
శిలలపై హోటల్ కట్టినారు..
చుట్టూ పచ్చదనం.. మధ్యలో సెడర్‌బర్గ్ పర్వతాలు.. వాటి గుహల్లో గదులు.. అదిరిపోయే ఈ హోటల్ దక్షిణాఫ్రికాలో ఉంది. కేప్‌టౌన్‌కు 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ కగ్గా కమ్మా రిసార్ట్ అంటే పర్యాటకులు పడిచస్తారు. సెడర్‌బర్గ్ పర్వతాల్లో ఉన్న గుహల్లో గదులను ఏర్పాటు చేశారు. మరికొన్నింటిని పర్వతాన్ని తొలిచి.. కట్టారు. అంతేకాదు.. దీని చుట్టూ అలా తిరిగొస్తే.. నాటి రాతి యుగంలోకి వెళ్లొచ్చిన అనుభూతి కలుగుతుంది.
పర్వతాలపై 6 వేల ఏళ్ల క్రితం అప్పటి ఆదిమవాసులు చెక్కిన చిత్రాలు నేటికీ దర్శనమిస్తాయి. అంతేకాదు.. గుహల్లో వద్దనుకుంటే.. ఆరుబయట నక్షత్రాలను లెక్కబెడుతూ పడుకునే సదుపాయమూ ఉంది. ఇందులో ఒక రోజు బసకు రూ.15,600 వసూలు చేస్తారు.