Petrol price
-
చౌకగా లభిస్తోన్న ముడి చమురు
రష్యా ముడిచమురు ఇప్పటికీ తక్కువ ధరకే లభిస్తుందని కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పురి అన్నారు. దాంతో రష్యన్ కంపెనీల నుంచి క్రూడాయిల్ కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఉక్రెయిన్‌తో యుద్ధం కారణంగా రష్యా ముడిచమురు దిగుమతులపై పాశ్చాత్య దేశాలు ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. దాంతో రష్యా తక్కువ ధరకు క్రూడాయిల్ విక్రయిస్తోంది.భారత్ తన చమురు అవసరాల్లో 88 శాతం దిగుమతులపైనే ఆధారపడుతోంది. ప్రపంచంలోని అతిపెద్ద ఇంధన వినియోగదారుల్లో భారత్ ఒకటిగా ఉంది. దేశీయంగా వార్షిక ముడిచమురు శుద్ధి సామర్థ్యం సుమారు 252 మిలియన్ మెట్రిక్ టన్నులుగా ఉంది. అంటే రోజుకు 50.04 లక్షల బ్యారెల్స్ శుద్ధి చేసే కెపాసిటీ కలిగి ఉంది. భవిష్యత్తులో ఇంధన వినియోగం పెరగనుందని మంత్రి అన్నారు. అందుకు అనుగుణంగా సంవత్సరానికి 300 మిలియన్ మెట్రిక్ టన్నుల (రోజూ 60 లక్షల బ్యారెల్స్) వరకు చమురు శుద్ధి చేసేలా కర్మాగారాల సామర్థ్యాన్ని పెంచే ప్రాజెక్ట్‌లు అమలులో ఉన్నాయని తెలిపారు.ఇదీ చదవండి: ఏటా 2.5 లక్షల టన్నుల గ్రీన్ అమ్మోనియా సరఫరాఫిబ్రవరి 2022లో ఉక్రెయిన్-రష్యాల మధ్య నెలకొన్న భౌగోళిక అనిశ్చితుల వల్ల యూరప్ దేశాలు రష్యా క్రూడ్ దిగుమతిపై ఆంక్షలు విధించాయి. దాంతో రష్యా చమురు ధరను తగ్గించడంతోపాటు రూపాయిల్లో ట్రేడ్ చేసుకునేందుకు వీలు కల్పించింది. ఇతర దేశాల నుంచి పోలిస్తే రష్యా చమురు దిగుమతి భారత్‌కు కలిసివచ్చింది. చైనా కూడా రష్యా చమురు వాడకాన్ని పెంచింది. ఈ పరిణామాల వల్ల ప్రస్తుతం భారత్‌కు అతిపెద్ద చమురు సరఫరాదారుగా రష్యా ఉద్భవించింది. ఉక్రెయిన్‌తో యుద్ధానికి ముందు భారత్‌కు చమురు దిగుమతిలో రష్యా వాటా 1 శాతం కంటే తక్కువే ఉండేది. క్రమంగా అది పెరుగుతూ దాదాపు 40 శాతం వాటాకు చేరింది. -
పెట్రోల్, డీజిల్ ధరలపై త్వరలో కేంద్రం తీపి కబురు
దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని కేంద్రం యోచిస్తోంది. చమురు ధరలు జనవరి కంటే కనిష్ట స్థాయికి పడిపోవడమే ఇందుకు కారణమని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. మార్కెట్లో ముడిచమురు ధరలు క్రమంగా తగ్గుతున్నాయి. గడిచిన పదేళ్లలో గరిష్ఠంగా జూన్ 2022లో బ్యారెల్ ధర 115 డాలర్లుగా నమోదైంది. ప్రస్తుతం బ్యారెల్ క్రూడ్ ధర దాదాపు 70 డాలర్లకు చేరింది.అంతర్జాతీయ భౌగోళిక అనిశ్చితుల వల్ల గతంలో భారీగా పెరిగిన ముడిచమురు ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఇటీవల క్రూడాయిల్ ధర 70 డాలర్లకు చేరువలో ఉంది. క్రూడ్ ధరలు గరిష్ఠంగా ఉన్నపుడు చమురుశుద్ధి కంపెనీలకు నష్టాలు రాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ రేట్లను పెంచింది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈ రేట్లను కొద్దిగా తగ్గించినా దిగివస్తున్న క్రూడ్ ధరలకు అనుగుణంగా మాత్రం రేట్లను తగ్గించలేదు. దాంతో కంపెనీలకు భారీగా లాభాలు చేకూరుతున్నాయి.త్వరలో జరగబోయే హరియాణా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల మద్దతు కూడగట్టుకునేందుకు అధికారపక్షం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అందులో భాగంగా పెట్రోల్, డీజిల్ రేట్లను తగ్గించనున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు తెలిపారు. లీటర్‌కు నాలుగు నుంచి ఆరు రూపాయలు తగ్గే అవకాశం ఉందని చెబుతున్నారు.ఇదీ చదవండి: సెబీ చీఫ్‌పై ఆరోపణలు.. పీఏసీ విచారణ?చమురు ధరలు తగ్గుముఖం పట్టడానికి పలు అంశాలు కారణమవుతున్నాయి. లిబియా తన ముడిచమురు సరఫరాలు పెంచింది. అక్టోబర్ నుంచి ఒపెక్ + దేశాలు ఉత్పత్తి కోతలను నిలిపివేయాలని నిర్ణయించాయి. ఒపెక్ దేశాల కాకుండా ముడిచమురు వెలికితీసే ఇతర దేశాలు వాటి ఉత్పత్తిని పెంచుతున్నాయి. దాంతో సరఫరా పెరిగి ధరలు తగ్గుతున్నాయి. -
పెరిగిన పెట్రోల్, డీజిల్ అమ్మకాలు.. కారణం..
ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోవడంతో గతేడాది జులై నెలతో పోలిస్తే ఈసారి పెట్రోల్ అమ్మకాలు 10%, డీజిల్ అమ్మకాలు 4.3% పెరిగాయని చమురు మంత్రిత్వ శాఖ డేటా విడుదల చేసింది. జులైలో వంటగ్యాస్ అమ్మకాలు 11%, జెట్ ఇంధన వినియోగం 9% పెరిగినట్లు నివేదికలో వెల్లడించింది.గత త్రైమాసికంతో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో పెట్రోల్ డిమాండ్ 7.1%, డీజిల్ డిమాండ్ 1.6 శాతం పెరిగింది. మొదటి త్రైమాసికంలో జెట్ ఇంధన విక్రయాలు 11.4%, వంట గ్యాస్ విక్రయాలు 5% పెరిగాయి. వేసవి సెలవులు ముగియడం, పాఠశాలలు, కళాశాలలు పునఃప్రారంభం కావడం ఇంధన వినియోగం పెరిగడానికి కారణమైనట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.ఇదీ చదవండి: ర్యాన్సమ్వేర్ దాడి.. బ్యాంకింగ్ సేవల పునరుద్ధరణదేశీయంగా దిగుమతి చేసుకుంటున్న చమురును శుద్ధి చేసే పెట్రోలియం ఉత్పత్తుల వినియోగంలో డీజిల్ 40% వాటా కలిగి ఉంది. సుదూర రవాణా, మైనింగ్, వ్యవసాయం..వంటి అవసరాలకు దీన్ని విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. పెట్రోల్, డీజిల్ వినియోగం పెరగడం పుంజుకుంటున్న ఆర్థిక కార్యకలాపాలకు సూచిక. విమాన ట్రాఫిక్ అధికమవడంతో జులైలో జెట్ ఇంధన డిమాండ్ పెరిగింది. కస్టమర్ల సంఖ్య విస్తరించడం వల్ల వంట గ్యాస్ వినియోగం అధికమైంది. ఈ నేపథ్యంలో ఈ రంగంలోని కంపెనీలు రాన్నున్న త్రైమాసిక ఫలితాల్లో మంచి ఫలితాలు పోస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. -
‘అలా చేస్తే లీటర్ పెట్రోల్ రూ.15కే!’
ఢిల్లీ: పెట్రో ధరలు దేశవ్యాప్తంగా మంట పుట్టిస్తున్నాయి. అయితే.. దీనికి పరిష్కారం ఉందని, అలా చేస్తే గనుక పెట్రోల్ ధర పాతాళానికి దిగొచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. అదే సమయంలో ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న ఓ ప్రధాన సమస్య కూడా లేకుండా పోతుందట!. పెట్రోలు ధరను లీటరుకు రూ. 15కే దొరికే దిశగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మంగళవారం వినూత్న ప్రతిపాదన చేశారు. రాజస్థాన్‌లోని ప్రతాప్‌గఢ్‌లో జరిగిన ర్యాలీలో గడ్కరీ మాట్లాడుతూ.. తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఇథనాల్,ఎలక్ట్రిసిటీ మిశ్రమాలను ఉపయోగించడం వల్ల పెట్రోల్ ధరలు వాటంతట అవే దిగి వస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే.. ఈ ప్రతిపాదన వెనుక ఉద్దేశం, తన ప్రధాన అభిమతం రైతులను ‘‘ఉర్జాదాత’’(శక్తి ప్రదాతలు)గా తీర్చిదిద్దడమేనని పేర్కొన్నారాయన. మన రైతులు అన్నదాతలే కాదు.. ఉర్జాదాతలు కూడా అనే ధోరణితో మా ఈ ప్రభుత్వం ఉంది. రైతులు ఉత్పత్తి చేసే ఇథనాల్‌తో వాహనాలన్నీ గనుక నడిస్తే ప్రయోజనం ఉంటుంది. సగటున 60% ఇథనాల్- 40% విద్యుత్ తీసుకుంటే.. అప్పుడు పెట్రోల్ లీటరుకు ₹ 15 చొప్పున అందుబాటులో ఉంటుంది. ప్రజలకు ప్రయోజనం ఉంటుందని పేర్కొన్నారాయన. తద్వారా ప్రపంచాన్ని పీడిస్తున్న కాలుష్యం తగ్గుతుందని, పెట్రో దిగుమతుల కోసం ఖర్చయ్యే 16 లక్షల కోట్ల రూపాయలు.. రైతుల ఖాతాల్లోకి మళ్లి వాళ్లకు లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నారాయన. #WATCH | Pratapgarh, Rajasthan | Union Minister Nitin Gadkari says, "Our government is of the mindset that the farmers become not only 'annadata' but also 'urjadata'...All the vehicles will now run on ethanol produced by farmers. If an average of 60% ethanol and 40% electricity… pic.twitter.com/RGBP7do5Ka — ANI (@ANI) July 5, 2023 ఇదీ చదవండి: 'స్టార్లను తయారుచేసేది టీచర్లే కదా' -
అల్లాడుతున్న ప్రజలు.. ఏకంగా రూ.10 పెరిగిన పెట్రోల్ ధర
పాకిస్తాన్లో ఆర్థిక సంక్షోభం కొనసాగుతోంది. నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. పెరిగిన ధరలతో అల్లాడుతున్న ప్రజలపై ఆ దేశ ప్రభుత్వం మరింత భారాన్ని మోపింది. ఇప్పటికే రూ.272 ఉన్న లీటర్ పెట్రోల్ ధరను ఏకంగా రూ. 10 పెంచింది. తాజా పెంపు తర్వాత ఇప్పుడు పెట్రోల్ ధర లీటరుకు రూ.282కి పెరిగింది. ఆ దేశ ఆర్థిక మంత్రి ఇషాక్ దార్ అర్ధరాత్ర ఈ పెంపును ప్రకటించారు. ప్రస్తుతం ఆ దేశంలో డీజిల్ ధర రూ.293, తేలికపాటి డీజిల్ ఆయిల్ ధర రూ. 174.68 గా ఉంది. కిరోసిన్ ధర కూడా రూ.5.78 పెరిగి రూ.186.07కి చేరింది. కొత్త ధరలు ఏప్రిల్ 16 నుంచి అమల్లోకి వస్తాయని ఆర్థిక మంత్రి తెలిపారు. గత 15 రోజులుగా అంతర్జాతీయ మార్కెట్లో పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పెరిగిన కారణంగా పెట్రోలు, కిరోసిన్ ధరలు పెంచినట్లు చెప్పారు. తీవ్ర అప్పుల్లో కూరుకుపోయిన పాకిస్తాన్ దివాళా తీయకుండా బయటపడేందుకు అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) నుంచి 1.1 బిలియన్ డాలర్ల బెయిల్అవుట్ ప్యాకేజీకి ప్రయత్నించింది. అయితే దీనికి సంబంధించి ఐఎంఎఫ్‌తో ఒప్పందం విఫలమైంది. ఈ నిధులు 2019లో ఐఎంఎఫ్ ఆమోదించిన 6.5 బిలియన్ డాలర్ల బెయిల్అవుట్ ప్యాకేజీలో భాగం. విదేశీ రుణాల్లో పాకిస్తాన్ డిఫాల్ట్ కాకుండా ఉండాలంటే ఇది చాలా కీలకం. ఇదీ చదవండి: ఐఫోన్ 15 రాకతో కనుమరుగయ్యే ఐఫోన్ పాత మోడళ్లు ఇవే.. -
పాక్‌లో కొండెక్కిన ధరలు.. చుక్కలు చూపిస్తున్న పాలు, పెట్రోల్, డీజిల్
ఇస్లామాబాద్: పొరుగు దేశం పాకిస్తాన్లో నిత్యవసర ధరలు ఆకాశాన్ని అంటాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ధరలు భారీ ఎత్తున పెరిగాయి. లీటర్ పాల ధర 210 రూపాయలకు పెరిగింది. పాడి ఉత్పత్తులతోపాటు వంటనూనె, గ్యాస్, గోధుమలు వంటి నిత్యావసర సరకుల ధరలన్నీ కనీవినీ ఎరగనంతగా పెరిగి జనానికి చుక్కలు చూపుతున్నాయి. పెరిగిన ధరలు చూసి పాక్ ప్రజలు అల్లాడిపోతున్నారు. చుక్కలు చూపిస్తున్న పెట్రోల్, డీజిల్ ధరలు పాక్‌లో పెట్రోల్ ధరలు కూడా చారిత్రలో తొలిసారి గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. లీటర్ పెట్రోల్‌పై 22 రూపాయలు పెంచడంతో ప్రస్తుతం ధర రూ. 272కు చేరింది. అంతేగాక డీజిల్‌పై 17.20 రూపాయలు పెరగడంతో లీటర్ డీజిల్ ధర రూ.280కి పెరిగింది. డాలర్‌తో రూపాయి విలువ క్షీణించడం వల్ల ఈ పెరుగుదల చోటుచేసుకుందని ఆర్థిక విభాగంపేర్కొంది. కాగా ఇప్పటికే పెరిగిన నిత్యావసర ధరలతో సతమతమవుతున్న పౌరులపై మరింత భారాన్ని మోపింది. రికార్డు స్థాయిలో చికెన్ ధరలు పాకిస్తాన్లో కిలో కోడి మాంసం ఏకంగా 780 రూపాయలైంది! బోన్‌లెస్ అయితే రూ.1,100కు చేరుకుంది. కిలో కోడి ధర రూ. 490లుగా ఉంది. దేశ చరిత్రలోనే చికెన్ ధర ఇంతలా పెరగడం ఇదే తొలిసారి. కొన్నాళ్లుగా పాక్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కి శ్రీలంకను తలపిస్తున్న విషయం తెలిసిందే. విదేశీ మారక నిల్వలు 1998 ఏడాది తర్వాత అత్యంత కనిష్ట స్థాయిలకు పడిపోయాయి. చదవండి: హిండెన్‌బర్గ్ ఆరోపణలు.. ‘అదానీ’పై మరో కేసు -
తెలంగాణ కంటే కర్ణాటకలోనే పెట్రోల్, డీజిల్ ధరలు తక్కువ.. ఎందుకు?
‘గొంగట్లో కూర్చుని అన్నం తింటూ వెంట్రుకలు ఏరుకోవాలనుకునే’వారిలాగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్, టీఆర్ఎస్ నాయకుల వైఖరి ఉందని పలువురు సామాన్యులు భావిస్తున్నారు. ఎందుకంటే తప్పులన్నీ తాము చేస్తూ కేంద్ర ప్రభుత్వంపై నెపాన్ని నెట్టడాన్ని రాజకీయ పరిశీలకులు కూడా విమర్శిస్తున్నారు. ఇటీవల టీఆర్ఎస్ అధినాయకులు పదే పదే కేంద్రాన్ని విమర్శిస్తూ రాష్ట్రాన్ని కేంద్రం నిర్లక్ష్యం చేస్తోందనీ, నిధులు ఇవ్వడం లేదనీ అబద్ధాలాడడం ఎంత వరకు సమంజసం? కేంద్రమే నిధులివ్వక పోతే రాష్ట్రంలో ఇన్ని జాతీయ రహదారులు ఎలా రూపుదిద్దుకునేవి? గ్రామ పంచాయతీలలో వివిధ అభివృద్ధి పనులకు ఫైనాన్స్ కమిషన్ల పేరుతో వస్తున్నవి కేంద్రం నిధులే. వీటితోనే గ్రామ పంచాయతీల కరెంటు బిల్లులు కట్టించి నిధులు మళ్లించడం మీ తప్పిదం కాదా? రాష్ట్ర ఖజానా పరిస్థితి ఆలోచించి డబుల్ బెడ్రూమ్ల పేరుతో డాంబికాలకు పోకుండా ఉండి ఉంటే పక్కనున్న ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా తదితర రాష్ట్రాలలాగా లక్షలాది కుటుంబాలకు కేంద్రం నిధులతో సొంతింటి కల నెరవేరేది కాదా? మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల అభివృద్ధికి మంజూరవుతున్న ‘ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన’ నిధులు కేంద్రానివి. ఇలా చెప్పుకుంటూ పోతే అసలు రాష్ట్ర నిధులతో జరుగుతున్న పనులేవీ అనే సందేహం రాకమానదు. రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్న కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో లక్షా రూ. 20 వేలకోట్ల ప్రజాధనాన్ని నీటిపాలు చేయడం మీ తప్పు కాదా? హైదరాబాద్ మెట్రోతోపాటు స్కైవేలు, ఫ్లైఓవర్లు, రింగ్ రోడ్లు అంటూ టీఆర్‌ఎస్‌వారు గొప్పగా చెప్పుకుంటున్న వాటి అభివృద్ధికి ఇబ్బడిముబ్బడిగా అందుతున్నవి కేంద్రం నిధులు కావా? రాష్ట్రంలో మెడికల్ కాలేజీలకు అనుమతులు రాకపోవడానికి కారణం కేంద్ర నిబంధనల ప్రకారం మీరు ప్రతిపాదనలు పంపక పోవడమే కదా! మునుగోడు ఎన్నికల్లో ప్రజావ్యతిరేకత వ్యక్తం అవుతుండడంతో ఈ మధ్య చేనేత కార్మికులపై కపట ప్రేమ ఒలకబోస్తూ జీఎస్టీపై మంత్రి కేటీఆర్ ప్రధానికి లేఖ రాయడం ఎవరిని మభ్యపెట్టడానికి? ప్రతి జీఎస్టీ మండలి సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పాల్గొంటున్న ప్రతినిధులు అప్పుడే ఎందుకు అభ్యంతరం చెప్పలేదు? జీఎస్టీ మండలిలో రాష్ట్రాలన్నీ కలిసి ప్రతి నిర్ణయం తీసుకుంటాయి కదా! మరి కేంద్రంపై నిందలు వేయడం ఏంటి? పై పెచ్చు జీఎస్టీ మండలి చేనేత కార్మికుల విషయంలో పన్ను పరిధిని రూ. 40 లక్షలకు పెంచితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రూ. 20 లక్షలకు మించితే పన్ను వసూలు చేస్తూ ప్రధానికి లేఖ రాయడం ‘మొగుణ్ణి కొట్టి మొగసాలకు ఎక్కడం’ లాంటిది కాదా? కేంద్రం నుంచి ప్రతి నెలా చేనేత కార్మికులకు 5 కిలోల ఉచిత రేషన్ బియ్యం అందుతున్నాయి. గతంలో నూలుపై ఉన్న 10 శాతం సబ్సిడీని మోదీ ప్రభుత్వం 15 శాతానికి పెంచింది. నేత కార్మికులు కేంద్ర ప్రభుత్వ సహకారంతో క్లస్టర్ ఏర్పాటు చేసుకొని అభివృద్ధి చెందాలనుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపకుండా అడ్డుపడుతోంది. కేంద్రానికి పేరు వస్తుందనా? దేశంలోనే తొలి చేనేత బజార్ స్థలం కబ్జాకు గురికాగా ఆ సమస్య పరిష్కరిస్తానని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చినా ఇంతవరకు నెరవేరలేదు. కేంద్రం దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న ఉచిత రేషన్ పథకాన్ని నిలిపివేసి నిరుపేదల నుంచి కిలో రూపాయి చొప్పున వసూలు చేసింది రాష్ట్ర ప్రభుత్వం కాదా? ఉచిత రేషన్ విషయంలో కేంద్రం ఇస్తున్న సబ్సిడీ ఒక్కో కిలోకి రూ. 28కి పైగా ఉంది. మరి ప్రభుత్వం వాటా ఎంత? ‘మాతా శిశు సంక్షేమ పథకం’ పేరుతో కేంద్రం నిధులిస్తే దానికి కేసీఆర్ కిట్ అంటూ ప్రచారం చేసుకోవడం మీ తప్పిదం కాదా? (క్లిక్ చేయండి: మతతత్త్వం కాదు... సామరస్యం కావాలి) నోరెత్తితే కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతుందని అంటున్నారు. మరి పక్కనే ఉన్న కర్ణాటకలో మన కంటే 10 నుంచి 15 రూపాయలు తక్కువకు పెట్రోల్, డీజిల్ ఎలా లభిస్తుంది? మీకు పేదలపైన అంత ప్రేమ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం అత్యధికంగా విధిస్తున్న పన్నులు తగ్గిస్తే సరిపోతుంది. కానీ మీరలా చేయట్లేదు. దేశంలో అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వం ఎనిమిదేళ్లుగా అవినీతి ఆరోపణలు లేకుండా పూర్తి పారదర్శకంగా పాలన సాగిస్తుంటే అవినీతి మరకలు అంటించేందుకు విఫలయత్నం చేశారు. కేసీఆర్ కుటుంబంపై, పార్టీపై అవినీతి ఆరోపణలు వస్తే కేంద్ర విచారణ సంస్థలు నిజాలు నిగ్గుతేల్చే పనిచేస్తే కక్ష సాధింపు చర్యలని కేంద్రాన్నే బదనామ్ చేస్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని బదనామ్ చేయడం ఆపి తమపై ప్రజా వ్యతిరేకతను తగ్గించుకునే చర్యలు తీసుకుంటే మంచిది. (క్లిక్ చేయండి: దారి తప్పిన మునుగోడు ఉప ఎన్నిక) - శ్యామ్ సుందర్ వరయోగి సీనియర్ జర్నలిస్ట్, బీజేపీ రాష్ట్ర నాయకులు -
లీటర్ పెట్రోల్ రూ.338.. బస్సు ఛార్జీలు ఏకంగా 35 శాతం పెంపు..
కొలంబో: అన్నిరకాలుగా సంక్షోభం కూరుకుపోయిన శ్రీలంకలో పరిస్థితులు నానాటికీ దిగజారుతున్నాయి. లీటర్ పెట్రోల్ మంగళవారం ఏకంగా 84 రూపాయలు పెరిగి రూ.338కి చేరింది. పెట్రో ధరలు పెరగడం ఈ నెలలో ఇది రెండోసారి. బస్సు చార్జీలు కూడా ఏకంగా 35 శాతం పెరిగాయి. దీంతో జనం మండిపడుతున్నారు. అధ్యక్షుడు గొటబయ రాజపక్స, ఆయన కుటుంబీకులు తప్పుకోవాలంటూ దేశవ్యాప్తంగా నిరసనలు మరింత ఉధృతమయ్యాయి. పెట్రో ధరల పెంపును నిరసిస్తూ సెంట్రల్ లంకలోని రంబుక్కన వద్ద హైవేను, రైల్వే ట్రాక్‌ను దిగ్బంధించారు. వారిపై పోలీసుల కాల్పుల్లో ఒకరు మరణించారు. పలువురు గాయపడ్డారు. జనాగ్రహాన్ని, ఆక్రోశాన్ని అర్థం చేసుకోగలనని అధ్యక్షుడు గొటబయ రాజపక్స అన్నారు. దేశ దుస్థితికి తన తప్పిదాలూ కారణమేనని అంగీకరించారు. రసాయన ఎరువులపై నిషేధం దారుణంగా బెడిసికొట్టిందన్నారు. సంక్షోభ పరిష్కార చర్యల్లో భాగంగా అధ్యక్షుని అధికారాలకు కత్తెర వేసి, పార్లమెంటుకు మరిన్ని అధికారాలు కల్పించాలని ప్రధాని మహింద రాజపక్స ప్రతిపాదించారు. 41 మంది ఎంపీలు తాము పాలక సంకీర్ణానికి దూరమవుతున్నట్టు సభలోనే ప్రకటించారు. చదవండి: (దద్దరిల్లుతున్న డోన్బాస్) -
మళ్ళీ భగ్గుమన్న పెట్రోల్ ధర
-
రూ.2కే లీటర్ పెట్రోల్.. ఏ దేశంలో తెలుసా?
ఉక్రెయిన్‌పై కొనసాగుతున్న రష్యా దాడులు ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలపై ప్రభావం చూపుతోంది. ఉక్రెయిన్ పరిణామాలతో భారత్‌లోనూ ధరాఘాతం నెలకొంటోంది. పలు నిత్యవసరాలు, ఇతర వస్తువల ధరలు రోజురోజుకూ పెరిగాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా బ్యారేల్ చమరు ధర 130 డాలర్లకు చేరుకుంది. దీంతో చాలా దేశాలలో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. మన దేశంలో కూడా అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలతో పోల్చితే పెట్రోల్, డీజిల్ ధరలు కూడా భారీగా పెరగాల్సి ఉంది. కానీ, ఇప్పటికే దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు జీవనకాల గరిష్టానికి చేరుకోవడంతో ఆయిల్ ధరల విషయంలో ఆయిల్ కంపెనీలు, కేంద్ర ప్రభుత్వం వేచిచూసే ధోరణి అవలంభిస్తున్నాయి. హోలీ పండుగ తర్వాత ఏ క్షణమైనా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశముందన్న ప్రచారం రెండ్రోజుల క్రితం నుంచి జరుగుతోంది. అయితే పెట్రో ధరల విషయంలో గుడ్ న్యూస్ అందుతోంది. పెట్రో ధరలు త్వరలో తగ్గే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. రష్యా నుంచి డిస్కౌంట్ ధరకు భారీగా ముడిచమురును ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు దిగుమతి చేసుకుంటున్నాయి. భారత్‌కు తక్కువ ధరకే ముడిచమురు ఇస్తామని ఇప్పటికే రష్యా బంపర్ ఆఫర్ ప్రకటించడంతో వచ్చే కాలంలో ఇంధన ధరలు తగ్గనున్నట్లు సమాచారం. అయితే, మన దేశంలో పెట్రోల్ ధరలు రూ.100కి పైగా ఉంటే, ఇతర దేశాలలో పెట్రోల్ ధరలు ఎంతగా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. దక్షిణాసియాలో పెట్రోల్ ధరలు: మన దాయాది దేశం అయిన పాకిస్తాన్'లో ఒక లీటర్ పెట్రోల్ ధర 0.837 డాలర్లు(సుమారు రూ.63.43) ఉండగా, శ్రీలంకలో ఇది 1.111 డాలర్లు(రూ. 84) వద్ద ఉంది. బంగ్లాదేశ్ దేశంలో వాహనదారులు ప్రతి లీటర్ ఇంధనానికి $1.035(రూ.78.43) చెల్లిస్తూ ఉంటే, నేపాల్'లో ఉన్నవారు $1.226(రూ.93) చెల్లిస్తున్నారు. మన చుట్టూ పక్క దేశాలతో పోలిస్తే మన దేశంలోనే చమరు ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయి. లీటర్ పెట్రోల్ చౌకగా దొరికే దేశాలు: ఇతర దేశాలలో పోలిస్తే ప్రపంచంలోనే పెట్రోల్ ధర తక్కువగా ఉన్న దేశం "వెనిజులా". ఈ దేశంలో ఒక లీటర్ పెట్రోల్ $0.025(రూ.1.89)గా ఉంది. ఆ తర్వాత లిబియాలో ఇంధనం చౌకగా ఉంది. ఇక్కడ ఒక లీటర్ పెట్రోల్ ధర $0.032(రూ.2.43)గా ఉంది. పెట్రోల్ ధర ఎక్కువగా ఉన్న దేశాలు: ఇతర దేశాలలో పోలిస్తే ప్రపంచంలోనే పెట్రోల్ ధర ఎక్కువగా ఉన్న దేశం "హాంగ్ కాంగ్". ఈ దేశంలో ఒక లీటర్ పెట్రోల్ $2.879(రూ.218)గా ఉంది. ఆ తర్వాత లిబియాలో ఇంధనం చౌకగా ఉంది. ఆ తర్వాత నార్వే, నెదర్లాండ్స్, ఫిన్లాండ్, లిచెన్ స్టెయిన్, జర్మనీ వంటి దేశాలలో ఇంధనం ధర లీటరుకు రూ.200కు పైగా ఉంది. (చదవండి: దేశ చరిత్రలో ఇదే తొలిసారి! కరోనా ఉన్నా..అదరగొట్టిన పన్నువసూళ్లు, ఏకంగా!) -
Telangana: రష్యా-ఉక్రెయిన్ వార్ ఎఫెక్ట్.. 20% బస్సులు డిపోల్లోనే!
సాక్షి, హైదరాబాద్: రష్యా–ఉక్రెయిన్ యుద్ధం వల్ల డీజిల్ ధరలు భారీగా పెరగడంతో ఆర్టీసీ ఉక్కిరిబిక్కిరవుతోంది. పెరిగిన ఖర్చులు తగ్గించుకునేందుకు బస్సుల ట్రిప్పులు కుదించుకోవాలని ఆలోచిస్తోంది. కనీసం 20 శాతం ట్రిప్పులు తగ్గించి ఆ మేరకు బస్సులను డిపోలకే పరిమితం చేయాలనుకుంటోంది. కుదుటపడుతున్న సమయంలో.. కోవిడ్ వల్ల గత రెండేళ్లుగా ఆర్టీసీ పూర్తిస్థాయిలో ట్రిప్పులు తిప్పలేకపోతోంది. ఇప్పుడిప్పుడే అన్ని బస్సులు ఊళ్లకు వెళ్తున్నాయి. పరిస్థితి క్రమంగా కుదుటపడుతుందని అనుకుంటున్న సమయంలో తాజా ‘డీజిల్ సంక్షోభం’ఆర్టీసీని మళ్లీ సమస్యల్లోకి నెట్టింది. ఆర్టీసీ నిత్యం సగటున 5 లక్షల లీటర్ల డీజిల్‌ను వినియోగిస్తుంది. ఫిబ్రవరి 16 వరకు ఆర్టీసీ కొనే బల్క్ డీజిల్ లీటరు ధర రూ.92గా ఉంది. తర్వాతి రోజే అది రూ. 6 మేర పెరిగింది. దీంతో అంతకంటే తక్కువ ధర ఉన్న రీటైల్లో కొనటం ప్రారంభించింది. ఉత్తరప్రదేశ్ ఎన్నికలు ముగుస్తూనే రిటైల్లోనూ రేట్లు పెరగుతాయని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం బల్క్ డీజిల్ లీటరు ధర రూ.104కు చేరింది. యూపీ ఎన్నికలు ముగిసేనాటికి నాటికి రేటు రూ. 110ని మించుతుందని, ఆర్టీసీకి బల్క్ పర్చేస్ డిస్కౌంట్‌తో కలుపుకుంటే అది రూ.105 కంటే ఎక్కువే ఉంటుందని ఆర్టీసీ అంచనా. అదే జరిగితే రోజువారీగా అదనంగా రూ.65 లక్షల భారం ఆర్టీసీపై పడుతుంది. దీన్ని భరించటం అసాధ్యమని సంస్థ చెబుతోంది. అందుకే కనీసం 20 శాతం ట్రిప్పులను, ఆ మేరకు ఖర్చులను తగ్గించుకోవాలని ఆలోచిస్తోంది. చదవండి: (గుడ్‌న్యూస్: సిటీ బస్సుల్లో ఉచిత ప్రయాణం) పెళ్లిళ్లూ లేకపోవడంతో.. సాధారణంగా ఆర్టీసీకి పెళ్లిళ్ల సీజన్లో ఆదాయం ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం శుభముహూర్తాలు లేకపోవడంతో పెళ్లిళ్లకు కూడా విరామం వచ్చింది. మరో 20 రోజులు ముహూర్తాల్లేవు. శుభముహూర్తాలు లేకుంటే ఆక్యుపెన్సీ రేషియో కూడా తగ్గుతుంది. బుధవారం 60 శాతం ఆక్యుపెన్సీ రేషియోనే నమోదైంది. ఇది ఇంకా తగ్గే అవకాశముంది. తక్కువ ఆక్యుపెన్సీ రేషియోను చూపి ట్రిప్పులను తగ్గించి అంతమేర బస్సులను డిపోలకే పరిమితం చేయాలని ఆర్టీసీ ఆలోచిస్తోంది. నేరుగా జనంపై డీజిల్ భారం చాలినన్ని బస్సుల్లేక, కొత్త బస్సులు కొనేందుకు నిధుల్లేక పాత బస్సులనే ఆర్టీసీ నడుపుతోంది. వేల సంఖ్యలోని ఊళ్లకు రవాణా వసతిని అందించలేకపోతోంది. దీంతో జనం ప్రైవేటు వాహనాలపై ఆధారపడుతున్నారు. డీజిల్ ధర పెరగటంతో ఆటో చార్జీలూ భగ్గుమంటున్నాయి. ఇప్పుడు ఆర్టీసీ ట్రిప్పులూ తగ్గితే, బస్సుల్లేవని ఆటోవాలాలు చార్జీలు పెంచే అవకాశం ఉంది. దీంతో డీజిల్ భారం నేరుగా జనం జేబుపై పడబోతోంది. -
వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పనుందా..?
ఉక్రెయిన్‌పై రష్యా దాడులకు దిగినప్పటి నుంచి బంగారం, చమరు ధరలు భారీగా ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ రోజు బ్యారెల్ బ్రెంట్ క్రూయిడ్ ఆయిల్ ధర 115 డాలర్లకు చేరుకుంది. అయితే, ఒకవైపు అంతర్జాతీయంగా చమరు ధరలు భారీగా పెరగడంతో ఆ ధరల నుంచి మన దేశ ప్రజలకు ఉపశమనం అందించడానికి కేంద్రం మార్గాలను అన్వేషిస్తోంది. వినియోగదారులపై చమురు ధరల ప్రభావం పడకుండా ఉండటానికి లీటరు పెట్రోల్, డీజిల్'పై రూ.8-10 ఎక్సైజ్ సుంకన్నీ తగ్గించడానికి కేంద్రం ఆలోచిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు బిజినెస్ టుడే మీడియాకు తెలిపాయి. గత ఏడాది నవంబర్ నెలలో 68 డాలర్లు ఉన్న బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర నేడు 115 డాలర్లకు చేరుకుంది. అప్పటి నుంచి పెట్రోల్, డీజిల్ ధరలలో పెద్దగా మార్పులేదు. "అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా దేశంలో డీజిల్ & పెట్రోల్ ధరలు ఇప్పటి వరకు లీటరుకు రూ.9-14 ఎక్కువగా ఉండాలి" అని ఎస్బిఐ ఎకోర్యాప్ కొద్ది రోజుల క్రితం తన నివేదికలో తెలిపింది. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించినట్లయితే, అప్పుడు ఖజానాకు లక్ష కోట్ల రూపాయలు నష్ట వస్తుంది. కాబట్టి, అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా దేశంలో డీజిల్ & పెట్రోల్ ధరలు పెంచే అవకాశం కూడా ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. చమురు ధరల ప్రభావం వినియోగదారుడి మీద పడకుండా ఉండటానికి కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకన్నీ, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్ తగ్గిస్తే పరిస్థితి చక్కదిద్దుకొనే అవకాశం ఉన్నట్లు ఆ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ప్రపంచ ముడి చమురు ధరలు పెరిగిన ప్రకారం దేశంలో చమురు ధరలను పెంచితే ద్రవ్యోల్బణం 52-65 బేసిస్ పాయింట్లు పెరిగే అవకాశం ఉంది. మరోవైపు, రేట్లు పెరగకుండా చూడటం కోసం ప్రభుత్వం పెట్రోలియం ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు సుమారు రూ.7 తగ్గించినట్లయితే, అప్పుడు నెలకు రూ.8,000 కోట్ల ఎక్సైజ్ సుంకం నష్టం వాటిల్లుతుంది అని ఎస్బీఐ తన నివేదికలో తెలిపింది. చూడాలి మరి మార్చి తర్వాత కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది. (చదవండి: కొత్తగా రుణం కోసం దరఖాస్తు చేసుకునే వారికి షాకిస్తున్న బ్యాంకులు..!) -
రష్యా-ఉక్రెయిన్ ఎఫెక్ట్.. కేంద్రానికి లక్ష కోట్ల నష్టం..!
రష్యా-ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న సంఘర్షణ నేపథ్యంలో బ్రెంట్ బ్యారెల్ ముడి చమరు ధర $100కు చేరుకుంది. అయితే, ముడి చమురు ధరలు పెరగడం వల్ల కేంద్ర ప్రభుత్వానికి ఈ ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ.95,000 కోట్ల నుంచి లక్ష కోట్ల రూపాయల నష్టం కలగవచ్చు అని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బిఐ) ఆర్థిక విభాగం ఒక నివేదికలో తెలిపింది. రెండు రోజుల నుంచి ముడి చమురు ధరలు పెరుగుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం నవంబర్ 2021 నుంచి పెట్రోల్ & డీజిల్ ధరలలో పెద్దగా మార్చలేదు. "ప్రస్తుతం ధరల ప్రకారం.. ఒక బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ధర $95/బిబిఎల్.-$110 బిబిఎల్ మధ్య ఉంది. అయితే, అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా దేశంలో ఉన్న ప్రస్తుత డీజిల్ & పెట్రోల్ ధరల కంటే రూ.9-14 ఎక్కువగా ఉండాలి" అని ఎస్బీఐ 'ఎకోర్యాప్' పేర్కొంది. అయితే, ప్రభుత్వం 5 రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన తర్వాత మార్చిలో పెట్రోల్ & డీజిల్ ధరలు పెరగకుండా ఉండాలంటే పెట్రోలియం ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు రూ.7 తగ్గించాల్సి ఉంటుంది అని పేర్కొంది. అప్పుడు నెలకు రూ.8,000 కోట్లకు పైగా ఎక్సైజ్ సుంకం నష్టం వాటిల్లుతుందని పేర్కొంది. "వచ్చే ఆర్థిక సంవత్సరంలో పెట్రోల్ & డీజిల్ వినియోగం ఆర్థిక సంవత్సరంలో 8-10 శాతం పెరిగితే అప్పుడు ప్రభుత్వం నష్టం సుమారు 95000 కోట్ల నుండి లక్ష కోట్ల రూపాయల వరకు ఉంటుంది" అని నివేదిక పేర్కొంది. ప్రస్తుతం దేశ రిటైల్ ద్రవ్యోల్బణం జనవరిలో 6.01 శాతంగా ఉంది. గత ఏడు నెలల కాలంలో ఇదే గరిష్టం. (చదవండి: ఎల్ఐసీ పాలసీదారులకు అలర్ట్.. ఆ అవకాశం మరో 3 రోజులే!) -
వాహనదారులకు షాక్.. భారీగా పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు!
గత కొద్ది రోజుల నుంచి రష్యా, ఉక్రెయిన్ల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. రష్యా అధ్యక్షుడు పుతిన్ యుద్ధానికే సై అంటున్నారు. రష్యా తూర్పు ఉక్రెయిన్‌లోని రష్యా మద్దతుగల వేర్పాటువాద ప్రాంతాల డోనెట్స్క్, లుహాన్స్క్ ప్రాంతాలను స్వతంత్ర ప్రాంతాలుగా గుర్తిస్తున్నట్టు ప్రకటించారు. దీంతో ప్రపంచ దేశాలు రష్యా మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రష్యా, ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు పెరగడంతో మంగళవారం చమురు ధరలు 2014 నుంచి గరిష్టస్థాయికి చేరుకున్నాయి. పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు! ఈ యుద్ద వాతావరణం వల్ల ముడి చమరు బ్యారెల్ ధర 100 డాలర్లకు పైగా పెరిగే అవకాశం ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తునారు. "బ్యారెల్ చమరు ధర $100 కంటే ఎక్కువకు పెరిగే అవకాశం ఉంది" అని ఆయిల్ బ్రోకర్ పీవిఎంకు చెందిన తమస్ వర్గా అన్నారు. ప్రపంచ బెంచ్ మార్క్ అయిన బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 3.48 డాలర్లు(3.7%) పెరిగి 98.94 డాలర్లుగా ఉంది. గతంలో ఇంతకు ముందు ఈ ధర 99.38 డాలర్లకు చేరుకుంది. 2014 సెప్టెంబర్ తర్వాత ఇదే అత్యధికం. యుఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్(డబ్ల్యుటిఐ) క్రూడ్ ఆయిల్ ధర 4.54 డాలర్లు(4.8%) పెరిగి 95.61 డాలర్లకు చేరుకుంది. కరోనావైరస్ మహమ్మారి తీవ్రత తగ్గడంతో ప్రపంచ వ్యాప్తంగా తిరిగి పెట్రోల్, డీజిల్‌కి డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలోనే రష్యా, ఉక్రెయిన్ల మధ్య ఉద్రిక్త వాతావరణం వల్ల చమరు ధరలు 7 ఏళ్ల గరిష్ట స్థాయికి చేరుకునే అవకాశం ఉంది. ఇలాంటి క్లిష్ట సమయంలో ఆర్గనైజేషన్ ఆఫ్ ది పెట్రోలియం ఎక్స్ పోర్టింగ్ దేశాలు, ఒపెక్+గా పిలువబడే మిత్రదేశాలు చమరు సరఫరాను ఎక్కువ పెంచడానికి ఆలోచిస్తున్నాయి. మన దేశంలో 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత దేశంలో భారీగా ఇంధన ధరలు పెరిగే అవకాశం ఉన్నట్లు గతంలో డెలాయిట్ టచి తోమత్సు ఇండియా తన నివేదికలో పేర్కొంది. "5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కారణంగా కేంద్రం రిటైల్ ధరలను పెంచలేదు" అని డెలాయిట్ భాగస్వామి దేబాసిష్ మిశ్రా ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. 5 రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన(మార్చి 10) తర్వాత అమ్మకపు ధరలో కొరతను పూడ్చడానికి కంపెనీలు లీటరుకు 8-9 రూపాయలు (11-12 సెంట్లు) ధరలను పెంచాలని చూస్తున్నట్లు మిశ్రా తెలిపారు.అంతర్జాతీయంగా ధరలకు అనుగుణంగా కంపెనీలకు ధరలు సవరించే అవకాశం ఉన్నప్పటికీ కేవలం ఎన్నికల కారణంగానే చమరు కంపెనీ పెంచలేదు అని పేర్కొన్నారు. ఇంధన ధరలు పెరగడం వల్ల అటు కేంద్ర ప్రభుత్వానికి, ఇటు సెంట్రల్ బ్యాంకుకు ఇబ్బందేనని మిశ్రా పేర్కొన్నారు. చమురు ధరలు పెరగడం వల్ల మళ్లీ నిత్యవసర ధరలు పేరుగుతాయని, దీంతో మళ్లీ ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉన్నట్లు చెప్పారు. ద్రవ్యోల్బణం కట్టడి చేయడం అనేది కేంద్ర బ్యాంకుకు కత్తి మీద సాము కానున్నట్లు తెలిపారు. చమురు ధరలో ప్రతి 10 డాలర్ల పెరుగుదల భారతదేశ ఆర్థిక వృద్ధిని 0.3% నుండి 0.35%కు తగ్గనున్నట్లు ఆయన తెలిపారు. అంతర్జాతీయంగా చమురు ధర 100 డాలర్లకు దాటితే రిటైల్ ద్రవ్యోల్బణం, కరెంట్ ఖాతా లోటును అదుపు చేయడం కష్టం అని అన్నారు. (చదవండి: ట్రంప్ అన్నంత పని చేశాడు.. ఇక సోషల్ మీడియాకు చుక్కలే?) -
పెట్రోల్, డీజిల్ వినియోగదారులకు భారీ షాక్.. మళ్లీ పెరగనున్న ధరలు!
గత కొన్ని నెలలుగా దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలలో పెద్దగా మార్పు కనిపించడం లేదు అని సంగతి మన అందరికీ తెలిసిందే. అయితే, ఇది కేవలం కొద్ది రోజుల వరకు మాత్రమే అని సమాచారం. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత దేశంలో భారీగా ఇంధన ధరలు పెరిగే అవకాశం ఉన్నట్లు డెలాయిట్ టచి తోమత్సు ఇండియా పేర్కొంది. "5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కారణంగా కేంద్రం రిటైల్ ధరలను పెంచలేదు" అని డెలాయిట్ భాగస్వామి దేబాసిష్ మిశ్రా ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. మార్చి 10 తర్వాత అమ్మకపు ధరలో కొరతను పూడ్చడానికి కంపెనీలు లీటరుకు 8-9 రూపాయలు (11-12 సెంట్లు) ధరలను పెంచాలని చూస్తున్నట్లు ఆయన తెలిపారు. అంతర్జాతీయంగా ధరలు పెరిగినప్పటికీ ఇండియన్ ఆయిల్ కార్ప్, భారత్ పెట్రోలియం కార్ప్, హిందుస్థాన్ పెట్రోలియం కార్ప్ ధరలను పెంచలేదు అని వివరించారు. అంతర్జాతీయంగా ధరలకు అనుగుణంగా కంపెనీలకు ధరలు సవరించే అవకాశం ఉన్నప్పటికీ కేవలం ఎన్నికల కారణంగానే పెంచలేదు అని పేర్కొన్నారు. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిసిన తర్వాత భారీగా ధరలను పెంచే అవకాశం ఉన్నట్లు ఆయన అన్నారు. ఒకవేళ పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిన అందులో కొంత మొత్తాన్ని కేంద్రం భరిస్తుందని, మిగతా మొత్తాన్ని ప్రజల మీద వేసే అవకాశం ఉన్నట్లు మిశ్రా తెలిపారు. ఇంధన ధరలు పెరగడం వల్ల అటు కేంద్ర ప్రభుత్వానికి, ఇటు సెంట్రల్ బ్యాంకుకు ఇబ్బందేనని పేర్కొన్నారు. చమురు ధరలు పెరగడం వల్ల మళ్లీ నిత్యవసర ధరలు పేరుగుతాయని, దీంతో మళ్లీ ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉన్నట్లు చెప్పారు. చమురు ధరలో ప్రతి 10 డాలర్ల పెరుగుదల భారతదేశ ఆర్థిక వృద్ధిని 0.3% నుండి 0.35%కు దెబ్బతీస్తుందని మిశ్రా తెలిపారు. అంతర్జాతీయంగా చమురు ధర 100 డాలర్లకు దాటితే రిటైల్ ద్రవ్యోల్బణం, కరెంట్ ఖాతా లోటును అదుపు చేయడం కష్టం అని అన్నారు. (చదవండి: అమెజాన్ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీగా పెరగనున్న వేతనం!) -
పెట్రోల్, డీజిల్‌పై కేంద్రం ఆదాయం ఎంతనో తెలుసా..!
గత ఆర్థిక సంవత్సరం (2020-21)లో పెట్రోల్, డీజిల్‌పై పన్నులు, సెస్ రూపంలో కేంద్ర ప్రభుత్వం మొత్తం రూ.4,55,069 కోట్లు వసూలు చేసినట్లు పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి రామేశ్వర్ తెలీ తెలిపారు. ఇదే కాలంలో రాష్ట్ర ప్రభుత్వాలు మొత్తం రూ.2,02,937 కోట్లు అమ్మకపు పన్ను, విలువ ఆధారిత పన్ను(వ్యాట్)గా వసూలు చేసినట్లు రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో కేంద్ర మంత్రి తెలియజేశారు. రాష్ట్రాల్లో మహారాష్ట్ర అన్ని పెట్రోలియం ఉత్పత్తులపై అమ్మకపు పన్ను, వ్యాట్ రూపంలో గరిష్టంగా 25,430 కోట్లు వసూలు చేసింది. ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ రూ.21,956 కోట్లు, తమిళనాడు రూ.17,063 కోట్లు వసూలు చేశాయి. నవంబర్ 3న పెట్రోల్‌పై విధించే సెంట్రల్ ఎక్సైజ్ సుంకాన్ని రూ.5, డీజిల్‌పై రూ.10 తగ్గించినప్పటికీ దేశంలో పెట్రోల్ & డీజిల్ ధరలు ఇంకా ఆకాశాన్ని తాకుతున్నాయి. కేంద్రం ప్రకటన తర్వాత అనేక రాష్ట్ర ప్రభుత్వాలు ఇంధనంపై వ్యాట్‌ను కూడా తగ్గించాయి. ప్రస్తుతం దేశ రాజధానిలో లీటర్ పెట్రోల్ ధర రూ.95.41, డీజిల్ ధర రూ.88.67గా ఉంది. భారతదేశం తన చమురు డిమాండ్‌లో 85 శాతం, 55 శాతం సహజ వాయువు అవసరాల కోసం దిగుమతులపై ఆధారపడి ఉంది. భారతదేశం 2020-21లో ముడి చమురు దిగుమతుల కోసం 62.71 బిలియన్ డాలర్లు ఖర్చు చేసింది. (చదవండి: డిస్నీ+ హాట్‌స్టార్ అదిరిపోయే ప్లాన్..! కేవలం రూ. 49 కే సబ్స్క్రిప్షన్..!) -
ఢిల్లీలో పెట్రోలుపై రూ.8 తగ్గింపు.. కారణం ఇదే
Petrol Price In Delhi NCR to get cheaper by Rs.8 per litre: ఢిల్లీ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ తీపి కబురు చెప్పారు. పెరిగిన ఫ్యూయల్ ధరలతో సతమతం అవుతున్న రాష్ట్ర ప్రజలకు ఊరట కలిగించే నిర్ణయం తీసుకున్నారు. పెట్రోవాత నుంచి ఉపశమనం కలిగించే చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం విధించే వ్యాట్ (వాల్యూ యాడెడ్ ట్యాక్స్) తగ్గించాలని బుధవారం జరిగిన కేబినేట్ సమావేశంలో ఢిల్లీ సర్కారు నిర్ణయం తీసుకుంది. లీటరుపై రూ. 8 వరకు తగ్గింపు పెట్రోల్ ధరలపై ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్‌పై ప్రస్తుతం ఢిల్లీ సర్కారు అమలు చేస్తోన్న వ్యాట్‌ను 30 శాతం నుంచి 19.40 శాతానికి తగ్గించాలని నిర్ణయం తీసుకుంది. దీని వల్ల లీటరు పెట్రోలు ధర ఇంచుమించు రూ.8 వరకు తగ్గనుంది. 2021 డిసెంబరు 1 అర్థరాత్రి 12 గంటల నుంచి ఈ కొత్త తగ్గింపు ధరలు అమల్లోకి వస్తాయని ఢిల్లీ సర్కారు తెలిపింది. వారి వల్లే ఢిల్లీ నగర పరిధిలో హర్యాణా, ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రాలు కూడా ఉన్నాయి. ఇటీవల కేంద్రం పెట్రోలు, డీజిల్‌లపై ఎక్సైజ్ డ్యూటీని రూ.5 తగ్గించింది. ఆ తర్వాత వ్యాట్ తగ్గించుకోవాలంటూ రాష్ట్రాలకు సూచించింది. దీంతో బీజేపీ ఏలుబడిలో ఉన్న ఉత్తరప్రదేశ్ , హర్యాణా రాష్ట్రాలు వ్యాట్‌ను తగ్గించాయి. దీంతో ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ రీజియన్ పరిధిలో పెట్రోలు, డీజిల్ ధరలు ఒక్కో ప్రాంతంలో ఒక్క రకంగా ఉంటున్నాయి. లీటరు పెట్రోలు ధర ఢిల్లీలో రూ. 103.97 ఉండగా నోయిడా (యూపీ)లో రూ.95.51, గురుగ్రామ్ (హర్యాణా)లో రూ. 95.90లుగా ఉంది. దీంతో పెట్రోలు రేటులో ఏకరూపత తెచ్చేందుకు ఆప్ సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. తాజా నిర్ణయంతో ఢిల్లీలో లీటరు పెట్రోలు ధర రూ.94 దగ్గరగా ఉండనుంది. చదవండి : ‘ఇలా చేస్తే పెట్రోలు ధరలు తగ్గుతాయి’ కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు -
డుగ్గుడుగ్గు బండిపై రాలేనంటున్న పెళ్లి కొడుకు.. ప్రచారంలో ఆర్టీసీ కొత్త పోకడ
ప్రభుత్వ రంగ సంస్థ తెలంగాణ ఆర్టీసీని కాపాడుకునేందుకు కింది స్థాయి ఉద్యోగుల నుంచి పై స్థాయిలో మేనేజింగ్ డైరెక్టర్ వరకు ప్రతీ ఒక్కరు శ్రమిస్తున్నారు. ఆర్టీసీ బస్సులో ప్రయాణించమని కోరుతూ రకరకాల పద్దతిలో ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాను ఉపయోగిస్తూ ప్రజల్లోకి చొచ్చుకుపోతున్నారు. ఇటీవల సోషల్ మీడియా ద్వారా సమాజాన్ని ఊపేసిన బుల్లెట్టు బండి పాటకి, పెరుగుతున్న పెట్రోలు ధరలకి లింకు పెడుతూ రూపొందించిన మీమ్‌ని వరంగల్ 1 డిపో మేనేజర్ అకౌంట్ నుంచి ట్విట్టర్లో పోస్ట్ చేశారు. TSRTC బస్సెక్కి వస్తా!!!@tsrtcmdoffice @TSRTCHQ pic.twitter.com/zinE3kuUZ4 — Depot Manager (@dmwgl1) November 2, 2021 పెట్రోలు రేటు పెరిగిందున డుగ్గుడుగ్గుమని బుల్లెట్ట బండెక్కి రాలేనని, ఆర్టీసీ బస్సులోనే వస్తానని ఇష్టమైతేనే పెళ్లి చేసుకోమంటూ పెళ్లి కొడుకు చెబుతున్నట్టుగా ఉన్న ఈ మీమ్‌ని క్రేజ్ థాట్ అంటున్నారు నెటిజన్లు. నవ్వులు పూయిస్తూ ప్రయాణికులను ఆకర్షించేందుకు ఆర్టీసీ చేస్తున్న ప్రయత్నాలను హర్షిస్తున్నారు. -
బైకు కంటే విమానాలకే చీప్‌గా ఫ్యూయల్ ! మళ్లీ పెరిగిన పెట్రోల్ ధరలు
చమురు కంపెనీలకు కనికరం లేకుండా పోతుంది. గ్యాప్ లేకుండా పెట్రోలు ధరలను పెంచేస్తున్నాయి. తాజాగా పెరిగిన ధరలతో హైదరాబాద్‌లో లీటరు పెట్రోలు ధర ఏకంగా రూ.113కి చేరుకుంది. ఇక రాజస్థాన్‌లోని బన్స్వారాలో అయితే లీటరు పెట్రోలు ఏకంగా రూ.117.21కి చేరుకుంది. పెట్రోలు ధరలు వరుసగా మూడూరోజు కూడా పెరిగాయి. పెట్రోలు, డీజిల్‌లపై లీటరుకి 37 పైసల వంతున ధర పెంచుతూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో హైదరాబాద్‌లో లీటరు పెట్రోలు ధర రూ. 113 కి చేరుకోగా డీజిల్ ధర రూ.106.22గా ఉంది. విమానమే నయం పెరుగుతున్న పెట్రోలు ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. అడ్డుఅదుపు లేకుండా పెరుగుతున్న ధరలతో బైకులు, కార్లను కొన్నాళ్లకు మూలనపడేయాలనే ఆలోచనలో కొందరు ఉండగా.. మరికొందరు తక్కువ ధరకే పెట్రోలు కావాలంటే విమానాలు కొనుక్కోవడం మేలంటూ సెటైర్లు వేస్తున్నారు. వాస్తవ పరిస్థితులు సైతం ఈ వ్యంగాస్త్రాలకు తగ్గట్టుగానే ఉన్నాయి. వాటికి పెట్రోల్ చీప్ బైకులు, కార్లు ఇలా సామాన్యులు ఉపయోగించే పెట్రోలు కంటే విమానాలకు వాడే పెట్రోలు చాలా చీప్‌గా లభిస్తుంది. తాజాగా పెరిగిన రేట్లతో ఢిల్లీలో సాధారణ పెట్రోలు లీటరు ధర రూ.108.64లు ఉండగా విమానాలకు ఉపయోగించే ఏవియేషన్ టర్బో ఫ్యూయల్ (ఏటీఎఫ్)పెట్రోలు లీటరు ధర రూ.79.02లకే లభిస్తోంది. ముంబై విషయానికి వస్తే రెగ్యులర్ పెట్రోలు ధర రూ.114.47 ఉండగా విమానాలకు ఉపయోగించే లీటరు పెట్రోలు ధర రూ.77.37లకే లభిస్తోంది. చెన్నై, కోల్‌కతా, హైదరాబాద్, బెంగళూరు ఇలా అన్ని నగరాల్లో ఇంచు మించు ఇదే వత్యాసం నెలకొంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో సామాన్యులు వినియోగించే పెట్రోలు కంటే విమానాలకు వాడే పెట్రోలు ధర కనీసం 30 శాతం తక్కువ ధరకే లభిస్తోంది. పన్నుల వల్లే మన పెట్రోలు అవసరాలన్నీ దిగుమతుల ద్వారానే తీరుతున్నాయి. విదేశాల నుంచి ముడి చమురు దిగుమతి చేసుకుని శుద్ధి చేసిన తర్వాత వచ్చిన పెట్రోలుకి రవాణా ఛార్జీలు, డీలర్ కమిషన్ కలుపుతారు. తర్వాత వచ్చిన ధరపై కేంద్రం 11 శాతం పన్ను విధిస్తోంది. అనంతరం రాష్ట్రాలు వ్యాట్‌ను విధిస్తున్నాయి. అత్యధికంగా గుజరాత్ రాష్ట్రం 30 శాతం వ్యాట్ని విధిస్తోంది. ఆ తర్వాత తమిళనాడు 29 శాతం వ్యాట్ విధిస్తోంది. దీంతో ఒక్కో రాష్ట్రంలో ఏటీఎఫ్ పెట్రోలు ధర ఒక్కో రకంగా ఉంది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం కేంద్రం విధిస్తున్న పన్ను 11 శాతమే ఉండటం. అందువల్ల ఏటీఎఫ్ పెట్రోలు తక్కువ ధరకే లభిస్తోంది. పెరిగిన పన్నులు ఇక రెగ్యులర్ పెట్రోలుకి సంబంధించి ముడి చమురు ధర, రవాణా ఛార్జీలు, డీలర్ కమిషన్లను మినహాయిస్తే లీటరు పెట్రోలు ధరలో సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ 34 శాతంగా ఉంటోంది. ఈ మొత్తం కలపగా వచ్చిన ధరపై రాష్ట్రాలు వేర్వేరుగా వ్యాట్‌ను అమలు చేస్తున్నాయి. గరిష్టంగా రాజస్థాన్, మహారాష్ట్రలు దాదాపు 29 శాతం వ్యాట్‌ను విధిస్తున్నాయి. దీంతో అక్కడ లీటరు పెట్రోలు దాదాపు రూ. 115 దగ్గరకు చేరుకుంది. రెగ్యులర్ పెట్రోలుకి రాష్ట్రాలు విధిస్తున్న వ్యాట్ కనిష్టంగా 17 శాతం నుంచి 29 శాతం ఉండగా కేంద్రం విధిస్తున్న ఎక్సైజ్ పన్ను ఏకంగా 34 శాతం ఉంటోంది. అంతర్జాతీయ ధరలంటూ పన్నుల విధానం కారణంగా సామాన్యులపై పడుతున్న భారాన్ని ప్రభుత్వాలు నేర్పుగా అంతర్జాతీయ చమురు ధర మీదకు తోసేస్తున్నాయి. ముడి చమురు ధరల వల్లే ఈ సమస్య అన్నట్టుగా కలరింగ్ ఇస్తున్నాయి. ప్రతీ రోజు పెరుగుతున్న పెట్రోలు ధరలతో సామాన్యులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నా పట్టించుకోవడం లేదు. - సాక్షి, వెబ్‌డెస్క్ చదవండి: ఈ దేశంలో పెట్రోలు చాలా చీప్.. లీటరు రూ.1.50 మాత్రమే! -
ఈ దేశంలో పెట్రోలు చాలా చీప్.. లీటరు రూ.1.50 మాత్రమే!
Most Expensive and Cheapest Petrol and Diesel Prices Countries: పెట్రోలు, డీజిల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. అంతర్జాతీయంగా పెరిగిన చమురు ధరల పేరుతో ఆయిల్ కంపెనీలు. వ్యాట్, ఎక్సైజ్ డ్యూటీ పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేస్తున్న భారంతో పెట్రోలు, డీజిల్ రేట్లు లీటరకు వంద రూపాయలు ఎప్పుడో దాటేశాయి. కాన్నీ కొన్ని దేశాల్లో అగ్గిపెట్టె కంటే పెట్రోలు చాలా చీప్. మరి కొన్ని చోట్ల ధరలు భగ్గుమంటున్నాయి. ఇప్పటికే సామాన్యులు మోయలేని దశకు పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగినా.. ఇంకా తమ ధరల దాహం తీరలేదన్నట్టుగా ఆయిల్ కంపెనీలు సంకేతాలు పంపుతున్నాయి. కానీ ఈ దేశంలో అగ్గిపెట్టె కొన్నంత ఈజీగా లీటరు పెట్రోలును కొనేయెచ్చు. ఆ దేశం పేరే వెనుజువెలా. దక్షిణ అమెరికా ఖండంలో ఉన్న ఈ లాటిన్ కంట్రీలో చమురు నిక్షేపాలు పుష్కలం. అమెరికా ఆయిల్ సరఫరాలు తీర్చడంలో ఈ దేశానిదే ముఖ్య పాత్ర. ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని విలవిలాడుతున్నా పెట్రోలు కష్టాలయితే ఆ దేశాన్ని చుట్టుముట్టలేదు. వెనుజువెలాలో లీటరు పెట్రోలు ధర 0.02 డాలర్లు మన కరెన్సీలో అక్షరాల కేవలం రూపాయిన్నర (రూ.1.50) మాత్రమే. చమురు నిల్వలు ఎక్కువగా ఉండటంతో ఈ దేశం అత్యంత చవగ్గా తమ పౌరులకు పెట్రోలు, డీజిల్ అందిస్తోంది. ఇక్కడయితే ఇంతే వెనుజువెలా తర్వాత పెట్రోలు అతి తక్కువ ధరకే అందిస్తున్న దేశంగా ఇరాన్ నిలిచింది. ఇక్కడ లీటరు పెట్రోలు ధర 0.06 డాలర్లుగా ఉంది. అంటే మన కరెన్సీలో రూ.4.51గా ఉంది. ఆ తర్వాత అంతర్యుద్ధంలో కొట్టుమిట్టాడుతున్న సిరియాలో 0.23 డాలర్లు (రూ.17)గా పెట్రోలు ధర ఉంది. వీటి తర్వాత అంగోలా, అల్జేరియా, కువైట్, నైజీరియా, తుర్క్మెనిస్తాన్, ఖజకిస్తాన్, ఇథియోపియా దేశాల్లో 0.50 డాలర్ల లోపే అంటే రూ.40లోపే లీటరు పెట్రోలు వస్తోంది. అక్కడ మోత మోగుతోంది పెట్రోలు ధరలు చాలా ఎక్కువగా ఉన్న దేశాల్లో మొదటి స్థానం హంగ్కాంగ్ది. చైనాలో అంతర్భాగం అయినప్పటికీ పెట్రోలు విషయంలో ఇక్కడ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇటీవల హాంగ్‌కాంగ్‌లో లీటరు పెట్రోలు ధర 2.56 డాలర్లుగా నమోదు అవుతోంది. అంటే మన కరెన్సీలో లీటరు పెట్రోలు ధర రూ.192ల దగ్గరగా ఉంది. హాంగ్‌కాంగ్ తర్వాత స్థానంలో నెదర్లాండ్స్ 2.18 డాలర్లు (రూ.163), సెంట్రల్ ఆఫ్రికా రిపబ్లిక్ 2.14 డాలర్లు (రూ.160)గా ఉన్నాయి. వీటి తర్వాత నార్వే, ఇజ్రాయిల్, డెన్మార్క్, మోనాకో, గ్రీస్, ఫిన్లాండ్, ఐస్లాండ్లలో లీటరు పెట్రోలు కొనాలంటే మన కరెన్సీలో రూ. 150కి పైగానే చెల్లించాలి. ఏడాదిన్నరలో రూ.36 పెరుగుదల కరోనా సమయంలో డిమాండ్, సప్లై మధ్య తేడాలు రావడంతో పెట్రోలు ధరలు ఒత్తిడికి లోనయ్యాయి. దీని మధ్య సమతూకం పేరుతో ఎక్సైజ్ డ్యూటీని కేంద్రం విధించింది. అప్పటి నుంచి మన దగ్గర ఎడాపెడా పెట్రోలు, డీజిల్ ధరలకు అదుపు లేకుండా పోయింది. 2020 మేలో హైదరాబాద్‌లో లీటరు పెట్రోలు ధర రూ. 75 దగ్గర ఉండగా ప్రస్తుతం లీటరు పెట్రోలు ధర రూ.111లుగా ఉంది. దాదాపు ఏడాదిన్నర కాలంలో లీటరు పెట్రోలు ధర కనివినీ ఎరుగని రీతిలో పెరిగింది. మరీ ఈ వైరుధ్యం ఏంటో ? అంతర్జాతీయ మార్కెట్లో ధరలు అంటూ కేంద్రం చెబుతున్నా.. క్షేత్ర స్థాయిలో పరిస్థితులు వేరుగా ఉన్నాయి. 2014లో అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 109 డాలర్లుగా నమోదు అయ్యింది. అప్పుడు లీటరు పెట్రోలు ధర నికరంగా రూ. 71లుగా ఉంది. 2021 అక్టోబరులో బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 85 డాలర్లుగా ఉంది. కానీ ప్రస్తుతం లీటరు పెట్రోలు రూ. 111 దగ్గర నమోదు అవుతోంది. - సాక్షి, వెబ్‌డెస్క్ చదవండి : మళ్లీ పెంపుతో రికార్డు స్థాయికి ధరలు -
పెట్రోల్ రేట్లు ఎంత పెరిగినా నో ప్రాబ్లం.. వాటే ఐడియా గురూ..!!
ఒక బైకుపై ఆరుగురు వ్యక్తులు ఒకరిని ఒకరు అంటకుండా వెళ్లడం సాధ్యమా? ఫజిల్లా ఉందే.. ఇదేలా సాధ్యమౌతుంది.. ఇదేనా మీ సమాధానం. ఐతే ఈ వీడియో వైపు ఓ లుక్కెయ్యండి. బైకుకు వెనక భాగంలో ఒక నెచ్చెన కట్టి, దానికి రెండు టైర్లు అమర్చారు. బైకు నడిపే వ్యక్తి కాకుండా ఇంకా ఐదుగురు, వారి లగేజీలతోసహా ఆ నిచ్చెనపై హాయిగా కూర్చున్నారు. ఇంతమంది కూర్చోగా ఇంకా కావల్సినంత స్థలం మిగిలి ఉండటం ఈ వీడియోలో కనిపిస్తుంది. రోడ్డుపై వేరే వెహికల్లో ప్రయాణించే వారు ఈ సన్నివేశాన్ని రికార్డు చేశారు. దీనికి సంబంధించిన ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే వైరల్ అయ్యింది. ఒకే పనిని ఎప్పుడూ ఒకేలా ఎందుకు చెయ్యాలి.. ఇలా కూడా చేయొచ్చని వీళ్లు నిరూపించారు. ఇక ఈ వీడియోను చూసిన నెటిజన్లు భిన్న కామెంట్ల రూపంలో స్పందిస్తున్నారు. పెరిగిన పెట్రోల్ రేట్ల దృష్ట్యా ఐడియా అదుర్స్ అని సరదాగా కామెంట్ చేస్తున్నారు. ఐడియా భలే ఉందిగానీ, సేఫ్టి చూసుకోండి గురూ అని మరికొందరు సూచిస్తున్నారు. పాపం ట్రాఫిక్ పోలీసుల కంటబడితే వీళ్ల పరిస్థితి ఏంటో అని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. చదవండి: ఈ వాటర్ బాటిల్ ధర సీఈవోల జీతం కంటే ఎక్కువే!.. రూ.45 లక్షలు.. View this post on Instagram A post shared by GiDDa CoMpAnY -mEmE pAgE- (@giedde) -
పండగ పూట షాక్ ! పెరిగిన పెట్రోల్ ధరలు
హైదరాబాద్ : చమురు కంపెనీలు సామాన్యులకు షాక్‌ల మీద షాక్‌లు ఇస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ ధరల స్థిరీకరణ పేరుతో గ్యాప్ లేకుండా బాదుతున్నాయి. ఈ నెలలో మరోసారి పెట్రోలు, డీజిల్ ధరలను పెంచాయి. తాజాగా సవరించిన ధరలతో లీటరు పెట్రోలుపై 34 పైసలు, లీటరు డీజిల్‌పై 37 పైసల వంతున ధరలు పెరిగాయి. దీంతో హైదరాబాద్ నగరంలో లీటరు పెట్రోలు ధర ఏకంగా రూ. 108.96 లకు చేరుకోగా డీజిల్ ధర రూ.102లుగా నమోదు అవుతోంది. ఈ నెలంతా బాదుడే మే నుంచి ఆగస్టు వరకు అంతర్జాతీయ ధరల పేరుతో చమురు కంపెనీలు పెట్రోలు, డీజిలు ధరలు పెంచాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లో లీటరు పెట్రోలు ధర వంద దాటేయగా డీజిల్ ధర సెంచరీకి చేరువైంది. ఆ తర్వాత నెల రోజుల పాటు ధరల పెరుగుదల నుంచి ఉపశమనం లభించింది. సెప్టెంబరు 5 నుంచి అక్టోబరు 2 వరకు పెట్రోలు ధరలు పెరగలేదు. గత పది రోజులుగా పెట్రోలు ధరలు వరుసగా పెరుగుతూనే ఉన్నాయి. దీంతో డీజిల్ ధర సెంచరీ క్రాస్ చేయగా పెట్రోలు ధర రూ. 110 కి చేరుకుంది. -
సెంచరీ దాటిన లీటరు డీజిల్ ధర
Petrol Price: హైదరాబాద్ : చమురు సంస్థల ధరల పెంపు నిర్ణయంతో తెలుగు రాష్ట్రాల్లో లీటరు డీజిల్ ధర సెంచరీ మార్క్‌ని క్రాస్ చేసింది. గురువారం పెంచిన ధరలతో దాదాపు రెండు రాష్ట్రాల్లో అన్ని లీటరు డీజిల్ ధర వంద రూపాయలను దాటేసింది. జూన్‌లోనే లీటరు పెట్రోలు ధర వందను దాటింది. పెంపు ఇలా పెట్రో వడ్డన కార్యక్రమం షురూ అయ్యింది. వరుసగా మూడో రోజు పెట్రోలు, డీజిల్ రేట్లను పెంచుతున్నట్టు చమురు సంస్థలు ప్రకటించాయి. లీటరు పెట్రోలుపై 30 పైసలు, లీటరు డీజిల్‌పై 38 పైసల వంతున ధరలు పెంచాయి. దీంతో హైదరాబాద్ నగరంలో లీటరు పెట్రోలు ధర రూ. 107.36లకు పెరగగా డీజిల్ ధర 100.09లుగా నమోదు అయ్యింది. అక్టోబరు తొలి వారంలో ఏకంగా మూడు సార్లు పెట్రోలు ధరలు పెరిగాయి. మాటలకే పరిమితం పెట్రోలు ధరల నుంచి ఉపశమనం కలిగించేందుకు జీఎస్టీ పరిధిలోకి తీసుకువస్తామంటూ కేంద్రం ఫీలర్లు వదలడమే తప్ప ఆ దిశగా ఇంత వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడం వల్ల రాష్ట్రాలకు తగ్గిపోయే ఆదాయం, అందుకు తగ్గ ప్రత్యామ్నాయం చూపించడంలో కేంద్రం విఫలమవుతోంది. ఫలితంగా పెట్రోలు ధరల భారం సామాన్యులపై పడుతోంది. చదవండి : మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు -
మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు!
హైదరాబాద్: పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ క్రమ క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం వరకు స్థిరంగా ఉన్న పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతూ వస్తున్నాయి. తాజాగా నేడు పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. దీంతో వాహనదారులపై ప్రతికూల ప్రభావం పడనుంది. హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ ధర 26 పైసలు పెరగడంతో రూ.105.74కు చేరింది. డీజిల్ ధర 32 పైసలు పెరుగుదలతో రూ.98.06కు ఎగసింది. ఇక అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గాయి. బ్రెంట్ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 0.46 శాతం తగ్గుదలతో 77.73 డాలర్లకు క్షీణించింది. డబ్ల్యూటీఐ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 0.28 శాతం క్షీణతతో 74.61 డాలర్లకు తగ్గింది. ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం వంటి ప్రభుత్వ రంగ చమురు సంస్థలు అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు ధరలను, రూపాయి-డాలర్ మారకపు విలువను పరిగణనలోకి తీసుకుని ప్రతిరోజూ ఇంధన రేట్లను సవరిస్తాయి. ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుంచి కొత్త పెట్రోల్, డీజిల్ ధరలు మార్పులు చేస్తారు. దేశంలోని ఇతర నగరాలలో కొత్త ఇంధన రేట్లు ఈ క్రింది విధంగా ఉన్నాయి. (చదవండి: పది ఏళ్లుగా ముఖేష్ అంబానీ నెంబర్ 1) -
నాలుగు నెలల్లో లక్ష కోట్లకు పైగా ఎక్సైజ్ సుంకం వసూళ్లు
ఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి నాలుగు నెలల్లో కేంద్ర ప్రభుత్వం వసూలు చేస్తున్న ఎక్సైజ్ సుంకం వసూళ్లు 48% పెరిగాయి. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలోని కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ విడుదల చేసిన డేటా ప్రకారం, ఏప్రిల్-జూలై 2021 మధ్య ఎక్సైజ్ సుంకం వసూళ్లు లక్ష కోట్లకు పైగా వసూలు అయ్యాయి. 2021-22 ఆర్థిక సంవత్సరం మొదటి నాలుగు నెలల(ఏప్రిల్ - జూలై) కాలంలో వసూళ్లు రూ.32,492 కోట్లు పెరిగి సుమారు రూ.1,00,387 కోట్లకు చేరుకుంది. గత కాంగ్రెస్ నేతృత్వంలోని యుపీఎ ప్రభుత్వం ఇంధనానికి సబ్సిడీ ఇవ్వడానికి జారీ చేసిన చమురు బాండ్లను తిరిగి చెల్లించడానికి ఈ ఆర్ధిక సంవత్సరంలో రూ.10,000 కోట్లను చెల్లించాల్సి ఉంటుంది. కానీ, కేవలం ఈ ఆర్ధిక సంవత్సరం మొదటి మూడు నెలలోనే రూ.32,492 కోట్లు వసూలు అయ్యాయి. అంటే.. ఈ చమురు బాండ్ల కింద చెల్లించాల్సిన డబ్బు కంటే మూడు రేట్లు అదనంగా ఎక్సైజ్ సుంకం వసూలు అయ్యింది. ఎక్సైజ్ సుంకం వసూలులో ఎక్కువ భాగం పెట్రోల్, డీజిల్ నుంచే ఉంది. ఎకానమీ పుంజుకోవడంతో, ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో ఎక్సైజ్ సుంకం వసూళ్లు గత సంవత్సరంతో పోలిస్తే లక్ష కోట్లకు పైగా పెరగవచ్చు అని పరిశ్రమ వర్గాలు తెలిపాయి.(చదవండి: ఈడీ నోటీసులను కోర్టులో సవాల్ చేసిన సచిన్ బన్సాల్) అయితే, పెట్రో ధరల పెరుగుదల విషయంలో కేంద్ర చెబుతున్న సమాధానాలు వేరేగా ఉన్నాయి. గత ప్రభుత్వం చమురు కంపెనీలకు రూ.1.34 లక్షల కోట్ల విలువైన బాండ్లను జారీ చేసింది. ఇప్పుడు దానికి వడ్డీ + అసలు చెల్లించాల్సి వస్తున్నట్లు తెలిపింది. మరోవైపు పెట్రో ఉత్పత్తులపై ఇప్పటికే కేంద్రానికి భారీగా ఆదాయం సమకూరుతోంది. 2020-21 మధ్య కాలంలో పెట్రోల్, డీజిల్‌పై రూ.3.35 లక్షల కోట్లు సమకూరింది. అంతకుముందు ఏడాది ఈ మొత్తం రూ.1.78లక్షల కోట్లుగా ఉంది. అంటే 88 శాతం మేర పెరిగినట్లు ఇటీవల పార్లమెంట్‌కు ఇచ్చిన సమాధానంలో కేంద్రమే పేర్కొంది. ప్రజలను తప్పు దోవ పట్టించడానికి కేంద్రం అబద్దం చెబుతున్నట్లు ప్రతిపక్షాలు పేర్కొంటున్నాయి. పెట్రోల్ పై విధిస్తున్న ఎక్సైజ్ సుంకాన్ని గత ఏడాది లీటరుకు రూ.19.98 నుండి రూ.32.9కు పెంచారు. -
Petrol Price: ఎంతకాలం పెంచుతారంటూ కొత్త బైక్‌ను తగులబెట్టాడు
ధరూరు: పెరిగిన పెట్రోల్ ధరలను నిరసిస్తూ తన కొత్త బైక్‌ను తగలబెట్టాడు ఓ యువకుడు. జోగుళాంబ గద్వాల జిల్లా ధరూర్ మండల కేంద్రానికి చెందిన రైతు కుర్వ ఆంజనేయులు మూడు నెలల క్రితం కొత్త బైక్‌ను కొనుగోలు చేశాడు. బుధవారం సాయంత్రం గ్రామంలోని ఓ పెట్రోల్ బంక్ వద్దకు వెళ్లి వాహనంలో పెట్రోల్ పోయించుకున్నాడు. లీటర్ ఎంత అని బంకులో పనిచేస్తున్న వ్యక్తిని అడగ్గా, రూ.107 అని చెప్పడంతో.. ‘అడిగేవారు లేరా.. ఇంకా ఎన్ని రోజులు పెట్రోలు ధరలు పెంచుకుంటూ పోతారు’అని ఆగ్రహం వ్యక్తం చేస్తూ పెట్రోల్‌ను బైక్‌పై పోసి నిప్పంటించి అక్కడే కూర్చున్నాడు. దీంతో చుట్టుపక్కల ఉన్నవారు వచ్చి వెంటనే మంటలు ఆర్పేశారు. విషయం తెలుసుకున్న రేవులపల్లి పోలీసులు ఆంజనేయులును, కాలిపోయిన బైక్‌ను తీసుకెళ్లి కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
వరుసగా రెండో రోజు తగ్గిన డీజిల్ ధరలు
హైదరాబాద్: వరుసగా రెండో రోజు డీజిల్ ధరను తగ్గించాయి చమురు కంపెనీలు. లీటరు డీజిల్‌పై మరోసారి 20 పైసల వంతున ధర తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పడిపోవడంతో డీజిల్ ధరలు తగ్గుతున్నాయి. డీజిల్ ధరలు తగ్గిస్తోన్న చమురు కంపెనీలు పెట్రోలు ధర తగ్గించకపోవడంపై ప్రజల్లో అంసంతృప్తి నెలకొంది. ధరల తగ్గింపుకు ముందు హైదరాబాద్‌లో లీటరు డీజిల్ ధర రూ.97.74 ఉండగా తాజా తగ్గింపుతో రూ.97.54గా ఉంది. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరను ఒకేసారి 25 రూపాయలు పెంచుతూ డీజిల్ ధరలు కేవలం లీటరుకు 20 పైసల వంతున తగ్గించడంపై విమర్శలు వస్తున్నాయి. మొత్తంగా చూస్తే గత నెల రోజులుగా పెట్రోలు, డీజిల్ ధరలు పెరగకుండా నిలకడగా ఉండటం వల్ల సామాన్యులకు ఎంతో కొంత ఉపశమనం కలిగిస్తోంది. -
పెట్రోలు ధరలపై కేంద్ర ఆర్థిక మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు!
పెట్రోలు ధర వంద రూపాయల మార్క్‌ను దాటేసి వాహనదారులను హడలెత్తిస్తున్న సంగతి తెలిసిందే. ఆగకుండా పెరుగుతున్న ధరల వల్ల బంకు వెళ్లిన ప్రతీసారీ సామాన్యుడు బడ్జెట్ లెక్కలు వేసుకోవాల్సి వస్తోంది. అయితే, ఈ పెట్రోల్ ధరలపై కేంద్ర ఆర్ధిక మంత్రి మళ్లీ పాత పాట పాడారు. యూపీఏ హయాంలో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన చమురు బాండ్లపై ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం అసలు, వడ్డీని చెల్లించాల్సి వస్తుందని, ఈ చెల్లింపుల కారణంగానే ధరలు పెరుగుతున్నాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆగస్టు 16న మీడియా సమావేశంలో అన్నారు. గత యూపీఏ ప్రభుత్వం రూ.1.3 లక్షల కోట్ల ఆయిల్ బాండ్ బిల్లులు, రూ.37,340 కోట్ల వడ్డీని తిరిగి చెల్లించలేదని తెలిపారు. ఒక మీడియా సమావేశంలో తమిళనాడు తరహాలో కేంద్రం ఇంధనంపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తుందా అని విలేఖరి అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్ధిక మంత్రి సీతారామన్ ఇలా సమాధానం ఇచ్చారు.. "మేము గత ప్రభుత్వం నుంచి వారసత్వంగా వచ్చిన అన్నింటిని జాబితా చేస్తూ 2014లో ఒక తెల్ల కాగితాన్ని విడుదల చేసి ఉండాల్సింది. చమురు బాండ్లు దానిలో పెద్ద భాగం. గత యూపీఏ ప్రభుత్వం చమురు మార్కెటింగ్ కంపెనీలకు చమురు బాండ్ల జారీ చేయడం వల్ల ఇంధన ధరలు తగ్గాయి. ఇప్పటికీ ఆ భారాన్ని ప్రజలు మోస్తున్నట్లు" అన్నారు. లీటరు పెట్రోల్ రేటుపై రూ.3 ఇంధన పన్నును తగ్గిస్తూన్నట్లు తమిళనాడు ప్రభుత్వం ఆగస్టు 13న ప్రకటించింది. ఈ తగ్గింపు వల్ల ఆ రాష్ట్ర ఖజానా మీద ఏడాదికి రూ.1,160 కోట్ల భారం పడనుంది. -
Petrol Diesel Prices: వాహనదారులకు స్వల్ఫ ఊరట
న్యూఢిల్లీ: చమురు ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. అయితే వరుసగా పెరుగుతున్న పెట్రో ధరలకు ఇవాళ బ్రేక్ పడింది. ఈరోజు చమురు ధరల్లో ఎలాంటి పెరుగుదల లేదని చమురు కంపెనీలు ప్రకటించాయి. మంగళవారం ఉదయం భారత్ పెట్రోలియం, హెచ్‌పీ, ఇండియన్ ఆయిల్ లాంటి ప్రధాన పెట్రోల్ బంకుల్లో పెట్రో ధరల్లో ఎలాంటి పెరుగుదల కనిపించలేదు. ఇక మే 4 నుంచి మొదలైన ధరల పెంపు.. కొనసాగుతూ వస్తోంది. ఈ ఒక్క జులై నెలలోనే పెట్రోల్ ధర ఏడుసార్లు పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.105.15పై., డీజిల్ రూ.97.78పై.గా ఉంది. చెన్నైలో రూ.102.. రూ.92, ముంబైలో రూ.107, రూ.97, ఢిల్లీలో రూ.101, రూ.89, బెంగళూరులో రూ.104, రూ.98గా లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలు ఉన్నాయి. అయితే ఒపెక్ దేశాల వైఖరితో అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు రాబోయే రోజుల్లో పెరిగే అవకాశమే ఉందని నిపుణులు భావిస్తున్నారు. -
పెట్రోల్ ధరలు తగ్గించండి - ఇక్రా
ముంబై: పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ వినియోగం.. ‘ప్రభుత్వ ఆదాయాలకు ఎటువంటి విఘాతం కలుగకుండా’ ఇంధన సెస్ తగ్గింపునకు దోహదపడుతుందని దేశీయ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా శుక్రవారం విశ్లేషించింది. 2020–21లో ప్రభుత్వానికి వచ్చిన ఆదాయాల్లో ఎటువంటి ప్రభావం పడకుండా పెట్రోల్, డీజిల్‌పై లీటర్‌కు రూ.4.5 సెస్ భారం తగ్గించవచ్చని పేర్కొంది. అంతర్జాతీయంగా ఇంధన ధరల తీవ్రత దీనితో దేశంలో ఆకాశాన్ని అంటుతున్న పెట్రోల్, డీజిల్ ధరల నేపథ్యంలో ఇక్రా తాజా సూచనలు చేసింది. దీనివల్ల ద్రవ్యోల్బణం ఆందోళనలను కూడా తగ్గించవచ్చని పేర్కొంది. ఇక్రా విశ్లేషణాంశాలను పరిశీలిస్తే.. మహమ్మారి వ్యాప్తికి ముందు 2019–20 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే 2021–22లో పెట్రోల్ వినియోగం 6.7 శాతం, డీజిల్ వినియోగం 3.3 శాతం పెరుగుతుందని అంచనా. కాగా, 2020–21లో పోల్చితే పెట్రోల్ వినియోగం 2021–22లో 14 శాతం పెరుగుతుందని అంచనా. డీజిల్ విషయంలో ఈ అంచనా 10 శాతంగా ఉంది. 2020–21లో సెస్ ద్వారా రూ.3.2 లక్షల కోట్లు వసూలవుతాయని కేంద్ర ప్రభుత్వం అంచనావేస్తోంది. అయితే అధిక వినియోగం వల్ల ఈ ఆదాయాలు 2021–22లో మరో రూ.40 వేల కోట్లు పెరిగి రూ.3.6 లక్షల కోట్లకు చేరుతుందని అంచనా. పెరుగుతున్న రవాణా, ఎకానమీ రికవరీ దీనికి కారణం. అంటే వినియోగం భారీ పెరుగుదల వల్ల సెస్‌ల రూపంలో 2021–22లో రూ.40,000 కోట్లు ప్రభుత్వానికి అదనపు ఆదాయం వస్తుందన్నమాట. ఈ అదనపు సెస్ రూ.40,000 కోట్ల వసూళ్లను ప్రభుత్వం వదులుకోడానికి సిద్ధపడితే, లీటర్ ఇంధనంపై రూ.4.5 మేర సెస్ భారం తగ్గుతుంది. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఇప్పటి వరకూ సెస్ ద్వారా వచ్చిన ఆదాయాలను చూస్తే, ఏప్రిల్, మే నెలల్లో రూ.80,000 కోట్లు ఒనగూరాయి. 2020–21 ఆదాయాలను చేరడానికి మరో రూ.2.4 లక్షల కోట్లు వసూలయితే సరిపోతుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కి కేంద్రం నిర్దేశిస్తున్న విధంగా 2 నుంచి 6 శాతం శ్రేణిలో వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడానికీ రూ.40,000 కోట్ల సెస్ తగ్గింపు నిర్ణయం దోహదపడుతుంది. సెస్‌ను లీటర్‌కు రూ.4.5 తగ్గిస్తే, ఇంధనం, లైట్, ఆహార ద్రవ్యోల్బణం 10 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) తగ్గే అవకాశం ఉంది. రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు– ప్రస్తుతం 4 శాతం) నిర్ణయానికి ప్రాతిపదిక అయిన వినియోగ ధరల సూచీ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 2021–22లో 5.3 శాతం ఉండే వీలుంది. ఆర్బీఐ అంచనా ప్రకారం ఇది 5.1 శాతంగా ఉంది. రిటైల్ ద్రవ్యోల్బణం మొదటి, రెండవ, మూడవ, నాల్గవ త్రైమాసికాల్లో వరుసగా 5.2 శాతం, 5.4 శాతం, 4.7 శాతం, 5.3 శాతంగా కొనసాగుతాయని ఆర్బీఐ ఇటీవలి ద్వైమాసిన సమీక్ష అంచనావేసింది. అంతర్జాతీయంగా క్రూడ్ ధరల పెరుగుదలకు తోడు డాలర్ మారకంలో రూపాయి బలహీన ధోరణి, మార్చి 2020 నుంచీ కేంద్రం విధించిన అధిక సెస్‌లు, రాష్ట్ర ప్రభుత్వాలు మూడు రెట్లకుపైగా పెంచిన వ్యాల్యూ యాడెడ్ పన్నులు (వీఏటీ) పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరలు భారీగా పెరుగుదలకు కారణమయ్యాయి. దేశంలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే పెట్రోల్ ధర లీటర్ రూ.100 దాటేసింది. డీజిల్ విషయంలోనూ ధర మూడంకెలకు చేరవయ్యింది. ఈ పరిస్థితుల్లో వినియోగదారుకు ప్రయోజనం చేకూర్చడానికి ఇంధనంపై విధించిన సెస్‌ను తగ్గించాలన్న డిమాండ్ విస్తృతమవుతోంది. అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు భారీగా పడిపోయిన నేపథ్యంలో అదనపు ఆదాయానికి ఒక మార్గంగా 2020 ప్రారంభంలో సెస్ మార్గాన్ని కేంద్రం ఎంచుకుంది. ఇప్పుడు క్రూడ్ ధరలు భారీగా పెరిగాయి. అయినా ప్రభుత్వం సెస్‌ను కొనసాగిస్తోంది. ఇది వినియోగదారుపై తీవ్ర భారాన్ని మోపుతోంది. ద్రవ్యోల్బణం ఐదు శాతం: యూబీఎస్ అంచనా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సగటున రిటైల్ ద్రవ్యోల్బణం 5 శాతంగా ఉండే వీలుందని స్విస్ బ్రోకరేజ్ సంస్థ యూబీఎస్ అంచనావేసింది. అయితే రూపాయి మరింత బలహీనపడి, అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు పెరిగితే రిటైల్ ద్రవ్యోల్బణం మరింత పెరగవచ్చని కూడా తన తాజా నివేదికలో పేర్కొంది. ఇక్రా రేటింగ్స్ విషయంలో ఈ అంచనా 5.3 శాతంగా ఉండగా, ఆర్బీఐ అంచనా 5.1 శాతం -
రాకెట్ వేగంతో దూసుకెళ్తున్న పెట్రోల్ ధరలు
హైదరాబాద్: పెట్రోల్, డీజిల్ ధరలు రాకెట్ వేగంతో దూసుకెళ్తున్నాయి. ఎప్పటికప్పుడు సరికొత్త రికార్డు సృష్టిస్తున్న ఇంధన ధరలు ఒకరోజు విరామం తరువాత నేడు మళ్ళీ భారీగానే పెరిగాయి. దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు జీవిత కాల గరిష్ఠాన్ని తాకాయి. ఢిల్లీలో పెట్రోల్ ధరలు 28 పైసలు పెరగడంతో రూ.97.50 చేరుకుంటే, డీజిల్ ధర 26 పైసలు రూ.88.23కు చేరుకుంది. హైదరాబాద్ లో తాజాగా నేడు పెట్రోల్ ధరలు 29 పైసలు, డీజిల్ 28 పైసలు పెరగడంతో పెట్రోల్ ధర రూ.101.33, డీజిల్ ధర రూ.96.17గా ఉన్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఇంధన ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. చెన్నైలో పెట్రోల్ ధర రూ. 98.65, డీజిల్ ధర రూ. 92.83 ముంబైలో పెట్రోల్ ధర రూ. 103.63, డీజిల్ ధర రూ. 95.72 కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ. 97.38, డీజిల్ లీటరుకు రూ. 91.08 భోపాల్‌లో పెట్రోల్ ధర రూ. 105.72, డీజిల్ ధర లీటరుకు రూ. 96.93 బెంగళూరులో పెట్రోల్ ధర రూ. 100.76, డీజిల్ ధర లీటరుకు రూ. 93.54 దేశంలోని చాలా నగరాల్లో పెట్రోల్ ధర ఇప్పటికే రూ.100 మార్కును తాకింది. మే 4 నుంచి వేగంగా పెరిగిన చమురు ధరలు. కేవలం 29 రోజుల్లో పెట్రోల్ ధర లీటరుకు రూ.7.18 పెరిగితే, డీజిల్ ధర రూ .7.45 పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్ ముడి చమురు ధరలను బట్టి దేశీయ ఇంధన ధరలు మారుతాయి. అంతేగాక, ఆర్థిక వృద్ధి కూడా పెట్రోల్ ధరల పెరుగుదల, పతనానికి కారణం. పన్నులు, సరుకు ఛార్జీలను బట్టి ఇంధన ధరలు రాష్ట్రాన్ని బట్టి మారతాయి.కొత్త ఇంధన ధరలను ప్రతిరోజు ఉదయం 6 గంటలకు మారుస్తారు. చదవండి: చైనాకు భారీ షాక్ ఇచ్చిన శామ్సంగ్ -
పెట్రో ధరలపై కేంద్ర మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు
దేశంలో రోజు రోజుకి పెట్రోల్, డీజల్ భారీగా పెరుగుతూ పోతున్న సంగతి అందరికి తెలిసిందే. ధరలు భారీగా పెరుగుతుండటంతో నిత్యావసర ధరలు కూడా పెరుగతున్నాయి. దీంతో సామాన్య ప్రజానీకం ఈ ధరల పెరుగుదలపై గగ్గోలు పెడుతున్నారు. ఈ ధరల పెరగుదలపై కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వివరణ ఇచ్చారు. పెట్రో ధరలు భారీగా పెరుగుతున్నాయిని, దీన్ని తాము అంగీకరిస్తున్నామన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలపై పడుతున్న ఈ భారాన్ని తాము అర్థం చేసుకోగలమని అన్నారు. గత నెల మే 4వ తేదీ నుంచి ఇప్పటివరకు చమురు ధరలు 23 సార్లు పెరిగిన నేపథ్యంలో ధర్మేంద్ర ప్రధాన్ పైవిధంగా స్పందించారు. పెట్రో ధరలపై కేంద్రం చర్యలు తీసుకోకపోవడానికి కారణాలు కూడా వివరించారు. సంక్షేమ పథకాలకు నిధులు కోసం నగదును సర్దుబాటు చేయాల్సి వస్తుంది అని ఆయన వెల్లడించారు. సంక్షేమ కార్యక్రమాల కోసం నిధులు ఆదా చేస్తున్నందునే పెట్రో ధరల పెంపును ఉపేక్షించాల్సి వస్తోందని ఆయన వివరణ ఇచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో దేశ వ్యాప్తంగా రేషన్ కోసం రూ. లక్ష కోట్లు, వ్యాక్సిన్ల కోసం రూ.35 వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. ఇలాంటి విపత్కర పరిస్థితులలో నిధులు ఆదా చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. అందుకే పెట్రో భారంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నట్లు చెప్పారు. చదవండి: హోమ్ లోన్, వ్యక్తిగత రుణాల కోసం సిబిల్ స్కోర్ ఎంత ఉండాలి? -
ఆకాశాన్ని తాకుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో పెట్రోలు, డీజిల్ ధరలు మళ్లీ ఒక రోజు విరామం తర్వాత మే 16న ఆదివారం పెరిగాయి. మే 4 నుండి పెరుగుతూ వస్తున్న ధరలు ఆదివారం తొమ్మిదవసారి పెరిగి వినియోగదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఆదివారం పెట్రోలుపై 25 పైసలు, డీజిల్ ధరలు 30 పైసలు పెరిగాయి. తాజా పెంపుతో దేశంలోని కొన్ని ప్రధాన నగరాల్లో పెట్రోల్ ధరలు రూ.100 దాటేశాయి. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్ రాష్ట్రాల్లో పెట్రోల్ ధర సెంచరీ కూడా కొట్టేసింది. దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు రూ.92.34 నుంచి రూ.92.58కు పెరిగితే, డీజిల్ ధర లీటరుకు రూ 82,95 నుంచి రూ.83.22 చేరుకుంది. ప్రస్తుతం, పెట్రోల్, డీజిల్ ధరలు ముంబైలో అత్యధికంగా ఉన్నాయి. ముంబైలో పెట్రోల్ లీటరుకు 98.88 రూపాయలకు, డీజిల్ లీటరుకు రూ.90.40 చొప్పున విక్రయిస్తున్నట్లు ప్రభుత్వ చమురు శుద్ధి సంస్థ తెలిపింది. అసెంబ్లీ ఎన్నికల సమయం ముగిసిన తర్వాత మే 4 నుంచి ప్రభుత్వ యాజమాన్యంలోని చమురు కంపెనీలు చమురు ధరలను పెంచుతూ పోతున్నాయి. విలువ ఆధారిత పన్ను లేదా వ్యాట్ కారణంగా పెట్రోల్, డీజిల్ ధరలు రాష్ట్రాల వారీగా మారుతూ ఉంటాయి. ఇంధన ధరలలో ఏవైనా మార్పులు జరిగితే ఆ ధరలు 6 గంటల నుంచి అమలులోకి వస్తాయి. నేడు హైదరాబాదులో పెట్రోలు ధర రూ.96.22,డీజిల్ ధర రూ.90.73గా ఉంది. చదవండి: Ducati: డుకాటీ నుంచి రెండు కొత్త బైకులు -
సామాన్యుడి నడ్డి విరుస్తున్న చమురు కంపెనీలు
న్యూఢిల్లీ: ఏ ముహూర్తన ఎన్నికలు అయిపోయాయో గానీ అప్పటి నుంచి చమురు కంపెనీలు సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి. ఒక పక్క సామాన్యుడు కరోనా మహమ్మరితో పోరాడతుంటే మరోపక్క చమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. దీంతో ఏది కొనాలి అన్న భయమేస్తుంది. ఎన్నికల ఫలితాలు ప్రకటించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎనిమిది సార్లు పెట్రోల్ రేట్లు పెరిగాయి. ఈ నెల 4 నుంచి ఇప్పటి వరకు పెట్రోల్‌పై రూ..1.94, డీజిల్‌పై రూ.2.22 పెరిగింది. చమురు కంపెనీలు ఒక రోజు విరామం తీసుకుని నేడు మళ్లీ పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాయి. దేశవ్యాప్తంగా పెట్రోల్ ధర 28-30 పైసలు పెరగగా, డీజిల్ ధర 34-40 పైసలు పెరిగింది. తాజా పెంపుతో చమురు ధరలు రికార్డు స్థాయికి చేరాయి. ప్రస్తుతం ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.92.34, డీజిల్ రూ.82.95కు చేరుకుంది. ఆర్థిక రాజధాని ముంబైలో పెట్రోల్ రూ.98.65, డీజిల్, రూ.89.75, చెన్నైలో రూ.93.84, డీజిల్ రూ.87.49, కోల్‌కతాలో రూ.92.16, డీజిల్ రూ.85.45, జైపూర్‌లో రూ.99.02, డీజిల్ రూ.91.80కి చేరాయి. ఇక హైదరాబాద్‌లో పెట్రోల్ ధర 30 పైసలు పెరిగి రూ.95.97కు చేరుకుంటే, డీజిల్ ధర 37 పైసలు పెరిగి రూ.90.43 చేరుకుంది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్ వంటి రాష్ట్రాలలో పలు చోట్ల లీటర్ పెట్రోల్ ధర రూ.100 మార్క్‌ను కూడా దాటింది. రోజు రోజుకు ఇంధన ధరలు పైపైకి వెళ్తుండడంతో వాహనదారులు, సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. భారతదేశంలో ఇంధన ధరల పెరుగుదల అనేది అంతర్జాతీయ ముడి చమురు ధరలు, రూపాయి డాలర్ మార్పిడి రేటుపై ఆధారపడి ఉంటుంది. పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం, విలువ ఆధారిత పన్ను (వ్యాట్), కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాలు వివిధ పన్నులు విధిస్తాయి. పెట్రోల్ రిటైల్ అమ్మకపు ధరలో 60శాతం, డీజిల్ 54 శాతంపైగా కేంద్ర, రాష్ట్ర పన్నులు ఉన్నాయి. చదవండి: గూగుల్ క్రోమ్ యాప్‌తో జర జాగ్రత్త! -
Petrol Price: సెంచరీ కొట్టేసిన పెట్రోలు ధరలు
న్యూఢిల్లీ: పెట్రో ధరల పెరుగుదల ఆగడం లేదు. అసెంబ్లీ ఎన్నికలను పురస్కరించుకొని... 18 రోజులు పెంపు జోలికి వెళ్లని ఆయిల్ కంపెనీలు తర్వాత రోజువారీగా వడ్డిస్తున్నాయి. మే 4 తేదీ నుంచి పెట్రో ధరలు వరుసగా పెరుగుతూ వస్తున్నాయి. దీని ఫలితంగా దేశంలోని పలు నగరాల్లో పెట్రోల్ ధర 100 రూపాయలు దాటేసింది. బోఫాల్‌లో లీటరు పెట్రోల్ రూ.100.08 ఉండగా ఇండోర్‌లో రూ.100.16 చేరింది. ఇక రాజస్తాన్‌లోని. శ్రీగంగానగర్‌లో దేశంలోనే ఎక్కడా లేనంత అధికంగా లీటర్ పెట్రోల్ ధర రూ.102.96కు చేరింది. డీజిల్ లీటర్ ధర రూ.95.89గా ఉంది. నేడు పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎటువంటి మార్పు లేదు. హైదరాబాద్ లో పెట్రోల్ ధర రూ.95.67, డీజిల్ ధర రూ.90.06గా ఉంది. చదవండి: టెకీలకు బంపర్ ఆఫర్ : డబుల్ హైక్స్ కు ఐటీ దిగ్గజాల మొగ్గు -
తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు
న్యూఢిల్లీ: భారత్‌లో కొన్ని రోజులుగా స్థిరంగా ఉన్న పెట్రోల్, డీజిల్ ధరలకు బ్రేక్ పడింది. గురువారం పెట్రోల్, డీజిల్ ధరలు స్వల్పంగా తగ్గాయి. పెట్రోల్‌పై లీటరుకు 16 పైసలు, డీజిల్ 14 పైసలు తగ్గింది. సుమారు 15 రోజుల విరామం తర్వాత నేడు(ఏప్రిల్ 15) చమురు ధరలు స్వల్పంగా తగ్గాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.. ప్రస్తుతం దేశ రాజధాని దిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.90.40 ఉండగా, డీజిల్ ధర రూ.80.73గా ఉంది. రాష్ట్రాలు విధించే పన్నులు ఆధారంగా ధరల్లో స్వల్ప మార్పు ఉంటుంది. ఆరు నెలల నుంచి పెరుగుతూ వస్తున్న పెట్రోల్ ధరలు పెరగ్గా, మార్చి 24 నుంచి స్వల్పంగా తగ్గాయి. నేడు హైదరాబాద్ లో పెట్రోల్ ధర రూ.93.99 ఉండగా, డీజిల్ ధర రూ.88.05గా ఉంది. చదవండి: ఫ్లిప్‌కార్ట్ చేతికి ట్రావెల్ బుకింగ్ క్లియర్‌ట్రిప్ -
గుడ్‌న్యూస్: పెట్రోల్, డీజిల్‌పై భారం లేనట్లే
న్యూఢిల్లీ : లీటర్ పెట్రోల్‌పై రూ.2.5, లీటర్ డీజిల్‌పై రూ.4 చొప్పున అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ సెస్(ఏఐడీసీ) విధిస్తున్నట్లు 2021–22 బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనివల్ల రవాణా వ్యయం పెరిగి, నిత్యావసరాల ధరలు మండిపోతాయన్న ఆందోళనలు వ్యక్తమైనప్పటికీ వాస్తవానికి ప్రజలపై ఈ భారం ఉండదు. ఎందుకంటే పెట్రోల్, డీజిల్‌పై బేసిక్ ఎక్సైజ్ డ్యూటీ(బీఈడీ), స్పెషల్ అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ (ఎస్ఏఈడీ)ని ప్రభుత్వం తగ్గించింది. ప్రస్తుతం లీటర్ పెట్రోల్‌పై బీఈడీ రూ.2.98 ఉండగా, దీన్ని రూ.1.4కు తగ్గించారు. అలాగే ఎస్ఏఈడీని రూ.12 నుంచి రూ.11కు కుదించారు. అలాగే లీడర్ డీజిల్‌పై బీఈడీని రూ.4.83 నుంచి రూ.1.8కు, ఎస్ఏఈడీని రూ.9 నుంచి రూ.8కి తగ్గించివేశారు. మొత్తంగా ఎక్సైజ్ పన్ను (బీఈడీ+ఎస్ఏఈడీ+ఏఐడీసీ) లీటర్ పెట్రోల్‌పై రూ.14.9, లీటర్ డీజిల్‌పై రూ.13.8 కానుంది. ఇప్పటివరకు ఇది వరుసగా రూ.14.98, రూ.13.83గా ఉంది. అంటే కొత్తగా అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ సెస్ విధించినా పెట్రోల్, డీజిల్ ధరల్లో మార్పు ఉండదు. వినియోగదారులపై అదనపు భారం పడబోదు. మద్యం ధరల్లోనూ మార్పు లేదు పెట్రోల్ డీజిల్ తరహాలోనే ఇంపోర్టెడ్ మద్యంపై 100 శాతం అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ సెస్(ఏఐడీసీ) విధిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్లో ప్రకటించింది. 80 కంటే తక్కువ ఆల్కహాల్ శాతం ఉన్న దిగుమతి చేసుకున్న స్పిరిట్స్, వైన్స్‌పై ప్రస్తుతం 150 శాతం కస్టమ్స్ డ్యూటీ విధిస్తున్నారు. దీన్ని రూ.50 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. దీంతో మద్యంపై కస్టమ్స్ డ్యూటీ, ఏఐడీసీ కలిపి 150 శాతం కానుంది. అంటే దిగుమతి చేసుకున్న మద్యంపై ఏఐడీసీ విధించినప్పటికీ ధరల్లో ఎలాంటి మార్పు ఉండదు. -
2015–18 స్థాయికి పెట్రో ధరల సవరణ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్‌పై విలువ ఆధారిత పన్ను (వ్యాట్)ను 2015–18 స్థాయికి సవరిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. పెట్రోల్‌పై రూ.1.24, డీజిల్‌పై 93 పైసల చొప్పున వ్యాట్‌ను పెంచింది. పెట్రోల్‌పై 31 శాతం పన్నుతో పాటు అదనంగా రూ.4, డీజిల్‌పై 22.25 శాతం వ్యాట్‌తో పాటు అదనంగా రూ.4 సుంకం విధించింది. కోవిడ్ కారణంగా ఆదాయం పడిపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ► లాక్డౌన్ వల్ల ఆదాయాలు భారీగా పడిపోవడంతో చాలా రాష్ట్రాలు పన్నులు పెంచాయి. అదే బాటలో ఇక్కడ కూడా ధరలు సవరించినట్టు ప్రభుత్వం పేర్కొంది. ఏప్రిల్, మే నెలల్లో ఢిల్లీ, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, రాజస్తాన్, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలు పన్ను రేట్లు పెంచాయి. ► లాక్డౌన్ వల్ల ఏప్రిల్‌లో రాష్ట్రానికి రూ.4,480 కోట్ల సొంత ఆదాయం రావాల్సి ఉండగా.. కేవలం రూ.1,323 కోట్లు మాత్రమే వచ్చింది. ఇదే పరిస్థితి మే, జూన్ నెలల్లోనూ కొనసాగింది. ► ఆదాయం తగ్గినా రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ విపత్తును సమర్ధవంతంగా ఎదుర్కోవడానికి వైద్యం, సంక్షేమం పథకాల పరంగా పెద్దఎత్తున నిధులను వెచ్చించింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పెద్దఎత్తున ప్రశంసలు వచ్చాయి. ► ఆర్థిక పరిస్థితులు దిగజారుతున్న నేపథ్యంలో 2015–18 స్థాయికి దాటకుండా పెట్రోల్, డీజిల్‌పై పన్ను రేట్లు సవరించినట్టు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ సవరించిన ధరలు మంగళవారం నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు. -
ఢిల్లీ: పెట్రోల్‌తో పోటీ పడిన డీజిల్ ధర
న్యూఢిల్లీ : వరుసగా 18వ రోజు దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. దీంతో బుధవారం దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలు దాదాపు ఒకే ధర పలుకుతున్నాయి. అక్కడ లీటర్ పెట్రోల్ ధర 79.88 రూపాయలుగా కాగా, డీజిల్ ధర 79.40 రుపాయలుగా ఉంది. అంటే ఒక్క రోజులో లీటర్ డీజిల్‌పై ధర 48 పైసలు పెరిగింది. 18 రోజుల వ్యవధిలో ఢిల్లీలో లీటర్ పెట్రోల్‌పై 9.41రూపాయలు, డీజిల్ 9.58 రూపాయలు పెరిగాయి. ఇంటర్నేషనల్ బెంచ్‌మార్క్ రేట్ల ప్రకారం ఎక్కడైనా పెట్రోల్ ధర డీజిల్ కంటే ఎక్కువగా ఉంటుంది. కానీ ఢిల్లీ ప్రభుత్వం డీజిల్‌పై వ్యాట్‌ను భారీగా పెంచడంతో దేశ రాజధానిలో పెట్రోల్ కంటే డీజిల్ ఖరీదుగా మారింది. అయినప్పటికీ ఇతర మెట్రో నగరాలైన కోల్కత్తా, ముంబై , చెన్నైలలో డీజిల్ రేట్ల కంటే పెట్రోల్ ధరలు అధికంగా ఉన్నాయి. (లాక్డౌన్ వేళ పెట్రో సెగలు) ప్రపంచవ్యాప్తంగా రవాణా, పారిశ్రామిక కార్యకలాపాలపై పరిమితులను సడలించడంతో ఇంధన ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. జూన్ 7 కు ముందు లాక్డౌన్ కారణంగా 82 రోజుల పాటు దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎటువంటి మార్పులు చోటుచేసుకోలేదు. మెట్రో నగరాల్లో బుధవారం పెట్రోల్ ధరలు మారకుండా డీజిల్ ధరలను పెంచడంతో లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. (వరుసగా 17వ రోజూ పెట్రో వడ్డన) నగరం పెట్రోల్ డీజిల్ ఢిల్లీ 79.76 79.88 కోల్కత్తా 81,45 75,06 ముంబై 86,54 78,22 చెన్నై 83,04 77,17 (సోర్స్: ఇండియన్ ఆయిల్) -
మన దగ్గర పెట్రోల్ ధరలు ఎందుకు తగ్గడం లేదు?
సాక్షి, న్యూఢిల్లీ : అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు చరిత్రలో ఎన్నడు ఎరగనంతగా పడిపోయాయి. ఏప్రిల్ 22వ తేదీ నాటికి ఓ బారెల్ ధర కనిష్ట స్థాయికి 16 డాలర్లకు పడి పోయింది. నెల రోజుల్లో చమురు ధరలు ఏకంగా 39 శాతం పడి పోయాయి. అయినా దేశీయంగా భారత్ పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గక పోవడం ఆశ్చర్యకరం. కరోనా వైరస్ కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు జనవరి నెల నుంచి తగ్గుముఖం పట్టాయి. అయినా ఇప్పటికీ ముంబైలో లీటరు పెట్రోలు ధర 76.31 రూపాయలు, డీజిల్ ధర 66.21 రూపాయలు. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గినా పెట్రోలు, డీజిల్ ధరల్లో భారతీయులకు పెద్దగా ప్రయోజనం ఎందుకు కలగలేదు? అందుకు కారణాలేమిటీ? కేంద్ర ప్రభుత్వం అనూహ్యంగా మార్చి 14వ తేదీన పెట్రోలు, డీజిల్‌పై లీటరుకు మూడు రూపాయల చొప్పున పెంచింది. ఈ కారణంగా కేంద్రానికి సమకూరే సొమ్ము 39 వేల కోట్ల రూపాయలు. ఆ తర్వాత వారానికి కేంద్ర ప్రభుత్వం భవిష్యత్తులో పెట్రోలు, డీజిల్‌పై అదనంగా మరో ఎనిమిది రూపాయల ఎక్సైజ్ పన్నును పెంచేందుకు వీలుగా దేశ ఆర్థిక బిల్లును సవరించింది. చమురు ధరల హెచ్చింపు, తగ్గింపులపై ఇక తమ ప్రభుత్వానికి ఎలాంటి ఆధిపత్యం ఉండదని చమురు ధరలపై నియంత్రణను ఎత్తివేసిన నాడే నరేంద్ర మోదీ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆ తర్వాత అంతర్జాతీయ మార్కెట్లో ధరలు తగ్గినప్పుడు భారత్‌లో పెట్రోలు ధరలు తగ్గుతూ, పెరిగినప్పుడు పెరుగుతూ వచ్చాయి. ఆ తర్వాత దేశ ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చుకోవడంలో భాగంగా చమురు ధరలపై ఎక్సైజ్ పన్నులను పెంచుతూ వచ్చింది. ఇప్పుడు ఇంతగా పన్నులను పెంచడానికి ఆర్థిక అవసరాలే కనిపిస్తున్నాయి. ఆర్థిక ద్రవ్యోల్బణాన్ని తగ్గించుకోవడానికి ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది జీడీపీలో ఆదాయం, వినిమయానికి మధ్య వ్యత్యాసం మూడున్నర శాతానికి చేరుకుంది. ఈ వ్యత్యాసం ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఏడు శాతానికి చేరుకుంటుందని ముంబైకి చెందిన ‘మోతీలాల్ ఓస్వాల్’ బ్రోకరేజ్ సంస్థ ఏప్రిల్ 13న విడుదల చేసిన ఓ నివేదికలో హెచ్చరించింది. మరోపక్క డాలర్‌తో రూపాయి మారక విలువ పడి పోతోంది. కరోనా పరిస్థితుల ప్రభావం ఇలాగే కొనసాగినట్లయితే ఆర్థిక పరిస్థితి మరింత దిగజారే ఆస్కారం ఉంది. కేంద్రం నిర్ణయం సరైనది కాదు: కేజ్రీవాల్ -
పెరగనున్న పెట్రోలు ధరలు
సాక్షి, న్యూఢిల్లీ : సౌదీ అరేబియాలోని చమురు నిల్వలపై యెమెన్‌కు చెందిన హౌతి తిరుగుబాటుదారులు శనివారం దాడి చేసిన సంఘటనలో రోజుకు 57 లక్షల బ్యారెళ్ల చమురు సరఫరా నిలిచిపోయింది. పర్యవసానంగా అంతర్జాతీయ మార్కెట్‌కు రోజుకు ఐదు శాతం చొప్పున చమురు సరఫరా నిలిచిపోయింది. పర్యవసానంగా అంతర్జాతీయ ముడి చమురు ధరలు పెరిగి పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగే అవకాశం ఉందని అంతర్జాతీయ చమురు మార్కెట్ నిపుణులు సోమవారం హెచ్చరించారు. అయితే అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరగకుండా నివారించేందుకు తక్షణమే అమెరికా దేశీయ చమురు నిల్వలను విడుదల చేయాల్సిందిగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు. అమెరికా తీసుకున్న ఈ నిర్ణయం వల్ల రెండు, మూడు రోజులు అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరగకుండా నిలబడవచ్చని, మంటల్లో చిక్కుకుని తీవ్రంగా నష్టపోయిన సౌదీ అరేబియా చమురు సంస్థ ఎప్పటిలోగా తమ చమురు ఉత్పత్తుల సరఫరాను పునరుద్ధరించగలదనే అంశంపై ఆధారపడి చమురు ధరలు పెరగడం, పెరగకుండా ఉండడం ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుత సౌదీ అరేబియా చమురు సంస్థ సరఫరాపై అనిశ్చిత పరిస్థితే కొనసాగుతోంది. ఎందుకంటే ఇప్పటికీ అక్కడి చమురు నిల్వల నుంచి పొగ వెలువడుతూనే ఉంది. సౌదీపై ఈ దాడికి పాల్పడింది ఎవరో ఇప్పటికే గుర్తించామని, వారిపై ప్రతీకార దాడి జరిపేందుకు ఆయుధాలు లోడ్ చేసి పెట్టుకున్నామని, సౌదీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మరుక్షణం దాడికి పాల్పడతామని ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్ ప్రోత్సాహంతో యెమెన్‌కు చెందిన హౌతి మిలిటెంట్లు ఈ దాడికి పాల్పడ్డారని అంతర్జాతీయ వార్తలు తెలియజేస్తుండగా, ఇరాన్‌యే ఈ దాడికి పాల్పడిందని అమెరికా నేరుగా ఆరోపిస్తోంది. అంటే ఇరాన్‌పైనే అమెరికా దాడి చేసే అవకాశం ఉంది. ఈ ఉద్రిక్తల కారణంగా కూడా అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగే అవకాశం ఉంది. (చదవండి: అమెరికా అబద్ధాలు గరిష్టానికి చేరాయి) -
న్యూయార్క్ కన్నా మన ముంబైలోనే చౌక
సాక్షి, న్యూఢిల్లీ : ఆధునిక జీవన శైళికి సంబంధించి చాలా విషయాల్లో అమెరికాలోని న్యూయార్క్ నగరం కన్నా మన ముంబై నగరం ఎంతో చీప్. సినిమా టిక్కెట్లు, టాక్సీ ట్రిప్పులు, ఫ్యాన్సీ డిన్నర్లు న్యూయార్క్ కన్నా ముంబైలో 17 శాతం నుంచి 33 శాతం వరకు చౌకని దాయ్చూ బ్యాంక్ నిర్వహించిన ఓ సర్వేలో వెల్లడయింది. ఇక ఐఫోన్ ఎక్స్ఎస్లయితే న్యూయార్క్ నగరం కన్నా మన ముంబైలోనే యమ ఖరీదు. అక్కడికన్నా ఇక్కడ 131 శాతం ధర ఎక్కువ. పెట్రోలు కూడా అక్కడి కన్నా ఇక్కడే ఎక్కువ. అందుకు కారణం అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరుగుతుండడం, అమెరికా డాలర్‌తో రూపాయి మారకం విలువ పడిపోవడం, అధిక పన్నులు అందుకు కారణం. ఆపిల్ ఉత్పత్తులైన మ్యాక్‌బుక్స్, ఐపాడ్స్, ఆపిల్ వాచ్‌లు ఒక్క న్యూయార్క్ ఏమిటో ప్రపంచంలోని అనేక దేశాల్లోకెల్లా భారత్‌లోనే ఖరీదు. ఈ విషయాన్ని ఆపిల్ సీఈవో టిమ్ కుక్ స్వయంగా అంగీకరించారు కూడా. 2018, సెప్టెంబర్ నెలలో మార్కెట్లోకి వచ్చిన ఐఫోన్ ఎక్స్ఎస్ ధర భారత్‌లో 1635 డాలర్లు (1.14 లక్షల రూపాయలు). అదే అమెరికాలో 1250 డాలర్లు. మన కన్నా అర్జెంటీనా, టర్కీ, బ్రెజిల్ దేశాల్లో మనకన్నా ఐఫోన్ ధర ఎక్కువే. ఆపిల్ ఉత్పత్తులపై మన దేశం దిగుమతి సుంకాలను ఎక్కువగా పెంచడం, ఆపిల్ కంపెనీ కాకుండా మధ్యవర్తితో అమ్మకాలు జరిపించడం వల్ల ధరలు అధికంగా ఉంటున్నాయి. సెల్ఫోన్ల కొనుగోళ్లలో ప్రపంచంలోనే భారత రెండవ పెద్ద దేశం అవడం వల్ల ఇక భారత్‌లో తమ ఉత్పత్తులను నేరుగా విక్రయించేందుకు ఆపిల్ ప్రయత్నాలు చేపట్టింది. -
పేలనున్న పెట్రోలు బాంబు!
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో అటు ప్రభుత్వ యంత్రాంగం, ఇటు ప్రజానీకం లోక్‌సభ ఎన్నికల ప్రక్రియలో మునిగిపోవడంతో అంతర్జాతీయంగా పెరుగుతున్న చమురు ధరలను ఎవరు పట్టించుకోవడం లేదు. ఇరాన్ నుంచి చమురు కొనుగోలు చేసేందుకు అలీన దేశాలకు ఇచ్చిన అనుమతిని ఇప్పుడే రద్దు చేయడం లేదని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ గత వారం స్పష్టం చేయడంతో అంతర్జాతీయ మార్కెట్లో అప్పటివరకున్న బ్యారెల్ పెట్రోల్ ధర 75 డాలర్ల నుంచి 73 డాలర్లకు పడిపోయింది. ట్రంప్ ప్రకటన ప్రభావం స్పల్పంగానే పనిచేసింది. అంతర్జాతీయంగా చమురు ధరలు గత ఏడాదితో పోలిస్తే 30 శాతం పెరిగాయి. గత ఆరు వారాల్లోనే 12 శాతం పెరిగాయి. దానికి అనుగుణంగా దేశంలో పెట్రోలు ధరలు ఎక్కడా పెరగలేదు. గత ఆరు వారాల్లో లీటరు పెట్రోల్‌కు కేవలం 47 పైసలు మాత్రమే పెరిగింది. మరి అంతర్జాతీయ చమురు ధరలకు అనుగుణంగా దేశంలో ఎందుకు పెట్రోలు ధరలు పెరగలేదు? అన్న ప్రశ్నకు సమాధానం దొరకడం పెద్ద కష్టమేమి కాదు. ఎన్నికలు. ఈ సమయంలో పెట్రోలు ధరలు పెంచినట్లయితే అది పాలకపక్ష భారతీయ జనతా పార్టీకి ప్రతికూలాంశం అవుతుందని ఆందోళనతో ఆ అంశాన్ని పక్కన పెట్టి ఉంటారు. చమురు ధరలను ఇలా తొక్కిపెట్టడం దేశంలో ఇదే మొట్టమొదటిసారి కాదు. గతేడాది కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కూడా చమురు ధరలను తొక్కిపట్టి ఉంచారు. ఎన్నికల ఫలితాలు వెలువడగానే ధరలను ఒక్కసారిగా పెంచేశారు. ఎన్నికల సమయంలో నష్టపోయినా సొమ్మునంతా తిరిగి రాబట్టారు. ఈసారి కూడా అలాంటి ప్రమాదమే జరిగే అవకాశం ఉందని అఖిల భారత పెట్రోలు డీలర్ల సంఘం కోశాధికారి నితిన్ ఘోయల్ తెలిపారు. నేడు దేశంలో ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండడం, దేశంలో నిరుద్యోగ సమస్య పెరిగిపోవడం, వ్యవసాయ సంక్షోభ పరిస్థితుల్లో చిక్కుకోవడం లాంటి సమస్యలను ఎలా ఎదుర్కోవాలో తెలియక సతమతమవుతున్న కేంద్ర ప్రభుత్వానికి పెట్రోలు ధరల పెంపు శిరోభారమే. ఇక వినియోగదారులకు అది పేలనున్న బాంబే. -
ఒడిశాలో పెట్రోల్ ధరను దాటిన డీజిల్ ధర
-
ఇందులో ఏదెక్కువో తేల్చండి!
సాక్షి, న్యూఢిల్లీ : 56.71 రూపాయలు ఎక్కువనా, 72.83 రూపాయలు ఎక్కువనా అని ఏ ఒకటవ తరగతి పిల్లవాడిని అడిగినా 72.83 రూపాయలు ఎక్కువని ఠక్కున చెప్పేస్తాడు. రోజు రోజుకు పెరుగుతున్న పెట్రోలు ధరలను సమర్థించుకునేందుకు కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయం ప్రధాని నరేంద్ర మోదీ బొమ్మతో విడుదల చేసిన ఓ గ్రాఫిక్ చిత్రంలో 56.71 రూపాయలకన్నా 72.83 రూపాయలు 28 శాతం తక్కువని చూపించింది. ఆ మేరకు దిగువకు బాణం గుర్తును కూడా గీసింది. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోకన్నా బీజేపీ ప్రభుత్వం హయాంలో పెట్రోలు పెరగడం కన్నా తగ్గిందని గ్రాఫ్‌లో చూపించడం కోసం తాపత్రయ పడిన బీజేపీ మొన్నటి వరకున్న అసలు డీజిల్ ధరను కూడా సూచించాల్సి వచ్చి బొక్క బోర్లా పడింది. ఆ గ్రాఫ్‌ను చూసిన వారెవరైనా కింద పడి గిలగిలా కొట్టుకోవాల్సిందే. అలా కాసేపు కొట్టుకున్న ట్విట్టర్లు ఆ తర్వాత తేరుకొని తమదైన శైలిలో ట్వీట్లు పేలుస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నాటి పరిస్థితితో పోలిస్తే అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు భారీగా తగ్గినా దేశీయంగా చమురు ధరలను ఎప్పటికప్పుడు మోదీ ప్రభుత్వం పెంచుతూ వచ్చింది. ప్రతిపక్షాలన్నీ ఏకమై భారత్ బంద్‌కు పిలుపునివ్వడం, భగ్గుమంటున్న భారత ప్రజలు కూడా బంద్‌ను విజయవంతం చేయడం తెల్సిందే. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు బంద్ విజయవంతమైందని ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రకటించుకోగా, పెట్రోలు ధరల పెంపునకు తమ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని, అంతర్జాతీయ చమురు సంస్థలు అంతర్జాతీయ మార్కెట్ ధరలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు సవరించుకుంటున్నాయని మోదీ ప్రభుత్వం సమర్థించుకునేందుకు ప్రయత్నించింది. తిమ్మిని బమ్మిచేసైనా ప్రభుత్వాన్ని సమర్థించాలనుకున్న బీజేపీ కార్యాలయం పాఠకుల దిమ్మ తిరిగేలా చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో రేట్లు (ఢిల్లీ మార్కెట్ రేట్లు) 2004, మే 16వ తేదీన అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధర బారెల్‌కు 36 డాలర్లు ఉండగా, లీటరు ప్రెటోలు ధర 33.71 రూపాయలు, డీజిల్ లీటరు ధర 21.74 రూపాయలు ఉండింది. 2009, మే 16వ తేదీ నాటికి అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధర 36 డాలర్ల నుంచి 58 డాలర్లకు పెరగ్గా, పెట్రోలు ధర 33.71 రూపాయల నుంచి 40.62 రూపాయలకు, డీజిల్ ధర 21.74 రూపాయల నుంచి 30.86 రూపాయలకు పెరిగింది. ఇక 2014, మే 16వ తేదీ నాటికి అంతర్జాతీయ మార్కెట్లో బారెల్ క్రూడాయిల్ ధర 107 డాలర్లకు పెరగ్గా, లీటరు పెట్రోలు ధర లీటరుకు 71.41 రూపాయలకు, డీజిల్ ధర 56.71 రూపాయలకి పెరిగింది. బీజేపీ అధికారంలోకి వచ్చాక (ఢిల్లీ మార్కెట్లో) కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం వచ్చాక పెరిగిన చమురు ధరలను పరిశీలిస్తే విస్తు పోవాల్సిందే. 2014లో అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధర 107 డాలర్లు ఉన్నప్పుడు లీటరు పెట్రోలు ధర 71.41 రూపాయలు ఉండగా, 2018, సెప్టెంబర్ 10వ తేదీ నాటికి అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధర 71 డాలర్లకు పడిపోగా లీటరు పెట్రోలు ధర 80.73 రూపాయలకు పెరిగింది. డీజిల్ లీటరు ధర 72.83 రూపాయలకు పెరిగింది. ఇక్కడే బీజేపీ పొరపాటు చేసింది. 2014లో డీజిల్ ధర 56.71 రూపాయలు ఉండగా, 2018, సెప్టెంబర్ 10కి 72.83 రూపాయలకు పడిపోయిందని గ్రాఫిక్ ద్వారా చూపింది. దీంతో ట్వీట్ల మీద ట్వీట్లు పేలుతున్నాయి. వాస్తవానికి కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో దేశంలో చమురు ధరలు ప్రభుత్వ నియంత్రణలో ఉండేవి. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు పెరిగినప్పుడల్లా, పెరిగిన ధరలకు అనుగుణంగా కాకుండా ప్రభుత్వం సూచించిన మేరకే దేశంలోని ప్రభుత్వ చమురు కంపెనీలు ధరలు పెంచేవి. దీనివల్ల చమురు కంపెనీలపై పడే ఆర్థిక భారాన్ని కేంద్ర ప్రభుత్వమే భరించేది. ప్రభుత్వ ధరలలో పోటీ పడలేక ప్రైవేటు చమురు కంపెనీలు తీవ్రంగా నష్టపోయేవి. ఈ దశలో ప్రైవేటు చమురు కంపెనీలను ఆదుకునేందుకు మోదీ ప్రభుత్వం అంతర్జాతీయ క్రూడాయిల్ ధరలకు అనుగుణంగా ధరలను పెంచుకోవాల్సిందిగా ఆదేశిస్తూ చమురు కంపెనీలకు ఉత్తర్వులు జారీ చేసింది. ఫలితంగానే మోదీ ప్రభుత్వం హయాంలో ధరలు పెరుగుతూ వస్తున్నాయి. చమురు కంపెనీలకు స్వేచ్ఛనిచ్చిన మోదీ ప్రభుత్వం వినియోగదారులకు సబ్సిడీ ఇచ్చి ఉండాల్సింది. అలా చేయక పోవడం వల్ల దేశంలో డీజిల్ ధరలు పెరిగినప్పుడల్లా అన్ని సరకుల ధరలు పెరుగుతున్నాయి. ప్రజల నుంచి ఆందోళన వ్యక్తం అవుతోంది. నరేంద్ర మోదీలో బీజేపీ సీనియర్ నాయకుడు ఎల్కే అడ్వానీ ఒకప్పుడు మోదీలో ఏం చూశారోగానీ, మోదీని ‘బ్రిలియెంట్ ఈవెంట్స్ మేనేజర్’ అని ప్రశంసించారు. మరి తాజా గ్రాఫ్ చూశాక ఇప్పుడేమంటారో! -
త్వరపడండి.. ట్యాంకు ఫుల్ చేయించండి..!
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలను లీటర్‌కు ఒక పైసా తగ్గిస్తున్నట్టు బుధవారం చమురు సంస్థలు ప్రకటించడంపై వినియోగదారులు మండిపడుతున్నారు. ‘పైసా’చికంపై సోషల్ మీడియాలో జోకులు, వంగ్యాస్త్రాలు ఎక్కుపెట్టారు. ఫొటోలు, వీడియోలతో ప్రభుత్వ చమురు సంస్థల తీరును ఎండగట్టారు. ఒక్క పైసాను ఏం చేసుకోవాలబ్బా... ఆ...గుర్తొచ్చింది. జన్‌ధన్ యోజన అకౌంట్లలో జమచేసేస్తాను. అసలు దీనంతటికీ కారణం మన తొలి ప్రధాని నెహ్రూయే. ఆయన హయాంలోనే పైసాను చలామణిలోకి తెచ్చారు. అందుకే ఇప్పుడు పైసా తగ్గింది ఒక్క పైసా ఆదా అయింది. ఎలా ఖర్చు పెట్టాలో అర్థం కావట్లేదు. ఏమేం కొనాలో ఒక జాబితా రూపొందించుకోవాలి. అబ్బా! ఎంత ఉపశమనమో. ఒక్క పైసా తగ్గిందోచ్.. నిజంగా ఇవాళ నేను కోటీశ్వరుడినన్న భావన కలుగుతోంది. సేల్ సేల్.. మెగా సేల్.. పెట్రోల్‌పై ఒక్క పైసా డిస్కౌంట్. త్వరపడండి.. ట్యాంకు ఫుల్ చేయించండి.. మంచి తరుణం మించినా దొరకదు. అబ్బో.. ఊహించలేకపోతున్నాం. ఏకంగా ఒక్క పైసా తగ్గించారు కదా.. ప్రజలపై మోదీకి ఉన్న సానుభూతిని వెలకట్టలేం... నిజంగా మీ రుణం తీర్చుకోలేనిది. పట్టలేనంత సంతోషంగా ఉంది. నా అందమైన భవిష్యత్‌ని నిర్మించుకోవడానికి ఒక్క పైసా ఆదా చేసుకోగలిగాను. ఇంతకంటే జీవితానికి కావల్సినదేముంది. పెట్రోల్, డీజిల్‌పై ఆదా చేసిన ఒక్క పైసాతో ఇల్లు, కారు, హెలికాప్టర్ కొనాలనుకుంటున్నాను. -
ప్రధాని ఫిట్నెస్ చాలెంజ్ ట్వీట్‌పై స్పందించిన రాహూల్ గాంధీ
-
పెట్రోల్ ధరలు.. నిర్మాత ట్వీట్‌పై జోకులు
బాలీవుడ్ నిర్మాత ఏక్తా కపూర్ చేసిన వ్యాఖ్యలపై జోకులు పేలుస్తూ నెటిజన్లు తెగ ట్రోల్ చేస్తున్నారు. పెట్రోల్ ధరలు పెరగడంపై ఏక్తా కపూర్ చేసిన వ్యాఖ్యల అంతరార్థమేమిటో అర్థం కాకపోవడమే ఇందుకు కారణం. ‘వీరే ది వెడ్డింగ్’ సినిమా ప్రమోషన్లో పాల్గొన్న ఏక్తా.. ‘ ఒకవేళ పెట్రోల్ ధరలు ఎక్కువగా ఉన్నప్పటికీ అబ్బాయిలు అమ్మాయిలను లాంగ్‌డ్రైవ్స్‌కి తీసుకెళ్తారు. ఈరోజుల్లో అమ్మాయిలు కూడా అబ్బాయిలను డ్రైవ్‌కి తీసుకెళ్తున్నారు. అయిపోవటానికి ఇదేం సినిమా కాదు. కాబట్టి, మీరు మీ డ్రైవింగ్‌పై తక్కువ ఖర్చు చేయండి. థియేటర్లలో ఎక్కువ సమయం ఉండండి’ అంటూ వ్యాఖ్యానించారు. ఏక్తా కపూర్ వ్యాఖ్యలను ఏఎన్ఐ ట్వీట్ చేసింది. ‘ఏక్తా లాజిక్ ఆమె నిర్మించే సీరియళ్లలాగే ఇంకా బేస్మెంట్ లెవల్లోనే ఉందంటూ’ ఓ నెటిజన్ ట్వీట్ చేయగా.. ‘ఒకవేళ భవిష్యత్తులో ఆహారం ధరలు పెరిగితే.. అదేమీ స్కూలు ఫీజు కాదు కట్టకుండా ఉండటానికి.. పిల్లల చదువుకు తక్కువ ఖర్చు చేయండి.. ఆహారం కోసం ఎక్కువ డబ్బు వెచ్చించండి’ అంటూ మరొకరు వ్యంగంగా ట్వీట్ చేశారు. అయితే గతంలో కూడా పలుమార్లు ఇలాంటి లాజిక్‌లేని వ్యాఖ్యలు చేసి ఏక్తా కపూర్ నెటిజన్ల చేతికి చిక్కారు. Even if petrol prices are at its highest, men will take women for drives & in today's time, women will take men for drives. This isn't the movie that you're going to stop watching as at this time you need to spend less on driving & more in theatre: Ekta Kapoor on fuel price hike pic.twitter.com/kyhaowGHVN — ANI (@ANI) May 22, 2018 -
త్వరలోనే పెట్రోల్ @100.. తగ్గించడానికి అదొక్కటే మార్గం!
సాక్షి, హైదరాబాద్ : రోజురోజుకు అమాంతం పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరలు ప్రజలను బెంబెలెత్తిస్తున్నాయి. గడిచిన పదిరోజుల్లో పెట్రోల్ ధర క్రమంగా పెరిగింది కానీ, తగ్గింది లేదు. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో లీటరు పెట్రోల్ 81. 47 రూపాయలకు లభిస్తుండగా.. లీటరు డీజిల్ 74.04 రూపాయలకు లభిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు పెరగడంతో దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. ఏదిఏమైనా పెట్రోల్, డీజిల్ ధరలు అమాంతం పెరగడంతో సామ్యానుడిపై భారం మరింత పడుతోంది. మధ్యతరగతి వేతన జీవులు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరల భారాన్ని తట్టుకోవడానికి తమ రోజువారీ నిత్యావసరాల్లో కోత పెట్టుకోవాల్సి పరిస్థితి నెలకొంది. మొత్తానికి దేశమంతటా పెట్రోల్, డీజిల్ ధరలపై సామాన్య, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాగే ధరలు పెరుగుతూపోతే త్వరలోనే లీటరు పెట్రోల్ ధర రూ. 100లను దాటుతుందని, అప్పుడు మధ్యతరగతి ప్రజలు మరింతగా ఇబ్బంది పడాల్సి వస్తుందని అంటున్నారు. వెంటనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకొని పెట్రో ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంలో కేంద్ర పెట్రోలియంశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చమురు సంస్థలతో చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలంటే రాష్ట్ర స్థాయిలో వ్యాట్ తదితర పన్నులు, కేంద్రం పన్నులు, సుంకాలు తగ్గించడమే ఒక్కటే మార్గమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ‘పెట్రో ధరలు నేరుగా ముడి చమురు ధరలతో ముడిపడి ఉన్నాయి. ఓపీఈసీ దేశాలు ముడిచమురు సరఫరాను నిలిపివేశాయి. అంతర్జాతీయంగా ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ధరలు తగ్గించాలని చెప్పడానికి లేదు. కానీ కేంద్ర, రాష్ట్రాల స్థాయిలో విధిస్తున్న వివిధ పన్నులు, సుంకాలు తగ్గించడం ద్వారా పెరుగుతున్న పెట్రోల్ ధరల నుంచి సామాన్యులకు ఊరట కల్పించవచ్చు. ధరలు తగ్గించడానికి అదొక్కటే మార్గం’ అని పెట్రోల్ పంప్ డీలర్స్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు అజయ్ భన్సల్ తెలిపారు. -
పెట్రోల్ ధరలపై స్పందించిన కేంద్రమంత్రి
న్యూఢిల్లీ : పెట్రోల్ ధరలు అత్యంత గరిష్టస్థాయికి చేరుకోవడంపై కేంద్ర పెట్రోలియం శాఖమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పందించారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. పెట్రోల్, డిజిల్ ధరలు పెరుగుదలతో సామన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే విషయాన్ని తాను అంగీకరిస్తున్నట్లు తెలిపారు. పెట్రో ఉత్పత్తులు తగ్గడం, అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు పెరగడం.. పెట్రోల్, డిజిల్ ధరలపై ప్రభావం చూపిందన్నారు. త్వరలోనే భారత ప్రభుత్వం ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తుందని పేర్కొన్నారు. కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో 19 రోజుల పాటు పెట్రో ధరలను యథాతథంగా ఉంచిన ఆయిల్ కంపెనీలు మే 14 నుంచి తిరిగి ధరల సవరణను చేపట్టాయి. దీంతో పెట్రో ధరలు గరిష్ట స్థాయికి చేరాయి. గత వారం రోజులుగా పెట్రోల్ ధర లీటర్‌కు రూ 1.61, డీజిల్ ధర లీటర్‌కు రూ 1.64 మేర పెరిగాయి. హైదరాబాద్‌లో పెట్రోల్ లీటర్ ధర రూ 80.76 దాటడం గమనార్హం. డీజిల్ లీటర్‌కు రూ 73.45కు చేరింది. ఇక దేశవ్యాప్తంగా లీటర్ పెట్రోల్ రూ 76.24కు చేరగా, డీజిల్ ధర రూ 67.57కు ఎగబాకింది. -
స్పీకర్ మోడ్ లేదా ఏరోప్లేన్ మోడ్
మాలూరు/దొడ్డబళ్లాపుర/హొసకోటె: కర్ణాటక విధానసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సోమవారం వ్యంగ్య బాణాలు సంధించారు. ‘స్పీకర్ మోడ్’ లేదా ‘ఏరోప్లేన్ మోడ్’లో ఉండే మొబైల్ ఫోన్ వంటి వ్యక్తి మోదీ అనీ, ఆయన ఎప్పుడూ ‘వర్క్ మోడ్’లో ఉండరని రాహుల్ ఎద్దేవా చేశారు. సోమవారం రాహుల్ మాలూరు, హొసకోటె, దొడ్డబళ్లాపుర, దేవనహళ్లి తదితర ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు. ‘మాట్లాడటానికి మరో విషయమే లేనట్లు మోదీ ఎప్పుడూ తన ప్రసంగాల్లో నాపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేస్తుంటారు. ప్రస్తుత సమస్యలపై కాకుండా కాంగ్రెస్‌ను, నన్ను దూషించడమే పనిగా పెట్టుకుని మాట్లాడతారు. ఆయన మాటల్లో ఎప్పుడూ మా పార్టీ వారిపై గౌరవం కనిపించదు’ అని పేర్కొన్నారు. పెట్రో ధరలు పెరిగిపోతుండటానికి నిరసనగా రాహుల్ గాంధీ కొద్ది దూరంపాటు సైకిల్ తొక్కి, మరికొద్ది దూరం ఎద్దుల బండిలో ప్రయాణించారు. -
పెట్రో ధరలు త్వరలోనే తగ్గుతాయ్
అహ్మదాబాద్ / గాంధీనగర్: అమెరికాలో సంభవించిన హరికేన్ల ప్రభావంతో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మీడియాకు తెలిపారు. గత మూడు రోజులుగా అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధర తగ్గుతోందని, తదనుగుణంగా త్వరలోనే దేశంలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయని వెల్లడించారు. ఈ ధరల్ని తగ్గించడానికి పెట్రోలియం ఉత్పత్తులపై పన్నులు తగ్గించే ప్రసక్తే లేదని ప్రధాన్ మరో ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. గత 20 ఏళ్లుగా ఈ ధరలు అంతర్జాతీయ మార్కెట్‌కు అనుసంధానమై ఉన్నాయని వెల్లడించారు. ఏకాభిప్రాయంతో పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. -
తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయి. లీటర్ పెట్రోల్ పై రూ.1.12 పైసలు, లీటర్ డీజిల్ పై రూ.1.24పైసలు ధరలు తగ్గిస్తున్నట్టు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రకటించింది. తగ్గించిన ధరలు నేటి అర్థరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయని పేర్కొంది. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గడంతోపాటు డాలర్ తో రూపాయి మారకం విలువకు అనుగుణంగా ఈ ధరలను తగ్గించినట్టు తెలిసింది. కాగ, రోజువారీగా సవరించనున్న పెట్రోల్, డీజిల్ రేట్లపై పెట్రోల్ డీలర్లు కూడా సమ్మతించారు. ధరలను ప్రతిరోజూ అర్థరాత్రి కాకుండా ఉదయం ఆరు గంటలకు సవరించాలన్న వారి డిమాండ్ కు ప్రభుత్వం ఒప్పుకోవడంతో ముందుగా నిర్ణయించిన బంద్ ను కూడా పెట్రో డీలర్లు ఉపసంహరించుకున్నారు. రేపటి నుంచే రోజువారీ ధరల మార్పు ఉండనుంది. కానీ ఒక్క రోజే ముందే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తున్నట్టు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రకటించడం విశేషం. ఇవి కూడా నేటి అర్థరాత్రి నుంచే అమల్లోకి వస్తాయని పేర్కొంది. -
16 నుంచి పెట్రోల్, డీజిల్ బంద్!
పెట్రోల్ బంకుల యజమానుల హెచ్చరిక న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలను రోజువారీగా సవరించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పెట్రోల్ బంకుల యజమానులు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. జూన్ 16 నుంచి ప్రభుత్వ చమురు సంస్థల నుంచి పెట్రోల్, డీజిల్ కొనకూడదని నిర్ణయించారు. ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నామని పెట్రోల్ బంకుల యజమాన్య సంఘాలు తెలిపాయి. అదే జరిగితే పెట్రోల్ బంకులు ఖాళీ అయిపోయి వినియోగదారులకు తిప్పలు తప్పవు. అయితే ఇది సమ్మె కాదని.. 16 నుంచి పెట్రోల్, డీజిల్ మాత్రం కొనబోమని అఖిల భారత పెట్రోలియం డీలర్ల సంఘం అధ్యక్షుడు అజయ్ బన్సాల్ తెలిపారు. జూన్ 16 నుంచి దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలను రోజువారీగా సవరిస్తామని పెట్రోలియం సంస్థలు స్పష్టం చేసిన నేపథ్యంలో పెట్రోల్ బంకుల యజమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అమలుచేస్తున్న ఐదు నగరాల్లో యజమానులు చేతులు కాల్చుకున్నారని.. దేశవ్యాప్తంగా అమలుపై పునరాలోచించాలని కోరారు. దేశవ్యాప్తంగా సుమారు 57 వేల పెట్రోల్ బంకులు ఉన్నాయి. వీటిలో ఐఓసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ సంయుక్త ఆధ్వర్యంలో 53 వేల బంకులు నడుస్తున్నాయి. అంతర్జాతీయ ముడి చమురు ధరలకు అనుగుణంగా ప్రతి 15 రోజులకు పెట్రోల్, డీజిల్ ధరలను సవరిస్తున్నాయి. రోజువారీ ధరల సవరణను ప్రయోగాత్మకంగా మే 1 నుంచి పుదుచ్చేరి, చండీగఢ్, జంషెడ్పూర్, ఉదయ్‌పూర్, విశాఖపట్నంలో అమలు చేస్తున్నారు. ఎస్సార్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి ప్రైవేటు సంస్థలు కూడా ఈ విధానాన్ని అనుసరించాయి. స్టాక్ విలువ పడిపోతుందున్న భయంతో రోజువారీ ధరల సవరణకు డీలర్లు జంకుతున్నారు. తమకు కమిషన్ పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. రోజువారీ ధరల సవరణతో పారదర్శకత పెరుగుతుందని, చిల్లర అమ్మకాల్లో ఒడిదుడుకులు చాలా వరకు తగ్గుతాయని చమురు కంపెనీలు అంటున్నాయి. -
పెట్రోల్‌పై రూ.3.78 పెంపు
చెన్నై : తమిళనాడులో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. పెట్రోల్‌పై రూ 3.78, డీజిల్‌పై రూ 1.70 పెరిగాయి. పెట్రోల్, డిజిల్‌పై తమిళనాడు ప్రభుత్వం వ్యాట్(వ్యాల్యూ ఆడెడ్ ట్యాక్స్) పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ధరల పెంపుపై తమిళనాడు పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. పెట్రోల్, డిజిల్ ధరల పెంపుతో సామాన్యులపై తీవ్రప్రభావం పడుతుందని, తక్షణమే ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పెట్రోల్‌పై 27 శాతం ఉన్న వ్యాట్‌ను 34 శాతానికి పెంచగా, డీజిల్‌పై 21.4 శాతం ఉన్న వ్యాట్‌ను 25 శాతానికి పెంచారని అసోసియేషన్ ప్రెసిడెంట్ కే.పీ మురళి పేర్కొన్నారు. ధరలపెంపుతో రవాణా ఖర్చులు పెరిగి కూరగాయల దగ్గర నుంచి అన్ని వస్తువుల ధరలపై ప్రభావం పడే అవకాశం ఉందని తెలిపారు. తమిళనాడులో పెంచిన వ్యాట్‌తో పెట్రోల్ ధర లీటరుకు రూ. 75కు చేరింది. -
డీజిల్ ధర తగ్గి.. పెట్రోల్ ధర పెరిగింది!
-
పెట్రోల్ ధర పెరిగింది!
కరెన్సీ కష్టాలకు తోడు దేశప్రజలకు మరో చిన్న షాక్. లీటరు పెట్రోల్ ధర 0.13 పైసలు పెరిగింది. ఈ మేరకు ఆయిల్ కంపెనీలు బుధవారం రాత్రి నిర్ణయాన్ని వెల్లడించాయి. అదే సమయంలో డీజిల్ ధర 0.12 పైసలు (ఒక లీటరుకు)తగ్గింది. కొత్త ధరలు నేటి(నవంబర్ 30) అర్థరాత్రి నుంచి అమలులోకి వస్తాయని ఆయిల్ కంపెనీలు ప్రకటించాయి. నవంబర్ 15న లీటరు పెట్రోల్‌పై రూ.1.46 పైసలు, లీటరు డీజిల్‌పై రూ.1.53 పైసలు తగ్గిన సంగతి తెలిసిందే. ప్రతి 15 రోజులకు ఒకసారి ఆయిల్ ధరలను సమీక్షించే కంపెనీలు.. చివరిసారిగా నవంబర్ 15న ధరలు తగ్గించాయి. నేటి సమీక్షలో పెట్రోల్ ధరలు పెంచి, డీజిల్ ధరలు తగ్గిస్తున్నట్టు తెలిపాయి. కొత్త ధరల ప్రకారం ఢిల్లీలో లీటరు పెట్రోల్ రూ.66.10, లీటరు డీజిల్ రూ.54.57గా ఉండనున్నాయి. -
సామాన్యుడికి పెట్రోవాత
ఐదు వారాల్లో పెట్రోల్‌పై రూ.4.47, డీజిల్‌పై రూ.6.46 పెంపు న్యూఢిల్లీ: విపరీతంగా పెరిగిన నిత్యావసరాల ధరలతో అల్లాడుతున్న ప్రజలు.. ఐదు వారాల్లో లీటర్ పెట్రోల్ ధర రూ.4.47, డీజిల్ ధర రూ.6.46 పెంపుతో మరిన్ని కష్టాలు పడుతున్నారు. మంగళవారం లీటర్ పెట్రోల్‌పై రూ.2.58, డీజిల్‌పై రూ.2.26 పెంచడం తెలిసిందే. మే 1 నుంచి పెట్రో ధరలను పెంచడం ఇది మూడోసారి. మే 1న లీటర్ పెట్రోల్ ధరను రూ.1.06, మే 17న రూ. 0.83 పెంచారు. డీజిల్‌పై మే 1న రూ. 2.94, మే 17న రూ.1.26ను ఆయిల్ కంపెనీలు పెంచాయి. తాజా పెంపుతో ఈ ఏడాదిలో పెట్రో ధరలు గరిష్ట రిటైల్ రేటుకు చేరుకున్నాయి. ఇక ఏప్రిల్ 16న చివరిసారిగా ప్రభుత్వం పెట్రోల్ ధరలను తగ్గించింది. అప్పుడు పెట్రోల్‌పై రూ.0.74, డీజిల్‌పై రూ.1.30 పైసలను తగ్గించింది. మార్చి నుంచి ఇప్పటివరకూ పెట్రోల్ ధర రూ.8.99, డీజిల్ ధర రూ.9.79 పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు తగ్గినపుడు కూడా కేంద్రం పెట్రో ఉత్పత్తుల ధరలను తగ్గించకుండా.. లాభాన్ని పెంచుకునేందుకు ఎక్సైజ్ సుంకాన్ని 9రెట్లు పెంచింది. దీనివల్ల పెట్రోల్‌పై రూ. 11.77, డీజిల్‌పై రూ. 13.47 ఎక్సైజ్ సుంకం పెరిగింది. కంపెనీలు పెట్రో ధరలు పెంచడంతో గోవా ప్రభుత్వం పెట్రోల్‌పై 20 శాతంగా ఉన్న వ్యాట్‌ను 15 శాతానికి తగ్గించింది. పెంపును ఉపసంహరించాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. సబ్సిడీయేతర సిలిండర్‌పై రూ.21 పెంపు సబ్సిడీయేతర 14.2 కిలోల ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర రూ. 21 పెరిగింది. ఢిల్లీలో ధర రూ. 527.50 నుంచి రూ.548.50కు చేరింది. కాగా, 2016-17 బడ్జెట్లో పేర్కొన్నట్లు 0.5 శాతం కృషి కల్యాణ్ సెస్ బుధవారం నుంచి అమల్లోకి వచ్చింది. సినిమా టికెట్లు, హోటల్ బిల్లులు, బ్యాంకింగ్ లావాదేవీలు తదిరాలపై సేవాపన్ను 15 శాతానికి చేరింది. -
పెట్రోలు ధర పెంపునకు నిరసనగా ఆందోళన
కల్యాణదుర్గం (అనంతపురం జిల్లా) : పెట్రోలు ధరల పెంపునకు నిరసనగా కల్యాణదుర్గంలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో కార్యకర్తలు, నాయకులు ఆందోళనకు దిగారు. పెంచిన ధరలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. కార్యకర్తలు తమ బైక్‌లను తోసుకుంటూ నిరసన వ్యక్తం చేశారు. కల్యాణదుర్గం వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ తిరుమల వెంకటేశ్వర్లు, పట్టణ కన్వీనర్ గోపారం శ్రీనివాసులు ఆధ్వర్యంలో బుధవారం ఈ ఆందోళనలు జరిగాయి. -
లీటర్ పెట్రోల్ ధర రూ.60 దాటకూడదని..
పణజి: పెట్రోల్ ధరలపై ఇచ్చిన హామీని నిలబెట్టుకునేందుకు గోవా సర్కారు విలువ ఆధారిత పన్ను(వ్యాట్) తగ్గించింది. పెట్రోల్ పై వ్యాట్ ను 2 శాతం తగ్గించింది. దీంతో రాష్ట్రంలో పెట్రోల్ పై వ్యాట్ 22 శాతం నుంచి 20 శాతానికి తగ్గిందని వాణిజ్య పన్నుల విభాగం సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. లీటర్ పెట్రోల్ ధర రూ.60 దాటనీయబోమని బీజేపీ సర్కారు ఎన్నికల్లో హామీయిచ్చింది. చమురు కంపెనీలు గత రాత్రి పెట్రోల్ ధర లీటర్ కు 83 పైసలు పెంచాయి. దీంతో లీటర్ పెట్రోల్ ధర గోవాలో రూ.60 దాటిపోయింది. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం మేరకు వ్యాట్ తగ్గించి పెట్రోల్ ధర రూ.60 మించకుండా చేసింది. ప్రస్తుతం గోవాలో లీటర్ పెట్రోల్ ధర రూ.59.70గా ఉంది. గోవాలో 2012లో అధికారం చేపట్టిన బీజేపీ పెట్రోల్ పై వ్యాట్ పూర్తిగా రద్దు చేసింది. ఫలితంగా పెట్రోల్ ధర లీటరకు రూ.11 తగ్గింది. రాష్ట్ర ఖజానాకు రూ. 150 కోట్ల నష్టం వాటిల్లుతుండడంతో నిర్ణయాన్ని మార్చకుని మళ్లీ వ్యాట్ విధించింది. -
రూ.3.02 తగ్గిన పెట్రోల్ ధర
డీజిల్‌పై రూ.1.47 పెంపు న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పెట్రోల్ ధరలు లీటరుకు రూ. 3.02 తగ్గగా.. డీజిల్ రూ. 1.47 పెరిగినట్లు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) ప్రకటించింది. మారిన ధరలు సోమవారం అర్థరాత్రినుంచి అమల్లోకి వచ్చాయి. ఫిబ్రవరి నెలలో పెట్రోల్ ధరలు తగ్గటం, డీజిల్ ధరలు పెరగటం ఇది రెండోసారి. కాగా, కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక పెట్రో ఉత్పత్తుల ధరలు తగ్గటం ఇది ఏడోసారి. ఫిబ్రవరిలో పెట్రోల్ ధరలు తగ్గినా అది నామమాత్రంగానే ఉన్నాయి. ఫిబ్రవరి 1న పెట్రోల్ ధర నాలుగు పైసలు, 18న 32 పైసలు తగ్గగా.. డీజిల్ ఫిబ్రవరి 1న మూడు పైసలు తగ్గగా.. ఫిబ్రవరి 18న 28 పైసలు పెరిగింది. అంతర్జాతీయంగా పెట్రో ఉత్పత్తుధరలు తగ్గటం, డాలర్‌తో రూపాయి మారక విలువ స్వల్పంగా తగ్గటంతో పాటు పదిహేనురోజులకోసారి ఇంధన సరఫరా కంపెనీల సమీక్ష సమావేశంలో తీసుకున్న నిర్ణయాల వల్లే ధరల్లో మార్పులు తీసుకువచ్చినట్లు ఐఓసీ తెలిపింది. పెట్రోల్‌పై ఎక్సైజ్ డ్యూటీ ఒక రూపాయి పెరగగా.. డీజిల్‌పై 1.5 రూపాయలు పెరిగింది. దీని ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో కేంద్రానికి 3200 కోట్ల ఆదాయం సమకూరనుంది. గత నవంబర్ నుంచి పెట్రో ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకం పెంచటం ఇది ఐదోసారి కావటం విశేషం. మారిన ధరలతో హైదరాబాద్‌లో రూ. 63.52 ఉన్న పెట్రోల్ ధర రూ. 60.33కు తగ్గగా.. రూ.48.51 ఉన్న డీజిల్ రూ. 50.09కు లభించనుంది. -
పెట్రోల్ తగ్గింది, డీజిల్ పెరిగింది
న్యూఢిల్లీ: పెట్రోల్ ధర లీటర్ కు 32 పైసలు తగ్గింది. డీజిల్ ధర కాస్త పెరిగింది. లీటర్ డీజిల్ కు 28 పైసలు పెంచినట్టు చమురు సంస్థలు బుధవారం వెల్లడించాయి. కొత్త ధరలు ఈ అర్ధరాత్రి నుంచే అమలవుతాయని పేర్కొన్నాయి. జనవరి 15న పెట్రోల్ పై 32 పైసలు, డిజిల్ పై 85 పైసలు తగ్గించాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు భారీగా తగ్గుతున్న ఆ ప్రయోజనం వినియోగదారులకు దక్కడం లేదు. పెట్రోల్ ధర తగ్గించిన వెంటనే కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీని పెంచుతోంది. జనవరి 30న పెట్రోల్‌పై లీటర్‌కు రూపాయి, డీజిల్‌పై లీటర్‌కు రూపాయి 50 పైసలు చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని పెంచింది. జనవరి నెలలోనే 2వ తేదీన లీటర్ పెట్రోల్‌పై 37 పైసలు, డీజిల్ పై లీటరుకు రెండు రూపాయల చొప్పున ఎక్సైజ్ సుంకం పెంచింది. దీంతో వినియోగదారులకు పెద్దగా ప్రయోజనం కలగడం లేదు. -
తగ్గిన పెట్రోల్ ధరలు
న్యూఢిల్లీ: నిత్యావసరాల ధరలు మండిపోతున్న తరుణంలో సామాన్యుడికి అతి స్వల్ప ఊరట. పెట్రోల్ ధర స్వల్పంగా తగ్గింది. ఒక లీటరు పెట్రోలుపై 50 పైసలు తగ్గిస్తున్నట్లు చమురు సంస్థలు శనివారం ప్రకటించాయి. కొత్త ధరలు ఈ అర్థరాత్రి నుంచే అమలవుతాయి. కాగా, డీజిల్ ధరలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. రెండు వారాల కిందటే డీజిల్ ధరను రెండు రూపాయలు పెంచిన సంగతి తెలిసిందే. -
స్వల్పంగా తగ్గిన పెట్రోల్ ధర
-
అక్కడ లీటరు పెట్రోలు రూ. 190!
ఇన్నర్ లైన్ పర్మిట్ విధానాన్ని అమలు చేయాలంటూ మణిపూర్‌లో జరుగుతున్న హింసాత్మక ఆందోళన అక్కడి ప్రజల దైనందిన జీవితంపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఆ రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలన్నీ ఒక్కసారిగా ఆకాశాన్నంటాయి. ఇంఫాల్- డిమాపూర్, ఇంఫాల్ - సిల్చార్ జాతీయ రహదారులు మూసుకుపోవడంతో రాష్ట్రంలోకి సరుకులు వచ్చే మార్గం లేకుండా పోయింది. దీంతో రాజధాని ఇంఫాల్ నగరంలో పెట్రోలు ధర దాదాపు రూ. 190 వరకు చేరుకుంది. అలాగే ఉల్లిగడ్డలు, బంగాళా దుంపలు, పప్పుధాన్యాలు, కూరగాయల ధరలు కూడా రెట్టింపు అయ్యాయి. ఇంఫాల్- డిమాపూర్ జాతీయ రహదారిలో ఆగస్టు మధ్యవారంలో భారీ కొండ చరియ విరిగిపడింది. దాంతో అక్కడి రోడ్డు మార్గం మొత్తం మూసుకుపోయింది. మరమ్మతు పనులు ఇంకా పూర్తి కాలేదు. దానికి తోడు ఆందోళనల కారణంగా మరో జాతీయ రహదారి కూడా మూసుకుపోయింది. ఇవే ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలయ్యాయి. రాష్ట్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజాపంపిణీ శాఖ ఆధ్వర్యంలో పెట్రోలును రేషన్ పద్ధతిలో అమ్ముతున్నారు. అక్కడ కొనాలంటే ఐదారు గంటలు పడుతోంది. పని కూడా మానేసుకుని ఇక్కడ ఒక రోజంతా వేచి చూడాల్సి వస్తోందని హీరోజిత్ సింగ్ అనే వ్యక్తి చెప్పారు. అయితే బ్లాక్‌లో కొనాలంటే మాత్రం ఐదు నిమిషాల్లోనే దొరుకుతోందని, ఇదెలా సాధ్యం అవుతోందని ఆయన ప్రశ్నించారు. -
పెట్రో ధరలు బాగా తగ్గే అవకాశం?
పెట్రోలు, డీజిల్ ధరలు మరో వారం రోజుల్లో తగ్గే అవకాశం కనిపిస్తోంది. గత నెల 30వ తేదీన పెట్రోలు ధరను లీటరుకు 31 పైసలు, డీజిల్ ధరను లీటరుకు 71 పైసలు తగ్గించారు. అయితే.. ఇప్పుడు మళ్లీ అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు గణనీయంగా పడిపోయాయి. దాంతో ఈనెల 15వ తేదీన నిర్వహించే సమీక్ష తర్వాత పెట్రోలు, డీజిల్ ధరలు కాస్త ఎక్కువగానే తగ్గొచ్చని అంటున్నారు. మన దేశం తమ అవసరాల కోసం 80 శాతం చమురును దిగుమతి చేసుకుంటుంది. అంతర్జాతీయంగా చమురు ధరలతో పాటు, రూపాయి విలువ కూడా మన పెట్రోలు, డీజిల్ ధరలను నిర్ణయించడంలో కీలకపాత్ర పోషిస్తాయి. గ్రీసు సంక్షోభం, ఇరాన్ చర్చల్లో పురోగతి, డాలర్ బలోపేతం కావడం, చైనా స్టాక్ మార్కెట్లు పడిపోవడం లాంటి కారణాలతో ఈవారంలో అంతర్జాతీయంగా చమురు ధరలు బాగా తగ్గాయి. ఏప్రిల్ తర్వాత తొలిసారిగా మళ్లీ బ్రెంట్ క్రూడాయిల్ ధర 60 డాలర్ల దిగువ స్థాయికి చేరుకుంది. మంగళవారం నాడు బ్రెంట్ క్రూడ్ 57 డాలర్ల వద్ద ట్రేడయింది. మరో వారం రోజుల్లో ఇది 50 డాలర్ల కంటే కూడా తగ్గొచ్చని ఎనలిస్టులు చెబుతున్నారు. ఈ లెక్కన చూసుకుంటే మనకు కూడా ఈ తగ్గింపు ఫలితం బాగానే కలిసి రావొచ్చన్నమాట. -
పెట్రోలు కార్లకే జనం మొగ్గు!
