ప్రొద్దుటూరు: వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులోని రాయల్‌కౌంటీ రిసార్ట్‌పై పోలీసులు సోమవారం సాయంత్రం దాడులు నిర్వహించారు. పేకాట ఆడుతున్న టీడీపీ నాయకుడితో సహా మరో 15 మందిని అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.1.06 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో మార్కెట్‌యార్డ్ మాజీ చైర్మన్, టీడీపీ నాయకుడు బండి భాస్కర్‌రెడ్డి కూడా ఉన్నట్టు పోలీసులు తెలిపారు.