shootout
-
సిటీలోనే షెల్టర్? బిహార్ నుంచి వచ్చి ఇక్కడే మకాం
సాక్షి, హైదరాబాద్: కర్ణాటకలోని బీదర్‌తో పాటు మన నగరంలోని అఫ్జల్‌గంజ్ ప్రాంతంలో తుపాకీతో విరుచుకుపడిన దుండగులు ఇక్కడే షెల్టర్ తీసుకున్నారా? అంటే.. ఔననే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. నగరంలో వీరి వ్యవహారశైలి, నేరం జరిగిన తీరు, వినియోగించిన వాహనంతో పాటు ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకున్న దర్యాప్తు అధికారులు ఈ అంచనాకు వచ్చారు. దీంతో దుండగులు బస చేసే అవకాశం ఉన్న ప్రాంతాల కోసం ఆరా తీస్తున్నారు. మరోపక్క దుండగులు గురువారం సాయంత్రం ట్రాలీ బ్యాగ్స్ కంటే ముందే కొత్త బ్యాక్ ప్యాక్ సైతం ఖరీదు చేశారు. రోషన్ ట్రావెల్స్ పక్కన ఉన్న దోశ కింగ్ హోటల్లోనే తమ బ్యాగ్‌లో నుంచి తుపాకీ తదితరాలను తీసి కొత్త బ్యాక్ ప్యాక్‌లో పెట్టుకున్నట్లు తేలింది. బిహార్ టు బీదర్ వయా సిటీ.. నేరం జరిగిన తీరు, ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలను పరిగణనలోకి తీసుకున్న దుండగులు హైదరాబాద్ మీదుగానే బీదర్ వెళ్లినట్లు పోలీసులు భావిస్తున్నారు. నిందితులు బిహార్‌కు చెందిన వారుగా ప్రాథమిక ఆధారాలు లభించాయి. బీదర్‌లోని శివాజీ జంక్షన్ వద్ద ఎస్బీఐ ఏటీఎం కేంద్రాల్లో డబ్బు నింపే సీఎంఎస్ ఏజెన్సీ వాహనాన్ని కొల్లగొట్టడానికి దుండగులు బైక్‌పై వచ్చారు. ఈ వాహనానికి ‘ఏపీ’ రిజి్రస్టేషన్‌తో కూడిన నంబర్ ప్లేట్ ఉంది. ఇది అసలుదైనా, నకిలీదైనా వాహనం మాత్రం హైదరాబాద్, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో చోరీ చేసిందని భావిస్తున్నారు. చోరీ చేసిన వాహనంతోనే రెక్కీ? నగరంలోని ఒక లాడ్జిలో రెండు మూడు రోజులు బస చేసిన దుండగులు చోరీ చేసిన వాహనం పైనే బీదర్ వెళ్లి వస్తూ రెక్కీ చేసి ఉంటారని, అందుకే నేరం చేసిన తర్వాత కూడా రాయ్‌పూర్ వెళ్లడానికి అఫ్జల్‌గంజ్‌కు వచ్చి ఉంటారని అంచనా వేస్తున్నారు. శనివారం బీదర్ పోలీసులతో కలిసి చేసిన తనిఖీల నేపథ్యంలో రెండు అనుమానాస్పద వాహనాలను స్వా«దీనం చేసుకున్నారు. వీటిలో దుండగులు వాడింది ఏదనేదానిపై ఆరా తీస్తున్నారు. తిరుమలగిరి నుంచి మళ్లీ వెనక్కి... ఈ నేరగాళ్లకు హైదరాబాద్‌లోని ప్రాంతాలు, రహదారులకు సంబంధించి పూర్తి అవగాహన ఉన్నట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. గురువారం రాత్రి అఫ్జల్‌గంజ్‌లో ఫైరింగ్ తర్వాత అక్కడ నుంచి ఆటోలో ఎస్కేప్ అయ్యారు. సికింద్రాబాద్ అల్ఫా హోటల్ వద్ద ఆటో దిగిన దుండగులు డ్రైవర్‌కు డబ్బు ఇచ్చి పంపేశారు. ఆపై అక్కడ నుంచి మరో ఆటో మాట్లాడుకుని తిరుమలగిరి చౌరస్తాకు చేరుకున్నారు. ఆ ఆటో కూడా దిగిపోయిన ఇరువురూ రోడ్డు దాటి నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లారు. అక్కడే దుస్తులు మార్చుకున్నారు. పాత బ్యాగ్స్, బ్యాక్ ప్యాక్‌తో పాటు వ్రస్తాలను పడేశారు. ఆపై రోడ్డు మీదికి వచ్చి మరో ఆటో ఎక్కారు. ఆ ఆటో తిరిగి సికింద్రాబాద్ వైపే వెళ్లినట్లు సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. దీంతో ఈ ఆటో ఎటు వెళ్లిందో తెలుసుకోవడంతో పాటు డ్రైవర్‌ను గుర్తించడానికి అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ నాలుగు ప్రాంతాల్లో లోతుగా ఆరా... శనివారం ఉదయం నుంచి ఈ నేరానికి ముందు ఏం జరిగిందనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. దుండగులు బస చేసి ఉంటారనే అనుమానంతో నాంపల్లి, సికింద్రాబాద్, కాచిగూడ, అఫ్జల్‌గంజ్ చుట్టుపక్కల ప్రాంతాల్లోని లాడ్జిల్లో ఆరా తీస్తున్నారు. దర్యాప్తు అధికారులకు కీలక ఆధారం దొరికినట్లు సమాచారం. మనీష్ గ్యాంగ్ పనేనా? బీదర్‌తో పాటు నగరంలోని కొన్ని సీసీ కెమెరాల్లో లభించిన దుండగుల ఫొటోలను పోలీసులు దేశంలోని అన్ని రాష్ట్రాల పోలీసులకు పంపారు. వీటిలో ఉన్న ఓ దుండగుడు తమ రాష్ట్రానికి చెందిన మోస్ట్ వాంటెడ్ మనీష్ కుషా్వహా అంటూ సమాచారం ఇచ్చారు. అతని కోసం ముమ్మరంగా గాలించడం మొదలెట్టారు. బిహార్ పోలీసులు ఆ ఫొటోలను అక్కడి నిరంజన గ్రామంలో ఉండే మనీష్ తల్లిదండ్రులకు చూపించారు. వాళ్లు అది తమ కుమారుడి ఫొటో కాదని చెప్పడంతో దర్యాప్తు మళ్లీ మొదటికి వచ్చింది. వారిచెప్పింది వాస్తవమా? కాదా? నేరం చేసింది మనీష్ నేతృత్వంలోని గ్యాంగ్ కాదా? అనే కోణాలను పరిశీలిస్తున్నారు. పోలీసుల వద్ద తుపాకీ ఉండాల్సిందే ‘సాక్షి’ కథనానికి స్పందించిన సిటీ సీపీఅఫ్జల్గంజ్ కాల్పుల ఉదంతం నేపథ్యంలో నగర పోలీసు విభాగంలో ఉన్న లోపాలను ఎత్తి చూపిస్తూ ‘సరి చేయకుంటే సమస్యలెన్నో!’ శీర్షికన ‘సాక్షి’లో శనివారం ప్రచురితమైన కథనంపై కొత్వాల్ సీవీ ఆనంద్ స్పందించారు. దీనిపై ఆయన శనివారం ఉన్నతాధికారులతో విస్తృత స్థాయి సమీక్ష నిర్వహించారు. క్షేత్రస్థాయి విధుల్లో ఉండే పోలీసులు, టాస్క్‌ఫోర్స్ వంటి ప్రత్యేక విభాగాలకు చెందిన అధికారులు, సిబ్బంది తమ వెంట తుపాకులు ఉంచుకోకపోవడాన్ని ఆయన తీవ్రంగా పరిగణించారు. శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజల ప్రాణాలు, ఆస్తులు రక్షించడం కోసం పని చేసే అధికారులు తమ వెంట కచి్చతంగా పోలీసు విభాగం ఇచి్చన తుపాకీ ఉంచుకోవాలని స్పష్టం చేశారు. వీరితో పాటు ప్రత్యేక విభాగాల్లో పని చేస్తున్న వారిలో ఎవరికైనా తుపాకీ జారీ అనివార్యమైతే ఆ కోణంలో తక్షణం చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. పోలీసులు తమ వద్ద ఉండే తుపాకులను కేవలం అత్యవసర సందర్భాలు, అవసరమైనప్పుడు మాత్రమే వాడాలని ఆనంద్ స్పష్టం చేశారు. కేవలం తుపాకీ కలిగి ఉండటమే కాదని... క్రమం తప్పకుండా ఫైరింగ్ ప్రాక్టీస్ చేయించాలని కొత్వాల్ నిర్ణయించారు. లా అండ్ ఆర్డర్‌తో పాటు అన్ని విభాగాల్లో పని చేస్తున్న వారితో దశల వారీగా దీన్ని చేయించాలని స్పష్టం చేశారు. నగరంలో పని చేయని సీసీ కెమెరాలకు మరమ్మతులు చేయించడంతో పాటు కొత్తవాటి ఏర్పాటు, అనుసంధానానికి ప్రాధాన్యం ఇవ్వాలని సీవీ ఆనంద్ నిర్ణయించారు. -
'దస్' కా దమ్..
ఒలింపిక్స్‌లో భారత పురుషుల హాకీ జట్టు మరో అద్భుతాన్ని చూపించింది. టోక్యోలో మూడేళ్ల క్రితం నాటి జోరును పునరావృతం చేస్తూ సెమీఫైనల్‌కు చేరింది. అప్పటిలాగే ఈసారి కూడా ప్రత్యర్థి బ్రిటన్. నాడు నిర్ణీత సమయంలోనే భారత్ విజయం సాధించగా, ఇప్పుడు క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ షూటౌట్‌కు చేరింది. తుది ఫలితం మాత్రమే సేమ్ టు సేమ్. భారత ఆటగాళ్లంతా చురుకైన ఆటతో సత్తా చాటగా, ఎప్పటిలాగే గోల్ కీపర్ శ్రీజేశ్ అసాధారణ గోల్ కీపింగ్ జట్టును గెలిపించింది. మూడు క్వార్టర్ల పాటు ఒక ఆటగాడిని కోల్పోయి పది మందితోనే టీమిండియా కొనసాగినా... పదునైన డిఫెన్స్‌తో మన జట్టు ప్రత్యర్థిని నిలువరించగలిగింది. మరో మ్యాచ్ గెలిచి ఫైనల్ చేరితే గత ఒలింపిక్స్‌కంటే మెరుగైన ఫలితంతో భారత్ సగర్వంగా నిలుస్తుంది. పారిస్: ఒలింపిక్స్‌లో వరుసగా రెండో పతకం సాధించే దిశగా భారత పురుషుల హాకీ జట్టు ఆశలు రేపుతోంది. స్ఫూర్తిదాయక ఆటతీరు కనబర్చిన మన జట్టు పారిస్ఒలింపిక్స్లో సెమీఫైనల్లోకి ప్రవేశించింది. ఆదివారం జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ సింగ్ నాయకత్వంలోని భారత జట్టు ‘షూటౌట్’లో బ్రిటన్ను ఓడించింది. నిర్ణీత సమయంలో ఇరు జట్లు 1–1తో సమంగా నిలవగా... ‘షూటౌట్’లో భారత్ 4–2తో పైచేయి సాధించింది. ఇరు జట్లు హోరాహోరీగా తలపడిన పోరులో భారత్ తరఫున కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ 22వ నిమిషంలో, బ్రిటన్ తరఫున లీ మార్టన్ 27వ నిమిషంలో గోల్స్ సాధించారు. ‘షూటౌట్’లో భారత్ తరఫున హర్మన్‌ప్రీత్ సింగ్, సుఖ్జీత్ సింగ్, లలిత్ కుమార్ ఉపాధ్యాయ్, రాజ్‌కుమార్ గోల్స్ చేయగా... బ్రిటన్ ఆటగాళ్లలో జేమ్స్ ఆల్బరీ, జాక్ వలాస్ మాత్రమే గోల్స్ కొట్టారు. కానర్ విలియమ్సన్, ఫిలిప్ రాపర్ విఫలమయ్యారు. రాపర్ గోల్‌ను శ్రీజేశ్ అద్భుతంగా నిలువరించిన తర్వాత భారత్ 3–2తో ఆధిక్యంలో నిలవగా... నాలుగో షాట్‌ను రాజ్‌కుమార్ గోల్‌గా మలచడంతో భారత బృందం సంబరం చేసుకుంది. ఫలితం తేలిపోవడంతో చివరిదైన ఐదో షాట్‌ను బ్రిటన్ తీసుకోలేదు. జర్మనీ, అర్జెంటీనా జట్ల మధ్య జరిగే నాలుగో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ విజేతతో భారత జట్టు మంగళవారం జరిగే సెమీఫైనల్లో తలపడుతుంది. ఒకవేళ సెమీఫైనల్లో భారత్ ఓడిపోతే గురువారం కాంస్య పతకం కోసం పోటీపడుతుంది. సెమీస్‌లో గెలిస్తే మాత్రం 1980 మాస్కో ఒలింపిక్స్ తర్వాత మళ్లీ విశ్వ క్రీడల్లో భారత్‌కు ఫైనల్ బెర్త్ ఖరారవుతుంది. ఆరంభంలో బ్రిటన్ చాలా దూకుడుగా ఆడుతూ వరుసగా దాడులు చేసింది. తొలి ఐదు నిమిషాల్లోనే ఆ జట్టుకు రెండు పెనాల్టీ కార్నర్లు లభించగా, భారత్ వాటిని నిలువరించింది. 11వ నిమిషంలో కూడా బ్రిటన్ జట్టు పెనాల్టీ కార్నర్ ద్వారా చేసిన ప్రయత్నం వృథా అయింది. భారత్ కూడా తొలి క్వార్టర్లో రెండు పెనాల్టీలు సంపాదించినా వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయింది. రెండో క్వార్టర్ కూడా ఇదే తరహాలో సాగింది. అయితే 22వ నిమిషంలో లభించిన పెనాల్టీని హర్మన్‌ప్రీత్ గోల్‌గా మలచడంతో ఆధిక్యం దక్కింది. కానీ మరో ఐదు నిమిషాలకే వేగంగా దూసుకొచ్చిన లీ మార్టన్ చేసిన గోల్ ప్రయత్నాన్ని కీపర్ శ్రీజేశ్ ఆపడంలో విఫలం కావడంతో స్కోరు సమమైంది. మూడో క్వార్టర్లో కూడా బ్రిటన్‌కు మూడు పెనాల్టీలు రాగా శ్రీజేశ్ సమర్థంగా అడ్డుకున్నాడు. ఆ తర్వాత చివరి వరకు ఇరు జట్లు మరో గోల్ కోసం ఎంతగా ప్రయత్నించినా సఫలం కాలేకపోయాయి. బెల్జియంకు షాక్ మరోవైపు డిఫెండింగ్ చాంపియన్, ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌లో ఉన్న బెల్జియం జట్టు పారిస్ ఒలింపిక్స్ నుంచి నిష్క్రమించింది. ఆదివారం జరిగిన రెండో క్వార్టర్ ఫైనల్లో స్పెయిన్ 3–2తో టోక్యో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత బెల్జియం జట్టును బోల్తా కొట్టించింది. తద్వారా 2008 బీజింగ్ ఒలింపిక్స్ తర్వాత స్పెయిన్ జట్టు మళ్లీ సెమీఫైనల్‌కు చేరుకుంది. మూడో క్వార్టర్ ఫైనల్లో నెదర్లాండ్స్ 2–0తో ఆస్ట్రేలియా జట్టును ఓడించి సెమీఫైనల్లో స్పెయిన్‌తో పోరుకు సిద్ధమైంది. రోహిదాస్‌కు రెడ్ కార్డ్ మ్యాచ్‌లో జరిగిన ఒక అనూహ్య ఘటన భారత్‌ను మ్యాచ్ ఆసాంతం ఇబ్బంది పెట్టింది. 17వ నిమిషంలో భారత డిఫెండర్ అమిత్ రోహిదాస్ స్టిక్ బ్రిటన్ ఫార్వర్డ్ విలియమ్ కల్నాన్ తలకు తగిలింది. వీడియో రీప్లే చూస్తే అతను ఉద్దేశపూర్వకంగా చేసినట్లు అనిపించకపోయినా... మ్యాచ్ రిఫరీ తీవ్ర చర్య తీసుకున్నాడు. రోహిదాస్‌కు ‘రెడ్ కార్డ్’ చూపించడంతో అతను మైదానాన్ని వీడాల్సి వచ్చింది. దాంతో మిగిలిన మ్యాచ్ మొత్తం భారత్ 10 మందితోనే ఆడింది. మిడ్ ఫీల్డర్ మన్‌ప్రీత్ సింగ్ డిఫెండర్‌గా బాధ్యత తీసుకోవాల్సి వచ్చింది. దీనిపై భారత జట్టు అప్పీల్ చేసింది. దీనిపై వాదనల అనంతరం రోహిదాస్ తప్పు చేసినట్లు తేలితే అతనిపై ఒక మ్యాచ్ నిషేధం (సెమీఫైనల్) పడే అవకాశం ఉంది. చివరి వరకు స్కోరును సమంగా ఉంచడం తప్ప మాకు మరో ప్రత్యామ్నాయం లేకపోయింది. అందుకే పూర్తిగా డిఫెన్స్‌పైనే దృష్టి పెట్టాల్సి వచ్చింది. పది మందితో ఆడటం మ్యాచ్‌లో కఠిన సమయం. కానీ ఏమీ చేయలేం. ఆటగాళ్లంతా సమష్టి ప్రదర్శన కనబర్చారు. పరిస్థితులు ఎలా ఉన్నా ఇదే తరహా మానసిక దృఢత్వంతో సెమీస్ ఆడతాం. శ్రీజేశ్ దిగ్గజం. తొలి మ్యాచ్ నుంచి అతను మమ్మల్ని ఆదుకుంటూనే ఉన్నాడు. –హర్మన్‌ప్రీత్ సింగ్, భారత కెప్టెన్ గోల్ కీపర్‌గా నా బాధ్యత నెరవేర్చాను. ఈ రోజు భారత్‌కు కలిసొచ్చింది. షూటౌట్లో షాట్ తీసుకున్న భారత ఆటగాళ్లెవరూ నిరాశపర్చలేదు. వారు స్కోరు చేయడం వల్ల నాలో నమ్మకం మరింత పెరిగింది. మైదానంలోకి అడుగు పెట్టినప్పుడు ఇది నా ఆఖరి మ్యాచ్ కావచ్చు లేదా బాగా ఆడితే మరో రెండు మ్యాచ్‌లు ఆడవచ్చని అనుకున్నాను. సెమీస్ ప్రత్యర్థి ఎవరైనా ఇలాగే ఆడతాం. –పీఆర్ శ్రీజేశ్, భారత గోల్‌కీపర్7 ఒలింపిక్స్ హాకీలో బ్రిటన్ జట్టుపై భారత్ గెలుపొందడం ఇది ఏడోసారి. రెండు జట్లు విశ్వ క్రీడల్లో ఇప్పటి వరకు పది సార్లు తలపడ్డాయి. మూడు మ్యాచ్‌ల్లో బ్రిటన్ నెగ్గింది. చివరిసారి 2000 సిడ్నీ ఒలింపిక్స్‌లో భారత జట్టుపై బ్రిటన్ గెలిచింది.52 వరుసగా రెండు ఒలింపిక్స్ క్రీడల్లో భారత పురుషుల హాకీ జట్టు సెమీఫైనల్ చేరడం 52 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. భారత జట్టు 1936 బెర్లిన్ ఒలింపిక్స్ నుంచి 1972 మ్యూనిక్ ఒలింపిక్స్ వరకు కనీసం సెమీఫైనల్ దశ దాటింది. 1976 మెక్సికో ఒలింపిక్స్‌లో భారత్ గ్రూప్ దశలోనే నిష్క్రమించింది. 1980 మాస్కో ఒలింపిక్స్‌లో ఫైనల్ చేరడంతోపాటు స్వర్ణ పతకాన్ని సాధించింది. -
‘షూటౌట్’లో భారత పురుషుల హాకీ జట్టు గెలుపు!
అంట్వర్ప్ (బెల్జియం): అంతర్జాతీయ హాకీ సమాఖ్య ప్రొ లీగ్‌లో భారత జట్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. పురుషుల జట్టు ‘షూటౌట్’లో 5–4తో అర్జెంటీనాపై నెగ్గింది. నిర్ణీత సమయం ముగిసే సరికి ఇరుజట్లు 2–2తో సమంగా నిలిచాయి.భారత్ తరఫున మన్దీప్ (11వ ని.లో), లలిత్ (55వ ని.లో)... అర్జెంటీనా తరఫున మార్టినెజ్ (20వ ని.లో), థామస్ డొమినె (60వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. ‘షూటౌట్’లో హర్మన్‌ప్రీత్, సుఖ్జీత్ చెరో రెండు గోల్స్ చేయగా, అభిషేక్ ఒక గోల్ చేశాడు. రాజ్‌కుమార్, లలిత్ విఫలమయ్యారు.ప్రత్యర్థి జట్టులో మైకో రెండు గోల్స్ కొట్టగా, లుకాస్, టోబియస్ ఒక్కో గోల్ చేశారు. ముగ్గురు విఫలమవడంతో భారత్ నెగ్గింది. ఇదే వేదికపై జరిగిన మరో మ్యాచ్‌లో భారత మహిళల జట్టు 0–5 గోల్స్‌తో అర్జెంటీనా చేతిలో ఓడింది.ఇవి చదవండి: ప్రిక్వార్టర్స్‌లో సింధు -
ఆ్రస్టేలియా చేతిలో భారత్ ‘షూటౌట్’
రూర్కెలాలో జరుగుతున్న ప్రొ హాకీ లీగ్‌లో భారత్‌కు అనూహ్య పరాజయం ఎదురైంది. శనివారం ఆ్రస్టేలియాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ షూటౌట్లో 0–3 గోల్స్ తేడాతో ఓటమిపాలైంది. రెగ్యులర్ టైమ్‌లో ఇరు జట్లు 2–2తో సమంగా నిలిచాయి. భారత్ తరఫున 20వ నిమిషంలో హర్మన్‌ప్రీత్ సింగ్, 29వ నిమిషంలో అమిత్ రోహిదాస్ పెనాల్టీ కార్నర్ల ద్వారా గోల్స్ సాధించారు. ఆ్రస్టేలియా ఆటగాళ్లలో 23వ నిమిషంలో పెనాల్టీ స్ట్రోక్ ద్వారా బ్లేక్ గోవర్స్ గోల్ చేయగా...53వ నిమిషంలో టామ్ క్రెయిగ్ మరో గోల్‌తో స్కోరును సమం చేశాడు. దాంతో మ్యాచ్ ‘షూటౌట్’కు వెళ్లింది. ఇందులో ఆ్రస్టేలియా తరఫున షాట్ ఆడిన ముగ్గురూ టామ్ వికామ్, ఆగిల్వీ ఫ్లయిన్, టిమ్ బ్రాండ్ సఫలం కాగా...భారత్ తరఫున ప్రయత్నించిన ముగ్గురు లలిత్ కుమార్, సుఖ్జీత్ సింగ్, ఆకాశ్‌దీప్ సింగ్ గోల్ చేయడంలో విఫలమయ్యారు. ఆ్రస్టేలియాకు లభించిన నాలుగు పెనాల్టీ కార్నర్లతో పాటు ఒక పెనాల్టీ స్ట్రోక్‌ను కూడా సమర్థంగా నిలువరించి పట్టుదల కనబర్చిన భారత్‌కు ఈ తుది ఫలితం తీవ్ర నిరాశ కలిగించింది. -
‘షూటౌట్’లో భారత్ ఓటమి
చియాంగ్ మాయ్ (థాయ్‌లాండ్): కింగ్స్ కప్ అంతర్జాతీయ ఫుట్‌బాల్ టోర్నమెంట్లో భారత జట్టు మూడో స్థానం కోసం పోటీపడనుంది. ఇరాక్ జట్టుతో గురువారం జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో భారత జట్టు ‘పెనాల్టీ షూటౌట్’లో 4–5 గోల్స్ తేడాతో ఓడిపోయింది. నిర్ణీత సమయం ముగిసేసరికి రెండు జట్లు 2–2తో సమంగా నిలిచాయి. టోర్నీ నిబంధనల ప్రకారం అదనపు సమయం ఆడించకుండా నేరుగా ‘షూటౌట్’ ద్వారా ఫలితాన్ని నిర్ణయించారు. ‘షూటౌట్’లో తొలి షాట్‌ను భారత ప్లేయర్ బ్రాండన్ ఫెర్నాండెజ్ గోల్ పోస్ట్‌కు కొట్టాడు. ఆ తర్వాత సందేశ్ జింగాన్, సురేశ్, అన్వర్ అలీ, రహీమ్ అలీ గోల్స్ చేశారు. ఇరాక్ తరఫున ఐదుగురు ఆటగాళ్లూ గోల్స్ సాధించడంతో భారత్‌కు ఓటమి తప్పలేదు. అంతకుముందు భారత్ తరఫున మహేశ్ 16వ నిమిషంలో తొలి గోల్ చేశాడు. 28వ నిమిషంలో కరీమ్ అలీ గోల్‌తో ఇరాక్ స్కోరును 1–1తో సమం చేసింది. 51వ నిమిషంలో ఇరాక్ కెపె్టన్ జలాల్ హసన్ సెల్ఫ్ గోల్‌తో భారత్ 2–1తో ఆధిక్యంలోకి వెళ్లింది. 79వ నిమిషంలో అయ్‌మెన్ గోల్‌తో ఇరాక్ 2–2తో స్కోరును సమం చేసింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 70వ స్థానంలో ఉన్న ఇరాక్‌పై భారత్ ఏనాడూ గెలవలేదు. ఇప్పటి వరకు రెండు జట్లు ఏడుసార్లు తలపడ్డాయి. ఆరు మ్యాచ్‌ల్లో ఇరాక్ నెగ్గగా, మరో మ్యాచ్ ‘డ్రా’ అయింది. లెబనాన్, థాయ్‌లాండ్ జట్ల మధ్య రెండో సెమీఫైనల్ పరాజిత జట్టుతో మూడో స్థానం కోసం భారత్ తలపడుతుంది. -
భారత్ ‘షూటౌట్’ విజయం
లండన్: ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్‌లో భాగంగా శనివారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 4–2 (షూటౌట్)లో ఇంగ్లండ్‌ను ఓడించింది. నిర్ణీత సమయంలో ఇరు జట్లు 4–4 గోల్స్‌తో సమంగా నిలవగా...ఆ తర్వాత భారత్ ఆధిపత్యం ప్రదర్శించింది. భారత్ తరఫున హర్మన్‌ప్రీత్ సింగ్ (6వ నిమిషం), మన్దీప్ సింగ్ (18వ, సుఖ్జీత్ సింగ్ (27వ), అభిషేక్ (49వ) ఒక్కో గోల్ సాధించగా, ఇంగ్లండ్ తరఫున వార్డ్ స్యామ్ ఒక్కడే 4 గోల్స్ (7వ, 39వ, 46వ, 52వ నిమిషాల్లో) చేయడం విశేషం. అనంతరం షూటౌట్లో భారత్‌నుంచి మన్‌ప్రీత్ సింగ్, హర్మన్‌ప్రీత్ సింగ్, లలిత్ ఉపాధ్యాయ్, అభిషేక్ సఫలం కాగా, ఇంగ్లండ్‌నుంచి కాల్నాన్ విల్, వాలన్ జాచరీ మాత్రమే గోల్ చేయగలిగారు. సొంతగడ్డపై ఆరంభంలో ఇంగ్లండ్ వరుసగా దాడులు చేయగా, భారత గోల్ కీపర్ కృష్ణన్ పాఠక్ వాటిని సమర్థంగా అడ్డుకోగా, భారత్‌కు లభించిన తొలి పెనాల్టీ కార్నర్‌ను కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ గోల్‌గా మలచగలిగాడు. 25 సెకన్ల లోపే వార్డ్ గోల్‌తో ఇంగ్లండ్ స్కోరు సమం చేయగా...మన్దీప్, సుఖ్‌జీత్‌లో ఫీల్డ్ గోల్స్‌తో తొలి అర్ధ భాగం ముగిసే సరికి భారత్ ఆధిక్యంలో నిలిచింది. మూడో క్వార్టర్లో, ఆపై నాలుగో క్వార్టర్ ఆరంభంలో కూడా ఒక్కో గోల్ సాధించి వార్డ్ ‘హ్యాట్రిక్’ పూర్తి చేయడంతో స్కోరు 3–3తో సమమైంది. ఐదు నిమిషాల తర్వాత మరో గోల్‌తో భారత్ ముందంజలో నిలిచినా, వార్డ్ తన నాలుగో గోల్‌తో మళ్లీ ఇంగ్లండ్‌ను ఆదుకున్నాడు. అయితే షూటౌట్లో చివరకు భారత్‌దే పైచేయి అయింది. -
హైదరాబాద్ లో అర్థరాత్రి కాల్పుల కలకలం
-
FIH Pro League: ‘షూటౌట్’లో భారత్ గెలుపు
రూర్కెలా: సొంతగడ్డపై ప్రొ హాకీ లీగ్ దశను భారత పురుషుల జట్టు విజయంతో ముగించింది. ఆస్ట్రేలియా జట్టుతో బుధవారం జరిగిన రౌండ్ రాబిన్ లీగ్ మ్యాచ్‌లో టీమిండియా ‘షూటౌట్’లో 4–3 గోల్స్ తేడాతో గెలుపొందింది. అంతకుముందు నిర్ణీత సమయం పూర్తయ్యాక రెండు జట్లు 2–2తో సమఉజ్జీగా నిలిచాయి. రెగ్యులర్ టైమ్‌లో భారత్ తరఫున వివేక్ సాగర్ ప్రసాద్ (2వ ని.లో), సుఖ్జీత్ సింగ్ (47వ ని.లో)... ఆస్ట్రేలియా తరఫున నాథన్ ఎఫార్మస్ (37వ ని.లో), టిమ్ హోవర్డ్ (52వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. ‘షూటౌట్’లో తొలి ఐదు షాట్లలో భారత్ నుంచి కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్, సుఖ్జీత్ సింగ్, దిల్‌ప్రీత్ సింగ్ సఫలమవ్వగా... హార్దిక్ సింగ్, వివేక్ సాగర్ ప్రసాద్ విఫలమయ్యారు. ఆస్ట్రేలియా తరఫున జేక్ హార్వీ, క్రెయిగ్ మరైస్, జాక్ వెల్చ్ గోల్స్ చేయగా... జేక్ వెటన్, నాథన్ ఎఫార్మస్ గురి తప్పారు. దాంతో ‘షూటౌట్’లో రెండు జట్లు 3–3తో సమంగా నిలిచాయి. ‘సడెన్‌డెత్’లో తొలి షాట్‌ను హర్మన్‌ప్రీత్ గోల్‌గా మలచగా... ఆస్ట్రేలియా ప్లేయర్ జాక్ వెల్చ్ షాట్‌ను భారత గోల్‌కీపర్ శ్రీజేశ్ నిలువరించడంతో టీమిండియా విజయం ఖాయమైంది. -
Hockey World Cup 2023: హాకీ జగజ్జేత జర్మనీ
భువనేశ్వర్: 13 ఏళ్ల విరామం తర్వాత జర్మనీ జట్టు పురుషుల హాకీలో జగజ్జేతగా నిలిచింది. ఆదివారం జరిగిన ప్రపంచకప్ హాకీ టోర్నీ ఫైనల్లో జర్మనీ ‘షూటౌట్’లో 5–4తో డిఫెండింగ్ చాంపియన్ బెల్జియం జట్టును ఓడించింది. నిర్ణీత సమయం ముగిసే సరికి రెండు జట్లు 3–3తో సమంగా నిలిచాయి. దాంతో విజేతను నిర్ణయించడానికి ‘షూటౌట్’ నిర్వహించారు. ‘షూటౌట్’లో నిర్ణీత ఐదు షాట్ల తర్వాత రెండు జట్లు 3–3తో సమంగా నిలిచాయి. ‘సడెన్ డెత్’లో తొలి షాట్లో రెండు జట్ల ఆటగాళ్లు సఫలమయ్యాయి. రెండో షాట్లో జర్మనీ సఫలంకాగా... బెల్జియం ఆటగాడు విఫలంకావడంతో జర్మనీ విజయం ఖరారైంది. ఈ గెలుపుతో ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్ జట్ల తర్వాత మూడుసార్లు ప్రపంచకప్ నెగ్గిన మూడో జట్టుగా జర్మనీ గుర్తింపు పొందింది. జర్మనీ 2002, 2006ల లో టైటిల్ నెగ్గింది. కాంస్య పతకం మ్యాచ్‌లో నెదర్లాండ్స్ 3–1తో ఆస్ట్రేలియాను ఓడించింది. -
FIFA World Cup 2022: క్రొయేషియా కేక
దోహా: లీగ్ దశలో రెండు ప్రపంచ మాజీ చాంపియన్ జట్లపై (జర్మనీ, స్పెయిన్) సంచలన విజయం సాధించిన జపాన్ జట్టు కీలకమైన నాకౌట్ మ్యాచ్‌లో మాత్రం తడబడింది. గత ప్రపంచకప్ రన్నరప్ క్రొయేషియా జట్టుతో సోమవారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో జపాన్ ‘షూటౌట్’లో ఓడిపోయింది. జపాన్ను ఏమాత్రం తక్కువ చేయకుండా నిర్ణీత సమయంలో... ఆ తర్వాత అదనపు సమయంలోనూ జాగ్రత్తగా ఆడిన క్రొయేషియా నిర్ణాయక ‘షూటౌట్’లో మాత్రం పూర్తిగా పైచేయి సాధించింది. తుదకు ‘షూటౌట్’లో 3–1తో జపాన్ను ఓడించి ఈ మెగా ఈవెంట్లో మూడోసారి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. 1998లో మూడో స్థానం పొందిన క్రొయేషియా, 2018లో రన్నరప్‌గా నిలిచింది. మరోవైపు జపాన్ ప్రస్థానం నాలుగోసారి ప్రిక్వార్టర్ ఫైనల్‌కే పరిమితమైంది. గతంలో మూడుసార్లు ప్రిక్వార్టర్ ఫైనల్ చేరి ఈ గండాన్ని అధిగమించలేకపోయిన ‘బ్లూ సమురాయ్’ బృందానికి నాలుగోసారీ నిరాశే ఎదురైంది. క్రొయేషియా సంబరం ముందుగా ఆట 43వ నిమిషంలో డైజెన్ మేడా గోల్‌తో జపాన్ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత 55వ నిమిషంలో లావ్రెన్ కుడి వైపు నుంచి కొట్టిన క్రాస్ షాట్‌ను ‘డి’ ఏరియాలో పెరిసిచ్ హెడర్ షాట్‌తో గోల్‌గా మలచడంతో క్రొయేషియా స్కోరును 1–1తో సమం చేసింది. అనంతరం రెండు జట్లు మరో గోల్ చేయకపోవడంతో నిర్ణీత సమయానికి రెండు జట్లు 1–1తో సమంగా నిలిచాయి. ఫలితం తేలడానికి అదనపు సమయం (15 నిమిషాలు నిడివి గల రెండు భాగాలు) ఆడించారు. అదనపు సమయంలోనూ స్కోరు సమంగా ఉండటంతో విజేతను నిర్ణయించడానికి ‘షూటౌట్’ అనివార్యమైంది. ‘షూటౌట్’లో క్రొయేషియా గోల్‌కీపర్ లివాకోవిచ్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. జపాన్ ఆటగాళ్లు కొట్టిన మూడు షాట్లను నేర్పుతో నిలువరించాడు. మరోవైపు క్రొయేషియా జట్టులో లివాజా కొట్టిన షాట్ గోల్‌పోస్ట్ బార్‌కు తగిలి పక్కకు వెళ్లగా, మిగతా ముగ్గురు ఆటగాళ్లు జపాన్ గోల్కీపర్ను బోల్తా కొట్టించి బంతిని లక్ష్యానికి చేర్చారు. బ్రెజిల్, దక్షిణ కొరియా మ్యాచ్ విజేతతో క్వార్టర్ ఫైనల్లో క్రొయేషియా ఆడుతుంది. -
క్రిమినల్ కోసం వెళ్లిన పోలీసులపై మర్డర్ కేసు!
దెహ్రాదూన్: నేరాలకు పాల్పడుతున్న వారిని పట్టుకుని కేసులు నమోదు చేస్తారు పోలీసులు. అయితే, నేరస్థులను పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులపైనే మర్డర్ కేసు నమోదైన అరుదైన సంఘటన ఉత్తరాఖండ్‌లో జరిగింది. మైనింగ్ మాఫియాను పట్టుకునే క్రమంలో జరిగిన ఎదురు కాల్పుల్లో స్థానిక బీజేపీ నేత భార్య మృతి చెందింది. దీంతో ఆగ్రహించిన గ్రామస్థులు పోలీసులపై దాడి చేశారు. వారిపై హత్య కేసు సైతం నమోదు చేశారు. ఇంతకి ఏం జరిగిందంటే? ఉత్తర్‌ప్రదేశ్‌లోని మొరదాబాద్‌కు చెందిన ఐదుగురు పోలీసులు మైనింగ్ మాఫియాను పట్టుకునేందుకు ఉత్తరాఖండ్‌లోని జాస్పూర్కు వెళ్లారు. రూ.50,000 రివార్డ్ ఉన్న వాంటెడ్ క్రిమినల్ జాఫర్.. జాస్పూర్‌లోని భుల్లార్ అనే వ్యక్తి ఇంటిలో ఉన్నట్లు తెలిసి.. అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులు, మైనింగ్ ముఠా మధ్య ఎన్కౌంటర్ మొదలైంది. ఈ ఎదురుకాల్పుల్లో స్థానిక బీజేపీ నేత గుర్తాజ్ భుల్లార్ భార్య గుర్ప్రీత్ కౌర్ ప్రాణాలు కోల్పోయింది. ఇద్దరు పోలీసులకు సైతం తూటాలు తగిలాయి. బీజేపీ నేత భార్య మృతితో గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులపై దాడి చేశారు. ఈ దాడిలో ముగ్గురు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. ఉత్తరాఖండ్ వెళ్లిన ఐదుగురు ఉత్తర్‌ప్రదేశ్ పోలీసులపై హత్య కేసు సైతం నమోదైంది. ‘రూ.50వేల రివార్డ్ ప్రకటించిన వాంటెడ్ క్రిమినల్ కోసం వెతుకుతున్నాం. భరత్‌పుర్ గ్రామం నుంచి తప్పించుకుని పోయాడు. మా పోలీసు బృందం అక్కడికి వెళ్లిన క్రమంలో వారిపై దాడి చేసి ఆయుధాలు లాక్కున్నారు. ప్రస్తుతం ఐదుగురు పోలీసులు చికిత్స పొందుతున్నారు. నిందితులు పరారీలో ఉన్నారు. వారి కోసం వేట కొనసాగుతుంది.’ అని మొరదాబాద్ సీనియ్ పోలీసు అధికారి షలాబ్ మథూర్ తెలిపారు. ఇదీ చదవండి: హిజాబ్ తీర్పు: సుప్రీం కోర్టులో ఊహించని పరిణామం -
కాల్పులకు రియల్ ఎస్టేట్ గొడవే కారణం
-
మాదాపూర్ నీరూస్ సర్కిల్ వద్ద రౌడీషీటర్ల మధ్య ఘర్షణ
-
హైదరాబాద్ మాదాపూర్ లో కాల్పుల కలకలం
-
FIH Pro League: ‘షూటౌట్’లో బెల్జియంపై భారత్ విజయం
ఆంట్వర్ప్: ప్రొ హాకీ లీగ్‌లో భాగంగా టోక్యో ఒలింపిక్స్ చాంపియన్ బెల్జియం జట్టుతో శనివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో భారత పురుషుల జట్టు ‘షూటౌట్’లో 5–4తో గెలిచింది. ‘షూటౌట్’లో భారత్ తరఫున హర్మన్‌ప్రీత్, అభిషేక్, లలిత్, షంషేర్ సింగ్, ఆకాశ్‌దీప్ సింగ్... బెల్జియం తరఫున బొకార్డ్, టాన్‌గయ్, సిమోన్, ఆర్థర్ సఫలమయ్యారు. బెల్జియం ప్లేయర్ నికోలస్ కొట్టిన ఐదో షాట్‌ను భారత గోల్‌కీపర్ శ్రీజేష్ అడ్డుకు న్నాడు. అంతకుముందు నిర్ణీత సమయం ముగిసేసరికి రెండు జట్లు 3–3తో సమంగా నిలిచాయి. ప్రస్తుతం భారత్ 29 పాయింట్లతో రెండో ర్యాంక్‌లో ఉంది. బెల్జియం మహిళల జట్టుతో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు 1–2తో ఓడిపోయింది. -
బంగ్లాదేశ్ హైకమిషన్ బయట కాల్పులు... తనను తాను కాల్చుకోబోయి...
కోల్‌కతా: డిప్రెషన్‌కి గురైన ఓ పోలీస్ ఆత్మహత్య చేసుకుందామని తుపాకీని తనవైపుకి తిప్పుకునేలోపే ఊహించని దారుణం చోటు చేసుకుంది. ఈ ఘటన కోల్‌కతాలో చోటు చేసుకుంది. ఈ మేరకు కోల్‌కతాలోని బంగ్లాదేశ్ హైకమిషన్ వెలుపల సాయుధ బలగాలకు చెందిన ఒక కానిస్టేబుల్ అకస్మాత్తుగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో మహిళతో సహా ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఐతే తుడుప్ లెప్చా అనే కానిస్టేబుల్ ఒక గంట పాటు ఆ ప్రాంతంలో సంచరిస్తూ, అకస్మాత్తుగా కాల్పులు జరిపాడని, ఆ తర్వాత తుపాకీని తనవైపుకి తిప్పుకున్నాడని స్థానికులు చెబుతున్నారు. ఈ మేరకు అధికారులు కూడా సెల్ఫ్‌లోడింగ్ రైఫిల్ నుంచే ఈ కాల్పులు జరిగాయని వెల్లడించారు. పైగా లెప్చా కోల్‌కతా సాయుధ పోలీసుల 5వ బెటాలియన్‌కు చెందినవాడని, బంగ్లాదేశ్ హైకమిషన్‌లో విధులు నిర్వర్తిస్తున్నడాని చెప్పారు మొన్నటిదాక సెలవుల్లో ఉన్న ఆయన ఈ ఉదయమే విధుల్లోకి చేరాడని, పైగా డిప్రెషన్‌తో గత కొంతకాలంగా బాధపడుతున్నట్లు పేర్కొన్నారు. ఈ ఘటనలో కానిస్టేబుల్, మరో ఇద్దరు మృతి చెందారని చెప్పారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. (చదవండి: కస్టడీలో ఉన్న ఢిల్లీ మంత్రి ముఖం పై నెత్తుటి గాయాలు...ఫోటోలు వైరల్) -
‘షూటౌట్’లో భారత్ గెలుపు
