ఉదయం ప్రహరీ.. సాయంత్రం ముఖద్వారం కూల్చివేత
నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేసిన మున్సిపల్ అధికారులు
ఎమ్మెల్యే డైరెక్షన్‌లో అధికారుల యాక్షన్!
వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా పనిచేశారన్న అక్కసుతోనే విధ్వంసం
సాక్షి టాస్‌్కఫోర్స్: తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుల ఆస్తులే లక్ష్యంగా విధ్వంసానికి తెగబడుతున్నారు. గత ఆరు నెలల్లో సుమారు 175 నిర్మాణాలను కూల్చివేశారు. తాజాగా శ్రీకాళహస్తి మున్సిపాలిటీ పరిధిలో స్వర్ణముఖి నది ఒడ్డున 2017 టీడీపీ హయాంలోనే నిర్మించిన రివర్‌వ్యూ రిసార్ట్‌ను... నేడు అక్రమం అంటూ ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే నేలమట్టం చేసేందుకు సిద్ధమయ్యారు.
శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే తాటిపర్తి చెంచురెడ్డి అల్లుడు శేఖర్‌రెడ్డికి చెందిన రిజి్రస్టేషన్ స్థలంలో రివర్ వ్యూ రిసార్ట్ నిరి్మంచారు. రిసార్ట్ నిర్మాణానికి అన్ని అనుమతులు ఉన్నాయని చెంచురెడ్డి కుమార్తె వెల్లడించారు. అయితే, సార్వత్రిక ఎన్నికల్లో శేఖర్‌రెడ్డి కుటుంబం వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా పనిచేసింది. అందువల్లే వారిపై శేఖర్‌రెడ్డికి చెందిన రివర్ వ్యూ రిసార్ట్‌ను కూల్చివేసేందుకు స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సు«దీర్‌రెడ్డి కుట్ర పన్నారనే ఆరోపణలు
వినిపిస్తున్నాయి.
తెల్లవారుజామునే వచ్చి...
మున్సిపల్ అధికారులు, పోలీసులు శనివారం వేకువజామున రివర్ వ్యూ రిసార్ట్ వద్దకు చేరుకుని కూల్చివేతకు సిద్ధమయ్యారు. ఈ విషయం తెలుసుకున్న శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి అక్కడకు చేరుకుని ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ప్రైవేటు ఆస్తులలో ఏమిటీ దౌర్జన్యమని నిలదీశారు. అప్పటికే ప్రహరీ కొంత భాగాన్ని కూల్చి వేశారు.
మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ శ్రేణులు అడ్డుకోవడంతో కూల్చివేతను తాత్కాలికంగా నిలిపివేశారు. శ్రీకాళహస్తిలో జరుగుతున్న విధ్వంసకాండ గురించి బియ్యపు మధుసూదన్‌రెడ్డి.. వైఎస్సార్‌సీపీ తిరుపతి, చిత్తూరు జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. భూమన వెంటనే శ్రీకాళహస్తిలోని రివర్‌వ్యూ రిసార్ట్ వద్దకు చేరుకుని కనీసం నోటీసులు ఇవ్వకుండా కూల్చివేయడం సరికాదని, నిబంధనలు పాటించాలని అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేశారు.
అనంతరం ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం కూడా హోటల్ వద్దకు చేరుకుని నిర్మాణాలు కూల్చివేతను తప్పుబట్టారు. ఇంతలోనే మరోసారి అధికారులు కూల్చివేతకు సిద్ధం కాగా.. బియ్యపు మధుసూదన్‌రెడ్డి, హైకోర్టు మాజీ న్యాయవాది ప్రభాకర్‌రెడ్డి గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను మున్సిపల్ కమిషనర్, అధికారులకు చదివి వినిపించారు. రిజిస్టర్ భూమిలో నిర్మించిన భవనాన్ని ఎలా కూలుస్తారని? అక్రమ నిర్మాణమే అయినా వారం ముందే నోటీసులు ఇవ్వాలని సుప్రీంకోర్టు చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు.
అక్రమ నిర్మాణాలు అయినా శని, ఆదివారాల్లో ఎటువంటి చర్యలు తీసుకోరాదని స్పష్టంచేశారు. దీంతో మున్సిపల్ కమిషనర్, పోలీసులు వెనకడుగు వేశారు. అయినా ఎమ్మెల్యే నుంచి మున్సిపల్ కమిషనర్, పోలీసులపై ఒత్తిడి రావటంతో ప్రహరీని పూర్తిగా కూల్చివేశారు.
ఒకవైపు అక్రమం అంటూనే.. మరోవైపు పరిహారం చెల్లిస్తామని..
ఉదయం నుంచి రివర్‌వ్యూ రిసార్ట్ అక్రమంగా నిర్మించారని, కూల్చివేస్తామని అధికారులు హడావుడి చేశారు. అయితే, మధ్యాహ్న సమయంలో అక్కడికి చేరుకున్న ఉన్నతాధికారులు మాత్రం ‘స్వర్ణముఖి నది సుందరీకరణ కోసం స్థలం అవసరం ఉంది. కొంత తీసుకుంటాం. అందువల్ల కూల్చివేసిన నిర్మాణాలకు ఎంత నష్టం అయ్యిందో చెబితే పరిహారం చెల్లిస్తాం’అని చెప్పడం గమనార్హం.
ఆ తర్వాత కూల్చివేతలు నిలిపివేసి అందరూ వెళ్లిపోయారు. కానీ, వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఎవరూ లేని సమయంలో సాయంత్రం అధికారులు మరోసారి జేసీబీతో వచ్చి రివర్ వ్యూ రిసార్ట్ ముఖద్వారాన్ని పూర్తిగా కూల్చివేశారు.
Comments
Please login to add a commentAdd a comment