భారతీయ క్రీడగా పేరొందిన ఖో-ఖోకు స్పాన్సర్‌షిప్ పెరుగుతోంది. ఈ ఆటను మరింత మందికి చేరువ చేసేందుకు కార్పొరేట్ కంపెనీలు తమ సహకారం అందిస్తున్నాయి. అంతర్జాతీయ గుర్తింపు లభించే దిశగా ఖో-ఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (కేకేఎఫ్ఐ) పని చేస్తోంది. 2000 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన ఖో-ఖోను చాలాకాలంగా దక్షిణ ఆసియాలో ఎక్కువగా ఆడుతున్నారు. అయితే క్రికెట్ అంతటి ప్రజాదరణ పొందడంలో మాత్రం వెనకబడింది. ఈ పరిస్థితిని మార్చి ఖోఖోను ప్రపంచ వేదికలపై నిలబెట్టే ప్రయత్నాన్ని కేకేఎఫ్ఐ చేస్తోంది. ఇందులో భాగంగా ఈ సంస్థ మరిన్ని స్పాన్సర్‌షిప్‌లకు కోసం చూస్తోంది.
ఖో-ఖో ప్రపంచకప్
కేకేఎఫ్ఐ ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన ఖో-ఖో ప్రపంచకప్‌ను ఆవిష్కరించింది. జనవరి 13 నుంచి 19 వరకు దీన్ని నిర్వహించనున్నారు. ఈ ప్రారంభ కార్యక్రమంలో 23 దేశాలకు చెందిన జట్లు పోటీపడ్డాయి. ఏరియల్ డ్యాన్సర్లతో సహా ప్రసిద్ధ కళాకారుల ప్రదర్శనలు, స్టార్ పెర్ఫార్మర్ షిమాక్ దావర్ కొరియోగ్రఫీతో ఈ టోర్నమెంట్ ప్రారంభ వేడుకలు నిర్వహించారు.
స్పాన్సర్ షిప్‌లు
ఖో-ఖోను ఆధునీకరించడంలో భాగంగా కేకేఎఫ్ఐ క్రీడా ప్రాంగణాల్లో మార్పులు చేస్తోంది. గతంలో ఇది మట్టి కోర్టుల్లో జరిగేది. దాన్ని ఇండోర్ మ్యాట్లపై జరిగేలా చేసింది. ఇది ఆటగాళ్లకు, ప్రేక్షకులకు అనుకూలంగా మారింది. ఈ వాతావరణం స్పాన్సర్ షిప్‌లను కూడా ఆకర్షించింది. ప్రస్తుతం ఢిల్లీలో జరుగుతున్న ఖో-ఖో ప్రపంచకప్‌నకు ఈజ్ మై ట్రిప్, జీఎంఆర్ ఏరో, జొమాటో, బ్లాక్ బెర్రీస్, టాటా వంటి బ్రాండ్లు మద్దతు ఇస్తున్నాయి. డిస్నీ+ హాట్‌స్టార్, స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్, డీడీ స్పోర్ట్స్ వంటి ప్రధాన నెట్వర్క్‌ల్లో ఈ టోర్నమెంట్ ప్రసారం అవుతోంది. ఈ టోర్నమెంట్లకు 200 మిలియన్లకు పైగా వ్యూయర్‌షిప్ ఉంటుందని అంచనా.
ఇదీ చదవండి: క్రెడిట్ కార్డు పోయిందా? బ్లాక్ చేయండిలా..
అల్టిమేట్ ఖో-ఖో (యూకేకే) లీగ్
క్రికెట్‌లో ఐపీఎల్, కబడ్డీలో ప్రో కబడ్డీ లీగ్ ఎలాగో ఖో-ఖోలోనూ అల్టిమేట్ ఖో-ఖో (యూకేకే) లీగ్‌ను 2022లో ప్రారంభించారు. ఇందులోనూ ఫ్రాంచైజీలుంటాయి. ప్రో కబడ్డీ లీగ్, ఇండియన్ సూపర్ లీగ్ తరువాత దేశంలో అత్యధికంగా వీక్షించిన క్రికెటేతర క్రీడా టోర్నమెంట్‌గా యూకేకే ప్రజాదరణ పొందింది. లీగ్ మొదటి సీజన్‌లో 64 మిలియన్ల వ్యూయర్ షిప్ సొంతం చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment