karnataka police
-
బెంగళూరు రేవ్ పార్టీ కేసులో బిగ్ ట్విస్ట్.. పోలీసులు సస్పెండ్
బెంగళూరు: బెంగళూరులోని జీఆర్ ఫామ్‌హౌస్‌లో రేవ్ పార్టీ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు విచారణలో భాగంగా ముగ్గురు పోలీసు సిబ్బందిని ఆ శాఖ ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. రేవ్ పార్టీ గురించి తెలిసినా నిర్లక్ష్యం వహించినందుకు చర్యలు తీసుకున్నట్టు అధికారులు తెలిపారు.కాగా, బెంగళూరులోని జీఆర్ ఫామ్ హౌస్‌లో జరిగిన రేవ్ పార్టీలో ఇప్పటికే పలు ట్విస్ట్‌లు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఇక, తాజాగా పోలీసు శాఖలో నిర్లక్ష్యంగా ఉన్న హెబ్బగోడి పోలీసు స్టేషన్‌కు చెందిన ముగ్గురు పోలీసులను సస్పెండ్ చేశారు. మరో ఇద్దరు పోలీసులకు ఎస్పీ మెమోలు జారీ చేశారు. సస్పెండ్ అయిన వారిలో ఏఎస్ఐ నారాయణ స్వామి, హెడ్‌కానిస్టేబుల్ గిరీష్, కానిస్టేబుల్ దేవరాజ్ ఉన్నారు. అయితే, వీరికి రేవ్ పార్టీ గురించి సమాచారం ఉన్నప్పటికీ నిరక్ష్యం వహించడంతో ఉన్నతాధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.ఇదిలా ఉండగా.. రేవ్ పార్టీలో టాలీవుడ్‌కు హేమా, ఆషీరాయ్ డ్రగ్స్ తీసుకున్నట్టు బహిర్గతమైంది. వీరి బ్లడ్ శాంపుల్స్‌లో డ్రగ్స్ తీసుకున్నట్టు వెల్లడైంది. పార్టీలో 150 మంది పాల్గొనగా.. 86 మంది డ్రగ్స్ తీసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. సన్‌సెట్ టు సన్‌రైజ్ విక్టరీ పేరుతో బర్త్‌డే పార్టీ ముసుగులో ఈ పార్టీ నిర్వహించారు. ఇందుకోసం నిర్వాహకులు రూ.2 లక్షల ఎంట్రీ ఫీజు తీసుకుని 200 మందిని ఆహ్వానించారు. ఈ పార్టీలోతెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటకకు చెందిన క్రికెట్ బుకీలు, సినీ పరిశ్రమకు చెందిన పలువురు నటీనటులు(తెలుగు సినీ, సీరియల్ ప్రముఖులు సైతం) పాల్గొన్నారు. -
బెంగళూరు రేవ్ పార్టీపై వెలుగులోకి సంచలన విషయాలు..
సాక్షి, బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీ తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. రేవ్ పార్టీలో సినీ ప్రముఖుల పేర్లు బయటకు రావడంతో ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. మరోవైపు.. బెంగళూరు రేవ్ పార్టీపై పోలీసులు తీగలాగుతున్నారు. ఇందులో భాగంగా సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. కాగా, ‘సన్‌సెట్ టూ సన్‌రైజ్ విక్టరీ’ పేరుతో వ్యాపారి, క్రికెట్ బూకీ వాసు వ్యక్తి తన పుట్టినరోజు సందర్భంగా పార్టీ ఇచ్చినట్టు పోలీసులు గుర్తించారు. పార్టీ దాదాపు 150 మంది ప్రముఖులు హాజరయ్యారు. బర్త్ డే పార్టీలో డ్రగ్స్ వినియోగించినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక, ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం సాయంత్రం వరకు రేవ్ పార్టీ జరిగేలా ప్లాన్ చేసుకున్నారు. ఈ ఈవెంట్ మొత్తానికి అరుణ్ ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరించారు. వాసు బర్త్‌డే పార్టీకి డగ్ర్ పెడ్లర్లు సిద్ధిఖీ, రణధీర్, రాజ్ కూడా రావడంతో డ్రగ్స్ వాడినట్టు తెలుస్తోంది. మరోవైపు.. రేవ్ పార్టీ ఇచ్చిన క్రికెట్ బూకీ వాసు నేపథ్యంపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రముఖులతో వాసుకు ఉన్న లింకులపై పోలీసులు విచారణ చేపట్టారు. వాసుపై ఉన్న పాత కేసులపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇక, రేవ్ పార్టీలు, డ్రగ్స్ పార్టీలపై హైదరాబాద్‌లో నిఘా పెరగడంతో బెంగళూరులో ఇలా పార్టీ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ఈ పార్టీకి తెలుగు రాష్ట్రాల నుంచి ప్రముఖులు పెద్ద సంఖ్యలోనే హాజరయ్యారు. వీరంతా రెండు రోజులుగా బెంగళూరు జీఆర్ ఫామ్‌హాస్‌లో మకాం వేసినట్టు సమాచారం. ఇక, నిన్న రేవ్ పార్టీపై రైడ్ సందర్భంగా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ పార్టీలో తెలుగు, కన్నడ, తమిళ సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు కూడా ఉన్నారు. ఈ కేసులో ఇప్పటికే వాసు, అరుణ్, సిద్ధిఖీ, రణధీర్, రాజ్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారికి వైద్య పరీక్షలు రేవ్ పార్టీలో పాల్గొన్నవారిని అదుపులోకి తీసుకున్నామని, రక్తం నమూనాలు సేకరించి పరీక్షలు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. రేవ్‌పార్టీలో 150 మంది ఉన్నారని డాగ్ స్క్వాడ్‌ను పిలిపించి తనిఖీలు చేపట్టామని, కొన్ని మాదకద్రవ్యాలు లభించాయని కర్ణాటక పోలీసులు వివరించారు. ‘సన్‌సెట్ టు సన్‌రైజ్ విక్టరీ’ పేరిట రేవ్ పార్టీ జరిగినట్లు పోలీసులు పేర్కొన్నారు. సుమారు 15.56 గ్రా. ఎండీఎంఏ, 6.2 గ్రా. హైడ్రో గంజాయి, కొకైన్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. -
అమిత్ మాలవీయాపై కర్ణాటకలో కేసు నమోదు
బెంగళూరు/న్యూఢిల్లీ: బీజేపీ ఐటీ విభాగం అధ్యక్షుడు అమిత్ మాలవీయాపై కర్ణాటక పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కర్ణాటక కాంగ్రెస్ నేత రమేశ్ బాబు ఫిర్యాదు మేరకు మాలవీయాపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు బుధవారం వెల్లడించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాం«దీని అభ్యంతరకరంగా చిత్రీకరిస్తూ సోషల్ మీడియాలో మాలవీయా ఓ వీడియోను పోస్టు చేశారని, ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ రమేశ్ బాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రజల మధ్య చిచ్చుపెట్టడం, విద్వేషాలు రగిలించడమే మాలవీయా ఉద్దేశమని ఆరోపించారు. ఇదిలా ఉండగా, తనపై కర్ణాటకలో కేసు నమోదు కావడంపై మాలవీయా ట్విట్టర్లో ప్రతిస్పందించారు. విదేశీ శక్తుల చేతుల్లో రాహుల్ గాంధీ ఓ పావు అని విమర్శించారు. మాలవీయాపై కేసు పెట్టడాన్ని కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత స్మృతి ఇరానీ తప్పుపట్టారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికార దురి్వనియోగానికి పాల్పడుతోందని ఆరోపించారు. -
దేశ రహస్యాలు అమ్మడానికి ప్రయత్నించి.. చివరికి బిగ్ ట్విస్ట్..
కెలమంగలం(కర్ణాటక): కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖలోని రహస్యాలను సెల్‌ఫోన్ ద్వారా ఫోటోలు తీసి విదేశీ గూఢచార సంస్థలకు విక్రయించేందుకు ప్రయత్నించిన వ్యక్తిని డెంకణీకోట పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల మేరకు డెంకణీకోట సమీపంలోని బైరగొండపల్లి గ్రామానికి చెందిన రామక్రిష్ణారెడ్డి కొడుకు ఉదయ్‌కుమార్ (32). బెంగళూరులో కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా 2017 నుంచి 2019 వరకు పనిచేశాడు. ఈ సమయంలో కార్యాలయంలో భద్రపరిచిన పలు ధృవీకరణ పత్రాలు, పరిశోధనా ఉపకరణాలను సెల్‌ఫోన్ ద్వారా ఫోటోలు తీసి విదేశీ ఏజెన్సీల వద్ద విక్రయించి డబ్బు సంపాదించడానికి ప్రయత్నించాడు. విషయం తెలుసుకొన్న తళి పోలీసులు తీవ్ర గాలింపు చర్యలు చేపట్టి ఉదయ్‌కుమార్‌ను అరెస్ట్ చేశారు. కేసు విచారణలో ఉంది. చదవండి: మాజీ సీఎం యడియూరప్పకు తప్పిన ముప్పు.. వీడియో -
పోలీసుల స్పెషల్ డ్రైవ్.. రాత్రి బైకులు ఆపి ఫింగర్ ప్రింట్ టెస్టులు!
బనశంకరి: సిలికాన్ సిటీ బెంగళూరులో రాత్రి సమయంలో చోరీలకు తెగబడే దొంగలకు అడ్డుకట్టవేయడానికి నగర పోలీసులు కొత్త పథకం రూపొందించారు. రాత్రి సమయంలో గస్తీలు, వాహనాల తనిఖీల సమయంలో అనుమానితులు, వాహనదారుల వేలిముద్రలు, వాహనాల నంబర్లు పరిశీలనకు నాంది పలికారు. ఇందులో నేరపూరిత చరిత్ర ఉంటే అక్కడే వాహనాలను లాక్ చేస్తారు. వాహన సమాచారం కూడా డేటా బేస్‌లో వస్తుంది కాబట్టి దొంగ వాహనమైతే సీజ్ చేస్తారు. తద్వారా రాత్రి వేళల్లో దొంగలకు, అసాంఘిక శక్తులకు అడ్డుకట్ట పడుతుందని పోలీసులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. క్షణాల్లో తేలిపోతుంది పోలీసులు గస్తీ, నాకాబందీ సమయాల్లో జనం వేలిముద్రలను తమ మొబైల్ఫోన్లో సీసీటీఎన్ఎస్ అప్లికేషన్లో పరిశీలిస్తారు. సాధారణ పౌరులైతే ఏమీ ఉండదు. నేరాల్లో భాగస్వామి అయితేనే అతని నమోదైన కేసుల వివరాలు లభ్యమౌతాయి. అదుపులోకి తీసుకుని విచారణ చేపడతారు. సరైన కారణాలు లేకపోతే తగిన చర్యలు తీసుకుంటారు. అలాగే వాహనం నంబరును బట్టి చోరీ చేసిన వాహనమా, నేరాల్లో ఉపయోగించారా, లేదా అనేది కూడా యాప్ ద్వారా నిర్ధారిస్తారు. సీఐ, ఎస్ఐలకు శిక్షణ గత రెండు నెలలనుంచి వివిధ పోలీస్స్టేషన్లలో మల్లోకి తీసుకువచ్చారు. ప్రతిపోలీస్ స్టేషన్ సీఐ, ఎస్ఐలకు శిక్షణ అందించి ఉపకరణాలు అందజేశారు. నిత్యం తలా 20 మందిని తనిఖీ చేయడం తప్పనిసరి. దశలవారీగా నగరవ్యాప్తంగా విస్తరిస్తారు. పోలీసులు ప్రజలు వేలిముద్రలు తీసుకుంటే వ్యక్తిగత సమాచారం చోరీకి గురి అవుతుందనే భయం వద్దని, కేవల వేలిముద్రలు స్కాన్ అవుతాయని, రహస్య సమాచారం సేకరణ జరగదని పోలీసులు తెలిపారు. జరగబోయే నేరాలను అడ్డుకోవచ్చు రాత్రి సమయంలో దొంగలు, నేర చరిత్ర కలవారి ఆచూకీ కనిపెట్టి, జరగబోయే నేరాలను తప్పించడానికి సీసీటీఎన్ఎస్ డేటా ద్వారా రాత్రి సమయంలో తనిఖీలు చేపడుతున్నట్లు తూర్పు విభాగం అదనపు పోలీస్ కమిషనర్ సుబ్రమణ్యేశ్వరరావ్ తెలిపారు. -
కర్ణాటకలో ఇద్దరు ఐఎస్ ఉగ్రవాదులు అరెస్ట్
శివమొగ్గ: నిషేధిత ఉగ్ర సంస్థ ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) కదలికలపై కర్ణాటక పోలీసులు నిఘా వేశారు. ఇస్లామిక్ స్టేట్‌తో సంబంధాలు ఉన్నాయనే అనుమానంతో మంగళవారం ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. మరో టెర్రరిస్ట్ పరారీలో ఉన్నట్లు చెప్పారు. నిందితుల వద్ద పేలుడు పదార్థాలు లభించినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో పేలుళ్లకు కుట్ర పన్నారని ఆరోపించారు. ఇద్దరు నిందితులను కోర్టులో హాజరుపరచగా.. వారిని కోర్టు ఏడు రోజుల కస్టడీకి అనుమతించినట్లు తెలిపారు. -
ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. బైక్‌పై నుంచి ఎగిరి బస్సు టైర్ కింద..
రోడ్డుపై వెళ్తున్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలో పోలీసులు హెచ్చరిస్తూనే ఉంటారు. ముఖ్యంగా ద్విచక్రవాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించి.. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని చెబుతూనే ఉంటారు. ఈ క్రమంలో ట్రాఫిక్ రూల్స్ పాటించని వారిని జరిమానాలు సైతం విధిస్తుంటారు. తాజాగా హెల్మెట్ ధరించడం ఎంత ముఖ్యమో కర్నాటక పోలీసులు తెలిపారు. ఇందుకు సంబంధించి ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసి జాగ్రత్తలు పాటించాలని హెచ్చరించారు. ఈ వీడియోలో ఓ బైకర్ స్పీడ్‌గా డ్రైవ్ చేస్తూ ఓ బస్సు బ్యాక్ టైర్ కిందపడిపోతాడు. అయితే, ఈ సమయంలో బైకర్ ఐఎస్ఐ స్టాండర్డ్ మార్క్ ఉన్న హెల్మెట్‌ను ధరించడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. దీంతో, ప్రతీ ఒక్కరూ విధిగా స్టాండర్ట్ ఉన్న హెల్మెట్‌ను ధరించి ట్రాఫిక్ రూల్స్ పాటించాలని సూచించారు. ಉತ್ತಮ ಗುಣಮಟ್ಟದ ಐ ಎಸ್ ಐ ಮಾರ್ಕ್ ಹೆಲ್ಮೆಟ್" ಜೀವರಕ್ಷಕ" Good quality ISI MARK helmet saves life. pic.twitter.com/IUMyH7wE8u — Dr.B.R. Ravikanthe Gowda IPS (@jointcptraffic) July 20, 2022 -
హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ పీఏ అరెస్ట్
సాక్షి, హిందూపురం: హైటెక్ పద్ధతిలో పేకాట ఆడుతున్న హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వ్యక్తిగత సహాయకుడు (పీఏ) బాలాజీని కర్ణాటక పోలీసులు అరెస్టు చేశారు. ఆంధ్ర–కర్ణాటక సరిహద్దులోని కర్ణాటక రాష్ట్రం చిక్ బళ్లాపూర్ జిల్లా గౌరీబిదనూరు తాలూకా పరిధిలోని నగిరిగెర బీఎన్ఆర్ రెస్టారెంట్ వద్ద జూద కేంద్రంపై కర్ణాటక స్పెషల్ టాస్క్ఫోర్సు పోలీసులు ఆదివారం దాడి చేశారు. బాలకృష్ణ పీఏ బాలాజీతో పాటు 19 మందిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.1,56,750 నగదు, 8 కార్లు, 3 బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో ఉపాధ్యాయులతో పాటు రాజకీయ నాయకులూ ఉన్నారు. వీరిని సోమవారం గౌరీబిదనూరు పోలీసులు గుడిబండే కోర్టుకు హాజరు హాజరుపర్చగా..రిమాండ్‌కు ఆదేశిస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులిచ్చారు. కాగా.. గతంలో బాలకృష్ణ పీఏగా పనిచేసిన శేఖర్ కూడా పంచాయతీ రాజ్ శాఖలో భారీ అవినీతికి పాల్పడి జైలుకెళ్లాడు. ప్రస్తుత పీఏ బాలాజీ సైతం పేకాట ఆడుతూ పోలీసులకు పట్టుబడడంతో బాలకృష్ణ పీఏల తీరు ఇలాగే ఉంటుందా అంటూ హిందూపురం ప్రాంత ప్రజలు చర్చించుకుంటున్నారు. చదవండి: (పవన్ కల్యాణ్ రాజకీయ బ్రోకర్: కాంగ్రెస్ నేత తులసిరెడ్డి) -
హిజాబ్ వివాదం.. కర్నాటక పోలీసుల సంచలన నిర్ణయం
సాక్షి, బెంగళూరు: కర్నాటకలో మొదలైన హిజాబ్ వివాదం దేశంలో సంచలనంగా మారింది. ఈ వివాదం రాజకీయంగా దుమారం రేపుతోంది. కర్నాటకలోని విద్యాసంస్థల వద్ద హిజాబ్‌ను తీసివేసి లోపలికి వెళ్లాలని పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థులకు సూచిస్తున్నాయి. ఈ క్రమంలో వారి నిర్ణయంపై విద్యార్థినిలు నిరసనలు తెలుపుతున్నారు. దీంతో నిరసన తెలిపిన వారిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వివరాల ప్రకారం.. కర్నాటకలో తుమకూరులోని ఎంప్రెస్ కాలేజీలో హిజాబ్ ధరించడంపై ఆంక్షలు విధించారు. అయితే, విద్యార్థినిలు మాత్రం హిజాబ్ ధరించి కాలేజీకి వచ్చారు. ఈ క్రమంలో కాలేజీలోకి వారిని అనుమతించలేదు యాజమాన్యం. ఈ సందర్బంగా కాలేజీ యాజమాన్యం, విద్యార్థినిల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం విద్యార్థినిలు తాము హిజాబ్ ధరించి తరగతులకు హాజరయ్యేందుకు అనుమతించాలని డిమాండ్ చేస్తూ కాలేజీ ఆవరణలో ఆందోళనకు దిగారు. దీంతో, కాలేజీ నిబంధనలను ఉల్లంఘించినందుకు 10 మంది విద్యార్థినిలపై కాలేజీ ప్రిన్సిపల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. మరోవైపు కూర్గ్ జిల్లాలోని జూనియర్ కాలేజీలో విద్యార్థులు హిజాబ్ ధరించి రావడంతో కళాశాల ప్రిన్సిపాల్ కాలేజీ ప్రాంగణం నుంచి వారు వెళ్లిపోవాలని అరుస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
వీడు మామూలోడు కాదు.. నాలుగు పెళ్లిళ్లు.. జల్సాలు.. చివరికి
శివాజీనగర(కర్ణాటక): కేంద్ర ప్రభుత్వ సర్వే శాఖలో డిప్యూటి కమిషనర్‌గా పనిచేస్తున్నట్లు చెప్పుకొని, ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి వందలాది మందితో డబ్బు వసూలు చేసి మోసగిస్తున్న ఖతర్నాక్ వంచకున్ని బెంగళూరు సీసీబీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఉడుపి జిల్లా కుందాపురకు చెందిన రాఘవేంద్ర అరెస్ట్ అయిన నిందితుడు. ఇతడు ఉడుపిలో ప్రైవేట్‌గా సర్వేయర్‌గా పని చేస్తుండేవాడు. చదవండి: యువకుడితో వివాహేతర సంబంధం.. వారిని కరెంట్ స్తంభానికి కట్టేసి.. తక్కువ కాలంలో ధనవంతున్ని కావాలని వక్రమార్గం పట్టాడు. 10 సంవత్సరాల కిందట బెంగళూరుకు వచ్చి కేంద్ర సర్వే శాఖలో డిప్యూటీ కమిషనర్ అని నకిలీ గుర్తింపు కార్డు చేయించుకొన్నాడు. కారుకు భారత ప్రభుత్వం అని బోర్డు వేసుకుని ప్రభుత్వ శాఖల్లో పని ఇప్పిస్తానంటూ మోసాలను ప్రారంభించాడు. ఎక్కువగా ఉత్తర కర్ణాటక జిల్లాల్లో పెద్దసంఖ్యలో నిరుద్యోగుల నుంచి రూ.20 లక్షల చొప్పున వసూలు చేశాడు. నాలుగు పెళ్లిళ్లు బెంగళూరు జే.పీ.నగరలో ఉంటున్న రాఘవేంద్ర హావేరి, బాగలకోట, బెంగళూరు, కుందాపురలో రహస్యంగా నలుగురు మహిళలను పెళ్లి చేసుకున్నాడు. మోసం చేసి సంపాదించిన డబ్బుతో సొంతూరు సహా పలుచోట్ల ఫ్లాట్లు, నగలు, కార్లు కొన్నాడు. పలువురు బాధితులు ఫిర్యాదు చేయడంతో మోసగాని బండారం బయటపడింది. అతనిని అరెస్టు చేసి నకిలీ గుర్తింపు కార్డు, మొబైల్ ఫోన్, ట్యాబ్, ల్యాప్‌టాప్, చెక్‌బుక్, బాండ్ పేపర్లు, ఆస్తి పత్రాలను స్వాధీనం చేసుకొన్నారు. వివిధ జిల్లాల్లో నమోదైన ఫిర్యాదులపైనా విచారణ చేపట్టారు. -
‘ఖాకీ’ని తలపించే చేజింగ్, 45 రోజుల ఆపరేషన్
సాక్షి, కరీంనగర్: కార్తీ హీరోగా నటించిన సూపర్ హిట్ సినిమా ఖాకీ కథ తెలుసుగా! ఉత్తర భారతం నుంచి సరుకు రవాణా లారీల్లో వచ్చే కొందరు దుండగులు తెలుగు రాష్ట్రాల్లో దోపిడీలు, హత్యలకు పాల్పడతారు. వారిని పట్టుకోవడానికి ఆయా రాష్ట్రాల పోలీసులతో కలిసి స్థానిక పోలీసులు భారీ ఎత్తున జాయింట్ ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. తాజాగా తెలంగాణ, కర్ణాటకకు చెందిన పోలీసులు అలాంటి జాయింట్ ఆపరేషన్ చేశారు. 118 కేసుల్లో నిందితుడిగా ఉన్న ఓ కరుడుగట్టిన నేరస్తుడిని పట్టుకునేందుకు ఈ రెండు రాష్ట్రాల పోలీసులు దాదాపు 45 రోజులపాటు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. నవీ ముంబై, పుణె, హైదరాబాద్, బెంగళూర్, షోలాపూర్, బీదర్‌లో సెర్చ్ ఆపరేషన్ కొనసాగింది. ఎట్టకేలకు గజదొంగ భాకర్ అలీని కరీంనగర్ పోలీసులు షోలాపూర్‌లో శనివారం అరెస్టు చేశారు. అయితే, అతను సాదాసీదాగా పోలీసులకు చిక్కలేదు. పోలీసులపై అటాక్ చేసి తప్పించుకునేందుకు యత్నించాడు. ఆక్రమంలో భాకర్ అలీ చేతిలో పోలీసులు గాయపడ్డారు. చివరకు ఛేజింగ్ చేసి పోలీసులు అతని ఆట కట్టించారు. కాగా, భాకర్ అలీపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో పీడీ యాక్టు కేసులు ఉన్నట్టు కరీంనగర్ సీపీ కమలాసన్ రెడ్డి తెలిపారు. 2015 ముందే హైదరాబాద్‌లో వందకుపైగా చైన్ స్నాచింగ్ కేసులు ఉన్నాయని వెల్లడించారు. నేరస్తుడిని పట్టుకునేందుకు వందల సీసీ కెమెరాలను పరిశీలించామని పేర్కొన్నారు. నేరస్తుడి నుంచి గంజాయి సహా కార్లు స్వాధీనం చేసుకున్నామని సీపీ తెలిపారు. (చదవండి: 200కు పైగా ఇన్స్టాంట్ లోన్‌యాప్స్ తొలగింపు..) -
ఇలాగైతే ఎలా?
