
గత ఏడాది మార్చిలో పెట్రోల్, డీజిల్ ధరలు రెండు రూపాయలు తగ్గింది. ఆ తరువాత ధరల తగ్గుదల ఊసేలేదు. అయితే ఇప్పుడు ఇంధన ధరలను తగ్గించి, ప్రజలకు కొంత ఉపశమనం కలిగించాలనే ఉద్దేశ్యంతో మోదీ ప్రభుత్వం ముందడుగు వేసింది.
2019-20లో పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా రూ.72.69, రూ.65.78 వద్ద ఉండేవి. 2023-24లో రూ.96.63, రూ. 89.53 వద్దకు చేరాయి. తాజాగా ఈ ధరలను రూ. 94.74, రూ. 87.64 వద్దకు (ఢిల్లీ) తీసుకువచ్చినట్లు కేంద్ర మంత్రి 'సురేష్ గోపి' పేర్కొన్నారు. దీన్ని బట్టి చూస్తే ఇంధన ధరలు సుమారు రెండు రూపాయల వరకు తగ్గినట్లు తెలుస్తోంది.
ఇంధన ధరలు 2021-22 సమయంలో గరిష్ట స్థాయికి చేరాయి. ఆ తరువాత ప్రభుత్వం నవంబర్ 2021 - మే 2022లో పెట్రోల్ & డీజిల్‌పై కేంద్ర ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు రూ.13, రూ.16 తగ్గించింది. దీంతో ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. ప్రభుత్వం.. ప్రభుత్వ రంగ సంస్థలు తీసుకున్న వివిధ చర్యల ఫలితంగా ఇంధన ధరలు తగ్గాయని సురేష్ గోపి అన్నారు.
ఇదీ చదవండి: రూ.25 వేల కోట్ల రాజభవనంలో మహారాణి.. అయినా..!
పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించి, ప్రజలకు కొంత ఉపశమనం కలిగించాలంటే.. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వ్యాట్ రేట్లను తగ్గించాలని సురేష్ గోపి సూచించారు. అంతర్జాతీయ ధరల పెరుగుదల నుంచి సామాన్య ప్రజలను రక్షించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అంతే కాకుండా దిగుమతులను తగ్గించి.. పెట్రోల్‌లో ఇథనాల్ మిశ్రమాన్ని పెంచడం వంటివి కూడా చేస్తున్నట్లు సురేష్ గోపి వెల్లడించారు.
ప్రస్తుతం తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు ఢిల్లీకి మాత్రమే పరిమితం. ముంబై, బెంగళూరు, హైదరాబాద్, విజయవాడలలో పెట్రోల్ ధరలు రూ. 100 కంటే ఎక్కువే ఉంది.
Comments
Please login to add a commentAdd a comment