వ్యభిచార కూపంలోకి దిగనందుకే అకింతను కిరాతకంగా చంపారనే విషయం సిట్ దర్యాప్తులో వెలుగు చూడడంతో.. అధికారులు ఈ కేసును మరింత లోతుగా విచారణ చేపట్టాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో.. తొమ్మిదేళ్ల కిందట ఇదే తరహాలో ఓ అమ్మాయి కనిపించకుండా పోయిందనే విషయం బయటపడింది. అంతేకాదు ఆ రిసార్ట్‌లో పని చేసిన మాజీ ఉద్యోగులు రిసార్ట్ యాజమాన్యంపై సంచలన ఆరోపణలు చేస్తున్నారు.
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ రిసార్ట్ హత్య కేసు దర్యాప్తులో విస్తుపోయే విషయాలు వెలుగు చూస్తున్నాయి. వ్యభిచార కూపంలోకి దిగనందుకే అకింతను కిరాతకంగా చంపారనే విషయం సిట్ దర్యాప్తులో వెలుగు చూడడంతో.. అధికారులు ఈ కేసును మరింత లోతుగా విచారణ చేపట్టాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో.. ఆ రిసార్ట్‌లో పని చేసిన మాజీ ఉద్యోగులు రిసార్ట్ యాజమాన్యంపై సంచలన ఆరోపణలు చేస్తున్నారు.
ఉత్తరాఖండ్ పౌరీ జిల్లా రిషికేష్ వద్ద ఉన్న వనతారా రిసార్ట్.. అసాంఘిక కార్యకలాపాలకు నెలవుగా ఉండేదని అందులో పని చేసి మానేసిన కొందరు చెప్తున్నారు. రిసార్ట్‌లో అక్రమ మద్యం అమ్మకాలతోపాటు గంజాయి, ఇతర డ్రగ్స్ సరఫరా చేసే వారని.. చివరకు అమ్మాయిలతో వ్యభిచారం కూడా నిర్వహించేవారని వెల్లడించారు చాలామంది. ఆరు నెలల కిందట అక్కడ ఉద్యోగం మానేసిన ఆ ఉద్యోగి అక్కడ తనకు ఎదురైన అనుభవాలను పోలీసులకు, మీడియాకు తెలియజేశాడు. రిసార్ట్‌లో వ్యభిచారం జోరుగా జరుగుతుండేది.
అక్కడికి వచ్చే యువతను మద్యం, మత్తు పదార్థాలతో రిసార్ట్ యాజమాన్యం లొంగదీసుకునేది. వ్యభిచారంలోకి దింపి ఆ అమ్మాయిలతో వీఐపీలను సంతృప్తిపరిచేది. అక్కడి పరిస్థితులపై ఎవరైనా మాట్లాడినా, ఫిర్యాదులు చేయాలని ప్రయత్నించినా దాడి చేసేవారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వకుండా వేధించేవాళ్లు. పోలీసులకు నేను ఫిర్యాదు చేశా. కానీ, తమ పరిధిలోకి రాదని.. స్థానికంగా ఉన్న పట్వారీ(రెవెన్యూ అధికారి)కి ఆ ఫిర్యాదును అందజేశారు. కానీ, ఆయన కూడా వాళ్ల మనిషే. అందుకే నాపై దాడి జరిగింది. మానసికంగానూ నన్ను వేధించారు అని సదరు మాజీ ఉద్యోగి వాపోయాడు.
బీజేపీ(బహిష్కృత) నేత వినోద్ ఆర్య కొడుకు అయిన పుల్కిత్ ఆర్య, మేనేజర్ సౌరభ్ భాస్కర్, అసిస్టెంట్ మేనేజర్ అకింత్ గుప్తాలు వనతారా రిసార్ట్‌ను నిర్వహించేవాళ్లు. ఈ ముగ్గురు రిసార్ట్‌లో రిసెప్షనిస్ట్‌గా పని చేసే 19 ఏళ్ల అకింత భండారిని వ్యభిచారంలోకి దిగాలని, వీఐపీలను సుఖపెట్టాలని ఆమెపై ఒత్తిడి తెచ్చారు. మాట వినని అంకిత.. పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే.. ఆమెను కిరాతకంగా హత్యాచారం చేశారనే ఆరోపణలు ఉన్నాయి.
ఆపై శవాన్ని సమీపంలోని కాలువలో పడేయగా.. పోలీసులు మృతదేహాన్ని అతికష్టం మీద స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన ఉత్తరాఖండ్‌లోనే కాదు యావత్ దేశంలోనూ చర్చనీయాంశంగా మారింది. ఆమెపై హత్యాచారం జరిగిందని బాధిత కుటుంబం.. న్యాయ పోరాటానికి దిగింది. ఈ పోరాటానికి మద్ధతుగా స్థానికులు ఆందోళనలతో పాటు విధ్వంసానికి దిగారు. ఘటనకు కారణమైన రిసార్ట్‌ను అప్పటికే అధికారులు బుల్డోజర్‌లతో కూల్చేయగా.. స్థానికులు మరి కొంత భాగానికి నిప్పు పెట్టారు. అయితే.. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు ద్వారా బాధిత కుటుంబానికి న్యాయం చేస్తానని సీఎం పుష్కర్ ధామి హామీ ఇవ్వడంతో పరిస్థితులు కాస్త చల్లబడ్డాయి.
ఇదీ చదవండి: ఫుల్లుగా తాగొచ్చి మహిళపై అత్యాచారం.. రూంలో లాక్ చేసిన బాధితురాలు
Comments
Please login to add a commentAdd a comment