Ankita
-
అంకితాభావం
అంకితా గొరాయా.. డెంటిస్ట్రీ చదివి, నటన మీదున్న ఇష్టంతో యాక్టింగ్ ఫీల్డ్‌లోకి అడుగుపెట్టింది. వెండితెర, వెబ్‌తెర నటిగా రాణిస్తోంది.డాక్టరా ..యాక్టరా అని ఆలోచించినప్పుడు యాక్టింగ్‌కే మనసు ఓటేసింది. అందుకే ముంబై వచ్చేసి మెథడ్ యాక్టింగ్‌లో జాయిన్ అయ్యాను. సినిమా, సిరీస్ ఏదైనా సరే.. భిన్నమైన పాత్రలు పోషించాలనుంది!– అంకితా గోరయా👉అంకితా పుట్టి, పెరిగింది చండీగఢ్‌లో. తండ్రి.. బల్జిందర్ గొరాయా, రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్. తల్లి.. కిరణ్ గొరాయా, ఆర్టిస్ట్. అంకితా.. డాక్టర్ హర్వంశ్ సింగ్ జడ్జ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ అండ్ హాస్పిటల్లో బీడీఎస్ చేసింది.👉నటనంటే ఆసక్తి ఉండటంతో చదువైపోగానే ముంబైకి వెళ్లింది. అక్కడే ‘ద జెఫ్ గోల్డ్బర్గ్ స్టూడియో’లో మెథడ్ యాక్టింగ్‌లో డిప్లొమా చేసింది. ఆ సమయంలోనే యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ ప్రదర్శించిన సుప్రసిద్ధ ఇటాలియన్ నాటకం ‘సిక్స్ క్యారెక్టర్స్ ఇన్ సర్చ్ ఆఫ్ యాన్ ఆథర్’లో నటించింది. అంతేకాదు అస్సి థియేటర్ వాళ్ల ‘బాయ్స్ లైఫ్’లోనూ ప్రధాన భూమిక పోషించింది.👉రంగస్థలం మీద ఆమె ప్రతిభను చూసి వెండితెర వెల్కమ్ చెప్పింది. ‘సెక్షన్ 375’, ‘పతి పత్నీ ఔర్ వో’, ‘శేర్షా’ సినిమాల్లో ప్రాధాన్యమున్న పాత్రల్లోనే నటించింది అంకితా. ‘ద యెల్లో డైరీ’ మ్యూజిక్ బ్యాండ్ రిలీజ్ చేసిన ‘రబ్ రాఖా’ మ్యూజిక్ వీడియోలో కూడా కనిపించింది.👉ఇప్పుడు ఓటీటీలోకీ అడుగుపెట్టింది ‘ఇండస్ట్రీ’ అనే వెబ్ సిరీస్‌తో. అందులో ‘గాయత్రీ షా’గా అభినయించి, మెప్పిస్తోంది. ఇది అమెజాన్ మినీటీవీలో స్ట్రీమ్ అవుతోంది.👉ఇన్‌స్టా, ఎక్స్, యూట్యూబ్‌లోనూ అంకితా యాక్టివ్‌గా ఉంటుంది.కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్ల పుత్రరత్నం తైమూర్‌కి, తన హాఫ్ సిస్టర్ సారా అలీ ఖాన్ అంటే చాలా ఇష్టం. ఆ ఇద్దరికీ మంచి బాండింగ్ ఉందని బాలీవుడ్ వర్గాల భోగట్టా! సారాను తైమూర్ ‘గోల్’ అని పిలుస్తాడట. ఆ పిలుపునకు సారా మురిసి ముక్కలవుతుందట. గోల్ అంటే హిందీలో ‘గుండ్రం’ అని అర్థం. లావుగా ఉన్నవాళ్లను హిందీలో ‘గోల్’ అంటూ ఆటపట్టిస్తుంటారు. ఒకప్పుడు సారా చాలా లావుగా ఉండేది. అప్పుడు ఆమెను ఇంట్లో అదే పేరుతో ఆటపట్టించేవారట. ‘బహుశా పెద్దవాళ్ల ద్వారా తైమూర్ ఆ మాటను విని ఉన్నాడేమో అందుకే నన్ను ‘గోల్’ అని పిలుస్తాడు’ అంటూ సంబరపడిపోతుంది. -
Indrani Trailer: విజువల్ వండర్లా ‘ఇంద్రాణి’
యానీయా, అంకిత, అజయ్ ప్రధాన పాత్రలలో నటించిన తాజా చిత్రం ‘ఇంద్రాణి’. స్టీఫెన్ పల్లం స్వీయ దర్శక నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రం జూన్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ మంచి బజ్ క్రియేట్ చేశాయి. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ని విడుదల చేశారు మేకర్స్.'ఇండియన్ సూపర్ ఫోర్స్' గురించి పవర్ ఫుల్ వాయిస్ ఓవర్‌తో ట్రైలర్ ప్రారంభమైన ఈ ట్రైలర్.. అద్భుతమైన విజువల్స్ తో ఆద్యంతం అద్భుతంగా సాగింది. ట్రైలర్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే 'ఇంద్రాణి' ఓ విజువల్ వండర్. దర్శకుడు స్టీఫెన్ పల్లం ఈ సినిమా కోసం క్రియేట్ చేసిన ఫ్యూచరిస్టిక్ వరల్డ్ మెస్మరైజింగా వుంది. గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ హాలీవుడ్ స్థాయిలో ఉంటూ అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో ఆకట్టుకున్నాయి. యానీయా, అంకిత, అజయ్, కబీర్ సింగ్ ఇలా మెయిన్ క్యారెక్టర్స్ అన్నీ సూపర్ పవర్స్ తో అలరించాయి. సినిమాటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ప్రొడక్షన్ డిజైన్ .. ఇవన్నీ టాప్ క్లాస్ లో వున్నాయి. మొత్తానికి ట్రైలర్ సినిమాపై చాలా క్యురియాసిటీని పెంచింది. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో డైరెక్టర్ స్టీఫెన్ పల్లం మాట్లాడుతూ..'ఇంద్రాణి' ఒక ఎపిక్ లాంటి సినిమా. చాలా అద్భుతమైన కంటెంట్ వుంది ఇందులో. టాప్ క్లాస్ వీఎఫ్ఎక్స్ వర్క్ ప్రేక్షులని అలరిస్తుంది. ఇందులో లీడ్ రోల్ తో పాటు ఒక రోబోని కూడా క్రియేట్ చేశాం. ఆ ఇద్దరి జర్నీ చాలా అద్భుతంగా వుంటుంది. ఇందులో టైం ట్రావెల్ కాన్సెప్ట్ కూడా ఉంది. వందేళ్ళ తర్వాత ఎలాంటి టెక్నాలజీ వుండబోతుందో ఇందులో చూపించడం జరిగింది. వందేళ్ళ తర్వాత భారతదేశం ప్రపంచంలో ఎలాంటి పాత్ర పోషిస్తుందో ఇందులో సరికొత్తగా చూపించడం జరిగింది. ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది’ అన్నారు. -
ఫ్యాషన్ డిజైనింగ్ కాలేజ్ నేపథ్యంలో ‘పేషన్’
సుధీష్ వెంకట్, అంకిత సాహ, శ్రేయాసి షా హీరో హీరోయిన్లుగా నటిస్తున్న తాజా సినిమా ‘పేషన్’. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ అరవింద్ జోషువా ఈ చిత్రంతో దర్శకుడిగా తెలుగు తెరకు పరిచయం కాబోతున్నాడు.ఆయన స్టార్ డైరెక్టర్స్ శేఖర్ కమ్ముల, మదన్, మోహన కృష్ణ ఇంద్రగంటి వంటి వారి వద్ద పనిచేశారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. హైదరాబాద్ లోని కొన్ని ఫ్యాషన్ కాలేజీలలో 20 రోజుల పాటు తొలి షెడ్యూల్ చిత్రీకరణ జరిపారు. త్వరలోనే రెండో షెడ్యూల్ షూటింగ్ జరగబోతుంది. ఈ సందర్భంగా దర్శకుడు అరవింద్ జోషువా మాట్లాడుతూ - హైదరాబాద్ లోని కొన్ని ఫ్యాషన్ కాలేజీలలో 20 రోజులపాటు సినిమాలోని కొన్ని ప్రధాన సన్నివేశాలని చిత్రించాం. ఇప్పుడు రెండవ షెడ్యూల్ కి సిధ్ధమవుతున్నాం. ఫ్యాషన్ ప్రపంచానికి సంబంధించి ఇంతకుముందు ఎపుడూ రానటువంటి ఒక సమగ్రమైన, సాంకేతిక పరిజ్ఞానంతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాం. ఈ తరహాలో వస్తున్న మొట్టమొదటి భారతీయ సినిమా "పేషన్" అని చెప్పుకోవచ్చు. ప్రేమ, ఆకర్షణకి సంబంధించి యువతలో ఉన్న అనేకమైన ప్రశ్నలకి ఈ సినిమా సమాధానం అవుతుంది. అన్నారు. -
Ankita Basappa: ఒక్క మార్కూ వదల్లేదు!
నూటికి నూరు శాతం అంకితం చదువుల తల్లి సరస్వతే అయినా ఆడపిల్ల చదువుకు వెనుకా ముందు ఆలోచించేవారు ఇంకా ఉన్నారు. అలాంటి వారందరూ అంకితను చూసి ఆలోచన మార్చుకోవాలి. ఎందుకంటే కర్నాటక రైతు బిడ్డ అంకిత పదవ తరగతి ఫలితాల్లో 625కు 625 మార్కులు తెచ్చుకుంది. రాష్ట్రం మొత్తం మీద సెంట్ పర్సెంట్ వచ్చింది అంకితకే. ఇలాంటి అంకితలు ఎందరో ఉంటారు చదువులో ్ర΄ోత్సహిస్తే.మే 9 వ తేదీ. ఆ ఫోన్ వచ్చేసరికి బసప్ప పొలంలో ఉన్నాడు. అవతలి వైపు ఉన్నది స్కూల్ టీచరు.‘బసప్ప గారు మీ అమ్మాయికి పదవ తరగతిలో స్టేట్ ఫస్ట్ మార్కులు వచ్చాయి’ ‘ఓ.. ఎన్ని మార్కులు వచ్చాయి సార్?’‘ఎన్ని వచ్చాయి ఏంటి బసప్ప గారు. అంతకు మించి వేయలేక 625కు 625 వేశారు. అంత బాగా చదివింది మీ అమ్మాయి. ఇన్ని మార్కులు ఇంకెవరికీ రాలేదు’...కర్నాటకలోని బాగల్కోట్కు దాదాపు గంట దూరంలో ఉండే చిన్న పల్లె వజ్రమట్టి. ఆ ఊరే బసప్పది. ఆరెకరాల రైతు. పెద్దమ్మాయి అంకిత. ఇంకా ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. వార్త తెలిశాక ఇంటికి ఆఘమేఘాల మీద చేరుకున్నాడు. మరి కాసేపటిలో ఊరు ఊరంతా ఆ ఇంటి ముందే ఉంది. సందడి చేసింది. కోలాహాలం సృష్టించింది. పులకరించింది. మరి ఒక చిన్న పల్లెటూరి నుంచి అంత బాగా చదివితే ఆ అమ్మాయిని ఆశీర్వదించకుండా ఎలా? అంకితను చూసి ప్రతి ఒక్కరూ మెటికలువిరవడమే.హాస్టల్లో ఉండిఅంకిత తన ఊరికి నలభై నిమిషాల దూరంలో ఉన్న ముధోల్లోని ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకుంది. స్కూల్ హాస్టల్లో ఉండి చదువుకుంటూనే సెలవుల్లో ఇంటికి వచ్చేది. ‘నేను సెల్‌ఫోన్ వాడను. ఏ రోజు పాఠాలు ఆ రోజు చదువుకుంటాను. డిజిటల్ లైబ్రరీలో అదనపు మెటీరియల్ చదివాను. ఉదయం ఐదుకు లేస్తాను. మళ్లీ రాత్రి చదువుతూనే నిద్ర΄ోతాను. ఇంట్లో ఉంటే ఇంటి పనులు ఏవో ఒకటి చేయాల్సి వస్తుంది. కాని హాస్టల్లో ఉంటే చదువు తప్ప వేరే పనేముంది. నా పాఠాలు అయ్యాక ఆడుకోవడం కూడా నేను మానలేదు. మా స్కూల్ టీచర్లు ముందు నుంచి నాకు మంచి మార్కులు వస్తాయని ఊహించారు. వారు నాకు అన్ని విధాల స΄ోర్ట్ చేస్తూ వచ్చారు. నాకు సెంట్ పర్సెంట్ వచ్చినందుకు ఆనందమే. కాని నా కంటే మా అమ్మా నాన్నలు, స్కూల్ టీచర్లు ఎక్కువ సంతోషపడటం నాకు ఎక్కువ ఆనందాన్ని ఇచ్చింది. మా స్కూల్లో మంచి క్రమశిక్షణ ఉంటుంది. అందువల్లే నేను బాగా చదివాను‘ అని చెప్పింది అంకిత.ఐ.ఏ.ఎస్. కావాలని‘మా అమ్మాయి బాగా చదువుతుందనుకున్నాము గాని ఇంత బాగా చదువుతుందని అనుకోలేదు. మేము ఇక ఆమె ఎంత చదవాలంటే అంత చదివిస్తాము. ఏది చదవాలన్నా ఎంత కష్టమైనా చదివిస్తాము’ అన్నారు బసప్ప, అతని భార్య గీత. భర్తతో పాటు పొలానికి వెళ్లి పని చేసే గీత కూతురిని చూసి మురిసి΄ోతోంది. ‘నేను ఇంటర్లో సైన్స్ చదివి ఇంజనీరింగ్ చేయాలనుకుంటున్నాను. ఆ తర్వాత ఐ.ఏ.ఎస్. చేస్తాను’ అంది అంకిత.ముఖ్యమంత్రి ప్రశంసఅంకితకు వచ్చిన మార్కుల గురించి విని కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అభినందనలు తెలియచేశారు. ఇంకా బాగల్కోట్ ప్రభుత్వ అధికారులు ప్రశంసలు తెలియచేశారు. ఇక కర్నాటక డెప్యూటీ చీఫ్ మినిస్టర్ డి.కె.శివకుమార్ తానే స్వయంగా ఇంటికి వచ్చి అభినందిస్తానని కబురు పంపారు. అంకిత విజయం బాగా చదివే అమ్మాయిలందరికీ అంకితం. -
రొమాంటిక్ సీన్స్‌లో చాలా భయపడ్డా.. డైరెక్టర్‌తో గొడవపడ్డాను: హీరో
సాయి రోనక్, అంకిత సాహా, బిస్మి నాస్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘రాజయోగం’ . శ్రీ నవబాలా క్రియేషన్స్, వైష్ణవి నటరాజ్ ప్రొడక్షన్స్ పతాకాలపై మణి లక్ష్మణ్ రావు నిర్మిస్తున్న ఈ చిత్రం..డిసెంబర్ 30న విడుదల అవుతోంది. ఈ సందర్భంగా హీరో సాయి రోనక్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ సినిమాలో రొమాంటిక్ సీన్స్ చేసేప్పుడు భయపడ్డాను. కొన్ని సార్లు దర్శకుడితో గొడపవడ్డాను. మొత్తం ఎడిటింగ్ లో చూశాక దర్శకుడి విజన్ అర్థమైంది. ఆయన చూపించిన సీన్స్ ఏవీ ఇబ్బంది పెట్టేలా ఉండవు. నాకు డాన్స్, ఫైట్స్ బాగా వచ్చు. ఇండస్ట్రీలో కొంతమంది స్టార్స్ కు డాన్సు నేర్పంచాను. ఆ స్కిల్ చూపించే అవకాశం ఈ చిత్రంలో కలిగింది. ఇందులో నేను క్యాబ్ డ్రైవర్ క్యారెక్టర్ చేస్తున్నాను. పదివేల కోట్ల రూపాయల డైమండ్స్ పాయింట్ చుట్టూ కథ సాగుతుంది. ఈవీవీ గారి స్టైల్ సినిమాల్లో ఉన్నట్లు ఒక ఛేజింగ్ తో సినిమా సాగుతుంది. ఫైట్స్, డాన్స్ వంటి కమర్షియల్ అంశాలతో పాటు రొమాన్స్ కూడా ఉంటుంది’ అన్నారు. -
రిసెప్షనిస్ట్ హత్య కేసులో మరో ట్విస్ట్.. పోస్ట్‌మార్టం నివేదికలో ఏముంది?
దేహ్రాదూన్: ఉత్తరాఖండ్‌లో రిసెప్షనిస్ట్, 19ఏళ్ల యువతి హత్య కేసు రాజకీయంగా దుమారానికి దారితీసింది. ఈ కేసులో బహిష్కృత భాజపా నేత కుమారుడు, రిసార్ట్ యజమాని పుల్కిత్ ఆర్య, ఇద్దరు సిబ్బందిని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ హత్య కేసులో మరో కీలక విషయం బయటకు వచ్చింది. హత్యకు ముందు యువతిపై అత్యాచారం జరిగినట్లు ఆధారాలు లేవని పోస్ట్‌మార్టం నివేదికలో తేలినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అయితే ఆమె వేళ్లు, చేతులు, వీపు భాగాల్లో గాయాలైనట్లు గుర్తులు కనిపించినట్లు పేర్కొన్నాయి. ఈ కేసులో బాధిత కుటుంబానికి న్యాయం జరిగే దిశగా చర్యలు చేపట్టారు ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి. కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారించనున్నట్లు చెప్పారు. అలాగే మృతురాలి కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం ప్రకటించారు. అంకిత తండ్రితో సీఎం మంగళవారం ఫోన్లో మాట్లాడారు. ఈ కేసు విచారణను వేగంగా జరిపించి నిందితులకు కఠినశిక్ష పడేలా చేస్తామని హామీ ఇచ్చారు. ఆ మరునాడే పరిహారం ప్రకటించారు. ఇదీ కేసు.. భాజపా బహిష్కృత నేత వినోద్ ఆర్య కుమారుడు పుల్కిత్ ఆర్యకు రిషికేశ్‌లో రిసార్టు ఉంది. అందులో రిసెప్షనిస్ట్‌గా పనిచేస్తోన్న 19 ఏళ్ల యువతి ఇటీవలే హత్యకు గురైంది. కొద్దిరోజుల తర్వాత అక్కడికి దగ్గర్లోని కాలువలో ఆమె మృతదేహం లభించింది. రిసార్టుకు వచ్చే అతిథులకు ఆమె ‘ప్రత్యేక’ సేవలు చేసేందుకు నిరాకరించినందుకే పుల్కిత్, మరో ఇద్దరు సిబ్బంది ఆమెను హత్యచేసినట్లు ప్రాథమిక విచారణలో తేల్చారు పోలీసులు. తనను వ్యభిచార కూపంలోకి లాగేందుకు యత్నిస్తున్నారని వాట్సాప్‌లో స్నేహితుడితో ఆమె మొరపెట్టుకున్న స్క్రీన్ షాట్లు, ఓ ఫోన్ కాల్ వివరాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఇదీ చదవండి: Uttarakhand: రిసెప్షనిస్ట్ అంకిత కుటుంబానికి రూ.25లక్షల ఆర్థిక సాయం -
అంకిత కుటుంబానికి రూ.25లక్షల ఆర్థిక సాయం.. ప్రకటించిన సీఎం
దెహ్రాదూన్: ఉత్తరాఖండ్‌లో హత్యకు గురైన రిసెప్షనిస్ట్ అంకిత భండారీ కుటుంబానికి ఆర్థిక సాయం ప్రకటించారు సీఎం పుష్కర్ సింగ్ ధామీ. ఆమె తల్లిదండ్రులకు రూ.25లక్షలు అందించాలని ఆదేశించారు. ఉత్తరాఖండ్ సీఎం కార్యాలయం ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. అలాగే అంకిత కుటుంభానికి త్వరగా న్యాయం జరిగేందుకు ఆమె హత్య కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టుతో విచారణ జరిపించాలని ధామీ న్యాయస్థానాన్ని కోరినట్లు సీఎంఓ తెలిపింది. అంకిత తండ్రితో సీఎం మంగళవారం ఫోన్లో మాట్లాడారు. ఈ కేసు విచారణను వేగంగా జరిపించి నిందితులకు కఠినశిక్ష పడేలా చేస్తామని హామీ ఇచ్చారు. ఆ మరునాడే పరిహారం ప్రకటించారు. मुख्यमंत्री श्री @pushkardhami ने अधिकारियों को दिवंगत अंकिता भंडारी के परिजनों को ₹25 लाख की आर्थिक सहायता देने के निर्देश दिए हैं। उन्होंने कहा कि पीड़ित परिवार को त्वरित न्याय मिल सके, इसके लिये फास्ट ट्रैक कोर्ट में सुनवाई के लिए माननीय न्यायालय से अनुरोध किया गया है। — CM Office Uttarakhand (@ukcmo) September 28, 2022 మరోవైపు అంకిత హత్య కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) నిందితులకు చెందిన గ్రే యాక్టివా, బ్లాక్ పల్సర్ బైక్‌లను స్వాధీనం చేసుకుంది. వీటిని ఉపయోగించే అంకితను కాలువ దగ్గరకు తీసుకెళ్లి ఆ తర్వాత అందులోకి తోసేసి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. బీజేపీ నుంచి సస్పెండైన వినోద్ ఆర్య కుమారుడు అంకిత్ ఆర్య ఈ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. తన రిసార్డులో రిసెప్షనిస్ట్‌గా పనిచేసే ఆమెను మరో ఇద్దరు సిబ్బందితో కలిసి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే ముగ్గురినీ అరెస్టు చేశారు. ఈ హత్య ఉత్తరాఖండ్‌లో తీవ్ర దుమారం రేపింది. మరోవైపు ఈ రిసార్టులో వ్యభిచారం నిర్వహించేవారని, ఆ కూపంలోకి దిగేందుకు నిరాకరించడం వల్లే అంకితను హత్య చేశారని సిట్ దర్యాప్తులో తేలింది. చదవండి: అది రిసార్ట్ కాదు.. వ్యభిచార కూపం! -
నన్ను ఏమార్చారు.. నా కూతుర్ని కడసారి చూసుకోనివ్వలేదు
దెహ్రాదూన్: ఉత్తరాఖండ్‌లో రిసెప్షనిస్ట్ అంకిత భండారీ గతవారం హత్యకు గురైన విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఘటన తీవ్ర దుమారం రేపింది. అత్యంత నాటకీయ పరిణామాల మధ్య యువతి అంత్యక్రియలు ఆదివారం జరిగాయి. అయితే తన కూతుర్ని కడసారి కూడా చూసుకోనివ్వకుండా తనను ఏమార్చారని అంకిత తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. తనను అధికారులు ఎలా మోసం చేశారో ఓ వీడియోలో చెప్పారు. అంకిత మృతి వార్త తెలిసి ఆమె తల్లి తీవ్ర అనారోగ్యానికి గురైందని, ఆస్పత్రిలో చికిత్స పొందుతోందని తొలుత ప్రచారం జరిగింది. అయితే ఇందులో వాస్తవం లేదని ఆమె వెల్లడించింది. తన కూతుర్ని చూపిస్తామని చెప్పి నలుగురు వచ్చి అడవిలో ఉన్న తమను తీసుకెళ్లారని చెప్పారు. ఆ తర్వాత తనతో అబద్దాలు చెప్పి ఆస్పత్రికి తీసుకెళ్లి, వీల్‌ఛైర్‌లో బలవంతంగా కూర్చొబెట్టారని పేర్కొన్నారు. అనంతరం సెలైన్ పెట్టి ఫోటోలు తీసుకున్నారని పేర్కొన్నారు. తన ఆరోగ్యం బాగానే ఉన్నా కావాలనే ఇదంతా చేశారని వివరించారు. తాను ఎన్నిసార్లు అడిగినా తన కూతురి దగ్గరికే తీసుకెళ్తున్నట్లు చెప్పి నమ్మించి మోసం చేశారని వాపోయారు. మరోవైపు తన భర్తను బలవంతంగా అంకిత మృతదేహం వద్దకు తీసుకెళ్లారని తల్లి ఆరోపించారు. తనను మాత్రం అంకితను కడసారి చూసేందుకు కూడా అనుమతి ఇవ్వకుండా కర్కశంగా ప్రవర్తించారని పేర్కొన్నారు. బీజేపీ నేత కుమారుడే.. బీజేపీ నేత వినోద్ ఆర్య కుమారుడు అంకిత్ ఆర్యకు చెందిన రిసార్టులో అంకిత భండారీ రిసెప్షనిస్టుగా పనిచేసేది. గత ఆదివారం ఆమె అదృశ్యమైంది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు ఆమె హత్యకు గురైనట్లు తెలుసుకున్నారు. నిందితుడు అంకిత్ ఆర్యతో పాటు అతనికి సహకరించిన మరో ఇద్దరు రిసార్టు సిబ్బందిని అరెస్టు చేశారు. శనివారం అంకిత మృతదేహం కాలువలో లభించింది. మొదట అంత్యక్రియలు నిర్వహించేందుకు ససేమిరా అన్నారు అంకిత తండ్రి. ఆ తర్వాత సీఎం పుష్కర్ సింగ్ ధామీ ఇచ్చిన హామీతో మనసు మార్చుకుని ఆదివారం అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కేసు విచారణను వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. చదవండి: గులాం నబీ ఆజాద్ కొత్త పార్టీ పేరు ఇదే.. -
అంకిత హత్యపై... ‘ఫాస్ట్‌ట్రాక్’ విచారణ
డెహ్రాడూన్/రిషికేశ్: రిషికేశ్‌లోని రిసార్టు రిసెప్షనిస్ట్ అంకితా భండారి(19)హత్యపై ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో విచారణ జరిపిస్తామని సీఎం పుష్కర్ సింగ్ ధామి ఆదివారం ప్రకటించారు. పోస్ట్‌మార్టం రిపోర్టు బయట పెడతామన్నారు. ఈ హామీ అనంతరం కుటుంబసభ్యులు అంకిత అంత్యక్రియలు పూర్తి చేశారు. హత్యపై కీలక ఆధారాలు దొరికే అవకాశమున్న రిసార్ట్‌ను ప్రభుత్వం ఎందుకు కూల్చేసిందని అంకిత తండ్రి అంతకుముందు ప్రశ్నించారు. దోషులను శిక్షించాలంటూ రిషికేశ్–బద్రీనాథ్ జాతీయ రహదారిపై 8 గంటలు ఆందోళనజరిగింది. మరోవైపు హత్యను పక్కదారి పట్టించేందుకు నిందితుడు, మాజీ మంత్రి వినోద్ దకొడుకు పులకిత్ ప్రయత్నించినట్లు వెలుగులోకి వచ్చింది. వినోద్ మాత్రం తన కొడుకు అమాయకుడంటూ వెనకేసుకుని వచ్చారు. -
రిసెప్షనిస్ట్ హత్య కేసులో షాకింగ్ నిజాలు..
దెహ్రాదూన్: ఉత్తరాఖండ్‌లోని రిసార్టులో పనిచేసే రిసెప్షనిస్టును హత్యకు సంబంధించి పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. రిసార్టుకు వచ్చే అతిథులకు ప్రత్యేక సేవలు చేయాలని ఓనర్ పుల్కిత్ ఆర్య అంకిత భండారీని తీవ్ర ఒత్తిడి చేశాడని చెప్పారు. అందుకు ఆమె నిరాకరించిందని, ఈ క్రమంలోనే ఆమెతో గొవడపడి సిబ్బందితో కలిసి హత్య చేశాడని పేర్కొన్నారు. యువతి తన ఫ్రెండ్‌తో చేసిన చాటింగ్‌ను పరిశిలిస్తే తమకు ఈ విషయం తెలిసిందని డీజీపీ అశోక్ కుమార్ పేర్కొన్నారు. మరోవైపు రిసార్టుకు వచ్చే అతిథులతో శృంగారం చేయాలని అంకితను ఓనర్ బెదిరించాడని ఆమె ఫేస్బుక్ ఫ్రెండ్ ఒకరు ఇప్పటికే ఆరోపించారు. అందుకు ఒప్పుకోనందుకే ఆమెను హత్య చేశారని పేర్కొన్నారు. ఇప్పుడు పోలీసులు కూడా అదే విషయాన్ని ధ్రువీకరించడం గమనార్హం. రిసార్టు ఓనర్ పుల్కిత్ ఆర్య ప్రముఖ బీజేపీ నేత వినోద్ ఆర్య కుమారుడు. ఆదివారం అదృశ్యమైన అంకితను అతడే హత్య చేశాడని తెలిసి స్థానికుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఓవైపు అధికారులు జేసీబీతో రిసార్టును కూల్చివేసే సమయంలో స్థానికులు వచ్చి భవనానికి నిప్పుపెట్టారు. ఈ హత్య ఉందంతో వినోద్ ఆర్య, అతని మరో కుమారుడ్ని బీజేపీ పార్టీ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. యువతి మృతదేహన్ని పోలుసులు శనివారం కాలువలో కనుగొన్నారు. చదవండి: యువతి హత్య కేసులో కుమారుడు అరెస్టు.. తండ్రిని సస్పెండ్ చేసిన బీజేపీ -
పరిహారం ఏం చేస్కోవాలయ్యా.. అంకిత తండ్రి ఆవేదన
రాంచీ: చక్కగా చదువుకుంటున్న కూతురిని చూసి మురిసిపోతున్న ఆ తండ్రికి.. చివరకు శోకమే మిగిలింది. నిండా 20 ఏళ్లు పూర్తికాకుండానే పాడెకు ఎక్కింది ఆ బిడ్డ. ప్రేమ ముసుగులో ఓ ఉన్మాది ఘాతుకానికి బలైన అంకిత మృతి ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రేమోన్మాది షారూఖ్ హుస్సేన్(19) చేతిలో బలైంది పదిహేడేళ్ల అంకితా కుమారి సింగ్. పొరుగింట్లోనే ఉండే షారూఖ్.. అంకితతో స్నేహం చేశాడు. అయితే తనను ప్రేమించాలని, పెళ్లి చేసుకోవాలని ఆమెను బెదిరిస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలో.. అంకిత తండ్రి సైతం షారూఖ్ కుటుంబంతో ఈ విషయంపై మాట్లాడాడు కూడా. అయితే.. షారూఖ్ వేధింపులు మాత్రం ఆగలేదు. ఆగస్టు 23వ తేదీన డుమ్కా పట్టణంలోని తన ఇంట్లో నిద్రిస్తున్న అంకితపై కిటికీ గుండా పెట్రోల్ పోసి.. నిప్పటించి పారిపోయాడు షారూఖ్. తొంభై శాతం కాలిన గాయాలతో.. చికిత్స పొందుతూ చివరికి ఆదివారం కన్నుమూసింది అంకిత. ఈ ఘటన జార్ఖండ్‌నే కాదు.. యావత్ దేశాన్ని కుదిపేసింది. ఇదిలా ఉంటే.. జార్ఖండ్ ప్రభుత్వం సోమవారం అంకిత కుటుంబానికి పరిహారం ప్రకటించింది. బాధితురాలి కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం ప్రకటిస్తున్నట్లు తెలిపారు ముఖ్యమంత్రి సోరెన్. అయితే ఈ ఆర్థిక సాయంపై అంకిత తండ్రి సంజీవ్ సింగ్ తీవ్రంగా స్పందించారు. ‘‘పరిహారం ఇప్పుడు ఏం చేస్కోవాలి. నా ఆర్థిక స్థితి నుంచి నా కూతురిపై దాడి జరిగిన రోజు నుంచి విజ్ఞప్తి చేస్తూనే ఉన్నా. ప్రభుత్వం గనుక ఇదే సాయాన్ని ముందు అందించి ఉంటే.. మెరుగైన చికిత్స అందించి నా కూతురిని రక్షించుకునేవాడ్ని. ఆమె బతికేది ఏమో’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇస్తున్న ఆ సాయాన్ని వద్దని తిరస్కరించారాయన. వాడు ప్రేమోన్మాది మాత్రమే కాదు.. మతోన్మాది కూడా. తనను వివాహం చేసుకోవాలని, ఇస్లాంలోని మారాలని, లేకుంటే జీవితాంతం నరకం చూపిస్తానని బెదిరించేవాడని అంకిత తమకు చెప్పి వాపోయిందని సంజీవ్ మీడియాకు వెల్లడించారు. తనకు పరిహారం అక్కర్లేదని.. తన కూతురి ఆత్మకు శాంతి కలిగేలా ఈ కేసులో న్యాయం కావాలని కోరుకుంటున్నారాయన. మరోవైపు అంకిత చికిత్స పొందుతుండగా.. తీసిన కొన్ని వీడియోలు.. తనపై జరిగిన దాడి తరహాలోనే నిందితులను చంపేయాలంటూ ఆమె కోరుకున్న వీడియోలు సైతం వైరల్ అవుతున్నాయి. This is the last wish of #AnkitaSingh : She said "as i am dying now, Shahrukh & his accompalish should also get death like me." But I am very doubtful about our Supreme Court. Recently they stopped hanging of a Muslim who has raped & killed a 4 year old girl saying he has future pic.twitter.com/SLpQz4UoyY — Radharamn Das राधारमण दास (@RadharamnDas) August 29, 2022 #WATCH | Jharkhand: Accused Shahrukh who set ablaze a class 12 girl in Dumka for allegedly turning down his proposal, was arrested on 23rd August. The girl succumbed to her burn injuries yesterday, 28th August. (In video: The accused from the day of his arrest - 23rd August) pic.twitter.com/PwkQuM8plt — ANI (@ANI) August 29, 2022 మరోవైపు నిందితుడ్ని పోలీసులు అరెస్ట్ చేసి తరలిస్తుండగా.. మీడియాను చూస్తూ నవ్వడం అతని ఉన్మాదస్థాయిని తెలియజేస్తోందని పలువురు మండిపడుతున్నారు. ఇంకోవైపు ఎంక్వైరీ ఆఫీసర్‌గా నూర్ ముస్తఫాను నియమించడంపై స్థానిక యువత తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. నూర్ ముస్తాఫాపై తమకు నమ్మకం లేదని.. తన మతస్తుడికి మద్ధతుగా ఆమె దర్యాప్తు కొనసాగించే అవకాశం ఉందంటూ ఆరోపిస్తూ తక్షణమే ఆమెకు ఇచ్చిన విచారణ బాధ్యతలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక బీజేపీ సైతం ఈ ఘటన ఆధారంగా జేఎంఎం ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తోంది. అంకిత మృతదేహానికి బీజేపీ నేతలు, భజ్రంగ్ దల్ సభ్యులు దగ్గరుండి అంత్యక్రియలు జరిపించారు. మరోవైపు జస్టిస్ ఫర్ అంకిత హ్యాష్‌ట్యాగ్ ఇప్పుడు ట్విటర్‌ను కుదిపేస్తోంది. ఇదీ చదవండి: బీజేపీ కార్పొరేటర్ ఇంట్లో కిడ్నాపైన పసికందు!! -
Ankita Shah: ఆసరాకు అంకితం
ఆడపిల్లలు తల్లికి ఇంటి పనుల్లో తప్ప తండ్రికి ఏవిధంగా సాయపడగలరు... అనే ఆలోచన నిన్నామొన్నటి వరకు సమాజంలో ఉండేది. ఇప్పుడు ఏమరుపాటుగా కూడా అలాంటి ఆలోచన చేయాల్సిన అవసరం లేదని నిరూపిస్తున్నారు అంకితలాంటి అమ్మాయిలు. గుజరాత్లో పుట్టి పెరిగిన అంకిత షా దివ్యాంగురాలైనా ఆటో నడుపుతూ తల్లిదండ్రులకు ఆసరా అయ్యింది. జీవితంలో నిలదొక్కుకోవడానికి తనలాంటి దివ్యాంగులకు ప్రేరణ గా నిలుస్తోంది. అంకిత ఏడాది బిడ్డగా ఉన్నప్పుడు పోలియో వచ్చి కుడికాలు వైకల్యానికి లోనైంది. అయినా, తల్లిదండ్రులు ఆమెను చదువులో ప్రోత్సహించారు. దీంతో ఎకనామిక్స్‌లో డిగ్రీ చేసింది అంకిత. 2009లో ఉద్యోగం కోసం అహ్మదాబాద్ కు వెళ్లింది. చుక్కెదురైంది అక్కడ. అక్కడనే కాదు, అలా చాలా చోట్ల ఇంటర్వ్యూలకు హాజరయ్యింది. కానీ, ప్రతీచోటా తిరస్కారాన్నే ఎదుర్కొంది. కొన్ని ఆఫీసులలో వైకల్యం కారణంగా జాబ్ ఇవ్వలేమన్నారు. అంకిత కుటుంబంలో తోబుట్టువులతో కలిపి ఏడుగురు సభ్యులు. తండ్రి సంపాదన పైనే ఇల్లు గడిచేది. అంకిత చిన్న చిన్న పనులు వెతుక్కొని చేసినా అవేవీ కుటుంబ పోషణకు సరిపోవడం లేదు. ఇది చాలదన్నట్టు అంకిత తండ్రి నాలుగేళ్ల క్రితం క్యాన్సర్ బారిన పడ్డాడు. మనో ధైర్యమే ఊతంగా.. సంపాదించే పెద్ద దిక్కు లేకపోతే ఆ కుటుంబం ఎలాంటి పరిస్థితిలో ఉంటుందో ఊహించవచ్చు. అప్పటికీ కుటుంబ పోషణకు సరిపడా ఉద్యోగం కోసం అంకిత వెతుకుతూనే ఉంది. అలాంటి సమయంలోనే దివ్యాంగుడైన ఆటో డ్రైవర్ లాల్జీ బారోట్ పరిచయం అయ్యాడు. ఏ పనీ దొరక్క చాలా ఇబ్బందిగా ఉందని చెప్పడంతో అతను అంకితకు ఆటో నడపడం నేర్పించాడు. ఆటో నడపడం పూర్తిగా వచ్చాక, లైసెన్స్ తీసుకుంది అంకిత. ఆటో రిక్షా కొనుగోలులోనూ అంకితకు సాయం చేశాడు బారోట్. దీంతో మూడేళ్లుగా అంకిత ఆటో డ్రైవింగ్ చేస్తూ నెలకు రూ.25 వేలు సంపాదిస్తోంది. ‘డ్రైవింగ్ వల్ల మొదట్లో వళ్లు నొప్పులు వచ్చేవి అయినా, కుటుంబం కళ్ల ముందు మెదిలి మనోధైర్యాన్నే ఊతంగా చేసుకుంది. శక్తినంతా కూడదీసుకొని డ్రైవింగ్‌లో నైపుణ్యం సాధించింది. ‘రోజూ ఉదయం 10:30 గంటల నుంచి ఆటో నడపడానికి బయల్దేరుతాను. తిరిగి ఇంటికి వచ్చేసరికి రాత్రి 8:30 గంటలు అవుతుంది. మా నాన్న బాధ్యత తీసుకోగలిగాను అనే ఆనందంతోపాటు కుటుంబానికి భరోసాగా ఉన్నాను అనే సంతృప్తి కలుగుతుంది. ధైర్యం చేసి ఉండకపోతే ఈ రోజు మా కుటుంబం చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చేది’ అంటోంది అంకిత. తండ్రి బాధ్యతను భుజాలకెత్తుకున్న కూతురుగానే కాదు దివ్యాంగులకూ ప్రేరణగా నిలుస్తోంది అంకిత. -
5 నెలల గర్భవతి... 10 కి.మీ. పరుగు... 62 నిమిషాల్లో...
బెంగళూరు: మహిళా‘శక్తి’ అంటే ఇదేనేమో! పురుషులు ఏ కొంచెం ఎక్కువ శ్రమించినా బాగా అలసిపోయాం... ఇక విశ్రాంతి కావాల్సిందే అంటారు. కానీ మహిళ మాత్రం ఓ బిడ్డను మోస్తున్నా ఇంటి పని చేస్తుంది. ఆఫీస్‌కెళ్లి డ్యూటీ చేస్తుంది. అంతేగానీ... నెలతప్పిన నాటి నుంచి ప్రసవించే దాకా రెస్ట్ తీసుకుంటానని భీష్మించుకోదు కదా! ఇదే జరిగితే మన పొద్దు గడవడం కాదు... ప్రపంచమే నడవకుండా ‘లాక్డౌన్’ అయ్యేది. ఇక విషయానికొస్తే... ఓ మహిళ మరో అడుగు ముందుకేసింది. స్ఫూర్తిగొలిపే పరుగు పెట్టింది. ఐదు నెలల గర్భవతి అయిన ఆమె 10కే (10 కిలోమీటర్లు) పరుగును 62 నిమిషాల్లో పూర్తి చేసింది. ఆ ధీర వనిత బెంగళూరుకు చెందిన 35 ఏళ్ల అంకిత గౌర్. వృత్తిరీత్యా ఇంజినీర్ అయిన అంకిత గత తొమ్మిదేళ్లుగా ఇలాంటి పరుగు పోటీల్లో పాల్గొంటూనే ఉంది. ఇక టీసీఎస్ 10కే రన్లో 2013 సంవత్సరం నుంచి క్రమం తప్పకుండా పోటీ పడుతూనే ఉంది. ఇందులో విశేషం లేదు. కానీ ఇప్పుడామె 5 నెలల గర్భవతి. మరో మూణ్నాలుగు నెలల్లో అంకిత తల్లి కానుంది. అయినా సరే తనకిష్టమైన పరుగు కోసం తన గైనకాలజిస్టును సంప్రదించి మరీ పోటీపడింది. దీనిపై అంకిత మాట్లాడుతూ ‘గడిచిన తొమ్మిదేళ్లుగా ఈ ‘పరుగు’ పెడుతూనే ఉన్నాను. నిత్యం నేను తీసుకునే శ్వాసలాగే నా జీవితంలో నేను పెట్టే పరుగు ఓ భాగం’ అని వివరించింది. ప్రతిరోజూ తను రన్నింగ్ చేస్తూనే ఉంటానని చెప్పిన ఆమె ఐదు అంతర్జాతీయ మారథాన్లలోనూ పాల్గొన్నట్లు పేర్కొంది. బెర్లిన్‌లో మూడుసార్లు, బోస్టన్, న్యూయార్క్ మారథాన్లలో ఒక్కోసారి పోటీపడినట్లు తెలిపింది. గతంలో టీసీఎస్ 10కేలోనూ పతకాలు గెలిచానని వివరించింది. -
పాటల వీడియోలు..పిపిఇ కిట్లు
ఈ మహమ్మారి కాలంలో ఓ చిన్న సాయం కూడా సమాజానికి ఎంతో మేలు చేస్తుంది. ప్రజల కష్టాలకు చలించిన ఓ వైద్య విద్యార్థి వినూత్నంగా ఆలోచించి తన వంతుగా ఏదైనా సాయం చేయాలనుకుంది. కరోనా పోరాటంలో ఉన్న ఆరోగ్య కార్యకర్తలకు ఉచితంగా పిపిఇ కిట్లు ఇవ్వాలని నిశ్చయించుకుంది. అందుకు సోషల్ మీడియాను వేదికగా చేసుకుంది. స్నేహితులతో కలిసి ‘సౌండ్’ అని పేరుతో రెండు నెలలుగా పాటల ప్రచారాన్ని నిర్వహిస్తోంది. అంకిత పూణేలోని భారతీయ విద్యాపీఠ్ మెడికల్ కాలేజీ విద్యార్థిని. రెండు నెలలుగా సోషల్ మీడియాలో ఆమె చేస్తున్న సంగీత ప్రచారం సక్సెస్ అయ్యింది. ఈ ప్రచారంలో వచ్చిన మొత్తంతో ఆరోగ్య కార్యకర్తలకు ఫేస్ షీల్డ్, పిపిఇ కిట్లు ఇచ్చింది. ఎనిమిది మంది బృందంగా తన ఎనిమిది మంది స్నేహితులతో అంకిత ఈ సంగీత ప్రచారాన్ని ప్రారంభించింది. అందుకు కాలేజీ బ్యాండ్ సభ్యుల సహాయాన్ని తీసుకుంది. 60 కి పైగా వివిధ భాషలలో గల ప్రసిద్ధ పాటల వీడియోలను సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్ళింది. ప్రజల కోరిన విధంగా ఈ వీడియోలను రూపొందించింది. ఒక అమ్మాయి తన ప్రేమికుడికి ఇష్టమైన పాటల వీడియో పంపించాలనుకుంటే, అంకిత తన స్నేహితులతో కలిసి వారికి ఆ పాటల వీడియోను పంపుతుంది. దీనికి బదులుగా, ఆమె ఒక కస్టమర్ నుండి 55 రూపాయలు తీసుకుంటుంది. ఆ మొత్తంతో ఒక ఫేస్ షీల్డ్ వస్తుంది. ఉచితంగా పిపిఇ కిట్లు అంకిత తన ప్రచారం ద్వారా మొదటి రోజు రూ. 28,000 వసూలు చేసింది. కొన్ని రోజుల్లోనే ఈ మొత్తం పెరిగింది. ఈ వీడియోలు 3,000 మంది వరకు కొనుగోలు చేశారు. ఈ విధంగా నిధులను కూడబెట్టి, ఆరోగ్య కార్యకర్తలకు శిక్షణా సెషన్ల కోసం కర్ణాటక ప్రభుత్వానికి అంకిత 300 ఫేస్ షీల్డ్‌లను అందించింది. గ్రేటర్ ముంబై మున్సిపల్ కమిషన్ హెల్త్ కేర్ వైద్యుల కోసం 1000 పిపిఇ కిట్లను సరఫరా చేసింది. మణిపాల్‌లోని కస్తూర్బా మెడికల్ కాలేజీకి 300 పిపిఇ కిట్లను ఇచ్చింది. ప్రస్తుతం ఆమె పాల్ఘర్లోని కోవిడ్ ఐసోలేషన్ వార్డ్ కోసం 500 పిపిఇ కిట్లను ఇవ్వడానికి ప్లాన్ చేస్తోంది. ఒంటరితనం దూరం అంకితకు చాలా మంది కాలేజీ స్నేహితులు ఉన్నారు. మొదటి విరాళం కాలేజీ విద్యార్థి నుండే తీసుకుంది. కరోనా కాలంలో అందరూ వారి వారి ఇళ్లలోనే ఉన్నారు. స్నేహితుల ఒంటరితనం, చింతను అధిగమించడానికి అంకిత మొదట్లో వారికి నచ్చిన పాటలను తయారు చేసి వీడియోలను ఇచ్చింది. ఈ విధంగా వారిని సంతోషపెట్టడంలో తను ఆనందం పొందింది. ఈ ఆలోచన నుంచే వీడియోలను సామాజిక మాధ్యమంలో ఉంచి నిధుల సేకరణకు పూనుకుంది. కస్టమర్ ఫొటోలు ఎవరైనా తమకు నచ్చినవిధంగా వీడియోలు కావాలంటే అలాగే తయారుచేసి ఇస్తుంది. పైగా కస్టమర్లు తమ ఫొటోలను షేర్ చేస్తే వాటిని సరైన విధంగా డిజైన్ చేసి, వీడియోల మీద అతికించి ఇస్తుంది. రెండు నెలల క్రితం ఫ్రెండ్ వని ఘాయ్‌తో ప్రారంభించిన ఈ ప్రాజెక్ట్‌లో ఇతర పట్టణాల్లో నివసిస్తున్న స్నేహితులనూ చేర్చింది. ఆ తర్వాత ప్రజలను తమ వీడియోల వైపు ఆకర్షించేలా డిజైన్ చేసింది. ఈ వీడియోలు లాక్డౌన్ జ్ఞాపకంగా దాచుకోవచ్చని తన వ్యూవర్స్‌కి చెప్పింది. ఈ వీడియోలకు ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. అంకిత అనుకున్న కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగుతోంది. కష్టకాలంలో ఇతరులకు సాయం చేయాలన్న ఒక చిన్న ఆలోచన అంకితను సేవా మార్గంలో ఆనందంగా పయనింపజేస్తోంది. -
పెద్ద కొడుకు
అంకితాబెన్ షా... గుజరాత్లో ఇప్పుడు వార్తల్లోని వ్యక్తి. అహ్మదాబాద్ రైల్వేస్టేషన్ ఆటో స్టాండ్‌లో మగవాళ్లు నడుపుతున్న ఆటోలతోపాటు అంకితాబెన్ షా ఆటో కూడా ఉంటుంది. ఆమె మీడియా దృష్టిని ఆకర్షించడానికి కారణం ఒక మహిళ ఆటో నడుపుతుండడం మాత్రమే కాదు. ఫిజికల్లీ చాలెంజ్డ్ ఉమన్ ఆటో నడపడం కూడా. అందులోనూ తండ్రి వైద్యం కోసం ఆమె ఈ సాహసం చేస్తున్నారు. ‘‘మా అమ్మానాన్నకు మేము ఐదుగురు సంతానం. అందరిలో పెద్దదాన్ని. మా నాన్న అనారోగ్యంతో మంచం పట్టాడు. ఆయనకు వైద్యం చేయించడంతోపాటు ఇంటిని పోషించాలి. నేను ఆడపిల్లను అని కానీ, నాకు శారీరక వైకల్యం ఉందని కాని ఊరుకోవడం నా వల్ల కాలేదు. ఆటో స్టీరింగ్ పట్టుకున్నాను. మహిళను కాబట్టి చూసిన వాళ్లు ఇన్ని ప్రశ్నలు వేస్తున్నారు. అబ్బాయినైతే ఎవరూ ఏమీ అడిగేవాళ్లే కాదు. మా నాన్న అంతమంది పిల్లల్ని పోషిస్తూ కూడా నన్ను చదివించాడు. ఆడపిల్ల, అందులోనూ శారీరక వైకల్యం ఉంది చదువెందుకు అనుకోలేదాయన. అలాంటి తండ్రికి నేను రుణం తీర్చుకోవాల్సిన సమయం ఇది’’ అంటారు అంకితాబెన్ షా. ఆఫీసుల చుట్టూ తిరిగింది అంకితాబెన్ షా సొంతూరు గుజరాత్, సూరత్‌కు సమీపంలోని పాలిథానా గ్రామం. ఆమెకు చిన్నప్పుడు కుడికాలికి పోలియో సోకింది. వాళ్లకు తెలిసిన డాక్టర్ అతడికి చేతనైన వైద్యం చేయడంతో ఆమె కోలుకోలేదు సరికదా, మెరుగైన వైద్యం అందక కాలిలో కొంత భాగం తొలగించాల్సి వచ్చింది. దాంతో ఆమెకు కృత్రిమ కాలు అమర్చారు. ‘మిగిలిన అందరు పిల్లల్లా అన్ని పనులూ చేయలేదు, కాబట్టి చదివిస్తే ఏదో ఒక ఉద్యోగం వస్తుంది. ఎవరి మీదా ఆధారపడకుండా తన బతుకు తాను జీవించగలుగుతుంది..’ అనుకున్నాడు ఆమె తండ్రి. అనుకున్నట్లే డిగ్రీ వరకు చదివించాడు కూడా. పదేళ్ల కిందట డిగ్రీ పట్టాతో అహ్మదాబాద్‌లో అడుగుపెట్టారు అంకిత. పాతికేళ్ల అమ్మాయి... చేతిలో పట్టాతో ఉద్యోగం కోసం అహ్మదాబాద్‌లోని ఆఫీసుల చుట్టూ తిరిగింది. ఓ గర్ల్స్ స్కూల్లో క్లర్క్ ఉద్యోగం వచ్చింది. మొదటి మూడు నెలలు నామమాత్రపు వేతనం ఇచ్చేటట్లు, మూడు నెలల తర్వాత మంచి జీతం ఇచ్చేటట్లు ఒప్పందం చేసుకుంది ఆ యాజమాన్యం. అయితే పది నెలలైనా జీతం మాటేలేదు. కాల్ సెంటర్ ఉద్యోగానికి గుజరాతీ యాసతో కూడిన ఇంగ్లిష్ ఉచ్ఛారణ పెద్ద అడ్డంకి అయింది. దాంతో అంకిత స్పోకెన్ ఇంగ్లిష్ ప్రాక్టీస్ చేశారు. అహ్మదాబాద్ వ్యాపార నగరం చూపించిన జీవితాన్ని గుర్తు చేసుకుంటూ.. ‘‘ఎన్నో ఆఫీసుల గడపలు ఎక్కి దిగాను. బీఏ ఎకనమిక్స్ పట్టా నా చేతిలో ఉంది, అయినా సరే నా కాలికి ఉన్న వైకల్యమే వాళ్లకు ప్రధానంగా కనిపించింది. ఇంటర్వూ్య చేసిన తర్వాత నా సర్టిఫికేట్లు చేతిలో పెడుతూ ‘వైకల్యం గురించి ఆలోచించాల్సి వస్తోంది’ అనేవారు. పట్టు వదలకుండా ప్రయత్నం చేయగా చేయగా ఎట్టకేలకు ఒక కాల్ సెంటర్లో ఉద్యోగం దొరికింది. రోజుకు పన్నెండు గంటల పని. పన్నెండు వేలు జీతం. బతుకుకు ఆసరా దొరికిందని సంతోషపడేలోపు నాన్నకు పెద్ద అనారోగ్యం. క్యాన్సర్ అన్నారు. ఆయనకు పని చేసే పరిస్థితి లేకపోవడమే కాదు ఆయనకు వైద్యం చేయించడానికి చాలా డబ్బు కావాలి. ఆయనను హాస్పిటళ్లకు తీసుకెళ్లాలి అంటే ఆఫీసుకు సెలవు పెట్టాలి. ఉద్యోగం చేస్తూ, వైద్యం చేయిస్తూ సూరత్– అహ్మదాబాద్‌ల చుట్టూ తిరిగాను. ఉద్యోగం నుంచి నన్ను తీసేయలేదు కానీ, నా సెలవులు వాళ్లకు ఇబ్బందిగా ఉంటున్నాయని తెలుస్తోంది. ఇదేం పని అన్నారు ఒక రోజు... ఇంట్లో అందరూ ఉన్నప్పుడు ఉద్యోగం మానేస్తానని చెప్పాను. వాళ్లు ఆ మాటకు పెద్దగా ఆశ్చర్యపోలేదు. కానీ ఆటో నడపతానన్న మాటకు ఆశ్చర్యపోయారు. నాకు తెలిసిన ఆటో డ్రైవర్ లాల్జీ బారోత్ దగ్గర డ్రైవింగ్ నేర్చుకున్నాను. అతడు కూడా ఫిజికల్లీ చాలెంజ్డ్ పర్సనే. అతను తన ఆటోకు మార్పులు చేయించుకున్నట్లే నాక్కూడా హ్యాండ్ బ్రేక్ పెట్టించాడు. ఆరు నెలల నుంచి ఆటో నడుపుతున్నాను. రోజుకు ఎనిమిది గంటలు పని చేస్తున్నాను, నెలకు పాతిక వేలు మిగులుతున్నాయి. నాన్న కోసం హాస్పిటల్‌కు వెళ్లాల్సినప్పుడు ఇప్పుడు ఎవరి నుంచీ అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఖర్చులకు సరిపడినంత డబ్బు రాలేదనిపిస్తే మరో రెండు గంటలు పని చేయడానికి నేను సిద్ధమే. కామెంట్లు వస్తుంటాయి రోడ్డు మీద బైక్‌లలో వెళ్లే వాళ్లలో కొందరు పోకిరీలు ఏదో ఒక కామెంట్ చేస్తుంటారు. మహిళ ఆటో నడుపుతోందని గమనించి నా ఆటోను దాటుకుని ముందుకి వెళ్లి తలలు తిప్పి నన్ను పరిశీలనగా చూస్తారు. వాళ్ల నోటికి వచ్చినదేదో కూస్తారు. ఆ మాటలను పట్టించుకోవాల్సిన అవసరమే లేదనిపిస్తుంది నాకు. ఎండలో తిరిగితే చర్మం కమిలిపోతోందనే బెంగ కూడా లేదు. నీడపట్టున కూర్చుని చేసిన ఉద్యోగాల కంటే ఆటో నడపడంలో నాకు సంతృప్తి ఉంది. భవిష్యత్తులో కూడా ఇక ఆ ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేయను. నాన్న ఆరోగ్యం కుదుటపడిన తర్వాత ట్యాక్సీ సర్వీస్‌ని విస్తృతం చేస్తాను. పెద్ద తమ్ముడికి పనిలో పడే వయసు వచ్చింది. తనను కూడా ఇదే పనిలో పెడతాను. మా కుటుంబాన్ని గట్టెక్కించిన స్టీరింగ్‌ని మాత్రం ఎప్పటికీ వదలను’’ అన్నారు అంకిత. – మంజీర -
ఆశలు ఉన్నవాళ్లు
కాళ్లు లేవు. కాలినడకన వస్తాం అని మొక్కుకోకూడదా? వేళ్లు లేవు. వీణపై స్వరాలను పలికించాలన్న తపన ఉండకూడదా? మాట లేదు. ప్రతిధ్వనించేలా నినదించాలని ఆవేశపడకూడదా? వినికిడి లేదు. విశ్వాంతరాళ హోరుకు విష్ణుమూర్తిలా చెవి వొగ్గకూడదా? చూపు లేదు. సిక్సర్లు కొట్టాలని, క్యాచ్‌లు పట్టేయాలని ఉత్సాహపడకూడదా? బ్రియాన్ లారా వెస్టిండీస్ క్రికెటర్. ప్రపంచ క్రికెట్ చరిత్రను తూకం వేస్తే ఆ తూగే బరువులో ఆయన కాస్త ఎక్కువగానే ఉంటారు. ఐదడుగులా ఎనిమిది అంగుళాల ఎత్తు ఉన్నందువల్ల, ర్యాంకింగ్‌లు– రికార్డులు ఏవో ఉంటాయి ఈ క్రికెట్వాళ్లకు.. అవి సమృద్ధిగా ఉన్నందువల్ల, ఒబామా అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు వెస్టిండీస్‌లో పర్యటిస్తూ అక్కడుండే లారాను వెతుక్కుంటూ వెళ్లి కలిసినందువల్ల, తన చిట్టచివరి వన్డే ఇంటర్నేషనల్‌లో ఆట అవుతున్నంతసేపూ ‘లారా.. లారా.. లారా..’ అని పిచ్‌లో ప్రకంపనలు రేపిన ఫ్యాన్స్ వైపు ఆటంతా అయ్యాక చేతులు చాస్తూ.. ‘డిడ్ ఐ ఎంటర్టైన్?’ అని అడిగినందు వల్లా.. క్రమంగా పెరుగుతూ వచ్చిన బరువు కావచ్చది. యాభై ఏళ్ల మనిషి. ఆరేళ్ల వయసున్నప్పటి నుంచి ఆడిన మనిషి. పన్నెండేళ్ల క్రితం రిటైర్ అయిన మనిషి. రిటైర్ అయినా బరువు ఏమాత్రం తగ్గని మనిషి. బ్రియాన్ లారానే మనం ఇంకోలా చూద్దాం. ఆయనకు కళ్లు లేవు. పుట్టు గుడ్డి. అలా అని అనుకుందాం. పదకొండు మంది సంతానంలో ఒకడైన లారాను తండ్రి ఎన్ని కళ్లతోనూ ఎంతసేపో కనిపెట్టుని ఉండలేకపోయేవాడు. లారా పుట్టిన శాంటాక్రజ్‌లో లోకల్ స్కూల్ ఒకటి ఉంది. హార్వార్డ్ కోచింగ్ క్లినిక్. ఆ క్లినిక్.. ఆరేళ్ల వయసులోనే క్రికెట్ అంటే ఆసక్తి చూపినప్పటికీ కళ్లు లేని కారణంగా లారాను చేరదీసి, ముద్దు చేయలేకపోయేది. లారా తొలి బడి సెయింట్ జోసెఫ్స్ రోమన్ కేథలిక్ ప్రైమరీ ఆ పసివాడికి అడ్మిషన్ ఇవ్వలేకపోయేది. కళ్లు లేని వాళ్ల బడి కాదు అది. సెయింట్ జువాన్ సెకండరీ స్కూలు, ఫాతిమా కాలేజీ కూడా ముఖం చాటేసేవి.. ఒకవేళ లారా స్టిక్ సహాయంతో తడుముకుంటూ తడుముకుంటూనే అంతదూరం వచ్చాడని అనుకున్నా. క్రికెట్ కోచ్ హ్యారీ రామ్‌దాస్ అంటే కూడా ప్రపంచానికిప్పుడు పెద్దగా తెలియకపోయేది. అంధుడైన లారాను లెఫ్ట్‌హ్యాండెడ్ బ్యాట్స్‌మన్‌గా, రైట్ ఆర్మ్ లెగ్ బ్రేక్ బౌలర్‌గా చెక్కడానికి ఆయనకేం పట్టేది?! లారాకు కూడా కళ్లు లేకుండా పద్నాలుగేళ్ల వయసులో స్కూల్ బాయ్స్ లీగ్‌లో ఇన్నింగ్స్‌కి సగటున 126 పరుగులు చొప్పున 745 పరుగులు తియ్యడం ఒక ఊహ మాత్రమే అయ్యేది. సాకర్ అన్నా, టేబుల్ టెన్నిస్ అన్నా కూడా లారాకు ఇష్టం. చూపులేని కారణంగా ఆ ఇష్టాలనూ చంపుకుని ఎక్కడో బతుకుతూ ఉండేవాడు! ‘నాకే ఎందుకిలా చేశావ్ దుర్మార్గుడా!’ అని దేవుణ్ణి తిట్టుకుంటూ.. తలకొట్టుకుంటూ ఉండేవాడు.. ఎవర్ని తిడుతున్నదీ స్పృహ లేకుండా. ‘‘అవును నిజంగా అలానే ఉండేవాడిని’’ అన్నాడు ఇప్పుడు ఇండియాలోనే ఉన్న బ్రియాన్ లారా. ఢిల్లీలో బ్లైండ్ ఉమెన్ డొమెస్టిక్ నేషనల్ క్రికెట్ లీగ్ పోటీలకు ముందు రెండు మాటలు మాట్లాడమని ‘క్రికెట్ అసోసియేషన్’ అడిగితే వచ్చాడు. పోటీలు సోమవారం మొదలయ్యాయి. ఫస్ట్ టైమ్ మన దగ్గర అంధ మహిళా క్రీడాకారులకు జాతీయస్థాయి పోటీలు జరగడం. ఏడు టీమ్‌లు తలపడుతున్నాయి. ఢిల్లీలోని సిరి ఫోర్ట్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఇవాళ ఫైనల్స్. మాట్లాడ్డానికి ముందు ఢిల్లీ టీమ్ కెప్టెన్ అంకితాసింగ్ని, తక్కిన టీమ్‌లను, టీమ్ మేట్స్నీ కలిసి విష్ చేశాడు లారా. ‘‘ఈరోజు మీ మధ్య నేను ఉండటం అనే ఫీలింగ్ నాకు చాలా వండర్ఫుల్ అనిపిస్తోంది’’ అన్నాడు ఆ తర్వాత స్టేజ్ మీద. కొంచెం ఎమోషనల్ కూడా అయ్యాడు. ‘‘నా కెరియర్ మొత్తంలో నేనేవైతే సాధించగలిగానో అవన్నీ కూడా నాకేవైతే ఉన్నాయో వాటి వలన సాధ్యమైనవే. నేనొకవేళ నాకేవైతే ఉన్నాయో వాటికి నోచుకోకపోయి ఉంటే కనుక, నా ఆశలన్నిటినీ చంపుకుని ఏ చీకటి మూలనో కూర్చొని ఉండేవాడిని’’ అని ఒక్క క్షణం ఆగి.. ‘‘అయితే ఇప్పుడనిపిస్తోంది. అలా కూర్చొని ఉండేవాడిని కాదని. నేనూ స్కూలుకు వెళ్లాలనే అనుకునేవాడిని. నేనూ నేర్చుకోవాలనే అనుకునేవాడిని. నేనూ మంచి ఉద్యోగం చేయాలనే అనుకునేవాడిని. నేనూ ఆటలు ఆడాలనే అనుకునేవాడిని’’ అన్నాడు లారా! ఆ వెంటనే ‘‘దీజ్ లేడీస్ అండ్ దెయిర్ టోర్నమెంట్ జస్ట్ అప్రోచింగ్’’ అన్నాడు. అప్రోచింగ్ అంటే నాట్ కంపేరబుల్ అని. ఈ మాటతో మళ్లీ కొద్దిగా బరువు పెరిగాడు బ్రియాన్ లారా. ఎలా ఆడతారు వీళ్లు క్రికెట్‌ని కళ్లు లేకుండా అనుకుంటాం? అసలు ఎలా ఆడాలనిపిస్తుంది వీళ్లకు క్రికెట్‌ని కళ్లు లేకుండా అనుకునేవాళ్లూ ఉండొచ్చు. ‘ఎలా ఆడతారు?’ అనే ప్రశ్నకు ఎక్కడైనా సమాచారం లభిస్తుంది. ‘ఎలా ఆడాలనిపిస్తుంది?’ అనే ప్రశ్నకు చూపుకు అందని సమాధానం మాత్రమే ఉంటుంది. -
ఆ కష్టాలనుంచి పుట్టిన కథ
‘‘ఓ రోజు నేను హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి వస్తున్నప్పుడు క్యాబ్‌లో రాసున్న ఓ కొటేషన్ గురించి క్యాబ్ డ్రైవర్ని అడిగా. ‘నేను బీటెక్ చదివాను. ఉద్యోగం దొరక్క నెలకి రూ.10 వేలకి క్యాబ్ డ్రైవర్‌గా చేస్తున్నా. నాలాంటి వాళ్లు చాలామంది చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నారు.. ఇంజినీరింగ్‌కి విలువ లేదు’ అని చెప్పగానే ఆశ్చర్యపోయా’’ అని డైరెక్టర్ రఘురాజ్ అన్నారు. ఈశ్వర్ హీరోగా, అంకిత, టువ హీరోయిన్లుగా ఆర్. రఘురాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘4 లెటర్స్’. ‘కుర్రాళ్ళకి అర్థమవుతుందిలే..’ అన్నది ఉపశీర్షిక. దొమ్మరాజు హేమలత, దొమ్మరాజు ఉదయ్ కుమార్ నిర్మించిన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా రఘురాజ్ మాట్లాడుతూ– ‘‘నాతో పైవిధంగా అన్న క్యాబ్ డ్రైవర్‌తో కొన్నిరోజులు ట్రావెల్ చేసి, ఇంజినీరింగ్ చేసిన వారి కష్టాలు తెలుసుకున్నాను. అలా ఈ స్టోరీ పుట్టింది. ఇంజినీరింగ్ స్టూడెంట్స్‌కి మా సినిమాలో ఒక మెసేజ్ కూడా ఉంటుంది. ‘లవ్ అట్ ఫస్ట్ సైట్’ అంటుంటారు. కానీ, అవన్నీ బ్రేకప్ అవుతున్నాయి. ‘లవ్ అట్ సెకండ్ లుక్’ అనే కొత్త కథాంశంతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాం. మా సినిమా యూత్‌కే కాదు.. పెద్దవాళ్లకు కూడా నచ్చుతుంది. వంద సంవత్సరాల సినిమా చరిత్రలో ఎవరూ చేయని సాహసం మా సినిమాలో చేశాం. అది ఏంటన్నది సినిమా చూస్తేనే అర్థమవుతుంది. థాయిల్యాండ్‌లోని ప్రత్యేకమైన ప్రదేశాల్లో పాటలు షూట్ చేశాం. నేను ఏదడిగినా కాదనకుండా అన్నీ సమకూర్చుతూ మమ్మల్ని ముందుకు నడిపించిన మా నిర్మాతలు ఉదయ కుమార్, హేమలత గార్లకు ప్రత్యేకంగా ధన్యవాదాలు’’ అన్నారు. నిర్మాత ఉదయ్ కుమార్ పాల్గొన్నారు. -
అంకితకు పతకం ఖాయం
భారత నంబర్‌వన్ మహిళా టెన్నిస్ క్రీడాకారిణి అంకిత రైనా సింగిల్స్ సెమీఫైనల్‌కు చేరుకొని పతకాన్ని ఖాయం చేసుకుంది. సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో అంకిత 6–4, 6–1తో చోంగ్ యుడిస్ వోంగ్ (హాంకాంగ్)పై గెలిచింది. మిక్స్డ్ డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో అంకిత–రోహన్ బోపన్న జంట 6–4, 6–4తో చోంగ్ యుడిస్ వోంగ్–చున్ హున్ వోంగ్ (హాంకాంగ్) ద్వయంపై నెగ్గింది. కుస్తీలో నిరాశ ఆసియా క్రీడల్లో రెజ్లింగ్‌కు చివరి రోజైన బుధవారం భారత్‌కు పతకం దక్కలేదు. నలుగురు రెజ్లర్లు బరిలోకి దిగినా ఎవరూ పతకం ‘పట్టు’ పట్టలేకపోయారు. గ్రీకో రోమన్ విభాగంలో హర్‌ప్రీత్ సింగ్ కాంస్యం కోల్పోయాడు. 87 కేజీల కాంస్య పతక బౌట్లో అతను 3–6తో కుస్తుబయేవ్ (కజకిస్తాన్) చేతిలో ఓడాడు. మిగతా ముగ్గురు రెజ్లర్లు... గుర్ప్రీత్ (77 కేజీలు), నవీన్ (130 కేజీలు), హర్దీప్ (97 కేజీలు) పతకం రౌండ్‌కు అర్హత సాధించేకపోయారు. జ్యోతి సురేఖ బృందానికి రెండో ర్యాంక్... మహిళల ఆర్చరీ కాంపౌండ్ టీమ్ ర్యాంకింగ్ క్వాలిఫయింగ్‌లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ బృందం 2085 పాయింట్లతో రెండో స్థానాన్ని దక్కించుకుంది. జ్యోతి సురేఖ 705 పాయింట్లు సాధించి ఓవరాల్‌గా రెండో ర్యాంక్‌లో నిలిచింది. మిగతా భారత ఆర్చర్లలో ముస్కాన్ (691) 9వ, మధుమిత (689) 11వ, త్రిషా దేబ్ (683) 19వ స్థానాల్లో నిలిచారు. తమ ప్రదర్శనతో భారత్‌కు నేరుగా క్వార్టర్ ఫైనల్‌కు బై లభించింది. జిమ్నాస్టిక్స్‌లో ఏడో స్థానం ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ టీమ్ ఈవెంట్లో బుద్దా అరుణా రెడ్డి, ప్రణతి దాస్, మందిర చౌదరీలతో కూడిన భారత జట్టు 138.050 పాయింట్లతో ఏడో స్థానంలో నిలిచింది. గాయం కారణంగా స్టార్ జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ టీమ్ ఈవెంట్ ఫైనల్‌కు దూరంగా ఉంది. -
తొలి రౌండ్లో అంకిత రైనా విజయం
ప్రతిష్టాత్మక వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ క్వాలిఫయింగ్ టెన్నిస్ టోర్నమెంట్లో భారత నంబర్‌వన్ క్రీడాకారిణి అంకిత రైనా శుభారంభం చేసింది. లండన్‌లో మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వాలిఫయింగ్ తొలి రౌండ్లో అంకిత 6–2, 6–1తో మయా లమ్స్‌డెన్ (బ్రిటన్)పై విజయం సాధించింది. రెండో రౌండ్లో ప్రపంచ 134వ ర్యాంకర్ వితాలియా దియాత్‌చెంకో (రష్యా)తో అంకిత ఆడుతుంది. పురుషుల డబుల్స్‌లో విష్ణు వర్ధన్–శ్రీరామ్ బాలాజీ (భారత్), జీవన్ నెడున్‌చెజియాన్ (భారత్)–ఆస్టిన్ క్రాయిసెక్ (అమెరికా) జోడీలు మరో మ్యాచ్ గెలిస్తే మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధిస్తాయి. -
పోరాడి ఓడిన అంకిత రైనా
ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్లో భారత క్రీడాకారిణి అంకిత రైనా తొలి రౌండ్లోనే నిష్క్రమించింది. పారిస్‌లో మంగళవారం పదో సీడ్ రొడీనా (రష్యా)తో జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో అంకిత 3–6, 6–7 (2/7)తో ఓటమి చవిచూసింది. గంటా 41 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో అంకిత తన సర్వీస్‌ను ఐదుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను మూడు సార్లు బ్రేక్ చేసింది. 52 అనవసర తప్పిదాలు చేసిన అంకిత నెట్‌వద్ద 15 పాయింట్లు సాధించింది. క్వాలిఫయింగ్ టోర్నీలో భారత్ నుంచి నలుగురు బరిలోకి దిగారు. ప్రజ్నేశ్ రెండో రౌండ్‌కు చేరుకోగా... అంకిత, సుమీత్, రామ్‌కుమార్ తొలి రౌండ్లోనే వెనుదిరిగారు. -
మిలింద్ సోమన్, అకింత కోన్వర్ పెళ్లి అయిపోయింది!!
