మారుతున్న జీవనశైలికి అనుగుణంగా క్రెడిట్‌కార్డుల వాడకం అధికమవుతోంది. అయితే ప్రయాణాల్లోనో లేదా ఇతర సందర్భాల్లోనో కార్డులను పోగోట్టుకోవడం సహజం. ఇలాంటి సమయాల్లో చాలామంది ఏ చర్యలు తీసుకోకుండా అలాగే వదిలేస్తూంటారు. ఆ కార్డు స్కామర్ల చేతికి చిక్కితే మాత్రం చాలా నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైనా సందర్భాల్లో కార్డులు కోల్పోతే వెంటనే బ్యాంకు అధికారులకు తెలియజేయాలి. వాటిని బ్లాక్ చేయించి కొత్తగా కార్డు కోసం దరఖాస్తులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు వినియోగదారులు ఒకవేళ తమ కార్డు కోల్పోతే ఎలా బ్లాక్ చేయాలో కింద తెలుసుకుందాం.
ఎస్‌బీఐ కార్డ్ హెల్ప్‌లైన్‌కు కాల్ చేయాలి. 39 02 02 02 (స్థానిక ఎస్టీడీ కోడను ముందు జత చేయాలి) లేదా 1860 180 1290కు డయల్ చేయాలి. పోయిన లేదా దొంగిలించబడిన కార్డు వివరాలతో ఐవీఆర్ సూచనలను పాటించాలి.
ఎస్ఎంఎస్ ద్వారా కూడా కార్డును బ్లాక్ చేయవచ్చు. రిజిస్టర్డ్ మొబైల్ నెంబరు నుంచి 5676791కు BLOCKXXXX (XXXX స్థానంలో కార్డు నెంబరు చివరి నాలుగు అంకెలు ఉండేలా చూసుకోవాలి)అని టైప్ చేసి టెక్ట్స్ మెసేజ్ చేయవచ్చు.
ఎస్‌బీఐ కార్డ్ వెబ్‌సైట్ ద్వారా కూడా కార్డును బ్లాక్ చేయవచ్చు. అధికారిక వెబ్‌సైట్‌లో మాత్రమే లాగిన్ అవ్వాలి.
ఎన్‌బీఐ కార్డ్స్ వెబ్‌సైట్(https://www.sbicard.com/)కు లాగిన్ అవ్వాలి.
లాగిన్ చేసిన తర్వాత హోం పేజీ ఎడమవైపున ఉన్న ‘రిక్వెస్ట్స్’ ట్యాబ్‌పై క్లిక్ చేయాలి.
‘రిపోర్ట్ లాస్ట్/ స్టోలెన్ కార్డ్’ ఆప్షన్ ఎంచుకోవాలి.
కార్డును బ్లాక్ చేయడానికి ప్రాంప్ట్‌లను అనుసరించాలి.
ఇదీ చదవండి: కొత్త ఉద్యోగం కోసం నిపుణులు పడిగాపులు
ఎస్‌బీఐ కార్డ్ మొబైల్ యాప్ ద్వారా బ్లాక్ చేయవచ్చు.
ఎస్‌బీఐ కార్డ్ మొబైల్ యాప్‌లోకి లాగిన్ అవ్వాలి.
హోం పేజీ ఎగువ ఎడమ వైపు కార్నర్‌లో మెనూ మీద ట్యాప్ చేయాలి.
‘సర్వీస్ రిక్వెస్ట్’ ఆప్షన్ ఎంచుకోవాలి.
‘లాస్/ స్టోలెన్ రిపోర్ట్’ ఆప్షన్ ఎంచుకోవాలి.
కార్డ్ నెంబరు ఎంచుకుని రెక్వెస్ట్‌ను సబ్మిట్ చేయాలి.
పైన చెప్పిన ఏ పద్ధతులు మీకు అందుబాటులో లేకపోతే వెంటనే మీ దగ్గర్లోని ఎస్‌బీఐ బ్రాంచ్‌ను సంప్రదించి సమస్యను తెలియజేయాలి. కార్డును బ్లాక్ చేసిన తరువాత ఎస్‌ఎంఎస్, ఈమెయిల్ ద్వారా ధ్రువీకరణ అందుతుంది.
Comments
Please login to add a commentAdd a comment