దేశవ్యాప్తంగా ఏడు నగరాల్లో 30 పాఠశాలల నుంచి దాదాపు 10,000 మంది పిల్లలు ఖో ఖో కార్యక్రమంలో పాల్గొన్నారు..
ఖో ఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, స్పోర్ట్స్ ఫర్ ఆల్‌తో అనుబంధంగా పాఠశాల పిల్లల క్రీడాభివృద్ధికి కృషి..
ఖో ఖో అథ్లెట్ల కోసం దేశవ్యాప్తంగా డేటాబేస్‌ను రూపొందించడమే ఈ కార్యాచరణ లక్ష్యం..
న్యూఢిల్లీ: పాఠశాల విద్యార్థులలో ఖో ఖోను ప్రోత్సహించడానికి ఖో ఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (KKFI), స్పోర్ట్స్ ఫర్ ఆల్ (SFA) భాగస్వామ్యంతో.. దేశవ్యాప్తంగా వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించింది. దేశ రాజధానిలో జనవరి 13-19 వరకు జరగనున్న ఖో ఖో ప్రపంచ కప్‌కు ముందు ఈ కార్యక్రమం దేశీయ క్రీడను అభివృద్ధి చేయడంలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది.
గత నెలలో.., హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, జైపూర్‌తో సహా ఏడు నగరాల్లోని 7,000 మందికి పైగా పాఠశాల విద్యార్థులను ఈ కార్యక్రమంలో విజయవంతంగా నిమగ్నం చేసింది. ఈ క్రీడ రాబోయే వారాల్లో లక్నో, పూణే, ముంబైకి కూడా విస్తరించబడనుంది. అంతేకాకుండా భారతదేశం అంతటా 30 పాఠశాలలకు చేరుకుంది. ఈ కార్యక్రమం జనవరి 11 నాటికి 200 పాఠశాలలకు చేరడమే లక్ష్యంగా ముందుకు సాగుతుంది.
ఈ సందర్భంగా ఖో ఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు శ్రీ సుధాన్షు మిట్టల్ తన అనుభవాలను పంచుకుంటూ.. "ఖో ఖోను సాంప్రదాయ ఆట నుండి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన క్రీడగా మార్చడమే మా లక్ష్యం. ఈ అద్భుతమైన క్రీడను యువకులకు పరిచయం చేయడం ద్వారా కొత్త ఆటగాళ్లను అభివృద్ధి చేయడమే కాకుండా.. భారతీయ గొప్ప క్రీడా వారసత్వాన్ని ప్రపంచంలోని ప్రతి ప్రాంతానికి తీసుకెళ్లే రాయబారులను సృష్టించడం ధ్యేయంగా పెట్టుకున్నామ’’ని అన్నారు.
ఆన్-గ్రౌండ్ కార్యక్రమాలను పూర్తి చేస్తూ.., సొసైటీ ఆఫ్ డిజిటల్ ఎంటర్‌ప్రెన్యూర్స్ (SODE) సహకారంతో KKFI డిజిటల్ రిజిస్ట్రేషన్ ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ ప్రయత్నంలో "డిజిటల్ రిజిస్ట్రేషన్ ప్రచారం అనేది గేమ్ ఛేంజర్". తెలంగాణ నుండి ఉత్తర ప్రదేశ్ వరకు భారతదేశం అంతటా 1,200 పైగా పాఠశాల్లో 7,000 నగరాల్లో విజయవంతంగా చేరుకున్నాము. -MS త్యాగి, ఖో ఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జనరల్ సెక్రటరీ.
దేశ వ్యాప్తంగా విభిన్న ప్రాంతాలలో ఉన్నటువంటి 6 నుండి 11 తరగతులకు చెందిన విద్యార్థుల నుండి ఈ-రిజిస్ట్రేషన్ డ్రైవ్ చురుకుగా నిర్వహిస్తున్నారు. ఖో ఖో ప్రపంచ కప్ స్థానికంగా జరుగుతున్నందున ఈ క్రీడా అభివృద్ధి కార్యక్రమాలు జాతీయ ఆసక్తిని పెంపొందించడంతో పాటు భారతీయ స్వదేశీ క్రీడ కోసం ప్రతిభను సృష్టించడంలో కీలకంగా పని చేస్తుంది.
భారతదేశంలో ఖో ఖో అద్భుత భవిష్యత్తును నిర్మించడంలోతీ ప్రయత్నం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. 2036 ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి భారత్ బిడ్డింగ్ చేయడంతో.., ఈ చిన్న పిల్లలు ప్రపంచ స్థాయిలో ఖో ఖో క్రీడా నైపుణ్యాలను ప్రదర్శించడానికి సన్నద్దమైతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment