కోబ్రాండెడ్ కార్డులు..కొండంత ప్రయోజనాలు.. | so many benefits with co branded cards | Sakshi
Sakshi News home page

కోబ్రాండెడ్ కార్డులు..కొండంత ప్రయోజనాలు..

Published Sat, Aug 2 2014 12:08 AM | Last Updated on Sat, Sep 2 2017 11:14 AM

కోబ్రాండెడ్ కార్డులు..కొండంత ప్రయోజనాలు..

కోబ్రాండెడ్ కార్డులు..కొండంత ప్రయోజనాలు..

పెట్రోల్, డీజిల్ రేట్లు అంతకంతకీ పెరిగిపోతూ పర్సుకు భారంగా మారుతున్నాయి. అయితే, పెరిగిపోయే రేట్ల విషయంలో మనం చేయగలిగేదేమీ లేదు కానీ.. వాహనంలో ఇంధనం పోయించిన ప్రతిసారీ ఎంతో కొంత డిస్కౌంటో లేదా పాయింట్లో దక్కించుకునేందుకు ఒక మార్గం ఉంది. అదే.. కోబ్రాండెడ్ కార్డులు ఉపయోగించడం.

క్రెడిట్ కార్డు సంస్థలు.. ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హెచ్‌పీసీఎల్ వంటి చమురు మార్కెటింగ్ కంపెనీలతో టైఅప్ పెట్టుకుని ఈ తరహా కార్డులు జారీ చేస్తున్నాయి. వీటిని ఆయా కంపెనీల పెట్రోల్ బంకుల్లో ఉపయోగించినప్పుడు... అధిక పాయింట్లు, క్యాష్‌బ్యాక్ తదితర రూపాల్లో ప్రయోజనాలు ఉంటాయి. అలాగే కార్డు కొనుగోళ్లపై సాధారణంగా చెల్లించాల్సి వచ్చే 2.5 శాతం ఫ్యూయల్ సర్‌చార్జీ కూడా ఉండదు.

ఉదాహరణకు ఇండియన్ ఆయిల్-సిటీ బ్యాంక్ ప్లాటినం లేదా టైటానియం కార్డులను తీసుకున్న పక్షంలో.. ఇండియన్ ఆయిల్ బంకుల్లో రూ. 150 మేర ఇంధనం కొంటే.. నాలుగు పాయింట్లు వస్తాయి. ఒక్క పాయింటు.. రూ. 1 విలువ చేసే ఇంధనానికి సరిసమానం. అంటే రూ. 150 విలువ చేసే ఇంధనంపై దాదాపు 2.6 శాతం మేర డిస్కౌంటు లభించినట్లవుతుంది. అలాగే, ఐసీఐసీఐ బ్యాంకు.. హెచ్‌పీసీఎల్‌తో టైఅప్ పెట్టుకుంది.

ఈ కార్డులను హెచ్‌పీసీఎల్ బంకుల్లో వాడితే క్యాష్‌బ్యాక్, అదనపు పాయింట్లు, ఫ్యూయల్ సర్‌చార్జీ మినహాయింపు కూడా లభిస్తాయి. అయితే, ఇలాంటి కోబ్రాండెడ్ కార్డులు.. ఆయా బ్యాంకులు టైఅప్ పెట్టుకున్న కంపెనీ బంకుల్లో మాత్రమే ప్రయోజనాలు లభిస్తాయి. వేరే బంకుల్లో రావు. ఒకవేళ ఒకే కంపెనీకి చెందిన బంకులకు కట్టుబడి ఉండటం కుదరకపోతే.. ఏ బంకులో ఇంధనం కొన్నా సర్‌చార్జీ మినహాయింపునిచ్చే క్రెడిట్, డెబిట్ కార్డులు తీసుకోవచ్చు. వీటిలోనూ కొన్ని కార్డుల్లో క్యాష్ బ్యాక్ ఆఫర్లు కూడా ఉంటుంటాయి.
 
పరిమితులు..

ఈ తరహా కార్డులపై మినహాయింపులకు కూడా నెలకింత చొప్పున పరిమితులు ఉంటాయి. మరికొన్నింటిలో ఇంధన సర్‌చార్జీ మినహాయింపు లభించినా.. కొనుగోలుపై రివార్డు పాయింట్లు లభించనివి కూడా ఉంటాయి. కాబట్టి, కార్డులు తీసుకునేటప్పుడు, కొనుగోళ్లు చేసేటప్పుడు ఈ అంశాలన్నీ పరిగణనలోకి తీసుకోవాలి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement