ప్రేమపెళ్లికి 17 లక్షల జరిమానా | 17 lakh fine to newly love married couple | Sakshi
Sakshi News home page

ప్రేమపెళ్లికి 17 లక్షల జరిమానా

Mar 10 2017 8:19 AM | Updated on Sep 5 2017 5:38 AM

ప్రేమపెళ్లికి 17 లక్షల జరిమానా

ప్రేమపెళ్లికి 17 లక్షల జరిమానా

ప్రేమించి పెళ్లి చేసుకున్న పాపానికి పాకిస్తాన్ కు చెందిన ఓ వ్యక్తికి అక్కడి జిర్గా (స్థానిక పంచాయతీ) రూ.17 లక్షల జరిమానా

కరాచీ: ప్రేమించి పెళ్లి చేసుకున్న పాపానికి పాకిస్తాన్ కు చెందిన ఓ వ్యక్తికి అక్కడి జిర్గా (స్థానిక పంచాయతీ) రూ.17 లక్షల జరిమానా వేసింది. ఆ జంటను మూడు నెలలపాటు గ్రామం నుంచి బహిష్కరిస్తూ ఇటీవల హుకుం జారీచేసింది. దక్షిణ సింధ్‌ ప్రావిన్సులోని కంధ్‌కోట్‌ కషో్మరే జిల్లాలోని ఓ గ్రామంలో ఈ ఘటన జరిగింది.

కొన్ని నెలల క్రితం సదరు వ్యక్తి అమ్మాయి ఇష్టంతోనే చట్టబద్ధంగా పెళ్లి చేసుకున్నాడు. అయితే తమ అమ్మాయిని పెళ్లి చేసుకుని పరువు తీశాడనీ, ఇందుకు జరిమానా కట్టాలని ఆమె పుట్టింటివారు జిర్గాలో ఫిర్యాదు చేశారు. కోర్టుల్లో కేసుల భారాన్ని తగ్గించుకునేందుకు గత నెలలోనే పాక్‌ ప్రభుత్వం జిర్గాల తీర్పులను చట్టబద్ధం చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement