Sindh Province
-
Pakistan: లోయలో పడిన బస్సు.. 17 మంది మృత్యువాత
కరాచీ: పాకిస్తాన్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 17 మంది మృతి చెందారు. 38 మంది గాయపడ్డారు. సింధ్, బలోచిస్తోన్ ప్రావిన్స్‌ల సరిహద్దుల్లోని హుబ్ పట్టణ సమీపంలో బుధవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. సింధ్ ప్రావిన్స్‌లోని తట్టా పట్టణానికి చెందిన కొందరు బలోచిస్తాన్‌లోని హుబ్ పట్టణంలోని షా నూరానీ దర్గాకు బుధవారం మధ్యాహ్నం బయలుదేరారు. వారు ప్రయాణిస్తున్న బస్సు రాత్రి 8 గంటల సమయంలో అదుపుతప్పి రోడ్డు పక్కన లోయలో పడిపోయింది. క్షతగాత్రులను అక్కడికి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న కరాచీ నగరంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
అత్యంత పెద్ద కోట ఇది.. అసలు దీని చరిత్ర ఏంటి?
-
పాక్‌లో ముగ్గురు హిందూ బాలికల కిడ్నాప్
కరాచీ: పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లో హిందూ వ్యాపారి ముగ్గురు కూతుళ్లను కిడ్నాప్ చేసి, బలవంతంగా మతం మార్చి ముగ్గురు యువకులు వారిని పెళ్లిళ్లు చేసుకున్నారు. పాకిస్తాన్ దరేవార్ ఇతేహాత్ సంస్థ చీఫ్ శివ కచ్చి ఈ విషయం తెలిపారు. ధార్కి ప్రాంతానికి చెందిన హిందూ వ్యాపారి లీలా రామ్ ముగ్గురు కూతుళ్లు చాందిని, రోష్ని, పరమేశ్ కుమారిలను కొందరు అపహరించుకుపోయారు. బలవంతంగా ఇస్లాంలోకి మార్చి అపహరించిన ముగ్గురు ముస్లింలు వారిని పెళ్లిళ్లు చేసుకున్నారని శివ కచ్చి చెప్పారు. -
Manisha Ropeta: పాకిస్తాన్లో హిందూ మహిళ హిస్టరీ క్రియేట్
దాయాది దేశం పాకిస్తాన్లో మరో అరుదైన ఘటన చోటుచేసుకుంది. అక్కడ హిందువులకు తక్కువ ప్రాధాన్యత ఉంటుంది. వారిని చిన్నచూపు చూస్తారు. కానీ, తాజాగా ఓ హిందూ మహిళ.. పాకిస్తాన్లో సంచలనం క్రియేట్ చేశారు. పోలీసు శాఖలో కీలక బాధ్యతలు అందుకుని.. ప్రపంచ దృష్టిని ఆకర్షించారు. వివరాల ప్రకారం.. పాకిస్తాన్‌కు చెందిన హిందూ మహిళ మనీషా రోపేటా(26) రికార్డులు బ్రేక్ చేశారు. పోలీస్ శాఖలో ఉన్నతంగా భావించే డిప్యూటీ సూపరింటెండెంట్ పదవిని అందుకుందన్న తొలి హిందూ మహిళగా గుర్తింపు పొందారు. ఈ స్థానానికి చేరిన తొలి హిందు మహిళగా హిస్టరీ క్రియేట్ చేశారు. సింధ్ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ నిర్వహిచిన పరీక్ష్లలో 468 మంది అభ్యర్థుల్లో 16వ స్థానంలో మనీషా నిలిచారు. కాగా, ప్రస్తుతం.. మనీషా రోపేటా డీఎస్పీగా లియారీ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉండగా.. సింధ్ ప్రావిన్స్ జకోబాబాద్ చెందిన మనీషా.. మధ్య తరగతి కుటుంబానికి చెందినవారు. ఆమె 13వ ఏట తండ్రి మరణించడంతో.. తల్లి కరాచీకి తీసుకువచ్చి పిల్లలను ఎంతో కష్టపడి చదివించారు. డీఎస్పీగా బాధత్యలు స్వీకరించిన తర్వాత మనీషా రోపేటా మాట్లాడుతూ.. చిన్నతనం నుంచి.. తాను, తన సోదరీమణులు పితృస్వామ్య వ్యవస్థను చూసినట్టు తెలిపారు. సమాజంలో మహిళలు అణచివేతకు గురవుతున్నారని అన్నారు. అలాంటి వారికి అండగా ఉండాలన్న ఉద్దేశ్యంతోనే పోలీస్ ఉద్యోగం కోసం ప్రయత్నించినట్టు స్పష్టం చేశారు. పాకిస్తాన్లో అమ్మాయిలకు ఎక్కువగా.. డాక్టర్ లేదా టీచర్ అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉంటాయని వెల్లడించారు. పోలీసు శాఖల్లో కూడా మహిళా ప్రాతినిథ్యం ఉండాలనే ఉద్దేశ్యంతోనే పోలీస్ శాఖలో చేరినట్లు పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: యుద్ధానికి కాలుదువ్వుతున్న ఉత్తరకొరియా...యూఎస్‌కి స్ట్రాంగ్ వార్నింగ్ -
టోర్నీకి ఎంపిక చేయలేదని యువ క్రికెటర్ ఆత్మహత్యాయత్నం
దేశవాలీ టోర్నీకి ఎంపిక చేయలేదన్న కారణంతో ఒక క్రికెటర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన పాకిస్తాన్లో చోటుచేసుకుంది. విషయంలోకి వెళితే.. షోయబ్ అనే ఫస్ట్‌క్లాస్ క్రికెటర్ సింద్ ప్రావిన్స్‌లోని హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇటీవలే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఇంటర్ సిటీ చాంపియన్‌షిప్‌ను ప్లాన్ చేసింది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అన్ని రాష్ట్రాల క్రికెట్ బోర్డులను కోరింది. కాగా బోర్డులు కోచ్‌ల సలహా మేరకే ట్రయల్స్‌ను నిర్వహించి ఆపై జట్టును ఎంపిక చేస్తున్నారు. ఈ క్రమంలోనే షోయబ్‌ను కోచ్ కనీసం బౌలింగ్ ట్రయల్ కూడా తీసుకెళ్లలేదు. దీంతో హైదరాబాద్ జట్టులో షోయబ్ పేరు గల్లంతయింది. ఈ విషయం తెలుసుకొని తీవ్ర మనస్థాపం చెందిన షోయబ్ ఇంటికి వచ్చి బెడ్రూంకు వెళ్లి తలుపులేసుకున్నాడు. షోయబ్ కోపంగా రావడం చూసిన ఇంటి సభ్యులు బెడ్రూంకు వెళ్లి చూసే లోపలే షోయబ్ తన చేతిని బ్లేడ్‌తో పలుమార్లు కట్ చేసుకొని బాత్రూంలో అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై అతని కుటుంబసభ్యులు స్పందించారు. ''కోచ్ తనను బౌలింగ్ ట్రయల్స్ తీసుకెళ్లలేదని.. దీంతో జట్టుకు ఎంపిక కాలేకపోయాననే బాధతో డిప్రెషన్లోకి వెళ్లిపోయాడు. మేం వెళ్లి చూసేలోపే చేతి కట్ చేసుకొని బాత్రూంలో పడి ఉన్నాడు. వెంటనే ఆసుపత్రికి తరలించాం. ప్రస్తుతం షోయబ్ పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని.. 24 గంటలు గడిస్తే కానీ ఏం చెప్పలేమని వైద్యులు పేర్కొన్నట్లు'' తెలిపారు. అయితే పాకిస్తాన్ క్రికెట్లో ఇది కొత్తేం కాదు. ఇంతకముందు 2018లో అండర్-19 క్రికెటర్ ముహమ్మద్ జర్యాబ్ తనను జట్టులో నుంచి తీసేశారని ఉరి వేసుకొని ఆత్యహత్య చేసుకోవడం అప్పట్లో పెను సంచలనం సృష్టించింది. చదవండి: కొడుకు బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయిన క్రికెటర్.. వీడియో వైరల్ 'ఆ క్రికెటర్ యువ ఆటగాళ్లకు ఒక గుణపాఠం.. చూసి నేర్చుకొండి' -
పాకిస్తాన్లో దారుణం.. యువతి కిడ్నాప్‌నకు యత్నం.. ప్రతిఘటించడంతో..
సాక్షి, న్యూఢిల్లీ: పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లో ఘోరం జరిగింది. 18 ఏళ్ల హిందూ అమ్మాయిని గుర్తు తెలియని వ్యక్తులు తుపాకీతో కాల్చిచంపారు. పూజా ఓద్ అనే యువతిని కిడ్నాప్ చేసేందుకు దుండగులు యత్నించారు. పూజా తీవ్రంగా ప్రతిఘటించడంతో ఆమెపై కాల్పులు జరిపారు. తీవ్ర గాయాలపాలైన బాధితురాలు చికిత్స పొందుతూ ఆస్పత్రిలో కన్నుమూసింది. పాకిస్తాన్లో ఇటువంటి ఘటనలు కొత్తదేం కాదు. ఇలాంటి ఘటనలు అనేకం జరిగాయని మానవ హక్కుల కార్యకర్తలు చెప్తున్నారు. పాకిస్తాన్ మైనారిటీలైన హిందూ, క్రిస్టియన్ మతాలకు చెందిన పలువురిని బలవంతంగా అపహరించి, మత మార్పిడులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతియేడు ఈ తరహా ఘటనలు చూస్తున్నామని ఆవేదన చెందారు. మైనార్టీ కమ్యూనిటీకి చెందిన అమ్మాయిలను కిడ్నాప్ చేసి, బలవంతంగా ఇస్లాం మతం స్వీకరించేసేలా ఒత్తిడి చేస్తున్నారని పేర్కొన్నారు. కానీ, పాకిస్తాన్ ప్రభుత్వం బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. పాకిస్తాన్ మొత్తం జనాభాలో హిందూ కమ్యూనిటీ 1.60 శాతం, సింధ్ ప్రావిన్స్‌లో 6.51 శాతం ఉన్నట్లు ఆ దేశ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. -
11 ఏళ్ల పాకిస్తాన్ మైనర్ బాలుడి పై అత్యాచారం, హత్య
ఇస్లామాబాద్: పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లో 11 ఏళ్ల హిందూ బాలుడుని లైంగిక వేధింపులకు గురిచేసి అత్యంత దారుణంగా హత్య చేసినట్లు స్థానిక మీడియా పేర్కొంది. అంతేకాదు ఆ బాలుడు శవమై ప్రావిన్స్‌లో ఖైర్పూర్ మీర్ ప్రాంతంలోని బబర్లోయ్ పట్టణంలోని ఒక పాడుబడిన ఇంట్లో ఉన్నట్లు గుర్తించామని అతని కుటుంబ సభ్యులు తెలిపారని వెల్లడించింది. ఈ మేరకు ఆ బాలుడు బంధువు రాజ్‌కుమార్ మాట్లాడుతూ..."మా కుటుంబం గురునానక్ పుట్టినరోజు కార్యక్రమాలతో బిజీగా ఉండటంతో మా పిల్లవాడు ఎప్పుడూ అదృశ్యమయ్యాడో మేము గుర్తించలేకపోయాం." అని చెప్పారు. (చదవండి: ప్రపంచంలోనే అత్యంత సంపన్న కుక్క.. వందల కోట్ల వారసత్వ ఆస్తి!) అంతేకాదు ఆ బాలుడు 2011లో జన్మించాడని, ప్రస్తుతం ఐదోతరగతి చదువుతున్నట్లు ఆ బాలుడి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. పైగా ఆ మైనర్ బాలుడి శరీరంపై చిత్రహింసల తాలుకా గుర్తులు కూడా ఉన్నాయని చైల్డ్ ప్రొటెక్షన్ అథారిటీ సుక్కుర్‌కు చెందిన జుబైర్ మహర్ తెలిపారు. అంతేకాదు గత కొన్ని వారాల్లో ప్రావిన్స్‌లో ఇలాంటి ఘటన జరగడం ఇది రెండోసారి అని మహర్ చెబుతున్నారు. ఈ మేరకు బాబర్లోయి పోలీస్ స్టేషన్‌లోని స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్హెచ్ఓ) మాట్లాడుతూ.." నిందితులు అతనిపై లైంగిక వేధింపులకు పాల్పడే ముందు బాలుడిని గొంతు కోసి చంపినట్లు చెప్పారు. మేము ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశాం. పైగా వారిలో ఒకరు నేరాన్ని అంగీకరించారు" అని ఎస్హెచ్ఓ చెప్పారు. (చదవండి: యువత ఆలోచనల్లో మార్పు తెస్తున్న ‘జై భీమ్’..) -
సీఎం ట్వీట్‌పై విమర్శలు: ‘దీపావళికి, హోలీకి తేడా తెలియదా’
ఇస్లామాబాద్: దీపావళి పండుగ నాడు.. హోలీ శుభాకాంక్షలు తెలిపి.. విమర్శల పాలవుతున్నారు పాకిస్తాన్ సింధ్ ప్రాంత ముఖ్యమంత్రి. ఆ వివరాలు.. నవంబర్ 4న ప్రజలు దీపావళి పండుగ జరుపుకున్నారు. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలువురు నాయకులు, రాజకీయవేత్తలు ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. వీరందరి మధ్యలో పాకిస్తాన్ సింధ్ ప్రాంత ముఖ్యమంత్రి తెలిపిన శుభాకాంక్షలు నెటిజనుల దృష్టిని ఆకర్షించాయి. దీపావళి సందర్భంగా సింధ్ ప్రాంత సీఎం మురద్ అలీ షా ట్విటర్లో తన ఫోటోని షేర్ చేశారు. దీని మీద హోలీ శుభాకాంక్షలు అని ప్రింట్ చేయించాడు. ఇది చూసిన నెటిజనులు.. మీకు దీపావళి పండగకి, హోలీకి తేడా తెలియదా అంటూ విమర్శించడం ప్రారంభించారు. పొరపాటు గుర్తించి వెంటనే ఆ ట్వీట్‌ను డిలీట్ చేశారు. కానీ నెటిజనులు అప్పటికే ఆ ట్వీట్‌ను స్క్రీన్‌షాట్ తీసి.. వైరల్ చేశారు. (చదవండి: Diwali 2021: ఈ మీమ్స్ చూస్తే.. నవ్వాపుకోలేరు!!) పాకిస్తాన్‌కు చెందిన జర్నలిస్ట్ ముర్తాజా సోలంగి సీఎం ట్వీట్ స్క్రీన్ షాట్‌ని తన ట్విటర్లో పోస్ట్ చేశారు. ఆ తర్వాత ‘‘సింధ్ ప్రాంత ప్రజల్లో ఎక్కువ మంది హిందువులు. ఇక్కడ విషాదకర అంశం ఏంటంటే.. సింధ్ సీఎం ఆఫీస్‌లో పని చేసే సిబ్బందికి దీపావళికి, హోలీకి తేడా తెలియదు. ఇది చాలా విచారకరం’’ అంటూ ట్వీట్ చేశారు. చదవండి: ఎంత మంచి వాడో.. ప్రతి డెలివరీ బాయ్‌కు గిఫ్ట్ ఇస్తాడట Sindh has the largest number of Hindu population in Pakistan with areas where Hindus are in overwhelming majority. One can only be sad at the state of affairs if the staff at the CM House Sindh doesn’t know the difference between Diwali and Holi. Sad indeed. pic.twitter.com/QdpDe6f3Pl — Murtaza Solangi (@murtazasolangi) November 4, 2021 -
పాక్‌లో ఘోర రైలు ప్రమాదం
కరాచీ: పాకిస్తాన్లో సోమవారం ఉదయం ఘోర రైలు ప్రమాదం జరిగింది. సింధ్ ప్రావిన్సులో రెండు రైళ్లు ఢీకొన్న ఘటనలో 50 మంది చనిపోగా మరో 70 మంది గాయాలపాలయ్యారు. పాక్ ఆర్మీ, పారా మిలటరీ బలగాలు రంగంలోకి దిగి, సహాయ, రక్షణ కార్యక్రమాల్లో నిమగ్నమయ్యాయి. బోగీల్లో మరికొందరు చిక్కుకున్నారని, మృతుల సంఖ్య పెరిగేందుకు అవకాశాలున్నాయని భావిస్తున్నారు.సోమవారం ఉదయం కరాచీ నుంచి సర్గోదా వెళ్తున్న మిల్లత్ ఎక్స్‌ప్రెస్ రైలు బోగీలు పట్టాలు తప్పి, ఎదురుగా ఉన్న పట్టాలపై చెల్లాచెదురుగా పడిపోయాయి. అంతలోనే ఎదురుగా రావల్పిండి నుంచి కరాచీ వైపు వస్తున్న సర్ సయ్యద్ ఎక్స్‌ప్రెస్ రైలు వాటిని ఢీకొట్టింది. ఘోట్కి జిల్లా ధార్కి సమీపంలో జరిగిన ఈ ఘటనలో 50 మంది మరణించారని స్థానిక మీడియా పేర్కొంది. ప్రమాద సమయంలో రైలు సాధారణ వేగంతోనే వెళుతోందని, చూస్తుండగానే మిల్లత్ ఎక్స్‌ప్రెస్ రైలు బోగీలు దొర్లుకుంటూ పట్టాలపైకి రావడం, వాటిని ఢీకొట్టడం క్షణాల్లోనూ జరిగిపోయిందని ఈ ప్రమాదం నుంచి బయటపడిన సర్ సయ్యద్ ఎక్స్‌ప్రెస్ రైలు డ్రైవర్ అయిజాజ్ షా తెలిపారు. క్షతగాత్రుల్లో 25 మంది పరిస్థితి విషమంగా ఉండగా, ప్రమాద సమయంలో రెండు రైళ్లలో కలిపి వెయ్యి మంది వరకు ప్రయాణికులున్నట్లు అధికారులు చెప్పారు. ఈ ఘటనలో 13 నుంచి 14 బోగీలు పట్టాలు తప్పగా ఇందులో 6 నుంచి 8 వరకు పూర్తిగా ధ్వంసమయ్యాయని అధికారులు వెల్లడించారు. బోగీల్లోపల చిక్కుకున్న వారిని వెలుపలికి తీయడానికి భారీ యంత్ర సామగ్రిని రప్పిస్తున్నామని, ఇందుకు కొంత సమయం పడుతుందని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు రూ.15 లక్షల సాయం రైలు ప్రమాద ఘటనపై పాకిస్తాన్ అధ్యక్షుడు ఆరిఫ్ ఆల్వి, ఆ దేశ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘ప్రమాద బాధితులకు సాయం అందించడంతోపాటు ఈ దుర్ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తునకు ఆదేశించాను’అని ఇమ్రాన్ ట్విట్టర్లో తెలిపారు. ఈ ఘటనలో మృతుల కుటుంబాలకు రూ.15 లక్షలు, క్షతగాత్రులకు రూ.1 నుంచి రూ.3 లక్షల వరకు అందజేస్తామని యంత్రాంగం ప్రకటించిందని జియో న్యూస్ వెల్లడించింది. పాక్‌లో తరచూ జరుగుతున్న రైలు ప్రమాదాలకు కాలం చెల్లిన వ్యవస్థ, అవినీతి, నిర్వహణాలోపమే కారణమని రైల్వే మాజీ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ దేశ విభజనకు ముందు కాలం నాటి రైల్వే వ్యవస్థ, పట్టాలనే ఉపయోగిస్తున్నారని ఆయన చెప్పారు. -
