ఇదేం జైలు రా సామీ..! ఏకంగా నీటి నడిబొడ్డున.. | Rummu Underwater Prison In Estonia Luxury Beachside Resort | Sakshi
Sakshi News home page

ఇదేం జైలు రా సామీ..! ఏకంగా నీటి నడిబొడ్డున..

Published Sun, Nov 3 2024 7:46 AM | Last Updated on Sun, Nov 3 2024 9:38 AM

Rummu Underwater Prison In Estonia Luxury Beachside Resort

నీటి నడిబొడ్డునున్న ఈ కట్టడం ఒక చెరసాల. ఇది ఇస్టోనియాలోని వసలెమా పారిష్‌ పట్టణ సమీపంలోని  రుమ్ము గ్రామంలో ఉంది. ఒకప్పుడు ఇక్కడ పాలరాతి గనులు, సున్నపురాతి గనులు ఉండేవి. సోవియట్‌ హయాంలో ఇక్కడ రుమ్ము, ముర్రు చెరసాలల్లో బందీలుగా ఉండే ఖైదీలతో ఈ గనుల్లో పనులు చేయించుకునేవారు. గని నుంచి వెలికి తీసిన సున్నపురాతిని శుద్ధి చేయడానికి చాలా నీటిని వాడేవాళ్లు. 

ఈ నీరు గనిని లోతుగా తవ్విన ప్రాంతంలోకి చేరి నిల్వ ఉండటం మొదలైంది. క్రమంగా ఈ నీరు ఖాళీ అయిపోయిన గని ప్రాంతమంతా నిండిపోయి, మడుగులా మారింది. చెరసాల చుట్టూ గనులు తవ్వడంతో ఇప్పుడు రుమ్ము చెరసాల భవనం నీటి మధ్యలో ఇలా మిగిలింది. ముర్రు చెరసాలను 2001లో రుమ్ము చెరసాలలో విలీనం చేశారు. తర్వాత ఈ చెరసాల 2012లో శాశ్వతంగా మూతబడింది. దీనిని చూడటానికి అప్పుడప్పుడు ఆసక్తిగల పరిశోధకులు, విద్యార్థులు ఇక్కడకు వస్తుంటారు.

(చదవండి: బెట్టీ ద ఫ్యాషన్‌ క్వీన్‌)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement