విహారంలో విషాదం..ప‌డ‌వ బోల్తా | Ten Of A Family Drown During Picnic At Lake Resort In Pak | Sakshi
Sakshi News home page

ఒకే కుటుంబానికి చెందిన 10 మంది మృతి

Published Tue, Aug 18 2020 12:04 PM | Last Updated on Tue, Aug 18 2020 12:46 PM

Ten Of A Family Drown During Picnic At Lake Resort In Pak - Sakshi

ఇస్లామాబాద్ : రిసార్టులో ప‌డ‌వ బోల్తాప‌డి ఒకే కుటుంబానికి చెందిన 10 మంది చ‌నిపోయిన ఘ‌ట‌న పాకిస్తాన్ ద‌క్షిణ సింధ్ ప్రావిన్స్‌లో చోటుచేసుకుంది. విహార‌యాత్ర  నిమిత్తం కీంజార్ లేక్ రిసార్టుకు  వ‌చ్చిన కుటుంబం అక్క‌డే ఓ ప‌డ‌వ‌ను అద్దెకు తీసుకొని స‌ర‌స్సులో విహ‌రిస్తుండ‌గా ప్ర‌మాద‌వ‌శాత్తూ ప‌డ‌వ బోల్తా ప‌డింది. బ‌ల‌మైన గాలులు వ‌ల్లే ఈ ప్ర‌మాదం జ‌రిగిన‌ట్లు ప్రాథ‌మికంగా అంచ‌నా వేశారు. ఈ ఘ‌ట‌న‌లో ఆరుగురు మహిళలు, ఇద్దరుచిన్నారులు  సహా ఒక కుటుంబంలోని పది మంది కుటుంబ సభ్యులు నీటిలో మునిగి చ‌నిపోగా ముగ్గురు మాత్రం ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వీరిని స్థానిక గ‌జ ఈత‌గాళ్లు ర‌క్షించార‌ని ఓ అధికారి వెల్ల‌డించారు. వారిని వెంట‌నే ఆసుప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్న‌ట్లు తెలిపారు. 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement