సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) ఇంటర్ కాలేజి ఖో–ఖో చాంపియన్‌షిప్‌లో ప్రభుత్వ వ్యాయామ విద్య కాలేజి (జీసీపీఈ) జట్టు సత్తా చాటింది. కేశవ్ మెమోరియల్ డిగ్రీ కాలేజి (నారాయణగూడ) వేదికగా జరిగిన ఈ టోర్నమెంట్‌లో జీసీపీఈ జట్టు విజేతగా నిలిచి టైటిల్‌ను కైవసం చేసుకుంది. శుక్రవారం జరిగిన ఫైనల్లో జీసీపీఈ 11–10తో సిద్ధార్థ వ్యాయామ విద్య కాలేజి (ఇబ్రహీంపట్నం) జట్టుపై విజయం సాధించింది.
మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో భవన్స్ కాలేజి 16–8తో నిజాం కాలేజిపై నెగ్గింది. అంతకుముందు జరిగిన సెమీస్ మ్యాచ్‌ల్లో జీసీపీఈ 14–5తో భవన్స్ కాలేజిపై, సిద్ధార్థ కాలేజి 13–4తో నిజాం కాలేజిపై ఘనవిజయం సాధించాయి. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో నిజాం కాలేజి ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎల్.బి.లక్ష్మీకాంత్ రాథోడ్ ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీని అందజేశారు. ఈ కార్యక్రమంలో కేఎంఈ సొసైటీ సంయుక్త కార్యదర్శి బి. శ్రీధర్ రెడ్డి, కేఎంఐసీఎస్ ప్రిన్సిపాల్ జె. నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment