వైఎస్సార్‌సీపీ ఆఫీస్‌ కూల్చివేత.. అధికారులకు హైకోర్టు నోటీసులు | AP High Court Serve Notices To Officials In YSRCP Office Demolition | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ ఆఫీస్‌ కూల్చివేత.. అధికారులకు హైకోర్టు నోటీసులు

Published Thu, Jul 11 2024 3:07 PM | Last Updated on Thu, Jul 11 2024 3:34 PM

AP High Court Serve Notices To Officials In YSRCP Office Demolition

అమరావతి, సాక్షి: తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైఎస్సార్‌సీపీ కార్యాలయం కూల్చివేత ఘటనలో ఏపీ హైకోర్టు చర్యలకు ఉపక్రమించింది. కోర్టు ధిక్కరణ కేసులో సీఆర్డీఏ కమిషనర్‌ కాటంనేని భాస్కర్‌తో పాటు తాడేపల్లి మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌కు నోటీసులు జారీ చేసింది.

కూల్చివేతకు సంబంధించి.. కోర్టు ధిక్కరణ చట్టం కింద చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ పిటిషన్‌ వేసిన సంగతి తెలిసిందే. గురువారం పిటిషన్‌పై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం నోటీసులు పంపింది. 

తాడేపల్లి మండలం సీతానగరం వద్ద నిర్మాణంలో ఉ‍న్న వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయ భవనం అక్రమ కట్టడం అని సీఆర్డీయే పేర్కొంది. అయితే దానిని కూల్చేయాలన్న సీఆర్డీయే ప్రిలిమినరీ ప్రొసీడింగ్స్‌ను సవాల్‌చేస్తూ వైఎస్సార్‌సీపీ హైకోర్టును కోర్టును ఆశ్రయించింది. దీంతో.. చట్టాన్ని మీరి వ్యవహరింవద్దని కోర్టు సీఆర్డీయేకు సూచించింది కూడా. 

అయినా కూడా మంగళగిరి తాడేపల్లి మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారుల సాయంతో సీఆర్డీయే జూన్‌ 22వ తేదీ వేకువజామున కూల్చివేతలు జరిపింది. కనీసం ముందస్తు నోటీసులు కూడా ఇవ్వలేదు. దీంతో సీఆర్డీఏ, మున్సిపల్‌ అధికారులు హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేశారంటూ వైఎస్సార్‌సీపీ తిరిగి న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.

	తాడేపల్లి వైఎస్సార్సీపీ ఆఫీస్ కూల్చివేత కేసులో హైకోర్టు కీలక నోటీసులు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement