lalith
-
‘షూటౌట్’లో భారత పురుషుల హాకీ జట్టు గెలుపు!
అంట్వర్ప్ (బెల్జియం): అంతర్జాతీయ హాకీ సమాఖ్య ప్రొ లీగ్‌లో భారత జట్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. పురుషుల జట్టు ‘షూటౌట్’లో 5–4తో అర్జెంటీనాపై నెగ్గింది. నిర్ణీత సమయం ముగిసే సరికి ఇరుజట్లు 2–2తో సమంగా నిలిచాయి.భారత్ తరఫున మన్దీప్ (11వ ని.లో), లలిత్ (55వ ని.లో)... అర్జెంటీనా తరఫున మార్టినెజ్ (20వ ని.లో), థామస్ డొమినె (60వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. ‘షూటౌట్’లో హర్మన్‌ప్రీత్, సుఖ్జీత్ చెరో రెండు గోల్స్ చేయగా, అభిషేక్ ఒక గోల్ చేశాడు. రాజ్‌కుమార్, లలిత్ విఫలమయ్యారు.ప్రత్యర్థి జట్టులో మైకో రెండు గోల్స్ కొట్టగా, లుకాస్, టోబియస్ ఒక్కో గోల్ చేశారు. ముగ్గురు విఫలమవడంతో భారత్ నెగ్గింది. ఇదే వేదికపై జరిగిన మరో మ్యాచ్‌లో భారత మహిళల జట్టు 0–5 గోల్స్‌తో అర్జెంటీనా చేతిలో ఓడింది.ఇవి చదవండి: ప్రిక్వార్టర్స్‌లో సింధు -
ప్లాన్ A&B.. పార్లమెంట్‌పై దాడిలో సంచలన విషయాలు
ఢిల్లీ: పార్లమెంట్ భద్రతా వైఫల్యం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రధాన సూత్రధారిగా పేరుగాంచిన లలిత్ ఝా కీలక విషయాలను పోలీసులకు తెలిపారు. ఈ వ్యవహారంలో వారు రెండు వ్యూహాలను పన్నినట్లు చెప్పాడు. ఒకవేళ ప్లాన్ ఏ విఫలమైతే ప్లాన్ బీని ఏర్పాటు చేసుకున్నట్లు చెప్పాడు. ప్లాన్ ఏ ప్రకారం నీలం, అమోల్ పార్లమెంట్‌లోకి ప్రవేశించకపోతే మరోవైపు నుంచి మహేశ్, కైలాష్ ప్రవేశించాలని నిర్ణయించుకున్నట్లు లలిత్ చెప్పాడు. పొగ బాంబులను మండించి నినాదాలు చేయాలని సంకల్పించినట్లు పేర్కొన్నాడు. మహేష్, కైలాష్ గురుగ్రామ్‌లోని తాము నివాసం ఉన్న విశాల్ శర్మ(విక్కి) ఇంటికి చేరుకోవడంలో విఫలమైనందున అమోల్, నీలం ఎలాగైనా పని పూర్తి చేయాలని ఆదేశాలు ఇచ్చినట్లు వెల్లడించాడు. పార్లమెంట్లో ఆరుగురు వ్యక్తులు బుధవారం గందరగోళం సృష్టించారు. పక్కా ప్రణాళికతో పార్లమెంట్‌లోకి అడుగుపెట్టిన నిందితులు గ్యాస్ క్యానిస్టర్లను ప్రయోగించారు. ఇద్దరు నిందితులు లోక్‌సభ లోపలికి ప్రవేశించి పసుపు రంగు గ్యాస్‌ను ప్రయోగించారు. దీంతో ఎంపీలంతా భయాందోళనకు గురయ్యారు. నిందితులను ఎంపీలే పట్టుకుని భద్రతా సిబ్బందికి అప్పగించారు. మరో ఇద్దరు పార్లమెంట్ ఆవరణలో అలజడి సృష్టించారు. ఈ కేసులో నలుగురు నిందితులను ఉపా(దేశ వ్యతిరేక కార్యకాలాపాల చట్టం) చట్టం కింద పోలీసులు అరెస్టు చేశారు. 2001 డిసెంబర్ 13న పార్లమెంట్‌పై దాడి జరిగిన రోజే మళ్లీ ఈ ఘటన జరగడం తీవ్ర చర్చకు దారి తీసింది. మనోరంజన్, సాగర్ శర్మ, నీలమ్, అమోల్ శిందె, విశాల్, లలిత్, మహేశ్ అనే ఏడుగురు దుండగులు ఈ ఘటనకు పాల్పడిన విషయం తెలిసిందే. ఇందులో మనోరంజన్, సాగర్‌శర్మ లోక్‌సభలోకి చొరబడగా.. నీలమ్, అమోల్ శిందే పార్లమెంట్ భవనం వెలుపల గందరగోళం సృష్టించారు. ఈ నలుగురితో పాటు వీరికి బస ఏర్పాటు చేసిన విశాల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహేష్‌ను ఇప్పటికే అరెస్టు చేశారు. ఈ ఐదుగురి మొబైల్ ఫోన్స్‌తో పరారైన లలిత్ ఝా ప్రస్తుతం లొంగిపోయాడు. ఇదీ చదవండి: పార్లమెంట్ అలజడి ఘటన: ప్రతిపక్షాల తీరుపై అమిత్ షా ఫైర్ -
తిరుమల శ్రీవారుని దర్శించుకున్న సీజేఐ లలిత్
-
Tokyo Olympics: ఫినిషింగ్ మెరుగుపడితేనే...
