ఇస్లామాబాద్ : పాకిస్తాన్‌లో శుక్రవారం జరిగిన బాంబు దాడిలో ముగ్గురు మృతి చెందారు. సింధ్ సింధ్ ప్రావిన్స్‌లోని రైల్వే స్టేషన్ సమీపంలో భద్రతా వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగినట్లు పాకిస్తాన్ మీడియా వెల్లడించింది. ఈ ఘటనలో పాకిస్తాన్ భద్రతా దళానికి చెందిన ఇద్దరు సహా, ఒక పౌరుడు మృతిచెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు. క్షతగ్రాతులను స్థానిక ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. సంఘటన జరిగిన గోట్కీ ప్రాంతాన్ని భద్రతా దళాలు చుట్టుముట్టాయి. అయితే ఈ దాడికి బాధ్యత వహిస్తూ ఏ ఉగ్రసంస్థ నుంచి ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన వెలువడలేదు. సాధారణంగా అయితే బలూచిస్తాన్ ప్రావిన్స్ లక్ష్యంగా ఉగ్రదాడులు జరుగుతాయని, సింధ్ ప్రావిన్స్‌లో ఇలాంటి ఘనలు అరుదు అని పాకిస్తాన్ అధికారులు పేర్కొన్నారు.
(వ్యాక్సిన్ అన్ని దేశాలకూ అందివ్వాలి: పాకిస్తాన్)
At least three people including a Sindh Rangers personnel were dead on Friday in a blast targeting a vehicle of the Rangers in Ghotki: Pakistan media
— ANI (@ANI) June 19, 2020
Comments
Please login to add a commentAdd a comment