‘షూటౌట్‌’లో భారత పురుషుల హాకీ జట్టు గెలుపు! | FIH Pro League 2024-24: Indian Men's Team Wins International Hockey Shootout, More Details Inside | Sakshi
Sakshi News home page

‘షూటౌట్‌’లో భారత పురుషుల హాకీ జట్టు గెలుపు!

May 23 2024 9:26 AM | Updated on May 23 2024 11:52 AM

Indian Men's Team Wins International Hockey Shootout

అంట్‌వర్ప్‌ (బెల్జియం): అంతర్జాతీయ హాకీ సమాఖ్య ప్రొ లీగ్‌లో భారత జట్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. పురుషుల జట్టు ‘షూటౌట్‌’లో 5–4తో అర్జెంటీనాపై నెగ్గింది. నిర్ణీత సమయం ముగిసే సరికి ఇరుజట్లు 2–2తో సమంగా నిలిచాయి.

భారత్‌ తరఫున మన్‌దీప్‌ (11వ ని.లో), లలిత్‌ (55వ ని.లో)... అర్జెంటీనా తరఫున మార్టినెజ్‌ (20వ ని.లో), థామస్‌ డొమినె (60వ ని.లో) ఒక్కో గోల్‌ చేశారు. ‘షూటౌట్‌’లో హర్మన్‌ప్రీత్, సుఖ్‌జీత్‌ చెరో రెండు గోల్స్‌ చేయగా, అభిషేక్‌ ఒక గోల్‌ చేశాడు. రాజ్‌కుమార్, లలిత్‌ విఫలమయ్యారు.

ప్రత్యర్థి జట్టులో మైకో రెండు గోల్స్‌ కొట్టగా, లుకాస్, టోబియస్‌ ఒక్కో గోల్‌ చేశారు. ముగ్గురు విఫలమవడంతో భారత్‌ నెగ్గింది. ఇదే వేదికపై జరిగిన మరో మ్యాచ్‌లో భారత మహిళల జట్టు 0–5 గోల్స్‌తో అర్జెంటీనా చేతిలో ఓడింది.

ఇవి చదవండి: ప్రిక్వార్టర్స్‌లో సింధు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement