భార్యపై మంత్రి కాల్పులు.. ఆపై సూసైడ్‌ | Pakistan Minister Shoots Wife | Sakshi
Sakshi News home page

భార్యపై మంత్రి కాల్పులు.. ఆపై సూసైడ్‌

Feb 3 2018 9:22 AM | Updated on Aug 30 2019 8:37 PM

Pakistan Minister Shoots Wife - Sakshi

భార్యాపై కాల్పులు జరిపి తనను కాల్చుకున్న పాక్‌ మంత్రి మిర్‌ హజర్‌ ఖాన్‌ బిజారాణి

ఇస్లామాబాద్‌ : పాకిస్థాన్‌లో ఓ మంత్రి దారుణ చర్యకు పాల్పడ్డాడు. తన భార్యపై కాల్పులు జరిపి హత్య చేసి అనంతరం అదే తుపాకితో తనను తాను కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పాకిస్థాన్‌ పీపుల్స్‌ పార్టీకి చెందిన మిర్‌ హజర్‌ ఖాన్‌ బిజారాణి, ఫరిహా రజాక్‌ భార్యా భర్తలు. ఆయన సింద్‌ ప్రావిన్స్‌కు మంత్రిగా ఉంటూ ఆ ప్రాంత అభివృద్ధి కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఆయన భార్య ఓ జర్నలిస్టు. అయితే, ఇటీవల వారి మధ్య తరుచు కుటుంబ పరమైన వివాదాలు నెలకొన్నట్లు సమాచారం.

గురువారం రాత్రి కరాచీలోని తమ నివాసంలో ఆ ఇద్దరు రక్తపు మడుగులో పడిఉన్నారు. మంత్రి తలకు బుల్లెట్‌ గాయం ఉండగా ఆయన భార్య శరీరంలోకి మూడు బుల్లెట్లు దూసుకుపోయాయి. ఆ తుపాకీ కూడా అక్కడే ఉంది. దాంతో ఆత్మహత్యకు పాల్పడటానికి ముందు హజర్‌ తన భార్యను చంపేసి అనంతరం తన ప్రాణాలు తీసుకున్నట్లు పోలీసులు ఓ అంచనాకు వచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement