
ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ఎం.ఆర్.లలిత్ బాబు షాంఘై ఓపెన్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్‌లో విజేతగా నిలిచాడు. చైనాలో జరిగిన ఈ టోర్నీలో లలిత్ నిర్ణీత తొమ్మిది రౌండ్‌ల తర్వాత ఏడు పాయింట్లతో లీ డి (చైనా), దాయ్ చాంగ్రెన్ (చైనా)లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచాడు.
అయితే మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంక్‌ను వర్గీకరించగా లలిత్ బాబుకు టాప్ ర్యాంక్ దక్కింది. రెండో స్థానంలో లీ డి... మూడో స్థానంలో దాయ్ చాంగ్రెన్ నిలిచారు. ఐదు గేముల్లో గెలిచిన లలిత్... నాలుగు గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని టోర్నీని అజేయంగా ముగించాడు.
Comments
Please login to add a commentAdd a comment