పాక్‌లో కాల్పులు.. 9 మంది మృతి
కరాచీ: పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావిన్సుకు చెందిన రెండు గిరిజన తెగల మధ్య జరిగిన గొడవల్లో 9 మంది మరణించారు. మరో అయిదుగురు గాయపడ్డారని అక్కడి మీడియా తెలిపింది. ఇరువర్గాల మధ్య కాల్పులు జరిగా యని చెప్పింది. శనివారం రాత్రి జగిరాని, ఛచార్ తెగల మధ్య ఈ దుర్ఘటన జరిగింది. ఇరు తెగలు ఎంతో కాలం నుంచి వైరం కొనసాగుతోంది. మృతదేహాలను, గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. గొడవల కారణంగా స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. పరిస్థితిని చక్కబెట్టేందుకు భారీగా పోలీసులు రంగంలోకి దిగారు. చదవండి: యుద్ధం కొనసాగుతుందని నెతన్యాహు హెచ్చరిక -
విహారంలో విషాదం..పడవ బోల్తా
ఇస్లామాబాద్ : రిసార్టులో పడవ బోల్తాపడి ఒకే కుటుంబానికి చెందిన 10 మంది చనిపోయిన ఘటన పాకిస్తాన్ దక్షిణ సింధ్ ప్రావిన్స్‌లో చోటుచేసుకుంది. విహారయాత్ర నిమిత్తం కీంజార్ లేక్ రిసార్టుకు వచ్చిన కుటుంబం అక్కడే ఓ పడవను అద్దెకు తీసుకొని సరస్సులో విహరిస్తుండగా ప్రమాదవశాత్తూ పడవ బోల్తా పడింది. బలమైన గాలులు వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ ఘటనలో ఆరుగురు మహిళలు, ఇద్దరుచిన్నారులు సహా ఒక కుటుంబంలోని పది మంది కుటుంబ సభ్యులు నీటిలో మునిగి చనిపోగా ముగ్గురు మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వీరిని స్థానిక గజ ఈతగాళ్లు రక్షించారని ఓ అధికారి వెల్లడించారు. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. -
పాకిస్తాన్లో బాంబు పేలుడు.. ముగ్గురు మృతి
ఇస్లామాబాద్ : పాకిస్తాన్లో శుక్రవారం జరిగిన బాంబు దాడిలో ముగ్గురు మృతి చెందారు. సింధ్ సింధ్ ప్రావిన్స్‌లోని రైల్వే స్టేషన్ సమీపంలో భద్రతా వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగినట్లు పాకిస్తాన్ మీడియా వెల్లడించింది. ఈ ఘటనలో పాకిస్తాన్ భద్రతా దళానికి చెందిన ఇద్దరు సహా, ఒక పౌరుడు మృతిచెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు. క్షతగ్రాతులను స్థానిక ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. సంఘటన జరిగిన గోట్కీ ప్రాంతాన్ని భద్రతా దళాలు చుట్టుముట్టాయి. అయితే ఈ దాడికి బాధ్యత వహిస్తూ ఏ ఉగ్రసంస్థ నుంచి ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన వెలువడలేదు. సాధారణంగా అయితే బలూచిస్తాన్ ప్రావిన్స్ లక్ష్యంగా ఉగ్రదాడులు జరుగుతాయని, సింధ్ ప్రావిన్స్‌లో ఇలాంటి ఘనలు అరుదు అని పాకిస్తాన్ అధికారులు పేర్కొన్నారు. (వ్యాక్సిన్ అన్ని దేశాలకూ అందివ్వాలి: పాకిస్తాన్) At least three people including a Sindh Rangers personnel were dead on Friday in a blast targeting a vehicle of the Rangers in Ghotki: Pakistan media — ANI (@ANI) June 19, 2020 -
పాకిస్తాన్‌కు సాయం నిలిపివేయండి: అల్తాఫ్
లండన్: మైనార్టీలపై అకృత్యాలకు పాల్పడుతున్న పాకిస్తాన్‌కు అందిస్తున్న సైనిక సహాయాన్ని నిలిపివేయాలని ముత్తహిద కైమీ ఉద్యమ నేత అల్తాఫ్ హుసేన్ అమెరికాకు విజ్ఞప్తి చేశారు. తద్వారా సింధు, బలూచిస్తాన్, ఖైబర్ ఫంక్తువా, గిల్గిట్ బల్టిస్తాన్‌లో నివసించే మైనార్టీలకు వేధింపుల నుంచి విముక్తి లభిస్తుందన్నారు. ఆల్- ఖైదా, తాలిబన్, లష్కర్-ఎ-తొయిబా, జైషే మహ్మద్ వంటి ఉగ్రసంస్థలను పాక్ ఐఎస్ఐ సృష్టించిందని.. వందలాది మంది ఉగ్రవాదులను తయారు చేసిందని దుయ్యబట్టారు. ప్రజాస్వామ్య ముసుగులో ఐఎస్ఐ చేస్తున్న అకృత్యాలకు అడ్డూఅదుపూ లేకుండా పోయిందని మండిపడ్డారు. ప్రజలను అత్యంత అణచివేతకు గురిచేసే ప్రపంచంలో ఏకైక ప్రభుత్వాన్ని నడిపిస్తోంది సైన్యమే అంటూ ఘాటు విమర్శలు చేశారు.(పాక్‌లో హిందువులపై పెచ్చుమీరుతున్న అకృత్యాలు) ఈ మేరకు అల్తాఫ్ పెంటగాన్‌కు లేఖ రాశారు. ‘‘పాకిస్తాన్ సైన్యం సింధు, బలూచిస్తాన్, కేపీకే, గిల్టిట్ బల్టిస్తాన్ ప్రాంతాలను ఆక్రమించింది. మైనార్టీలపై పాశవిక, క్రూర చర్యలకు పాల్పడుతోంది. నేటికీ అక్కడ అణచివేత కొనసాగుతోంది. శక్తిమంతమైన నిర్ణయాలు తీసుకునే మీ అధికారులు మరో కీలక నిర్ణయం తీసుకునే సమయం ఆసన్నమైంది. పాకిస్తాన్‌కు అందిస్తున్న పౌర, సైన్య సహకారాన్ని నిలిపివేయండి’’అని లేఖలో కోరారు. ఇక అమెరికాలో ఆగ్రహజ్వాలలకు కారణమైన నల్ల జాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ హత్యపై కూడా అల్తాఫ్ స్పందించారు. నిరసనకారులను శాంతింపజేసేందుకు అధికారులు తమ శాయశక్తులా కృషి చేస్తున్నారని.. అదే విధంగా జాతి వివక్షను పూర్తిగా నిర్మూలించే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. (లాక్డౌన్ ఎత్తివేస్తాం.. ఆ శక్తి లేదు: ఇమ్రాన్ ఖాన్) కాగా పాకిస్తాన్లో మైనార్టీలపై జరుగుతున్న అకృత్యాలను ప్రశ్నించేందుకు ముత్తాహిద కౌమీ ఉద్యమం పేరిట అల్తాఫ్ హుసేన్ 1984, మార్చి 18న పార్టీని స్థాపించారు. సెక్యూలర్ పార్టీగా పేరొందిన ఎంక్యూఎమ్ ప్రస్తుతం రెండు వర్గాలు చీలిపోయింది. ఎమ్‌క్యూఎమ్- లండన్ బాధ్యతలను అల్తాఫ్ పర్యవేక్షిస్తుండగా.. పాకిస్తాన్‌లోని పార్టీ విభాగాన్ని ఖాలిద్ మక్బూల్ సిద్ధిఖీ నడిపిస్తున్నారు. ముజాహిర్ల(పాకిస్తాన్‌కు వలస వచ్చిన ఉర్దూ మాట్లాడే ముస్లింలు) హక్కులకై పోరాడే ఎంక్యూఎమ్ 1990-1999 మధ్య కాలంలో పాకిస్తాన్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించింది. చదవండి: హాంకాంగ్‌పై చైనా ఆధిపత్యం.. నేపాల్, పాకిస్తాన్ మద్దతు -
‘అవును ఆమెపై అత్యాచారం చేసి చంపేశారు’
ఇస్లామాబాద్ : పాకిస్తాన్లో అనుమానాస్పదంగా మృతి చెందిన హిందూ విద్యార్థినిపై అత్యాచారం జరిగిందని పోస్ట్‌మార్టం నివేదిక వెల్లడించింది. గొంతు నులమడం వల్లే ఊపిరాడక ఆమె చనిపోయినట్లు గురువారం పేర్కొంది. అత్యాచారం జరిగిన కాసేపటి తర్వాతే బాధితురాలు ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించింది. కాగా సింధ్ ప్రావిన్స్‌లోని లర్ఖానా జిల్లాలోని బీబీ ఆసిఫా డెంటల్ కాలేజీ విద్యార్థిని చాందిని(పేరు మార్చాం) సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేవారు. ఈ క్రమంలో ఈ ఏడాది సెప్టెంబర్ 16న తన గదిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లుగా వార్తలు వెలువడ్డాయి. అయితే తన సోదరి ఆత్మహత్య చేసుకునేంత పిరికి కాదని.. కచ్చితంగా ఆమెను ఎవరో హత్య చేసి ఉంటారంటూ ఆమె సోదరుడు పోలీసులను ఆశ్రయించాడు. ఈ నేపథ్యంలో ఘటనాస్థలిలో దొరికిన ఆధారాలు, బాధితురాలి దుస్తులపై ఉన్న రక్తపు మరకలను వైద్యులు విశ్లేషించిన క్రమంలో ఆమె హత్య గావించబడినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఇక ఈ కేసుకు సంబంధించి 32 మందితో పాటు మృతురాలి కాల్‌డేటా ఆధారంగా తోటి విద్యార్థులైన మెహ్రాన్ అబ్రో, అలీ షాన్ మెమన్లను అనుమానితులుగా భావించి అదుపులోకి తీసుకున్నారు. కేసు విషయమై కాలేజీలో విచారించగా బాధితురాలు తన హాస్టల్ గదిలోనే సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకొని చనిపోయిందని కాలేజీ యాజమాన్యం తెలిపింది. అయితే అటాప్సీ నివేదికలో ఆమెపై అత్యాచారం జరిగిందని తేలడంతో ఈ కేసు క్లిష్టతరంగా మారింది. ఈ క్రమంలో ఘటనపై మరింత లోతుగా దర్యాప్తు చేయాల్సిందిగా సింధ్ ప్రభుత్వం ఆదేశించింది. (చదవండి : షాకింగ్ : యువతి మృతదేహంలో యువకుడి డీఎన్ఏ) -
దైవదూషణ: హిందువుల ఇళ్లు, ఆలయాలపై దాడి
కరాచీ: పాకిస్థాన్ సింధ్ ప్రావిన్స్‌లోని ఘోట్కి పట్టణంలో హిందువుల ఇళ్లు, ఆలయాలు లక్ష్యంగా దాడులు జరిగాయి. ఓ స్కూలుకు చెందిన హిందూ ప్రిన్సిపాల్ దైవదూషణ చేశాడన్న ఆరోపణల నేపథ్యంలో ఈ ప్రాంతంలో ఒక్కసారిగా హింస చెలరేగింది. ఘోట్కి పట్టణంలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలు, మూకదాడులపై పాకిస్థాన్ మానవ హక్కుల కమిషన్ తీవ్రంగా స్పందించింది. ఈ ఘటనలపై ఆందోళన వ్యక్తం చేసింది. ఇక్కడ చోటుచేసుకున్న మూక దాడుల్లో హిందువుల ఇళ్లు, దుకాణాలు, ఆలయాలు ధ్వంసమైనట్టు మానవ హక్కుల సంస్థ ట్విటర్లో పేర్కొంది. వరల్డ్ సింధీ కాంగ్రెస్ అనే సంస్థ కూడా ఘోట్కి పట్టణంలో చోటుచేసుకున్న మూకదాడులపై ఆందోళన వ్యక్తం చేసింది. పాకిస్థాన్‌లోని మతమైనారిటీలకు రక్షణ కల్పించేవిధంగా ఇతర దేశాలు ఆ దేశంపై ఒత్తిడి తీసుకురావాలని అభ్యర్థించింది. ‘ఘోట్కి పట్టణంలోని హిందూ కమ్యూనిటీపై దాడులు జరుగుతున్నాయి. హిందూ స్కూల్ ప్రిన్సిపాల్ దైవదూషణ చేశాడని ఓ విద్యార్థి ఆరోపించడంతో ప్రిన్సిపాల్ స్కూలుతోపాటు హిందువుల ఆలయాలు, దుకాణాలు, ఇళ్లను ధ్వంసం చేశారు’ అని వరల్డ్ సింధీ కాంగ్రెస్ ట్విటర్లో పేర్కొంది. ఘోట్కి పట్టణంలో ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని పోలీసులు పేర్కొన్నట్టు పాక్ మీడియా పేర్కొంది. దైవదూషణ చేసిన హిందు ప్రిన్సిపాల్‌ను అరెస్టు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నట్టు తెలిపింది. అధికారులు మాత్రం దాడులకు కారణమైన గుర్తించి చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. ఘోట్కితోపాటు మీర్పూర్ మథెలో, అదిల్‌పూర్ ప్రాంతాల్లో కూడా హింస చోటుచేసుకున్నట్టు డాన్ పత్రిక పేర్కొంది. భారత్‌లో మత మైనారిటీలపై దాడులు జరుగుతున్నాయని, వారికి రక్షణ లేకుండాపోయిందని ఒకవైపు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోపిస్తున్న సమయంలోనే పాక్‌లోని హిందు మైనారిటీలపై దాడులు జరగడం గమనార్హం. -
పాకిస్తాన్లో మరో దురాగతం
ఇస్లామాబాద్: దాయాది దేశం పాకిస్తాన్లో మరో దురాగతం చోటుచేసుకుంది. మైనార్టీ వర్గమైన సిక్కు పూజారి కుమార్తెను ముస్లిం యువకుడు బలవంతంగా వివాహం చేసుకున్న ఘటన మరువక ముందే మరో సంఘటన వెలుగులోకి వచ్చింది. సింధు ప్రావిన్స్‌లో ఓ హిందూ యువతిని బలవంతంగా మత మార్పిండి చేయించి ఓ ముస్లిం యువకుడు వివాహం చేసుకున్నాడు. యువతి తండ్రి తెలిపిన వివరాల ప్రకారం.. బీబీఏ చదువుతున్న తన కుమార్తె ఆగస్ట్ 29న ఇంటినుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదన్నారు. అయితే సదరు యువతిని తన క్లాస్‌మెట్స్ బాబార్ అమర్, మీర్జా దిల్వార్ కలిసి అపహరించుకుపోయారని, ఆ తరువాత మత మార్పిడి చేయించి అమర్ వివాహం చేసుకున్నారని స్థానిక మీడియాలో వార్తలు వచ్చినట్ల తెలిపారు. దీనిపై యువతి తండ్రి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారిద్దరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆ యువతి మాట్లాడుతూ... అమర్, మీర్జా తనను కిడ్నాప్ చేశారని, అనంతరం ఇస్లాం మతంలోకి మార్పించి బలవంతంగా పెళ్లి చేకున్నాడని తెలిపింది. ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తామని స్థానిక పోలీసులు తెలిపారు. అయితే మీర్జా దిల్వార్ పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సారథ్యంలోని పాకిస్తాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ (పీటీఐ) సభ్యురాలిగా తెలింది. కాగా గడిచిన వారం రోజుల్లోనే ఇలాంటి ఘటనలు రెండు జరగడం గమన్హారం. యువతలను ఎత్తుకెళ్లి మతం మార్చి ముస్లిం యువకులకు ఇచ్చి పెళ్లి చేయడం లాంటి ఘటనలు పాక్‌లో ఇటీవల బాగా పెరిగాయి. తాజా ఘటన వారంలో రెండోది కాగా, రెండు నెలల్లో ఇది మూడోదని పాకిస్తాన్‌కు చెందిన హిందూ ఎన్జీవో ఆల్ పాకిస్తాన్ హిందూ పంచాయత్ తెలిపింది. చదవండి: పాక్‌లో సిక్కు యువతి మత మార్పిడి! -
పాక్ ఎన్నికల్లో హిందూ మహిళ పోటీ
కరాచీ: పాకిస్తాన్లో తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న హిందూ మహిళగా సింధ్ ప్రావిన్సుకు చెందిన సునీతా పర్మార్ (31) రికార్డు సృష్టించారు. జూలై 25న అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా, థార్పార్కర్ జిల్లాలోని సింధ్ అసెంబ్లీ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా సునీత బరిలో నిలిచారు. పాక్‌లో అల్ప సంఖ్యాకవర్గమైన హిందువులు అత్యధికంగా ఉండేది థార్పార్కర్ జిల్లాలోనే. గత ప్రభుత్వాలు ఈ ప్రాంత అభివృద్ధిపై నిర్లక్ష్యంగా వ్యవహరించాయనీ, 21వ శతాబ్దంలోనూ అక్కడ అమ్మాయిలు చదువుకోవడానికి సరైన సౌకర్యాల్లేవనీ, కనీస వైద్య సదుపాయాలు కూడా లేవని ఆమె పేర్కొన్నారు. -
పాక్ ఎన్నికల బరిలో హిందూ మహిళ
కరాచీ : ముస్లింలు మెజారిటీ వర్గంగా ఉన్న పాకిస్తాన్లో ఓ హిందూ మహిళ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీలో నిలిచి చరిత్ర సృష్టించారు. సింధ్ ప్రావిన్స్‌కు చెందిన 31 ఏళ్ల సునీత పర్మార్ జూలై 25న జరిగే అసెంబ్లీ ఎన్నికలకు తార్పర్కర్ జిల్లాలోని సింధ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలో నిలిచారు. మైనార్టీ వర్గాల నుంచి అసెంబ్లీ ఎన్నికలకు పోటీ చేస్తున్న తొలి మహిళ సునీతనే కావడం విశేషం. ఏ పార్టీ మద్దతు లేకున్న ఆమె స్వతంత్ర అభ్యర్థిగా పోరాండేందుకు సిద్ధమయ్యారు. ఈ ఏడాది మార్చిలో కూడా హిందూ దళిత మహిళ కృష్ణకుమారి కోల్హీని పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) ఆ దేశ సెనెట్‌కు నామినేట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో పోటీ చేయడంపై సునీత మాట్లాడుతూ.. గత ప్రభుత్వాలు ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమయినందు వల్లే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. 21 శతాబ్ధంలో కూడా ఈ ప్రాంతంలో మహిళలకు కనీస విద్య, వైద్య వసతులు లేకపోవడం దారుణమని మండిపడ్డారు. మహిళలు బలహీనులు, భయస్థులు అనే రోజులు పోయాయన్నారు. గెలుపుపై తనకు పూర్తి విశ్వాసం ఉందని స్పష్టం చేశారు. తాను గెలిస్తే నియోజవర్గంలోని మహిళలకు మెరుగైన విద్య, వైద్య సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తానని తెలిపారు. స్త్రీలకు మెరుగైన విద్యను అందించడం ద్వారా వారు శక్తివంతంగా తయారవుతారని ఆమె అభిప్రాయపడ్డారు. కాగా 2017 లెక్కల ప్రకారం తార్పర్కర్ జిల్లాలోని 16 లక్షల జనాభాలో దాదాపు సగం మంది హిందువులే. -
భార్యపై మంత్రి కాల్పులు.. ఆపై సూసైడ్
ఇస్లామాబాద్ : పాకిస్థాన్‌లో ఓ మంత్రి దారుణ చర్యకు పాల్పడ్డాడు. తన భార్యపై కాల్పులు జరిపి హత్య చేసి అనంతరం అదే తుపాకితో తనను తాను కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పాకిస్థాన్ పీపుల్స్ పార్టీకి చెందిన మిర్ హజర్ ఖాన్ బిజారాణి, ఫరిహా రజాక్ భార్యా భర్తలు. ఆయన సింద్ ప్రావిన్స్‌కు మంత్రిగా ఉంటూ ఆ ప్రాంత అభివృద్ధి కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఆయన భార్య ఓ జర్నలిస్టు. అయితే, ఇటీవల వారి మధ్య తరుచు కుటుంబ పరమైన వివాదాలు నెలకొన్నట్లు సమాచారం. గురువారం రాత్రి కరాచీలోని తమ నివాసంలో ఆ ఇద్దరు రక్తపు మడుగులో పడిఉన్నారు. మంత్రి తలకు బుల్లెట్ గాయం ఉండగా ఆయన భార్య శరీరంలోకి మూడు బుల్లెట్లు దూసుకుపోయాయి. ఆ తుపాకీ కూడా అక్కడే ఉంది. దాంతో ఆత్మహత్యకు పాల్పడటానికి ముందు హజర్ తన భార్యను చంపేసి అనంతరం తన ప్రాణాలు తీసుకున్నట్లు పోలీసులు ఓ అంచనాకు వచ్చారు. -
హిందూ ఆలయాన్ని ధ్వంసం చేశారు!
పాకిస్థాన్‌లో ఘటన కరాచీ: పాకిస్థాన్ దక్షిణ సింధూ ప్రావిన్స్‌లో ఓ హిందూ ఆలయాన్ని కొందరు దుండగులు ధ్వంసం చేశారు. థాట్ట జిల్లా ఘరో పట్టణంలో శుక్రవారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. ఆలయంలోని ప్రధాన దేవతావిగ్రహాలను ధ్వంసం చేసి.. సమీపంలో ఉన్న చెత్తకుప్పలో పడేశారు. దీంతో పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదుచేశారు. దైవదూషణ, ఉగ్రవాదం అభియోగాల కింద కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటివరకు నిందితులను ఎవరినీ అరెస్టు చేయలేదని తెలిపారు. నెలవారీ పూజాకార్యక్రమాల నిర్వహణ కోసం ఆలయంలో ఏర్పాటుచేస్తున్న సమయంలో శుక్రవారం అర్థరాత్రి దుండగులు ఆలయంలోకి ప్రవేశించి.. ఈ దుర్మార్గానికి పాల్పడ్డారని, అర్ధరాత్రి ఒంటి గంట నుంచి ఐదుగంటల మధ్య వారు ఆలయంలోని విగ్రహాలను ఎత్తుకెళ్లి ధ్వంసం చేశారని, ఉదయం పూజల కోసం ఆలయానికి వచ్చిన హిందూ భక్తులు ఆలయంలో దేవతామూర్తులు లేకపోవడం దిగ్భ్రాంతపోయరని స్థానిక హిందూ కౌన్సిలర్ లాల్ మహేశ్వరి తెలిపారు. ఆలయ చరిత్రలో ఇలాంటి ఘటన ఇప్పటివరకు జరగలేదని చెప్పారు. ఘరో పట్టణంలో రెండువేలు కుటుంబాలు ఉండగా అందులో మెజారిటీ హిందువులే ఉన్నారు. -
ప్రేమపెళ్లికి 17 లక్షల జరిమానా
కరాచీ: ప్రేమించి పెళ్లి చేసుకున్న పాపానికి పాకిస్తాన్ కు చెందిన ఓ వ్యక్తికి అక్కడి జిర్గా (స్థానిక పంచాయతీ) రూ.17 లక్షల జరిమానా వేసింది. ఆ జంటను మూడు నెలలపాటు గ్రామం నుంచి బహిష్కరిస్తూ ఇటీవల హుకుం జారీచేసింది. దక్షిణ సింధ్ ప్రావిన్సులోని కంధ్‌కోట్ కషో్మరే జిల్లాలోని ఓ గ్రామంలో ఈ ఘటన జరిగింది. కొన్ని నెలల క్రితం సదరు వ్యక్తి అమ్మాయి ఇష్టంతోనే చట్టబద్ధంగా పెళ్లి చేసుకున్నాడు. అయితే తమ అమ్మాయిని పెళ్లి చేసుకుని పరువు తీశాడనీ, ఇందుకు జరిమానా కట్టాలని ఆమె పుట్టింటివారు జిర్గాలో ఫిర్యాదు చేశారు. కోర్టుల్లో కేసుల భారాన్ని తగ్గించుకునేందుకు గత నెలలోనే పాక్ ప్రభుత్వం జిర్గాల తీర్పులను చట్టబద్ధం చేసింది. -
93 మదర్సాలకు ఉగ్రవాదులతో లింక్
కరాచీ: సింధ్ ప్రావిన్స్‌లో దాదాపు 93 మదర్సాలకు ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నట్లు ఓ నివేదిక వెల్లడించింది. అవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఉగ్రవాద సంస్థలతో, పాక్‌లో నిషేధించిన తీవ్ర భావజాలం ఉన్న సంస్థలతో సంబంధాలు ఉన్నట్లు ఆ నివేదిక పేర్కొంది. దీంతో ప్రస్తుతం ఆ మదర్సాలన్నింటిపై వెంటనే చర్యలు తీసుకోవాలని సింధ్ ప్రాంత ముఖ్యమంత్రి మురాద్ అలీ షా రక్షణ బలగాలకు ఆదేశించినట్లు సమాచారం. పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ సంస్థలు సింధ్ ప్రావిన్స్‌లోని పరిస్థితులపై సర్వే చేయగా అక్కడి కొన్ని మదర్సాలు ఉగ్రవాదానికి హబ్ లుగా మారాయని గుర్తించి ఆ విషయాన్ని ముఖ్యమంత్రి మురాద్ కు వివరించాయి. దీంతో ఈ అంశంపై ప్రత్యేకంగా మంగళవారం ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు.దీనికి పాక్ రేంజర్స్ డైరెక్టర్ జనరల్ మేజర్ జనరల్ బిలాల్ అక్బర్, ఇతర ముఖ్య నేతలు కూడా హాజరయ్యారు. వీరంతా కలిసి మదర్సాలు చేస్తున్న చర్యలను తీవ్ర ఖండించారు. అలాంటి వాటిని ఏమాత్రం ప్రోత్సహించరాదని, వెంటనే వాటిపై చర్యలు తీసుకోవాలని ఆ సమావేశంలో రక్షణ బలగాల అధికారులకు సీఎం ఆదేశించారు. త్వరలోనే అలాంటి మదర్సాలపై చర్యలు ప్రారంభం కానున్నాయి. -
పాక్‌లో భానుడి ప్రతాపం.. 641మంది మృతి
కరాచీ: మనల్ని మాత్రం ఇప్పటికే చిరుజల్లులు పలుకరించి చల్లటి గాలులు అలుముకుంటుండగా పాకిస్థాన్‌ను మాత్రం వడగాలులు వణికిస్తున్నాయి. రంజాన్ ప్రారంభమైన గత శుక్రవారం నుంచి మంగళవారం వరకు వేడిగాలుల వల్ల 630 మందికిపైగా మృత్యువాతపడ్డారు. ముఖ్యంగా కరాచీ ప్రాంతంలో చనిపోయేవారి సంఖ్య ఎక్కువగా ఉంది. దీంతో పలు ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితిని విధించారు. వెంటనే పరిస్థితిని సమీక్షించి చక్కదిద్దాల్సిందిగా అధికారులకు అదేశాలు జారీ చేశారు. దాదాపు కొన్న దశాబ్దాల తర్వాత పాకిస్థాన్‌లో ఇలాంటి పరిస్థితి దాపురించింది. అక్కడ బాణుడు భగభగ మండిపోతుండటంతో జనాలు బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. ప్రభుత్వ ఆరోగ్యశాఖ సమాచారం మేరకు మంగళవారం చనిపోయిన మరోపదిమందితో కలిపి వడగాలుల వల్ల చనిపోయిన వారి సంఖ్య 641కి చేరింది. మితిమీరిన వేడిగాలుల వల్ల వడదెబ్బతగిలి..రక్తపోటు పడిపోతుండటంతో మరణాలు సంభవిస్తున్నాయని వైద్యులు చెప్తున్నారు. కరాచీలో గత శుక్రవారం నుంచి ఇప్పటివరకు వరుసగా 44 డిగ్రీల నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ఆందోళనకర పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే వేలమందికి ఆయా ఆస్పత్రుల్లో వైద్య పరీక్షలు అందిస్తున్నారు. -
బాంబు పేలుడు: పట్టాలు తప్పిన ఎక్స్‌ప్రెస్ రైలు
కరాచీ: పాకిస్థాన్ సింధు ప్రావెన్స్లో రైల్వే ట్రాక్‌పై బాంబు పేలుడు సంభవించింది. ఆ సమయంలో ట్రాక్‌పై వెళ్తున్న జాఫర్ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన మూడు బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో 10 మంది రైలు ప్రయాణికులు గాయపడ్డారని పాకిస్థాన్ రైల్వే అధికార ప్రతినిధి వెల్లడించారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. జాఫర్ ఎక్స్‌ప్రెస్ రావల్పిండి నుంచి క్విట్టాకు వెళ్తున్న క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుందని పేర్కొన్నారు. పేలుడు వల్ల రైల్వే ట్రాక్ ధ్వంసమైందని... సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలో పలు రైళ్లను వేరే మార్గంలో నడిపిస్తున్నట్లు వివరించారు. అయితే ఈ ఘటనకు తామే బాధ్యులమంటూ ఏ సంస్థ ప్రకటించలేదు. -
గ్రెనేడ్ దాడిలో మంత్రి సోదరుడి హతం
పాకిస్థాన్‌లో సామాన్య పౌరులకే కాదు ప్రధానులు, మంత్రులు, వారి కుటుంబ సభ్యులకూ రక్షణ దొరకదనే వాస్తవం మరోసారి రుజువైంది. సింధ్ ప్రావిన్స్‌కు మంత్రిగా వ్యవహరిస్తోన్న అబాదీ జావెద్ నగోరి కార్యాలయంపై శుక్రవారం సాయంత్రం గుర్తుతెలియని దుండగులు హ్యాండ్ గ్రెనేడ్స్, తుపాకులతో జరిపిన దాడిలో మంత్రి సోదరుడు అక్బర్ నగోరి దుర్మరణం చెందారు. లయారీ ప్రాంతంలోని మంత్రి కార్యాలయంపై దుండగులు జరిపినదాడిలో అక్బర్ సహా మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న భద్రతా బలగాలు క్షతగాత్రుల్ని ఆసుపత్రికి తరలించగా చికిత్సపొందుతూ మంత్రి సోదరుడు అక్బర్ మరణించారు. పెషావర్ సైనిక పాఠశాలపై ఉగ్రదాడి అనంతరం పాక్ సర్కార్ ముష్కరులపట్ల కఠినంగా వ్యవహరిస్తున్నందుకు ప్రతీకారంగానే ఈ దాడి జరిగినట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. ఘటనపై సమగ్ర దర్యాప్తునకు సింధ్ ప్రావిన్స్ ముఖ్యమంత్రి ఖయీమ్ అలీ షా ఆదేశాలు జారీచేశారు.