చెన్నై గ్రాండ్‌మాస్టర్స్ చెస్ టోర్నమెంట్‌లో భారత నంబర్‌వన్, తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ ఇరిగేశి అర్జున్‌కు తొలి ఓటమి ఎదురైంది. చెన్నైలో జరుగుతున్న ఈ టోర్నీలో ఆదివారం జరిగిన ఆరో రౌండ్ గేమ్‌లో అర్జున్ 48 ఎత్తుల్లో భారత్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్ అరవింద్ చిదంబరం చేతిలో అనూహ్యంగా ఓడిపోయాడు.
అరవింద్ చేతిలో ఓటమితో అర్జున్ లైవ్ ర్యాంకింగ్స్‌లో 2801.8 పాయింట్లతో ప్రపంచ రెండో ర్యాంక్ నుంచి నాలుగో ర్యాంక్‌కు పడిపోవడం గమనార్హం. అమీన్–పర్హామ్ (ఇరాన్) మధ్య గేమ్ 37 ఎత్తుల్లో...మాక్సిమి వాచిర్ లాగ్రెవ్ (ఫ్రాన్స్)–అలెక్సీ సరానా (సెర్బియా) మధ్య గేమ్ 31 ఎత్తుల్లో... అరోనియన్ (అమెరికా)–విదిత్ (భారత్) మధ్య గేమ్ 64 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగిశాయి.
ఎనిమిది మంది గ్రాండ్‌మాస్టర్ల మధ్య ఏడు రౌండ్లపాటు ఈ టోర్నీ జరుగుతోంది. ఆరో రౌండ్ తర్వాత అర్జున్, అరోనియన్ 4 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలోఉన్నారు. అరవింద్, అమీన్ 3.5 పాయింట్లతో సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచారు. ఈరోజు జరిగే చివరిదైన ఏడో రౌండ్ గేముల్లో లాగ్రెవ్‌తో అర్జున్; అరోనియన్‌తో అమీన్; విదిత్‌తో అలెక్సీ; పర్హామ్‌తో అరవింద్ తలపడతారు.
Comments
Please login to add a commentAdd a comment