కడెం: కడెం ప్రాజెక్ట్ తీరాన.. పచ్చని చెట్లతో ఆహ్లాదకరమైన వాతావరణంలో అందమైనా విడిది గదులతో పర్యాటకుల మనసు దోచుతుంది కడెం హరిత రిసార్ట్స్. పర్యాటకులకు చక్కని అతిథ్యాన్ని అందిస్తూ.. అవార్డులను సొంతం చేసుకుంటుంది.
ఇటీవలే హైదరాబాద్ శిల్పారామంలో నిర్వహించిన ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకల్లో భాగంగా పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, చైర్మన్ గెల్లు శ్రీనివాస్, ఎండి మనోహర్‌రావు చేతుల మీదుగా రిసార్ట్స్ మేనేజర్ నునవత్ తిరుపతి ఉత్తమ రిసార్ట్స్ అవార్డ్‌ను అందుకున్నారు.
ఆహ్లాదకరంగా హరిత రిసార్ట్...
కడెం ప్రాజెక్ట్ పరిసరాలను పర్యాటకంగా అభివృద్ధి చేయాలని ఉద్దేశంతో ప్రాజెక్ట్ తీరాన 2015లో పర్యాటకశాఖ 12 విడిది గదులు, రెస్టారెంట్, మీటింగ్‌హాల్‌తో హరిత ఏకో టూరిజం రిసార్ట్స్‌ను ఏర్పాటు చేసింది. ఏడేళ్ల కాలంలో పర్యాటకుల ఉత్తమ సేవలందిస్తూ మూడు సార్లు బెస్ట్ రిసార్ట్స్ అవార్డ్‌ను అందుకుంది. ప్రముఖులతో పాటు, వివిధ సుదూర ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులు ఇక్కడి విడిది చేస్తుంటారు.
సెలవు దినాల్లో, వీకెండ్‌లో పర్యాటకులతో సందడిగా ఉంటుంది. పర్యాటకులు సేదతీరేందుకు విడది గదులతో పాటుగా, పిల్లలకు చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఉంటుంది. పర్యాటకులతో పాటుగా ప్రీ వెడ్డింగ్, బర్త్‌డే షూట్‌లతో పాటుగా, ఫిల్మ్ షూట్‌లకు హరిత రిసార్ట్ ఫేమస్. అయితే ఇందులో తొమ్మిది మంది విధులు నిర్వహిస్తుండగా ఏడాదికి సుమారుగా రూ.4 నుంచి 5 లక్షల ఆదాయం సమకూరుతుంది.
గదుల బుకింగ్
పర్యాటక శాఖ వెబ్‌సైట్ ద్వారా గదులను బుక్ చేసుకోవచ్చు. డబ్ల్యూ డబ్ల్యూ డబ్ల్యూ.టీఎస్‌టీడీసీ.కామ్ ద్వారా గదులను బుక్ చేసుకోవచ్చు. వీకెండ్‌లో (శుక్ర, శని, ఆదివారల్లో) 1848, మిగాత రోజు ల్లో 1680(జీఎస్టీతో కలిపి). మరిన్ని వివరాలకు 9133053007 నంబర్‌లో సంప్రదించవచ్చు.
సిబ్బంది సహకారంతో
రాష్ట్రంలోనే బెస్ట్ రిసార్ట్‌గా కడెం హరితకు అవార్డ్ దక్కడం వెనుక సిబ్బంది సహకారం ఎంతో ఉంది. మూడుసార్లు హరిత రిసార్ట్స్‌కు అవార్డ్ దక్కడం అనందంగా ఉంది. సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి పర్యాటకులు వస్తుంటారు. శుభాకార్యలు, వింధులు జరుపుకునేందుకు అవకాశం ఉంది. పర్యాటకుల టూరిజం శాఖ తరఫున సౌకర్యాలు అందిస్తున్నాం. – నునవత్ తిరుపతి, హరిత రిసార్ట్స్ మేనేజర్, కడెం
Comments
Please login to add a commentAdd a comment