kho kho championship
-
అంతర్జాతీయ ఖోఖోలో.. 'సైరా' అనిపించిన తెలంగాణ సాయిరాజ్..
ఆదిలాబాద్: లోకేశ్వరం మండలంలోని మన్మద్ గ్రామానికి చెందిన సాయిరాజ్ అంతర్జాతీయ ఖోఖో పోటీల్లో ఇండియా తరఫున పాల్గొని బంగారు పతకాన్ని సాధించాడు. ఇటీవల నేపాల్దేశంలో జరిగిన అంతర్జాతీయ ఖోఖో పోటీల్లో రాణించి బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నాడు. దీంతో కోచ్ అన్నపూర్ణ, గ్రామస్తులు అతడిని అభినందించారు. -
రంగారెడ్డి మహిళల జట్టుకు టైటిల్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సీనియర్ ఖో–ఖో చాంపియన్‌షిప్‌లో రంగారెడ్డి జిల్లా మహిళల జట్టు సత్తా చాటింది. మేడారంలో నాలుగు రోజుల పాటు జరిగిన ఈ టోరీ్నలో విజేతగా నిలిచి టైటిల్‌ను కైవసం చేసుకుంది. మహిళల ఫైనల్లో రంగారెడ్డి 11–9తో కరీంనగర్‌పై గెలుపొందింది. మూడో స్థానం కోసం జరిగిన పోరులో మహబూబ్‌నగర్ 8–5తో వరంగల్‌పై నెగ్గింది. పురుషుల విభాగంలో వరంగల్ చాంపియన్‌గా నిలిచింది. తుదిపోరులో వరంగల్ 11–8తో కరీంనగర్‌ను ఓడించింది. రంగారెడ్డి 9–7తో హైదరాబాద్‌పై గెలుపొంది మూడోస్థానాన్ని దక్కించుకుంది. ఫైనల్ అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో ములుగు అదనపు ఎస్పీ సాయి చైతన్య ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను అందజేశారు. -
తెలంగాణ జట్టుకు రజతం
సాక్షి, హైదరాబాద్: జాతీయ స్థాయి ఖో–ఖో చాంపియన్‌షిప్‌లో తెలంగాణ జట్టు రాణించింది. సీఐఎస్సీఈ నేషనల్ స్పోర్ట్స్ ఆధ్వర్యంలో జరిగిన ఈ టోరీ్నలో తెలంగాణ రన్నరప్‌గా నిలిచి రజతాన్ని గెలుచుకుంది. ఆతిథ్య ఉత్తర్‌ప్రదేశ్ జట్టు విజేతగా నిలిచింది. ఘజియాబాద్ వేదికగా పోటీలు జరుగగా... రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించిన సెయింట్ జోసెఫ్ (హబ్సిగూడ) విద్యార్థి జి. కృషితా రెడ్డి టోర్నీ ఆసాంతం ఉత్తమ ప్రదర్శనతో ఆకట్టుకుంది. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం కృషితా రెడ్డిని అభినందించింది. ఆమె త్వరలో జరుగనున్న ఎస్జీఎఫ్ఐ అండర్–14 పోటీల్లో పాల్గొనే జట్టులోనూ స్థానం దక్కించుకుంది. -
జీసీపీఈ జట్టుకు టైటిల్
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) ఇంటర్ కాలేజి పురుషుల ఖో–ఖో టోర్నమెంట్లో జీసీపీఈ దోమలగూడ జట్టు టైటిల్‌ను కైవసం చేసుకుంది. కేశవ్ మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కామర్స్ అండ్ సైన్స్ కాలేజి (నారాయణగూడ) ప్రాంగణంలో జరిగిన ఈ టోర్నీలో జీసీపీఈ జట్టు విజేతగా నిలిచింది. సోమవారం జరిగిన ఫైనల్లో జీసీపీఈ 8–7తో నిజాం కాలేజిపై గెలుపొందింది. మూడో స్థానం కోసం జరిగిన పోరులో సిద్ధార్థ కాలేజి 8–1తో భవన్స్ న్యూ సైన్స్ (నారాయణగూడ) జట్టును ఓడించింది. అంతకుముందు జరిగిన సెమీస్ మ్యాచ్‌ల్లో నిజాం 14–9తో భవన్స్పై, జీసీపీఈ 14–7తో సిద్ధార్థ జట్లపై గెలుపొందాయి. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో కేశవ్ మెమోరియల్ ఎడ్యుకేషనల్ సొసైటీ సంయుక్త కార్యదర్శి శ్రీధర్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను అందజేశారు. -