భువనేశ్వర్: అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) ప్రొ లీగ్‌లో భారత్ ఆరో విజయం నమోదు చేసింది. ఇంగ్లండ్‌తో శనివారం జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ ‘షూటౌట్’లో 3–2తో నెగ్గింది. నిర్ణీత సమయం ముగిసేసరికి రెండు జట్లు 3–3తో సమఉజ్జీగా నిలిచాయి. దాంతో విజేతను నిర్ణయించేందుకు షూటౌట్‌ను నిర్వహించారు. ముందుగా తొలి ఐదు షాట్లు ముగిశాక రెండు జట్లూ 2–2తో సమంగా నిలిచాయి. అనంతరం ఆరో షాట్లో ఇరు జట్ల ఆటగాళ్లు విఫలమయ్యారు. ఏడో షాట్లో భారత్ తరఫున అభిషేక్ గోల్ చేయగా... ఇంగ్లండ్ తరఫున లియామ్ విఫలం కావడంతో టీమిండియా విజయం ఖాయమైంది. ఈ గెలుపుతో తొమ్మిది జట్లు బరిలో ఉన్న ప్రొ లీగ్‌లో భారత్ 18 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లోకి వచ్చింది. నేడు ఇంగ్లండ్‌తో ఇదే వేదికపై రెండో మ్యాచ్ ఉంది. -
పాక్‌లో కాల్పులు.. 9 మంది మృతి
కరాచీ: పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావిన్సుకు చెందిన రెండు గిరిజన తెగల మధ్య జరిగిన గొడవల్లో 9 మంది మరణించారు. మరో అయిదుగురు గాయపడ్డారని అక్కడి మీడియా తెలిపింది. ఇరువర్గాల మధ్య కాల్పులు జరిగా యని చెప్పింది. శనివారం రాత్రి జగిరాని, ఛచార్ తెగల మధ్య ఈ దుర్ఘటన జరిగింది. ఇరు తెగలు ఎంతో కాలం నుంచి వైరం కొనసాగుతోంది. మృతదేహాలను, గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. గొడవల కారణంగా స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. పరిస్థితిని చక్కబెట్టేందుకు భారీగా పోలీసులు రంగంలోకి దిగారు. చదవండి: యుద్ధం కొనసాగుతుందని నెతన్యాహు హెచ్చరిక -
భారత్ చేతిలో ఆసీస్ షూటౌట్
భువనేశ్వర్: గోల్ కీపర్ శ్రీజేశ్ అడ్డుగోడగా నిలవడంతో ప్రపంచ రెండో ర్యాంకర్ ఆస్ట్రేలియాపై భారత హాకీ జట్టు అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ప్రొ హాకీ లీగ్ సీజన్–2లో భాగంగా శనివారం ఇక్కడి కళింగ స్టేడియంలో జరిగిన రెండో లీగ్ మ్యాచ్‌లో భారత్ 3–1తో పెనాల్టీ షూటౌట్లో ఆస్ట్రేలియాపై గెలుపొందింది. దాంతో శుక్రవారం ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. నిర్ణీత 60 నిమిషాల ఆటలో ఇరు జట్లు కూడా 2–2 గోల్స్‌తో సమంగా నిలిచాయి. భారత తరఫున రూపిందర్ పాల్ సింగ్ (25వ నిమిషంలో), హర్మన్‌ప్రీత్ సింగ్ (27వ నిమిషంలో) చెరో గోల్ చేయగా... ఆసీస్ ఆటగాళ్లలో ట్రెంట్ మిట్టన్ (23వ నిమిషంలో), అరాన్ జలేవ్స్కీ (46వ నిమిషంలో) చెరో గోల్ సాధించారు. ఫలితంగా మ్యాచ్ షూటౌట్‌కు దారి తీసింది. -
ఢిల్లీలో రెండు గ్యాంగ్‌లు పరస్పరం కాల్పులు
-
పట్టపగలు.. నడిరోడ్డు మీద
న్యూఢిల్లీ : పట్టపగలు.. జనంతో కిక్కిరిసిన రోడ్డు మీద రెండు గ్యాంగ్‌లు పరస్పరం కాల్పులతో బీభత్సం సృష్టించాయి. ఈ ఘటనలో ఇద్దరు పాత నేరస్తులు మృతి చేందారు. ఈ సంఘటన ఆదివారం మధ్యాహ్నం ఢిల్లీ ద్వారకా మోర్ మెట్రో స్టేషన్ సమీపంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. నవడా ప్రాంతానికి చెందిన ప్రవీణ్ గెహ్లోత్, వికాస్ దళాల్ రెండు వేర్వేరు గ్యాంగ్‌లు నడుపుతూ నేరాలకు పాల్పడుతుంటారు. వీరి మీద ఢిల్లీ, హరియాణాలో గతంలోనే హత్యా, కిడ్నాప్, దొంగతనం వంటి పలు కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఈ రెండు గ్యాంగ్‌ల మధ్య ఘర్షణ జరిగింది. ప్రవీణ్ గెహ్లోత్ ప్రయాణిస్తున్న కారును మరో గ్యాంగ్‌కు చెందిన ముగ్గురు వ్యక్తులు తమ కారుతో అడ్డగించడమే కాక కాల్పులకు తెగబడ్డారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : ఢిల్లీలో రెండు గ్యాంగ్‌లు పరస్పరం కాల్పులు దాంతో ప్రవీణ్ గెహ్లోత్ కూడా కాల్పులు ప్రారంభించాడు. నడి రోడ్డు మీద.. జనం చూస్తుండగానే దాదాపు 15 రౌండ్ల కాల్పులు జరిపారు దుండగలు. దాంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ క్రమంలో మెట్రో స్టేషన్‌కు సమీపంలోనే పోలీసులు ఉండటంతో.. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. పోలీసులు రావడం గమనించిన నిందుతులు అక్కడి నుంచి పారరయ్యారు. ఇరు వర్గాల మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు నేరస్తులు మరణించినట్లు పోలీసులు తెలిపారు. రెండు గ్యాంగ్‌ల మీద కేసు నమోదు చేశామని.. త్వరలోనే నిందితులను అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు. దలాల్ 2018 హరియాణా పోలీసుల కస్టడీ నుంచి తప్పించుకుని వచ్చాడని.. అతని కోసం గాలిస్తున్నామని తెలిపారు. -
థాయ్‌లో కాల్పులు.. భారతీయుడు మృతి
బ్యాంకాక్: థాయ్‌లాండ్‌లో దారుణం జరిగింది. ఆదివారం రాత్రి రట్చతేవి జిల్లాలోని సెంట్రా వాటర్‌గేట్ పెవిలియన్ హోటల్ వద్ద రెండు టీనేజ్ గ్యాంగ్‌ల మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు విదేశీయులు మృతి చెందగా ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతి చెందిన వారిలో భారత పర్యాటకుడు గాఖ్రేజ్ ధీరజ్ (42), లావోస్ పర్యాటకుడు కెవోంగన్సా (28) ఉన్నారు. గాయపడ్డవారిలో ఇద్దరు భారతీయులు, ఒక లావోస్ పౌరుడితో పాటు మరో ఇద్దరు థాయ్‌లాండ్ పౌరులున్నారు. రాత్రి అక్కడున్న భారతీయ రెస్టారెంట్‌మాల్‌లో పర్యాటకులంతా కలసి భోజనం చేశారు. అనంతరం వారంతా తమ బస్సుకోసం ఎదురు చూస్తూ పార్కింగ్ ప్రదేశంలో నిలబడ్డారు. పార్కింగ్ సమీపంలో ఉన్న స్నూకర్ క్లబ్ దారిలో అకస్మాత్తుగా రెండు టీనేజ్ గ్రూప్‌లు పరిగెత్తుకుంటూ వచ్చాయి. తొలుత వారి మధ్య చిన్న వాగ్వాదం మొదలైంది.. నిమిషాల వ్యవధిలోనే అది కాల్పులకు దారి తీసింది. దాదాపు 20 మంది టీనేజర్లు తుపాకులు, కత్తులు, కర్రలు పట్టుకుని క్లబ్ నుంచి వీధిలోకి పరిగెత్తుకొచ్చారని, అందులో ముగ్గురు కాల్పులకు దిగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. -
బ్యాంకాక్‌లో కాల్పుల కలకలం
-
బ్యాంకాక్‌లో కాల్పులు.. భారతీయుడి మృతి
బ్యాంకాక్ : బ్యాంకాక్‌లో రెండు వర్గాల మధ్య జరిగిన కాల్పుల్లో భారత పర్యాటకుడు గాఖ్‌రెజర్ ధీరజ్(42) మృతిచెందాడు. రచ్చత్వేహి జిల్లాలోని సెంటరా వాటర్‌గేట్ పెవిలియన్ హోటల్ దగ్గర ఈ ఘటన జరిగింది. స్నూకర్ క్లబ్ నుంచి బయటకు వచ్చిన రెండు గ్రూపుల మధ్య ఫైరింగ్ జరగడంతో అక్కడే ఉన్న టూరిస్టులపైకి బుల్లెట్లు దూసుకువచ్చాయి. ఈ కాల్పుల్లో ధీరజ్‌తో పాటూ లావోస్‌కు చెందిన మరో పర్యాటకుడు మృతిచెందగా, ఐదుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రుల్లో ఇద్దరు భారతీయులున్నారు. ఓ మాల్లోని ఇండియన్ రెస్టారెంట్లో పర్యాటకులు భోజనం చేసి బయటకు వచ్చి బస్సు కోసం వేచి చూస్తున్న సమయంలో కాల్పులు జరిగాయి. రెండు గ్యాంగ్‌లకు చెందిన సుమారు 20 మంది ఫైరింగ్‌లో పాల్గొన్నారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కత్తులు, హాకీ స్టిక్లోతోనూ దాడులకు పాల్పడ్డారని తెలిపారు. పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకునే లోపు రెండు గ్రూపులకు చెందిన సభ్యులు అక్కడి నుంచి పరారయ్యారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై బ్యాంకాక్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
క్రొయేషియా కొట్టేసింది
పోరు చివరిదాకా రసవత్తరంగా జరిగింది. ఆతిథ్య జట్టు ఆడుతుంది కాబట్టి ఫిష్ట్ స్టేడియం హోరెత్తింది. ఇరు జట్లు రెండు సార్లు సమవుజ్జీగా నిలిచాయి. నిర్ణీత సమయంలో రష్యా, క్రొయేషియా చెరో గోల్ చేశాయి. అదనపు సమయంలోనూ ఒక్కో గోల్ చేశాయి. 2–2తో స్కోరు సమం కావడంతో షూటౌట్ తప్పలేదు. రష్యా ఆటగాళ్లు వెనుకబడితే క్రొయేషియా 4–3తో మ్యాచ్‌ను, సెమీస్ చాన్స్‌నూ కొట్టేసింది. సొచి: రష్యా ఆడినంతసేపూ బాగా ఆడింది. ఈ క్వార్టర్ ఫైనల్లో క్రొయేషియా కంటే ముందే గోల్ చేసింది. అదనపు సమయం దాకా దీటుగా బదులిచ్చింది. అదనపు సమయం ఒక దశలో 2–1తో గెలుస్తుందనుకున్న క్రొయేషియాను చివరి నిమిషాల్లో గోల్ చేసి 2–2తో మళ్లీ నిలువరించింది. కానీ షూటౌటే ఆతిథ్య జట్టు కొంపముంచింది. ఇద్దరు ఆటగాళ్లు షూటౌట్ ఒత్తిడిలో చిత్తవడంతో చివరకు క్రొయేషియా 4–3తో విజయం సాధించింది. రష్యా తరఫున డెనిస్ చెరిషెవ్ (31వ ని.), మరియో ఫెర్నాండెస్ (115వ ని.) చెరో గోల్ చేయగా... క్రొయేషియా తరఫున అండ్రెజ్ క్రామరిక్ (39వ ని.), డొమగొజ్ విదా (100వ ని.) గోల్ చేశారు. అయితే షూటౌట్లో రష్యా జట్టులో స్మొలొవ్తో పాటు ఫెర్నాండెస్ విఫలం కాగా జగొయెవ్, ఇగ్నాషెవిచ్, కుజియయెవ్ గోల్ సాధించారు. క్రొయేషియాలో మటే కొవసిక్ మినహా బ్రొజొవిక్, మోడ్రిక్, విదా, రకిటిక్ గోల్ చేయడంతో ఆ జట్టు సెమీస్ చేరింది. బుధవారం జరిగే సెమీఫైనల్లో మాజీ చాంపియన్ ఇంగ్లండ్‌తో క్రొయేషియా తలపడుతుంది. ప్రపంచకప్‌లో క్రొయేషియా సెమీస్ చేరడం ఇది రెండోసారి. 1998లో తొలిసారి ప్రపంచకప్‌లో ఆడిన ఆ జట్టు మూడో స్థానంలో నిలిచింది. ఆరంభం నుంచి రష్యా జాగ్రత్తగా ఆడింది. క్రొయేషియా స్ట్రయికర్లను నిలువరిస్తూ కదంతొక్కింది. బంతి చాలావరకు క్రొయేషియా ఆధీనంలోనే ఉన్నా... వారి దాడుల్ని గోల్పోస్ట్దాకా రానివ్వకుండా రష్యా అడ్డుకుంది. దీంతో అరగంట దాకా ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు. ఆ మరుసటి నిమిషంలో రష్యా మిడ్‌ఫీల్డర్ చెరిషెవ్ (31వ ని.) పెనాల్టీ బాక్స్‌కు సమీపంలో 25 గజాల దూరం నుంచి కొట్టిన షాట్ గోల్‌పోస్ట్‌లోకి దూసుకెళ్లింది. కానీ 8 నిమిషాల వ్యవధిలోనే క్రొయేషియా స్కోరు సమం చేసింది.రష్యా డిఫెండర్లను ఛేదిస్తూ మడ్జుకిచ్ ఇచ్చిన పాస్‌ను మిడ్‌ఫీల్డర్ క్రామరిక్ (39వ ని.) హెడర్ గోల్‌గా మలిచాడు. ద్వితీయార్ధంలో ఇరు జట్లు తమ దాడులకు పదును పెట్టినప్పటికీ ఎవరు సఫలం కాలేదు. బంతి పదేపదే క్రొయేషియా ఆధీనంలోకి వెళ్లినా... ప్రత్యర్థి లక్ష్యంపై గురిపెట్టడంలో రష్యా ఆటగాళ్లు కూడా ఆకట్టుకున్నారు. 13 షాట్లు ఆడిన రష్యా ఐదు సార్లు లక్ష్యంపై గురిపెట్టగా... క్రొయేషియా 18 షాట్లలో కేవలం మూడు సార్లు లక్ష్యం దిశగా ఆడింది. అదనపు సమయం మొదలైన పది నిమిషాలకు క్రొయేషియా తరఫున విదా (100వ ని.) హెడర్ గోల్ చేయగా, ఇక మ్యాచ్ ముగిసే చివరి క్షణాల్లో ఫెర్నాండెస్ (115వ ని.) కూడా హెడర్తోనే గోల్ చేసి రష్యాకు ఊపిరి పోశాడు. దీంతో 2–2తో స్కోరు సమం కావడంతో ఫలితం కోసం పెనాల్టీ షూటౌట్ అనివార్యమైంది.