వాహన దారులకు స్వల్ప ఊరట లభించింది. లీటరు పెట్రోలు, డీజిల్‌పై కేవలం15 పైసలు తగ్గిస్తున్నట్లు చమురు కంపెనీలు ప్రకటించాయి. దీంతో గడచిన 38 రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు రెండవసారి తగ్గినట్లైంది.
దేశంలోని పలు రాష్ట్రాల్లో పెట్రో ధరలు ఇలా ఉన్నాయి.
ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.101.49 ఉండగా లీటర్ డీజిల్ రూ.88.92గా ఉంది
హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ.105.63ఉండగా డీజిల్ రూ.97.16గా ఉంది
ముంబైలో పెట్రోల్ ధర రూ. 107.52 వద్ద ఉండగా డీజిల్ ధర రూ .96.48గా ఉంది
ఇక మధ్యప్రదేశ్, రాజస్థాన్ వంటి ప్రాంతాల్లో పెట్రోల్ ధరలు రూ.110 క్రాస్ చేశాయి. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, అమరావతి, తిరువనంతపురంలలో సెంచరీ దాటింది. దీంతో పెట్రోల్ ధర రూ.100 దాటిన నగరాల్లో ఢిల్లీ, కోల్‌కతా, భోపాల్, చెన్నై, జైపూర్, ముంబై, హైదరాబాద్, బెంగళూరు, పాట్నా, తిరువనంతపురం, పాట్నా, భువనేశ్వర్ తదితర నగరాలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment