న్యూస్ మేకర్
మొదటిసారిగా ప్రవేశపెట్టినఖోఖో వరల్డ్ కప్ 2025నుమన పురుషుల జట్టు గెలిచింది.అంతకంటే ఘనంగా మహిళాజట్టు కూడా గెలిచింది.బరిలో ఎవరి సత్తా వారిదే అన్నట్టుగాసాగిన ఈ వరల్డ్‌కప్‌లో23 దేశాలు పాల్గొంటే వారిపై గెలుపుకుమన మహిళాజట్టును ముందుండి నడిపించింది కెప్టెన్ ప్రియాంక ఇంగ్లే. పుణెకు చెందిన ఈ రైతుబిడ్డముంబైలో టాక్స్ అసిస్టెంట్‌గా పని చేస్తోంది. ఆమె పరిచయం
సరే. ముందు ఏం జరిగిందో చూద్దాం. గ్రూప్ స్టేజ్‌లో ఫస్ట్ మేచ్ పాకిస్తాన్‌తో పడింది. గెలిచారు. ఆ తర్వాత గట్టి జట్లయిన ఇరాన్, సౌత్ కొరియా, మలేసియా జట్లతో గెలిచారు. ఆ తర్వాత గెలుచుకుంటూ వచ్చి క్వార్టర్ ఫైనల్స్‌లో అత్యంత గట్టి జట్టు బంగ్లాదేశ్‌ను మట్టి కరిపించారు. సెమి ఫైనల్స్‌లో దక్షిణాఫ్రికా పరిస్థితి కూడా అంతే అయ్యింది. ఇక జనవరి 19న ఫైనల్స్. ప్రత్యర్థి జట్టు నే పాల్. ఈ జట్టుకు ఖోఖో బాగా వచ్చు. పైగా యంగ్ ప్లేయర్లు చాలామంది ఉన్నారు. కాని భారత జట్టులో యంగ్ ప్లేయర్లతో పాటు అనుభవజ్ఞులు కూడా ఉన్నారు. తోడు కెప్టెన్‌గా 15 ఏళ్ల అనుభవం ఉన్న ప్రియాంక ఉంది. ఖోఖోలో టచ్ పాయింట్లు ఉంటాయి. ఫైనల్స్‌లో భారత్ 78 టచ్ పాయింట్లతో నే΄ాల్‌ను 40 పాయింట్లతో కట్టడి చేసి ఘన విజయం సాధించింది. చరిత్రలో మొట్టమొదటిసారి ఖోఖో వరల్డ్ కప్ జరిగితే (జనవరి 13–19, న్యూఢిల్లీ) 23 దేశాలు పాల్గొంటే వాటన్నింటిని ఓడించి కప్‌ను సొంతం చేసుకుంది భారత మహిళా ఖోఖో జట్టు. అలా ప్రియాంక ఇంగ్లే తన జట్టుతో పాటు చరిత్రలో నిలిచిపోయింది.
ఇంతకాలం క్రికెట్‌కు క్రేజ్ ఉండేది. ఆ తర్వాత కబడ్డీ రంగం మీదకు వచ్చింది. ఇప్పుడు ఖోఖో. ఈ ఆటకు ఒలింపిక్స్‌లో చోటు దక్కితే ఒలింపిక్స్ మెడల్ సాధించడమే తమ లక్ష్యం అంటున్నారు ప్రియాంక ఇంగ్లే. చూడబోతే అదేం పెద్ద విషయం కానట్టుంది.
వీధి ఆట
పుణెలో రైతు కుటుంబంలో జన్మించిన ప్రియాంక తన స్కూల్లో ఐదో ఏట ఖోఖోలో చేరింది. అయితే తల్లిదండ్రులు పెద్దగా ఎంకరేజ్ చేయలేదు. ‘ఇది వీధి ఆట. బస్తీల్లో ఆడే ఆట. ఈ ఆటతో ఏం ప్రయోజనం’ అన్నారు. అయితే 8వ తరగతి వచ్చేసరికి నేషనల్స్‌కు ఆడటం మొదలుపెట్టింది. మెడల్స్ కూడా సాధించ సాగింది. అప్పుడు తల్లిదండ్రులు మనమ్మాయి బాగా ఆడుతోందని ప్రోత్సహించారు. ప్రియాంక ఇప్పటికి 23 నేషనల్ టైటిల్స్ గెలిచింది. నాల్గవ ఆసియన్ ఛాంపియన్‌షిప్‌లో గోల్డ్‌మెడల్ సాధించింది. అయినప్పటికీ ఆమె కెప్టెన్ అవుతానని ఊహించలేదు. వరల్డ్ కప్ 2025 పోటీలు జనవరి 13 నుంచి మొదలవనుండగా 11వ తేదీన, రెండురోజుల ముందు ఆమెను కెప్టెన్‌గా అనౌన్స్ చేశారు. ‘మట్టి మీద ఆడే ఆట నుంచి మ్యాట్ మీద ఆడే ఆట వరకూ ఎదిగిన ఖోఖోలో నేనూ సభ్యురాలు కాగలిగినందుకు గర్వించాను’ అంటుంది ప్రియాంక.
బరువైన ట్రోఫీ
వరల్డ్ కప్ ప్రారంభమైనప్పటి నుంచి వేదిక మీద ఉంచిన ట్రోఫీని మహిళాజట్టు సభ్యులందరూ తాకి చూశారు. ‘అది చాలా బరువున్న ట్రోఫీ. దానిని పట్టుకుని ఫొటో దిగడం సాధ్యం చేసుకోవాలని నిశ్చయించుకున్నాను’ అంటుంది ప్రియాంక. వరల్డ్ కప్ కోసం నెల రోజుల పాటు సాగిన క్యాంప్‌లో కోచ్‌లు 15 మంది గట్టి ప్లేయర్లను తీర్చిదిద్దారు. డిఫెండర్స్, అటాకర్స్, వజీర్స్ అనే మూడు కేటగిరీల్లో ఆటగాళ్లు తర్ఫీదు అవుతారు. ప్రియాంక ఆల్‌రౌండర్. ‘ఫైనల్స్‌లో నేపాల్ వస్తుందని మాకు తెలుసు. ఫస్ట్ హాఫ్‌లో వారిని తట్టుకోవడం కొంచెం కష్టమైంది. అయితే సెకండ్ హాఫ్‌లో మేము స్ట్రాటజీ మార్చి గెలిచాం. మా జట్టులో యంగ్ ప్లేయర్ల దూకుడు తగ్గిస్తూ అనుభవంతో ఆడుతూ ఈ గెలుపు సాధించాను’ అంది ప్రియాంక.
ఎం.కామ్ చేసి గవర్నమెంట్ టాక్స్ విభాగంలో ఉద్యోగం చేస్తోంది ఫ్రియాంక. ‘ఖోఖో ఆటగాళ్లకు ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలు వస్తున్నాయి. సాయం కూడా అందుతోంది. రోజులు బాగున్నాయి. మా మహారాష్ట్రలో ఖోఖో బాగా ఆడతాం. మా రాష్ట్రానికి నేను సరైన ట్రోఫీనే అందించాను’
అని ΄పొంగియింది ప్రియాంక.
ఇదీ చదవండి: ట్రంప్ విందులో నీతా స్పెషల్ లుక్.. ఈ చీరకు 1900 గంటలు పట్టిందట!
Comments
Please login to add a commentAdd a comment