Resort
-
హిమాచల్ పోలీసుల అకృత్యం
బనీఖేత్(హిమాచల్ ప్రదేశ్): నూతన సంవత్సర వేడుకల వేళ అర్ధరాత్రి దాటాక తాము అడిగిన మద్యం, ఆహారం ఇవ్వలేదన్న అక్కసుతో రిసార్ట్ మేనేజర్‌ను పోలీసులు కొట్టి చంపేసిన ఘటన హిమాచల్ ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. రిసార్ట్ యజమాని ఇచ్చిన ఫిర్యాదు, నమోదైన ఎఫ్ఐఆర్లోని వివరాల ప్రకారం డిసెంబర్ 31వ తేదీ అర్ధరాత్రిదాటాక పర్వతమయ పర్యాటక ప్రాంతం డల్హౌసీ దగ్గర్లోని బనీఖేత్లోని ఒక ప్రైవేట్ రిసార్ట్‌కు ముగ్గురు కానిస్టేబుళ్లు వచ్చారు. రాత్రి రెండు గంటల సమయంలో తాము అడిగిన భోజనం, మద్యం ఏర్పాట్లు చేయాలని రిసార్ట్ సిబ్బందికి ఆదేశాలిచ్చారు. రాత్రి సమయంలో తాము చేయాల్సిన ‘సర్వీస్’సమయం మించిపోయిందని, ఇప్పుడు నిబంధనలు ఒప్పుకోవని, ఈ సమయంలో సర్వీస్ చేయడం కుదరని అక్కడి రిసెప్షనిస్ట్ సచిన్ చెప్పాడు. దీంతో పట్టరాని ఆవేశంతో కానిస్టేబుల్స్ అనూప్, అమిత్‌లు రిసెప్షనిస్ట్‌ను చితకబాదారు. ఇదంతా చూసిన రిసార్ట్ మేనేజర్ రాజీందర్ హుటాహుటిన అక్కడికొచ్చి కానిస్టేబుళ్లను నిలువరించబోయారు. అప్పటికే కోపంతో ఊగిపోతున్న కానిస్టేబుళ్లు రాజీందర్పైనా దాడికి తెగించారు. ఈ దాడిలో రాజీందర్ అక్కడికక్కడే చనిపోయారు. దాడి సమయంలో కానిస్టేబుళ్లు పూటుగా మద్యం తాగి ఉన్నారని వార్తలొచ్చాయి. విషయం తెల్సుకున్న స్థానికులు వెంటనే చంబా–పఠాన్‌కోట్ జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేశారు. రాజీందర్ మృతికి కారణమైన కానిస్టేబుళ్లను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఫిర్యాదు అందుకున్న స్థానిక పోలీసులు వెంటనే ఆ ఇద్దరు కానిస్టేబుళ్లను అరెస్ట్‌చేశారు. ఇద్దరినీ విధుల నుంచి తప్పించి దర్యాప్తు మొదలుపెట్టామని చంబా ఎస్పీ గురువారం చెప్పారు. తీవ్రంగా గాయపడిన రిసెప్షనిస్ట్‌ను ఆస్పత్రిలో చేర్పించారు. -
శ్రీకాళహస్తిలో రిసార్ట్ కూల్చివేతకు కుట్ర
సాక్షి టాస్‌్కఫోర్స్: తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ సానుభూతిపరుల ఆస్తులే లక్ష్యంగా విధ్వంసానికి తెగబడుతున్నారు. గత ఆరు నెలల్లో సుమారు 175 నిర్మాణాలను కూల్చివేశారు. తాజాగా శ్రీకాళహస్తి మున్సిపాలిటీ పరిధిలో స్వర్ణముఖి నది ఒడ్డున 2017 టీడీపీ హయాంలోనే నిర్మించిన రివర్వ్యూ రిసార్ట్‌ను... నేడు అక్రమం అంటూ ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే నేలమట్టం చేసేందుకు సిద్ధమయ్యారు.శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే తాటిపర్తి చెంచురెడ్డి అల్లుడు శేఖర్‌రెడ్డికి చెందిన రిజి్రస్టేషన్ స్థలంలో రివర్ వ్యూ రిసార్ట్ నిరి్మంచారు. రిసార్ట్ నిర్మాణానికి అన్ని అనుమతులు ఉన్నాయని చెంచురెడ్డి కుమార్తె వెల్లడించారు. అయితే, సార్వత్రిక ఎన్నికల్లో శేఖర్‌రెడ్డి కుటుంబం వైఎస్సార్సీపీకి అనుకూలంగా పనిచేసింది. అందువల్లే వారిపై శేఖర్‌రెడ్డికి చెందిన రివర్ వ్యూ రిసార్ట్‌ను కూల్చివేసేందుకు స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సు«దీర్‌రెడ్డి కుట్ర పన్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తెల్లవారుజామునే వచ్చి... మున్సిపల్ అధికారులు, పోలీసులు శనివారం వేకువజామున రివర్ వ్యూ రిసార్ట్ వద్దకు చేరుకుని కూల్చివేతకు సిద్ధమయ్యారు. ఈ విషయం తెలుసుకున్న శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి అక్కడకు చేరుకుని ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ప్రైవేటు ఆస్తులలో ఏమిటీ దౌర్జన్యమని నిలదీశారు. అప్పటికే ప్రహరీ కొంత భాగాన్ని కూల్చి వేశారు. మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ శ్రేణులు అడ్డుకోవడంతో కూల్చివేతను తాత్కాలికంగా నిలిపివేశారు. శ్రీకాళహస్తిలో జరుగుతున్న విధ్వంసకాండ గురించి బియ్యపు మధుసూదన్‌రెడ్డి.. వైఎస్సార్సీపీ తిరుపతి, చిత్తూరు జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. భూమన వెంటనే శ్రీకాళహస్తిలోని రివర్వ్యూ రిసార్ట్ వద్దకు చేరుకుని కనీసం నోటీసులు ఇవ్వకుండా కూల్చివేయడం సరికాదని, నిబంధనలు పాటించాలని అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. అనంతరం ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం కూడా హోటల్ వద్దకు చేరుకుని నిర్మాణాలు కూల్చివేతను తప్పుబట్టారు. ఇంతలోనే మరోసారి అధికారులు కూల్చివేతకు సిద్ధం కాగా.. బియ్యపు మధుసూదన్‌రెడ్డి, హైకోర్టు మాజీ న్యాయవాది ప్రభాకర్‌రెడ్డి గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను మున్సిపల్ కమిషనర్, అధికారులకు చదివి వినిపించారు. రిజిస్టర్ భూమిలో నిర్మించిన భవనాన్ని ఎలా కూలుస్తారని? అక్రమ నిర్మాణమే అయినా వారం ముందే నోటీసులు ఇవ్వాలని సుప్రీంకోర్టు చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. అక్రమ నిర్మాణాలు అయినా శని, ఆదివారాల్లో ఎటువంటి చర్యలు తీసుకోరాదని స్పష్టంచేశారు. దీంతో మున్సిపల్ కమిషనర్, పోలీసులు వెనకడుగు వేశారు. అయినా ఎమ్మెల్యే నుంచి మున్సిపల్ కమిషనర్, పోలీసులపై ఒత్తిడి రావటంతో ప్రహరీని పూర్తిగా కూల్చివేశారు. ఒకవైపు అక్రమం అంటూనే.. మరోవైపు పరిహారం చెల్లిస్తామని.. ఉదయం నుంచి రివర్వ్యూ రిసార్ట్ అక్రమంగా నిర్మించారని, కూల్చివేస్తామని అధికారులు హడావుడి చేశారు. అయితే, మధ్యాహ్న సమయంలో అక్కడికి చేరుకున్న ఉన్నతాధికారులు మాత్రం ‘స్వర్ణముఖి నది సుందరీకరణ కోసం స్థలం అవసరం ఉంది. కొంత తీసుకుంటాం. అందువల్ల కూల్చివేసిన నిర్మాణాలకు ఎంత నష్టం అయ్యిందో చెబితే పరిహారం చెల్లిస్తాం’అని చెప్పడం గమనార్హం. ఆ తర్వాత కూల్చివేతలు నిలిపివేసి అందరూ వెళ్లిపోయారు. కానీ, వైఎస్సార్సీపీ శ్రేణులు ఎవరూ లేని సమయంలో సాయంత్రం అధికారులు మరోసారి జేసీబీతో వచ్చి రివర్ వ్యూ రిసార్ట్ ముఖద్వారాన్ని పూర్తిగా కూల్చివేశారు. -
కోడిపుంజులాంటి హోటల్..!
రాజసంగా నిలుచున్న కోడిపుంజును చూశారు కదూ! ఇది కోడి గౌరవార్థం నిలిపిన విగ్రహమేమీ కాదు. ఇది హోటల్ భవంతి. కోడిపుంజు ఆకారంలో ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన భవంతిగా ఇది గిన్నిస్ రికార్డు సాధించింది. ఈ భవంతి ఎత్తు 114.7 అడుగులు. ఫిలిప్పీన్స్‌లోని నెగ్రోస్ నగరంలో ఉందిది.నిలువెత్తు కోడిపుంజులాంటి ఈ హోటల్ భవనంలో సమస్త సౌకర్యాలతో కూడిన 15 ఎయిర్ కండిషన్డ్ గదులు ఉన్నాయి. ఫిలిప్పీన్స్ స్థానిక సంస్కృతిలో కోడిపుంజుకు విశేష ప్రాధాన్యముందని, ఆ ఒక్క కారణమే కాకుండా, జనాల దృష్టిని ఆకట్టుకునేందుకు కోడిపుంజు ఆకారంలో ఈ భవంతిని నిర్మించామని ఈ హోటల్ యజమాని రికార్డో కానో గ్వాపో తెలిపారు. ఈ హోటల్ పేరు ‘కాంప్యూస్టోహాన్ హైలాండ్ రిసార్ట్’. (చదవండి: ఏంటిది.. చేపకు ఆపరేషన్ చేశారా..!) -
స్విమ్మింగ్ పూల్‌లో గంతులేస్తూ..
దొడ్డబళ్లాపురం: మంగళూరు వద్ద ఘోర విషాదం చోటుచేసుకుంది. సెలవులు గడుపుదామని వచ్చిన యువతులు నీట మునిగిపోయారు. స్విమ్మింగ్ పూల్‌లో మునిగి ముగ్గురు యువతులు మృతిచెందిన సంఘటన మంగళూరు శివారులోని ఉచ్చిల బీచ్‌ను ఆనుకుని ఉండే వాజ్కో బీచ్ రిసార్ట్‌లో చోటుచేసుకుంది. మైసూరుకు చెందిన ఎన్. నిశిత (21), పార్వతి (20), ఎండీ కీర్తన (21) మృతులు. వీకెండ్ కావడంతో వీరు శనివారం నాడు రిసార్ట్‌కు వచ్చారు. ఆదివారం ఉదయం 10 గంటలకు స్విమ్మింగ్ పూల్‌లో ఈత కొట్టసాగారు. కొంతసేపటికే నీట మునిగిపోయారు. యువతులకు ఈత రాకపోవడం, స్విమ్మింగ్ పూల్ ఆరు అడుగుల కంటే లోతుగా ఉండడం వల్ల మునిగిపోయినట్లు అనుమానాలున్నాయి. ఉళ్లాల పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఘటనాస్థలిని నగర పోలీస్ కమిషనర్ అనుపమ్ అగర్వాల్ పరిశీలించారు. గంతులేస్తూ ఆడుతూనే..మొదట అందరూ ఈత కొలనులో గంతులేస్తూ సరదాగా ఆడుకుంటూ ఉన్నారు. అయితే కాస్త లోతైన చోట నిశిత మునిగిపోవడంతో ఆమెను కాపాడాలని పార్వతి ముందుకు వెళ్లింది. ఇదంతా చూస్తున్న కీర్తన కూడా వెళ్లింది. ఇలా వరుసగా మునిగి చనిపోయారని కమిషనర్ చెప్పారు. అక్కడి సీసీ కెమెరాలలో ఈ ఘోరం దృశ్యాలు నమోదయ్యాయి. అమ్మాయిల తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో వారు మధ్యాహ్నం కల్లా చేరుకుని విగతజీవులుగా ఉన్న కూతుళ్లను చూసి పెద్ద పెట్టున రోదించారు. వేలకు వేల ఫీజులు వసూలు చేసి రిసార్టులు, హోటళ్లలో కనీస భద్రతా వసతులు లేవని, ఫలితమే ఈ ఘోరమని ఆరోపణలున్నాయి. -
ఇదేం జైలు రా సామీ..! ఏకంగా నీటి నడిబొడ్డున..
నీటి నడిబొడ్డునున్న ఈ కట్టడం ఒక చెరసాల. ఇది ఇస్టోనియాలోని వసలెమా పారిష్ పట్టణ సమీపంలోని రుమ్ము గ్రామంలో ఉంది. ఒకప్పుడు ఇక్కడ పాలరాతి గనులు, సున్నపురాతి గనులు ఉండేవి. సోవియట్ హయాంలో ఇక్కడ రుమ్ము, ముర్రు చెరసాలల్లో బందీలుగా ఉండే ఖైదీలతో ఈ గనుల్లో పనులు చేయించుకునేవారు. గని నుంచి వెలికి తీసిన సున్నపురాతిని శుద్ధి చేయడానికి చాలా నీటిని వాడేవాళ్లు. ఈ నీరు గనిని లోతుగా తవ్విన ప్రాంతంలోకి చేరి నిల్వ ఉండటం మొదలైంది. క్రమంగా ఈ నీరు ఖాళీ అయిపోయిన గని ప్రాంతమంతా నిండిపోయి, మడుగులా మారింది. చెరసాల చుట్టూ గనులు తవ్వడంతో ఇప్పుడు రుమ్ము చెరసాల భవనం నీటి మధ్యలో ఇలా మిగిలింది. ముర్రు చెరసాలను 2001లో రుమ్ము చెరసాలలో విలీనం చేశారు. తర్వాత ఈ చెరసాల 2012లో శాశ్వతంగా మూతబడింది. దీనిని చూడటానికి అప్పుడప్పుడు ఆసక్తిగల పరిశోధకులు, విద్యార్థులు ఇక్కడకు వస్తుంటారు.(చదవండి: బెట్టీ ద ఫ్యాషన్ క్వీన్) -
టెక్సాస్‌లోని రివర్ వాక్‌లా మూసీ ఉంటే.. బోటుతో చుట్టేయ్యొచ్చు!
భాగ్యనగర మురికి నీటితో నిర్భాగ్యురాలైంది మూసీ, ప్రవాహం దెబ్బతిని పక్షవాత రోగయింది. అసలు మూసీ ఒకప్పటి ముచుకుంద కృష్ణా ఉపనది. వికారాబాద్ అనంతగిరి కొండల్లో పుట్టి హైదరాబాద్ మహా నగరంలో దాదాపు 50 కి మీ ప్రవహిస్తూ వెళ్తుంది. సిటీ మురికి నీటికి తోడు పారిశ్రామిక వ్యర్థాలు కూడా కలిసి దీన్ని మురికి నదిగా మార్చాయి. లంగర్ హౌస్ బాపూ ఘాట్ నుండి నాగోల్ బ్రిడ్జ్ వరకు 14 కి.మీ వరకు గల మూసీని సుందరీకరణ చేస్తామన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రాజెక్ట్ ‘ నందనవనం ’ సాధించింది శూన్యం. ‘మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ‘ ఉత్త హడావిడి మాత్రమేనని తేలిపోయింది. నేను అక్టోబర్‌లో అమెరికా వెళ్ళినప్పుడు సాన్ అంటోనియా నగరంలోని ‘ రివర్ వాక్ ’ చూసినప్పుడు నా మనసులో మెదిలింది మూసీనే. దేవతల్ని ఆదుకోడానికి హాలాహలం మింగిన శివుడిలా భాగ్యనగర కాలుష్యాన్నంతా భరిస్తున్నది మన మూసీ నదినే. సాన్ అంటోనియా అమెరికా టెక్సాస్ రాష్ట్రంలోని పెద్ద నగరాల్లో ఒకటి. ఆస్టిన్ నుంచి కేవలం గంటన్నర డ్రైవ్‌లో ఇక్కడకు చేరుకోవచ్చు. దీని జనాభా రెండు మిలియన్ల ( 2011 ) పైనే, వీరిలో హిస్పానిక్స్ ఎక్కువ . ఇది పర్యాటకంగా బాగా అభివృద్ధి చెందిన ప్రాంతం, ఇందులో ముఖ్యమైనవి సీ వరల్డ్ , రివర్ వాక్‌లు. ఈ నగర డౌన్ టౌన్ నుండి మెలికలు తిరుగుతూ సాగే రివర్ వాక్ , దీనికి అటు ఇటు ఎన్నో సందర్శనీయ స్థలాలు, షాప్ లు, బోలెడన్ని రెస్టారెంట్లు ముఖ్యంగా మెక్సికన్ ఫుడ్ కు సంబంధించినవి. సాన్ అంటోనియా నది వరదల వల్ల 1921లో జరిగిన అపార జన, ఆస్తి నష్టాలను దృష్టిలో పెట్టుకొని వాటి నివారణకు గాను 1926 లో ఓల్మాస్ డ్యామ్, బైపాస్ చానల్లు నిర్మించారట. 1938లో ‘సాన్ అంటోనియా రివర్ బ్యూటిఫికేషన్ ప్రాజెక్ట్’ ఏర్పాటు చేసి డౌన్ టౌన్ నుంచి దాదాపు 15 కి మీ వరకు నిర్మించిందే ఈ రివర్ వాక్. ఎక్కువ మంది పర్యాటకులను ఆకర్శించడంలో విజయవంతమైన ఈ రివర్ వాక్ ప్రభావంతో యూ ఎస్ లోని ఇతర ప్రాంతాల్లో ఇలాంటి మరెన్నో ప్రాజెక్టులు రావడం విశేషం. సాన్ ఫెర్నాండో కాథడ్రిల్ చర్చి, మార్కెట్ స్ట్రీట్‌ను కలుపుతూ డౌన్‌టౌన్ ఏరియాకు దారి తీసే రోడ్లు రద్దీగా ఉంటాయి. సాన్ అంటోనియా రివర్ బ్యూటిఫికేషన్ ప్రాజెక్ట్ ఒక అద్భుతమైన అనుభవం. నదికి ఇరువైపులా ఉండే ఫుట్‌పాత్‌పై సాయంకాలం నడవడం ఎప్పటికీ మరిచిపోలేం. ఓ పక్క నది, మరో పక్క ఫుడ్ సెంటర్లు, రెస్టరెంట్లు, మధ్య మధ్యన నదిలోంచి వెళ్లే బోట్లు... నాలుగు కిలోమీటర్ల దూరం ఎంతో బాగుంటుంది. ఇక రివర్‌వే పక్కన ఎన్నో అట్రాక్షన్లను ఏర్పాటు చేశారు. 229 మీటర్ల ఎత్తుతో కట్టిన టవర్ ఆఫ్ అమెరికాస్‌ను తప్పకు చూడాల్సిందే. లిఫ్ట్‌లో పైకి వెళ్లి చూస్తే.. ఇళ్లు, కార్లు అగ్గిపెట్టెల్లా కనిపిస్తాయి. ఇక్కడ ఉన్న మ్యూజియంలు, ఎనిమల్ థీమ్ హోటళ్లు, అద్భుతమైన హోటళ్లు టూరిస్టులకు మరింత మజా ఇస్తాయి. అలాగే వందల ఏళ్ల కింద కట్టిన ఇళ్లు, పచ్చిక బయళ్లు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. యూరోపియన్లు రాకముందే శాన్ అంటోనియాలో లోకల్ అమెరికన్ల జన జీవనం సాగింది. దక్షిణాదిన ఉండే ఈ ప్రాంతం ఉత్తరాదితో ఎన్నో యుద్ధాలు చేసింది. గన్ కల్చర్ ఎక్కువ. కొన్నాళ్ల పాటు మెక్సికో పాలనలో ఉన్న ఈ ప్రాంతాన్ని అమెరికాలో కలిపేందుకు 1836లో ఇక్కడ యుద్ధం జరిగింది. ఇప్పటికీ ఇక్కడ మొత్తం మెక్సికన్ కల్చరే కనిపిస్తుంది. ఎక్కువ భాగం షాపులు, మాల్స్ కూడా మెక్సికన్లవే. ఈ నగరంలో ఓ పక్కన పురాతన భవనాలు, పాడుబడిన వారసత్వ సంపద కనిపిస్తుంది. అతి పెద్ద కౌబాయ్ బూట్లను ఓ రోడ్డు కూడలిలో పెట్టారు. వాటికి గిన్నీస్ బుక్‌లో చోటు దొరికింది. ది గేట్ వే ( 1962 ), క్లాక్ & డాగర్ ( 1984 ), సెలెనా ( 1997 ) వంటి హాలీవుడ్ మూవీస్ లకు కూడా ఎక్కడంతో సాన్ అంటోనియా రివర్ వాక్ కుమరింత ప్రచారం లభించింది. హైదరాబాద్ మూసీ కూడా సాన్ అంటోనియా, లండన్ థేమ్స్ రివర్ ప్రాజెక్టుల స్థాయిలో అభివృద్ధి చెందితే మనం కూడా మూసీ లో బోటు షికార్లు చేయవచ్చు ! వేముల ప్రభాకర్ (చదవండి: అమెరికా వాతావరణం కన్నా మేరా భారత్ మహాన్ !) -
రిసార్టులకు పండగే! ఎగ్జిట్‌పోల్స్‌తో సోషల్ మీడియాలో వెల్లువెత్తిన మీమ్స్
కావేవీ మీమ్స్‌కు అనర్హం అన్నట్లుగా ఐదు రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి గురువారం విడుదలైన ఎగ్జిట్ పోల్స్‌పైనా సోషల్ మీడియాలో మీమ్స్ వెల్లువెత్తాయి. రాజస్థాన్, మధ్య ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మిజోరాంతోపాటు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు గురువారం పూర్తయ్యాయి. దీంతో ఆయా రాష్ట్రాలకు సంబంధించి వివిధ సర్వే సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ గురువారం సాయంత్రం విడుదలయ్యాయి. ఇందులో రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్, రెండు చోట్ల బీజేపీ, ఒక రాష్ట్రంలో హంగ్ అసెంబ్లీ వస్తుందని చాలా సర్వేలు అంచనా వేశాయి. అయితే అన్ని రాష్ట్రాల్లోనూ ప్రధాన పార్టీలు మ్యాజిక్ ఫిగర్‌కు చేరవలో ఉన్నట్లు కొన్ని ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వాల ఏర్పాటుకు ఆయా పార్టీలు పోటీ పడే క్రమంలో రిసార్టు రాజకీయాలు మొదలవుతాయని భావిస్తున్నారు. దీంతో రిసార్ట్‌లకు డిమాండ్ వస్తుందని, సొమ్ము చేసుకునేందుకు రిసార్ట్ ఓనర్లకు మంచి అవకాశం వచ్చిందంటూ సోషల్ మీడియాలో మీమ్స్ హల్చల్ చేస్తున్నాయి. కాగా ఐదు రాష్ట్రాల ఎన్నికల ఓట్ల లెక్కింపు డిసెంబర్ 3న జరగనుంది. ఏ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారం వస్తుందన్నది ఆరోజే తేలనుంది. #ExitPoll Hotels and resort owners after watching the Exit polls pic.twitter.com/NDKixJkBaL — वेल्ला इंसान (@vella_insan1) November 30, 2023 Hotels and resort owners after watching the Exit polls pic.twitter.com/KcEHtjVb5S — Pakchikpak Raja Babu (@HaramiParindey) November 30, 2023 Resort owners right now after Exit poll predicts hung assembly #ExitPolls pic.twitter.com/7dx0ysXQ9a — 👑Che_ಕೃಷ್ಣ🇮🇳💛❤️ (@ChekrishnaCk) November 30, 2023 -
అవార్డుల.. హరిత
కడెం: కడెం ప్రాజెక్ట్ తీరాన.. పచ్చని చెట్లతో ఆహ్లాదకరమైన వాతావరణంలో అందమైనా విడిది గదులతో పర్యాటకుల మనసు దోచుతుంది కడెం హరిత రిసార్ట్స్. పర్యాటకులకు చక్కని అతిథ్యాన్ని అందిస్తూ.. అవార్డులను సొంతం చేసుకుంటుంది. ఇటీవలే హైదరాబాద్ శిల్పారామంలో నిర్వహించిన ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకల్లో భాగంగా పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, చైర్మన్ గెల్లు శ్రీనివాస్, ఎండి మనోహర్‌రావు చేతుల మీదుగా రిసార్ట్స్ మేనేజర్ నునవత్ తిరుపతి ఉత్తమ రిసార్ట్స్ అవార్డ్‌ను అందుకున్నారు. ఆహ్లాదకరంగా హరిత రిసార్ట్... కడెం ప్రాజెక్ట్ పరిసరాలను పర్యాటకంగా అభివృద్ధి చేయాలని ఉద్దేశంతో ప్రాజెక్ట్ తీరాన 2015లో పర్యాటకశాఖ 12 విడిది గదులు, రెస్టారెంట్, మీటింగ్‌హాల్‌తో హరిత ఏకో టూరిజం రిసార్ట్స్‌ను ఏర్పాటు చేసింది. ఏడేళ్ల కాలంలో పర్యాటకుల ఉత్తమ సేవలందిస్తూ మూడు సార్లు బెస్ట్ రిసార్ట్స్ అవార్డ్‌ను అందుకుంది. ప్రముఖులతో పాటు, వివిధ సుదూర ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులు ఇక్కడి విడిది చేస్తుంటారు. సెలవు దినాల్లో, వీకెండ్లో పర్యాటకులతో సందడిగా ఉంటుంది. పర్యాటకులు సేదతీరేందుకు విడది గదులతో పాటుగా, పిల్లలకు చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఉంటుంది. పర్యాటకులతో పాటుగా ప్రీ వెడ్డింగ్, బర్త్‌డే షూట్లతో పాటుగా, ఫిల్మ్ షూట్లకు హరిత రిసార్ట్ ఫేమస్. అయితే ఇందులో తొమ్మిది మంది విధులు నిర్వహిస్తుండగా ఏడాదికి సుమారుగా రూ.4 నుంచి 5 లక్షల ఆదాయం సమకూరుతుంది. గదుల బుకింగ్ పర్యాటక శాఖ వెబ్సైట్ ద్వారా గదులను బుక్ చేసుకోవచ్చు. డబ్ల్యూ డబ్ల్యూ డబ్ల్యూ.టీఎస్‌టీడీసీ.కామ్ ద్వారా గదులను బుక్ చేసుకోవచ్చు. వీకెండ్లో (శుక్ర, శని, ఆదివారల్లో) 1848, మిగాత రోజు ల్లో 1680(జీఎస్టీతో కలిపి). మరిన్ని వివరాలకు 9133053007 నంబర్లో సంప్రదించవచ్చు. సిబ్బంది సహకారంతో రాష్ట్రంలోనే బెస్ట్ రిసార్ట్‌గా కడెం హరితకు అవార్డ్ దక్కడం వెనుక సిబ్బంది సహకారం ఎంతో ఉంది. మూడుసార్లు హరిత రిసార్ట్స్‌కు అవార్డ్ దక్కడం అనందంగా ఉంది. సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి పర్యాటకులు వస్తుంటారు. శుభాకార్యలు, వింధులు జరుపుకునేందుకు అవకాశం ఉంది. పర్యాటకుల టూరిజం శాఖ తరఫున సౌకర్యాలు అందిస్తున్నాం. – నునవత్ తిరుపతి, హరిత రిసార్ట్స్ మేనేజర్, కడెం -
దుబాయ్‌లో అదరిపోయే సూపర్ లగ్జరీ రిసార్ట్, మతిపోయే ఫీచర్లు, ఫోటోలు
-
పిల్లల కోసం కాల్పులు.. ఇదొక హైప్రొఫైల్ ట్విస్టుల స్టోరీ
-
పెందుర్తి లెండీవనం రిసార్ట్‌లో ఐదేళ్ల బాలుడు అనుమానాస్పద మృతి
-
వారి నిర్లక్ష్యంతోనే నా భార్య మృతి.. రిసార్ట్, బోట్ కెప్టెన్‌పై ఎన్ఆర్ఐ దావా
తన భార్య మరణానికి వారి నిర్లక్ష్యమే కారణమంటూ ఓ రిసార్ట్, బోట్ కెప్టెన్‌పై ఒక భారతీయ-అమెరికన్ దావా వేశారు. ఫ్లోరిడాలో గత ఏడాది పారాసెయిలింగ్ చేస్తున్నప్పుడు జరిగిన ప్రమాదంలో భారత్‌లోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన శ్రీనివాసరావు అలపర్తి భార్య మృతి చెందారు. ఆయన కొడుకు, మేనల్లుడు తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఆ ప్రమాదానికి వాటర్ ఫ్రంట్ రిసార్ట్, బోట్ కెప్టెన్ల నిర్లక్ష్యమే కారణమంటూ తాజాగా ఆయన వారిపై దావా వేశారు. శ్రీనివాసరావు అలపర్తి మన్రో కౌంటీ సర్క్యూట్ కోర్టులో బోట్ కెప్టెన్, అతని సహాయకుడు, రిసార్ట్ యాజమాన్యంపై 68 పేజీల వ్యాజ్యాన్ని దాఖలు చేసినట్లు ది వాషింగ్టన్ పోస్ట్ నివేదించింది. 2022 మే 30న శ్రీనివాసరావు, ఆయన భార్య సుప్రజ (33), వారి పదేళ్ల కొడుకు, తొమ్మిదేళ్ల మేనల్లుడు ఫ్లోరిడా కీస్లో పారాసైలింగ్‌కు వెళ్లారు. ఈ సమయంలో వాతావరణం ప్రతికూలంగా మారింది. కొన్ని నిమిషాల తర్వాత బోట్ కెప్టెన్ డేనియల్ కౌచ్ పారాసైల్‌ను బోట్‌కి అనుసంధానించే టౌలైన్‌ను కత్తిరించాడు. దీంతో సుప్రజ, ఇద్దరు పిల్లలు రెండు మైళ్ల దూరం గాలిలో తేలుతూ కాంక్రీట్ వంతెనకు తగిలారు. ఈ ప్రమాదంలో సుప్రజ మృతి చెందగా పిల్లలిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. బోట్ సిబ్బంది వాతావరణ సూచనను గమనించి, యూఎస్ కోస్ట్ గార్డ్‌కు సమాచారం అందించడంలో విఫలమయ్యారని శ్రీనివాసరావు తన దావాలో ఆరోపించారు. అంతేకాకుండా సిబ్బంది తమకు లైఫ్ జాకెట్లు వంటి తగిన భద్రతా పరికరాలను అందించలేదని, నియంత్రణ కోల్పోయిన తర్వాత పారాసైల్‌ను సరిగ్గా కిందికి తీసుకురాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. -
ఇక సామాన్యుడి పరిస్థితి ఏంటి?
సాక్షి, హైదరాబాద్: భూ వివాదంలో ఓ రిసార్టు యాజమాన్యం హైకోర్టు, సుప్రీంకోర్టును ఆశ్రయించి న్యాయం పొందినా స్పందించని అధికారుల తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘ఇక సామాన్య ప్రజలు ఎక్కడికి పోతారు? ఎలా న్యాయం పొందుతారు? అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులన్నా ఇంత లెక్కలేనితనమా? ఏళ్లుగా కోర్టుల చుట్టూ తిరిగి న్యాయం పొందినా అధికారులకు జాలి, దయ లాంటి ఏవీ ఉండవా? తదుపరి విచారణ నాటికి రంగారెడ్డి జిల్లా కలెక్టర్, ఆర్డీవో, గండిపేట తహసీల్దారు సదరు భూమికి సంబంధించిన పాస్ పుస్తకంతో కోర్టుకు హాజరుకావాలి. ఆ పాస్ పుస్తకాన్ని పిటిషనర్‌కు కోర్టే నేరుగా అందిస్తుంది. బుక్‌తో రాకుంటే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది’అని హైకోర్టు హెచ్చరించింది. విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది. రంగారెడ్డి జిల్లా గండిపేట్ మండలం ఖానాపూర్‌లో ప్రతాప్ జంగిల్ రిసార్టుకు 20 ఎకరాల భూమి ఉంది. భూములను ధరణిలో అప్లోడ్ చేయడం, కొత్త పాస్ పుస్తకాలు ఇచ్చే సయమంలో ఈ భూమి ప్రభుత్వానిదంటూ రెవెన్యూ అధికారులు వివాదానికి తెరతీశారు. దీనిపై రిసార్టు యాజమాన్యం 2019లో హైకోర్టును ఆశ్రయించింది. విచారణ జరిపిన సింగిల్ జడ్జి... ఆ భూమి రిసార్టుదేనని ఉత్తర్వులు ఇచ్చారు. దీనిపై అదే సంవత్సరం ప్రభుత్వం ద్విసభ్య ధర్మాసనం వద్ద అప్పీల్ చేసినా ఎదురుదెబ్బే తగిలింది. అనంతరం ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అక్కడ కూడా 2021లో రిసార్టు యాజమాన్యానికి అనుకూలంగానే తీర్పు వచ్చింది. అయినా అధికారులు పాస్ పుస్తకం ఇవ్వకపోవడంతో రిసార్టు యాజమాన్యం 2022లో హైకోర్టులో ధిక్కరణ కేసు దాఖలు చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించడం లేదని, ఉద్దేశపూర్వకంగానే ఉత్తర్వులపై నిర్లక్ష్యం వహిస్తున్నారని పిటిషన్లో పేర్కొంది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ తుకారాంజీ ధర్మాసనం విచారణ చేపట్టింది. వాదనలు విన్న ధర్మాసనం.. తదుపరి విచారణకు కలెక్టర్, ఆర్డీవో, తహసీల్దార్ అంతా పాసు పుస్తకంతో హాజరుకావాలని ఆదేశిస్తూ, విచారణను వాయిదా వేసింది. -
రుషికొండలో ఉల్లంఘనల్లేవ్
సాక్షి, అమరావతి: రిసార్ట్ ప్రాజెక్టు పునరుద్ధరణలో భాగంగా విశాఖలోని రుషికొండపై చేపడుతున్న నిర్మాణాల్లో ఎలాంటి ఉల్లంఘనలు లేవని హైకోర్టు ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వం నియమించిన సంయుక్త కమిటీ స్పష్టం చేసింది. క్షేత్రస్థాయి పర్యటన అనంతరం నివేదికను కమిటీ బుధవారం హైకోర్టుకు సమర్పించింది. కోస్టల్ రెగ్యులేషన్ జోన్ (సీఆర్‌జెడ్) అనుమతించిన మేరకు 9.88 ఎకరాల ప్రాంతంలోనే ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ అథారిటీ రుషికొండ రిసార్ట్ ప్రాజెక్టు భవనాలను చేపట్టిందని తెలిపింది. వ్యక్తిగత భవనాల ప్రదేశాల్లో స్వల్ప మార్పులు మినహా ఎలాంటి ఉల్లంఘనలు లేవని కమిటీ తేల్చింది. మొత్తం 19,968 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఏడు బ్లాకులు నిర్మించాలని టూరిజం డెవలప్మెంట్ అథారిటీ (ఏపీటీడీసీ) ప్రతిపాదించింది. 19,968 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఏడు బ్లాకుల నిర్మాణానికి కోస్టల్ రెగ్యులేషన్ జోన్ అనుమతించినా టూరిజం డెవలప్మెంట్ అథారిటీ 13,542 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నాలుగు బ్లాకులకే పరిమితం చేసిందని కమిటీ పేర్కొంది. వాస్తవంగా సీఆర్‌జెడ్ అనుమతి మేరకు 19,968 చదరపు మీటర్ల విస్తీర్ణంలో అంటే 2.71 ఎకరాల్లో నిర్మాణాలు చేపట్టాల్సి ఉన్నప్పటికీ కేవలం 1.84 ఎకరాల్లో అంటే 13,542 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నాలుగు బ్లాకులకే పరిమితమైనట్లు కమిటీ వివరించింది. మొత్తం 9.88 ఎకరాల ప్రాజెక్టులో 3.86 ఎకరాల్లో ఉన్న వాలు ప్రాంతంతో పాటు 4.225 ఎకరాలున్న మట్టి డంప్ ప్రాంతాన్ని కమిటీ పరిశీలించింది. ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ అథారిటీ హైకోర్టుకు సమర్పించిన కౌంటర్ అఫిడవిట్లో పేర్కొన్న ప్రకారం దాదాపుగా సరిపోతున్నట్లు కమిటీ పేర్కొంది. మట్టిడంప్ ప్రాంతమే అథారిటీ పేర్కొన్న దాని కన్నా కొంచెం ఎక్కువగా ఉందని, అయితే నిర్మాణం పూర్తయిన తరువాత డంప్ చేసిన మట్టిని తొలగిస్తారని కమిటీ తెలిపింది. ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ అథారిటీ కేంద్ర పర్యావరణ శాఖ ముందస్తు అనుమతి లేకుండా భూ వినియోగ నమూనాలు, ప్రతి బ్లాక్‌లో బిల్డ్ అప్ ఏరియాతో ఉన్న బ్లాకుల సంఖ్యలో సవరణలు చేసిందని కమిటీ వ్యాఖ్యానించింది. అయితే ఏపీటీడీసీ బిల్డప్ ఏరియాను తొలుత ప్రతిపాదించిన 19,968 చదరపు మీటర్ల విస్తీర్ణం నుంచి 13,542 చదరపు మీటర్ల విస్తీర్ణానికే నాలుగు బ్లాకులకే కుదించిందని కమిటీ పేర్కొంది. ఇందులో భూ వినియోగ విధానంలో ఎటువంటి మార్పులు లేవని, ఆమోదించిన బిల్డ్ అప్ ఏరియాలో నిర్మించిన ప్రాంతం సరిగానే ఉందని కమిటీ తెలిపింది. తొలుత 15,364 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించినట్లు అంకెల్లో పొరపాటు దొర్లిందని పేర్కొంది. 13,542 చదరపు మీటర్లలో నిర్మాణాలు, ఆమోదించిన ప్రాంతంలోనే ఉన్నాయని కమిటీ వెల్లడించింది. ప్రాజెక్టు పూర్తయ్యాక డంప్ తొలగింపు రుషికొండకు దక్షిణం వైపున సీఆర్‌జెడ్–2 ప్రాంతంలో తవ్విన మట్టిని ఏపీటీడీసీ డంప్ చేస్తున్నట్లు కమిటీ పరిశీలనలో తేలిందని పేర్కొంది. అయితే ఇది మెటీరియల్ తాత్కాలిక నిల్వ కోసం ఉద్దేశించినందున అభ్యంతరకరం కాకపోవచ్చని తెలిపింది. పాక్షికంగా ల్యాండ్ స్కేపింగ్, హార్డ్ స్కేపింగ్ పనుల కోసం దీన్ని వినియోగిస్తున్నారని, ప్రాజెక్టు పూర్తయిన తరువాత ఏవైనా ఉంటే ఆ స్థలం నుంచి తొలగిస్తారని పేర్కొంది. మొత్తం మీద కోస్టల్ రెగ్యులేషన్ జోన్, పర్యావరణ శాఖ అనుమతుల్లో పేర్కొన్న షరతుల ప్రకారమే ఉన్నాయని, ఎటువంటి ఉల్లంఘనలు లేవని కమిటీ స్పష్టం చేసింది. -
Sheybarah Resort: భూతల స్వర్గం!
ఈ ఫొటోలో కనిపిస్తున్నది సౌదీ అరేబియాలో నిర్మితమవుతున్న రిసార్ట్ హోటల్. సౌదీ ప్రధాన భూభాగానికి ఆవల షాబారా దీవిలో తయారవుతోంది. ‘రెడ్ సీ గ్లోబల్ డెవలపర్స్’ సంస్థ ‘షాబారా రిసార్ట్’ పేరుతో నిర్మిస్తున్న ఈ హోటల్ వచ్చే ఏడాది నుంచి అతిథులకు ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ హోటల్‌ను నిర్మిస్తున్న దీవిలోని పరిసరాలు, హోటల్లోని సౌకర్యాలు చూస్తే ఎవరైనా దీనిని భూతల స్వర్గంగానే భావిస్తారని డెవలపర్స్ సంస్థ చెబుతోంది. అంతేకాదు, ఇది ‘మోస్ట్ ఫ్యూచరిస్టిక్ హోటల్ ఇన్ ది వరల్డ్’ అని ఊదరగొడుతోంది కూడా! షాబారా దీవిలోని చుట్టూ దట్టమైన మడ అడవులు, ఎడారి వృక్షాల నడుమ దీనిని అధునాతన హంగులతో సర్వాంగ సుందరంగా నిర్మిస్తున్నారు. షాబారా దీవి తీరానికి చేరువలోని రంగురంగుల పగడపు దిబ్బలు కూడా ఇక్కడి నుంచి చూసే అతిథులకు కనువిందు చేస్తాయి. ఈ హోటల్లో 260 మంది సిబ్బంది సేవలందిస్తారు. ఇది ఏకకాలంలో 140 మంది అతిథులకు వసతి కల్పించనుంది. జీవవైవిధ్యాన్ని కాపాడేలా ఈ హోటల్‌ను తీర్చిదిద్దుతున్నామని ‘రెడ్ సీ గ్లోబల్ డెవలపర్స్’ సీఈవో జాన్ పగానో చెబుతున్నారు. పర్యావరణానికి ఏమాత్రం చేటు కలిగించని విధంగా పూర్తిగా సౌరవిద్యుత్తును ఉపయోగించుకునేలా దీనిని నిర్మిస్తున్నామని, ఇది సౌదీ పర్యాటకరంగం భవిష్యత్తునే మార్చేయగలదని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. -
కళ్ల ముందే కన్నబిడ్డ కొట్టుకుపోతుంటే..
అలపుజ్జా: ప్రమాదాల రూపంలో జీవితాల్ని అర్థాంతరంగా ముగించడం, ఆనందకరమైన క్షణాలను అంతలోనే విషాదాలు మార్చేయడం.. విధికి అలవాటే. సరదాగా గడిపేందుకు చుట్టాల ఇంటికి వెళ్లిన ఆ కుటుంబానికి.. తిరుగు ప్రయాణంలో తీరని శోకమే మిగిలింది. కళ్ల ముందు కన్నకూతురు కొట్టుకుపోతుంటే.. కాపాడలేని నిస్సహాయస్థితిలో విలపిస్తూ ఉండిపోయారు ఆ తల్లిదండ్రులు. కేరళ అలపుజ్జా జిల్లాకు చెందిన సుశీల, సురేంద్రన్ తమ ఒక్కగానొక్క కూతురు అర్ష(24)తో కలిసి కరువరకుండులో ఉండే బంధువుల ఇంటికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో.. అంతా కలిసి దగ్గర్లోని కొండ ప్రాంతంలో ఉన్న రిసార్ట్‌కు వెళ్లారు. సాయంత్రందాకా సరదాగా గడిపి.. ఐదున్నర గంటల ప్రాంతంలో సమీపంలో ఉన్న నీటి ప్రవాహం దగ్గరకు వెళ్లారు. వాతావరణం అంతా మాములుగా ఉండడంతో.. కుటుంబ సభ్యులంతా నీళ్లలోకి దిగి హుషారుగా గడపాలనుకున్నారు. అయితే.. అంతలో వాళ్ల సంతోషం కాస్త.. హాహాకారాలుగా మారిపోయింది. ఒక్కసారిగా ఆకస్మిక వరద సంభవించడంతో అక్కడున్న వాళ్లంతా చెల్లాచెదురైపోయారు. చిన్న చిన్న పిల్లలతో సహా కాస్త దూరం కొట్టుకుపోయారు. అందరూ ఎలాగోలా ఒడ్డుకు చేరగలిగారు. కానీ, పాపం.. అర్ష మాత్రం నిస్సహాయ స్థితిలో నీటి ప్రవాహంలో కొట్టుకునిపోయింది. ఆమెను కాపాడాలంటూ ఆమె తల్లిదండ్రులు బతిమాలినా.. సాహసం చేయాలేని స్థితిలో ఉండిపోయారంతా. చాలా దూరం కొట్టుకువెళ్లే క్రమంలో రాళ్లురప్పలు తగిలి ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. చివరకు ఎలాగోలా తీవ్రంగా గాయపడిన అర్షను గుర్తించి స్థానికులు ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ఆమె కన్నుమూసిందని వైద్యులు ప్రకటించారు. దీంతో ఆమె తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. Credits: Mathrubhumi News ఇదీ చదవండి: ప్రియుడితో కలిసి దుర్మార్గానికి దిగిన కన్నతల్లి -
అంకిత కుటుంబానికి రూ.25లక్షల ఆర్థిక సాయం.. ప్రకటించిన సీఎం
దెహ్రాదూన్: ఉత్తరాఖండ్‌లో హత్యకు గురైన రిసెప్షనిస్ట్ అంకిత భండారీ కుటుంబానికి ఆర్థిక సాయం ప్రకటించారు సీఎం పుష్కర్ సింగ్ ధామీ. ఆమె తల్లిదండ్రులకు రూ.25లక్షలు అందించాలని ఆదేశించారు. ఉత్తరాఖండ్ సీఎం కార్యాలయం ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. అలాగే అంకిత కుటుంభానికి త్వరగా న్యాయం జరిగేందుకు ఆమె హత్య కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టుతో విచారణ జరిపించాలని ధామీ న్యాయస్థానాన్ని కోరినట్లు సీఎంఓ తెలిపింది. అంకిత తండ్రితో సీఎం మంగళవారం ఫోన్లో మాట్లాడారు. ఈ కేసు విచారణను వేగంగా జరిపించి నిందితులకు కఠినశిక్ష పడేలా చేస్తామని హామీ ఇచ్చారు. ఆ మరునాడే పరిహారం ప్రకటించారు. मुख्यमंत्री श्री @pushkardhami ने अधिकारियों को दिवंगत अंकिता भंडारी के परिजनों को ₹25 लाख की आर्थिक सहायता देने के निर्देश दिए हैं। उन्होंने कहा कि पीड़ित परिवार को त्वरित न्याय मिल सके, इसके लिये फास्ट ट्रैक कोर्ट में सुनवाई के लिए माननीय न्यायालय से अनुरोध किया गया है। — CM Office Uttarakhand (@ukcmo) September 28, 2022 మరోవైపు అంకిత హత్య కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) నిందితులకు చెందిన గ్రే యాక్టివా, బ్లాక్ పల్సర్ బైక్‌లను స్వాధీనం చేసుకుంది. వీటిని ఉపయోగించే అంకితను కాలువ దగ్గరకు తీసుకెళ్లి ఆ తర్వాత అందులోకి తోసేసి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. బీజేపీ నుంచి సస్పెండైన వినోద్ ఆర్య కుమారుడు అంకిత్ ఆర్య ఈ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. తన రిసార్డులో రిసెప్షనిస్ట్‌గా పనిచేసే ఆమెను మరో ఇద్దరు సిబ్బందితో కలిసి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే ముగ్గురినీ అరెస్టు చేశారు. ఈ హత్య ఉత్తరాఖండ్‌లో తీవ్ర దుమారం రేపింది. మరోవైపు ఈ రిసార్టులో వ్యభిచారం నిర్వహించేవారని, ఆ కూపంలోకి దిగేందుకు నిరాకరించడం వల్లే అంకితను హత్య చేశారని సిట్ దర్యాప్తులో తేలింది. చదవండి: అది రిసార్ట్ కాదు.. వ్యభిచార కూపం! -
అది రిసార్ట్ కాదు.. వ్యభిచార కూపం!
వ్యభిచార కూపంలోకి దిగనందుకే అకింతను కిరాతకంగా చంపారనే విషయం సిట్ దర్యాప్తులో వెలుగు చూడడంతో.. అధికారులు ఈ కేసును మరింత లోతుగా విచారణ చేపట్టాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో.. తొమ్మిదేళ్ల కిందట ఇదే తరహాలో ఓ అమ్మాయి కనిపించకుండా పోయిందనే విషయం బయటపడింది. అంతేకాదు ఆ రిసార్ట్‌లో పని చేసిన మాజీ ఉద్యోగులు రిసార్ట్ యాజమాన్యంపై సంచలన ఆరోపణలు చేస్తున్నారు. డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ రిసార్ట్ హత్య కేసు దర్యాప్తులో విస్తుపోయే విషయాలు వెలుగు చూస్తున్నాయి. వ్యభిచార కూపంలోకి దిగనందుకే అకింతను కిరాతకంగా చంపారనే విషయం సిట్ దర్యాప్తులో వెలుగు చూడడంతో.. అధికారులు ఈ కేసును మరింత లోతుగా విచారణ చేపట్టాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో.. ఆ రిసార్ట్‌లో పని చేసిన మాజీ ఉద్యోగులు రిసార్ట్ యాజమాన్యంపై సంచలన ఆరోపణలు చేస్తున్నారు. ఉత్తరాఖండ్ పౌరీ జిల్లా రిషికేష్ వద్ద ఉన్న వనతారా రిసార్ట్.. అసాంఘిక కార్యకలాపాలకు నెలవుగా ఉండేదని అందులో పని చేసి మానేసిన కొందరు చెప్తున్నారు. రిసార్ట్‌లో అక్రమ మద్యం అమ్మకాలతోపాటు గంజాయి, ఇతర డ్రగ్స్ సరఫరా చేసే వారని.. చివరకు అమ్మాయిలతో వ్యభిచారం కూడా నిర్వహించేవారని వెల్లడించారు చాలామంది. ఆరు నెలల కిందట అక్కడ ఉద్యోగం మానేసిన ఆ ఉద్యోగి అక్కడ తనకు ఎదురైన అనుభవాలను పోలీసులకు, మీడియాకు తెలియజేశాడు. రిసార్ట్‌లో వ్యభిచారం జోరుగా జరుగుతుండేది. అక్కడికి వచ్చే యువతను మద్యం, మత్తు పదార్థాలతో రిసార్ట్ యాజమాన్యం లొంగదీసుకునేది. వ్యభిచారంలోకి దింపి ఆ అమ్మాయిలతో వీఐపీలను సంతృప్తిపరిచేది. అక్కడి పరిస్థితులపై ఎవరైనా మాట్లాడినా, ఫిర్యాదులు చేయాలని ప్రయత్నించినా దాడి చేసేవారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వకుండా వేధించేవాళ్లు. పోలీసులకు నేను ఫిర్యాదు చేశా. కానీ, తమ పరిధిలోకి రాదని.. స్థానికంగా ఉన్న పట్వారీ(రెవెన్యూ అధికారి)కి ఆ ఫిర్యాదును అందజేశారు. కానీ, ఆయన కూడా వాళ్ల మనిషే. అందుకే నాపై దాడి జరిగింది. మానసికంగానూ నన్ను వేధించారు అని సదరు మాజీ ఉద్యోగి వాపోయాడు. బీజేపీ(బహిష్కృత) నేత వినోద్ ఆర్య కొడుకు అయిన పుల్కిత్ ఆర్య, మేనేజర్ సౌరభ్ భాస్కర్, అసిస్టెంట్ మేనేజర్ అకింత్ గుప్తాలు వనతారా రిసార్ట్‌ను నిర్వహించేవాళ్లు. ఈ ముగ్గురు రిసార్ట్‌లో రిసెప్షనిస్ట్‌గా పని చేసే 19 ఏళ్ల అకింత భండారిని వ్యభిచారంలోకి దిగాలని, వీఐపీలను సుఖపెట్టాలని ఆమెపై ఒత్తిడి తెచ్చారు. మాట వినని అంకిత.. పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే.. ఆమెను కిరాతకంగా హత్యాచారం చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఆపై శవాన్ని సమీపంలోని కాలువలో పడేయగా.. పోలీసులు మృతదేహాన్ని అతికష్టం మీద స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన ఉత్తరాఖండ్‌లోనే కాదు యావత్ దేశంలోనూ చర్చనీయాంశంగా మారింది. ఆమెపై హత్యాచారం జరిగిందని బాధిత కుటుంబం.. న్యాయ పోరాటానికి దిగింది. ఈ పోరాటానికి మద్ధతుగా స్థానికులు ఆందోళనలతో పాటు విధ్వంసానికి దిగారు. ఘటనకు కారణమైన రిసార్ట్‌ను అప్పటికే అధికారులు బుల్డోజర్లతో కూల్చేయగా.. స్థానికులు మరి కొంత భాగానికి నిప్పు పెట్టారు. అయితే.. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు ద్వారా బాధిత కుటుంబానికి న్యాయం చేస్తానని సీఎం పుష్కర్ ధామి హామీ ఇవ్వడంతో పరిస్థితులు కాస్త చల్లబడ్డాయి. ఇదీ చదవండి: ఫుల్లుగా తాగొచ్చి మహిళపై అత్యాచారం.. రూంలో లాక్ చేసిన బాధితురాలు -
అంకిత హత్యపై... ‘ఫాస్ట్‌ట్రాక్’ విచారణ
డెహ్రాడూన్/రిషికేశ్: రిషికేశ్‌లోని రిసార్టు రిసెప్షనిస్ట్ అంకితా భండారి(19)హత్యపై ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో విచారణ జరిపిస్తామని సీఎం పుష్కర్ సింగ్ ధామి ఆదివారం ప్రకటించారు. పోస్ట్‌మార్టం రిపోర్టు బయట పెడతామన్నారు. ఈ హామీ అనంతరం కుటుంబసభ్యులు అంకిత అంత్యక్రియలు పూర్తి చేశారు. హత్యపై కీలక ఆధారాలు దొరికే అవకాశమున్న రిసార్ట్‌ను ప్రభుత్వం ఎందుకు కూల్చేసిందని అంకిత తండ్రి అంతకుముందు ప్రశ్నించారు. దోషులను శిక్షించాలంటూ రిషికేశ్–బద్రీనాథ్ జాతీయ రహదారిపై 8 గంటలు ఆందోళనజరిగింది. మరోవైపు హత్యను పక్కదారి పట్టించేందుకు నిందితుడు, మాజీ మంత్రి వినోద్ దకొడుకు పులకిత్ ప్రయత్నించినట్లు వెలుగులోకి వచ్చింది. వినోద్ మాత్రం తన కొడుకు అమాయకుడంటూ వెనకేసుకుని వచ్చారు. -
నాటకీయ పరిణామాల మధ్య అంకిత అంత్యక్రియలు
దెహ్రాదూన్: ఉత్తరాఖండ్‌లో అత్యంత నాటకీయ పరిణామాల మధ్య రిసెప్షనిస్ట్ అంకిత భండారీ అంత్యక్రియలు పూర్తయ్యాయి. మొదట పోస్టుమార్టం నివేదిక వచ్చాకే ఆమె భౌతిక కాయాన్ని మార్చురీ నుంచి తీసుకెళ్తామని చెప్పిన కుటుంబసభ్యులు .. ఆ తర్వాత మనసు మార్చుకున్నారు. అంకిత హత్య కేసు విచారణ వీలైనంత త్వరగా పూర్తి చేయడమే గాక, తుది పోస్టుమార్టం నివేదికను బహిరంగంగా వెల్లడిస్తామని సీఎం పుష్కర్ సింగ్ ధామీ హామీ ఇచ్చారు. దీంతో అంకిత భౌతిక కాయాన్ని తీసుకెళ్లి అంతిమ సంస్కారాలు నిర్వహించారు తల్లిదండ్రులు. అయితే ఈ కార్యక్రమానికి స్థానికులను ఎవరినీ అనుమతించలేదు. మరోవైపు అంకిత తల్లిదండ్రులు ఆస్పత్రికి వెళ్లినప్పుడు స్థానికులు పెద్దఎత్తున తరలివచ్చారు. అంకితకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు. అంకిత కుటుంబానికి వీలైనంత త్వరగా న్యాయం చేసేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేస్తామని సీఎం ధామీ చెప్పారు. బీజేపీ నేత వినోద్ ఆర్య కుమారుడు అంకిత్ ఆర్యకు చెందిన రిసార్టులో రిసెప్షనిస్ట్‌గా పనిచేసే అంకిత భండారీ హత్యకు గురైన విషయం తెలిసిందే. గత ఆదివారం అదృశ్యమైన ఆమె శనివారం కాలువలో శవంగా లభించింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు అంకిత్ ఆర్యను విచారించగా హత్య విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో అంకిత్‌తో పాటు అతనికి సహకరించిన మరో ఇద్దరు రిసార్టు సిబ్బందిని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. చదవండి: రిసెప్షనిస్ట్ హత్య కేసులో షాకింగ్ నిజాలు.. -
రిసెప్షనిస్ట్ హత్యోదంతం.. నిందితుడి తండ్రి సంచలన వ్యాఖ్యలు!
దెహ్రాదూన్: ఉత్తరాఖండ్, రిషికేష్‌లోని వంతారా రిసార్ట్‌లో రిసెప్షనిస్ట్‌గా పని చేసే యువతి హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పుల్కిత్ ఆర్యను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఆ మరుసటి రోజున నిందితుడి తండ్రి వినోద్ ఆర్య, సోదరుడు అంకిత్ ఆర్యను బీజేపీ పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఈ క్రమంలో తన కుమారుడిపై వచ్చిన ఆరోపణలను ఖండించారు బీజేపీ మాజీ నేత వినోద్ ఆర్య. పుల్కిత్ అమాయకుడని పేర్కొన్నారు. ‘అతడు ఒక సాదా సీదా అబ్బాయి. తన పనేదో తాను చూసుకుంటాడు. నా కుమారుడు పుల్కిత్, హత్యకు గురైన యువతి ఇరువురికి న్యాయం జరగాలని కోరుకుంటున్నా. పుల్కిత్ ఇలాంటి వాటిలో ఎప్పుడూ పాల్గొనలేదు. అతడు నిర్దోషి.’ అని తెలిపారు వినోద్ ఆర్య. చాలా రోజులుగా పులికిత్ తమ కుటుంబానికి దూరంగా జీవిస్తున్నాడని చెప్పారు. కేసు దర్యాప్తు నిష్పక్షపాతంగా, న్యాయబద్ధంగా జరగాలనే ఉద్దేశంతోనే పార్టీకి రాజీనామా చేసినట్లు వెల్లడించారు. హత్యకు గురైన రిసెప్షనిస్ట్, 19 ఏళ్ల యువతి పని చేస్తున్న రిసార్ట్ ఓనర్ పుల్కిత్ ఆర్య, మేనేజర్ సౌరభ్ భాస్కర్, అసిస్టెంట్ మేనేజర్ అంకిత్ గుప్తాలను శుక్రవారమే అరెస్ట్ చేశారు పోలీసులు. దర్యాప్తులో నిందితులు తెలిపిన వివరాలు, బాధితురాలి మొబైల్ ఫోన్ ఛాటింగ్ ప్రకారం..టూరిస్టులకు ‘ప్రత్యేక సేవలు’ అందించాలని ఆమెపై ఒత్తిడి చేసినట్లు తేలిందని పోలీసు అధికారి అశోక్ కుమార్ శనివారం వెల్లడించారు. నిందితుడు పుల్కిత్ ఆర్య, హత్యకు గురైన యువతి ఇదీ చదవండి: రిసెప్షనిస్ట్ హత్య కేసులో కుమారుడు అరెస్టు.. తండ్రిని పార్టీ నుంచి సస్పెండ్ చేసిన బీజేపీ -
రిసెప్షనిస్ట్ హత్య కేసులో షాకింగ్ నిజాలు..
