rodriguez
-
వరుసగా రెండోసారి..
► కోపా అమెరికా కప్ ఫైనల్లో చిలీ ► సెమీస్‌లో కొలంబియాపై 2-0తో విజయం ► అర్జెంటీనాతో అమీతుమీ షికాగో: డిఫెండింగ్ చాంపియన్ చిలీ మరోసారి పంజా విసిరింది. క్వార్టర్స్‌లో మెక్సికోను 7-0తో చిత్తు చేసి జోరు మీదున్న ఈ చాంపియన్ జట్టు గురువారం జరిగిన సెమీఫైనల్లో కొలంబియాను 2-0తో ఓడించింది. దీంతో వరుసగా రెండోసారి కోపా అమెరికా ఫైనల్‌కు చేరుకుంది. సోమవారం ఉదయం (భారత కాలమానం ప్రకారం) జరిగే ఫైనల్లో అర్జెంటీనాతో అమీతుమీ తేల్చుకోనుంది. గతేడాది జరిగిన తుది పోరులోనూ ఈ రెండు జట్లే పోటీపడ్డాయి. మూడో స్థానం కోసం ఆదివారం జరిగే మ్యాచ్‌లో కొలంబియా, అమెరికాతో తలపడుతుంది. చిలీ తరఫున చార్లెస్ అరంగిజ్ (7వ నిమిషంలో), జోస్ పెడ్రో ఫ్యూంజలిడా (11) గోల్స్ సాధించారు. అయితే ప్రథమార్ధం ముగిసిన అనంతరం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షంతో ఆటకు రెండున్నర గంటలు అంతరాయం ఏర్పడింది. ఓ దశలో మిగతా మ్యాచ్‌ను వాయిదా వేయాలని భావించినా వర్షం ఆగడంతో కొనసాగించారు. ఆట మొదలైన 11 నిమిషాలకే రెండు గోల్స్ చేసిన చిలీ ప్రథమార్ధం మొత్తం ఆధిపత్యం కనబరచింది. ద్వితీయార్ధంలో కొలంబియా స్టార్ రోడ్రిగ్వెజ్ మెరుపు ఆటను చూపినా చిలీ డిఫెన్స్‌ను అధిగమించలేకపోయాడు. -
కొలంబియాను సెమీస్‌కు చేర్చిన డేవిడ్
ఈస్ట్ రూథర్‌ఫోర్డ్ (అమెరికా): పెరూతో హోరాహోరీగా సాగిన క్వార్టర్ ఫైనల్లో కొలంబియా గోల్‌కీపర్ డేవిడ్ ఓస్పినా తమ జట్టుకు ఆపద్బాంధవుడిగా మారాడు. బ్రెజిల్‌పై సంచలన విజయంతో క్వార్టర్స్‌కు చేరిన పెరూ ఈ మ్యాచ్‌లోనూ గట్టి పోటీనే ఇచ్చినా చివర్లో డేవిడ్ సూపర్ షో ముందు తలవంచింది. పెనాల్టీ షూటౌట్ దాకా వెళ్లిన ఈ మ్యాచ్‌లో అతను ప్రత్యర్థికి అడ్డుగోడలా నిలబడి జట్టు విజయానికి కారణమయ్యాడు. దీంతో కొలంబియా 4-2తో నెగ్గి కోపా అమెరికా కప్ సెమీఫైనల్స్‌కు చేరింది. షూటౌట్లో కొలంబియా తరఫున జేమ్స్ రోడ్రిగ్వెజ్, క్వాడ్రాడో, మోరెనో, లాస్ కేఫెటెరాస్ వరుసగా గోల్స్ సాధించారు. అటు పెరూ నుంచి డియాజ్, టాపియా రెండు గోల్స్ సాధించినా... మూడో ప్రయత్నంలో ట్రాకో షాట్‌ను అడ్డుకునేందుకు గోల్ కీపర్ డేవిడ్ పొరపాటున ఎడమ వైపు డైవ్ చేసినా తన కాలితో మాత్రం బంతిని అడ్డుకోగలిగాడు. నాలుగో షాట్‌ను క్యూవా క్రాస్ బార్ పైనుంచి పంపడంతో కొలంబియా విజయం ఖాయమైంది. అంతకుముందు ఇరు జట్ల మధ్య గట్టి పోటీ జరిగింది. నిర్ణీత సమయంలోపు గోల్స్ చేయకపోవడంతో షూటౌట్ అనివార్యమైంది. -
మెస్సీకి గోల్డెన్ బాల్, రోడ్రిగ్జ్‌కు గోల్డెన్ బూటు
అర్జెంటీనా ఫైనల్లో ఓడిపోయినా.. గోల్డెన్ బాల్ మాత్రం ఏస్ క్రీడాకారుడు, ఆ టీమ్ కెప్టెన్ లియోనెల్ మెస్సీకే దక్కింది. 2014 ఫిఫా వరల్డ్ కప్‌కు గాను గోల్డెన్ బూట్ అవార్డును జేమ్స్ రోడ్రిగ్జ్ గెలుచుకున్నాడు. మార్కానా స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో జర్మనీ చేతుల్లో ఎక్స్ట్రా టైమ్‌లో అర్జెంటీనా 0-1 తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో మెస్సీ ఒక్క గోల్ కూడా చేయలేకపోయినా.. టోర్నమెంటు మొత్తమ్మీద అతడే మంచి ప్లేయర్ అని ఓటర్లంతా భావించారు. దాంతో గోల్డెన్ బాల్ అతడికే దక్కింది. జట్టు ఆడిన మొత్తం ఏడు మ్యాచ్‌లలోనూ పాల్గొన్న మెస్సీ (27) నాలుగు గోల్స్ కొట్టాడు. ఈ అవార్డుకు పోటీపడినవారిలో అర్జెన్ రాబెన్ (నెదర్లాండ్స్), నెయ్మార్ (బ్రెజిల్), జేమ్స్ రోడ్రిగ్జ్ (కొలంబియా), థామస్ ముల్లర్ (జర్మనీ) ఉన్నారు. ఇక కొలంబియా జట్టుకు ఆరు గోల్స్ అందించిన రోడ్రిగ్జ్ గోల్డెన్ బూట్ గెలుచుకున్నాడు. ఇక ఐదు గోల్స్ చేసిన థామస్ ముల్లర్ వెండి బూటు గెలుచుకున్నాడు. టోర్నమెంటు మొత్తమ్మీద కేవలం నాలుగంటే నాలుగేసార్లు గోల్స్ ఇచ్చిన జర్మన్ గోల్ కీపర్ మాన్యుయెల్ నూయెర్ గోల్డెన్ గ్లోవ్ దక్కించుకున్నాడు. అవార్డుల జాబితా ఇలా ఉంది.. గోల్డెన్ బాల్: లియోనెల్ మెస్సీ (అర్జెంటీనా), సిల్వర్ బాల్: థామస్ ముల్లర్ (జర్మనీ), బ్రాంజ్ బాల్: అర్జెన్ రాబెన్ (నెదర్లాండ్స్) గోల్డెన్ బూటు: జేమ్స్ రోడ్రిగ్జ్ (కొలంబియా), సిల్వర్ బూటు: థామస్ ముల్లర్ (జర్మనీ), బ్రాంజ్ బూటుష్ట్ర నెయ్మార్ (బ్రెజిల్) గోల్డెన్ గ్లోవ్: మాన్యుయెల్ నూయెర్ (జర్మనీ) యంగ్ ప్లేయర్ అవార్డు: పాల్ పోగ్బా (ఫ్రాన్స్) ఫిఫా ఫెయిర్ ప్లే ట్రోఫీ: కొలంబియా