రంగారెడ్డి ‘డబుల్’ ధమాక | rangareddy gets double dhamka in junior kho kho championship | Sakshi
Sakshi News home page

రంగారెడ్డి ‘డబుల్’ ధమాక

Published Sat, Oct 29 2016 12:56 PM | Last Updated on Mon, Sep 4 2017 6:41 PM

rangareddy gets double dhamka in junior kho kho championship

రాష్ట్ర స్థాయి ఖో-ఖో టోర్నీ  

సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర స్థాయి జూనియర్ ఖో-ఖో చాంపియన్‌షిప్‌లో రంగారెడ్డి క్రీడాకారులు సత్తా చాటారు. గద్వాలలో జరిగిన ఈ టోర్నమెంట్‌లో బాలబాలికల విభాగాల్లో టైటిల్స్‌ను చేజిక్కించుకున్నారు. గురువారం జరిగిన బాలుర ఫైనల్లో రంగారెడ్డి జట్టు 14-12తో కరీంనగర్‌పై విజయం సాధించింది. సెమీస్‌లో రంగారెడ్డి 10-6తో వరంగల్‌పై, కరీంనగర్8-7తో ఖమ్మంపై గెలుపొందారుు.

 

తర్వాత జరిగిన బాలికల ఫైనల్లోనూ రంగారెడ్డి జట్టు 6-4తో కరీంనగర్ జట్టును ఓడించింది. అంతకుముందు జరిగిన సెమీఫైనల్లో రంగారెడ్డి 8-5తో నిజామాబాద్‌పై గెలుపొందగా... కరీంనగర్ 6-5తో మహబూబ్‌నగర్‌ను ఓడించింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement