
కరాచీ: పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావిన్సుకు చెందిన రెండు గిరిజన తెగల మధ్య జరిగిన గొడవల్లో 9 మంది మరణించారు. మరో అయిదుగురు గాయపడ్డారని అక్కడి మీడియా తెలిపింది. ఇరువర్గాల మధ్య కాల్పులు జరిగా యని చెప్పింది. శనివారం రాత్రి జగిరాని, ఛచార్ తెగల మధ్య ఈ దుర్ఘటన జరిగింది. ఇరు తెగలు ఎంతో కాలం నుంచి వైరం కొనసాగుతోంది. మృతదేహాలను, గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. గొడవల కారణంగా స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. పరిస్థితిని చక్కబెట్టేందుకు భారీగా పోలీసులు రంగంలోకి దిగారు.
చదవండి: యుద్ధం కొనసాగుతుందని నెతన్యాహు హెచ్చరిక
Comments
Please login to add a commentAdd a comment