గ్లోబల్ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు తగ్గుముఖం పట్టాయి. కొన్ని రోజులకు ముందు ఒక బ్యారెల్ చమురు ధర 80 డాలర్ల కంటే ఎక్కువగా ఉండేది. అయితే ఉప్పుడు ఈ ధర 70 డాలర్ల నుంచి 72 డాలర్ల మధ్య ఉంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే మన దేశంలో కూడా ఇంధన (పెట్రోల్, డీజిల్) తగ్గే అవకాశం ఉందని పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ శాఖ కార్యదర్శి 'పంకజ్ జైన్' వెల్లడించారు.
అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు తగ్గడానికి ప్రధాన కారణం.. చాలా దేశాల్లో ఏర్పడ్డ ఆర్థిక మందగమనమే. అయితే తగ్గుతున్న ధరలను దృష్టిలో ఉంచుకుని OPEC+ (పెట్రోలియం ఎగుమతి దేశాలు) దేశాలు చమురు ఉత్పత్తిని తగ్గించాలని అనుకుంటున్నట్లు సమాచారం. అయితే భారత్ మాత్రం ఉత్పత్తిని పెంచాలని కోరుకుంటోంది.
ఇదీ చదవండి: ప్రమాదంలో ఆండ్రాయిడ్ యూజర్లు.. భారత ప్రభుత్వం హెచ్చరిక
ఇండియా ఎక్కువగా రష్యా నుంచి చమురును దిగుమతి చేసుకుంటుంది. రష్యా తరువాత ఇరాక్, సౌదీ అరేబియా నుంచి ఎక్కువగా దిగుమతి చేసుకుంటోంది. భారతదేశం ప్రపంచంలోని మూడవ అతిపెద్ద చమురు దిగుమతిదారు. దేశంలోని మొత్తం చమురులో 80% విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటుంది.
Comments
Please login to add a commentAdd a comment