విజేత కోఠి ఉమెన్స్ కాలేజి
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) ఇంటర్ కాలేజి మహిళల ఖో–ఖో చాంపియన్‌షిప్‌లో ఆతిథ్య కోఠి ఉమెన్స్ కాలేజి జట్టు విజేతగా నిలిచింది. శుక్రవారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో కోఠి ఉమెన్స్ జట్టు 10–1తో సెయింట్ ఆన్స్ (మెహిదీపట్నం) కాలేజీని చిత్తుగా ఓడించింది. మూడో స్థానం కోసం జరిగిన పోరులో వికారాబాద్ సాంఘిక సంక్షేమ కాలేజి జట్టు 4–1తో ఎల్బీనగర్ సాంఘిక సంక్షేమ కాలేజిపై గెలుపొందింది. అంతకుముందు జరిగిన సెమీస్ మ్యాచ్‌ల్లో కోఠి ఉమెన్స్ జట్టు 11–1తో వికారాబాద్ సాంఘిక సంక్షేమ కాలేజిపై, సెయింట్ ఆన్స్ (మెహిదీపట్నం) 16–2తో ఎల్బీ నగర్ సాంఘిక సంక్షేమ కాలేజిపై విజయం సాధించాయి. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో నిజాం కాలేజి ప్రిన్సిపాల్ ఎల్బీ లక్ష్మీకాంత్ రాథోడ్ ముఖ్య అతిథిగా పాల్గొని విజేతలకు ట్రోఫీని అందజేశారు. ఈ కార్యక్రమంలో కోఠి ఓయూసీడబ్ల్యూ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ రోజారాణి, టోర్నీ కార్యనిర్వాహక కార్యదర్శి వి. దీపిక, ఓయూ ఐసీటీఎస్ కార్యదర్శి బి. సునీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఖో–ఖో విజేత సెయింట్ పాయ్స్
సాక్షి, హైదరాబాద్: వైఎంసీఏ నారాయణగూడ ఆధ్వర్యంలో జరుగుతున్న కార్గిల్ విక్టరీ స్పోర్ట్స్ మీట్లో సెయింట్ పాయ్స్ బాలికల జట్టు విజేతగా నిలిచింది. శుక్రవారం జరిగిన ఖో–ఖో సీనియర్ బాలికల టైటిల్‌పోరులో సెయింట్ పాయ్స్ హైస్కూల్ 25–23తో మంచి స్కూల్ బాలాపూర్‌పై విజయం సాధించింది. జూనియర్ బాలుర ఫైనల్లో శ్రీవిద్య హైస్కూల్ 25–17తో శ్రీ మోడల్ హైస్కూల్‌ను ఓడించింది. జూనియర్ బాలికల కేటగిరీలో బేగాస్ హైస్కూల్ 8–3తో సెయింట్ ఫిలోమినా హైస్కూల్‌పై గెలుపొందింది. మరోవైపు వాలీబాల్ ఈవెంట్లో శ్రీవిద్య సెకం డరీ స్కూల్ తిలక్‌నగర్ చాంపియన్‌గా నిలిచింది. ఫైనల్లో శ్రీవిద్య స్కూల్ 25–17తో దిల్సుఖ్నగర్ పబ్లిక్ స్కూల్ (కర్మన్‌ఘాట్)పై గెలిచింది. -
ఆంధ్రప్రదేశ్‌కు మూడోస్థానం
సాక్షి, హైదరాబాద్: జూనియర్ సౌత్‌జోన్ జాతీయ ఖో–ఖో చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ బాలుర జట్టు మూడో స్థానంలో నిలిచింది. సరూర్‌నగర్ స్టేడియంలో జరిగిన ఈ టోర్నమెంట్లో కేరళ బాలికల జట్టు, తమిళనాడు బాలుర జట్టు విజేతలుగా నిలిచాయి. ఆదివారం జరిగిన బాలుర ఫైనల్లో తమిళనాడు 12–11తో కేరళపై గెలుపొందింది. బాలికల టైటిల్ పోరులో కేరళ 11–7తో కర్ణాటకను ఓడించింది. బాలికల విభాగంలో కర్ణాటక... బాలుర విభాగంలో ఆంధ్రప్రదేశ్ మూడోస్థానంలో నిలిచాయి. ఈ టోర్నీ ఆసాంతం రాణించిన ఆంధ్రప్రదేశ్ క్రీడాకారుడు నితీశ్ ‘బెస్ట్ చేజర్’ అవార్డును అందుకున్నాడు. రెండు రోజుల పాటు జరిగిన ఈ పోటీల్లో 6 రాష్ట్రాలకు చెందిన 12 జట్లు పాల్గొన్నాయి. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో శాట్స్ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్‌రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను అందజేశారు. -
రాష్ట్ర ఖో–ఖో జట్ల ప్రకటన
సాక్షి, హైదరాబాద్: జాతీయ ఖో–ఖో చాంపియన్‌షిప్‌లో పాల్గొనే రాష్ట్ర బాలబాలికల జట్లను గురువారం ప్రకటించారు. ఈ జట్లు మణిపూర్‌లోని తౌబాల్ నగరంలో సోమవారం నుంచి శుక్రవారం వరకు జరిగే జాతీయ ఖో–ఖో టోర్నీలో రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తాయి. బాలబాలికల జట్లకు కోచ్‌గా ఎన్. కష్ణమూర్తి, మేనేజర్‌గా గోపాల్ వ్యవహరిస్తారు. ఈ సందర్భంగా శాట్స్ చైర్మన్ ఎ. వెంకటేశ్వర్ రెడ్డి రాష్ట్ర జట్లకు ఎంపికైన క్రీడాకారులను అభినందించారు. వారికి స్పోర్ట్స్ కిట్లను అందజేశారు. జాతీయ, అంతర్జాతీయ టోర్నీల్లో తెలంగాణ జట్లు రాణించి రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్ర ఖో–ఖో సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కార్యదర్శి వై. శ్రీనివాసరావు, ఉమ్మడి కార్యదర్శి కె. రామకష్ణ, కోశాధికారి ఎన్. కష్ణమూర్తి, మేనేజర్ గోపాల్ తదితరులు పాల్గొన్నారు. జట్ల వివరాలు బాలురు: బి. మహేశ్, బి. సోమరాజు, జగతిబాబు, అశోక్ (రంగారెడ్డి), బి. ప్రవీణ్, మాజిద్ పాషా, డి. వినయ్ (వరంగల్), బి. రమేశ్, కె. రమేశ్(ఆదిలాబాద్), నరసింహస్వామి, ధీరజ్ (హైదరాబాద్). బాలికలు: బి. రేణుక, కె. అనూష (రంగారెడ్డి), ఎ. సంధ్య, పొనిక, శిరీష (వరంగల్), స్రవంతి, మహేశ్వరి (హైదరాబాద్), సి. కారుణ్య, లావణ్య, పరిమళ (నల్లగొండ), జి. కష్ణమ్మ (మహబూబ్‌నగర్), శారద సోని (ఖమ్మం). -
తెలంగాణ జట్లకు మూడో స్థానం
సాక్షి, హైదరాబాద్: ఫెడరేషన్ కప్ జాతీయ ఖో–ఖో చాంపియన్‌షిప్‌లో తెలంగాణ రాష్ట్ర జట్లు రాణించాయి. సరూర్‌నగర్ ఖో–ఖో స్టేడియంలో జరిగిన ఈ టోర్నీలో మహిళల, పురుషుల విభాగాల్లో మూడో స్థానాన్ని దక్కించుకున్నాయి. మహిళల టైటిల్‌పోరులో మహారాష్ట్ర 15–6తో కర్ణాటకపై గెలుపొంది చాంపియన్‌గా నిలిచింది. మూడో స్థానం కోసం జరిగిన పోరులో విదర్భపై తెలంగాణ గెలుపొందింది. పురుషుల ఫైనల్లో మహారాష్ట్ర 22–5తో కొల్హాపూర్‌పై విజయం సాధించింది. ఈ కేటగిరీలో తెలంగాణ మూడోస్థానంలో, కేరళ నాలుగో స్థానంలో నిలిచాయి. టోర్నీ ముగింపు కార్యక్రమంలో ‘శాట్స్’ ఎండీ ఎ. దినకర్ బాబు ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో భారత ఖో–ఖో సమాఖ్య కార్యదర్శి మహేందర్ సింగ్ త్యాగి, తెలంగాణ ఖో–ఖో సంఘం కార్యదర్శి వై. శ్రీనివాస రావు, రంగారెడ్డి జిల్లా ఖో–ఖో సంఘం కార్యదర్శి కె. రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
బెంగాల్‌పై తెలంగాణ గెలుపు
సాక్షి, హైదరాబాద్: ఫెడరేషన్ కప్ ఖో–ఖో చాంపియన్‌షిప్‌లో తెలంగాణ జట్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. సరూర్‌నగర్‌లో శనివారం జరిగిన మూడు మ్యాచ్‌ల్లో తెలంగాణ ఒక మ్యాచ్‌లో గెలిచి రెండింటిలో పరాజయం పాలైంది. పురుషుల తొలి మ్యాచ్‌లో తెలంగాణ 11–9తో పశ్చిమ బెంగాల్‌పై గెలుపొందగా, రెండో మ్యాచ్‌లో 4–13తో మహారాష్ట్ర చేతిలో పరాజయం పాలైంది. మహిళల విభాగంలోనూ మహారాష్ట్ర 10–6తో తెలంగాణ జట్టుపై విజయం సాధించింది. ఇతర మహిళల మ్యాచ్‌ల్లో కర్ణాటక 12–2తో పశ్చిమ బెంగాల్‌పై, పశ్చిమ బెంగాల్ 22–3తో ఢిల్లీపై, కర్ణాటక 19–4తో విదర్భపై, పశ్చిమ బెంగాల్ 4–0తో విదర్భపై, విదర్భ 8–7తో పశ్చిమ బెంగాల్‌పై గెలుపొందాయి. -
ఖో–ఖో క్రీడాకారులకు నగదు బహుమతి
సాక్షి, హైదరాబాద్: దక్షిణాసియా క్రీడల్లో అద్భుత ప్రతిభ కనబరిచిన రాష్ట్ర క్రీడాకారులకు ‘శాట్స్’ నగదు బహుమతిని అందజేసింది. భారత్‌కు ప్రాతినిధ్యం వహిం చిన రాష్ట్ర క్రీడాకారులు రంజిత్, నందినిలకు శాట్స్ ఎండీ ఎ. దినకర్‌బాబు రూ. 1.25 లక్షల చెక్‌ను అందజేశారు. మొత్తం 8 దేశాలు తలపడిన ఈ టోర్నీలో భారత్ పసిడి పతకాన్ని కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా దినకర్ బాబు మాట్లాడుతూ రాష్ట్రం నుంచి మరింత మంది క్రీడాకారులు దేశానికి ప్రాతినిధ్యం వహించేలా క్రీడల్లో రాణించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఖో–ఖో సంఘం కార్యదర్శి శ్రీనివాస్ రావు, సంయుక్త కార్యదర్శి రామకృష్ణ, పీఈటీలు పరమేశ్, సోని పాల్గొన్నారు. -
తెలంగాణ జట్లకు కాంస్యాలు
జాతీయ ఖో-ఖో చాంపియన్‌షిప్ సాక్షి, హైదరాబాద్: సీనియర్ సౌత్‌జోన్ జాతీయ ఖో-ఖో చాంపియన్‌షిప్‌లో తెలంగాణ జట్లు రాణించాయి. కర్ణాటకలోని గుల్బర్గాలో జరిగిన ఈ టోర్నీలో రాష్ట్ర పురుషుల, మహిళల జట్లు కాంస్య పతకాలను సాధించాయి. మూడో స్థానం కోసం ఆదివారం జరిగిన మ్యాచ్‌ల్లో తెలంగాణ పురుషుల జట్టు 9-8తో ఆంధ్రప్రదేశ్‌పై, మహిళల జట్టు కూడా 5-4తో ఆంధ్రప్రదేశ్‌పైనే గెలిచి మూడో స్థానంలో నిలిచాయి. అనంతరం రాష్ట్ర ఖో-ఖో సంఘం కార్యదర్శి శ్రీనివాసరావు, కోశాధికారి కృష్ణమూర్తి, సంయుక్త కార్యదర్శి రామకృష్ణ విజేత జట్లకు ట్రోఫీలను ప్రదానం చేశారు. -
రంగారెడ్డి ‘డబుల్’ ధమాక
రాష్ట్ర స్థాయి ఖో-ఖో టోర్నీ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర స్థాయి జూనియర్ ఖో-ఖో చాంపియన్‌షిప్‌లో రంగారెడ్డి క్రీడాకారులు సత్తా చాటారు. గద్వాలలో జరిగిన ఈ టోర్నమెంట్లో బాలబాలికల విభాగాల్లో టైటిల్స్‌ను చేజిక్కించుకున్నారు. గురువారం జరిగిన బాలుర ఫైనల్లో రంగారెడ్డి జట్టు 14-12తో కరీంనగర్‌పై విజయం సాధించింది. సెమీస్‌లో రంగారెడ్డి 10-6తో వరంగల్‌పై, కరీంనగర్8-7తో ఖమ్మంపై గెలుపొందారుు. తర్వాత జరిగిన బాలికల ఫైనల్లోనూ రంగారెడ్డి జట్టు 6-4తో కరీంనగర్ జట్టును ఓడించింది. అంతకుముందు జరిగిన సెమీఫైనల్లో రంగారెడ్డి 8-5తో నిజామాబాద్‌పై గెలుపొందగా... కరీంనగర్ 6-5తో మహబూబ్‌నగర్‌ను ఓడించింది.