బెంగళూరు: బెంగళూరులోని జీఆర్ ఫామ్‌హౌస్‌లో రేవ్ పార్టీ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు విచారణలో భాగంగా ముగ్గురు పోలీసు సిబ్బందిని ఆ శాఖ ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. రేవ్ పార్టీ గురించి తెలిసినా నిర్లక్ష్యం వహించినందుకు చర్యలు తీసుకున్నట్టు అధికారులు తెలిపారు.
కాగా, బెంగళూరులోని జీఆర్ ఫామ్ హౌస్‌లో జరిగిన రేవ్ పార్టీలో ఇప్పటికే పలు ట్విస్ట్‌లు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఇక, తాజాగా పోలీసు శాఖలో నిర్లక్ష్యంగా ఉన్న హెబ్బగోడి పోలీసు స్టేషన్‌కు చెందిన ముగ్గురు పోలీసులను సస్పెండ్ చేశారు. మరో ఇద్దరు పోలీసులకు ఎస్పీ మెమోలు జారీ చేశారు. సస్పెండ్ అయిన వారిలో ఏఎస్‌ఐ నారాయణ స్వామి, హెడ్‌కానిస్టేబుల్ గిరీష్, కానిస్టేబుల్ దేవరాజ్ ఉన్నారు. అయితే, వీరికి రేవ్ పార్టీ గురించి సమాచారం ఉన్నప్పటికీ నిరక్ష్యం వహించడంతో ఉన్నతాధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.
ఇదిలా ఉండగా.. రేవ్ పార్టీలో టాలీవుడ్‌కు హేమా, ఆషీరాయ్ డ్రగ్స్ తీసుకున్నట్టు బహిర్గతమైంది. వీరి బ్లడ్ శాంపుల్స్‌లో డ్రగ్స్ తీసుకున్నట్టు వెల్లడైంది. పార్టీలో 150 మంది పాల్గొనగా.. 86 మంది డ్రగ్స్ తీసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. సన్‌సెట్ టు సన్‌రైజ్ విక్టరీ పేరుతో బర్త్‌డే పార్టీ ముసుగులో ఈ పార్టీ నిర్వహించారు. ఇందుకోసం నిర్వాహకులు రూ.2 లక్షల ఎంట్రీ ఫీజు తీసుకుని 200 మందిని ఆహ్వానించారు. ఈ పార్టీలోతెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటకకు చెందిన క్రికెట్ బుకీలు, సినీ పరిశ్రమకు చెందిన పలువురు నటీనటులు(తెలుగు సినీ, సీరియల్ ప్రముఖులు సైతం) పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment