సునీతా పర్మార్
కరాచీ: పాకిస్తాన్‌లో తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న హిందూ మహిళగా సింధ్ ప్రావిన్సుకు చెందిన సునీతా పర్మార్ (31) రికార్డు సృష్టించారు. జూలై 25న అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా, థార్పార్కర్ జిల్లాలోని సింధ్ అసెంబ్లీ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా సునీత బరిలో నిలిచారు. పాక్‌లో అల్ప సంఖ్యాకవర్గమైన హిందువులు అత్యధికంగా ఉండేది థార్పార్కర్ జిల్లాలోనే. గత ప్రభుత్వాలు ఈ ప్రాంత అభివృద్ధిపై నిర్లక్ష్యంగా వ్యవహరించాయనీ, 21వ శతాబ్దంలోనూ అక్కడ అమ్మాయిలు చదువుకోవడానికి సరైన సౌకర్యాల్లేవనీ, కనీస వైద్య సదుపాయాలు కూడా లేవని ఆమె పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment