కొలంబియాను సెమీస్‌కు చేర్చిన డేవిడ్ | Columbia semis included David | Sakshi
Sakshi News home page

కొలంబియాను సెమీస్‌కు చేర్చిన డేవిడ్

Published Sun, Jun 19 2016 12:33 AM | Last Updated on Mon, Sep 4 2017 2:49 AM

కొలంబియాను సెమీస్‌కు చేర్చిన డేవిడ్

కొలంబియాను సెమీస్‌కు చేర్చిన డేవిడ్

ఈస్ట్ రూథర్‌ఫోర్డ్ (అమెరికా): పెరూతో హోరాహోరీగా సాగిన క్వార్టర్ ఫైనల్లో కొలంబియా గోల్‌కీపర్ డేవిడ్ ఓస్పినా తమ జట్టుకు ఆపద్బాంధవుడిగా మారాడు. బ్రెజిల్‌పై సంచలన విజయంతో క్వార్టర్స్‌కు చేరిన పెరూ ఈ మ్యాచ్‌లోనూ గట్టి పోటీనే ఇచ్చినా చివర్లో డేవిడ్ సూపర్ షో ముందు తలవంచింది. పెనాల్టీ షూటౌట్ దాకా వెళ్లిన ఈ మ్యాచ్‌లో అతను ప్రత్యర్థికి అడ్డుగోడలా నిలబడి జట్టు విజయానికి కారణమయ్యాడు. దీంతో  కొలంబియా 4-2తో నెగ్గి కోపా అమెరికా కప్ సెమీఫైనల్స్‌కు చేరింది.

షూటౌట్‌లో కొలంబియా తరఫున జేమ్స్ రోడ్రిగ్వెజ్, క్వాడ్రాడో, మోరెనో, లాస్ కేఫెటెరాస్ వరుసగా గోల్స్ సాధించారు. అటు పెరూ నుంచి డియాజ్, టాపియా రెండు గోల్స్ సాధించినా... మూడో ప్రయత్నంలో ట్రాకో షాట్‌ను అడ్డుకునేందుకు గోల్ కీపర్ డేవిడ్ పొరపాటున ఎడమ వైపు డైవ్ చేసినా తన కాలితో మాత్రం బంతిని అడ్డుకోగలిగాడు. నాలుగో షాట్‌ను క్యూవా క్రాస్ బార్ పైనుంచి పంపడంతో కొలంబియా విజయం ఖాయమైంది. అంతకుముందు ఇరు జట్ల మధ్య గట్టి పోటీ జరిగింది. నిర్ణీత సమయంలోపు గోల్స్ చేయకపోవడంతో షూటౌట్ అనివార్యమైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement