credit card companies
-
నెలలో 8.2 లక్షల క్రెడిట్ కార్డులు జారీ
దేశంలోని బ్యాంకులు 2024 డిసెంబర్ నెలలో సుమారు 8,20,000 కొత్త క్రెడిట్ కార్డు(Credit Cards)లను జారీ చేశాయి. ఇది గడిచిన నాలుగు నెలల్లో అత్యధిక సంఖ్యలో కార్డుల జారీని సూచిస్తుంది. పెళ్లిళ్ల సీజన్, ఇయర్ ఎండ్ ఫెస్టివల్స్ సమయంలో ఖర్చులు అధికమవడం ఈ కార్డుల పెరుగుదలకు కారణమైందని నిపుణులు చెబుతున్నారు.బ్యాంకుల వారీగా కార్డుల జారీ ఇలా..హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎస్బీఐ కార్డ్స్ కార్డుల జారీలో అగ్రస్థానంలో నిలిచాయి. మొత్తం జారీ చేసిన కార్డుల్లో ఈ రెండు సంస్థలే సగానికిపైగా వాటా ఆక్రమించాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంకు 3,12,000 కార్డులను జోడించగా, ఎస్బీఐ కార్డ్స్ 2,09,000 కార్డులను జారీ చేసింది. ఐసీఐసీఐ బ్యాంక్ 1,50,000 కొత్త కార్డులు విడుదల చేసింది.దేనికి ఖర్చు చేస్తున్నారంటే..క్రెడిట్ కార్డు వ్యయం గతంలో కంటే దాదాపు 11 శాతం పెరిగి 2024 డిసెంబర్ నాటికి రూ.1.9 లక్షల కోట్లకు చేరుకుంది. ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లు అందించే ఆకర్షణీయమైన డిస్కౌంట్లు, డీల్స్, నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లకు ఆదరణ లభించడం ఈ వ్యయం పెరగడానికి కారణం.ఇదీ చదవండి: ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడులు అప్‌మార్కెట్ వాటా, వృద్ధిచలామణిలో ఉన్న మొత్తం క్రెడిట్ కార్డుల సంఖ్య 2024 నవంబర్‌లో 107.2 మిలియన్ల నుంచి 2024 డిసెంబర్ చివరి నాటికి 108 మిలియన్లకు చేరుకుంది. అన్ సెక్యూర్డ్ లోన్ల విభాగంలో సవాళ్లు ఉన్నప్పటికీ ప్రస్తుత వివాహ సీజన్, రాబోయే వేసవి సెలవులను అందిపుచ్చుకోవడానికి బ్యాంకులు వ్యూహాత్మకంగా కొత్త క్రెడిట్ కార్డులను జారీ చేస్తూ కస్టమర్లను పెంచుకుంటున్నారు. -
క్రెడిట్ కార్డు పోయిందా? బ్లాక్ చేయండిలా..
మారుతున్న జీవనశైలికి అనుగుణంగా క్రెడిట్‌కార్డుల వాడకం అధికమవుతోంది. అయితే ప్రయాణాల్లోనో లేదా ఇతర సందర్భాల్లోనో కార్డులను పోగోట్టుకోవడం సహజం. ఇలాంటి సమయాల్లో చాలామంది ఏ చర్యలు తీసుకోకుండా అలాగే వదిలేస్తూంటారు. ఆ కార్డు స్కామర్ల చేతికి చిక్కితే మాత్రం చాలా నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైనా సందర్భాల్లో కార్డులు కోల్పోతే వెంటనే బ్యాంకు అధికారులకు తెలియజేయాలి. వాటిని బ్లాక్ చేయించి కొత్తగా కార్డు కోసం దరఖాస్తులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎస్బీఐ క్రెడిట్ కార్డు వినియోగదారులు ఒకవేళ తమ కార్డు కోల్పోతే ఎలా బ్లాక్ చేయాలో కింద తెలుసుకుందాం.ఎస్బీఐ కార్డ్ హెల్ప్‌లైన్‌కు కాల్ చేయాలి. 39 02 02 02 (స్థానిక ఎస్టీడీ కోడను ముందు జత చేయాలి) లేదా 1860 180 1290కు డయల్ చేయాలి. పోయిన లేదా దొంగిలించబడిన కార్డు వివరాలతో ఐవీఆర్ సూచనలను పాటించాలి.ఎస్ఎంఎస్ ద్వారా కూడా కార్డును బ్లాక్ చేయవచ్చు. రిజిస్టర్డ్ మొబైల్ నెంబరు నుంచి 5676791కు BLOCKXXXX (XXXX స్థానంలో కార్డు నెంబరు చివరి నాలుగు అంకెలు ఉండేలా చూసుకోవాలి)అని టైప్ చేసి టెక్ట్స్ మెసేజ్ చేయవచ్చు.ఎస్బీఐ కార్డ్ వెబ్సైట్ ద్వారా కూడా కార్డును బ్లాక్ చేయవచ్చు. అధికారిక వెబ్సైట్లో మాత్రమే లాగిన్ అవ్వాలి.ఎన్‌బీఐ కార్డ్స్ వెబ్సైట్(https://www.sbicard.com/)కు లాగిన్ అవ్వాలి.లాగిన్ చేసిన తర్వాత హోం పేజీ ఎడమవైపున ఉన్న ‘రిక్వెస్ట్స్’ ట్యాబ్‌పై క్లిక్ చేయాలి.‘రిపోర్ట్ లాస్ట్/ స్టోలెన్ కార్డ్’ ఆప్షన్ ఎంచుకోవాలి.కార్డును బ్లాక్ చేయడానికి ప్రాంప్ట్‌లను అనుసరించాలి.ఇదీ చదవండి: కొత్త ఉద్యోగం కోసం నిపుణులు పడిగాపులుఎస్బీఐ కార్డ్ మొబైల్ యాప్ ద్వారా బ్లాక్ చేయవచ్చు.ఎస్బీఐ కార్డ్ మొబైల్ యాప్‌లోకి లాగిన్ అవ్వాలి.హోం పేజీ ఎగువ ఎడమ వైపు కార్నర్లో మెనూ మీద ట్యాప్ చేయాలి.‘సర్వీస్ రిక్వెస్ట్’ ఆప్షన్ ఎంచుకోవాలి.‘లాస్/ స్టోలెన్ రిపోర్ట్’ ఆప్షన్ ఎంచుకోవాలి.కార్డ్ నెంబరు ఎంచుకుని రెక్వెస్ట్‌ను సబ్మిట్ చేయాలి.పైన చెప్పిన ఏ పద్ధతులు మీకు అందుబాటులో లేకపోతే వెంటనే మీ దగ్గర్లోని ఎస్బీఐ బ్రాంచ్‌ను సంప్రదించి సమస్యను తెలియజేయాలి. కార్డును బ్లాక్ చేసిన తరువాత ఎస్ఎంఎస్, ఈమెయిల్ ద్వారా ధ్రువీకరణ అందుతుంది. -
క్రెడిట్ కార్డు Vs ఛార్జ్ కార్డు.. ఏంటీ ఛార్జ్ కార్డు..
నెలవారీ వేతన జీవులతోపాటు చాలామంది వద్ద సాధారణంగా క్రెడిట్ కార్డు ఉండడం గమనిస్తుంటారు. అత్యవసర సమయాల్లో ఆర్థికంగా ఆదుకుంటుందనే ధీమాతో ఈ కార్డును తీసుకుంటారు. బిల్లు జనరేట్ అయ్యాక పూర్తి పేమెంట్ లేదా అత్యవసర సమయాల్లో మినియం బిల్లును చెల్లిస్తుంటారు. క్రెడిట్ కార్డు(Credit Card)లాగే కొన్ని బ్యాంకులు ఛార్జ్ కార్డు(Charge Card)లను జారీ చేస్తాయి. అయితే ఈ రెండింటి వినియోగంలో కొన్ని తేడాలున్నాయి. అసలు ఛార్జ్ కార్డులు ఎవరికి జారీ చేస్తారు.. పేమెంట్ నియమాలు ఎలా ఉంటాయి..ఛార్జ్ కార్డు నిజంగా ఎవరికి అవసరమో తెలుసుకుందాం.ఛార్జ్ కార్డులుఛార్జ్ కార్డు అనేది ఒక రకమైన చెల్లింపు కార్డు. ఎలాంటి ముందస్తు లిమిట్ పరిమితులు లేకుండా దీన్ని జారీ చేస్తారు. ప్రతి బిల్లింగ్ సైకిల్లో కొనుగోళ్లు చేయడానికి క్రెడిట్ కార్డులాగే దీన్ని వినియోగించవచ్చు. అయితే దీని వినియోగంలో పరిమితి ఉండదు కాబట్టి ఎంతైనా వాడుకోవచ్చు. కానీ బిల్లు సైకిల్ పూర్తి అయ్యేలోపు మొత్తం పేమెంట్ చేయాల్సి ఉంటుంది. సకాలంలో పూర్తి బ్యాలెన్స్ చెల్లించడంలో విఫలమైతే మాత్రం భారీ మొత్తంలో ఫీజులు చెల్లించాలి. క్రెడిట్ కార్డుల మాదిరిగానే ఛార్జ్ కార్డుల వినియోగంపై ట్రావెల్ పాయింట్లు, క్యాష్‌బ్యాక్, వివిధ రివార్డు పాయింట్లు ఇతర ప్రయోజనాలు అందిస్తారు.క్రెడిట్ కార్డు, ఛార్జ్ కార్డు మధ్య ప్రధాన తేడాలుక్రెడిట్ లిమిట్క్రెడిట్ కార్డులో ముందుగా సెట్ చేసిన లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ కంటే తక్కువే వాడుకోవాలి. కానీ ఛార్జ్ కార్డులో వ్యయ పరిమితి ఉండదు. ఎంతైనా వాడుకోవచ్చు. కానీ బిల్లు జనరేట్ అయ్యాక మాత్రం పూర్తిగా చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ పేమెంట్ చేయడంలో విఫలమైతే మాత్రం భారీగా ఛార్జీలు విధిస్తారు.బ్యాలెన్స్ పేమెంట్కనీస నెలవారీ చెల్లింపులకు క్రెడిట్ కార్డులో అవకాశం ఉంటుంది. కానీ ఛార్జ్ కార్డులో ఈ సదుపాయం ఉండదు. ప్రతి బిల్లింగ్ సైకిల్(Billing Cycle)లో పూర్తి బ్యాలెన్స్ చెల్లించాలి.వడ్డీ(Interest)మినిమం బ్యాలెన్స్ చెల్లించిన తర్వాత మిగతా చెల్లించాల్సిన దానికి క్రెడిట్ కార్డులో వడ్డీ విధిస్తారు. ఛార్జ్ కార్డులో అసలు ఆ సదుపాయమే ఉండదు.వార్షిక ఫీజులువార్షిక రుసుములు, ఆలస్య రుసుములు, వడ్డీ రేట్లు క్రెడిట్ కార్డులకు ఉంటాయి. ఛార్జ్ కార్డులకు కూడా వార్షిక రుసుము ఉంటుంది. అది క్రెడిట్ కార్డు రుసుముతో పోలిస్తే భారీగా ఉంటుంది. ఆలస్య రుసుము కూడా అధికంగానే విధిస్తారు.రివార్డులుక్రెడిట్ కార్డులు, ఛార్జ్ కార్డులు రెండింటిలోనూ క్యాష్ బ్యాక్, ట్రావెల్ పాయింట్స్(Travel Points), రివార్డు ప్రోగ్రామ్‌లు ఉంటాయి. ఛార్జ్ కార్డుల్లో ఇవి కొంత అధికంగా ఉంటాయి. బ్యాంకును అనుసరించి ఈ పాయింట్లు మారుతుంటాయి.ఛార్జ్ కార్డుకు అర్హులెవరు..అద్భుతమైన క్రెడిట్ స్కోర్: ఛార్జ్ కార్డ్ జారీ చేసేవారు సాధారణంగా అద్భుతమైన క్రెడిట్ స్కోర్ ఉన్న దరఖాస్తుదారుల కోసం చూస్తారు. సాధారణంగా 700 లేదా అంతకంటే ఎక్కువ ఉంటేనే దీన్ని జారీ చేసే అవకాశం ఉంటుంది.స్థిరమైన ఆదాయం: ప్రతి నెలా బ్యాలెన్స్ పూర్తిగా చెల్లించగలరని నిరూపించడానికి స్థిరమైన, గణనీయమైన ఆదాయాన్ని చూపించాల్సి ఉంటుంది.స్ట్రాంగ్ క్రెడిట్ హిస్టరీ: సకాలంలో చెల్లింపులు జరిపే ట్రాక్ రికార్డ్ ఉన్న క్రెడిట్ హిస్టరీ చాలా ముఖ్యం.తక్కువ రుణ-ఆదాయ నిష్పత్తి: రుణదాతలు తక్కువ రుణ-ఆదాయ నిష్పత్తి(ఆదాయం ఎక్కువ ఉండి రుణాలపై తక్కువగా ఆధారపడడం) ఉన్న దరఖాస్తుదారులకు ప్రాధాన్యం ఇస్తారు.రెసిడెన్సీ స్టేటస్: ఛార్జ్ కార్డు కోసం దరఖాస్తు చేయాలనుకుంటే మీరు ఏ దేశంలో అప్లై చేస్తున్నారో ఆ దేశ పౌరసత్వాన్ని కలిగి ఉండాలి.ఇదీ చదవండి: జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చిన మార్పులు ఇవే..ఇస్తున్నారు కదా అని..క్రెడిట్ కార్డు, ఛార్జ్ కార్డు.. ఏ కార్డు తీసుకున్నా అప్పు ఎప్పుటికీ మంచిదికాదు. తప్పని పరిస్థితుల్లో అప్పు చేసినా బిల్లు సైకిల్లోపు దాన్ని తిరిగి పూర్తిగా చెల్లించే ఆర్థిక సత్తా సంపాదించాలి. బ్యాంకువారు లేదా వేరొకరు ఇస్తున్నారు కదా అని అప్పు చేస్తే తిరిగి అది చెల్లించలేకపోతే తీవ్రంగా ఇబ్బందులు పడాల్సి ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. -
వైరల్: జాబ్‌కు ఆప్లికేషన్ ఇవ్వలేదు.. ఓ వీడియోతో జాబ్ కొట్టేశాడు..!
ముంబై: కరోనా మహామ్మారి పుణ్యానా విద్యార్థులందరు ఇంటికే పరిమితమయ్యారు. విద్యార్థులు ఇంట్లోనే ఉండి తమ అకడమిక్ ఇయర్‌ను కొనసాగిస్తున్నారు. విద్యార్థుల్లో కొంతమంది తమ డిగ్రీని పూర్తి చేసి ఉద్యోగాల కోసం నానాతంటాలు పడుతుండగా.. అందుకోసం వీలైనన్నీ కంపెనీలకు ఆప్లికేషన్లను పంపుతూ.. తమ అదృష్టాన్ని చెక్ చేసుకుంటున్నారు. విద్యార్థుల్లో కొంతమంది తమ డ్రీమ్ జాబ్‌ను సంపాదించుకోవడం ఎంతగానో కష్టపడుతున్నారు. మనలో సత్తా ఉండాలేగానీ.. ఉద్యోగమే మనల్ని వెతుకుంటూ వస్తోంది. కాగా ముంబైకు చెందిన 21 ఏళ్ల అవ్కాష్ షా (గ్రాఫిక్ డిజైనర్) విషయంలో అదే జరిగింది. అవ్కాష్ తన డ్రీమ్ జాబ్ సంపాదించుకోవడం కోసం.. భిన్నంగా ఆలోచించి తన శక్తి సామర్య్థాలను నేరుగా కంపెనీకి చూపించలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా ఓ 3డీ మోషన్ వీడియోను తన లింక్డిన్ ఖాతాలో ప్రముఖ క్రెడిట్‌కార్డు కంపెనీ క్రిడ్ను టాగ్ చేన్తూ పోస్ట్ చేశాడు. ఈ వీడియో వైరల్‌గా మారి, సుమారు పది లక్షల వరకు వ్యూస్ వచ్చాయి. వీడియోను చూసిన పలు కంపెనీలు అవ్కాష్ షాకు ఉద్యోగాన్ని ఇవ్వడానికి ముందుకు వచ్చాయి. కాగా ఈ వీడియోను క్రిడ్ కంపెనీ వ్యవస్థాపకుడు కునాల్ షాను ఎంతగానో ఆకర్షించింది. కంపెనీ నుంచి అవ్కాష్ షా క్రిడ్ డిజైన్ మాఫియాలోకి వెల్కమ్ అంటూ మెసేజ్‌ను పంపించింది. దీంతో అవ్కాష్ షా ఆనందానికి హద్దులేకుండా పోయింది. ఈ వీడియోతో తాను కోరుకున్న డ్రీమ్ జాబ్‌ను సంపాదించుకోవడంలో మార్గం సుగుమం చేసుకున్నాడు. ఈ వీడియోను చూసిన లింక్డిన్ అవ్కాష్ను మెచ్చుకుంది. చదవండి: యూట్యూబ్ కొత్త అప్ డేట్స్, అసంతృప్తి వ్యక్తం చేస్తున్న క్రియేటర్స్ -
కోబ్రాండెడ్ కార్డులు..కొండంత ప్రయోజనాలు..
పెట్రోల్, డీజిల్ రేట్లు అంతకంతకీ పెరిగిపోతూ పర్సుకు భారంగా మారుతున్నాయి. అయితే, పెరిగిపోయే రేట్ల విషయంలో మనం చేయగలిగేదేమీ లేదు కానీ.. వాహనంలో ఇంధనం పోయించిన ప్రతిసారీ ఎంతో కొంత డిస్కౌంటో లేదా పాయింట్లో దక్కించుకునేందుకు ఒక మార్గం ఉంది. అదే.. కోబ్రాండెడ్ కార్డులు ఉపయోగించడం. క్రెడిట్ కార్డు సంస్థలు.. ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హెచ్‌పీసీఎల్ వంటి చమురు మార్కెటింగ్ కంపెనీలతో టైఅప్ పెట్టుకుని ఈ తరహా కార్డులు జారీ చేస్తున్నాయి. వీటిని ఆయా కంపెనీల పెట్రోల్ బంకుల్లో ఉపయోగించినప్పుడు... అధిక పాయింట్లు, క్యాష్‌బ్యాక్ తదితర రూపాల్లో ప్రయోజనాలు ఉంటాయి. అలాగే కార్డు కొనుగోళ్లపై సాధారణంగా చెల్లించాల్సి వచ్చే 2.5 శాతం ఫ్యూయల్ సర్‌చార్జీ కూడా ఉండదు. ఉదాహరణకు ఇండియన్ ఆయిల్-సిటీ బ్యాంక్ ప్లాటినం లేదా టైటానియం కార్డులను తీసుకున్న పక్షంలో.. ఇండియన్ ఆయిల్ బంకుల్లో రూ. 150 మేర ఇంధనం కొంటే.. నాలుగు పాయింట్లు వస్తాయి. ఒక్క పాయింటు.. రూ. 1 విలువ చేసే ఇంధనానికి సరిసమానం. అంటే రూ. 150 విలువ చేసే ఇంధనంపై దాదాపు 2.6 శాతం మేర డిస్కౌంటు లభించినట్లవుతుంది. అలాగే, ఐసీఐసీఐ బ్యాంకు.. హెచ్పీసీఎల్తో టైఅప్ పెట్టుకుంది. ఈ కార్డులను హెచ్‌పీసీఎల్ బంకుల్లో వాడితే క్యాష్‌బ్యాక్, అదనపు పాయింట్లు, ఫ్యూయల్ సర్‌చార్జీ మినహాయింపు కూడా లభిస్తాయి. అయితే, ఇలాంటి కోబ్రాండెడ్ కార్డులు.. ఆయా బ్యాంకులు టైఅప్ పెట్టుకున్న కంపెనీ బంకుల్లో మాత్రమే ప్రయోజనాలు లభిస్తాయి. వేరే బంకుల్లో రావు. ఒకవేళ ఒకే కంపెనీకి చెందిన బంకులకు కట్టుబడి ఉండటం కుదరకపోతే.. ఏ బంకులో ఇంధనం కొన్నా సర్‌చార్జీ మినహాయింపునిచ్చే క్రెడిట్, డెబిట్ కార్డులు తీసుకోవచ్చు. వీటిలోనూ కొన్ని కార్డుల్లో క్యాష్ బ్యాక్ ఆఫర్లు కూడా ఉంటుంటాయి. పరిమితులు.. ఈ తరహా కార్డులపై మినహాయింపులకు కూడా నెలకింత చొప్పున పరిమితులు ఉంటాయి. మరికొన్నింటిలో ఇంధన సర్‌చార్జీ మినహాయింపు లభించినా.. కొనుగోలుపై రివార్డు పాయింట్లు లభించనివి కూడా ఉంటాయి. కాబట్టి, కార్డులు తీసుకునేటప్పుడు, కొనుగోళ్లు చేసేటప్పుడు ఈ అంశాలన్నీ పరిగణనలోకి తీసుకోవాలి.