-
వారి పెళ్లి అయిపోయింది!!
ప్రేమకు వయసుతో నిమిత్తం లేదని మిలింద్ సోమన్, అకింత కోన్వర్ జంట నిరూపించింది. మోడల్, నటుడు అయిన మిలింద్ ఆదివారం ప్రేమికురాలు అంకితను పెళ్లాడారు. 52 ఏళ్ల మిలింద్ గత కొన్నాళ్లుగా 23 ఏళ్ల అంకితతో డేటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి మధ్య దాదాపు 30 ఏళ్ల వ్యత్యాసం ఉంది. ఈ నేపథ్యంలో కూతురు వయస్సు ఉన్న అమ్మాయితో ప్రేమేంటి? అంటూ పలువురు మిలింద్‌ను తప్పుబట్టారు. వీరి అనుబంధంపై సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయి. ఈ విమర్శలను ఏమాత్రం లెక్కచేయని మిలింద్-అంకిత జంట ఆదివారం వైవాహిక జీవితంలో అడుగుపెట్టారు. ముంబైలోని అలిబౌగ్లో బంధుమిత్రుల సమక్షంలో సంప్రదాయ పద్ధతిలో వీరి పెళ్లి జరిగింది. వీరి పెళ్లికి సంబంధించిన చిత్రాలను బంధుమిత్రులు సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. వీరి పెళ్లి సన్నిహితుల నడుమ ఒకింత రహాస్యంగా జరిగినా.. సోషల్ మీడియాలో వీరి పెళ్లి ఫొటోలు హల్చల్ చేస్తున్నాయి. -
మేము బ్రేకప్ అవ్వలేదు : నటుడు
ప్రముఖ నటుడు, భారత మాజీ సూపర్ మోడల్ మిలింద్ సోమన్, అంకిత కోన్వర్ల ప్రేమ జంట బ్రేకప్ అయిందని పుకార్లు హల్చల్ చేశాయి. ఈ వార్తలపై ఆ ప్రేమజంట స్పందించింది. మేము కలిసే ఉన్నాం విడిపోలేదని తాజాగా ఇన్‌స్ట్రాగ్రామ్‌లో వారు ఫొటోలను పోస్ట్ చేశారు. 52 ఏళ్ల మిలింద్ 23 ఏళ్ల అంకితలు ప్రేమించుకుంటున్న సంగతి తెలిసిందే. తమ ప్రేమను ఈ జంట పెళ్లి వరకూ తీసుకు వచ్చింది. కాగా, వీరు పెళ్లికి రెండు రోజుల ముందు డబ్బు విషయంలో విడిపోయారనే వార్తలు బాలీవుడ్లో చక్కర్లు కొట్టాయి. దీంతో తాము విడిపోలేదని, ఇదంతా పుకార్లేనని తెలుపుతూ మిలింద్ ఇన్‌స్ట్రామ్‌లో అంకితతో కలిసి దిగిన ఫోటోలను పోస్ట్ చేశాడు. అంకిత కూడా ఆ ఫోటోలను షేర్ చేసింది. ‘మంచిపై దృష్టి పెట్టండి. మంచి అలవాట్లతో మంచి జీవితాన్ని గడుపుతారు’ , చుట్టుపక్కల వారిని ప్రేమించండి’ అంటూ మిలిందర్ తమ ఫొటోలను ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. దీంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. తమ సంతోషాన్ని తెలుపుతూ.. కామెట్స్ కూడా రాశారు. ‘ నాకు తెలిసి మీరు విడిపోరు. ఈ వార్తలు అన్ని పుకార్లే అనుకున్నా’ , మీ ఇద్దరిని ఇలా చూస్తుంటే సంతోషంగా ఉంది, జీవితాంతం ఇలానే కలిసి ఉండండి’ అంటూ అభిమానులు పోటోలపై కామెంట్స్ చేస్తున్నారు. మిలిందర్ అంకితను పెళ్లి చేసుకుంటే ఆయనకు ఇది రెండో పెళ్లి అవుతుంది. గతంలో ఫ్రెంచ్ నటి మైలీన్ జంపనోయినను మిలింద్ వివాహం చేసుకున్నారు. 2006 నుంచి 2009 వరకు వీరి దాంపత్య జీవితం కొనసాగింది. గతంలో కూడా మిలింద్, సూపర్ మోడల్ మధు సప్రేతో ప్రేమాయణం నడిపాడు. -
అంకిత అదరగొట్టినా...
న్యూఢిల్లీ: ఫెడ్ కప్ వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్ రేసునుంచి భారత్ నిష్క్రమించింది. సింగిల్స్ విభాగంలో అంకితా రైనా తన అసాధారణ ప్రదర్శన కొనసాగించి మరో విజయం సాధించినా... జట్టుగా భారత్‌కు ఓటమి తప్పలేదు. గురువారం ఇక్కడ జరిగిన ఆసియా ఓసియానియా గ్రూప్–1 టెన్నిస్ టోర్నీలో భారత్ వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఓడింది. ఈ పోరులో కజకిస్తాన్ 2–1తో భారత్‌పై గెలుపొందింది. బుధవారం చైనాతో జరిగిన మ్యాచ్‌లో సంచలన విజయం సాధించిన అంకిత... తన ధాటిని ఈ మ్యాచ్‌లోనూ కొనసాగించింది. సింగిల్స్‌లో ప్రపంచ 253వ ర్యాంకు క్రీడాకారిణి అంకిత 6–3, 1–6, 6–4తో 87వ ర్యాంకర్ యులియా పుటిన్త్సెవాను కంగుతినిపించింది. మిగతా మ్యాచ్‌ల్లో భారత అమ్మాయిల వైఫల్యంతో జట్టు ఓడిపోయింది. తొలి మ్యాచ్‌లో కర్మన్ కౌర్ థండి 3–6, 2–6తో జరీనా దియాస్ చేతిలో పరాజయం చవిచూసింది. చివరగా జరిగిన డబుల్స్‌లో అంకిత–ప్రార్థన తొంబారే జోడీ 0–6, 4–6తో జరీనా దియాస్–యులియా పుటిన్‌త్సెవా జంట చేతిలో ఓడింది. ఆసియా ఓసియానియా గ్రూప్–1లో కొనసాగాలంటే గెలవాల్సిన తదుపరి మ్యాచ్‌లో భారత్... హాంకాంగ్‌తో తలపడనుంది. -
‘భర్త హత్య కేసులో అంకిత ఆధారాలు లభించలేదు'
ప్రైవేటు కంపెనీలో హెచ్ఆర్ హత్య కేసులో అతని భార్య అంకిత దోషిగా చూపే ఆధారాలు ఏమీ లభించలేదని స్థానిక హెచ్ఎస్ఆర్ లేఔట్ పోలీసులు చెప్పారు. శుక్రవారం వారు తెలిపిన సమాచారం మేరకు.. హెచ్ఆర్గా పని చేస్తున్న సౌరభ్, అంకిత హెచ్ఎస్ఆర్ లేఔట్‌లోని ఓ అపార్టమెంట్లో నివాసముంటున్నారు. అదే అపార్టమెంట్లో రిశ్విన్ కూడా నివాసముంటున్నాడు. అంకిత, రిశ్విన్ మధ్య వివాహేతర సంబంధం ఉన్నట్లు సమాచారం. దీంతో గత నెల సౌరభ్‌ను అతని ఫ్లాట్‌లోనే రిశ్విన్ దారుణంగా పొడిచి హత్య చేశాడు. ఇందులో అంకిత ప్రమేయం ఉందని పోలీసులు భావించారు. రిశ్విన్, అంకిత నిత్యం వాట్స్ ఆఫ్‌లో టచ్‌లో ఉండేవారు. అయితే వారి మొబైళ్లలోని వాట్స్ఆప్లో ఉన్న సందేశాలను డిలిట్ చేశారు. దీంతో ఎలాంటి ఆధారాలు చిక్క లేదని పోలీసులు అంటున్నారు.దీంతో కేసు దర్యాప్తు పూర్తి చేసి కోర్టులో చివరి నివేదిక సమర్పించామని చెప్పారు. రిమాండ్‌లో ఉన్న రిశ్విన్‌ను శుక్రవారం కోర్టులో హాజరుపరిచారు.