
సాక్షి, విజయవాడ: వైఎస్సార్‌సీపీ కార్యాలయాల కూల్చివేతలపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశాలు వెలువరించింది. స్టేటస్ కో(యధాతధ) స్థితిని కొనసాగించాలని.. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేదాకా కూల్చివేతలు చేపట్టవద్దని తెలిపింది. అదే సమయంలో అధికారులు తొందరపాటు చర్యలు తీసుకోవద్దని.. వైఎస్సార్‌సీపీ వివరణ తీసుకోవాలని అధికార యంత్రాంగానికి సూచించింది.
వైఎస్సార్‌సీపీ ఆఫీసుల కూల్చివేతలపై చట్ట నిబంధన అనుసరించాలని కోర్టు పేర్కొంది. అదనపు ఆధారాలు ఉంటే 2 వారాల్లో సమర్పించాలన్న హైకోర్టు.. వాదనలు విన్న తర్వాత పూర్తిస్థాయి ఉత్తర్వులు వెలువరిస్తామని చెప్పింది. కోర్టులో వాదనల ప్రక్రియ పూర్తయ్యే వరకు కూల్చివేతలు చేపట్టొద్దని హైకోర్టు పేర్కొంది.
ప్రజా ప్రయోజనాలు ప్రభావితం అయితేనే చర్యలు తీసుకోవాలని.. లేదంటే పార్టీ కార్యాలయాలను కూల్చడానికి వీల్లేదని హైకోర్టు స్పష్టం చేసింది.

Comments
Please login to add a commentAdd a comment