ఇంధన ధరల్లో తేడా తగ్గటంతో డీజిల్‌పై తగ్గిన ఆసక్తి సాక్షి, బిజినెస్ బ్యూరో : డీజిల్‌కు, పెట్రోల్‌కు మధ్య ధరల్లో తేడా వ్యత్యాసం తగ్గుతోంది. దీంతో డీజిల్ కారుకు ప్రీమియం ధర పెట్టి కొనటమెందుకులే అని భావిస్తున్నట్టున్నారు కొనుగోలుదారులు. ఫలితం... డీజిల్ కార్ల అమ్మకాలు తగ్గుతున్నాయి!!. కారు కొనేటపుడు మొదట ఆలోచించేది ఏ బ్రాండ్ కొనాలా అని కాదు... డీజిల్ కారా... లేక పెట్రోల్ కారా అని. ఎందుకంటే ఇంధనమనేది ఆ కారు నడిపినన్నాళ్లూ అవసరమే. పెట్రోల్ ధరలకన్నా డీజిల్ ధరలు చాలా తక్కువ. రోజూ గనక ఎక్కువ కిలోమీటర్లు తిరిగే వాళ్లకు డీజిల్ వల్ల బాగా ఆదా అవుతుంది. అందుకని ప్రీమియం రేటు పెట్టి కొనాల్సి వచ్చినా... డీజిల్ కారు వైపే చాలామంది మొగ్గు చూపేవారు. కానీ ఇపుడా పరిస్థితి మారింది. డీజిల్‌కు, పెట్రోల్‌కు ధరల్లో తేడా తగ్గుతుండటంతో కొనుగోలు దారులు కూడా పెట్రోల్ కార్లకే మొగ్గు చూపుతున్నారు. ఏప్రిల్ నెలనే తీసుకుంటే... మొత్తం కార్ల అమ్మకాల్లో డీజిల్ వాటా 34 శాతానికి పడిపోయింది. రీసేల్ మార్కెట్లో డీజిల్ కార్ల విలువ తగ్గుతుండటం, ట్రాలీల వంటి యుటిలిటీ వాహనాల విక్రయాలు తగ్గుతుండటం దీనికి మరో కారణంగా కనిపిస్తోంది. 2012-13 ఆర్థిక సంవత్సరంలో మొత్తం వాహనాల్లో 47 శాతంగా ఉన్న డీజిల్ వాహనాల అమ్మకాలు 2013-14కు వచ్చేసరికి 42 శాతానికి పడిపోయాయి. ఇక 2014-15లో ఈ వాటా 37 శాతానికి పరిమితమైంది. ఈ ట్రెండ్ పర్యావరణానికి మాత్రం మంచిదేనని ఆటోమొబైల్ తయారీదారుల సొసైటీ చెబుతోంది. ఎందుకంటే పెట్రోల్‌తో పోలిస్తే డీజిల్ కాలుష్యం కాస్త ఎక్కువ. ఇదీ... డీజిల్ కథ: ఇప్పటిదాకా నియంత్ర ణల్లో ఉంటూ వచ్చిన డీజిల్‌పై గతేడాది అక్టోబర్‌లో ప్రభుత్వం పూర్తిగా నియంత్రణలను ఎత్తివేసింది. అప్పట్నుంచి దాని ధరలు కూడా మార్కెట్‌ను అనుసరించి హెచ్చుతగ్గులకు గురవుతున్నాయి. ఒక్క మే నెల్లోనే డీజిల్ ధర ఏకంగా 11 శాతం పెరిగింది. గతేడాది జనవరిలో పెట్రోల్-డీజిల్ ధరల మధ్య లీటరుకు రూ.18 వరకూ తేడా ఉండగా అక్టోబర్‌లో నియంత్రణలు తొలగించేనాటికి ఈ తేడా కేవలం రూ.11కు తగ్గింది. ప్రస్తుతం ఈ తేడా దాదాపు 16 రూపాయలుగా ఉన్నప్పటికీ ఈ ధరలు మార్కెట్ ప్రకారం కదులుతాయి కనక మున్ముందు మరీ ఎక్కువగా తేడా ఉండదన్నది బహిరంగమే. ‘‘డీజిల్ కార్లు కొనటానికి ప్రధాన కారణం ఇంధన ధరల్లో వ్యత్యాసమే. ఇపుడా వ్యత్యాసం బాగా తగ్గుతోంది కనక పెట్రోల్ కార్లు కొనటానికే ఇష్టపడుతున్నారు. పెట్రోల్ కార్లు డీజిల్ కన్నా చౌక కనక ఇపుడు వీటిని ఎంచుకోవటమే ఉత్తమం. పెపైచ్చు కాస్త ఫన్ని ఇష్టపడేవారు కూడా పెట్రోల్‌కే మొగ్గుతున్నారు’’ అని వోల్వో ఇండియా డిజిటల్ విభాగ డెరైక్టర్ సుదీప్ నారాయణ్ చెప్పారు. మున్ముందు ఎంట్రీలెవల్, లగ్జరీ, సెడాన్ సెగ్మెంట్లలో పెట్రోల్ వాహనాల వాటా పెరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇటీవల నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ పదేళ్లకు మించిన డీజిల్ వాహనాలను నడపవద్దని ఆదేశించిన నేపథ్యంలో ఢిల్లీ లాంటి ప్రాంతాల్లో వినియోగదారులు పెట్రోల్‌కే ఓటేస్తున్నారు. ‘‘ఈ ఉత్తర్వులు ఇంకా అమల్లోకి రాలేదు. కానీ దాని ప్రభావం మాత్రం అమ్మకాలపై కనిపిస్తోంది’’ అని ఆటోమొబైల్ పరిశ్రమ నిపుణుడొకరు వ్యాఖ్యానించారు. డీజిల్ కార్ల వాటా 30-35 శాతం మధ్య స్థిరపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. కృత్రిమ ధరలు... కృత్రిమ డిమాండ్ ఇదివరకు డీజిల్ ధరలు కృత్రిమంగా తక్కువగా ఉండేవని, అందుకే డీజిల్ వాహనాలకు కూడా కృత్రిమ డిమాండ్ ఉండేదని సియామ్ డెరైక్టర్ జనరల్ విష్ణు మాధుర్ చెప్పారు. ‘‘మున్ముందు ఇంధన సామర్థ్యం, వాహన ధర బట్టే డీజిల్ కార్ల అమ్మకాలు ఆధారపడి ఉంటాయి’’ అన్నారాయన. పెట్రోలు వాడకంలో రెండంకెల వృద్ధి కనిపిస్తుండటంతో ఇది కూడా డీజిల్ వాహనాలు తగ్గుముఖం పడుతున్నాయనటానికి తిరుగులేని సాక్ష్యమని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. పెట్రోలియం శాఖలోని పెట్రోలియం ప్లానింగ్, విశ్లేషణ విభాగం చెబుతున ్న దాని ప్రకారం 2014-15లో డీజిల్ వాడకం 1.5 శాతం పెరగ్గా, పెట్రోల్ వాడకం మాత్రం ఏకంగా 11.4 శాతం పెరిగింది. ఏప్రిల్‌లో పెట్రోల్ వాడకం 18.7 శాతం, డీజిల్ వాడకం 9.3 శాతం పెరిగాయి. -
పెరిగిన పెట్రో ధరలపై కామ్రేడ్ల కన్నెర్ర
ఆటోలను తాళ్లతో లాగి నిరసన నెల్లూరు(సెంట్రల్) : కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రజావ్యతిరేక విధానలపై కామ్రేడ్లు కన్నెర్రజేశారు. అధికారం చేతపట్టినప్పటి నుంచి ప్రజలపై భారం వేయడమే లక్ష్యంగా పెట్టుకుందని మోదీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. నరేంద్ర మోదీ ప్రభుత్వానికి నూకలు చెల్లాయంటూ నినాదాలు చేశారు. నగరంలోని గాంధీబొమ్మ సెంటర్లో ఆదివారం సీపీఎం నగర కార్యదర్శి మూలం రమేష్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఆర్టీసీ బస్‌స్టాండ్ సమీపంలో నెల్లూరు రూరల్ సీపీఎం కార్యదర్శి మాదాల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఆటోలను తాళ్లతో లాగి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీపీఎం నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వానికి పోయో కాలం వచ్చిందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇష్టానుసారంగా ప్రజలపై భారం వేయడం ఏమిటని ప్రశ్నించారు. రానున్న రోజుల్లో కేంద్ర ప్రభుత్వ పాలనపై తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. అబద్ధపు హామీలతో అధికారం చేతపట్టి ప్రజలను నిలువునా మోసం చేస్తున్నారన్నారు. మోదీ ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోనే ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్నారు. ఒక్కసారిగా పెట్రో ధరలు పెంచితే అసంతృప్తి వస్తుందని, వారానికోసారి పెంచుతూ ప్రజలపై భారం మోపుతున్నారన్నారు. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినప్పటికీ ఇక్కడ పెట్రోలు ధరలు తగ్గించకపోవడం అన్యాయంగా ఉందన్నారు. మోదీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు దాసోహంగా పనిచేస్తోందని ఆరోపించారు. యువతను పలు రకాలుగా ఆకర్షించి ఓట్లు గుంజుకున్న పాలకులు అధికారం చేతపట్టాక వారిని మరిచారన్నారు. అధిక ధరలు ప్రజలపై వేస్తూ ప్రజలను దోచుకుంటున్నారన్నారు. సీపీఎం నాయకులు కత్తి శ్రీనివాసులు, శీనయ్య, బాలయ్య తదితరులు పాల్గొన్నారు. -
‘పెట్రో’ పెంపుపై ఆందోళన
వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో కేంద్రం దిష్టిబొమ్మ దహనం దూలపల్లి: పెంచిన పెట్రోల్, డీజీల్ ధరలను తగ్గించకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని వైఎస్సార్ సీపీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు సురేష్‌రెడ్డి హెచ్చరించారు. ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను సూరారం సాయిబాబానగర్ చౌరస్తా వరకు ఊరేగింపుగా తీసుకువచ్చి దహనం చేశారు. ఈ సందర్భంగా సురేష్‌రెడ్డి మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నెల రోజుల్లో రెండు సార్లు పెట్రోల్, డీజీల్ ధరలను పెంచి సామాన్యుల నడ్డి విరిచిందన్నారు. ఒక పక్క పేదలకు లబ్ధి చేకూరే పథకాలు ప్రవేశపెడుతున్నామని ప్రగల్భాలు పలుకుతున్న బీజేపీ ప్రభుత్వం ధరలు పెంచి ఇబ్బందులకు గురిచేస్తుందని ఆరోపించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ పట్టణ అధ్యక్షుడు కాట్రెడ్డి రమణారెడ్డి, మీసాల్రెడ్డి, అమర్నాథ్రెడ్డి, విద్యార్థి విభాగం నేత విశ్వనాథ, శివగౌడ్, నరేందర్‌రెడ్డి, శివాజీ, రాజు తదితరులు పాల్గొన్నారు. -
ప్రజలపై భారం మోపడం తగదు
కర్నూలు (ఓల్డ్‌సిటీ) : పెట్రో ధరలు పెంచి ప్రజలపై భారాన్ని మోపడం తగదని ఎమ్మెల్సీ ఎం.సుధాకర్‌బాబు అన్నారు. శనివారం స్థానిక కళావెంకట్రావు కార్యాలయంలో డీసీసీ నాయకులతో కలిసి ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలోని చంద్రబాబు ప్రభుత్వం.. చమురు కంపెనీలు కూడబలుక్కుని పెట్రోల్, డీజిల్ ధరలను తరచుగా తగ్గిస్తూ, అధికంగా పెంచుతూ ప్రజల నడ్డి విరుస్తున్నాయని ఆరోపించారు. మాజీ జెడ్పీ చైర్మన్ ఆకెపోగు వెంకటస్వామి మాట్లాడుతూ ధరలు పెంచడంలో ఉన్న శ్రద్ధ ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వాలు చూపడం లేదన్నారు. విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ నాయకులు శివకుమార్, శ్రీనివాసులు రెడ్డి, వెంకటస్వామి, జయప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు. ఏఐటీయూసీ వినూత్న నిరసన కర్నూలు: పెట్రో ధరలను వ్యతిరేకిస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో వినూత్న తరహాలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.మునెప్ప, గౌరవాధ్యక్షుడు ప్రభాకర్ ఆధ్వర్యంలో పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని కోరుతూ శనివారం కలెక్టరేట్ వద్ద ఆటోలకు తాళ్లను కట్టి లాగుతూ నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా మునెప్ప మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పదేపదే పెట్రో, డీజిల్ ధరలు పెంచుతూ వినియోగదారుల నడ్డి విరుస్తోందన్నారు. తక్షణమే పెంచిన పెట్రో, డీజిల్ ధరలను తగ్గించి చమురు ధరలపై నియంత్రణ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఆటో యూనియన్ నాయకులు రామునాయక్, ఈశ్వర్, రమణ, రాము, మధు, అక్బర్‌తో పాటు ఆటో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పెంచిన ధరలను తగ్గించాలి కర్నూలు(రాజ్‌విహార్): పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని సీపీఎం నగర కార్యదర్శి గౌస్‌దేశాయ్ డిమాండ్ చేశారు. శనివారం నగర కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం సామాన్యులపై భారాలు మోపడమే లక్ష్యంగా పనిచేస్తోందనన్నారు. అందులో భాగంగా నెల రోజుల వ్యవధిలో రెండో సారి చమురు ధరలు పెంచి మధ్య తరగతి ప్రజల నడ్డి విరిచిందని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కార్యవర్గ సభ్యులు రామాంజనేయులు మాట్లాడుతూ పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడంతో రవాణ చార్జీలు కూడా పెరుగుతాయన్నారు. అనంతరం ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. నగర నాయకులు రాముడు, రాజగోపాల్, నాగరాజు, రాజశేఖర్, షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. -
పక్షం రోజుల్లో రెండు సార్లు పెంపా?
వైఎస్సార్సీపీ నేత వాసిరెడ్డి పద్మ హైదరాబాద్: నిత్యావసర సరుకుల ధరల పెరుగుదలతో ఒకపక్క సతమతమవుతున్న ప్రజలపై పక్షం రోజుల్లో రెండోసారి పెట్రోలు, డీజిల్ ధరలు పెంచి మోయలేని భారం పెంచడం దారుణమని వైఎస్సార్సీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ శనివారం విలేకరులతో మాట్లాడుతూ.. చమురు కంపెనీలు పెంచిన పెట్రోలు, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. రాహుల్‌కు కనువిప్పు కలిగిందా ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించాలన్న కనువిప్పు ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీకి ఇపుడు కలిగిందా అని పద్మ ప్రశ్నించారు. వైఎస్ మరణాన్ని జీర్ణించుకోలేక తనువు చాలించిన వందలాది కుటుంబాలను తమ అధినేత జగన్ పరామర్శిస్తానంటే వద్దంటూ.. అందరినీ ఒక చోట చేర్చి పరిహారం ఇవ్వాలని సూచించిన రాహుల్.. ఇపుడు ఇంటింటికీ ఎందుకు తిరుగుతున్నారని విమర్శించారు. చేసిన తప్పును రాహుల్ దిద్దుకుంటున్నారనుకోవాలా? లేక జగన్ యాత్రను ఆదర్శంగా తీసుకున్నారా అని పద్మ ప్రశ్నించారు. -
తగ్గిన పెట్రో ధరలు
- పెట్రోల్‌పై 49 పైసలు, డీజిల్‌పై రూ. 1.21 న్యూఢిల్లీ: ఇంధన ధరలు స్వల్పంగా దిగొచ్చాయి. పెట్రోల్ ధర లీటరుకు 49 పైసలు, డీజిల్ ధర లీటరుకు రూ. 1.21 తగ్గాయి. తగ్గింపు బుధవారం అర్ధరాత్రి నుంచే అమల్లోకి వచ్చింది. సబ్సిడీయేతర సిలిండర్ ధర మాత్రం రూ. 11 పెరిగి ఢిల్లీలో రూ. 621కి చేరుకుంది. ఢిల్లీలో పెట్రోల్ ధర రూ. 60.49 నుంచి రూ. 60కి, డీజిల్ ధర రూ. 49.71 నుంచి రూ. 48.50కి చేరుకున్నాయి. స్థానిక పన్నుల్లో తగ్గింపు కలుపుకుంటే ధరలు ఇంకొంత తగ్గుదల ఉంటుంది. హైదరాబాద్‌లో పెట్రోల్ ధర రూ. 68.23 నుంచి రూ.67.69కి, డీజిల్ ధర రూ. 56.21 నుంచి రూ. 54.86 కు చేరింది. ‘అంతర్జాతీయ విపణిలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయి. అయితే డాలరు-రూపాయి మారకం విలువ తగ్గింది. ఫలితంగా రిటైల్ ధరల తగ్గించాల్సి వచ్చింది’ అని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తెలిపింది. పెట్రోల్, డీ జిల్ ధరలు ఫిబ్రవరి 16న వరుసగా 82 పైసలు, 61 పైసలు, మార్చి 1న రూ. 3.18, రూ. 3.09 పెరగడం తెలిసిందే విమాన ఇంధనం(ఏటీఎఫ్) ధర తాజాగా కిలోలీటరుకు రూ. 1,025కు తగ్గి రూ. 49,338కి చేరుకుంది. ఏటీఎఫ్ ధర మార్చి 1న ఏకంగా 8.2 శాతం పెరగడం తెలిసిందే. -
మరోసారి తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు
-
మరోసారి తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు
న్యూఢిల్లీ: మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయి. అంతర్జాతీయంగా చమురు రేట్లలో తగ్గుదల కారణంగా పెట్రోల్ పై లీటర్ కు 91 పైసలు, డీజిల్ పై 84 పైసలు తగ్గింది. ఈ తగ్గిన ధరలు ఆదివారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ ఏడాది ఆగస్టు నుంచి ఇప్పటి వరకూ పెట్రోల్ విషయంలో ఎనిమిదో సారి, డీజిల్‌పై నాల్గోసారి తగ్గించనట్లయ్యింది. ఈ నవంబర్ మొదట్లో పెట్రోల్ పై లీటర్ కు రూ.2.41 పైసలు తగ్గగా, డీజిల్ పై లీటర్ కు రూ.2.21 తగ్గిన సంగతి తెలిసిందే. కాగా, ప్రతి 15 రోజులకు రేట్లు సమీక్షించే ఐఓసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ సంస్థలు మరోసారి డీజిల్, పెట్రోల్ రేట్లను సవరించాయి. ఈ తాజా సవరణతో పెట్రోల్ పై మొత్తంగా ఆగస్టు నుంచి ఇప్పటి వరకూ రూ. 10.27 పైసలు తగ్గినట్లయ్యింది. -
మరోసారి తగ్గనున్న పెట్రోల్, డీజిల్ రేట్లు!
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ఆయిల్ రేట్లలో తగ్గుదల కారణంగా ఈ వారాంతానికి దేశంలో పెట్రోల్, డీజిల్ రేట్లు మరోసారి తగ్గే అవకాశం ఉంది. ఈ తగ్గుదల రూపాయి వరకూ ఉండవచ్చని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. రేటు తగ్గితే.. ఈ ఏడాది ఆగస్టు నుంచి ఇప్పటి వరకూ పెట్రోల్ విషయంలో ఏడోసారి, డీజిల్‌పై మూడో సారి తగ్గించినట్టవుతుంది. కాగా, ప్రతి 15 రోజులకు రేట్లు సమీక్షించే ఐఓసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ సంస్థలు ఈ శనివారం డీజిల్, పెట్రోల్ రేట్లను సవరించనున్నాయి. నవంబర్ 1న పెట్రోల్‌పై రూ. 2.41 తగ్గించడంతో మొత్తంగా ఆగస్టు నుంచి ఇప్పటి వరకూ రూ. 9.36 తగ్గించినట్టయింది. -
డీజిల్, పెట్రోలు ధరలు ఇంకా తగ్గే ఛాన్స్!
న్యూఢిల్లీ: మరోసారి పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గే అవకాశాలు కనబడుతున్నాయి. అంతర్జాతీయంగా ముడిచమురు(క్రూడ్) ధర సోమ, మంగళవారాల్లో ఒక్కసారిగా పతనమయ్యింది. అమెరికాకు ఎగుమతి చేసే క్రూడ్ ధరను సౌదీ అరేబియా తగ్గించడంతో రేట్లు భారీగా పడిపోయాయి. న్యూయార్క్ కమోడిటీ ఎక్స్ఛేంజ్(నెమైక్స్)లో ట్రేడయ్యే లైట్ స్వీట్ క్రూడ్ బ్యారెల్ ధర మంగళవారం 2.5 డాలర్లమేర దిగజారి 76 డాలర్లకు క్షీణించింది. 2011 అక్టోబర్ తర్వాత ఈ స్థాయికి పడటం ఇదే తొలిసారి. ఇక బ్రెంట్ క్రూడ్ రేటు కూడా నాలుగున్నరేళ్లకుపైగా కనిష్టానికి దిగొచ్చింది. 2 డాలర్లకుపైగా క్షీణించి 82 డాలర్ల స్థాయికి చేరింది. ఈ రెండు రకాల క్రూడ్స్ ధరలూ రెండురోజుల్లో 4 శాతానికిపైగా తగ్గాయి. దేశీయంగానూ రేట్లు డౌన్... అంతర్జాతీయ ట్రెండ్‌కు అనుగుణంగానే భారత్ ఫ్యూచర్స్ మార్కెట్లోనూ ముడిచమురు ధరలు మరింత శాంతిస్తున్నాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్(ఎంసీఎక్స్)లో మంగళవారం బ్యారెల్ క్రూడ్ ధర 5 శాతంపైగా పతనమైంది. చురుగ్గా ట్రేడవుతున్న నవంబర్ నెలకు డెలివరీ అయ్యే కాంట్రాక్టు రేటు రూ.251(5.06 శాతం) క్షీణించి రూ.4,712 వద్ద ట్రేడవుతోంది. కాగా, అక్టోబర్ 31 తేదీన ఇండియన్ క్రూడ్ బాస్కెట్ బ్యారెల్ ధర 83.80 డాలర్ల వద్దకు దిగొచ్చిన సంగతి తెలిసిందే. దీంతో దేశీయంగా పెట్రోలు, డీజిల్ ధరలు కూడా దిగొచ్చాయి. ఇటీవలే లీటరు పెట్రోలుపై రూ.2.41, డీజిల్‌పై రూ.2.25 చొప్పున దేశీ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ(ఓఎంసీ)లు ధరల కోతను ప్రకటించాయి. సామాన్యుడికి మరింత ఉపశమనం? తాజాగా అంతర్జాతీయ ధరలు మరింత పతనం అవుతుండటంతో సామాన్య భారతీయుడికి పెట్రో ధరల నుంచి మరింత ఉపశమనం లభించనుందా? అంతర్జాతీయ క్రూడ్ రేట్ల ఇదే ధోరణి కొనసాగినా.. ధరలు ఇప్పుడున్న స్థాయిలోనే కొంతకాలం స్థిరంగా ఉన్నా.. దేశీయంగా పెట్రోలు, డీజిల్ ధరలు మరోసారి తగ్గే అవకాశాలున్నాయని పరిశీలకులు చెబుతున్నారు. 15 రోజులకొకసారి చమురు మార్కెటింగ్ కంపెనీలు ధరలను సమీక్షిస్తున్నాయి. తదుపరి సమీక్ష ఈ నెల 15న ఉండనుంది. కాగా, భారత్‌కు చమురు దిగుమతుల బిల్లు కూడా భారీగా తగ్గనుండటంతో ఆర్థిక వ్యవస్థకు చేదోడుగా నిలవనుందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
లీటరుకు రూపాయి తగ్గిన పెట్రోల్ ధర
న్యూఢిల్లీ: పెట్రోల్ ధర లీటరుకు రూపాయి తగ్గింది. స్థానిక పన్నుల్లోనూ తగ్గింపు కలుపుకుంటే ప్రాంతాల వారీగా మరికొంత తగ్గనుంది. తగ్గించిన ధర మంగళవారం అర్ధరాత్రి అమల్లోకి వస్తుందని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తెలిపింది. పెట్రోల్ ధర తగ్గించడం ఈనెలలో ఇది రెండోసారి. అక్టోబర్ 1న లీటర్ పెట్రోల్ ధరపై 54 పైసలు తగ్గింది. తాజా తగ్గింపుతో ఢిల్లీలో లీటరు పెట్రోల్ రూ.66.65కు, ముంబైలో రూ.74.46 చేరిందని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తెలిపింది. అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరలు తగ్గడంతో ప్రభుత్వ చమురు కంపెనీలు పెట్రోల్ ధర తగ్గించాయి. -
వాహనదారులకు శుభవార్త!
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు గణనీయంగా తగ్గడంతో పెట్రోల్, డీజిల్ ధరలు దిగిరానున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు 27 నెలల కనిష్ట స్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలో డీజిల్ లీటర్ ధర రూ. 2.50, పెట్రోల్ లీటర్ ధుర ఒక రూపాయి తగ్గే అవకాశం ఉంది. వాహనదారులకు ఇది శుభవార్తే. అయితే అక్టోబర్ 15న మహారాష్ట్ర, హర్యానాలలో అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన తర్వాత మాత్రమే ఈ తగ్గింపు అమలులోకి వచ్చే అవకాశం ఉంది. గత ఏడాది జనవరిలో రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ పెట్రోల్ ధరలను నెలకు 40 నుంచి 50 పైసల చొప్పున పెంచాలని నిర్ణయించింది. దీనికి అనుగుణంగా ప్రతి నెలా డీజిల్ ధర పెరుగుతోంది. అయితే డీజిల్ అమ్మకాలు లాభాల్లోకి వచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయాన్ని ఎత్తివేసే అవకాశం ఉంది. ** -
పెట్రోల్‌పై రూ.1.51 తగ్గింపు డీజిల్‌పై 50 పైసల పెంపు
న్యూఢిల్లీ: పెట్రోల్ ధర లీటర్‌పై రూ.1.51 పైసలు తగ్గింది. అయితే డీజిల్ ధర ఎప్పట్లాగే లీటరుకు 50 పైసలు పెరిగింది. సవరించిన ధరలు శనివారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి. పెట్రోల్ ధరపై స్థానిక పన్నుల్లో తగ్గింపు, డీజిల్ ధరపై పెంపు కలుపుకుంటే ప్రాంతాలను బట్టి ధరలు మారతాయి. అంతర్జాతీయ మార్కెట్లో చమురు రేట్లు తగ్గడంతో పెట్రోల్‌పై రూ.1.51 తగ్గించామని, స్థానిక అమ్మకం పన్నుల్లో తగ్గింపునూ కలుపుకుంటే ఢిల్లీలో తగ్గింపు రూ.1.82కి చేరిందని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తెలిపింది. ఈ తగ్గింపుతో ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ. 70.33 నుంచి రూ. 68.51కి చేరింది. పెట్రోధర ఈ నెలలో కిందకి దిగడం ఇది మూడోసారి. ఈ నెల 1న రూ.1.09, 15న రూ.2.18(స్థానిక పన్నుల్లో తగ్గింపు కలుపుకుని) తగ్గడం తెలిసిందే. పెట్రో ధర గత ఏడాది జూన్ ధరతో(రూ. 68.58)పోలిస్తే అతి తక్కువగా నమోదు కావడం ఇదే తొలిసారి. కాగా, అంతర్జాతీయ ధరల తగ్గింపుతో 14.2 కేజీల సబ్సిడీయేతర వంటగ్యాస్ సిలిండర్ ధర రూ.19 తగ్గి, రూ. 920 నుంచి రూ. 901కి చేరింది. బల్క్ డీజిల్ ధర ఢిల్లీలో లీటరుకు రూ.1.32 తగ్గింది. హైదరాబాద్‌లో.. హైదరాబాద్‌లో పెట్రోల్ ధర రూ.76.84 నుంచి రూ.75.02కి తగ్గగా, డీజిల్ ధర రూ.63.65 నుంచి రూ. 64.26కు పెరిగింది. -
ఈ నెలలో రెండవసారి తగ్గిన పెట్రోల్ ధర
హైదరాబాద్: వాహనదారులకు శుభవార్త. పెట్రోల్ ధర మళ్లీ తగ్గింది. లీటరుకు ఒక రూపాయి 82 పైసలు తగ్గించారు. తగ్గిన ధరలు ఈ అర్ధరాత్రి నుంచే అమలులోకి వస్తాయి. హైదరాబాద్‌లో లీటర్‌కు రెండు రూపాయల 50 పైసల వరకు తగ్గే అవకాశం ఉంది. ఈ నెలలో పెట్రోల్ ధర తగ్గడం ఇది రెండవసారి. స్వాత్రంత్ర దినోత్సవ కానుకగా ఈ నెల 15న పెట్రోల్ ధర తగ్గించారు. అప్పుడు లీటర్‌కు రూ.1.89 పైసల నుంచి రూ.2.38(ఢిల్లీలో ధరలు) వరకు తగ్గించారు.