కావలిలో వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుడి దుకాణం నేలమట్టం
ప్రభుత్వ స్థలం ఆక్రమించారని టీడీపీ నేతల ఫిర్యాదు
మునిసిపల్ అధికారులతో కూల్చివేయించిన ఎమ్మెల్యే
50 ఏళ్లుగా అక్కడే వ్యాపారం చేస్తున్న నారాయణ గుప్తా
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిలో టీడీపీ నేతల కక్ష సాధింపు హద్దులు దాటుతోంది. ఇప్పటివరకు గ్రావెల్, మట్టి దందాలతో మునిగితేలిన తెలుగు తమ్ముళ్లు...ప్రస్తుతం వైఎస్సార్‌సీపీ నేతలకు చెందిన ఆస్తుల ధ్వంసానికి పాల్పడుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి కనుసన్నల్లో టీడీపీ కార్యకర్తలు చేస్తోన్న దురాగతాలు పెచ్చుమీరిపోతున్నాయి. తాజాగా..వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుడైన నారాయణ గుప్తాకు చెందిన ఓ దుకాణాన్ని మంగళవారం వేకువజామున నేలమట్టం చేయించారు.
స్థానిక మునిసిపల్ అధికారులు ఎలాంటి నోటీసు ఇవ్వకుండా వేకువజామున వచ్చి దుకాణాన్ని కూలగొట్టించారు. దుకాణం ఉన్న స్థలం ప్రభుత్వానిది అని అధికారులు చెబుతున్నారు. కావలిలో పారీ్టలకతీతంగా పలువురు నేతలు అధికారుల చర్యను ఖండించారు. పట్టణంలోని రైల్వేరోడ్డులో 1.5 అంకణాల స్థలంలో చిన్న దుకాణం గది 50 ఏళ్లుగా నారాయణ గుప్తా కుటుంబం ఆధీనంలో ఉంది. రెవెన్యూ అధికారులు జారీ చేసిన పట్టా కలిగి, మునిసిపాలిటీకి పన్ను కూడా చెల్లిస్తున్నారు.
టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నారాయణ గుప్తా కుటుంబానికి చెందిన షాపు గదిని కూలి్చవేస్తామని టీడీపీ నాయకులు ప్రచారం చేస్తున్నారు. దీంతో నారాయణ గుప్తా కుటుంబం కోర్టును ఆశ్రయించింది. కోర్టులో కేసు ఉన్నప్పటికీ మునిసిపల్ అధికారులు మంగళవారం ఉదయాన్నే జేసీబీతో వచ్చి షాపుని నేలమట్టం చేశారు. షాపును ధ్వంసం చేసి మెటీరియల్ కూడా అప్పటికప్పుడు ట్రాక్టర్ల ద్వారా తరలించేశారు.
కుటుంబం వీధిన పడేలా చేశారు
ఎన్నో ఏళ్లుగా మునిసిపాలిటీకి పన్నులు కడుతున్నాం. మా తాతల కాలం నుంచి ఇక్కడే దుకాణం పెట్టుకుని జీవిస్తున్నాం. రెవెన్యూ అధికారులు ఇచ్చిన పట్టా ఉంది. ఇటీవల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి మద్దతుగా పనిచేశానన్న కారణంతో నన్ను టార్గెట్ చేశారు.
కౌంటింగ్ తర్వాత మా దుకాణం పడగొడతామని ప్రచారం రావడంతో కోర్టుకు వెళ్లాం. కోర్టులో పెండింగ్ ఉన్నప్పటికీ మునిసిపల్ అధికారులు మా దుకాణాన్ని పడగొట్టి ఆర్యవైశ్యులకు ద్రోహం చేశారు. – నారాయణ గుప్తా, వైశ్య నేత
Comments
Please login to add a commentAdd a comment