దెహ్రాదూన్: ఉత్తరాఖండ్‌లోని రిసార్టులో పనిచేసే రిసెప్షనిస్టును హత్యకు సంబంధించి పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. రిసార్టుకు వచ్చే అతిథులకు ప్రత్యేక సేవలు చేయాలని ఓనర్ పుల్కిత్ ఆర్య అంకిత భండారీని తీవ్ర ఒత్తిడి చేశాడని చెప్పారు. అందుకు ఆమె నిరాకరించిందని, ఈ క్రమంలోనే ఆమెతో గొవడపడి సిబ్బందితో కలిసి హత్య చేశాడని పేర్కొన్నారు. యువతి తన ఫ్రెండ్‌తో చేసిన చాటింగ్‌ను పరిశిలిస్తే తమకు ఈ విషయం తెలిసిందని డీజీపీ అశోక్ కుమార్ పేర్కొన్నారు. మరోవైపు రిసార్టుకు వచ్చే అతిథులతో శృంగారం చేయాలని అంకితను ఓనర్ బెదిరించాడని ఆమె ఫేస్బుక్ ఫ్రెండ్ ఒకరు ఇప్పటికే ఆరోపించారు. అందుకు ఒప్పుకోనందుకే ఆమెను హత్య చేశారని పేర్కొన్నారు. ఇప్పుడు పోలీసులు కూడా అదే విషయాన్ని ధ్రువీకరించడం గమనార్హం. రిసార్టు ఓనర్ పుల్కిత్ ఆర్య ప్రముఖ బీజేపీ నేత వినోద్ ఆర్య కుమారుడు. ఆదివారం అదృశ్యమైన అంకితను అతడే హత్య చేశాడని తెలిసి స్థానికుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఓవైపు అధికారులు జేసీబీతో రిసార్టును కూల్చివేసే సమయంలో స్థానికులు వచ్చి భవనానికి నిప్పుపెట్టారు. ఈ హత్య ఉందంతో వినోద్ ఆర్య, అతని మరో కుమారుడ్ని బీజేపీ పార్టీ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. యువతి మృతదేహన్ని పోలుసులు శనివారం కాలువలో కనుగొన్నారు. చదవండి: యువతి హత్య కేసులో కుమారుడు అరెస్టు.. తండ్రిని సస్పెండ్ చేసిన బీజేపీ -
పుల్కిత్ ఆర్య రిసార్ట్ కు నిప్పు పెట్టిన స్థానికులు
-
రిసెప్షనిస్ట్ హత్యోదంతం... కట్టలు తెంచుకున్న ఆగ్రహంతో రిసార్ట్‌కి నిప్పు పెట్టి...
Receptionist murder case: ఉత్తరాఖండ్‌లో రిసెప్షనిస్ట్ హత్యోదంతం పెద్ద కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. దీంతో స్థానికుల్లో ఆగ్రహావేశాలు ఒక్కసారిగా కట్టలు తెచ్చకున్నాయి. ఈ రిసెప్షనిస్ట్ హత్య కేసులో బీజేపీ నేత వినోద్ కుమార్ ఆర్య కొడుకు పుల్కిత్ ఆర్య నిందితుడిగా అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. దీంతో పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. ఈ మేరకు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర ధామీ ఈ ఘటన కఠిన చర్యల తోపాటు, నిందితుడి రిసార్ట్ని కూడా బుల్డోజర్లతో కూల్చివేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. అందులో భాగంగా రిసార్ట్‌లో కొంతభాగాన్ని కూల్చివేశారు కూడా. అంతేగాక ఈ కూల్చివేతను సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శే దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు కూడా. పైగా ఈ కేసుని త్వరితగతిన దర్యాప్తు చేసేలా డీఐజీ పి రేణుకా దేవి నేతృత్వంలో సిట్‌ను కూడా ఏర్పాటు చేశారు. దీంతో పోలీసులు ఈ కేసును త్వరితగతిన దర్యాప్తు చేయడమే కాకుండా శనివారం ఉదయమే ఆమె మృతదేహాన్ని కనుగొన్నారు. దీంతో ప్రజల్లో ఒక్కసారిగా ఆగ్రహోజ్వాలాలు మిన్నంటాయి. ఈ హత్యకు పాల్పడిన నిందితుడు పుల్కిత్ ఆర్య రిసార్ట్‌కి స్థానికులు నిప్పు పెట్టారు. ఐతే ప్రభుత్వమే ఒక పక్క కూల్చివేత పనులు ప్రారంభిస్తే ...మరోవైపు స్థానికులు కోపంతో రిసార్ట్‌లోని మిగిలిని భాగాన్ని తగలు బెట్టేశారు. అందుకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట హల్చల్ చేస్తోంది. WATCH | #AnkitaBhandari murder case: Locals set Vanatara resort in Rishikesh, Uttarakhand on fire. The resort is owned by BJP leader Vinod Arya's son Pulkit Arya. Three accused, including Pulkit, have been arrested in connection with the murder case. pic.twitter.com/7Zx0T6HJIB — ANI UP/Uttarakhand (@ANINewsUP) September 24, 2022 (చదవండి: రిసెప్టనిస్టు హత్యోదంతం...బుల్డోజర్లతో రిసార్ట్ కూల్చివేత..లైంగిక దాడి అనుమానాలు!) -
చందమామే దిగి వచ్చిందా!
దుబాయ్: డబ్బుంటే ఆ అంతరిక్షాన్నే ఎంచక్కా కిందకి దింపేసుకోవచ్చేమో కదా! లగ్జరీ లైఫ్‌కు పెట్టింది పేరైన దుబాయ్‌లో పర్యాటకుల్ని ఆకర్షించడానికి చంద్రుడి ఆకృతిలో రిసార్ట్ నిర్మిస్తున్నారు. ఇది రెండేళ్లలో పూర్తవుతుందట. అచ్చు చంద్రుడి ఉపరితలం మాదిరిగా డిజైన్ ఆకర్షణీయంగా ఉంది. 735 అడుగుల ఎత్తైన ఈ మూన్ రిసార్ట్ దుబాయ్‌కి మరో ప్రధాన ఆకర్షణగా మారనుంది. ఇందులో స్పా, వెల్నెస్ సెక్షన్, నైట్‌క్లబ్, ఈవెంట్ సెంటర్ ఉంటాయి. వ్యోమగాములకు, అంతరిక్షంలోకి వెళ్లాలనుకునే సాధారణ పర్యాటకులకి శిక్షణ కూడా ఇస్తారట. దీనికి నిర్మాణానికి 500 కోట్ల డాలర్లు అవుతుందట. దీనిపై ఏటా 180 కోట్ల డాలర్ల ఆదాయం వస్తుందని నిర్మాణ కంపెనీ అంచనా. ఈ రిసార్ట్స్‌లో ఏడాదికి కోటి మంది పర్యాటకులు ఎంజాయ్ చేసే వీలుంటుంది. (క్లిక్ చేయండి: సీఎన్జీ వినియోగదారులకు చేదు వార్త) -
సూర్యలంక బీచ్‌లో వీకెండ్ జోష్.. రాబడి కుష్
హోరుగాలికి లయబద్ధంగా కేరింతలు కొడుతున్నట్టు ఉవ్వెత్తున ఎగసిపడే కెరటాలు.. అలలతోపాటే ఎగిరెగిరి పడుతూ ఆనందగానం చేస్తున్నట్టు కిలకిలారావాలు చేసే వలస పక్షుల విన్యాసాలు.. ప్రకృతి సరికొత్త ‘అల’ంకారమేదో అద్దినట్టు.. సూర్యోదయం, సూర్యాస్తమయ సమయాల్లో మిలమిలా మెరుస్తూ కనువిందు చేసే సాగర జలాలు.. స్వచ్ఛమైన గాలి వీచే సుందర అటవీప్రాంతం.. ఇవన్నీ సూర్యలంక సొంతం. అందుకే ఈ తీరాన్ని సందర్శించేందుకు పర్యాటకులు ఉవ్విళ్లూరుతున్నారు. వారాంతాల్లో అధికసంఖ్యలో పోటెత్తుతున్నారు. సాక్షి, బాపట్ల: వీకెండ్ వస్తే చాలు.. సూర్యలంక తీరం కోలాహలంగా మారుతోంది. శని, ఆదివారాల్లో సుదూర ప్రాంతాల నుంచి పర్యాటకులు తరలివస్తున్నారు. ఫలితంగా పర్యాటక శాఖ ఆదాయం పెరుగుతోంది. రెండేళ్లుగా కరోనా వల్ల నష్టపోయిన పర్యాటక రంగం ఇప్పుడిప్పుడే లాభాల బాట పడుతోంది. సూర్యలంక ప్రత్యేకతలివే.. కాలుష్య కారక పరిశ్రమలు లేకపోవడం వల్ల ఈ తీరంలో సముద్ర జలాలు స్వచ్ఛంగా ఉంటాయి. చుట్టూ రెండుకిలోమీటర్ల దూరం మడ అడవులు విస్తరించి ఉంటాయి. ఇవి పర్యాటకులకు స్వచ్ఛమైన గాలులతో స్వాగతం పలుకుతాయి. ఈ తీరంలో అడపాదడపా డాల్ఫిన్లు విన్యాసాలు చేస్తుంటాయని స్థానికులు చెబుతుంటారు. రవాణా మార్గం.. అనుకూలం బాపట్ల జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలోనే సూర్యలంక ఉంటుంది. రవాణా మార్గం అనువుగా ఉంటుంది. అందుకే రాష్ట్రంలోని పలు జిల్లాలతోపాటు హైదరాబాద్ వంటి సుదూర ప్రాంతాల నుంచీ యువత వారాంతంలో సూర్యలంకకు తరలివస్తారు. ఇక్కడ పర్యాటకులకు సకల వసతులూ అందుబాటులో ఉన్నాయి. బీచ్‌కు సమీపంలో ప్రైవేటు రిసార్ట్స్ ఉన్నాయి. బాపట్లలోని భావన్నారాయణ దేవాలయం, పొన్నూరులోని ఏకశిల శివాలయం ఈ తీరానికి ఆధ్యాత్మిక ఆకర్షణ. కలెక్టర్ చొరవతో.. బాపట్ల జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టగానే విజయకృష్ణన్ సూర్యలంక తీరంపై దృష్టిపెట్టారు. ఈ తీరాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టారు. ఎస్పీ వకుల్‌జిందాల్ సహకారంతో భద్రతా చర్యలు చేపట్టారు. ముఖ్యంగా మద్యం సేవించి హల్చల్ చేసే మందుబాబులకు రూ.పదివేలు జరిమానా విధించాలని ఆదేశించారు. పర్యాటకాభివృద్ధికి ప్రణాళికలు సూర్యలంక తీరంలో పర్యాటకాభివృద్ధికి అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. ప్రభుత్వం కేటాయించిన 8 ఎకరాల భూమిలో ప్రైవేటు భాగస్వామ్యంతో నక్షత్ర హోటళ్లు, రిసార్ట్స్ నిర్మించాలని సన్నాహాలు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పర్యాటక ప్రదేశాలకు కేటాయించిన భూముల్లోనూ ఇదే తరహా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు పర్యాటకశాఖ చైర్మన్ ఆరిమండ వరప్రసాదరెడ్డి చెప్పారు. పెరిగిన ఆదాయం తీరంలో పర్యాటకశాఖ ఆదాయం పెరుగుతోంది. గతంలో నెలకు సగటున రూ.30 లక్షల మేర ఆదాయం వచ్చేదని స్థానిక అధికారులు చెబుతున్నారు. ఇప్పుడు ఈ మొత్తం రూ.40 లక్షలకు చేరుకుందని పేర్కొంటున్నారు. ఏడాదికి సుమారు రూ.5 కోట్ల ఆదాయం వస్తున్నట్లు వివరిస్తున్నారు. 32 రూమ్‌లతో సూర్యలంక తీరంలో పర్యాటక శాఖ ఏర్పాటు చేసిన హరిత రిసార్ట్స్ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. -
మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం.. ఎవరీ ఏక్నాథ్ షిండే?
ముంబై: మహారాష్ట్రలో రాజకీయం వేడేక్కింది. రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌తో మొదలైన రగడ సోమవారం ఎమ్మెల్సీ ఎన్నికలతో మరింత ముదిరి రాజకీయ సంక్షోభానికి దారితీసింది. తాజాగా అధికార మహా వికాస్ అఘాడి ప్రభుత్వానికి చెందిన మంత్రి ఏక్నాథ్ షిండే తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి అజ్ఞాతంలోకి వెళ్లడంతో.. శివసేన నేతృత్వంలోని కూటమి కుప్పకూలనుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే అదునుగా బీజేపీ ప్రతిపక్షాల ఎమ్మెల్యేలను తనవైపు లాక్కునేందుకు పావులు కదుపుతోంది. మహారాష్ట్రలో అధికారమే లక్ష్యంగా ఆచితూచి ముందుకు సాగుతోంది. అగ్రనేత ఏక్నాథ్ షిండే కాగా మహారాష్ట్ర రాజకీయాన్ని ఒక్కసారిగా మలుపు తిప్పిన ఎక్నాథ్ షిండే.. శివసేన పార్టీలో అగ్ర నాయకుడు. సీఎం ఉద్దవ్ ఠాక్రేకు నమ్మిన బంటు. ప్రస్తుతం మహా వికాస్ అఘాడి ప్రభుత్వంలో పట్టణ వ్యవహారాల మంత్రిగా పనిచేస్తున్నారు. మంత్రి కుమారుడు శ్రీకాంత్ షిండే లోక్‌సభ ఎంపీగా, సోదరుడు ప్రకాష్ షిండే కౌన్సిలర్‌గా ఉన్నారు. అయితే షిండేను గత కొంతకాలంగా ఉద్దేశపూర్వకంగా పక్కన పెట్టడంతో పార్టీపై అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. సంబంధిత వార్త: Maharashtra Political Crisis:శివ సేనలో చీలిక.. డేంజర్లో మహా సర్కార్!? నాలుగుసార్లు ఎమ్మెల్యే ఏక్నాథ్ షిండే మహారాష్ట్ర శాసనసభకు వరుసగా నాలుగు పర్యాయాలు (2004, 2009, 2014, 2019) ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2014లో గెలిచిన అనంతరం మహారాష్ట్ర అసెంబ్లీలో శివసేన శాసనసభా పక్ష నాయకుడిగా ఎన్నికయ్యారు. తరువాత ప్రతిపక్ష నాయకుడిగా కూడా పనిచేశారు. థానే ప్రాంతంలో ప్రముఖ నేతల్లో ఒకరైన ఏక్నాథ్ షిండే.. ఆ ప్రాంతాల్లో శివసేనను బలోపేతం చేయడంలో కీలకపాత్ర పోషించారు. పార్టీలోనూ, ఇటు ప్రజల్లోనూ నమ్మకం చొరగొన్న నేతగా గుర్తింపు పొందాడు. సూరత్ రిసార్ట్‌లో మకాం ప్రస్తుతం అజ్ఞాతంలోకి వెళ్లిన షిండే జాడ తెలిసింది. గుజరాత్ సూరత్‌లోని ఓ రిసార్ట్‌లో తన 10 మంది ఎమ్మెల్యేలతో ఉన్నట్లు తెలిసింది. వీళ్లంతా గుజరాత్ బీజేపీ అధ్యక్షుడు సీఆర్ పాటిల్‌తో టచ్‌లో ఉన్నారని సమాచారం. అయితే ఈ మధ్యాహ్నం తన ఎమ్మెల్యేలతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడనున్నట్లు తెలుస్తోంది. ఏక్నాథ్ షిండే అజ్ఞాతం.. ప్రస్తుతం ఉద్ధవ్ ప్రభుత్వాన్ని ప్రమాదంలో పడినట్లు కనిపిస్తుంది. షిండే ఇటీవల మంత్రి ఆదిత్య ఠాక్రేతో కలిసి అయోధ్య పర్యటనకు కూడా వెళ్లి వచ్చారు. చదవండి: Maharashtra Political Crisis:ఇది మహారాష్ట్ర.. బీజేపీ ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి! -
12 ఏళ్ల రష్యా బాలికపై అఘాయిత్యం
Goa Police has arrested a Room attendant: అత్యాచారాలు, లైంగిక వేధింపులు నిత్యకృత్యమైపోతున్నాయే తప్ప అంతుపొంతు లేకుండా పోతోంది. ప్రభుత్వ యంత్రాంగాలు ఎన్నిచట్టాలు తీసుకచ్చినప్పటికీ ఎక్కడో ఒక చోట మహిళలపై అఘాయిత్యం జరుగుతూనే ఉంటుంది. కామాంధులు చిన్నపిల్లలు, పసికందు అనే జాలి దయ లేకుండా అత్యంత క్రూరంగా ప్రవర్తిస్తున్నారు. అచ్చం అలాంటి ఘటనే గోవాలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే...నార్త్ గోవాలోని అరాంబోల్లోని హోటల్ రిసార్ట్‌లో 12 ఏళ్ల రష్యన్ బాలికపై అత్యాచారం జరిగింది. ఈ అకృత్యానికి పాల్పడింది ఆ రిసార్ట్‌లో పనిచేస్తున్న రూమ్ బాయ్ అని బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందుతుడి రవి లమానిని అతని సొంతూరు కర్ణాటకలోని గడగ్‌లో అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. ఈ మేరకు ఇన్స్పెక్టర్ విక్రమ్ నాయక్ మాట్లాడుతూ...బాధితురాలి తల్లి తన కుమార్తెను స్విమ్మింగ్ పూల్ వద్ద వదిలి మార్కెట్ నుంచి అవసరమైన వస్తువులు తీసుకురావడానికి వెళ్లినపుడు ఈ ఘటన చోటు చేసుకుందని తెలిపింది. ఆ తర్వాత నిందితుడు అక్కడ నుంచి పారిపోయాడు. అని చెప్పారు. (చదవండి: నవ వధువు సృజన మృతి కేసులో ట్విస్ట్.. షాక్‌లో పేరెంట్స్, వరుడు) -
పాక్‌లో ఘోరం.. మంచు కింద 22 మంది సజీవ సమాధి
ఇస్లామాబాద్: పాకిస్తాన్లో భారీగా కురుస్తున్న మంచు, మైనస్ 8 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రతలు ఒకే కుటుంబానికి చెందిన 8 మంది సహా మొత్తం 22 మందిని బలి తీసుకున్నాయి. మృతుల్లో 10 మంది చిన్నారులున్నారు. ఇస్లామాబాద్‌కు 28 మైళ్ల దూరంలోని ప్రముఖ కొండప్రాంత రిసార్టు పట్టణం ముర్రీలో ఈ విషాదం చోటుచేసుకుంది. పెద్ద సంఖ్యలో జనం ముర్రీకి పోటెత్తడంతో శుక్రవారం రాత్రి వేలాదిగా వాహనాలు ఆ దారిలో చిక్కుకుపోయాయి. తీవ్రంగా మంచు కురుస్తుండటం, ఉష్ణోగ్రతలు –8 డిగ్రీలకు పడిపోవడంతో చాలా మంది ఎటూ కదల్లేక వాహనాల్లోనే ఉండిపోయారు. చలికి గడ్డకట్టుకుపోయి ఇస్లామాబాద్‌కు చెందిన పోలీస్ అధికారి నవీద్ ఇక్బాల్ సహా ఆయన కుటుంబంలోని 8 మందితోపాటు మొత్తం 22 మంది వాహనాల్లోనే ప్రాణాలు కోల్పోయారు. నాలుగడుగుల మేర కురిసిన మంచులో వెయ్యి వరకు వాహనాలు చిక్కుకున్నాయి. దీంతో యంత్రాంగం వెంటనే సహాయక చర్యలు ప్రారంభించింది. శనివారం సాయంత్రం వరకు పరిస్థితి అదుపులోకి వస్తుందని అధికారులు చెప్పారు. ముందు జాగ్రత్తగా ముర్రీకి వెళ్లే రహదారులను ఆదివారం ఉదయం 9 గంటల వరకు మూసివేసినట్లు వెల్లడించారు. మంచు విపరీతంగా కురుస్తుండటంతో సైన్యం చేపడుతున్న సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోందన్నారు. -
మంగినపూడి బీచ్‌లో విచ్చలవిడిగా వ్యభిచారం
కోనేరు సెంటర్: పర్యాటకులకు ఆహ్లాదాన్ని పంచాల్సిన మంగినపూడి బీచ్ వ్యభిచారానికి కేరాఫ్ అడ్రస్‌గా మారింది. మచిలీపట్నంతో పాటు జిల్లాలోని ఇతర ప్రాంతాల నుంచి యువతీయువకులు నిత్యం బీచ్ సందర్శనకు వచ్చి తమ రాసలీలలు సాగిస్తున్నారు. స్థానికంగా ఉన్న రిసార్ట్లు ఉపయోగపడుతుండటంతో యువతీ, యువకులతో పాటు వివాహేతేర సంబంధాలు నెరపే జంటలు, అచ్చంగా వ్యభిచారం చేసే మహిళలు నిత్యం పదుల సంఖ్యలో రిసార్ట్‌లకు చేరుతున్నారు. బందరు రూరల్ పోలీసులు బుధవారం రిసార్ట్‌పై చేసిన దాడిలో అనేక జంటలు పోలీసులకు చిక్కాయి. రిసార్ట్ నడిపే వ్యక్తి మచిలీపట్నంతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులకు రూంలను గంటల లెక్కన అద్దెకు ఇస్తూ సొమ్ము చేసుకుంటున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. గంటకు రూ. 1000 చొప్పున వసూలు చేస్తూ ఈ విధమైన నిర్వాకానికి పూనుకుంటున్నట్లు చెబుతున్నారు. కచ్చితమైన సమాచారంతో... రిసార్ట్‌లో నిర్వాకంపై కచ్చితమైన సమాచారంతోనే బందరు రూరల్ ఎస్సై కె వై దాస్ సిబ్బందితో కలిసి మెరుపుదాడి చేశారు. పోలీసులు రిసార్ట్‌పై దాడి చేసిన విషయాన్ని గమనించిన కొన్ని జంటలు తోటల్లోకి పరుగులు తీయగా మరి కొందరు రూంలలోని బాత్రూమ్లలోకి వెళ్లి దాక్కున్నట్లు తెలిసింది. రూమ్‌లలో కొన్ని కుటుంబాలు సైతం ఉండటంతో విషయం అర్థమైన పోలీసులు వారిని ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా వివరాలు సేకరించి పంపించారు. అనుమానాస్పదంగా చిక్కిన ఎనిమిది జంటలను పోలీసు జీపులో బందరు రూరల్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పోలీసులకు చిక్కిన వారిలో కొంత మంది ప్రముఖులు, మరి కొందరు ప్రజాప్రతినిధుల వద్ద పనిచేస్తున్న వారు ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. -
దట్టమైన అడవిలో 100 ఏళ్లనాటి బంగ్లా.. ఒక రాత్రికి రూ.లక్ష
100 Year Old Mansion కోలంబో: అది ఒకప్పుడు అద్బతమైన బంగ్లా..1912 కాలంలో ఓ సంపన్నుడు తన భార్య గుర్తుగా ఆ భవనాన్ని నిర్మించాడు. శ్రీలంకలోని వెలిగామ పట్టణానికి సమీపంలో ఈ అద్బతమైన భవంతికి హలాలా కండా అనే పేరు పెట్టుకున్నాడు. అప్పట్లో ఈ బంగ్లాకు ఎంతో మంది ప్రముఖులకు విడిదిగా ఉండేది. ఇథియోపియన్ చక్రవర్తి హేలీ సెలస్సీ, అలనాటి ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ కేథ్ మిల్లర్ వంటి ప్రముఖులు విడిది చేసేవారు. కానీ రోజులు గడేచే కొద్ది ఆ బంగ్లా వైభవం తగ్గిపోయింది. చివరకు అడవిలో శిధిలమైన బంగ్లాలా మిగిలిపోయింది. ఈ భవంతిలో రాతి గోడలు కూలిపోయి.. గబ్బిలాలకు ఆ బంగ్లా ఆవాసంగా మారిపోయింది. ఈ క్రమంలో ఎందుకు పనికి రాని ఈ భవనాన్ని 2011లో రూ.2కోట్లుకు నలుగురు స్నేహితులు కొనుగోలు చేశారు. తర్వాత ఇంటీరియర్ డిజైనర్ అయిన శార్ప్, అతని స్నేహితులు జెన్నీ లెవిస్, రిచర్డ్ బ్లీస్‌డేల్, బెంట్లీ డి బేయర్ ఆ బంగ్లాను పునర్నిర్మాణం చేసి బంగ్లాకు పునర్వైభవం తీసుకొచ్చారు .ఈ క్రమంలో వాళ్లు ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు. 2012 డిసెంబర్లో ఆ బంగ్లా పునర్నిర్మాణ పనులను మొదలు పెట్టారు. బంగ్లాకు పునర్వైభవం తీసుకురావడానికి దాదాపు రెండేళ్ల సమయం పట్టింది. చారిత్రాత్మకత దెబ్బతినకుండా ఇప్పటి అధునాతన సౌకర్యాలు ఉండేలా ఆ భవనాన్ని పూర్తి చేశారు. అంతేకాకుండా గార్డెన్లో 23 మీటర్ల పొడవుతో ఒక నీటి కొలనును ఏర్పాటు చేశారు. ఇప్పుడు దాన్ని ఆ నలుగురు స్నేహితులు రిసార్ట్‌గా మార్చేశారు. ఐదు బెడ్రూంలతో అందంగా ఉన్న ఈ భవంతిలో 12 మంది బస చేయవచ్చు. ఈ రిసార్ట్‌కు ఒక మేనేజర్, చెఫ్, ఇద్దరు సర్వీస్ స్టాఫ్, ఇద్దరు గార్డెనర్లు, ఒక సెక్యూరిటీ గార్డు ఉన్నారు. ఈ రిసార్ట్‌లో ఒక రాత్రి గడపాలంటే దాదాపు రూ. లక్ష (1300 డాలర్లు) చెల్లించాల్సి ఉంటుంది. మీరు ఎప్పడైనా శ్రీలంకను సందర్శిస్తే, ఈ భవనం తప్పనిసారిగా చూడాల్సిందే. -
ఇక్కడ ఒక్క రాత్రికి రూ. 58 లక్షలు
పర్యాటకులను ఎక్కువగా ఆకట్టుకునే ప్రాంతం మాల్దీవులు. 26 ద్వీపాల సముహమైన మాల్దీవ్స్‌లో సహజమైన బీచ్‌లు, చల్లటి వాతావరణంతో స్వర్గాన్ని తలపిస్తుంది. అంతేగాక ఇక్కడ ప్రతి ఐలాండ్‌లోని రిసార్టులు స్వీమ్మింగ్ ఫూల్స్‌తో, బెడ్రూం విల్లాలు మాల్దీవులకు మరింత ఆకర్షణ. అయితే ఇక్కడ విడిది చేయాలంటే పర్యాటకులు ఒక్కరోజుకు వేల రూపాయల నుంచి లక్షల్లో చెల్లించాల్సి ఉంటుంది. అందుకే సాధారణ ప్రజలతో పోలిస్తే సెలబ్రెటీలే ఎక్కువగా ఇక్కడకు వెళుతుంటారు. లాక్డౌన్లో దాదాపు 8 నెలల పాటు సెలబ్రిటీలు ఇంటికే పరిమితమయ్యారు. అనంతరం లాక్డౌన్ ఎత్తివేయడంతో సెలబ్రెటీలంతా రిఫ్రెష్మెంట్ కోసం మాల్దీవులకు క్యూ కడుతున్నారు. దీంతో పర్యటకులను మరింత ఆకట్టుకునేందుకు వాల్డోర్ఫ్ ఆస్టోరియా మాల్దీవులు ఇథాఫుషిలో కొత్తగా ఓ ప్రైవేటు లగ్జరీ రిసార్టును నిర్మించారు. ప్రస్తుతం ఈ రిసార్టు పర్యాటకులు తెగ ఆకట్టుకుంటోంది. అయితే దీని ఖరీదు విని మాత్రం చాలా మంది నోళ్లు వెల్లబెడుతున్నారు. 32,000 చదరపు మీటర్ల అభయారణ్య ద్వీపమైన మాల్దీవులలోనే ఇది అతిపెద్ద ప్రైవేట్ ద్వీపం. లగ్జరీ రూమ్‌లతో అన్ని రకాల హంగు ఆర్భాటాలతో నిర్మించిన ఈ రిసార్టులో విడిది చేయాలంటే ఒక్క రాత్రికి సుమారు 58 లక్షల రూపాయలు చెల్లించాలంట. (చదవండి: చైనా దూకుడు: మరో అద్భుతానికి శ్రీకారం) అంత ఖరీదైన ఈ ద్వీపంలో మూడు బీచ్ విల్లాలతో కూడిన లగ్జరీ బెడ్రూమ్లు, రెండు ఓవర్ వాటర్ బెడ్రూమ్లు, రెసిడెన్సీ బెడ్రూంలతో పాటు స్వీమ్మింగ్ ఫూల్స్ ఉన్నాయి. వినోదం కోసం ఒక ప్రైవేట్ క్లబ్‌హౌస్ కూడా ఉంది. అదే విధంగా స్వంత ప్రత్యేక పాక బృందం, వాటర్‌స్పోర్ట్స్, డైవింగ్, యాచ్ ట్రిప్స్, ధ్యానం, యోగా సెంటర్లు, పిల్లలకు ప్రత్యేకంగా స్వీమ్మింగ్ పూల్, గేమింగ్ ఏరియాతో పాటు పూర్తిస్థాయి జిమ్ కూడా ఉంది. ఇథాఫుషి - ప్రైవేట్ ద్వీపంలో నిర్మించిన లగ్జరీ కొత్త రిసార్టును ఈ వారంలోనే ప్రారంభించారు. ఇక్కడ ఒకేసారి దాదాపు 24 మంది పర్యటకులు విడిది చేయవచ్చు. ఈ ద్వీపానికి వెళ్లాలంటే పడవలో 40 నిమిషాల్లో లేదా విమానంలో 15 నిమిషాల్లో ద్వీపానికి చేరుకోవచ్చు. అన్ని సౌకర్యాలతో నిర్మించిన ఈ ద్వీపానికి మీరు కూడా వెళ్లాలనుకుంటున్నారా. మరి అక్కడ ఉండాలంటే ఒక్క రాత్రికి 58,49,600 రూపాయలు (80,000 అమెరికా డాలర్లు) చెల్లించాల్సి ఉంటుంది. ఆలోచించుకోండి. (చదవండి: చెత్త రికార్డు సృష్టించనున్న ట్రంప్) -
గోటితో పోయేది గొడ్డలిదాకా తెచ్చుకున్నాడు
హోటల్, రెస్టారెంట్లు తమ ఫుడ్ ఎలా ఉందో చెప్పాలంటూ అక్కడికి వచ్చే కస్టమర్ల వద్ద రివ్యూలు తీసుకోవడం సహజంగా చూస్తుంటాం. కస్టమర్లు నుంచి వచ్చే సమాధానాలను ఆధారంగా చేసుకొని హోటల్స్, రెస్టారెంట్లు మరింత నాణ్యమైన ఫుడ్‌ను అందించేందుకు ప్రయత్నిస్తుంటాయి. కానీ థాయిలాండ్‌లోని ఒక హోటల్ మాత్రం ఒక కస్టమర్ తమ హోటల్‌పై నెగెటివ్ రివ్యూ ఇచ్చినందుకు అతన్ని రెండు రాత్రులు జైలు పాలయ్యేలా చేసింది. (చదవండి : పోలీస్ స్టేషన్‌కు అనుకోని అతిథి) అసలు విషయంలోకి వెళితే.. అమెరికాకు చెందిన వెస్లీ బార్నెస్.. థాయిలాండ్‌లో ఇంగ్లీష్ టీచర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. కోహ్చాంగ్ ఐలాండ్‌లో ఉన్న చాంగ్ రిసార్ట్‌కు వచ్చిన బార్నెస్ జిన్ బాటిల్‌ను తన వెంట తీసుకువచ్చాడు. అయితే దీనికి హోటల్ యాజమాన్యం అభ్యంతరం చెబతూ బెర్నాస్‌కు 15 కోర్కేజ్ (థాయిలాండ్ కరెన్సీ) డాలర్లు జరిమానా విధించింది. హోటల్లో ఫుడ్ తిన్నాకా బిల్ చూసుకొని ఆశ్చర్యానికి గురైన బెర్నాస్ తనకు జరిమానా విధించడంపై హోటల్ యాజమాన్యంతో గొడవపడ్డాడు. దీంతో మీరు తిన్నదానికి బిల్లు చెల్లించండి చాలు అని బెర్నాస్‌కు సర్దిచెప్పారు. ఇంతవరకు బాగానే ఉంది. బెర్నాస్ ఇంటికి వెళ్లాకా హోటల్ గురించి ఆన్లైన్ కస్టమర్ రివ్యూ రేటింగ్‌లో పనితీరును విమర్శిస్తూ నెగిటివ్‌గా రాసుకొచ్చాడు. అతను చేసిన ఈ పని తన జాబ్‌కు, జీవితానికి ఎసరు పెడుతుందని ఆ క్షణంలో అతనికి తెలియదు. ఈ విషయం తెలుసుకున్న చాంగ్ రిసార్ట్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో బెర్నాస్ను అరెస్ట్ చేసిన పోలీసులు అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. కాగా బెర్నాస్పై పరువునష్టం దావాతో పాటు ఒక కంపెనీ తప్పేం లేకున్నా వారిపై నెగెటివ్ రాసినందుకు, అలాగే కంప్యూటర్ క్రైమ్ యాక్ట్ ప్రకారం తప్పుడు రివ్యూ ఇచ్చినందుకు అతనిపై కేసు నమోదయింది. దీంతో బెర్నాస్‌కు రెండు రోజుల జైలు, 3160 కోర్కజ్ డాలర్ల జరిమానా విధించారు. ఇకవేళ బెర్నాస్ చేసింది తప్పు అని తేలితే రెండేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. బెర్నాస్ చేసిన పనికి స్కూల్ యాజమాన్యం అతన్ని విధుల నుంచి తొలగించింది. అందుకే అంటారు గోటితే పోయేది గొడ్డలిదాకా తెచ్చుకోవడం అంటే ఇదే.. తాను చేసిందే తప్పు అన్న సంగతి తెలిసి కూడా రిసార్ట్ వాళ్లతో గొడవపడడమే గాక తిరిగి వారిపైనే నెగెటివ్ రివ్యూలు రాసి జైలు పాలయ్యాడు. (చదవండి : తంతే రైలు అయినా వెనక్కి వెళ్లాల్సిందే!) -
స్నేహితులే చంపేశారా..?
-
పుట్టినరోజు వేడుకల్లో విషాదం
విశాఖపట్నం : జిల్లాలో ఓ ప్రైవేటు రిసార్ట్స్‌లో జరిగిన పుట్టిన రోజు వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. బర్త్ డే పార్టీలో పాల్గొన్న ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. యువకుడి మృతదేహం స్విమ్మింగ్ పూల్‌లో కనిపించడంతో స్నేహితులే చంపేశారు అంటూ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గాజువాక చెందిన సుధాకర్ అనే యువకుడు పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం అచ్యుతాపురం మండలం కొండకర్ల వద్ద ఓ ప్రైవేట్ రిసార్ట్‌లో బర్త్ డే పార్టీ ఏర్పాటు చేశారు. ఈ వేడుకలో సుధాకర్‌కు చెందిన మొత్తం 10 మంది స్నేహితులు ఈ పార్టీలో పాల్గొన్నారు. వీరిలో గాజువాక బీసీ కాలనీకి చెందిన సాయి అనే యువకుడు స్విమ్మింగ్ పూల్ పడి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పార్టీ అనంతరం స్మిమ్మింగ్ చేస్తుండగా ప్రమాదం జరిగినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తోటి స్నేహితులు చంపేసి ఉంటారని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పదోతరగతి చదువుతున్న ఈ సాయి తల్లిదండ్రులు మరణించడంతో బంధువుల ఇంట్లో ఉంటున్నాడు. ఘటనపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. మృతదేహాన్ని అనకాపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
కరోనా హాట్‌స్పాట్‌గా న్యూడిస్ట్‌ల రిసార్ట్
పారిస్ : ఫ్రాన్స్, మోంటాపెల్లియర్‌లోని ప్రఖ్యాత నేచురిస్ట్ రిసార్ట్ ‘కాప్ డిఎగ్డే’ కరోనా వైరస్ హాట్‌స్పాట్‌గా మారింది. అక్కడ సేదతీరుతున్న న్యూడిస్టుల నిర్లక్ష్యం కారణంగా రిసార్టులో ఇప్పటి వరకు 95 మందికి వైరస్ సోకింది. హాలిడేను ముగించుకుని ఇంటికి వెళ్లిన దాదాపు 55 మంది అనారోగ్యం పాలయ్యారు. రిసార్టులో పర్యటిస్తున్న న్యూడిస్టులు భౌతిక దూరాన్ని పాటించకపోవటం, మాస్కులు ధరించకపోవటమే ఇందుకు కారణమని ఫ్రెంచ్ వైద్యాధికారులు చెబుతున్నారు. ( 94 ఏళ్ల వయస్సులో ‘సాహసం’) గత సోమవారం 194 మందికి పరీక్షలు నిర్వహించగా 38 మందికి, బుధవారం నాడు 244 మందికి పరీక్షలు నిర్వహించగా 57 మందికి కరోనా పాజిటివ్ వచ్చిందని స్థానిక వైద్యాధికారులు తెలిపారు. బయటి గ్రామాల కంటే రిసార్టులో వైరస్ వ్యాప్తి నాలుగు రెట్లు అధికంగా ఉందని ఆరోగ్య శాఖ చెబుతోంది. ముఖ్యంగా 40 ఏళ్లలోపు ఉన్న వారిలో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉందని వెల్లడించింది. కాగా, ఫ్రాన్స్‌లో గడిచిన 24 గంటల్లో 4,900 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,42,899కు చేరింది. ఇప్పటి వరకు వైరస్ బారిన పడి 30 వేల మంది మృత్యువాత పడ్డారు. -
విహారంలో విషాదం..పడవ బోల్తా
ఇస్లామాబాద్ : రిసార్టులో పడవ బోల్తాపడి ఒకే కుటుంబానికి చెందిన 10 మంది చనిపోయిన ఘటన పాకిస్తాన్ దక్షిణ సింధ్ ప్రావిన్స్‌లో చోటుచేసుకుంది. విహారయాత్ర నిమిత్తం కీంజార్ లేక్ రిసార్టుకు వచ్చిన కుటుంబం అక్కడే ఓ పడవను అద్దెకు తీసుకొని సరస్సులో విహరిస్తుండగా ప్రమాదవశాత్తూ పడవ బోల్తా పడింది. బలమైన గాలులు వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ ఘటనలో ఆరుగురు మహిళలు, ఇద్దరుచిన్నారులు సహా ఒక కుటుంబంలోని పది మంది కుటుంబ సభ్యులు నీటిలో మునిగి చనిపోగా ముగ్గురు మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వీరిని స్థానిక గజ ఈతగాళ్లు రక్షించారని ఓ అధికారి వెల్లడించారు. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. -
రిసార్ట్‌కు గుజరాత్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
జైపూర్ : గుజరాత్‌లోని తమ పార్టీకి చెందిన 21 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ ఆదివారం రాజస్తాన్‌లోని ఒక రిసార్ట్‌కు తరలించింది. జూన్ 19న జరగనున్న రాజ్యసభ ఎన్నికల కోసం తమ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని ఆరోపించింది. 182 మంది సభ్యుల గుజరాత్ అసెంబ్లీలో.. పలువురు సభ్యుల రాజీనామా అనంతరం ప్రస్తుతం కాంగ్రెస్‌కు 65 మంది ఎమ్మెల్యేలున్నారు. ఇప్పటికే తమ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ గుజరాత్‌లోని రాజ్‌కోట్, అంబాజీ, ఆనంద్‌ల్లో ఉన్న రిసార్ట్‌లకు తరలించింది. రాజ్‌కోట్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలున్న నీల్సిటీ రిసార్ట్‌పై లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించారని పోలీసు కేసు నమోదైంది. ‘ప్రస్తుతం రాజస్తాన్‌లోని అబు రోడ్లో ఉన్న రిసార్ట్‌లో 21 మంది మా ఎమ్మెల్యేలున్నారు. ఉత్తర గుజరాత్ నుంచి మరి కొందరు సోమవారం వస్తారు’ అని కాంగ్రెస్ నేత ఒకరు వెల్లడించారు. కరోనాతో పోరాడాల్సిన సమయంలో మా ఎమ్మెల్యేలను ఆకర్షించే పనిలో బీజేపీ బిజీగా ఉంది అని గుజరాత్ కాంగ్రెస్ చీఫ్ అమిత్ చావ్డా విమర్శించారు. -
ఆజం ఖాన్‌కు మరో షాక్
రాంపూర్: వివాదాస్పద సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ఆజం ఖాన్‌కు భారీ ఎదురు దెబ్బ. భూకబ్జా, ల్యాండ్ మాఫియా ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరవుతున్నఆజం ఖాన్‌కు తాజాగా మరో షాక్ తగలింది. రాంపూర్‌లోని ఖాన్‌కు చెందిన లగ్జరీ రిసార్ట్ 'హంసఫర్' గోడనుఅధికారులు కూల్చివేశారు. కబ్జా ఆరోపణలతో బుల్డోజర్లు, జేసీబీ యంత్రాల సాయంతో కూల్చివేశారు. ఉత్తరప్రదశ్ నీటిపారుదల శాఖ ఆజం ఖాన్‌కు నోటీసులు కూడా జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ భూమిని ఆక్రమించి దీన్ని నిర్మించారని ఆరోపణలతో అధికారులు ఈ చర్య చేపట్టారు. ప్రభుత్వ భూముల ఆక్రమణకు పాల్పడినట్లు జిల్లా యంత్రాంగం నుంచి కూడా ఇప్పటికే అనేక ఆరోపణలు వచ్చాయి. పేద రైతులనుంచి వ్యవసాయ భూమిని, ప్రభుత్వ భూములను స్వాహా చేశాడన్న కేసులో అతనిపై వరుస కేసులు నమోదైనాయి. ఈ నేపథ్యంలోనే జూలై 29న ఆజం ఖాన్‌ను ల్యాండ్ మాఫియాగా ప్రకటించారు. అలాగే ఖాన్‌కు చెంది మహమ్మద్ అలీ జౌహార్యూనివర్శిటీకి విదేశీ విరాళాలకు సంబంధించి మనీ లాండరింగ్ ఆరోపణలపై ఎన్ఫోర్స్మెంట్ విభాగం (ఈడీ) కూడా విచారణ చేపట్టింది. ఆయనపై నమోదైన కేసుల (30 దాకా) వివరాలపై స్థానిక అధికారులను ఆరా తీస్తోంది. మరోవైపు ఆజం ఖాన్ కొనుగోళ్లకు సంబంధించిన రెవెన్యూ రికార్డులు, చెల్లింపు రశీదులు, ఇతర ఒప్పందాల వివరాలను రెవన్యూ శాఖను కోరామని రాంపూర్ ఎస్పీ అజయ్ పాల్ శర్మ తెలిపారు. అనేక వందల కోట్ల విలువైన భూమిని కొనుగోలు చేసినట్టు తమ దృష్టికి వచ్చిందని, వీటిపై దర్యాప్తు చేయాల్సి వుందన్నారు. -
లడాఖ్‌లో అత్యాధునిక రిసార్ట్
సాక్షి, ముంబై : జమ్మూ కశ్మీర్ ప్రత్యేక హోదా ఉపసంహరించుకోవడంపై వివాదం ఇంకా కొనసాగుతుండగానే మహారాష్ట్ర ప్రభుత్వం లడాఖ్‌లో పర్యాటక రిసార్ట్ ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. దీనికి సంబంధించి త్వరలో అధికారిక నిర్ణయం తీసుకుంటామని ఆ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి శాఖ మంత్రి జయకుమార్ రావల్ ప్రకటించారు. లడాఖ్‌లో భూమిని కొనుగోలు చేసి ఎంటీడీసీ (మహారాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్) ఆధ్వర్యంలో ఒక రిసార్ట్ ఏర్పాటు చేయాలనుకుంటున్నామని రావల్ తెలిపారు. లడాఖ్, జమ్మూ కాశ్మీర్లను ప్రతి సంవత్సరం గణనీయమైన సంఖ్యలో పర్యాటకులు సందర్శిస్తారు. తాజాగా ఆర్టికల్ 370ను రద్దు చేయడంతో, తాము అధికారికంగా రిసార్ట్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నామని మంత్రి రావాల్ పేర్కొన్నారు. ఈ రిస్టార్‌ను అత్యంత ఆధునికంగా ఏర్పాటు చేస్తామన్నారు. దీనిపై అధికారిక నిర్ణయం త్వరలో తీసుకుంటామని రావల్ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యాలయంలో ఎంటీడీసీ బుకింగ్ సదుపాయాన్ని ప్రారంభించిన తరువాత ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇక్కడ ప్రభుత్వ అధికారులకు ప్రత్యేక డిస్కౌంట్‌ను అందిస్తామని కూడా ఆయన వెల్లడించారు. కాగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 370తో పాటు, ఆర్టికల్ 35ఏ ను రద్దు ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. జమ్మూకశ్మీర్, లడాఖ్ అనే రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా అవతరించనున్నాయంటూ సంచలన నిర్ణయాన్ని ప్రకటించింది. ఈ ప్రతిపాదనకు సోమవారం రాజ్యసభలో ఆమోదం లభించింది. దీంతో జమ్మూ కశ్మీర్, లడాఖ్‌లో భూమిని కొనుగోలు చేయకుండా బయటి వ్యక్తులపై ఉన్న నిషేధం నిలిచిపోతుందని భావిస్తున్నారు. -
ప్రముఖ రిసార్ట్ సీఎండీ అరెస్ట్
హైదరాబాద్: నగర శివార్లలోని ఓ ప్రముఖ రిసార్ట్ సీఎండీని అధికారులు బుధవారం అరెస్ట్ చేశారు. జీఎస్టీ ఎగవేతకు పాల్పడినందుకు ఆయనపై చర్యలు తీసుకున్నట్టు డైరెక్టర్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్(డీజీజీఐ) తెలిపింది. కస్టమర్ల నుంచి జీఎస్టీ వసూలు చేస్తున్న సదురు రిసార్ట్ నిర్వాహకులు.. ప్రభుత్వానికి చెల్లించాల్సిన 13.81 కోట్ల రూపాయలు జీఎస్టీ మొత్తాన్ని పక్కదారి పట్టించినట్టు డీజీజీఐ అధికారులు పేర్కొన్నారు. చట్ట ప్రకారం వినియోగదారుని నుంచి వసూలు చేసే జీఎస్టీని నిర్ణీత గడువులోపు నేరుగా ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. కానీ సదురు రిసార్ట్ ఈ నిబంధనలను పట్టించుకోకుండా.. పన్ను ఎగవేతకు పాల్పడిందని వెల్లడించారు. ఈ విషయంలో ఆదాయపు పన్ను శాఖ సదురు రిసార్ట్‌కు, గతంలో పలుమార్లు నోటీసులు అందజేసినట్టు వెల్లడించారు. జీఎస్టీ నిబంధనల ప్రకారం దీనిని తీవ్రమైన నేరంగా పరిగణించాల్సి ఉంటుందన్నారు. ఇటువంటి నేరాలకు పాల్పడితే ఐదేళ్ల జైలు శిక్ష ఎదుర్కొవాల్సి వస్తుందని హెచ్చరించారు. రిసార్ట్ ఎండీ విచారణకు సహకరించకపోవడంతో అతనికి ఈ నెల 18 రిమాండ్‌కు తరలించడం జరిగిందన్నారు. -
ఏ1 రిసార్ట్స్ యాజమాని లొంగుబాటు
తూర్పుగోదావరి, రంపచోడవరం: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన రేవ్ పార్టీ వ్యవహరంలో దేవరాతిగూడెంలోని ఏ–1 రిసార్ట్స్ యాజమాని బి రమణమహర్షి(బాబ్జి) మంగళవారం రంపచోడవరం పోలీస్ స్టేషన్లో లొంగిపోయినట్టు ఏఎస్పీ రాహుల్‌దేవ్‌సింగ్ తెలిపారు. ఈ మేరకు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో విలేకర్ల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. ఈనెల ఏడో తేదీన దేవరాతిగూడెం ఏ1 రిసార్ట్స్‌లో యువతులతో కలిసి కొంత మంది పురుషులు నృత్యాలు చేస్తూ రేవ్ పార్టీ జరుగుతుందనే సమాచారంతో స్థానిక సీఐ బీహెచ్ వెంకటేశ్వర్లు, ఎస్సై జె విజయబాబు దాడి చేసి విజయవాడకు చెందిన 21 మంది పురుషులను, ఎనిమిది మంది యువతులను అరెస్టు చేసినట్టు తెలిపారు. ఏ1 రిసార్ట్స్ యాజమానిని బుధవారం రంపచోడవరం కోర్టులో హాజరుపరుస్తామని వెల్లడించారు. రేవ్ పార్టీలో పాల్గొన్న యువతులకు రంపచోడవరం సీడీపీఓ ద్వారా కౌన్సెలింగ్ ఇస్తామన్నారు. రేవ్ పార్టీలో పాల్గొన్న పురుషులు, యువతులకు 41ఏ సీఆర్సీపీ నోటీసులు జారీ చేసి పంపించామన్నారు. ఈ కేసుకు సంబంధించి అన్ని చట్ట ప్రకారం చేసినట్టు వెల్లడించారు. ఏజెన్సీలో సేఫ్ టూరిజం అభివృద్ధికి పోలీస్ శాఖ తమ వంతు కృషి చేస్తుందన్నారు. -
బెస్ట్ జాబ్: ఏడాదికి 83 లక్షల జీతం!
న్యూఢిల్లీ: మీకు ట్రావెలింగ్ అంటే ఇష్టమా? అన్ని దేశాలు తిరుగుతూ విభిన్న సంస్కృతి సంప్రదాయాలు తెలుసుకోవాలని ఉందా? దేశ దేశాల రుచులు ఆస్వాదించాలని అనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం మెక్సికోలోని విదాంతా రిసార్ట్స్ బ్రాండ్ అంబాసిడర్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోండి. మీరు కన్న కలలన్నీ నెరవేరతాయి. ఇదేమీ సాదాసీదా ఉద్యోగం కాదు. ప్రపంచంలో దీనిని మించిన ఉద్యోగమే లేదట. విదాంతా గ్రూప్ ‘ప్రపంచంలో అత్యుత్తుమ ఉద్యోగం’ అంటూ జారీచేసిన ప్రకటన ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ ఉద్యోగం వస్తే ఏడాదికి 83 లక్షల రూపాయల వేతనం, బీచ్ అందాల్ని ఆస్వాదించేలా రిసార్టుల్లో ఉచిత బస, దేశదేశాలు తిరిగే ఛాన్స్ వస్తుంది. ఇక విందు వినోదాలకు కొదవే లేదు. పైసా ఖర్చు లేకుండా ప్రపంచ ప్రసిద్ధ చెఫ్‌లు చేసిపెట్టిన వంటకాల్ని లొట్టలేసుకుంటూ తినొచ్చు. యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడాలను సందర్శించవచ్చు. సాహసం చేసే స్వభావం ఉంటే కీకారణ్యాల్లో షికారు కొడుతూ వేటాడే సరదా తీర్చుకోవచ్చు. అంతేనా మంచం మీద నుంచి కాలు కింద పెట్టకుండానే బెడ్ కాఫీ, బ్రేక్ ఫాస్ట్.. వంటికి మసాజ్‌ల కోసం సకల సౌకర్యాలతో ఉండే స్పాలు, సాయంత్రం వేళల్లో సరస్సుల పక్కన విహారం. ఇలా చెప్పుకుంటూ పోతే ఆ కంపెనీ ఇచ్చే ప్రోత్సాహకాల జాబితా చాంతాండంత అవుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే స్వర్గ సుఖాలు అనుభవించవచ్చు. అవనిలో ఉన్న అంతులేని ఆనందం అంతా ఈ ఒక్క ఉద్యోగంతో మీ సొంతమవుతుందని విదాంతా గ్రూప్ ఎగ్జిక్యూటిక్ వైస్ ప్రెసిడెంట్ ఇవాన్ చావెజ్ అంటున్నారు. ఇన్ని రాజభోగాలు సమకూరుస్తున్నారంటే ఉద్యోగానికి అర్హతలేంటని అనుకుంటున్నారా? ఏం పెద్దగా అక్కర్లేదు. సోషల్ మీడియాలో మీకు నేమ్, ఫేమ్ ఉండాలి. పర్యాటకుల్ని ఆకర్షించే నైపుణ్యం మీ సొంతమైతే చాలు. ఒక బ్రాండ్ అంబాసిడర్‌గా ఆ రిసార్టుల బిజినెస్ పెంచే బాధ్యత మీదే. ఈ ఉద్యోగానికి మీరు అర్హులే అనుకుంటే www.worldsbestjob.com వెబ్సైట్లోకి లాగిన్ అవండి. అక్టోబర్ 21లోగా ఈ కొత్త ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోండి. -
20 కేజీల బంగారం.. 21 కార్లు, బౌన్సర్లు
న్యూఢిల్లీ : ‘దేవుడి దయ వల్లే నా దగ్గర ఉన్న బంగారం ప్రతి ఏడు పెరుగుతుంది. పరిస్థితులు అనుకూలించి.. నా ఆరోగ్యం సహకరిస్తే మరిన్ని యాత్రలు చేస్తానంటున్నా’రు ‘గోల్డెన్ బాబా’ అలియాస్ సుధీర్ మక్కర్. ఈ బాబా ప్రతి ఏడాది 200 కిలోమీటర్ల పాటు సాగే కన్వర్ యాత్ర చేస్తారనే విషయం తెలిసిందే. ఈ ఏడాది కూడా కన్వర్ యాత్ర ప్రారంభించారు. ప్రస్తుతం యాత్రలో భాగంగా ఢిల్లీ - మీరట్ రోడ్డులో ఉన్న ఒక రిసార్ట్‌లో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా ‘గోల్డెన్ బాబా’ మీడియాతో ముచ్చటించారు. ఆయన చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే.. ‘బంగారం, కార్లు అంటే నాకు చాలా ఇష్టం. నేను మరణించే వరకూ వాటి మీద నా పిచ్చి ప్రేమ తగ్గదు. దేవుడు దయ వల్ల నా దగ్గర ఉన్న సంపద (బంగారం) ప్రతి ఏడాది పెరుగుతోంది. పరిస్థితులు అనుకూలించి, ముఖ్యంగా నా ఆరోగ్యం సహకరిస్తే ఇలాంటి యాత్రలు మరిన్ని చేస్తాను. మూడేళ్ల క్రితం నాకు తీవ్రమైన కడుపు నొప్పి వచ్చింది. చికిత్సం కోసం ముంబైలో ఉన్న అన్ని ప్రముఖ ఆస్పత్రులను సందర్శించాను. కానీ ఉపయోగం లేదు’ అన్నారు. ఈ ఏడాది చేసే కన్వర్ యాత్ర 25వది. ఇదే తన చివరి కన్వర్ యాత్రగా ప్రకటించారు గోల్డెన్ బాబా. తన యాత్రా ప్రస్థానం గురించి చెప్తూ ‘నా తొలి యాత్ర పూర్తవడానికి అయిన ఖర్చు కేవలం 250 రూపాయలు మాత్రమే. ఆ సమయంలో భక్తులు పెట్టింది తింటూ, రోడ్డు పక్కన ఉండే ఆశ్రమాల్లో సేద తీరుతూ నా యాత్రను కొనసాగించాను. కానీ ఇప్పుడు అలా కాదు. ప్రస్తుతం నేను నాతో పాటు ఒక ప్రత్యేక వంట మనిషిని, వాటర్ ప్రూఫ్ టెంట్‌ని, సిబ్బందిని తీసుకెళ్తాను. వాహానాల కోసమే దాదాపు 1. 25 కోట్లు ఖర్చు చేస్తున్నాను. వీటన్నింటి వల్ల భారీగా ఖర్చవుతుంది. అందుకే నా తొలి కన్వర్ యాత్ర నాకు చాలా ప్రత్యేకం అన్నారు. గతేడాది యాత్ర సందర్భంగా ఈ బాబా 14.5 కేజీల బంగారాన్ని ధరించగా.. ఈ ఏడాది దాదాపు 20 కేజీల బంగారాన్ని ధరించారు, 21 కార్లను, బౌన్సర్లను తీసుకెళ్తున్నారు. ఈ గోల్డేన్ బాబా సన్యాసిగా మారకముందు ఢిల్లీలోని గాంధీ నగర్ మార్కెట్లో వస్త్రాల వ్యాపారం చేసేవారు. ప్రస్తుతం ఈ బాబాకు ఘజియాబాద్‌లో ఒక విలాసవంతమైన భవనం ఉంది. ఈ ఆస్తుల గురించి స్పందిస్తూ ‘నా తదనంతరం ఈ ఆస్తులన్ని నా ప్రియ శిష్యునికి చెందుతాయ’ని తెలిపారు. ప్రస్తుతం ఈ బాబా దగ్గర ఓ బీఎండబ్ల్యూ కారు, 2 ఆడీ కార్లు, రెండు ఇన్నోవాలున్నాయి. ఇవే కాక ఒక రోలెక్స్ వాచ్, రూ 150 కోట్ల విలువైన ఆస్తులున్నట్లు వార్తలు వచ్చాయి. -
ఇళ్ల ముఖం చూడని జేడీఎస్ ఎమ్మెల్యేలు..
బయటి ప్రపంచంతో సంబంధాలు లేవు. మొబైల్స్, ఇంటర్నెట్పై నిఘా. ఇంద్ర నగరిని తలపించే రిసార్టులో జీవితం. ముఖ్యమంత్రి పదవిని అందుకోబోతున్న జేడీఎల్పీ నేత కుమారస్వామి తన ఎమ్మెల్యేలను నగర సమీపంలోని ప్రిస్టేజ్ రిసార్టుకు తరలించారు. బలపరీక్ష వరకు వారిని కాపాడుకోవడానికి అన్ని ప్రయత్నాలూ చేస్తున్నారు. దొడ్డబళ్లాపురం: ఆపరేషన్ కమల కంగారుతో జేడీఎస్ తన ఎమ్మెల్యేలను పిల్లల కోడిలా కాపాడుకుంటోంది. పలు రిసార్టులకు మకాం మారుస్తోంది. కాంగ్రెస్, జేడీఎస్ కూటమిని నిద్రపోనివ్వమని బహిరంగంగా సవాళ్లు విసురుతుండడంతో బీజేపీ ఏ వైపు నుండి ఆకర్షిస్తుందోనని భయపడ్డ జేడీఎస్ హైకమాండ్ ఆదివారం రాత్రి తమ పార్టీ ఎమ్మెల్యేలను దేవనహళ్లి– నందికొండ మార్గంలోని ప్రిస్టేజ్ గోల్ఫ్ షైర్ రిసార్టుకు తరలించింది. రిసార్టు లోపల, బయట పకడ్బందీ భద్రతను ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యేలకు ఎడబాటు లేకుండా కుటుంబ సభ్యులను కూడా రిసార్టులో ఉండడానికి అవకాశం కల్పించడం విశేషం. రిసార్టులో పనిచేసే సిబ్బందిని క్షుణ్ణంగా తనిఖీ చేసి లోపలకు వదులుతున్నారు. అతిథులుగా వచ్చిన విదేశీయులు, ఇతర అతిథులు ఈ తనిఖీలతో ఇబ్బందులు పడ్డారు. కొందరిని లోపలకు వదలగా మరికొందరిని వెనక్కు పంపించారు. రిసార్టులోకివెళ్లే ఫోన్లపై నిఘా పెట్టారు. రిసార్టులో 32 మంది పార్టీ నాయకుల సమాచారం ప్రకారం 32 మంది జేడీఎస్ ఎమ్మెల్యేలు రిసార్టులో బసచేయగా, లోకల్ జేడీఎస్ ఎమ్మెల్యే (దేవనహళ్లి) నిసర్గ నారాయణస్వామి పర్యవేక్షిస్తున్నారు. ఇలా ఉండగా సోమవారం రిసార్టు నుండి ముగ్గురు,నలుగురు ఎమ్మెల్యేలు మినహా ఎవ్వరూ బయటకు రాలేదు. మొదట చాముండేశ్వరి ఎమ్మెల్యే జీటీ దేవేగౌడ పని మీద బెంగళూరుకు వెళ్లారు. తరువాత సింధనూరు ఎమ్మెల్యే నాడగౌడ బయటకు వెళ్లారు. శిర తాలూకాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగి 7 మంది మరణించడంతో ఆ ఎమ్మెల్యే సత్యనారాయణ హైకమాండ్ అనుమతితో కారు తెప్పించుకుని అక్కడికి వెళ్లారు. తరువాత మాజీ మంత్రి ప్రస్తుత జేడీఎస్ ఎమ్మెల్యే బండెప్ప కాశంపూర్ కాసేపు బయటకు వచ్చి మీడియాతో ముచ్చటించారు. లోపల ఎమ్మెల్యేలు ఎలాంటి ఇబ్బందులూ పడడం లేదన్నారు. అయితే అధికంగా ప్రయాణించడం వల్ల అలసిపోయామని, ఇక ఇదే రిసార్టులో 5 రోజులపాటు విశ్రాంతి తీసుకుంటామన్నారు. మంత్రి పదవి కోసం ప్రయత్నిస్తున్నారా?అని ప్రశ్నించగా కుమారస్వామి మొదటిసారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మొదటిసారి ఆయన మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశానని, ఇప్పుడు మంత్రి పదవి ఇమ్మని అయితే అడగలేదని, కుమారస్వామిని ముఖ్యమంత్రిని చేయడమే తమందరి లక్ష్యమని చెప్పారు. అంతా రిలాక్స్ మూడ్ మధ్యాహ్నం సమయానికి కొళ్లేగాల నియోజకవర్గం బీఎస్పీ ఎమ్మెల్యే, రాష్ట్ర బీఎస్పీ అధ్యక్షుడు మహేశ్ కూడా పని నిమిత్తం బయటకు వచ్చాడు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ఎమ్మెల్యేలందరూ రిలాక్స్ మూడ్‌లో ఉన్నామన్నారు. తాను మంత్రి పదవి ఆశిస్తున్నానని చెప్పారు. బుధవారం కుమారస్వామి ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారానికి బీఎస్పీ అధినాయకురాలు మాయావతి వస్తారని తెలిపారు. కుమారస్వామి ఎమ్మెల్యేలను కలవడానికి ఉదయమే రిసార్టుకు వస్తారని చెప్పినప్పటికీ, హాసన్‌లో పలు దేవాలయాల దర్శనం,ఢిల్లీ వెళ్లాల్సిన పని ఉండడంతో ఆయన రాలేకపోయారు. మంత్రి పదవులపై కాంగ్రెస్ చర్చ సాక్షి, బెంగళూరు: కాంగ్రెస్–జేడీఎస్ సంకీర్ణంలో పదవుల పందేరంపై కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జి.పరమేశ్వర్ ఆధ్వర్యంలో సోమవారం నగరంలో ఓ హోటల్లో కాంగ్రెస్ నాయకులు చర్చలు జరిపారు. పలువురు జేడీఎస్ నాయకులు కూడా హాజరయ్యారు. మంత్రివర్గంలో సీనియర్ నాయకులు, అనుభవజ్ఞులకే పెద్దపీట వేయాలని పేర్కొన్నారు. రెండు పార్టీలకూ ఆమోదయోగ్యులనే కేబినెట్లో తీసుకుంటారు. గత సిద్ధు ప్రభుత్వంలో మంత్రులుగా పని చేసిన ఈసారి చాన్స్ ఇవ్వాలా, వద్దా అనేది కీలక ప్రశ్నగా మారింది. సీనియర్ నాయకులు మంత్రి పదవుల కోసం త్యాగం చేయాల్సిందేనని మాజీ మంత్రి రామలింగారెడ్డి అన్నారు. తనకు పదవి కావాలని అడగలేదని, పార్టీ నిర్ణయం మేరకు నడుచుకుంటానని చెప్పారు. -
వేసవి విడిది కాదు, రాజకీయ వేడిఇది!
వేసవి విడిది కోసం అంతా చల్లని ప్రాంతాలకు పరుగులు పెడుతోంటే, కర్నాటక రాజకీయం నేతల్ని మండుటెండల్లో భాగ్యనగరానికి పరుగులు పెట్టించింది. అతిపెద్ద పార్టీగా అవతరించిన బిజెపి ధాటినుంచి తమ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు కాంగ్రెస్, జెడిఎస్ లకు హైదరాబాద్ రాజకీయ విడిదిగా మారడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశం అయ్యింది. అయితే ఏ పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కావాల్సిన బలం లే నప్పుడు ఎమ్మెల్యేలను గంపగుత్తాగా తీసుకెళ్లి ప్రత్యర్థులకు చిక్కకుండా దాచిపెట్టే సాంప్రదాయం గత రెండు దశాబ్దాలుగా మన దేశంలో కొనసాగుతూ వస్తోంది. పాలిటిక్స్‌లోని ఈ రిసార్ట్ రాజకీయాలు ఎప్పుడెప్పుడు, ఎక్కడెక్కడ రాజకీయ విడిదిని ఏర్పాటు చేసాయన్నది ఓసారి చూద్దాం. హర్యాణా... హర్యాణా రాజకీయాలు 1982లో ఇదే రిసార్ట్స్ రాజకీయాలకు తెరమీదకొచ్చాయి. అక్కడ కాంగ్రెస్‌కి దీటుగా పురోగమిస్తోన్న లోక్ దళ్ పార్టీ, బీజేపీల కలయికని కాదని, కాంగ్రెస్‌ని బలనిరూపణ కోసం పిలవడంతో లోక్ దళ్ అధినేత దేవీలాల్ తన ఎమ్మెల్యేలను కాంగ్రెస్ నుంచి కాపాడుకోవడం కోసం తన పార్టీ 48 ఎమ్మెల్యేలతో సహా, తనకు మద్దతునిస్తానన్న బిజెపి ఎమ్మెల్యేలను ఢిల్లీలోని ఓ హోటల్‌కి తరలించారు. అయితే ఇంత భద్రంగా దాచినా ఎమ్మెల్యేలను కాపాడుకోలేకపోయింది ఆ పార్టీ. ఒక ఎమ్మెల్యే బయటకు పోయే దారిలేక హోటల్లోని పైప్‌లైన్‌పైన జారుకుంటూ తప్పించుకుపోవడంతో చివరకు కాంగ్రెస్ పార్టీకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే అవకాశం దక్కింది. కర్నాటక... చాలా రాష్ట్రాలకు రిసార్ట్ రాజకీయాల అనుభవం ఉన్నా, కర్నాటకకి మాత్రం ఈ విషయంలో ఎక్కువ అనుభవాలను చవిచూడాల్సి వచ్చిందని చెప్పొచ్చు. కర్నాటక పలుసందర్భాలో రాజకీయ విడిదికి కేంద్రంగా మారింది ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు చేసిన ప్రయత్నం నుంచి కాపాడుకునేందుకు 1983 లో రామకృష్ణ హె గ్డే రిసార్ట్ రాజకీయాలు ప్రారంభించారు. 2004, 2006, 2008, 2009–11, 2012 వరకు అనేక సందర్భాల్లో కర్నాటక రాజకీయాలు రిసార్ట్స్‌లో సేదదీరాయి. ప్రధానంగా 2009 నుంచి, 2011 మధ్య కాలంలో ప్రత్యర్థి పార్టీలనుంచి తమ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు దాదాపు 80 మంది బిజెపి ఎమ్మెల్యేలను బెంగుళూరులోని స్టార్ హోటల్‌కి తరిలించారు. ఆంధ్రప్రదేశ్ ... మన తెలుగు రాష్ట్రంలో కూడా రిసార్ట్ రాజకీయాల్లో స్థానం ఉంది. 1984లో నందమూరి తారక రామారావుని గద్దె దించేందుకు రెండు సార్లు రిసార్ట్ రాజకీయాలకు నాంది పలికారు. 1984లో నాటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ఓపెన్ హార్ట్ సర్జరీ కోసం అమెరికా వెళ్ళినప్పుడు నాటి గవర్నర్ రామ్‌లాల్ ఠాకూర్ , ఎన్‌టిఆర్‌ని బర్తరఫ్ చేసి, నాదెండ్ల భాస్కర్ రావుని ముఖ్యమంత్రిగా నియమించారు. ఈ సందర్భంగా టిడిపి ఎమ్మెల్యేలను హైదరాబాద్ నుంచి బెంగుళూరులోని నంది హిల్స్‌కి, అక్కడి నుంచి ఢిల్లీకి తరలించారు. ప్రభుత్వం పడిపోవడంతో. మళ్ళీ ఎన్‌టి రామారావు రథయాత్ర ద్వారా జనంలోకెళ్ళి అధికారాన్ని చేజిక్కించుకున్నారు. ఇందిరాగాంధీ ఆరోజు శంకర్ దయాళ్ శర్మని గవర్నర్‌గా నియమించారు. ఆ తరువాత 1995లో చంద్రబాబు నాయుడు తన మామ ఎన్టిరామారావుని గద్దెదించి అధికారాన్ని కైవసం చేసుకునేందుకు ఎమ్మెల్యేలందర్నీ రాత్రికి రాత్రే హైదరాబాద్‌లోని అప్పటి వైస్రాయ్ హోటల్‌కి తరలించి దాచిపెట్టి, ఎవ్వర్నీ కలవనివ్వకుండా కట్టడి చేసారు. బలనిరూపణకు అవసరమైన ఎమ్మెల్యేలను నయానా భయానా దక్కించుకునేవరకూ ఈ నాటకం కొనసాగడం తెలిసిందే. గుజరాత్ ... 1995లో 47 మంది ఎమ్మెల్యేలున్న శంకర్ సింగ్ వఘేలా బీజేపీ పైన తిరుగుబాటు చేసి తన ఎమ్మెల్యేలందర్నీ మధ్యప్రదేశ్‌లోని స్టార్ హోటల్ ఖజురహో తరలించారు. చివరకు ఒప్పందం మేరకు ఆనాటి ముఖ్యమంత్రి కేశూభాయ్ పటేల్ కి బదులుగా వఘేలా మద్దతుదారుడైన సురేష్ మెహతా ముఖ్యమంత్రిగా నియమితులయ్యారు. అయితే అది ఎంతోకాలం నిలవలేదు. తరువాత తన అనుయాయులతో పార్టీ నుంచి బయటకు వచ్చేసి ప్రభుత్వాన్ని పడగొట్టారు. ఉత్తర ప్రదేశ్ ... 1998 లోక్ సభ ఎన్నికల సందర్భంలో కళ్యాణ్ సింగ్ నాయకత్వంలోని బిజెపి ప్రభుత్వాన్ని నాటి ఉత్తర ప్రదేశ్ గవర్నర్ రమేష్ భండారీ డిస్మిస్ చే శారు. అప్పుడు కాంగ్రెస్‌లో ఉన్న జగదాంబికా పాల్ ని ముఖ్యమంత్రిగా నియమించారు. ఆయన 48 గంటల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నారు. బలనిరూపణ సందర్భంగా బిజెపి తన సభ్యులను అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించింది. అయితే గవర్నర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సింగ్ కోర్టుకి వెళ్లడంతో తిరిగి అలహాబాద్ హైకోర్టు ఆదేశాలతో కళ్యాణ్ సింగ్ ముఖ్యమంత్రిగా నియమితులయ్యారు. బిహార్... బీహార్‌లో 2000 సంవత్సరంలో జనతాదళ్‌యూ(జేడీయూ) నేత నితీష్ కుమార్‌ని ప్రభుత్వ ఏర్పాటుకి ఆçహ్వనించిన సందర్భంలో తమ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు కాంగ్రెస్, రాష్ట్రీయ జనతాదళ్ పార్టీలు తమ శాసన సభ్యులను పాట్నా లోని ఓ హోటల్లో దాచిపెట్టారు. అదే సందర్భంలో బలనిరూపణలో ఓటమిపాలవడానికి ముందు నితీష్ కుమార్ ఏడు రోజులపాటు ముఖ్యమంత్రిగా కొనసాగారు. 2005లో లోక్ జనశక్తి పార్టీ, బీజేపీ, జేడీయూ తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు తన ఎమ్మెల్యేలను జమ్షెడ్పూర్లోని ఓ హోటల్లో ఉంచింది. మహారాష్ట్ర ... 2002లో ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ–శివసేన లోకి తన సభ్యులు జారిపోకుండా ఉండేందుకు ఆనాటి ముఖ్యమంత్రి విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ బెంగుళూరులోని హోటల్‌కి తన ఎమ్మెల్యేలను తరలించారు. ఉత్తరాఖండ్... 2016లో అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి కొందరు ఎమ్మెల్యేలు వెళ్ళిపోవడంతో ఉత్తరాఖండ్ ప్రభుత్వం పడిపోయింది. దీంతో తన సభ్యులను కాపాడుకునేందుకు బిజెపి తన శాసన సభ్యులను తీసుకొని జైపూర్‌లోని ఓ హోటల్లో బసచేసింది. ఇరు పార్టీలు గెలుపుగుర్రాల్ని కైవసం చేసుకునేందుకు విపరీతంగా డబ్బు పాచికలు వేసారు. అయితే చివరకు రాష్ట్రపతి పాలనను విధించాలని కేంద్రం తొలుత నిర్ణయించినా అది హైకోర్టు జోక్యంతో ఆగిపోయింది. ఆ తరువాత 2017 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి పాలైంది. తమిళనాడు... తమిళనాడు తమ్ముళ్ళు కూడా ఏం తక్కువ తినలేదనడానికి తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణానంతర రాజకీయాలు సాక్ష్యం. 2017లో పన్నీర్‌సెల్వం చేత ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయించిన అనంతరం ఎఐడిఎంకె నాయకురాలు వి.కె.శశికళ తన ఎమ్మెల్యేలను చేజారిపోకుండా కాపాడుకునేందుకు వాళ్లందర్నీ చెన్నై లోని రిసార్ట్స్‌కి తరలించడం తెలిసిందే. -
నాడు దెయ్యాల కొంప.. మరి నేడు..?
ఒకప్పుడు అక్కడ ప్రజలు అడుగు పెట్టాలంటే వణుకు. అక్కడ దెయ్యాలు ఉండేవని స్థానికులు భ్రమపడేవారు. కానీ వందేళ్ల తర్వాత అక్కడ పరిస్థితి మారిపోయింది. దానికి కారణం అక్కడి వాతావరణాన్ని పూర్తిగా ఫేమస్ టూరిస్ట్ స్పాట్‌గా మార్చేయడమే. ఈ బిజీ బిజీ లైఫ్‌లో ఉన్న ఒత్తిడిని తగ్గించుకోవడానికి అదొక మంచి ప్రదేశంగా మారడమే. ఇలా మార్చడానికి చాలా కష్టపడాల్సి వచ్చిందని నిర్వాహకులు క్రిష్టినా రోసి తెలిపారు. 1880 కాలంలో ఇక్కడ ప్రజలు నివసించేవారు. వారంతా బంగారం, వెండి తవ్వుకుంటూ జీవనం సాగించేవారు. కానీ 1919 వచ్చేసరికి ఏమైందో ఏమో కానీ జనసంచారం తగ్గి ఎడారిలా మారింది. కారణం అక్కడ ఓ భవనంలో దెయ్యాలున్నాయని ప్రచారం జరగడం. దీంతో ఓ శతాబ్దకాలం మూగబోయినట్లున్న ఆ ఏరియా ఇప్పుడు పర్యాటకులతో నిండిపోయింది. మొత్తం 1600 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ రిసార్ట్‌లో 200 ఎకరాల్లో దాదాపు 12 లాగ్ క్యాబిన్లను నిర్మించారు. వాటికి పూర్వీకుల పేర్లు, ఆ ప్రాంత చరిత్రను సూచించేలా పేర్లు పెట్టారు. ఒక్కోటి అధునాతన హంగులతో తీర్చిదిద్దారు. ఇంకా అక్కడికి తరలివస్తున్న పర్యాటకులకు ఫిషింగ్, హార్స్ రైడింగ్ చేసుకునే అవకాశం కల్పించారు. కాకపోతే ఇవి కొంచెం ఖర్చుతో కూడుకున్నవి. ఇక్కడ ఒక్కరికి ఒక్క రాత్రికి 630- 2100 డాలర్లు అవుతుంది. ఇంతకీ ఈ ప్రదేశం ఎక్కడో చెప్పలేదు కదూ... కొలరెడోలోని డంటన్ హిల్‌స్టేషన్ ప్రాంతం. -
వారం తర్వాత రిసార్ట్ నుంచి బయటికి
బెంగళూరు: గుజరాత్‌కు చెందిన 44 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వారం తర్వాత తొలిసారి రిసార్ట్ నుంచి బాహ్యప్రపంచానికి వచ్చారు. బెంగళూరు సమీపంలోని రిసార్ట్‌లో ఉంటున్న వీరు శనివారం రాజ్‌భవన్‌కు వెళ్లి కర్ణాటక గవర్నర్ వజూభాయ్ వాలాను కలుసుకున్నారు. భేటీ తర్వాత ఎమ్మెల్యేలు విధాన సౌధను సందర్శించారు. ఐటీ విచారణ ఎదుర్కొంటున్న కర్ణాటక మంత్రి డీకే శివకుమార్ అక్కడ వారితో జత కలిశారు. గుజరాత్ నుంచి జరిగే రాజ్యసభ ఎన్నికల్లో గెలవడానికి బీజేపీ తమను లొంగదీసుకోవడానికి యత్నిస్తోందని ఆరోపించారు. చట్టాన్ని తాను ఉల్లంఘిం చలేదని శివకుమార్ విలేకర్లతో అన్నారు. -
కోటలో వేటగాడు!
► డబ్బున్నోళ్ల ఆట.. రిసార్ట్ ముసుగులో వేట.. ► సిద్దిపేట జిల్లా గిరాయిపల్లి అడవుల్లో వన్యప్రాణుల వేట ♦ రిసార్ట్ పేరుతో విచ్చలవిడి వ్యవహారం ♦ అడవి జంతువులను వధించి వాటి మాంసంతో విందులు ♦ ధనవంతులు, బడా వ్యాపారులు, వారి పిల్లల ఆటవిక క్రీడ ♦ అడవిని ఆనుకుని రిసార్ట్.. సాయంత్రమైతే చొరబాటు ♦ ‘షికారు’ పేరిట ఈవెంట్‌గా వేట ♦ దుప్పులు, కొండ గొర్రెలు, నెమళ్లు మాయం ♦ విషయం తెలిసీ పట్టించుకోని అటవీ శాఖ అధికారులు ♦ మామూళ్ల మత్తులో పోలీసు అధికారులు అదో అటవీ ప్రాంతం.. దుప్పులు, కొండ గొర్రెలు, నెమళ్లు వంటి ఎన్నో వన్యప్రాణులకు నిలయం.. అలాంటి అడవిలోకి ఓ రిసార్ట్ చొరబడింది.. గండికోటలా అన్ని విలాసాలతో ధనవంతులు, బడా వ్యాపారులు, వారి పిల్లల ఆటవిక క్రీడలకు నిలయంగా మారింది. డబ్బులు కడితే చాలు అక్రమంగా అడవిలోకి ప్రవేశించి.. ఇష్టమొచ్చినట్లుగా వన్యప్రాణులను వేటాడవచ్చు! వాటి మాంసంతో విందులూ ఆరగించవచ్చు.. సిద్దిపేట జిల్లా గిరాయిపల్లి అటవీ ప్రాంతంలో రిసార్ట్ ముసుగులో జరుగుతున్న వ్యవహారమిది. విషయం తెలిసినా పోలీసులు, అటవీ అధికారులు మామూళ్ల మత్తులో పట్టించుకోకపోవడంతో వన్యప్రాణుల వేట యథేచ్ఛగా సాగిపోతోంది. ఈ వ్యవహారంపై ‘సాక్షి’ పరిశోధనాత్మక కథనం.. హైదరాబాద్: సిద్దిపేట జిల్లా గిరాయిపల్లి అటవీ ప్రాంతంలో ఆధునిక హంగులతో ఓ రిసార్ట్ కట్టారు. దాదాపు 170 ఎకరాల విస్తీర్ణంలో అడవికి ఆనుకుని ఏర్పాటు చేశారు. అడవిలో కలసిపోయి ఉండటంతో నెమళ్ల గుంపులు, వన్యప్రాణులూ ఇందులోకి వస్తుంటాయి. ఈ రిసార్ట్‌లో రాచరిక కాలం నాటి తరహాలో ఆకర్షించే భవనాలు, పట్టుపాన్పులు, పంచభక్ష్య పరమాన్నాలు, చెలికత్తెలు, సేవకులు.. ఇలా అన్నీ సిద్ధం. కాస్త ఖర్చుపెడితే రోజంతా రాజుల్లా గడపొచ్చు. మరి రాజు అన్నాక వేట కూడా ఉంటుంది కదా!.. అందుకే అన్నట్లుగా పేజ్‌త్రీ పర్యాటకులను ఆకర్షించడం కోసం వేటను ‘షికారు’ పేరిట ఒక ఈవెంట్‌గా పెట్టినట్టు విశ్వసనీయంగా తెలిసింది. రిసార్టుకు వచ్చేవారు దానికి ఆనుకుని ఉన్న అడవిలోకి వెళ్లి జంతువులను వేటాడుతున్నారని.. అలా వేటాడి తెచ్చిన వాటిని వండి వడ్డిస్తున్నారని సమాచారం. ముఖ్యంగా బడా వ్యాపారులు, రాజకీయ నాయకులు, బ్యూరోక్రాట్ల పిల్లలను ఆకర్షించడం కోసం ఈ వేటకు బాటలు వేసినట్టు తెలుస్తోంది. స్థానిక రైతులు ఈ వేట వివరాలను ‘సాక్షి’ప్రతినిధికి వెల్లడించారు. సాయంత్రం ఆరు నుంచి మొదలు సాధారణంగా అడవి జంతువులు సాయంత్రం వేళలో వాటి ఆవాసాల నుంచి బయటికి వచ్చి సంచరిస్తుంటాయి. దీంతో రిసార్ట్ యాజమాన్యం షికారు పేరుతో సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు వేట నిర్వహిస్తోంది. వేట కోసం ప్రత్యేకంగా కుక్కలను పెంచుతున్నారు. రిసార్టు సిబ్బంది, పర్యాటకులు ఆ వేట కుక్కలను పట్టుకుని అడవిలోకి వెళతారు. అక్కడక్కడా ఎంచుకున్న చోట్ల ఇనుప కంచెల బోనులు ఏర్పాటు చేస్తారు. తర్వాత కాస్త ముందుకు వెళ్లి వన్యప్రాణులను కర్రలతో వెంటాడి ఆ బోనుల వైపు వచ్చేలా తరుముతారు. బోనుల్లో చిక్కుకున్న వన్యప్రాణులను రిసార్టుకు పట్టుకువచ్చి వధిస్తున్నారు. వాటి మాంసంతో వంటకాలు తయారుచేసుకుని తింటున్నారు. ఇక అడవిలోంచి రిసార్టులోకి వస్తున్న నెమళ్ల పరిస్థితి ఏమిటనేది ప్రశ్నార్థకమే. కొండ గొర్రెలు, దుప్పులను వేటాడి.. కొంత కాలంగా గుట్టుగా సాగుతున్న వన్యప్రాణుల వేట వ్యవహారం ఇటీవలే బయటకు పొక్కింది. మే నెల మూడో వారంలో రిసార్టు సిబ్బంది, పర్యాటకులు కలసి మూడు కొండ గొర్రెలు, ఒకదుప్పిని వేటాడినట్టు విశ్వసనీయంగా తెలిసింది. వాటిలో దుప్పిని, ఒక కొండ గొర్రెను అదే రోజున వధించి.. వాటి మాంసంతో విందు భోజనం ఏర్పాటు చేసినట్లు తెలిసింది. మిగతా రెండు కొండ గొర్రెలను రిసార్టు ఇనుప కంచెలో ఉంచగా.. కొందరు పోలీసులకు సమాచారం చేరవేశారని తెలిసింది. ఇటీవల ఆత్మహత్య చేసుకున్న కుకునూరుపల్లి ఎస్సై ప్రభాకర్‌రెడ్డి.. ఆ రోజున సిబ్బందితో కలసి రిసార్టుకు వెళ్లారని, కానీ కేసు నమోదు చేయకుండానే వెనుదిరిగారని సమాచారం. అప్పటిదాకా ఇలాంటి రిసార్టు ఒకటి ఉందనే విషయం స్థానికంగా కూడా పెద్దగా తెలియకపోవడం గమనార్హం. అయితే ఆలస్యంగా సమాచారం అందుకున్న సిద్దిపేట ఫారెస్టు రేంజర్ శ్యాంసుందర్‌రావు తన సిబ్బందితో కలసి ఆ రిసార్టుపై దాడి చేశారు. రెండు కొండ గొర్రెలను స్వాధీనం చేసుకుని, రిసార్టు సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు. కేసులు పెట్టి వదిలేశారు అటవీ అధికారులు రిసార్టుపై దాడి చేసిన వెంటనే రాజకీయ నాయకులు రంగ ప్రవేశం చేశారు. ఎలాంటి కేసులు పెట్టకుండా నిందితులను వదిలేయాలంటూ వారు అధికారులపై ఒత్తిడి చేసినట్టు తెలిసింది. దానికి తలొగ్గిన అధికారులు సాధారణ సెక్షన్ల కింద కేసులు పెట్టి చేతులు దులుపుకొన్నారు. దర్యాప్తును గాలికొదిలేశారు. స్వాధీనం చేసుకున్న కొండ గొర్రెలను నర్సాపూర్ కోర్టు న్యాయమూర్తికి చూపించి.. నర్సాపూర్ అడవుల్లోనే వదిలేశారు. ఈ ఘటన జరిగిన తర్వాత కూడా మళ్లీ రిసార్టు ముసుగులో వేట కొనసాగుతున్నట్లు తెలిసింది. మరోవైపు రిసార్టు కేసు వివరాల కోసం ‘సాక్షి’ప్రతినిధి సిద్దిపేట డీఎఫ్‌వో శ్రీధర్‌రావు, రేంజర్ శ్యాంసుందర్రావులకు విజ్ఞప్తి చేసినా, వారం రోజుల పాటు తిరిగినా.. వారు వివరాలు ఇవ్వడానికి నిరాకరించారు. అయితే రిసార్టులో కొండ గొర్రెలను బంధించిన మాట నిజమేనని, వాటిని స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేశామని శ్యాంసుందర్‌రావు చెప్పారు. -
శశికళ అరెస్ట్‌కు రంగం సిద్ధం చేసిన పోలీసులు
-
జనం మధ్యలోకి వెళ్తున్న శశికళ
-
కొండవీడులో ప్రపంచస్థాయి రిసార్ట్
ప్రభుత్వం అనుమతిస్తే నిర్మిస్తాం గోల్కొండ గ్రూప్స్ అధినేత రామిరెడ్డి ప్రకటన యడ్లపాడు: అంతర్జాతీయ ప్రమాణాలతో కొండవీడులో రిసార్ట్ ఏర్పాటు చేయనున్నానని గోల్కొండ హోటల్స్ గ్రూప్ అధినేత నడికట్టు రామిరెడ్డి చెప్పారు. శనివారం ఈ ప్రాంతాన్ని కొండవీడు కోట అభివృద్ధి కమిటీ కన్వీనర్ కే శివారెడ్డితో కలిసి రామిరెడ్డి సందర్శించారు. ఘాట్‌రోడ్డు పనులు, కొండలపై ఉన్న కట్టడాల వివరాలు తదితర అంశాలను శివారెడ్డి, కాంట్రాక్టర్లు ఆళ్ల శ్రీనివాసరెడ్డి, గరికపాటి సుబ్బారావులను అడిగి తెలుసుకున్నారు. రామిరెడ్డి, శివారెడ్డి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుతో ఫోన్లో మాట్లాడారు. అతి త్వరలోనే అటవీ భూములను కేంద్రం డీనోటిఫై చేస్తుందని, అన్నిరకాల అనుమతులు సులభంగా వస్తాయని మంత్రి వెల్లడించినట్లు చెప్పారు. రిసార్ట్ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళతానన్నారు. కొండవీడు నుంచి బోయపాలెం వరకు డబుల్ రోడ్డు నిర్మాణానికే రూ.8 కోట్ల నిధులు మంజూరయ్యాయని, త్వరలోనే టెండర్లు పిలిచేందుకు సిద్ధంగా ఉన్నారని రామిరెడ్డి పేర్కొన్నారు. రాజధానికి తలమానికం కానుంది.. కొండవీడుకు దగ్గర్లోని చిరుమామిళ్లలో జన్మించడం వల్ల జన్మభూమికి ఖ్యాతి తెచ్చేందుకు రిసార్ట్ నిర్మాణం చేయాలని సంకల్పించామని ఆయన తెలిపారు. కొండవీడులో ప్రపంచస్థాయి రిసార్ట్ నిర్మించాలనేదే తన లక్ష్యమన్నారు. గుంటూరుకు కొండవీడు ఊటీగా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. ఇందుకు కనీసం 30 ఎకరాల విస్తీర్ణం అవసరమని, ప్రాథమికంగా రూ.30 కోట్లు ఖర్చవుతుందని తెలిపారు. ప్రాజెక్టు ప్రణాళిక రూపం దాల్చితేగానీ పూర్తి విషయాలు చెప్పలేని స్పష్టం చేశారు. -
రిసార్ట్‌గా మారనున్న కాన్సెంట్రేషన్ క్యాంప్
పోడ్కోరికా: రెండో ప్రపంచ యుద్ధం కాలంనాటి ‘కాన్సెంట్రేషన్’ క్యాంప్ గల మోంటోనిగ్రొ తీరంలోని మాముల దీవిని ఇప్పుడు అందమైన లగ్జరీ రిసార్ట్‌గా అభివృద్ధి చేయాలని మోంటోనిగ్రొ ప్రభుత్వం నిర్ణయించింది. ఇటలీకి చెందిన అప్పటి నాజీ నియంత బెనిటో ముస్సోలిని శత్రు ఖైదీలను నిర్భంధించేందుకు మాముల దీవిలో ‘కాన్సెంట్రేషన్’ క్యాంప్‌ను ఏర్పాటు చేశారు. ఈ క్యాంప్‌లో 2,300 మంది ఖైదీలను నిర్బంధించగా వారిలో 130 మంది ఆకలితో చనిపోవడంగానీ, చంపేయడంగానీ జరిగింది. చారిత్రక గుర్తుగా ఈ దీవిని అలాగే ఉంచాలంటూ స్థానిక ప్రజలతోపాటు పలు ప్రపంచ దేశాలు చేసిన సూచనలను ఖాతరు చేయకుండా అక్కడ సుందరమైన రిసార్ట్‌ను నిర్మించి ప్రపంచ పర్యాటకులను ఆకర్షించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రిసార్ట్‌ను నిర్మించేందుకు 1150 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని కూడా అంచనా వేసింది. ‘మాముల క్యాంప్’ పేరుతో 1950లో ఓ హాలివుడ్ సినిమా కూడా వచ్చింది. మాముల దీవి దానంతట అదే శిథిలమయ్యేలా వదిలేయడం లేదా దాన్ని అందమైన పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్డడం అనే రెండే ప్రత్యామ్నాయాలు తమకు ఉన్నాయని జాతీయ పర్యాటక శాఖ డెరైక్టర్ ఆలివెరా బ్రజోవిక్ తెలిపారు. రెండో ప్రత్యామ్నాయమే ఉత్తమమైనదని భావించామని, ఎందుకంటే స్థానికుల ఆర్థిక పరిస్థితి మెరుగుపడేందుకు ఇది దోహదపడుతుందని ఆయన వివరించారు. ఈ కాన్స్ట్రేషన్ క్యాంప్‌లో స్థానికులే ఎక్కువ మంది మరణించడం వల్ల రిసార్ట్‌గా తీర్చిదిద్దడం వారికి ఇష్టం లేదు. క్యాంప్‌ను మ్యూజియంగానే ఉంచడం ఉత్తమమన్నది వారి వాదన. వారి వాదనకు తగ్గట్టుగా అవసరమైతే క్యాంప్ ఉన్న ప్రాంతంలో ఓ మ్యూజియం ఏర్పాటు చేస్తామని ఆలివెరా అన్నారు. రిసార్ట్ నిర్మాణం కోసం స్విస్-ఈజిప్షియన్ కంపెనీ ‘ఓరస్కామ్’కు ఈ దీవిని 49 ఏళ్ల పాటు లీజుకు ఇచ్చారు. చదరపు మీటరుకు 150 రూపాయల చొప్పున ఈ కంపెనీ లీజు దక్కించుకుంది. -
రిసార్ట్‌పై దాడి.. 15 మంది అరెస్ట్
ప్రొద్దుటూరు: వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులోని రాయల్‌కౌంటీ రిసార్ట్‌పై పోలీసులు సోమవారం సాయంత్రం దాడులు నిర్వహించారు. పేకాట ఆడుతున్న టీడీపీ నాయకుడితో సహా మరో 15 మందిని అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.1.06 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో మార్కెట్‌యార్డ్ మాజీ చైర్మన్, టీడీపీ నాయకుడు బండి భాస్కర్‌రెడ్డి కూడా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. -
లక్షల డబ్బు.. మెదక్ ఎన్నికకేనా?
-
శామీర్‌పేట్ రిసార్ట్‌లో పోలీసుల తనిఖీలు
హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా శామీర్‌పేటలోని ఓ రిసార్ట్‌పై పోలీసులు శుక్రవారం దాడి చేశారు. ఈ సందర్భంగా రూ.24 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. మెదక్ ఉప ఎన్నికల్లో ఈ డబ్బును పంచేందుకు దాచినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపై సమాచారం అందటంతో పోలీసులు రిసార్ట్ పై దాడి చేసి నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ నగదు ఓ రాజకీయ నేతకు సంబంధించిందిగా పోలీసులు భావిస్తున్నారు. -
శిలలపై హోటల్ కట్టినారు..
చుట్టూ పచ్చదనం.. మధ్యలో సెడర్బర్గ్ పర్వతాలు.. వాటి గుహల్లో గదులు.. అదిరిపోయే ఈ హోటల్ దక్షిణాఫ్రికాలో ఉంది. కేప్‌టౌన్‌కు 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ కగ్గా కమ్మా రిసార్ట్ అంటే పర్యాటకులు పడిచస్తారు. సెడర్బర్గ్ పర్వతాల్లో ఉన్న గుహల్లో గదులను ఏర్పాటు చేశారు. మరికొన్నింటిని పర్వతాన్ని తొలిచి.. కట్టారు. అంతేకాదు.. దీని చుట్టూ అలా తిరిగొస్తే.. నాటి రాతి యుగంలోకి వెళ్లొచ్చిన అనుభూతి కలుగుతుంది. పర్వతాలపై 6 వేల ఏళ్ల క్రితం అప్పటి ఆదిమవాసులు చెక్కిన చిత్రాలు నేటికీ దర్శనమిస్తాయి. అంతేకాదు.. గుహల్లో వద్దనుకుంటే.. ఆరుబయట నక్షత్రాలను లెక్కబెడుతూ పడుకునే సదుపాయమూ ఉంది. ఇందులో ఒక రోజు బసకు రూ.15,600 వసూలు చేస్తారు.