కర్ణాటక రాష్ట్రం హవేరీ పోలీసులు 69 మంది మీద ‘డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005, ఎపిడమిక్ డిసీజెస్ యాక్ట్, 1897’ చట్టాల కింద కేసులు పెట్టారు. వాళ్లందరూ ఒక ఊరి వాళ్లే. వారంతా ఊరి పండుగ చేసుకోవడానికి గుమిగూడారు. హవేరీ జిల్లా కర్జగి గ్రామంలో ఏటా జరిగే ‘కరా హున్నిమే’ ఉత్సవానికి యాభైవేల మంది హాజరవుతారు. ఎన్నోఏళ్లుగా వస్తున్న సంప్రదాయం. ‘ఎన్నేళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయమైనప్పటికీ ఈ ఏడాది అన్ని ఏడాదుల వంటిది కాదు. ఉత్సవాలను పక్కన పెట్టండి’ అన్నారు పోలీసు అధికారులు. లాక్డౌన్ నిబంధనలు పాటిస్తూ ఉత్సవాలు నిర్వహించుకోవడానికి కూడా అనుమతి లభించలేదు. దాంతో నిర్వహకులు ఇటు భక్తుల విశ్వాసాలకు, కోవిడ్ నిబంధనలకు మధ్య ఒక మధ్యే మార్గాన్ని ఆశ్రయించారు. బ్రహ్మ లింగేశ్వరుడికి పూజలన్నీ యధావిధిగా జరుగుతాయి. ఎడ్లబండి ఊరేగింపు మాత్రం అతి కొద్దిమందితో నామమాత్రంగా నిర్వహించాలనుకున్నారు. ఆనవాయితీని కొనసాగించడం మాత్రమే జరుగుతుంది. వేడుక కాదు, కాబట్టి ఎవరూ పాల్గొనవద్దని ఊరంతటికీ చెప్పారు. విన్నట్లే తలూపారందరూ. గురువారం (11–06–2020) సాయంత్రం ఊరేగింపు మొదలవగానే జనం నేల ఈనినట్లు పోగయ్యారు. నిర్వహకుల మాట వినేవాళ్లు ఒక్కరూ లేరు. పరిస్థితి చెయ్యి దాటిపోయింది. భౌతిక దూరం పాటించలేదు, మాస్కులు ధరించనూ లేదు. మరీ ఈ రకంగా నిబంధనలను ఉల్లంఘిస్తే చూస్తూ ఊరుకోవడం కుదరదని తేల్చి చెప్పేశారు పోలీసులు. నిర్వాహక కమిటీసభ్యులతోపాటు మరికొందరి మీద కూడా కేసులు ఫైల్ అయ్యాయి. ఇది విశ్వాసాలకు విఘాతం కలిగించడం కాదు, సంక్షేమం కోసం జాగ్రత్తలు తీసుకోవడం మాత్రమే. -
మరోసారి వార్తల్లోకి గ్యాంగ్‌స్టర్ రవి పూజారి
న్యూఢిల్లీ : గత 20 ఏళ్లుగా పోలీసులకు చిక్కకుండా పరారీలో ఉన్న మాఫియా గ్యాంగ్ స్టర్ రవి పూజారిని త్వరలోనే భారత్‌కు రప్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా భారత ప్రభుత్వం అతన్ని తిరిగి దేశానికి తీసుకురావడానికి అన్ని ఏర్పాట్లు చేస్తుందని సమాచారం అందింది. ఈ మేరకు రా అధికారుల సహాయంతో కర్నాటక పోలీసులు రవి పూజారీని తీసుకువచ్చేందుకు సెనెగల్ దేశానికి వెళ్లారు. ఇదే విషయమై కర్నాటక పోలీసులు మాట్లాడుతూ.. ఒక్క బెంగళూరులోనే రవి పుజారిపై 39 కేసులు ఉన్నాయి. వాటిలో 2007లో షబ్నమ్ డెవలపర్స్ యజమానులు శైలాజా, రవిల హత్య కేసు తో పాటు మంగళూరులో 36, ఉడిపిలో 11, మైసూరు, హుబ్బల్లి-ధార్వాడ్, కోలార్, శివమొగ్గలో ఒక్కో కేసు ఉన్నట్లు తెలిపారు.(చదవండి : మాఫియా డాన్ రవి పుజారీ అరెస్ట్) 20 ఏళ్ల క్రితం ఇండియా నుంచి పారిపోయిన రవి పూజారి ఆఫ్రికాలోని సెనెగల్ దేశానికి వెళ్లి ఆంటోని ఫెర్నాండెజ్‌గా పేరు మార్చుకున్నాడు. ఆ తర్వాత పాస్‌పోర్ట్ సంపాదించి తన కుటుంబాన్ని కూడా సెనెగల్‌కు రప్పించి పలుచోట్ల రెస్టారెంట్లు నడుపుతూ జీవనం సాగించాడు. అయితే గతేడాది జనవరి 2019లో బార్బర్ షాపుకు వెళ్లిన రవి పూజారిపై అనుమానించిన సెనెగల్ పోలీసులు అదుపులోకి తీసుకొని స్థానిక కోర్టులో ప్రవేశపెట్టగా అతనికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు. బెయిల్‌పై బయటికి వచ్చిన రవి పూజారి అక్కడి నుంచి వేరే చోటికి పారిపోయాడు. కాగా అప్పటినుంచి కనిపించకుండా పోయిన రవి పూజారి భారతదేశానికి అప్పగించేందుకు సెనెగల్ సుప్రీంకోర్టు ఒప్పుకోవడంతో పోలీసులు అతని కోసం సెనెగల్ వెళ్లారు.(కోట్లు ఇవ్వాలంటూ మంత్రికి డాన్ బెదిరింపు కాల్!) కాగా గతంలో ఛోటారాజన్, దావూద్ ఇబ్రహీంలతో కలసి పనిచేసిన పుజారీ.. తర్వాత సొంత గ్యాంగ్‌ను ఏర్పాటు చేసుకొని హత్యలు,బెదిరింపులకు పాల్పడినట్లు తేలింది. రవి పూజారి తనను బెదిరించాడని సినీ నిర్మాత మహేష్ భట్ అప్పట్లో ముంబై పోలీసులకు ఫిర్యాదు చేయడం పెను సంచలనంగా మారింది.ఆ తర్వాత భట్ ను చంపడానికి కుట్ర పన్నిన రవి పూజారి ముఠాలోని కొంతమందిని పోలీసులు అరెస్టు చేశారు. -
'కర్ణాటక మృతుల కుటుంబాలకు మమతా బెనర్జీ భరోసా'
మంగళూరు : పోలీసు కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అండగా నిలిచారు. మాట ఇచ్చిన 48 గంటల లోపే తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి బృందం కర్ణాటకలోని మంగళూరు నగరంలో పోలీసు కాల్పుల్లో చనిపోయిన ఇద్దరు బాధితుల కుటుంబాలకు రూ. 5 లక్షలు చొప్పున చెక్కులు అందజేసింది. మృతులు మొహమ్మద్ జలీల్, నౌషీన్‌ల కుటుంబాలను తృణమూల్ కాంగ్రెస్ ప్రతినిధులు, పార్లమెంటు సభ్యులు దినేష్ త్రివేది, నదీముల్లా హక్‌లు పరామర్శించారు. గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని కూడా పరామర్శించారు. చదవండి: సీఎం గారూ.. మీ ప్రవర్తన హద్దుమీరింది! పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌరుల జాబితాలను వ్యతిరేకిస్తూ మంగళూరులో ఆందోళనలు జరిగినపుడు పోలీసు కాల్పుల్లో జలీల్, నౌషీన్‌లు చనిపోయారు. ఆందోళనకారులు బందర్ పోలీస్ స్టేషన్ మీద దాడి చేయడంతో కాల్పులు జరపాల్సి వచ్చిందని పోలీసులు చెబుతున్నారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యులు దినేష్ త్రివేది మాట్లాడుతూ.. ఇది మానవతా సాయం మాత్రమే. ఇందులో రాజకీయాలేమీ లేవు. ఇక్కడి ప్రభుత్వం పరిహారం ప్రకటించింది కానీ ఇంతవరకూ ఇవ్వలేదు. అది పుండు మీద కారం చల్లటం వంటిదే. మమతా బెనర్జీ ప్రతి ఒక్కరికీ అండగా నిలుస్తారని ఆయన పేర్కొన్నారు. చదవండి: సిద్ధార్థ్ రాజకీయ ఎంట్రీపై సస్పెన్స్ వీడినట్టే..! -
హెల్మెట్ లేదని లారీ డ్రైవర్‌కు జరిమానా!
కర్ణాటక,బొమ్మనహళ్లి: సాధారణంగా బైక్‌పై వెళ్తున్న వారు హెల్మెట్ ధరించకుంటే ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధిస్తారు. అయితే 409 లారీలో వెళ్తున్న డ్రైవర్ హెల్మెట్ వేసుకోలేదని సదరు డ్రైవర్‌కు జరిమానా విధించిన ఘటన ఉత్తర కన్నడ జిల్లా కార్వార్లో చోటుచేసుకుంది. దీంతో రసీదు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఉత్తర కన్నడ జిల్లా కార్వార సమీపంలోని దాండేలి నగరంలో 409 వాహన డ్రైవర్‌గా నజీర్ ఇంటికి పోలీసులు నోటీసు పంపారు. హెల్మెట్ ధరించ లేదని జరిమానా చెల్లించాలని నోటీసు పంపారు. దీంతో పోలీసులు నోటీసు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
స్టేషన్లో నిందితుడి పుట్టినరోజు వేడుక
కర్ణాటక ,యశవంతపుర : రిమాండ్ ఖైదీ పుట్టిన రోజు వేడుకలు పోలీసు స్టేషన్లో జరిగాయి. ఈ విచిత్ర ఘటన విద్యారణ్య పోలీసు స్టేషన్లో జరిగింది. పోలీసు అధికారి పేరిట ప్రజల నుండి డబ్బులు వసూలు చేసిన కేసులో అభిషేక్ అలియాస్ అభిని గతేడాది పోలీసులు అరెస్టు చేశారు. ఈ సమయంలో అభి పుట్టిన రోజు వేడుకలను పోలీసు స్టేషన్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిందితుడు అభికి ఆ పోలీసు స్టేషన్ ఎస్ఐ కేక్ తినిపిస్తున్న ఫోటోలు ఇటీవల వైరల్ అయ్యాయి. ఎస్ఐ, స్టేషన్ సిబ్బంది నిందితుడికి కేక్ తినిపిస్తున్న వీడియో, ఫోటోలు వైరల్ కావడంతో ప్రజల ఆక్రోశానికి గురవుతున్నారు. బాడుగకు తీసుకున్న కారును ధ్వసం చేసిన నిందితుడు అభిషేక్.. కారు యజమాని రిపేర్‌కు డబ్బులు అడిగితే నేను పోలీసును, నన్నే డబ్బులు అడుగుతావా.. కేసు నమోదు చేస్తానంటూ కారు యజమానిని బెదిరించారు. ఇదే కాకుండాకారు యజమాని నుంచి వేల రూపాయలను వసూలు చేశాడు. ఇందుకు సంబంధించి దాసరహళ్లి నివాసి కార్తీక్ విద్యారణ్యపుర పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అభిషేక్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి జతలో పోలీసులు కేక్ తిన్న విషయంపై ఉన్నత అధికారులను వివరణ కోరగా నిందితుడు పోలీసులతో సన్నిహితంగా ఉండేవాడు. ఏడాది క్రితం పుట్టిన రోజును స్టేషన్లో జరిపారు. అయితే నాలుగు నెలల క్రితం అక్కడి ఎస్ఐతో పాటు పోలీసులు బదిలీ అయినట్లు వివరించారు. ఎవరిపై చర్యలు తీసుకోవాలో అర్థం కావటంలేదన్నారు. -
వెనుకసీటులో కూర్చున్న వృద్ధుడి పైశాచికత్వం
కృష్ణరాజపురం : రైలులో వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిపై ఫిర్యాదు చేయడానికి వెళితే పోలీసులు కూడా నిర్లక్షంగా వ్యవహరించారని ఆరోపిస్తూ యువతి ఫేస్బుక్లో ఆవేదన వ్యక్తం చేశారు. బెంగళూరు నగరంలోని ఓ సాఫ్ట్వేర్ సంస్థలో ఇంజనీర్‌గా పని చేస్తున్న యువతి ఈనెల17వ తేదీన విధులు ముగిసిన అనంతరం రైలులో స్నేహితులతో కలసి కేజీఎఫ్ పట్టణానికి వెళుతున్నారు. రైలు బయలుదేరిన కొద్దిసేపటికి యువతి నిద్రలోకి జారుకోవడాన్ని గమనించిన వెనుకసీటులో కూర్చున్న 55 ఏళ్ల వ్యక్తి యువతి వెనుకభాగాన్ని తడుముతూ అసభ్యంగా ప్రవర్తించాడు. వెంటనే మేల్కొన్న యువతి వ్యక్తిని ప్రశ్నించగా మరింత అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో పక్క బోగీలో ఉన్న తన స్నేహితులను పిలవడానికి ప్రయత్నించగా అంతలోపు వ్యక్తి వైట్‌ఫీల్డ్ స్టేషన్లో దిగి పారిపోయాడు. దీనిపై వైట్‌ఫీల్డ్ పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్లగా తమ పరిధిలోకి రాదని అడుగోడి పోలీసులకు ఫిర్యాదు చేయాలంటూ సూచించారు. దీంతో అడుగోడి పోలీస్‌స్టేషన్‌కు చేరుకొని తనకు ఎదురైన అనుభవాన్ని వివరించి కేసు నమోదు చేసుకోవాలంటూ విన్నవించగా ఘటన తమ పరిధిలోకి రాదని రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేయాలంటూ అక్కడి నుంచి కూడా పంపించేశారు. అక్కడి నుంచి నేరుగా కంటోన్మెంట్ పోలీసులకు ఘటన గురించి వివరించి కేసు నమోదు చేసుకోవాలంటూ విన్నవించగా ఫోటో ఉందా, అడ్రస్ ఉందా, వ్యక్తి పేరేంటి ఇలా నిర్లక్ష్యంగా ప్రశ్నలు వేసి కేసు నమోదు చేసుకోవానికి నిరాకరించారంటూ ఫేస్బుక్లో బాధను వ్యక్తం చేశారు. ఫేస్బుక్ పోస్ట్‌ను కేంద్ర రైల్వేశాఖతో పాటు మహిళ శిశు సంక్షేమశాఖకు కూడా ట్యాగ్ చేశారు. -
గ్రేట్ పోలీస్
కృష్ణరాజపురం : ఇండోనేషియా దేశ రాజధాని జకార్త నగరానికి చెందిన మహిళ డీజే బెంగళూరు నగర పోలీసులపై ప్రశంసలు కురిపిస్తూ సామాజిక మాధ్యమాల్లో చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. కొత్త సంవత్సరం వేడుకల్లో సంగీత విభావరి (డీజే) కోసం బాణసవాడిలోని యునైటెడ్ టాలెంట్ అనే సంస్థ నిర్వాహకులు జకార్త నగరానికి చెందిన మహిళ డీజే కేసా అయ్రెస్ను తీసుకువచ్చారు. సంగీత విభావరి కోసం తీసుకువచ్చిన కేసా రానుపోను విమాన ఛార్జీలు, హోటల్లో బస కూడా ఏర్పాటు చేశారు. సంగీత విభావరి ముగిసిన అనంతరం రెండు రోజుల్లో ఖాతాలోకి పారితోషకం పంపిస్తామంటూ నిర్వాహకులు నమ్మించారు. జకార్తకు వెళ్లి రోజులు గడుస్తున్నా పారితోషకం పంపించకపోవడంతో ఎన్నిసార్లు ఫోన్ చేసినా నిర్వాహకులు స్పందించలేదు. కార్యక్రమ నిర్వాహకుల తీరుతో విసుగు చెందిన కేసా ఇదేనెల 8న బెంగళూరుకు వచ్చి పోలీస్ కమిషనర్ సునీల్‌కుమార్‌ను కలుసుకొని తన సమస్య వివరించారు. స్పందించిన కమిషనర్ సునీల్‌కుమార్ కేసా సమస్యను వెంటనే పరిష్కరించాలంటూ డీసీపీ రాహుల్‌కుమార్‌ను ఆదేశించారు. వివరాలు తెలుసుకున్న డీసీపీ రాహుల్ కుమార్ బాణసవాడి ఎస్ఐ మురళికి కేసా సమస్య గురించి వివరించి పరిష్కరించాలంటూ ఆదేశించారు. కేసా ఫిర్యాదుతో విచారణ జరిపిన బాణసవాడి పోలీసులు కేసాకు రావాల్సిన 600 డాలర్ల పారితోషికంతో కేసా విమాన ఛార్జీలు కూడా ఇప్పించి జకార్తకు పంపించారు. తమ సమస్యపై వెంటనే స్పందించి పరిష్కరించి తమకు రావాల్సిన పారితోషికం ఇప్పించినందుకు సంతోషం వ్యక్తం చేసిన కేసా పోలీసుల పనితీరును ప్రశంసిస్తూ సామాజిక మాధ్యమాల్లో చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. -
ప్రియుని భార్యను చంపడానికి కేసరిబాత్‌లో సైనేడ్..
చింతామణి: చిక్కబళ్లాపురం జిల్లా చింతామణిలో విషం కలిపిన ప్రసాదం తిని ఇద్దరు మరణించడం, మరో 8మంది తీవ్ర అస్వస్థత పాలైన ఘటనలో మిస్టరీ వీడిపోయింది. అక్రమ సంబంధమే ఇంత పని చేయించిందని తేలింది. తమ ఆనందానికి ప్రియుని భార్య గౌరి, ఆమె తల్లి అడ్డుగా ఉందని వారిని మట్టుబెట్టడానికి ప్రియుడు లోకేష్ (30)తో కలిసి నిందితురాలు లక్ష్మీ (48) ఈ ఘాతుకానికి పాల్పడిందని పోలీసులు ప్రకటించారు. స్వర్ణకారులు బంగారంపనిలో ఉపయోగించే సైనేడ్ విషాన్ని ప్రసాదంలో కలిపినట్లు తెలిపారు. మంగళవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో రాష్ట్ర ఐజీపీ దయానంద, ఎస్పీ కార్తీక్‌రెడ్డితో కలిసి కేసు వివరాలను వెల్లడించారు. ప్రధాన నిందితురాలు లక్ష్మీ, ఆమెకు సహకరించిన ఇద్దరు మహిళలను అరెస్టు చేసినట్లు వారు తెలిపారు. వివరాలు.. గత శుక్రవారం రాత్రి చింతామణి పట్టణంలో ఒక ఆలయం వద్ద ఇద్దరు మహిళలు పంచిన ప్రసాదం తిని కవిత (29), సరస్వతమ్మ (55) అనే ఇద్దరు మహిళలు మరణించారు. ఇది సంచలనం కలిగించింది. ఎస్పీ కార్తీక్‌రెడ్డి కేసు దర్యాప్తును సీరియస్‌గా తీసుకున్నారు. కేసు విచారణలో భాగంగా పలువురు అనుమానితులను పట్టుకుని విచారించగా లక్ష్మీ పాత్ర బయటపడింది. అడ్డు తొలగించుకోవాలని ఆలయం వద్ద ఎదురెదురు ఇళ్లలో ఉండే మహిళ లక్ష్మీతో యువకుడులోకేష్ అనైతిక సంబంధం ఉంది. రెండేళ్ల కిందట లోకేష్‌కు శిడ్లఘట్టకు చెందిన గౌరి అనే యువతితో పెళ్లయింది. లోకేష్ బండారం భార్యకు తెలిసిపోవడంతో లక్ష్మీతో గొడవలు పడింది. పోలీసు స్టేషన్‌కు వెళ్లి పంచాయతీ జరిగాయి. నాలుగు నెలల కిందట లోకేష్ ఇంటి నుండి ఎక్కడికో వెళ్లిపోయాడు. గౌరి పోలీసుస్టేషన్ మిస్సింగ్ కేసు పెట్టింది. కానీ అజ్ఞాతం నుంచి లక్ష్మీ– లోకేష్ మధ్య సంబంధాలు కొనసాగాయి. గౌరిని చంపాలని పథకం పన్ని రెండుసార్లు ప్రయత్నించి విఫలయినట్టు లక్ష్మీ అంగీరించింది. ఈసారి పకడ్బందీగా గత శుక్రవారం పకడ్బందీగా అమలు చేశారు. లక్ష్మీ తన ఇంట్లో కేసరిబాత్‌ను తయారు చేసింది. ప్రసాదాన్ని రెండు భాగాలు చేసి ఇంటి పనిమనిషి అమరావతి, ఆలయం ముందర పూలు అమ్ముతున్న పార్వతీలను పిలిచి ప్రసాదాన్ని పంచాలని సూచించింది. అందులో సైనైడ్ కలిపి ఉన్న విషయం వారికి తెలియకపోవడంతో సరేనని అంగీకరించారు. ప్లాస్టిక్ కప్పులో పెట్టినది గౌరి, వారి తల్లి సరస్వతి గుడినుంచి రాగానే ఇవ్వాలని సూచింది. వారు సరిగ్గా గౌరి, తల్లి సరస్వతికి ఇచ్చి తినమని చెప్పారు. ఇంటికి వెళ్లాక సరస్వతి ఇంటిపక్కలవారికి పంచింది.తాను కొంత తిని, కూతురికి ఇవ్వగా ఆమె తినలేదు. కొంతసేపటికే ప్రసాదం తిన్న 10 మంది తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. కవిత అనే మహిళ చనిపోగా, ఆమె భర్త రాజు, చిన్నారులు జాహ్నవి, చరణి , ఇతరులు నారాయణప్ప, వెంకటరమణ, సుధా, శశిదర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సరస్వతి చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. ఈ కేసులో మరొక నిందితుడు లోకేష్ కోసం గాలిస్తున్నామని ఐజీపీ చెప్పారు. దర్యాప్తు బృందానికి 50వేలు బహుమానాన్ని ప్రకటించారు. -
కారులో హెల్మెట్లతో వచ్చి మరీ..
సాక్షి, సిటీబ్యూరో: కర్ణాటక పోలీసు అధికారులు మన రాజధానిపై కన్నేశారు. కొన్ని రోజుల క్రితం బెంగళూరు, బీదర్‌లో జరిగిన నేరాల్లో నిందితులు, హతుడి కోసం ఇక్కడ ఆరా తీస్తున్నారు. బెంగళూరులోని మార్తహళ్లి ఠాణా పరిధి నుంచి సాఫ్ట్వేర్ ఇంజినీర్ కిడ్నాప్‌నకు యత్నించిన నిందితులు, బీదర్ జిల్లాలోని మన్నెకిళ్లిలో చోటు చేసుకున్న గుర్తుతెలియని వ్యక్తి హత్య కేసులను ఛేదించడానికి అక్కడి పోలీసులు ఇప్పటికే రెండుసార్లు ఇక్కడికి వచ్చి వెళ్లారు. ఓ కేసులో స్థానిక పోలీసుల సహకారం తీసుకుంటుండగా, మరోదాంట్లో వాళ్లే నేరుగా గాలిస్తున్నారు. కారులో హెల్మెట్లతో వచ్చి మరీ.. మధ్యప్రదేశ్ ఇండోర్‌కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ అనురాగ్‌వర్మ బెంగళూరులోని మార్తహళ్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉన్న యమలూర్లో నివసిస్తూ సమీపంలోని ఓ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఇతడికి కొన్ని నెలల క్రితం ఇండోర్‌కే చెందిన యువతితో నిశ్చితార్థమైంది. ఆపై కొన్నాళ్లకు వీరి మధ్య స్పర్థలు వచ్చాయనే అనుమానాలు ఉన్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఈ నెల 11 ఉదయం కార్యాలయానికి వెళ్తున్న అనురాగ్‌పై కిడ్నాప్ యత్నం జరిగింది. హెల్మెట్లు ధరించి కారులో వచ్చిన ఇద్దరు వ్యక్తులు అనురాగ్ తలకు తుపాకీ గురిపెట్టి కారులోకి ఎక్కాలని బలవంతం చేయగా అప్రమత్తమైన అనురాగ్ పెద్దగా అరవడంతో పాటు పెనుగులాడాడు. ఫలితంగా అతడి సెల్‌ఫోన్ కారులో పడిపోగా.. ఇద్దరు దుండగులు అందులో ఉడాయించారు. దీనిపై బాధితుడి ఫిర్యాదు మేరకు మార్తహళ్లి ఠాణాలో కేసు నమోదైంది. దర్యాప్తు నేపథ్యంలో నిందితులు రాజస్థాన్‌కు చెందిన వారని, ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్నట్టు తేల్చారు. దీంతో వారిని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి రాజస్థాన్, ఇండోర్‌తో పాటు నగరంలోను ముమ్మరంగా గాలిస్తున్నాయి. ఇక్కడి ఆటో కావడంతో... సిటీలో ఏర్పాటు చేస్తున్న సీసీ కెమెరాలు పొరుగు రాష్ట్రాల్లో నమోదైన కేసుల దర్యాప్తులోనూ ఉపయుక్తంగా మారుతున్నాయి. బీదర్ జిల్లాలో జరిగిన ఓ హత్య కేసును ఛేదించడానికి అక్కడి పోలీసులు సైబరాబాద్ అధికారులను కలిసి తమకు నిర్ణీత ప్రదేశంలోని సీసీ కెమెరాల్లో నమోదైన ఫీడ్ ఇప్పించాలని కోరారు. వారికి సహకరించిన ఇక్కడి పోలీసులు ఆ కేసు దర్యాప్తుతో పాటు నిందితులు, హతుడి గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్నారు. సైబరాబాద్ పరిధిలో ఉన్న పద్మావతినగర్ నుంచి ఈ నెల 10న ఓ ఆటో చోరీకి గురైంది. ఇది కర్ణాటకలోని బీదర్ జిల్లాలో ఉన్న చరక్పల్లి ఠాణా పరిధిలోని ఓ కల్లుకాంపౌండ్ సమీపంలో దొరికింది. కేసు నమోదు తర్వాత రిజిస్ట్రేషన్ వివరాల ఆధారంగా అక్కడి పోలీసులు ఇక్కడి బాధితుడికి సమాచారం ఇచ్చారు. దర్యాప్తులో భాగంగా వివిధ చెక్‌పోస్టుల్లోని సీసీ కెమెరాల్లో నమోదైన ఫీడ్‌ను పరిశీలించారు. ఈ నేపథ్యంలో 10వ తేదీ ఆ ఆటోలో డ్రైవర్‌తో పాటు మరోవ్యక్తి ఉన్న ఆనవాళ్లు దొరికాయి. ఇదిలా ఉండగా.. చరక్పల్లికి సమీపంలో ఉన్న మన్నెకిళ్లి పోలీసుస్టేషన్ పరిధిలో ఈనెల 11న ఓ గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం దొరికింది. పూర్తిగా కాలిపోయిన స్థితిలో ఉన్న దీన్ని గుర్తించడం కష్టంగా మారింది. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎలాంటి మిస్సింగ్ కేసులు లేకపోవడంతో ఈ ఆటోతో ఆ మృతదేహానికి లింకు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఈ సందేహం నివృత్తి కావాలంటే ఆటోను తస్కరించిన చోరులు దొరకాల్సి ఉంది. దీనికోసం సిటీకి వచ్చిన చరక్పల్లి పోలీసులు స్థానిక అధికారుల సాయంతో పద్మావతినగర్‌లో దర్యాప్తు చేశారు. ఆటో చోరీకి గురైన ప్రాంతంలోని సీసీ కెమెరాలో రికార్డు అయిన ఫీడ్‌ను సేకరించారు. -
పోలీసులకు తీపి కబురు
సాక్షి బెంగళూరు: రాష్ట్రంలోని 86 వేల మంది పోలీసుల పంట పండింది. ఎంతో కాలంగా వేచి చూస్తున్న తరుణం రానే వచ్చింది. బహుకాల నిరీక్షణకు తెరపడనుంది. వేతన పెంపు కోసం ఎదురు చూస్తున్న పోలీసుల ఆశలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. పోలీసుల జీతాల పెంపు అనివార్యమని ఐపీఎస్ అధికారి రాఘవేంద్ర ఔరాద్కర్ కమిటీ ఇచ్చిన నివేదికకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఫిబ్రవరిలో ప్రవేశపెట్టే బడ్జెట్లో ఈ మేరకు పెంచాల్సిన జీతాలను ప్రకటించనున్నట్లు సమాచారం. ఆందోళనలతో కమిటీ.. దేశంలోని ఏ ఇతర రాష్ట్రాల పోలీసు జీతాలతో పోల్చినా ఇక్కడి రక్షకభటుల వేతనాలు తక్కువగా ఉన్నాయి. గతంలో తమ జీతాలను పెంచాలని అనేక సార్లు పోలీసులు ఆందోనలకు దిగారు. గత కాంగ్రెస్ హయాంలోనూ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడంతో మాజీ సీఎం సిద్ధరామయ్య అప్పట్లో ఐపీఎస్ అధికారి రాఘవేంద్ర ఔరాద్కర్ నేతృత్వంలో ఒక కమిటీని వేశారు. 30 శాతం పెంపునకు సిఫారసు.. 2016 సెప్టెంబర్ 27న ప్రభుత్వానికి కమిటీ నివేదిక సమర్పించింది. రాష్ట్ర పోలీసులు జీతాల పెంపు అనివార్యమని ప్రభుత్వానికి నివేదించింది. పోలీసు శాఖలోని పని చేసే ఆయా విభాగాల్లోని సిబ్బందికి 30 శాతం మేర జీతాన్ని పెంచాలని కమిటీ సూచించింది. ఆ తర్వాత కమిటీ సమర్పించిన నివేదికలోని అంశాలను అమలు చేయాలని పోలీసులు ప్రభుత్వంపై ఒత్తిడి చేశారు. కర్ణాటక 8వ స్థానం.. కమిటీ నివేదిక ప్రకారం పోలీసుల వేతన శ్రేణిలో కర్ణాటక ఎనిమిదో స్థానంలో నిలిచింది. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోల్చితే కర్ణాటకలో వెనుకబడి ఉంది. కర్ణాటక పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ రాష్ట్రాలు సైతం ముందుగానే ఉన్నాయి. దీంతో ఇక్కడి పోలీసులు ఆందోళనలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు వీరి జీతాలు పెంచేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ విషయం ఆర్థిక శాఖ వద్ద పెండింగ్‌లో ఉంది. ముఖ్యమంత్రి నిర్వహిస్తున్న బడ్జెట్ పూర్వ సమావేశాల్లో ఈ విషయంపై తీర్మానించి వచ్చే బడ్జెట్లో పెంపు మేర కేటాయింపులు జరపనున్నారు. -
ప్రకాశ్‌రాజ్‌కు పోలీసుల నోటీసు
కర్ణాటక, యశవంతపుర : హిందువులను అవహేళనంగా మాట్లాడిన బహుభాష నటుడు ప్రకాశ్‌రాజ్‌కు బెంగళూరు పోలీసులు విచారణ నోటీస్‌ను జారీ చేశారు. న్యాయవాది ఎన్.కిరణ్ బెంగరూరు 24వ ఎసీఎంఎం కోర్డు ఆదేశాల మేరకు హనుమంతనగర పోలీసులు ప్రకాశ్‌రాజ్‌పై కేసు నమోదు చేశారు. దీంతో తమ ముందు హజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. విజయపురలో జరిగిన సమావేశంలో గోమాత గురించి ఏమి తెలియదు. బట్టలు సుభ్రం కావాలంటే ఒక కేజీ పేడ, రెండు లీటర్ల గోమూత్రంతో బట్టలను శుభ్రం చేసుకోవాలని అవహేళనగా మాట్లాడారు. హిందువుల మనోభావాలను రెచ్చకొట్టిన ప్రకాశ్‌రాజ్‌పై చర్యలు తీసుకోనేలా పోలీసులను అదేశించాలంటూ రెండు నెలల క్రితం న్యాయవాది కిరణ్‌కేసు దాఖలు చేశారు. దీంతో ప్రకాశ్‌రాజ్‌కు పోలీసులు నోటీసును జారీ చేశారు. -
తుపాకీ లేని ఖాకీ
బొమ్మనహళ్లి: ప్రజా భద్రతను చూసే పోలీసులు లాఠీలతోనే దుండగులను ఎదుర్కోవాల్సి వస్తోంది. హోంశాఖకు ఏటా వేల కోట్ల రూపాయలు బడ్జెట్‌ను కేటాయిస్తున్నా మౌలికమైన ఆయుధాల కొరత నాలుగో సింహాన్ని నిస్తేజం చేస్తోంది. నేరస్థులు, ఉగ్రవాదుల నుంచి ప్రజల ధన,మాన, ప్రాణాలను రక్షించడానికి ఎన్నో పరీక్షలు నిర్వహించి నెలల పాటు శిక్షణనిచ్చి పోలీసులను నియమించే ప్రభుత్వాలు వారికి ఆయుధాలను ఇవ్వడంలో మాత్రం నిర్లక్ష్య ధోరణిని వదులుకోలేకపోతున్నాయి. ప్రస్తుతం చిల్లర దొంగల నుంచి ఉగ్రవాదుల వరకు అత్యాధునిక ఆయుధాలను కలిగి ఉండగా, వారిని ఎదుర్కొనాల్సిన పోలీసులు మాత్రం దశాబ్దాల కాలం నాటి తుపాకులతోనే నెట్టుకొస్తున్నారు. కానిస్టేబుళ్ల పరిస్థితి మరింత దారుణంగా ఉంటోంది. రాత్రి వేళల్లో గస్తీలో పాల్గొనే కానిస్టేబుళ్లు కేవలం లాఠీలతో విధులు నిర్వర్తిస్తుండడంతో దొంగలు నిర్భీతిగా దాడులకు తెగబడుతున్నారు. బెంగళూరు నగరంలో కూడా దొంగలు, అసాంఘిక ముఠాలు పోలీసులపై దాడులకు తెగబడ్డ ఘటనలు కోకొల్లలు. ఇంత జరుగుతున్నా పోలీసులకు కొత్త ఆయుధాలు అందించి శాఖలో ఆయుధాల కొరతను నివారించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకర పరిణామం. కాగ్ నివేదికలో చేదు నిజాలు రాష్ట్ర పోలీసుశాఖలో ఆయుధాల కొరతపై గత కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యం వహించిందో కాగ్ నివేదిక బట్టబయలు చేసింది. సంకీర్ణ ప్రభుత్వం కూడా అదే దారిలో నడుస్తోందంటూ కాగ్ స్పష్టం చేసింది. చాలా స్టేషన్లలో కావాల్సినంత మందుగుండు ఉంది, తుపాకులే లేవు, కొన్నిచోట్ల తుపాకులు ఉన్నాయి, అందుకు తగిన మందుగుండు అందుబాటులో లేదు. ♦ 2012లో రాష్ట్రంలోని చాలా పోలీస్స్టేషన్లలో ఏకే– 47 తదితర ఆయుధాల కొరత మరింత తీవ్రంగా ఉంది. ♦ ప్రతి పోలీస్‌స్టేషన్‌లో తప్పనిసరిగాఉండాల్సిన 0.303 ట్రంకెటేడ్ రైఫిల్‌ల కొరత 72 శాతం ఉండగా 2017 మార్చ్ నెలఖారు నాటికి కూడా ఆయుధాల కొరత శాతం అంతే ఉన్నట్లు కాగ్ నివేదికలో బహిర్గతమైంది. ♦ ఆయుధాలు ఉన్న 18 పోలీస్స్టేషన్లలో అందుకు సరిపడా మందుగుండు సామగ్రి లేకపోవడంతో ఆయుధాలన్నింటినీ స్టోర్‌రూమ్‌లలో పడేశారు. పలు పీఎస్‌లలో మందుగుండు కాలవ్యవధి ముగియడంతో బెంగళూరులోని సీఏఆర్,మైసూరు నగరంలోని డీఏఆర్ కేంద్రాల్లో అటకెక్కించారు. ఇంటెలిజెన్స్ విభాగ ఏడీజీపీ, కేఎస్ఆర్పీ, యాదగిరి, తుమకూరు తదితర 18 పోలీసు కేంద్రాల్లో భారీగా నిల్వ చేసిన ఆయుధాలు, మందుగుండు సామాగ్రి ఏళ్లతరబడి వృథాగా ఉంటోంది. ప్రస్తుతం కొత్తగా పోలీసుశాఖలో చేరిన పోలీసు అధికారులు,సిబ్బందికి ఫైరింగ్ శిక్షణ ఇవ్వడానికి కూడా ఆయుధాలు లేనంతగా ఆయుధాల కొరత సమస్య పరిణమించిందని పోలీసు వర్గాల సమాచారం. దీంతో చేతిలో సరైన ఆయుధాలు లేక పోవడంతో రాత్రివేళల్లో విధులు నిర్వర్తించడానికి పోలీసులు వెనుకడుగేస్తున్నారు. శిక్షణ లేక చిలుము కాగ్ నివేదికల ప్రకారం ఎనిమిది జిల్లాల్లోని 21 పోలీస్స్టేషన్ల సీఐ, ఎస్ఐ, ఏఎస్ఐ, హెడ్‌కానిస్టేబుళ్లకు 9 ఎంఎం గన్లు ఇచ్చారు. అయితే ఏఎస్ఐ, హెడ్‌కానిస్టేబుళ్లకు అందించిన గన్లను అధికారులు స్టేషన్లలోని స్టోర్‌రూమ్‌లలో భద్రపరిచారు. సంవత్సరాల తరబడి స్టోర్ రూమ్‌లలో భద్రపరచిన గన్లను ఎప్పుడు కూడా వాడకపోవడం, కనీసం అప్పుడప్పుడు శుభ్రం కూడా చేయక తుప్పుపట్టి పనికిరాకుండా పోయాయి. ఆయుధాల కొరత లేదు: డీసీఎం పరమేశ్వర్ రాష్ట్రంలోని హోం శాఖలో ఎలాంటి ఆయుధాల కోరత లేదని, సీఏజీ ఇచ్చిన నివేదికను చాలా సీరియస్‌గా తిసుకోవడం జరుగుతుందని హోంశాఖ మంత్రి జి. పరమేశ్వర్ అన్నారు. బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ డీసీఎం ఆర్.అశోక్ మాట్లాడుతూ. పోలీసు సిబ్బందికి ఆయుధాల కొరతపై కాగ్ నివేదిక మీద చర్చించి ప్రభుత్వానికి సలహాలను ఇస్తామని తెలిపారు. -
నిర్భయ తల్లే ఇంత అందంగా ఉంటే...
సాక్షి, బెంగళూరు : దేశరాజధాని నడిబొడ్డున జరిగిన నిర్భయ ఘటనను ప్రజలు ఇంకా పూర్తిగా మర్చిపోలేదు. మానవ మృగాలు 23 ఏళ్ల పారామెడికల్ విద్యార్థినిని బస్సులో కిరాతకంగా అత్యాచారం చేయగా.. చికిత్స పొందుతూ ఆమె మృతి చెందిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి నిర్భయ తల్లి ఆశాదేవి లైంగిక దాడుల్లో కఠిన చట్టాల కోసం పోరాటం చేస్తూనే ఉన్నారు. ఇదిలా ఉంటే తాజాగా కర్ణాటక రిటైర్డ్ అధికారి ఒకరు నిర్భయ తల్లి ఆశాదేవిని ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. వివరాల్లోకి వెళ్తే... స్త్రీలను సన్మానించేందుకు ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమానికి కర్ణాటక మాజీ డీజీపీ హెచ్‌టీ సంగ్లియానాను ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి ‘నిర్భయ’ తల్లి ఆశా దేవి కూడా వచ్చారు. సంగ్లియానాను వేదిక మీదకు ఆహ్వానించి మాట్లాడాల్సిందిగా కోరారు. ఆ సమయంలో ఈ ఉన్నతాధికారి తాను ఎక్కడ ఉన్నది, ఎందుకు వేదిక మీదకు వచ్చిందనే విషయం మర్చిపోయి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ‘నిర్భయ తల్లిని చూశాను. ఆమె చక్కగా, అందంగా ఉన్నారు. తల్లే ఇంత అందంగా ఉంటే ఇక నిర్భయ ఎంత అందంగా ఉండేదో నేను ఊహించగలను’ అన్నారు. అంతేకాకుండా కార్యక్రమానికి వచ్చిన వారికి కొన్ని ఉచిత సలహాలు కూడా ఇచ్చారు. ‘మీరు ఎంత బలవంతులైనా సరే.. రేపిస్టులకు లొంగిపోవాల్సిందే. అలా అయితేనే మీరు, మీ జీవితాలు సురక్షితంగా ఉంటాయి, ఈ మాటలు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి వర్తిస్తాయి’ అంటూ వ్యాఖ్యానించారు. సంగ్లియానా వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగుతోంది. ఆయన క్షమాపణలు చెప్పాలంటూ మహిళ సంఘాలు ధర్నా చేపట్టాయి. -
కర్ణాటక పోలీసుల దాష్టీకం
సాక్షి, పెద్దపంజాని: చిత్తూరు జిల్లా పెద్దపంజాని మండలం శివదిలో కర్ణాటక పోలీసులు దాష్టీకం ప్రదర్శించారు. ఎటువంటి కారణం లేకుండానే 11 మంది యువకులను కర్ణాటక తీసుకెళ్లి తీవ్రంగా కొట్టారు. వారిలో ఇద్దరి యువకుల పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. దొంగతనం చేయకుండానే ఒప్పుకోమని వారిని బెదిరిస్తున్నారని ఆ యువకుల కుటుంబీకులు ఆరోపిస్తున్నారు.