ప్రైవేటు కంపెనీలో హెచ్‌ఆర్ హత్య కేసులో అతని భార్య అంకిత దోషిగా చూపే ఆధారాలు ఏమీ లభించలేదని స్థానిక హెచ్‌ఎస్‌ఆర్ లేఔట్ పోలీసులు చెప్పారు. శుక్రవారం వారు తెలిపిన సమాచారం మేరకు.. హెచ్‌ఆర్‌గా పని చేస్తున్న సౌరభ్, అంకిత హెచ్‌ఎస్‌ఆర్ లేఔట్‌లోని ఓ అపార్‌టమెంట్‌లో నివాసముంటున్నారు. అదే అపార్‌టమెంట్‌లో రిశ్విన్ కూడా నివాసముంటున్నాడు. అంకిత, రిశ్విన్ మధ్య వివాహేతర సంబంధం ఉన్నట్లు సమాచారం.
దీంతో గత నెల సౌరభ్‌ను అతని ఫ్లాట్‌లోనే రిశ్విన్ దారుణంగా పొడిచి హత్య చేశాడు. ఇందులో అంకిత ప్రమేయం ఉందని పోలీసులు భావించారు. రిశ్విన్, అంకిత నిత్యం వాట్స్ ఆఫ్‌లో టచ్‌లో ఉండేవారు. అయితే వారి మొబైళ్లలోని వాట్స్‌ఆప్‌లో ఉన్న సందేశాలను డిలిట్ చేశారు. దీంతో ఎలాంటి ఆధారాలు చిక్క లేదని పోలీసులు అంటున్నారు.దీంతో కేసు దర్యాప్తు పూర్తి చేసి కోర్టులో చివరి నివేదిక సమర్పించామని చెప్పారు. రిమాండ్‌లో ఉన్న రిశ్విన్‌ను శుక్రవారం కోర్టులో హాజరుపరిచారు.
‘భర్త హత్య కేసులో అంకిత ఆధారాలు లభించలేదు'
Published Sat, Jul 5 2014 8:31 AM | Last Updated on Mon, Jul 30 2018 9:15 PM
Advertisement
Advertisement