బెంగళూరు: గుజరాత్‌కు చెందిన 44 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వారం తర్వాత తొలిసారి రిసార్ట్ నుంచి బాహ్యప్రపంచానికి వచ్చారు. బెంగళూరు సమీపంలోని రిసార్ట్‌లో ఉంటున్న వీరు శనివారం రాజ్‌భవన్‌కు వెళ్లి కర్ణాటక గవర్నర్ వజూభాయ్ వాలాను కలుసుకున్నారు.
భేటీ తర్వాత ఎమ్మెల్యేలు విధాన సౌధను సందర్శించారు. ఐటీ విచారణ ఎదుర్కొంటున్న కర్ణాటక మంత్రి డీకే శివకుమార్ అక్కడ వారితో జత కలిశారు. గుజరాత్ నుంచి జరిగే రాజ్యసభ ఎన్నికల్లో గెలవడానికి బీజేపీ తమను లొంగదీసుకోవడానికి యత్నిస్తోందని ఆరోపించారు. చట్టాన్ని తాను ఉల్లంఘిం చలేదని శివకుమార్ విలేకర్లతో అన్నారు.