
మాల్మో (స్వీడన్): టెపి సెగెమన్ ఓపెన్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్‌లో భారత యువ గ్రాండ్‌మాస్టర్, తెలంగాణ ప్లేయర్ ఇరిగేశి అర్జున్ తొలి ఓటమి చవిచూశాడు. శుక్రవారం జరిగిన రెండో రౌండ్‌లో వరంగల్ జిల్లాకు చెందిన 19 ఏళ్ల అర్జున్ తెల్ల పావులతో ఆడుతూ 57 ఎత్తుల్లో స్వీడన్ గ్రాండ్‌మాస్టర్ నిల్స్ గ్రాండెలియస్ చేతిలో పరాజయం పాలయ్యాడు.
భారత్‌కే చెందిన మరో యువ గ్రాండ్‌మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ వరుసగా రెండో విజయంతో రెండు పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. రెండో రౌండ్‌లో తమిళనాడుకు చెందిన గుకేశ్ 35 ఎత్తుల్లో విన్సెంట్ కీమెర్ (జర్మనీ)పై గెలుపొందాడు. భారత సంతతికి చెందిన అమెరికా గ్రాండ్‌మాస్టర్ అభిమన్యు మిశ్రా రెండో రౌండ్‌లో 43 ఎత్తుల్లో జోర్డెన్ వాన్ ఫోరీస్ట్ (నెదర్లాండ్స్)పై విజయం సాధించాడు.
Comments
Please login to add a commentAdd a comment