కోడిపుంజులాంటి హోటల్‌..! | Philippines Resort: Ever Seen A Giant Chicken Hotel | Sakshi
Sakshi News home page

కోడిపుంజులాంటి హోటల్‌..!

Published Sun, Dec 1 2024 11:48 AM | Last Updated on Sun, Dec 1 2024 12:05 PM

Philippines Resort: Ever Seen A Giant Chicken Hotel

రాజసంగా నిలుచున్న కోడిపుంజును చూశారు కదూ! ఇది కోడి గౌరవార్థం నిలిపిన విగ్రహమేమీ కాదు. ఇది హోటల్‌ భవంతి. కోడిపుంజు ఆకారంలో ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన భవంతిగా ఇది గిన్నిస్‌ రికార్డు సాధించింది. ఈ భవంతి ఎత్తు 114.7 అడుగులు. ఫిలిప్పీన్స్‌లోని నెగ్రోస్‌ నగరంలో ఉందిది.

నిలువెత్తు కోడిపుంజులాంటి ఈ హోటల్‌ భవనంలో సమస్త సౌకర్యాలతో కూడిన 15 ఎయిర్‌ కండిషన్డ్‌ గదులు ఉన్నాయి. ఫిలిప్పీన్స్‌ స్థానిక సంస్కృతిలో కోడిపుంజుకు విశేష ప్రాధాన్యముందని, ఆ ఒక్క కారణమే కాకుండా, జనాల దృష్టిని ఆకట్టుకునేందుకు కోడిపుంజు ఆకారంలో ఈ భవంతిని నిర్మించామని ఈ హోటల్‌ యజమాని రికార్డో కానో గ్వాపో తెలిపారు. ఈ హోటల్‌ పేరు ‘కాంప్యూస్టోహాన్‌ హైలాండ్‌ రిసార్ట్‌’.  

(చదవండి: ఏంటిది.. చేపకు ఆపరేషన్‌ చేశారా..!)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement