Kho Kho
-
'ఖో ఖో ప్రపంచ కప్‌కు రంగం సిద్దం...6 ఖండాలు, 24 దేశాలు'
ఖో ఖో ప్రపంచ కప్ ప్రారంభ ఎడిషన్‌కు రంగం సిద్ధమైంది.., ఈ ఖో ఖో ప్రపంచ కప్ 2025 జనవరి 13 నుండి జనవరి 19 వరకు న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియం స్టేడియంలో జరగనుంది. అంతర్జాతీయ క్రీడా వేదికపై ఖో ఖో ను ప్రశస్తిని పెంచడానికి ఖో ఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా పురుషులు-మహిళలు రెండు విభాగాల్లోనూ పాల్గొనే జట్ల సంఖ్యను పెంచింది.గత నియమాలకు అనుగుణంగా టోర్నమెంట్లో 16 మంది పురుషులు, 16 మంది మహిళలు పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే ఈ ప్రపంచ కప్‌లో పాల్గొనే దేశాల నుంచి భారీగా ఆసక్తి పెగడంతో ప్రపంచ కప్‌లో పురుషుల కోసం 21 జట్లకు, మహిళలకు 20 జట్లకు మైదానాన్ని విస్తరించారు.ఈ ప్రతిష్టాత్మక క్రీడా సంగ్రామంలో ఆసియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, యూరప్ మరియు ఓషియానియాకు (ఆరు ఖండాలు) చెందిన దేశాలు పాల్గోంటున్నాయి.ఖో ఖో ప్రపంచ కప్ 2025లో పాల్గొనే దేశాలు:ఖండం: ఆఫ్రికాపురుషుల: ఘనా, కెన్యా, దక్షిణాఫ్రికామహిళల: కెన్యా, దక్షిణాఫ్రికా, ఉగాండాఖండం: ఆసియాపురుషుల: బంగ్లాదేశ్, భూటాన్, భారత్ (ఆతిథ్య), ఇరాన్, మలేషియా, నేపాల్, పాకిస్థాన్, దక్షిణ కొరియా, శ్రీలంకమహిళలు: బంగ్లాదేశ్, భూటాన్, భారతదేశం (ఆతిథ్య), ఇండోనేషియా, ఇరాన్, మలేషియా, నేపాల్, పాకిస్తాన్, దక్షిణ కొరియా, శ్రీలంకఖండం: యూరోప్పురుషుల: ఇంగ్లాండ్, జర్మనీ, నెదర్లాండ్స్, పోలాండ్మహిళలు: ఇంగ్లాండ్, జర్మనీ, నెదర్లాండ్స్, పోలాండ్ఖండం: ఉత్తర అమెరికాపురుషుల: యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాఖండం: దక్షిణ అమెరికాపురుషుల: అర్జెంటీనా, బ్రెజిల్, పెరూమహిళలు: పెరూఖండం: ఓషియానియా (ఆస్ట్రేలియా)పురుషుల: ఆస్ట్రేలియామహిళల: ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ఈ ప్రపంచ కప్ సన్నాహాల గురించి భారత ఖో ఖో ఫెడరేషన్ ప్రెసిడెంట్ శ్రీ సుధాన్షు మిట్టల్ మాట్లాడుతూ... "మేము విదేశీ ప్రతినిధులను దృష్టిలో ఉంచుకుని సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నాం. అతిథులకు వారి ఆహార అవసరాలకు అనుగుణంగా భోజనం, ఆహార ప్రణాళికను రూపొందించాము. వారి కోసం పూర్తి లాజిస్టిక్స్, బస, రవాణా సౌకర్యాలను కూడా అందజేస్తున్నాం.తద్వారా వారు ఇక్కడ ఉండే సమయంలో ఎలాంటి సమస్యలను ఎదుర్కోకుండా టోర్నమెంట్ ముగిసే వరకు అన్ని దేశాలు ఉండేందుకు మేము ఏర్పాట్లు చేసాము. ఫలితాలతో సంబంధం లేకుండా ఖో ఖో ప్రపంచ కప్ 2025 ప్రపంచవ్యాప్తంగా ఉన్న అంతర్జాతీయ క్రీడా ఈవెంట్లకు బెంచ్‌మార్క్‌ను సెట్ చేస్తుంద’’ని తెలిపారు.జనవరి 13న ప్రపంచకప్ ప్రారంభోత్సవం జరగనుంది.. ఆ తర్వాత టోర్నమెంట్లో భారత్-పాకిస్థాన్‌ల మధ్య మొదటి మ్యాచ్ జరుగుతుంది. జనవరి 14 నుండి జనవరి 16 మధ్య లీగ్ దశ మ్యాచ్‌లు జరుగుతాయి. ఆ తర్వాత క్వార్టర్-ఫైనల్స్ మరియు సెమీ-ఫైనల్స్ వరుసగా జనవరి 17 మరియు 18 జనవరిలో జరుగుతాయి. తొలిసారిగా ఖో ఖో ప్రపంచకప్ ఫైనల్స్ జనవరి 19న జరగనున్నాయి.భారత ఒలింపిక్ సంఘం (IOA) అధికారికంగా ఖో ఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (KKFI)తో తన భాగస్వామ్యాన్ని ధృవీకరించి.. ఈ ఈవెంట్‌కు తిరుగులేని మద్దతుకు ఆమోదం తెలిపింది. -
ఖో..ఖో : ఇంట్రస్టింగ్ స్టోరీ.. ఖో అంటే అర్థం ఏంటి?
ఇప్పుడు కొన్ని స్కూళ్లలో దీనిని మర్చిపోయారుకాని ఒకప్పుడు ప్రతి స్కూల్లో ఆడించేవారు. పిల్లలు ఉత్సాహంగా ఆడేవారు. ఖొఖొ ఆట ఆడటం సులువు కాబట్టి పిల్లలు స్కూళ్లలో, ఇంటి వద్ద, మైదానాల్లో ఆడవచ్చు. ఇది ఆడేందుకే కాదు, చూసేందుకూ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మరి ఖొఖొ చరిత్రేమిటో తెలుసా? ఖొఖొ దక్షిణాసియా సంప్రదాయ క్రీడ. క్రీ.పూ నాలుగో శతాబ్దం నుంచే ఈ ఆట ఆడి ఉంటారని చరిత్రకారులు అంచనా వేస్తున్నారు. మహాభారతంలో కూడా ఖొఖొ ప్రస్తావన ఉందని కొందరి మాట. అప్పట్లో దీన్ని ‘ఖొ ధ్వని క్రీడ’ అని పిలిచేవారు. అంటే ‘ఖొ’ అని శబ్దం చేస్తూ ఆడే ఆట అని అర్థం.రకరకాల నియమాలు, విధానాలతో ఆడే ఈ ఆట 1914 నుంచి ఒక స్థిరమైన రూపాన్ని పొందింది. పుణెలోని డక్కన్ జింఖాన్ క్లబ్ వారు ఈ ఆటకు సంబంధించి నిబంధనలు ఏర్పాటు చేసి తొలి రూల్ బుక్ తయారుచేశారు. అనంతరం అనేక పోటీల్లో ఖొఖొ భాగమైంది. దక్షిణాసియా క్రీడాపోటీలు, ఖేలో ఇండియా, నేషనల్ గేమ్స్ ఆఫ్ ఇండియా వంటి వేదికలపై ఖొఖొ చోటు దక్కించుకుంది. ఆటలో ఒక జట్టుకు ఏడుగురు క్రీడాకారులు ఉంటారు. వారిలో ఒకరు పరిగెడుతూ ఉండగా మరో జట్టులోని వ్యక్తి అతణ్ని పట్టుకునేందుకు ప్రయత్నిస్తుంటాడు. అతని వెళ్లే మార్గాన్ని బట్టి పరిగెత్తే వ్యక్తి మరో వ్యక్తిని తట్టి ‘ఖొ’ అంటాడు. వెంటనే అతను లేచి అవతలి జట్టు వ్యక్తి కోసం పరిగెడతాడు. అతని స్థానంలో అతనికి ‘ఖొ’ ఇచ్చిన వ్యక్తి కూర్చుంటాడు. ఇది ‘ఖొఖొ’ ఆడే విధానం. మొదట్లో మట్టి, ఇసుక వంటివి ఉన్నచోట ఖొఖొ ఆడేవారు. ప్రస్తుతం స్టేడియంలో ఏర్పాటు చేసిన కోర్టుల్లోనూ ఆడుతున్నారు. మనదేశంలో నస్రీన్ షేక్, సతీష్రాయ్, సారికా కాలె, పంకజ్ మల్హోత్రా, మందాకినీ మఝీ, ప్రవీణ్‌కుమార్ వంటివారు ఖొఖొ క్రీడాకారులుగా గుర్తింపు పొందారు. 2024 మార్చిలో జాతీయ ఖొఖొ ఛాంపియన్ షిప్‌పోటీలు నిర్వహించారు. అందులో మహారాష్ట్ర జట్లు స్త్రీ, పురుషుల విభాగాల్లో విజేతలుగా నిలిచాయి. ఖొఖొకు మరింత ప్రాచుర్యం కల్పించేందుకు ‘అంతర్జాతీయ ఖొఖొ సమాఖ్య’ 2025లో ‘ఖొఖొ ప్రపంచ కప్ పోటీలను నిర్వహించాలని అనుకుంటోంది. ఇందులో భారత ఖొఖొ సమాఖ్య కూడా భాగం కానుంది. దీంతోపాటు 2036లో జరిగే ఒలింపిక్స్‌లో ఖొఖొను కూడా చేర్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి ఖొఖొ నేర్చుకోండి. ఈసారి మరింత ఉత్సాహంగా ఆడండి. -
ఖో ఖో కార్యక్రమంలో 10 వేల మంది విద్యార్థులు
న్యూఢిల్లీ: పాఠశాల విద్యార్థులలో ఖో ఖోను ప్రోత్సహించడానికి ఖో ఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (KKFI), స్పోర్ట్స్ ఫర్ ఆల్ (SFA) భాగస్వామ్యంతో.. దేశవ్యాప్తంగా వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించింది. దేశ రాజధానిలో జనవరి 13-19 వరకు జరగనున్న ఖో ఖో ప్రపంచ కప్‌కు ముందు ఈ కార్యక్రమం దేశీయ క్రీడను అభివృద్ధి చేయడంలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది.గత నెలలో.., హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, జైపూర్‌తో సహా ఏడు నగరాల్లోని 7,000 మందికి పైగా పాఠశాల విద్యార్థులను ఈ కార్యక్రమంలో విజయవంతంగా నిమగ్నం చేసింది. ఈ క్రీడ రాబోయే వారాల్లో లక్నో, పూణే, ముంబైకి కూడా విస్తరించబడనుంది. అంతేకాకుండా భారతదేశం అంతటా 30 పాఠశాలలకు చేరుకుంది. ఈ కార్యక్రమం జనవరి 11 నాటికి 200 పాఠశాలలకు చేరడమే లక్ష్యంగా ముందుకు సాగుతుంది.ఈ సందర్భంగా ఖో ఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు శ్రీ సుధాన్షు మిట్టల్ తన అనుభవాలను పంచుకుంటూ.. "ఖో ఖోను సాంప్రదాయ ఆట నుండి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన క్రీడగా మార్చడమే మా లక్ష్యం. ఈ అద్భుతమైన క్రీడను యువకులకు పరిచయం చేయడం ద్వారా కొత్త ఆటగాళ్లను అభివృద్ధి చేయడమే కాకుండా.. భారతీయ గొప్ప క్రీడా వారసత్వాన్ని ప్రపంచంలోని ప్రతి ప్రాంతానికి తీసుకెళ్లే రాయబారులను సృష్టించడం ధ్యేయంగా పెట్టుకున్నామ’’ని అన్నారు.ఆన్-గ్రౌండ్ కార్యక్రమాలను పూర్తి చేస్తూ.., సొసైటీ ఆఫ్ డిజిటల్ ఎంటర్‌ప్రెన్యూర్స్ (SODE) సహకారంతో KKFI డిజిటల్ రిజిస్ట్రేషన్ ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ ప్రయత్నంలో "డిజిటల్ రిజిస్ట్రేషన్ ప్రచారం అనేది గేమ్ ఛేంజర్". తెలంగాణ నుండి ఉత్తర ప్రదేశ్ వరకు భారతదేశం అంతటా 1,200 పైగా పాఠశాల్లో 7,000 నగరాల్లో విజయవంతంగా చేరుకున్నాము. -MS త్యాగి, ఖో ఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జనరల్ సెక్రటరీ.దేశ వ్యాప్తంగా విభిన్న ప్రాంతాలలో ఉన్నటువంటి 6 నుండి 11 తరగతులకు చెందిన విద్యార్థుల నుండి ఈ-రిజిస్ట్రేషన్ డ్రైవ్ చురుకుగా నిర్వహిస్తున్నారు. ఖో ఖో ప్రపంచ కప్ స్థానికంగా జరుగుతున్నందున ఈ క్రీడా అభివృద్ధి కార్యక్రమాలు జాతీయ ఆసక్తిని పెంపొందించడంతో పాటు భారతీయ స్వదేశీ క్రీడ కోసం ప్రతిభను సృష్టించడంలో కీలకంగా పని చేస్తుంది.భారతదేశంలో ఖో ఖో అద్భుత భవిష్యత్తును నిర్మించడంలోతీ ప్రయత్నం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. 2036 ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి భారత్ బిడ్డింగ్ చేయడంతో.., ఈ చిన్న పిల్లలు ప్రపంచ స్థాయిలో ఖో ఖో క్రీడా నైపుణ్యాలను ప్రదర్శించడానికి సన్నద్దమైతున్నారు. -
ఖో ఖో తొలి ప్రపంచకప్.. ఆరంభం ఆరోజే!
న్యూఢిల్లీ: మన మట్టిలో పుట్టిన గ్రామీణ క్రీడ ఇప్పుడు ప్రపంచకప్‌గా ప్రసిద్ధికెక్కెందుకు సిద్ధమైంది. ప్రప్రథమ ఖోఖో ప్రపంచకప్ టోర్నమెంట్‌కు న్యూఢిల్లీ ఆతిథ్యమివ్వనుంది. వచ్చే ఏడాది జనవరి 13 నుంచి 19 వరకు జరిగే పోటీలను ఢిల్లీలోని త్యాగరాజ్ స్టేడియంలో నిర్వహిస్తారు. దీనికి సంబంధించిన అధికారిక లోగోను ‘ది వరల్డ్ గోస్ ఖో ఖో’ ట్యాగ్‌లైన్‌తో బుధవారం ఆవిష్కరించారు.మొత్తం 24 దేశాలకు చెందిన పురుషులు, మహిళల జట్లు ఇందులో పాల్గొంటాయని నిర్వాహకులు తెలిపారు. భారత ఖోఖో సమాఖ్య (కేకేఎఫ్ఐ) అధ్యక్షుడు సుధాన్షు మిట్టల్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘ఖోఖో ఆట మన మట్టిలో పుట్టింది. ఇప్పుడు ‘మ్యాట్’ మీదికి మారి మరో స్థాయికి చేరడం చాలా ఆనందంగా ఉంది. ఈ గ్రామీణ క్రీడను అంతర్జాతీయ క్రీడగా ఎదిగేందుకు కృషి చేసిన మన సమాఖ్యను అభినందించాల్సిందే.ముందుగా మన దేశంలో ఈ ఆటను అల్టిమేట్ ఖోఖో లీగ్‌గా ప్రేక్షకుల ముందుకు తెచ్చాం. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి ప్రపంచకప్ మెగాఈవెంట్గా తీసుకొస్తున్నాం’ అని అన్నారు. కేంద్ర క్రీడలు, యువజన సర్వీసుల శాఖ సహాయ మంత్రి రక్ష ఖడ్సే మాట్లాడుతూ మహాభారత కాలంలోనే ఖోఖో మన చరిత్రలో భాగమైందని, భారత ప్రభుత్వం ఇలాంటి క్రీడలకు విశిష్ట గౌరవాన్ని తీసుకొచ్చేందుకు ఎంతో కృషి చేస్తోందని, ఈ వరుసలోనే తొలి ఖోఖో ప్రపంచకప్ ఆతిథ్యమిస్తోందని చెప్పారు. ఈ విషయంలో కేకేఎఫ్ఐ పోషించిన పాత్రను ఆమె అభినందించారు. -
ఖోఖో ప్రపంచకప్ తొలి ఎడిషన్‌కు భారత్ ఆతిథ్యం
ఖోఖో ప్రపంచకప్ తొలి ఎడిషన్‌కు భారత్ ఆతిథ్యమివ్వనుంది. వచ్చే ఏడాది జరగనున్న ఈ టోర్నమెంట్లో పదహారు పురుషుల, మహిళల జట్లు పాల్గొంటాయని భారత ఖోఖో సమాఖ్య బుధవారం వెల్లడించింది. 2032 నాటికి ఖోఖోకు ఒలింపిక్ క్రీడగా గుర్తింపు తీసుకొచ్చే దిశగా ఇది కీలక ముందడుగు అని పేర్కొంది. ‘ఖోఖో మూలాలు భారత్‌లో ఉన్నాయి. ప్రాచీన క్రీడలో ప్రపంచకప్ నిర్వహించడం ద్వారా ఘన సాంస్కృతిక వారసత్వానికి తగిన గుర్తింపు లభిస్తుంది. మట్టి నుంచి ప్రారంభమై మ్యాట్ వరకు చేరిన ఈ క్రీడను ఇప్పుడు ప్రపంచంలో 54 దేశాలు ఆడుతున్నాయి. 2032 నాటికి ఖోఖోకు ఒలింపిక్ క్రీడగా గుర్తింపు దక్కేలా చేయడమే మా అంతిమ లక్ష్యం. అందులో ప్రపంచకప్ తొలి అడుగు’ అని ఖోఖో సమాఖ్య అధ్యక్షుడు సుధాన్షు మిట్టల్ పేర్కొన్నాడు. క్వార్టర్ ఫైనల్లో భారత్నాన్చాంగ్ (చైనా): ప్రపంచ జూనియర్ మిక్స్డ్ టీమ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత జట్టు క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. టర్కీతో బుధవారం జరిగిన గ్రూప్ ‘ఇ’ చివరి లీగ్ మ్యాచ్‌లో భారత జట్టు 110–99 పాయింట్లతో విజయం సాధించింది. ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) ఈ టోర్నీలో ప్రయోగాత్మకంగా రిలే స్కోరింగ్ పద్ధతిని ప్రవేశపెట్టింది. ఇరు జట్ల మధ్య 10 మ్యాచ్‌లు జరుగుతుండగా... తొలుత 110 పాయింట్లు చేరిన జట్టు విజేతగా నిలుస్తుంది. టర్కీకంటే ముందు పెరూ, అజర్బైజాన్, మారిషస్‌లతో జరిగిన మ్యాచ్‌ల్లోనూ భారత జట్టు గెలిచింది. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్లో ఇండోనేసియాతో భారత్ తలపడుతుంది. -
ఏపీ క్రీడా సంబురం: టాలెంట్ హంట్‌లో CSK.. ఇంకా
సాక్షి, గుంటూరు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘‘ఆడుదాం ఆంధ్రా’’ పోటీలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం ప్రారంభించారు. గ్రామీణ క్రీడాకారుల ప్రతిభను గుర్తించి పట్టం కట్టేందుకు వీలుగా ప్రవేశపెట్టిన అతిపెద్ద క్రీడోత్సవాన్ని గుంటూరులో ఆరంభించారు. నల్లపాడులోని లయోలా పబ్లిక్ స్కూల్ ఇందుకు వేదికైంది. దేశచరిత్రలోనే మైలురాయి పోటీల ప్రారంభం సందర్భంగా సీఎం వైస్ జగన్ మాట్లాడుతూ.. ‘‘ఈ క్రీడా సంబురాలు దేశ చరిత్రలోనే మైలురాయి. ఈ రోజు నుంచి... 47 రోజులపాటు ఆడుదాం ఆంధ్రా క్రీడా పోటీలను నిర్వహించనున్నాం. ఆడుదాం ఆంధ్రా గొప్ప పండుగ. మంచి ఆరోగ్యానికి క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయి వ్యాయామం వల్ల బీపీ, డయాబెటిక్.. అదుపులో ఉంటాయి. గ్రామస్థాయిలో క్రీడలు ఎంతో అవసరం. అందుకే..గ్రామస్థాయి నుంచి అడుగులేస్తున్నాం. గ్రామాల్లోని ఆణిముత్యాలను వెతికి .. దేశానికి అందిస్తాం. క్రీడాకారులను అంతర్జాతీయ స్థాయిలో.. తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. 15,004 గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో.. పోటీలు జరుగుతాయి. 9 వేల ప్లే గ్రౌండ్స్ రెడీగా ఉన్నాయి. 47 రోజుల్లో.. 5 దశల్లో పోటీల నిర్వహణ ఉంటుంది. ఈ క్రీడా సంబురాలు ప్రతి ఏడాది జరుగుతాయి. రూ.12 కోట్లకు పైగా నగదు బహుమతులు అందజేస్తాం’’ అని తెలిపారు. ఆడుదాం ఆంధ్ర పోటీల్లో భాగంగా.. ►తొలి దశలో.. జనవరి 9వ తేదీ వరకు.. గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో పోటీలు.. ►జనవరి 10 నుంచి 23 వరకు.. మండల స్థాయిలో పోటీలు.. ►జనవరి 24 నుంచి 30 వరకు.. నియోజకవర్గ స్థాయిలో పోటీలు.. ►ఫిబ్రవరి 6వ తేదీ నుంచి.. 10వ తేదీ వరకు రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించనున్నారు. అదే విధంగా ఉదయం 5 గంటల నుంచి.. సాయంత్రం 7 గంటల వరకు.. పోటీలు నిర్వహించేలా షెడ్యూల్ ఖరారైంది. ఆడుదాం ఆంధ్ర- మరిన్ని విశేషాలు ►రిఫరీలుగా.. 1.50 లక్షల మంది వలంటీర్లకు ప్రత్యేక శిక్షణ ►పోటీ పడనున్న.. 34.19 లక్షల క్రీడాకారులు ►వీరిలో.. 10 లక్షల మందికిపైగా మహిళలు.. రిజిస్ట్రేషన్ చేసుకోవడం విశేషం ►గ్రామీణ స్థాయిలో క్రీడా ప్రతిభను.. ప్రోత్సాహించాలనే లక్ష్యంతో.. రూ.119.19 కోట్లతో సీఎం జగన్ ప్రభుత్వం ఆడుదాం ఆంధ్రా పోటీలను నిర్వహిస్తోంది. దాదాపు రూ.42 కోట్లతో..క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్, ఖోఖో.. కబడ్డీ క్రీడాకారులకు అవసరమైన.. 5.09 లక్షల స్పోర్ట్స్ కిట్లు ప్రతి సచివాలయానికి సరఫరా చేశారు. ►ప్రొఫెషనల్ టోర్నీ తరహాలో.. మండలస్థాయిలో 17.10 లక్షల .. టీ షర్టులు, టోపీలతో కూడిన కిట్లు. ప్రొఫెషనల్స్‌ను గుర్తించేందుకు..ప్రణాళిక సిద్ధం చేసిన ప్రభుత్వం ►క్రికెట్లో చెన్నై సూపర్ కింగ్స్.. ఆంధ్రా క్రికెట్ ఆసోషియేషన్ ►బ్యాడ్మింటన్‌లో సింధు.. శ్రీకాంత్ బృందాలు ►వాలీబాల్‌లో ప్రైమ్ వాలీబాల్.. ►కబడ్డీలో- ప్రొకబడ్డీ ఆర్గనైజర్లు.. ►ఖోఖోలో- రాష్ట్ర క్రీడా సంఘాల ప్రతినిధులు.. టాలెంట్ హంట్ చేయనున్నారు. ►ఆన్లైన్, ఆఫ్ లైన్లో.. ప్రతిభగల క్రీడాకారులను గుర్తించేందుకు.. ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. అనంతరం.. వివిధ స్థాయిల్లో అంతర్జాతీయ శిక్షణ ఇప్పించి.. ఐపీఎల్ లాంటి ప్రతిష్టాత్మక ఈవెంట్లలో.. అవకాశం కల్పించే దృక్పథంతో.. పోటీలను సీఎం జగన్ ప్రభుత్వం నిర్వహిస్తోంది. -
‘టాప్’లోకి తెలుగు యోధాస్
పుణే: అల్టిమేట్ ఖో–ఖో లీగ్‌లో తెలుగు యోధాస్ జట్టు నాలుగో విజయం నమోదు చేసింది. ముంబై ఖిలాడీస్ జట్టుతో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో తెలుగు యోధాస్ 55–43తో గెలిచింది. ఈ విజ యంతో తెలుగు యోధాస్ 12 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లోకి దూసుకొచ్చింది. కెప్టెన్ ప్రజ్వల్, సచిన్ భార్గవ్ తెలుగు యోధాస్ విజయంలో కీలకపాత్ర పోషించారు. ప్రజ్వల్ 3 నిమిషాలు డిఫెండ్ చేయగా... సచిన్ 3 నిమిషాల 47 సెకన్లు డిఫెండ్ చేయడంతోపాటు అటాకింగ్‌లో పది పాయింట్లు కూడా స్కోరు చేశాడు. మరో మ్యాచ్‌లో చెన్నై క్విక్‌గన్స్ 53–51తో గుజరాత్ జెయింట్స్‌ను ఓడించింది. -
తెలుగు యోధాస్‌కు షాక్.. ఉత్కంఠ పోరులో చెన్నై క్విక్ గన్స్ గెలుపు
అల్టిమేట్ ఖో ఖో ఆరంభ సీజన్లో వరుస విజయాలతో దూసుకుపోతున్న తెలుగు యోధాస్ 'వి'జైత్రయాత్ర యాత్రకు అడ్డుకట్ట పడింది. తమిళ తంబిల జట్టు చెన్నై క్విక్ గన్స్.. తెలుగు యోధాస్‌కు ఓటమిని పరిచయం చేసింది. తద్వారా తొలి మ్యాచ్‌లో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకోవడంతో పాటు ఎడిషన్ తొలి విజయాన్ని నమోదు చేసింది. Even-steven at the half-time mark 😱Another screamer on the cards? Let's find out in the second half 👊#TYvCQG #UltimateKhoKho #IndiaMaarChalaang #AbKhoHoga #KhoKho pic.twitter.com/kh4t4QxCN5— Ultimate Kho Kho (@ultimatekhokho) August 17, 2022 తొలి మ్యాచ్‌లో చెన్నై క్విక్ గన్స్ , రెండో మ్యాచ్‌లో రాజస్థాన్ వారియర్స్‌ను ఓడించి జోరుమీదున్న తెలుగు యోధాస్.. బుధవారం జరిగిన ఉత్కంఠ పోరులో క్విక్ గన్స్ చేతిలో 46-52 తేడాతో ఓటమిపాలైంది. నువ్వా నేనా అన్నట్లు సాగిన తొలి అర్ధభాగంలో ఇరు జట్లు సమాన పాయింట్ల (25-25)తో ఉన్నప్పటికీ.. సెకెండ్ హాఫ్‌లో క్విక్ గన్స్ పుంజుకుని అద్భుత విజయం సాధించింది. ఈ ఓటమితో ఆరు జట్లు పాల్గొంటున్న టోర్నీలో తెలుగు యోధాస్ రెండో స్థానానికి పడిపోగా.. ఎడిషన్‌లో తొలి విజయం సాధించిన క్విక్ గన్స్ నాలుగో ప్లేస్‌కు ఎగబాకింది. మరో మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ 66-48తో ముంబై ఖిలాడీస్పై నెగ్గి, యోధాస్‌ను వెనక్కునెట్టి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. ఆడిన 2 మ్యాచ్‌ల్లో ఓటమిపాలైన రాజస్థాన్.. పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో ఉండగా.. ఒడిషా, ముంబై జట్లు 3, 5 ప్లేస్ల్లో కొనసాగుతున్నాయి. ఇవాళ (ఆగస్ట్ 18) జరిగే మ్యాచ్‌ల్లో రాజస్థాన్ వారియర్స్‌తో ఒడిశా జాగర్‌నట్స్, చెన్నై క్విక్ గన్స్‌తో ముంబై ఖిలాడీస్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లు సోనీ టెన్, సోనీ టెన్ 4 (తెలుగు కామెంట్రీ)లో ఛానల్లలో రాత్రి 7.30 నుంచి ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. చదవండి: వరుసగా రెండో మ్యాచ్‌లోనూ తెలుగు యోధాస్ గెలుపు -
వరుసగా రెండో మ్యాచ్‌లోనూ తెలుగు యోధాస్ గెలుపు
పుణే: అల్టిమేట్ ఖో–ఖో లీగ్‌లో తెలుగు యోధాస్ జట్టు వరుసగా రెండో విజయం నమోదు చేసింది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో తెలుగు యోధాస్ 68–47 పాయింట్ల తేడాతో రాజస్తాన్ వారియర్స్‌ను ఓడించింది. ఆదర్శ్ మొహితే ఆల్‌రౌండ్ ప్రదర్శనతో తెలుగు యోధాస్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఆదర్శ్ మూడు నిమిషాల 43 సెకన్లు ఫీల్డ్‌లో గడిపి... ఆ తర్వాత 10 పాయింట్లు కూడా స్కోరు చేశాడు. మరో మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ 54–49తో జగర్‌నట్స్ ఒడిషా జట్టుపై గెలిచింది. -
Ultimate Kho Kho: తెలుగు యోధాస్ శుభారంభం
పుణే: అల్టిమేట్ ఖో–ఖో లీగ్‌లో తెలుగు యోధాస్ జట్టు విజయంతో బోణీ చేసింది. ఆదివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో తెలుగు యోధాస్ 48–38తో చెన్నై క్విక్ గన్స్ జట్టుపై విజయం సాధించింది. డిఫెండర్ దీపక్ మాధవ్, అటాకర్ అరుణ్ గున్కీ రాణించి తెలుగు యోధాస్ గెలుపులో కీలకపాత్ర పోషించారు. ఆరంభంలో తెలుగు యోధాస్ వరుసగా 25 పాయింట్లు స్కోరు చేయగా చెన్నై ఖాతా తెరువలేకపోయింది. తెలుగు యోధాస్ స్కోరు చేసిన మొత్తం పాయింట్లలో 24 టచ్ పాయింట్లు, 17 డైవ్ పాయింట్లు ఉండటం విశేషం. అంతకుముందు తొలి మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ 69–44తో ముంబై ఖిలాడీస్ జట్టుపై గెలిచింది. నేడు జరిగే మ్యాచ్‌ల్లో రాజస్తాన్ వారియర్స్‌తో ముంబై ఖిలాడీస్; ఒడిషా జగర్‌నాట్స్‌తో చెన్నై క్విక్ గన్స్ తలపడతాయి. -
ఖో–ఖో లీగ్.. తెలుగు యోధాస్ కెప్టెన్ ఎవరంటే..?
న్యూఢిల్లీ: ఖో–ఖో లీగ్ ఫ్రాంచైజీ టోర్నీ ‘అల్టిమేట్ ఖో–ఖో’కు రంగం సిద్ధమైంది. రాష్ట్రానికి చెందిన కార్పొరేట్ సంస్థ జీఎంఆర్ ఇది వరకే హైదరాబాద్ నగరానికి చెందిన ఫ్రాంచైజీని చేజిక్కించుకోగా...ఆ జట్టు ‘తెలుగు యోధాస్’ పేరుతో బరిలోకి దిగుతోంది. అటాకింగ్ ప్లేయర్ ప్రజ్వల్‌కు జట్టు సారథ్య బాధ్యతలు అప్పగించిన టీమ్ మేనేజ్మెంట్ ఆల్‌రౌండర్ ప్రతీక్ వాయికర్ను వైస్ కెప్టెన్‌గా నియమించింది. ఆరు ఫ్రాంచైజీలు ముంబై, ఒడిశా, చెన్నై, రాజస్తాన్, గుజరాత్, హైదరాబాద్‌ల మధ్య ఈ సీజన్ పోటీలు ఈ నెల 14 నుంచి సెప్టెంబర్ 4 వరకు జరుగనున్నాయి. లీగ్ దశలో ఒక్కో జట్టు ఇతర ఫ్రాంచైజీలతో రెండేసి మ్యాచ్‌లు ఆడుతుంది. అనంతరం ఐపీఎల్ తరహాలో ‘ప్లేఆఫ్స్’ నిర్వహిస్తారు. సెప్టెంబర్ 4న జరిగే ఫైనల్‌తో ఈ సీజన్ ముగుస్తుంది. మ్యాచ్‌లన్నీ పుణేలోని ఛత్రపతి శివాజీ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో నిర్వహిస్తారు. సోనీ నెట్వర్క్ చానెల్లో, సోనీ లివ్ యాప్‌లో ఖో–ఖో పోటీలు ప్రసారం అవుతాయి. తెలుగు యోధాస్ జట్టు 14న తమ తొలి మ్యాచ్‌లో చెన్నైతో తలపడుతుంది. జట్టు వివరాలు అటాకర్: ఆదర్శ్ దత్తాత్రే, ఆదిత్య దాస్, కేసీ ధనుశ్, గవర వెంకటేశ్, పి.హేమచంద్రన్, కె.ప్రజ్వల్, రోక్సన్ సినమ్, సచిన్ భార్గో, సదానంద తోక్చోమ్, వి.సుబ్రమణి; డిఫెండర్: భరత్ అవధూత్, బొజ్జం రంజిత్, దీపక్ విఠల్, ధ్రువ్, వైభవ్ ప్రసాద్, సుదర్శన్; ఆల్‌రౌండర్: అనుకూల్ సర్కార్, అరుణ్ అశోక్, ఎస్.అరుణ్, సంబి బాల, కిరణ్ ప్రతీక్, రోహన్ తనాజీ -
అరక దున్నిన అత్త.. విత్తనాలు వేసిన కోడళ్లు!
వ్యవసాయంలో మహిళల శ్రమే అధికమైనా... రైతు అనగానే నెత్తిన తలపాగ, చేతిలో అరకతో ఓ పురుష రూపం గుర్తుకొస్తుంది. దాన్ని బ్రేక్ చేశారు నల్లగొండ జిల్లాకు చెందిన శ్రీశైలమ్మ. చింతపల్లి మండలం కుర్రంపల్లిలో గురువారం ఆమె అరక దున్నుతుండగా, తన ఇద్దరు కోడళ్లు విత్తనాలు వేస్తూ కనిపించారు. శ్రీశైలమ్మ భర్త రామచంద్రం సామాజిక కార్యకర్త. వారికి ఆరుగురు కుమారులు. ఇద్దరు ఆర్మీలో ఉన్నారు. నలుగురు ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నారు. అయినా శ్రీశైలమ్మ భర్తతోపాటు వ్యవసాయ పనులు చేస్తూ స్ఫూర్తినిస్తున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, చింతపల్లి (దేవరకొండ) ‘ఆశ’క్తిగా ఖోఖో ఆదిలాబాద్ డైట్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన క్రీడా మైదానాన్ని కలెక్టర్ సిక్తా పట్నాయక్, మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్‌లతో కలిసి ఎమ్మెల్యే జోగు రామన్న గురువారం ప్రారంభించారు. అక్కడ ఏర్పాటు చేసిన క్రీడా వస్తువులు, మైదానాన్ని పరిశీలించి వెళ్లిపోయారు. అనంతరం విధి నిర్వహణలో భాగంగా అక్కడే ఉన్న ఆశ వర్కర్లు ఖోఖో ఆడారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ శైలజ వారితో కలిసి ఉత్సాహంగా ఖోఖో ఆడుతూ కనిపించారు. –సాక్షి ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్ పిల్లల్ని పలకరించి.. కలిసి భోజనం.. గూడూరు: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం తీగలవేణి హైస్కూల్లో కలెక్టర్ కె.శశాంక విద్యార్థినులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా గురువారం తీగలవేణికి హాజరైన కలెక్టర్ ‘మన ఊరు – మన బడి’లో ఎంపికైన జెడ్పీహెచ్‌ఎస్‌ను సందర్శించారు. మధ్యాహ్న భోజన సమయం కావడంతో పిల్లలు ప్లేట్లు పట్టుకొని బారులు తీరారు. కలెక్టర్ శశాంక వారితో మాట్లాడిన అనంతరం వంటకాలను పరిశీలించారు. ‘రోజూ రుచికరంగా వండి పెడుతున్నారా? నేను మీతో కలిసి భోజనం చేయొచ్చా’.. అని కలెక్టర్ కోరగా.. సార్... రండి అంటూ పిల్లలు ఆనందంగా స్వాగతం పలికారు. అనంతరం కలెక్టర్ వారితో కూర్చుని భోజనం చేశారు. ‘వంటలు బాగానే ఉన్నాయి. ఇలాగే చేయండి’.. అని అన్నారు. (క్లిక్: గోళీ అంత గుడ్డు.. వావ్.. మూన్!) -
జీసీపీఈ జట్టుకు టైటిల్
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) ఇంటర్ కాలేజి ఖో–ఖో చాంపియన్‌షిప్‌లో ప్రభుత్వ వ్యాయామ విద్య కాలేజి (జీసీపీఈ) జట్టు సత్తా చాటింది. కేశవ్ మెమోరియల్ డిగ్రీ కాలేజి (నారాయణగూడ) వేదికగా జరిగిన ఈ టోర్నమెంట్లో జీసీపీఈ జట్టు విజేతగా నిలిచి టైటిల్‌ను కైవసం చేసుకుంది. శుక్రవారం జరిగిన ఫైనల్లో జీసీపీఈ 11–10తో సిద్ధార్థ వ్యాయామ విద్య కాలేజి (ఇబ్రహీంపట్నం) జట్టుపై విజయం సాధించింది. మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో భవన్స్ కాలేజి 16–8తో నిజాం కాలేజిపై నెగ్గింది. అంతకుముందు జరిగిన సెమీస్ మ్యాచ్‌ల్లో జీసీపీఈ 14–5తో భవన్స్ కాలేజిపై, సిద్ధార్థ కాలేజి 13–4తో నిజాం కాలేజిపై ఘనవిజయం సాధించాయి. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో నిజాం కాలేజి ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎల్.బి.లక్ష్మీకాంత్ రాథోడ్ ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీని అందజేశారు. ఈ కార్యక్రమంలో కేఎంఈ సొసైటీ సంయుక్త కార్యదర్శి బి. శ్రీధర్ రెడ్డి, కేఎంఐసీఎస్ ప్రిన్సిపాల్ జె. నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
రంగారెడ్డి మహిళల జట్టుకు టైటిల్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సీనియర్ ఖో–ఖో చాంపియన్‌షిప్‌లో రంగారెడ్డి జిల్లా మహిళల జట్టు సత్తా చాటింది. మేడారంలో నాలుగు రోజుల పాటు జరిగిన ఈ టోరీ్నలో విజేతగా నిలిచి టైటిల్‌ను కైవసం చేసుకుంది. మహిళల ఫైనల్లో రంగారెడ్డి 11–9తో కరీంనగర్‌పై గెలుపొందింది. మూడో స్థానం కోసం జరిగిన పోరులో మహబూబ్‌నగర్ 8–5తో వరంగల్‌పై నెగ్గింది. పురుషుల విభాగంలో వరంగల్ చాంపియన్‌గా నిలిచింది. తుదిపోరులో వరంగల్ 11–8తో కరీంనగర్‌ను ఓడించింది. రంగారెడ్డి 9–7తో హైదరాబాద్‌పై గెలుపొంది మూడోస్థానాన్ని దక్కించుకుంది. ఫైనల్ అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో ములుగు అదనపు ఎస్పీ సాయి చైతన్య ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను అందజేశారు. -
ఖో–ఖో లీగ్ నిబంధనల్లో మార్పులు
న్యూఢిల్లీ: గ్రామీణ క్రీడ ఖో–ఖో మరింత ఆకర్షణీయంగా మారనుంది. క్రికెట్, కబడ్డీ, రెజ్లింగ్ తరహాలోనే ఖో–ఖోలోనూ ఇటీవల లీగ్ ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది నవంబర్‌లో ‘అల్టిమేట్ ఖో–ఖో’ పేరుతో జరుగనున్న ఈ లీగ్... తొలి సీజన్‌తోనే ప్రేక్షకాదరణ పొందేం దుకు ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో ఖో–ఖో ఆట నిబంధనల్లో కొన్ని మార్పులు చేస్తూ ఆటను మరింత ఆసక్తికరంగా మార్చేసింది. ఇందులో భాగంగా ఆట మొత్తం నిడివిని 36 నిమిషాల నుంచి 28 నిమిషాలకు తగ్గించింది. దీంతో రెండు ఇన్నింగ్స్‌లలోనూ ప్రతి జట్టు ఏడు నిమిషాల చొప్పున ఆడుతుంది. దీంతో ఆటలో వేగం పెరగడంతో పాటు ఆసక్తికర పోరాటాలు ప్రేక్షకులని రంజింపచేస్తాయని నిర్వాహకులు భావిస్తున్నారు. దీనితో పాటు అధిక పాయింట్లు పొందడానికి వీలుగా ‘వజీర్’ అనే కొత్త విధానాన్ని ప్రవేశపెట్టారు. దీని ప్రకారం వజీర్‌గా వ్యవహరించే ఆటగాడు అయితే తనకు అనుకూలంగా అయితే ఎడమవైపు, లేదా కుడివైపుకు పరిగెత్తి పాయింట్లను సాధించవచ్చు. వజీర్ ట్రంప్‌కార్డుగా ఉపయోగపడుతూ పాయింట్లు పెంచుకునేందుకు ఉపయోగపడతాడు. అంతేకాకుండా స్కోరింగ్ విధానంలోనూ కొన్ని మార్పుచేర్పులు చేశారు. దీని ప్రకారం స్కైడైవ్ ద్వారా జట్టుకు అదనంగా ఒక పాయింట్ సాధించే వీలుంటుంది. మ్యాచ్‌లో అంపైర్ల నిర్ణయాన్ని ప్రశ్నిస్తూ ఆటగాళ్లకు రివ్యూ కోరే అవకాశాన్ని కూడా కల్పించారు. ప్రతి ఇన్నింగ్స్‌లో రెండు రివ్యూలు కోరవచ్చు. ఒకవేళ రివ్యూలో విఫలమైతే ప్రత్యర్థి జట్టుకు ఒక పాయింట్‌ను కేటాయిస్తారు. ఈ మార్పులు అభిమానులకు ఖో–ఖోను మరింత చేరువ చేస్తాయని నిర్వాహకులు పేర్కొన్నారు. కొత్త ఫార్మాట్ అభిమానులను ఆకట్టుకునే విధంగా ఉంటుందని భారత ఖో–ఖో సమాఖ్య చైర్మన్ రాజీవ్ మెహతా అన్నారు. భారత్‌లో నైపుణ్యమున్న ఆటగాళ్లకు అల్టిమేట్ ఖో–ఖో లీగ్ మంచి అవకాశమని చెప్పారు. -
రాష్ట్ర ఖో–ఖో జట్ల ప్రకటన
సాక్షి, హైదరాబాద్: జాతీయ ఖో–ఖో చాంపియన్‌షిప్‌లో పాల్గొనే రాష్ట్ర బాలబాలికల జట్లను గురువారం ప్రకటించారు. ఈ జట్లు మణిపూర్‌లోని తౌబాల్ నగరంలో సోమవారం నుంచి శుక్రవారం వరకు జరిగే జాతీయ ఖో–ఖో టోర్నీలో రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తాయి. బాలబాలికల జట్లకు కోచ్‌గా ఎన్. కష్ణమూర్తి, మేనేజర్‌గా గోపాల్ వ్యవహరిస్తారు. ఈ సందర్భంగా శాట్స్ చైర్మన్ ఎ. వెంకటేశ్వర్ రెడ్డి రాష్ట్ర జట్లకు ఎంపికైన క్రీడాకారులను అభినందించారు. వారికి స్పోర్ట్స్ కిట్లను అందజేశారు. జాతీయ, అంతర్జాతీయ టోర్నీల్లో తెలంగాణ జట్లు రాణించి రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్ర ఖో–ఖో సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కార్యదర్శి వై. శ్రీనివాసరావు, ఉమ్మడి కార్యదర్శి కె. రామకష్ణ, కోశాధికారి ఎన్. కష్ణమూర్తి, మేనేజర్ గోపాల్ తదితరులు పాల్గొన్నారు. జట్ల వివరాలు బాలురు: బి. మహేశ్, బి. సోమరాజు, జగతిబాబు, అశోక్ (రంగారెడ్డి), బి. ప్రవీణ్, మాజిద్ పాషా, డి. వినయ్ (వరంగల్), బి. రమేశ్, కె. రమేశ్(ఆదిలాబాద్), నరసింహస్వామి, ధీరజ్ (హైదరాబాద్). బాలికలు: బి. రేణుక, కె. అనూష (రంగారెడ్డి), ఎ. సంధ్య, పొనిక, శిరీష (వరంగల్), స్రవంతి, మహేశ్వరి (హైదరాబాద్), సి. కారుణ్య, లావణ్య, పరిమళ (నల్లగొండ), జి. కష్ణమ్మ (మహబూబ్‌నగర్), శారద సోని (ఖమ్మం). -
ఇది ఆట కాదు ఖో ఖో!
చిన్నప్పుడు ఆడుకున్న ఆటలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ‘ఖో ఖో’ ఆట గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు నయనతార లీడ్ రోల్ చేయనున్న ఓ సినిమాకి ఇదే టైటిల్ పెట్టారు. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ సినిమా కాదిది. మరి.. ‘ఖో ఖో’ అని టైటిల్ ఎందుకు పెట్టినట్లు? అంటే... టైటిల్ వెనక అసలు కారణం తెలియడానికి ఇంకాస్త టైమ్ పడుతుంది. ఎందుకంటే, నయనతారతో ఈ సినిమా తీయనున్న లైకా ప్రొడక్షన్స్ ప్రస్తుతానికి పెద్దగా వివరాలేం బయటపెట్టలేదు. ‘డార్క్ కామెడీ’ నేపథ్యంలో సినిమా ఉంటుందని మాత్రం పేర్కొన్నారు. నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించనున్న ఈ చిత్రానికి అనిరు«ద్ రవిచంద్రన్ స్వరకర్త. ప్రస్తుతం రజనీకాంత్ హీరోగా శంకర్ దర్శకత్వంలో దాదాపు 400 కోట్ల బడ్జెట్‌తో 2.0’ నిర్మిస్తున్న లైకా ప్రొడక్షన్స్ ‘ఖో ఖో’ని కూడా భారీ బడ్జెట్‌తో నిర్మించనుందట. అఫ్కోర్స్ ‘2.0’ అంత భారీ బడ్జెట్ కాకపోయినా, లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో ఎక్కువ బడ్జెట్‌తో రూపొందే సినిమా అవుతుందట. -
పాఠశాల విద్యా ప్రణాళికలో క్రీడలు
► కేంద్ర మంత్రి వెంకయ్యనాయడు న్యూఢిల్లీ: దేశ సంప్రదాయ క్రీడలు కబడ్డీ, ఖోఖోలను ఒలింపిక్స్‌లో చేర్చే విధంగా ప్రధాని నరేంద్రమోది కృషి చేస్తున్నారని కేంద్ర పట్టణాభివృద్ధి, సమాచార శాఖ మంత్రి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. డీడీ స్పోర్ట్స్ నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న ఆయన ప్రతి ఒక్కరి జీవితంలో ఓ భాగమైన క్రీడలను పాఠశాల విద్యా ప్రణాళికలో చేర్చాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుందని తెలిపారు. రు. క్రీడల ప్రాముఖ్యత గురించి ప్రధాని మన్ కీ బాత్ లో ప్రస్తావించారన్న విషయాన్ని గుర్తు చేశారు. ముఖ్యంగా క్రీడలు విద్యార్థులను చైతన్యపరుస్తాయని అభిప్రాయపడ్డారు. అంతేగాకుండా ఆరోగ్యంగా, మానసికంగా ధృడంగా చేస్తాయని, న్యాయకత్వలక్షణాలు అలువరుస్తాయని తెలిపారు. క్రీడాకారుల జీవితాలపై సినిమాలు రావడం మంచి పరిణామమని, ఇవి క్రీడలను ఎంచుకునేలా యువతకు స్పూర్తిని కల్గిస్తాయని వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. ఇక వారణాసీ స్మార్ట్ సిటీ అవుతుందని ప్రజల సహకారంతో మార్పు సాధ్యమన్నారు. వారణాసీ స్మార్ట్ సిటీ అయ్యేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సహకరిస్తుందిని తెలిపారు. -
జేఎన్టీయూ-కే ఖోఖో బాలికల జట్టు ఎంపిక
గుడ్లవల్లేరు(గుడివాడ): కాకినాడ జేఎన్టీయూ ఖోఖో బాలికల జట్టును మంగళవారం గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్లో ఎంపిక చేశారు. ఎనిమిది జిల్లాల్లోని అనుబంధ కళాశాలల నుంచి 70 మంది క్రీడాకారిణులు పాల్గొన్నారు. జేఎన్టీయూ-కె జట్టుకు కె.పూర్ణ, ఎస్.తులసి (దువ్వాడ విజ్ఞాన్ ఇంజినీరింగ్), సీహెచ్ నవ్యశ్రీ,, కె.బాలనాగమ్మ (కోరంగి కైట్), టి.పండు (నూజివీడు సారధి), ఎం.శ్రీదేవి, ఇ.ప్రియాంక (సూరంపాలెం ప్రగతి), పి.మౌనిక, పి.లహరి (చీరాల ఇంజినీరింగ్), ఆర్.సాయిలక్ష్మి ప్రసన్న (నున్న వికాస్), ఎల్.భార్గవి(విజయనగరం జేఎన్టీయూ), ఎ.కీర్తి, జి.నాగబిందు (గుడ్లవల్లేరు ఇంజినీరింగ్), ఎం.జ్యోతి (బూడంపాడు సెయింట్ మేరీస్), ఎల్.పుష్పలత (నర్సరావుపేట తిరుమల ఇంజినీరింగ్), ఎ.మాధురి(గుంటూరు ఎన్నారై) ఎంపికయ్యారని ప్రోగ్రామ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎం.శివశంకర్ తెలిపారు. ఈ జట్టుకు ఈ నెల 31వ తేదీ వరకు గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్‌లోనే శిక్షణ ఇస్తున్నామని పేర్కొన్నారు. వచ్చే నెల 2వ తేదీ నుంచి 6 వరకు తమిళనాడులోని కాంచీపురం సమీపంలోని చిట్టినాడు అకాడమీలో జరిగే దక్షిణ భారత అంతర విశ్వవిద్యాలయాల ఖోఖో బాలికల పోటీల్లో ఈ జట్టు పాల్గొంటుందని చెప్పారు. కార్యక్రమంలో కాకినాడ జేఎన్టీయూ యూనివర్సిటీ డీన్ డాక్టర్ జీవీఎన్ ప్రసాద్, అబ్జర్వర్ డాక్టర్ బీపీ రాజు, సెలక్షన్ కమిటీ మెంబర్స్ కె.వెంకట్రావు (విజయవాడ), ఎన్.ఆదినారాయణ (కాకినాడ), కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ పి.నాగేశ్వరరెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ పి.రవీంద్రబాబు, పీడీలు దేశపతి, లావణ్య, శ్రీనివాస్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. -
హోరాహోరీగా ఖోఖో పోటీలు
గుంటూరు స్పోర్ట్స్: ఖేలో ఇండియా జిల్లా స్థాయి క్రీడాపోటీలలో భాగంగా జిల్లా క్రీడాభివృ«ద్ధి సంస్థ ఆధ్వర్యంలో శనివారం స్థానిక బ్రహ్మానందరెడ్డి స్టేడియంలో అండర్–14, 17 బాలబాలికల ఖోఖో పోటీలు హోరాహోరీగా జరిగాయి. పోటీలలో 110 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. విజేతలకు జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈవో జోసఫ్ కుమార్ బహుమతులు అందించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడాకారుల ప్రతిభను వెలికితీసేందుకు క్రీడలు దోహదపడుతాయన్నారు. కార్యక్రమంలో జిల్లా క్రీడాభివృద్ధి అధికారి శ్రీనివాసరావు, వ్యాయామ ఉపాధ్యాయులు, శిక్షకులు తదితరులు పాలొన్నారు.అండర్–14 బాలుర విభాగంలో మాచర్ల జట్టు ప్రథమ, సత్తెనపల్లి జట్టు ద్వితీయ, వినుకొండ జట్టు తృతీయ స్థానాలు సాధించాయి.బాలికల విభాగంలో మాచర్ల జట్లు ప్రథమ, బాపట్ల ద్వితీయ, వినుకొండ తృతీయ స్థానాలు సాధించాయి. అండర్–17 బాలుర విభాగంలో బాపట్ల జట్టు ప్రథమ, చిలకలూరి పేట జట్టు ద్వితీయ, గురజాల జట్టు తృతీయ స్థానాలు సాధించాయి. బాలికల విభాగంలో మాచర్ల జట్టు ప్రథమ, వేమూరు జట్టు ద్వితీయ, ప్రత్తిపాడు జట్టు తృతీయ స్థానాలు సాధించాయి. -
ముచ్చటగా మూడోస్థానం
భీమడోలు : స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో జిల్లా ఖోఖో అసోసియేషన్ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు నిర్వహించిన 36వ రాష్ట్ర స్థాయి అండర్–18 జూనియర్ బాల, బాలికల ఖోఖో పోటీలు శుక్రవారం ముగి శాయి. రాష్ట్రస్థాయి ఖోఖో పోటీల్లో బాలుర విభాగంలో ప్రథమ స్థానాన్ని ప్రకాశం, ద్వితీయస్థానాన్ని విశాఖపట్నం జట్లు సాధించాయి. పశ్చిమ గోదావరి, విజయనగరం జిల్లా జట్లు తృతీయస్థానంతో సరిపెట్టుకున్నాయి. బాలికల విభాగంలో ప్రథమ స్థానాన్ని విజయనగరం, ద్వితీయ స్థానం కృష్ణా జిల్లా, తృతీయ స్థానాలను పశ్చిమ గోదావరి జిల్లా, విశాఖపట్నం టీములు గెలుచుకున్నాయి. ఉత్తమ ప్రతిభ చూపిన క్రీడాకారులను జాతీయస్థాయి జట్టుకు ఎంపిక చేశారు. జాతీయస్థాయికి ఎంపికైన బాలుర జట్టు ఇదే.. ప్రకాశం జిల్లాకు చెందిన కె.అనిల్, పి.విశ్వనాథన్, పి.బాల సామిరెడ్డి, విశాఖపట్నం నుంచి పి.నరేష్, టి.తలుపులు, ఎల్.సురేష్ (విజయనగరం), రమేష్ (పశ్చిమ గోదావరి), మునిశేఖర్(చిత్తూరు), అబ్బాస్ అలీ(కృష్ణా జిల్లా), కె.చరణ్(కడప), హేమ సుందర్(గుంటూరు), రామాంజనేయులు(అనంతపురం). బాలికల జట్టు విజయనగరం నుంచి బి.శిరీషా, బి.శాంతమ్మ, కృష్ణా నుంచి కె.కుమారి, పి.నవ్య, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి జి.రాజీ, వి.ప్రభావతి, పి.చక్ర అనూష(తూర్పుగోదావరి), జి.పార్వతి(కడప), పి.వినీత(అనంతపురం), పి.అనూష(విశాఖపట్నం), కె.సుజాత(గుంటూరు), సీహెచ్ ప్రియాంక(నెల్లూరు). -
ఖోఖో జిల్లా జట్ల ఎంపిక
గుంతకల్లు టౌన్ : స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడామైదానంలో మంగళవారం జిల్లా ఖోఖో అసోసియేషన్ ఆ««దl్వర్యంలో ఖోఖో అండర్–18 జిల్లా బాలుర, బాలికల జట్లను ఎంపిక చేశారు. క్రీడాకారుల ప్రతిభ ఆధారంగా 12 మందితో కూడిన బాలుర జట్టును ఎంపిక చేసినట్లు ఖోఖో అసోసియేషన్ జిల్లా కార్యదర్శి జి.పుల్లారెడ్డి, కళాశాల ప్రిన్సిపల్ కె.శ్రీనివాసులు, ఏడీసీసీఏ జిల్లా కార్యదర్శి నాగార్జున ప్రసాద్ ప్రకటించారు. అలాగే ఇటీవల నెల్లూరులో జరిగిన రాష్ట్రస్థాయి ఖోఖో పోటీల్లో పాల్గొన్న బాలికల జట్టులో అద్భుతమైన ప్రతిభ కనబరిచిన 10 మందితోపాటు రాష్ట్రస్థాయి క్రీడాకారిణులైన గుంతకల్లుకు చెందిన ఇద్దరు అమ్మాయిలను బాలికల జట్టుకు ఎంపిక చేశామన్నారు. ఈ రెండు జట్లు ఈ నెల 26–28 వరకు పశ్చిమ గోదావరి జిల్లా భీమడోలులో రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటాయన్నారు. సెలెక్షన్ కమిటీ సభ్యులు, పీఈటీలు శ్రీనివాసులు, ప్రభాకర్, మారుతీ ప్రసాద్ పాల్గొన్నారు. ఎంపికైన బాలుర జట్టు : రామాంజినేయులు, వంశీకృష్ణ, సురేష్, భాస్కర్, మనోజ్‌కుమార్(గుంతకల్లు), ఎర్?రస్వామి, రాజశేఖర్, పురుషోత్తం(ఆమిద్యాల), నాగార్జున(అనంతపురం), వేణు, కానప్ప(చిన్నహోతూరు), శశి(ఉరవకొండ). బాలికల జట్టు : మునీషా, ఆశాబీ, రుబేనా(గుంతకల్లు), వినీత, జ్యోతి, గాయత్రి, హరిత(చిన్నహోతూరు), కవిత, వరలక్షి్మ, శిరీష(నింబగల్లు), ధనలక్షి్మ, శిల్ప(ఆమిద్యాల). -
ముగిసిన ఖోఖో క్రీడలు
నల్లగొండ టూటౌన్: జిల్లా కేంద్రంలోని నల్లగొండ పబ్లిక్ స్కూల్లో నిర్వహించిన సీబీఎస్ఈ క్లస్టర్ – 7 ఖో ఖో పోటీలు గురువారం ముగిశాయి. తెలంగాణ, ఏపీ నుంచి 12 జట్లు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా పాఠశాల ప్రెసిడెంట్ జగిని భీమయ్య మాట్లాడుతూ క్రీడాకారులు గెలుపొటములను సమానంగా తీసుకోవాలన్నారు. విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచి క్రీడల్లో పాల్గొంటే అన్ని రకాలుగా విజయాలు సాధించవచ్చన్నారు. అనంతరం మెుదటి బహుమతి సాధించిన నల్లగొండ, ద్వితీయ బహుమతి సాధించిన మెదక్, తృతీయ బహుమతి సాధించిన తెనాలి, రంగారెడిడ జట్లకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కార్యదర్శి జి.అమరేందర్‌రావు, కోశాధికారి పుల్లెంల వెంకటనారాయణగౌడ్, ప్రిన్సిపాల్ పార్థసారధి, అబ్జర్వర్ రాయపురెడ్డిలు పాల్గొన్నారు. -
సెమీస్‌లో తెలంగాణ జట్లు
సాక్షి,హైదరాబాద్: సౌత్‌జోన్ జాతీయ జూనియర్ ఖో- ఖో చాంపియన్‌షిప్‌లో తెలంగాణ బాలబాలికల జట్లు సెమీస్‌లోకి ప్రవేశించాయి. ఉప్పల్‌లోని మున్సిపల్ స్టేడియంలో శనివారం జరిగిన బాలుర తొలి లీగ్ మ్యాచ్‌లో తెలంగాణ జట్టు 10-6తో కర్నాటకపై గెలపొందగా... రెండో మ్యాచ్‌లో 9-6తో ఆంధ్రప్రదేశ్ జట్టును ఓడించింది. బాలికల విభాగంలోనూ తెలంగాణ జట్టు 11-10తో కర్నాటకపై, 20-15తో ఆంధ్రప్రదేశ్ జట్టుపై విజయం సాధించింది. -
ప్రతిష్టాత్మకంగా రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలు
నెల్లూరు(బృందావనం): నెల్లూరులో అక్టోబర్ 1 నుంచి మూడు రోజుల పాటు నిర్వహించనున్న రాష్ట్రస్థాయి సీనియర్ ఖోఖో చాంపియన్ షిప్ పోటీలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని జిల్లా ఖోఖో అసోసియేషన్ నిర్ణయించింది. స్థానిక ఏసీ సుబ్బారెడ్డి క్రీడాప్రాంగణంలోని జిల్లా క్రీడాప్రాధికార సంస్థ కార్యాలయంలో జిల్లా ఖోఖో అసోసియేషన్ కార్యవర్గం రాష్ట్ర స్థాయి పోటీల నిర్వహణపై ఆదివారం సమావేశమైంది. రాష్ట్రస్థాయి పోటీల నిర్వహణపై చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా క్రీడాభివృద్ధి అధికారి పీవీ రమణయ్యను ఘనంగా సత్కరించారు. ఈ సమావేశంలో జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ కోశాధికారి పసుపులేటి రామమూర్తి, జిల్లా ఖోఖో సంఘం అధ్యక్షుడు షేక్ జిలానీబాషా, ఆంధ్రప్రదేశ్ స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి మహబూబ్‌బాషా, జిల్లా ఖోఖో సంఘం కార్యదర్శి గురుప్రసాద్, కోశాధికారి ఎం గిరిప్రసాద్, తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రస్థాయి పోటీలకు సీనియర్ ఖోఖో జట్ల ఎంపికలు పూర్తి రాష్ట్రస్థాయి పోటీలకు జిల్లా సీనియర్ పురుషుల, మహిళల ఖోఖో జట్ల ఎంపికలను ఆదివారం నిర్వహించారు. స్థానిక ఏసీ సుబ్బారెడ్డి క్రీడాప్రాంగణంలో నిర్వహించిన పోటీల్లో ప్రతిభకనబర్చిన క్రీడాకారులను జిల్లా జట్టుకు ఎంపిక చేశారు. జిల్లా జట్ల ఎంపికలను జిల్లా ఖోఖో అసోసియేషన్ నిర్వాహకులు, డీఎస్డీఓ రమణయ్య, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ కోశాధికారి రామమూర్తి పర్యవేక్షించారు.