బెంగళూరు: అందివచ్చిన అవకాశాలను గోల్స్‌గా మలచడంపై ఆటగాళ్లు దృష్టి సారించాలని భారత హాకీ జట్టు ఫార్వర్డ్ ప్లేయర్ లలిత్ ఉపాధ్యాయ్ అభిప్రాయపడ్డాడు. మైదానంలో ప్లేయర్లు చురుకుగా కదులుతూ ప్రత్యర్థి డిఫెండర్లను బోల్తా కొట్టిస్తూ గోల్ పోస్ట్‌ను సమీపించినా ఫినిషింగ్ మాత్రం అనుకున్న స్థాయిలో లేదని... అందులో భారత జట్టు మెరుగు పడాలని లలిత్ పేర్కొన్నాడు. ఇలా జరిగితేనే టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ మెరుగైన ప్రదర్శనను కనబర్చగలదని లలిత్ అన్నాడు. ఈసారి జరిగే ఒలింపిక్స్‌లో భారత్‌కు పతకం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నాడు. ఇటీవల ముగిసిన అర్జెంటీనా పర్యటనలో భారత్ నాలుగు ప్రాక్టీస్ మ్యాచ్‌లతో పాటు... రెండు ప్రొ లీగ్ హాకీ టోర్నీ మ్యాచ్‌లను ఆడింది. ప్రాక్టీస్ మ్యాచ్‌ల్లో 12 గోల్స్ చేసిన భారత్... ప్రొ లీగ్ మ్యాచ్‌ల్లో ఐదు గోల్స్ చేసింది. ప్రస్తుతం ఒలింపిక్స్ కోసం భారత హాకీ బృందం బెంగళూరులోని ‘సాయ్’లో ఏర్పాటు చేసిన శిక్షణ శిబిరంలో పాల్గొంటోంది. టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు క్లిష్టమైన ‘డ్రా’ పడింది. భారత్ గ్రూప్‌లో డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనాతోపాటు ఆస్ట్రేలియా, జపాన్, న్యూజిలాండ్, స్పెయిన్ జట్లు ఉన్నాయి. -
అష్టావధానం.. ఎంతో ఇష్టంగా!
అమెరికా గడ్డపై పుట్టి పెరిగాడు.. పరాయి భాషలో విద్యాభ్యాసంచేస్తున్నాడు.. అయితేనేం, అమ్మభాషలో కమ్మగా అష్టావధానం చేస్తున్నాడు లలిత్ ఆదిత్య.తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఈ యువకుడు బుధవారం రవీంద్రభారతిలో సంస్కృతాంధ్ర ద్విగుణిత అష్టావధానం నిర్వహించాడు. అతిరథ మహారథులు పృచ్ఛకులుగా సంధించిన ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. ఈ సందర్భంగా తన అష్టావధాన ప్రస్థానంపై ‘సాక్షి’తో ప్రత్యేకంగా ముచ్చటించాడు. సాక్షి, సిటీబ్యూరో :భారత గడ్డతో అనుబంధమున్న ఎవరైనా తమ కష్టకాలంలో, ఆపద సమయంలోఉన్నపళంగా తలుచుకొనే దైవం హనుమంతుడు. ఆ దైవమే తనను అష్టావధానం వైపు అడుగులు వేయించాడు. ఆయన ఆశీర్వాదం బలంతోనే అతిరథ మహారథులు పృచ్ఛకులుగా సంధించిన ప్రశ్నలకు సమాధానం చెబుతున్నానని యువ అష్టావధాని లలిత్ ఆదిత్యపేర్కొన్నారు. అమెరికాలో పుట్టి పెరిగిన ఆయన అష్టావధానంలో పేరు ప్రఖ్యాతులుసంపాదించారు. బుధవారం రవీంద్రభారతిలో సంస్కృతాంధ్ర ద్విగుణిత అష్టావధానంనిర్వహించేందుకు వచ్చిన ఆయన ‘సాక్షి’తో ముచ్చటించారు. నాలుగు నెలల పాటు శిక్షణ.. సరిగ్గా మూడేళ్ల క్రితం హనుమంతుడిని స్తుతిస్తూ నేను రాసిన ఆంజనేయస్వామి శతకం అష్టావధానం వైపు అడుగులు వేయించింది. శతకంలోని తప్పొప్పులు విశ్లేషించుకునేందుకు వెళ్లిన నన్ను ధూళిపాళ్ల మహదేవ రమణి గురువు వద్ద అష్టావధానంలో శిక్షణ పొందేలా మార్చింది. ఇందులో నాలుగు నెలల పాటు శిక్షణ తీసుకున్నా. గొప్ప అదృష్టం.. అవకాశం.. రవీంద్ర భారతి నా కలల స్వప్నం. ఈ వేదికపై ప్రదర్శన పూర్వజన్మ సుకృతంగా భావిస్తా. ఆ అదృష్టాన్ని మాటల్లో వర్ణించలేను. పద్యాలు రాయడం, వేదం, సంగీతం వంటి వాటిపై పట్టు ఉండటంతో అష్టావధానం తేలికైంది. అమెరికాలో పలు అష్టావధాన కార్యక్రమాల్లో పాల్గొన్న అనుభవం ఉంది. ఇటీవల రాజమండ్రి, విజయవాడల్లో నిర్వహించిన అష్టావధాన ప్రక్రియల్లో పాలుపంచుకున్నాను. భక్తి కావ్యం.. జీవిత లక్ష్యం ప్రస్తుతం నేను అమెరికాలో ఏరోస్పేస్ ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్నా. కెరీర్లో ఎదగడానికి అష్టావధానం ఎంతగానో ఉపకరిస్తుంది. సృజనాత్మకత, ఏకాగ్రత రెండూ పెరుగుతాయి. భవిష్యత్తులో ఏరోస్పేస్ ఇంజినీరింగ్‌లో స్థిరపడతా. భక్తిభావాన్ని పెంపొందించే మంచి కావ్యం రాయాలనేదినా జీవిత లక్ష్యం. . తెలుగు భాషలో ఆత్మీయత.. అమెరికాలోని పిల్లలకు బాల్యంలోనే సంప్రదాయ నృత్యాలు, సాహితీ పఠనం, వేదాలు నేర్పిస్తున్నారు. తెలుగుభాష ఉచ్చారణలో స్పష్టత మాత్రమే కాదు.ఆత్మీయత దాగి ఉంటుంది. రు. నాన్న మారుతీ శశిధర్, అమ్మ శైలజ నా బాల్యంలోనే భారతీయ సంస్కృతీసంప్రదాయాలను అలవర్చారు. తెలుగులో మాట్లాడమే కాదు, చిన్నతనంలోనే పద్యాలు చెప్పటం.. తిరిగి చెప్పించటం ఇలా కన్నవారి ప్రేరణతోనే అమ్మ భాషపై పట్టు సాధించాను. పుస్తకపఠనం, సంగీతం రెండింటితో సహవాసంతో స్వయంగా పద్యాలు రాసేంతగా ఎదిగాను. ఆరో తరగతి చదువుతున్న సమయంలోనే తెలుగు, ఆంగ్ల భాషల్లో పద్యాలు రాసి గురువుల ప్రశంసలు పొందాను. -
‘అయోధ్య’ నుంచి వైదొలిగిన జస్టిస్ లలిత్
న్యూఢిల్లీ: అయోధ్య భూ వివాద కేసును విచారించాల్సిన రాజ్యాంగ ధర్మాసనం నుంచి జస్టిస్ యూయూ లలిత్ అనూహ్యంగా వైదొలిగారు. దీంతో కొత్త ధర్మాసనాన్ని ఏర్పాటుచేసి జనవరి 29న విచారణ ప్రారంభిస్తామని సుప్రీంకోర్టు గురువారం ప్రకటించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనంలో సభ్యుడైన లలిత్..ఇకపై జరిగే విచారణలో పాల్గొనేందుకు నిరాకరించి తనంతట తానే తప్పుకున్నారు. రామ మందిర నిర్మాణ కేసుకే సంబంధించి 1997లో అప్పటి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి కల్యాణ్‌సింగ్ తరఫున లాయర్‌గా జస్టిస్ లలిత్ ప్రాతినిధ్యం వహించిన సంగతిని సీనియర్ అడ్వొకేట్ రాజీవ్ ధావన్ ప్రస్తావించారు. ఈ కేసు విచారణలో జస్టిస్ లలిత్ కొనసాగేందుకు తనకేం అభ్యంతరం లేదని ధావన్ స్పష్టం చేసినా తుది నిర్ణయం మాత్రం జస్టిస్ లలిత్‌దేనని బెంచ్ తెలిపింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ఈ ధర్మాసనంలో జస్టిస్ లలిత్‌తో పాటు జస్టిస్ ఎస్ఏ బాబ్డే, జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ డీవై చంద్రచూడ్ ఉన్నారు. ముగ్గురికి సూచిస్తే ఐదుగురికి ఎందుకిచ్చారు?: ధావన్ జస్టిస్ లలిత్ స్వచ్ఛందంగా వైదొలగడంతో అయోధ్య కేసు విచారణను వాయిదా వేసి కొత్త బెంచ్‌ను నియమించడం మినహా మరో మార్గం లేదని కోర్టు తెలిపింది. విచారణలో ముస్లిం పిటిషన్‌దారుడు సిద్దిఖి తరఫున రాజీవ్ ధావన్, హిందూ కక్షిదారుల తరఫున హరీశ్ సాల్వే వాదనలు వినిపించారు. అయోధ్య భూ వివాద కేసును ముగ్గురు సభ్యుల ధర్మాసనానికి బదిలీ చేయాలని త్రిసభ్య బెంచ్ గతేడాది సెప్టెంబర్ 27న కోర్టుకు సూచించినా ఐదుగురు సభ్యుల ధర్మాసనానికి ఎందుకు కేటాయించారని ధావన్ ప్రశ్నించారు. దీనికి సాల్వే స్పందిస్తూ..రాజ్యాంగ సంబంధ ప్రశ్నలు తలెత్తినప్పుడు, ఆ అంశాన్ని ఐదుగురు సభ్యుల కన్నా తక్కువ లేని బెంచ్‌కే కేటాయించాలని అన్నారు. ప్రధాన న్యాయమూర్తి తన పాలనాధికారాలు వినియోగించి ఈ కేసును ఐదుగురు సభ్యుల ధర్మాసనానికి కేటాయించారని కోర్టు వెల్లడించింది. ఐదుగురు సభ్యుల బెంచ్ నియామకం త్రిసభ్య ధర్మాసనం నిర్దేశించిన మార్గదర్శకాలకు విరుద్ధంగా ఏమీ లేదని స్పష్టం చేసింది. అవసరానికి తగినట్లుగా ఏ బెంచ్‌లో ఎందరు సభ్యులుండాలో నిర్ణయించే అధికారం సీజేఐకి దఖలుపడిందని తెలిపింది. కొత్త బెంచ్ వేలాది పేజీల సాక్ష్యాలు, దస్తావేజులు, సాక్షుల వాంగ్మూలాలను పరిశీలించాల్సి ఉంది. ఇప్పటి వరకూ 88 మంది చెప్పిన 13886 పేజీల సాక్ష్యాలు, 257 డాక్యుమెంట్లు, వీడియో టేపులను భద్రపరిచారు. వాళ్లంతా సీజేఐలవుతారు! జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ప్రస్తుత రాజ్యాంగ ధర్మాసనంలో సభ్యులైన జస్టిస్ ఎస్ఏ బాబ్డే, జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ యూయూ లలిత్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌లు వరుసగా ఒకరి తరువాత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు అయ్యే అవకాశాలున్నాయి. జస్టిస్ రంజన్ గొగోయ్ నవంబర్‌లో పదవీ విరమణ చేశాక సంప్రదాయం ప్రకారం.. ఆయన తరువాత అత్యంత సీనియర్ న్యాయమూర్తి అయిన జస్టిస్ ఎస్ఏ బాబ్డే సీజేఐగా బాధ్యతలు చేపట్టొచ్చు. 2021లో జస్టిస్ బాబ్డే పదవీ కాలం ముగిసిన తరువాత తెలుగు వ్యక్తి ఎన్వీ రమణకు సుప్రీం తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా అవకాశం లభించొచ్చు. 2022లో జస్టిస్ రమణ పదవీ విరమణ తరువాత జస్టిస్ యూయూ లలిత్ ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యే అవకాశం ఉంది. 2022 నవంబర్‌లో జస్టిస్ లలిత్ పదవీకాలం ముగిశాక జస్టిస్ చంద్రచూడ్ సీజేఐగా నియమితులై 60 ఏళ్లు వచ్చే వరకు అంటే 2024 వరకు పదవిలో కొనసాగొచ్చు. -
షాంఘై ఓపెన్ చెస్ టోర్నీ విజేత లలిత్
ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ఎం.ఆర్.లలిత్ బాబు షాంఘై ఓపెన్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో విజేతగా నిలిచాడు. చైనాలో జరిగిన ఈ టోర్నీలో లలిత్ నిర్ణీత తొమ్మిది రౌండ్ల తర్వాత ఏడు పాయింట్లతో లీ డి (చైనా), దాయ్ చాంగ్రెన్ (చైనా)లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచాడు. అయితే మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంక్‌ను వర్గీకరించగా లలిత్ బాబుకు టాప్ ర్యాంక్ దక్కింది. రెండో స్థానంలో లీ డి... మూడో స్థానంలో దాయ్ చాంగ్రెన్ నిలిచారు. ఐదు గేముల్లో గెలిచిన లలిత్... నాలుగు గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని టోర్నీని అజేయంగా ముగించాడు. -
లలిత్, ప్రత్యూష ఓటమి
తాష్కెంట్: ఆసియా కాంటినెంటల్ చెస్ చాంపియన్‌షిప్ ఆరో రౌండ్లో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులు ఎం.ఆర్.లలిత్ బాబు, బొడ్డ ప్రత్యూషలకు పరాజయాలు ఎదురయ్యాయి. ఓపెన్ విభాగంలో అలీకులోవ్ ఎల్బెక్ (ఉజ్బెకిస్తాన్) చేతిలో లలిత్ బాబు... మహిళల విభాగంలో హోంగ్ థి బావో ట్రామ్ (వియత్నాం) చేతిలో ప్రత్యూష ఓడిపోయారు. ఆరో రౌండ్ తర్వాత లలిత్ 2.5 పాయింట్లతో 59వ స్థానంలో, ప్రత్యూష మూడు పాయింట్లతో 17వ స్థానంలో ఉన్నారు. -
లలిత్‌బాబు విజయం
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ఎం.ఆర్. లలిత్‌బాబు ఎనిమిదో రౌండ్ గేమ్‌లో రష్యా గ్రాండ్‌మాస్టర్ వాసిలీ పాపిన్కు షాకిచ్చాడు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న అంతర్జాతీయ గ్రాండ్‌మాస్టర్స్ చెస్ టోర్నమెంట్లో ఆదివారం జరిగిన ‘ఎ’ కేటగిరీ ఎనిమిదో రౌండ్ పోటీలో ఏపీ ఆటగాడు చక్కని ఎత్తులతో రష్యన్ ప్రత్యర్థిని నిలువరించాడు. 34 ఎత్తుల్లోనే వాసిలీ ఆటకట్టించాడు. తాజా విజయంతో అతను 6 పాయింట్లతో మరో ఐదుగురితో కలిసి ఉమ్మడిగా రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. చెన్నైకి చెందిన గ్రాండ్‌మాస్టర్ సేతురామన్ ఆరున్నర పాయింట్లతో ఒంటరిగా ఆధిక్యంలో కొనసాగుతున్నాడు. అతను మిఖాయిల్ మొజరోవ్ (రష్యా, 6)తో గేమ్‌ను డ్రా చేసుకున్నాడు. సంచలన విజయాలతో దూసుకెళ్తున్న ఏపీ కుర్రాడు ధూళిపాళ బాలచంద్ర ప్రసాద్ (5)కు ఎనిమిదో రౌండ్లో చుక్కెదురైంది. ఆర్మేనియా గ్రాండ్‌మాస్టర్ శామ్వెల్ టెర్-సహక్యాన్ (6) చేతిలో బాలచంద్ర కంగుతిన్నాడు. ఏడో రౌండ్దాకా సంయుక్తంగా మూడో స్థానంలో కొనసాగిన అతను తాజా పరాజయంతో ఇప్పుడు నాలుగో స్థానానికి పడిపోయాడు. ‘బి’ కేటగిరీలో జరిగిన ఏడో రౌండ్ గేముల్లో ఆంధ్రప్రదేశ్ ఆటగాళ్లు వరుణ్, విశ్వనాథ్ ప్రసాద్, లక్ష్మీసందీప్ నాయుడు, సాయి అగ్ని జీవితేశ్, ప్రతీక్ శ్రీవాస్తవ, ఎస్. ఖాన్, కల్యాణ్ కుమార్ విజయాలు నమోదు చేశారు. బి-కేటగిరీ ఏడో రౌండ్ ఫలితాలు వరుణ్ (ఏపీ, 6.5)... సుబ్రమణ్యం (తమిళనాడు)పై, విశ్వనాథ్ ప్రసాద్ (ఏపీ, 6.5)... రమణబాబు (ఏపీ, 5)పై, లక్ష్మీ సందీప్ (ఏపీ, 6)... విజయ్ ఆనంద్ (తమిళనాడు, 5)పై, సాయి అగ్ని జీవితేశ్ (ఏపీ, 5.5)... నయన్‌దీప్ (డీఏఎస్సీబీ, 4.5)పై, కళ్యాణ్ కుమార్ (ఏపీ, 5)... బైవబ్ (ఒడిశా, 4)పై, ఎస్.ఖాన్ (ఏపీ, 5)... రాజేంద్ర (రాజస్థాన్, 4)పై, ప్రతీక్ (ఏపీ, 5)... రూప్ సౌరవ్ (బీహార్, 4)పై నెగ్గారు. -
ఇంటర్నేషనల్ జీఎం చెస్ టోర్నీ ప్రారంభం
ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: చిన్నారుల్లో మేధాశక్తిని పెంపొందించేందుకు చెస్ క్రీడ ఎంతగానో దోహద పడుతుందని రాష్ట్ర ప్రభుత్వ వైద్య, ఆర్యోగ శాఖ ముఖ్య కార్యదర్శి ఎల్.వి.సుబ్రహ్మణ్యం చెప్పారు. సైబర్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో సోమవారం ఇంటర్నేషనల్ గ్రాండ్ మాస్టర్ చెస్ టోర్నమెంట్ ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి సుబ్రహ్మణ్యం ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. ఇందులో 15 దేశాల నుంచి వందకు పైగా అంతర్జాతీయ చెస్ క్రీడాకారులు పాల్గొంటున్నారు. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాలకు కూడా చెస్‌ను తీసుకెళ్లే విధంగా తోడ్పడాలని ఏపీసీఏ అధ్యక్షుడు నర్సింహా రెడ్డి, ప్రధాన కార్యదర్శి కె.కన్నారెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. విదేశీ గ్రాండ్ మాస్టర్స్‌తో రాష్ట్ర క్రీడాకారులకు శిక్షణ ఇప్పించే చెస్ అకాడమీ కోసం క్రీడల శాఖ కార్యదర్శి లవ్ అగర్వాల్ చేస్తున్న ప్రయత్నాలను ఇంటర్నేషనల్ మాస్టర్ లంక రవి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఐఎస్ఎన్ అధికారి అశోక్ కుమార్, టెక్ మహీంద్ర సీనియర్ ఉపాధ్యక్షుడు బసంత్ కె.మిశ్రా, ఆంధ్రాబ్యాంక్ జనరల్ మేనేజర్ చంద్రశేఖర్, పెట్రోలియం మంత్రిత్వ శాఖ మెంబర్ సెక్రటరీ వీరేంద్ర కుమార్ మహేంద్ర, ఏపీసీఏ ఉపాధ్యక్షుడు మేజర్ శివ ప్రసాద్‌లు పాల్గొన్నారు.