దెహ్రాదూన్: ఉత్తరాఖండ్‌లో హత్యకు గురైన రిసెప్షనిస్ట్ అంకిత భండారీ కుటుంబానికి ఆర్థిక సాయం ప్రకటించారు సీఎం పుష్కర్ సింగ్ ధామీ. ఆమె తల్లిదండ్రులకు రూ.25లక్షలు అందించాలని ఆదేశించారు. ఉత్తరాఖండ్ సీఎం కార్యాలయం ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడించింది.
అలాగే అంకిత కుటుంభానికి త్వరగా న్యాయం జరిగేందుకు ఆమె హత్య కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టుతో విచారణ జరిపించాలని ధామీ న్యాయస్థానాన్ని కోరినట్లు సీఎంఓ తెలిపింది. అంకిత తండ్రితో సీఎం మంగళవారం ఫోన్లో మాట్లాడారు. ఈ కేసు విచారణను వేగంగా జరిపించి నిందితులకు కఠినశిక్ష పడేలా చేస్తామని హామీ ఇచ్చారు. ఆ మరునాడే పరిహారం ప్రకటించారు.
मुख्यमंत्री श्री @pushkardhami ने अधिकारियों को दिवंगत अंकिता भंडारी के परिजनों को ₹25 लाख की आर्थिक सहायता देने के निर्देश दिए हैं। उन्होंने कहा कि पीड़ित परिवार को त्वरित न्याय मिल सके, इसके लिये फास्ट ट्रैक कोर्ट में सुनवाई के लिए माननीय न्यायालय से अनुरोध किया गया है।
— CM Office Uttarakhand (@ukcmo) September 28, 2022
మరోవైపు అంకిత హత్య కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) నిందితులకు చెందిన గ్రే యాక్టివా, బ్లాక్ పల్సర్ బైక్‌లను స్వాధీనం చేసుకుంది. వీటిని ఉపయోగించే అంకితను కాలువ దగ్గరకు తీసుకెళ్లి ఆ తర్వాత అందులోకి తోసేసి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు.
బీజేపీ నుంచి సస్పెండైన వినోద్ ఆర్య కుమారుడు అంకిత్ ఆర్య ఈ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. తన రిసార్డులో రిసెప్షనిస్ట్‌గా పనిచేసే ఆమెను మరో ఇద్దరు సిబ్బందితో కలిసి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే ముగ్గురినీ అరెస్టు చేశారు. ఈ హత్య ఉత్తరాఖండ్‌లో తీవ్ర దుమారం రేపింది. మరోవైపు ఈ రిసార్టులో వ్యభిచారం నిర్వహించేవారని, ఆ కూపంలోకి దిగేందుకు నిరాకరించడం వల్లే అంకితను హత్య చేశారని సిట్ దర్యాప్తులో తేలింది.
చదవండి: అది రిసార్ట్ కాదు.. వ్యభిచార కూపం!
Comments
Please login to add a commentAdd a comment