
పెట్రోల్ ధర పెరిగింది!
దేశంలో పెట్రోల్ ధరలు పెరిగి, డీజిల్ ధరలు తగ్గాయి.
నవంబర్ 15న లీటరు పెట్రోల్పై రూ.1.46 పైసలు, లీటరు డీజిల్పై రూ.1.53 పైసలు తగ్గిన సంగతి తెలిసిందే. ప్రతి 15 రోజులకు ఒకసారి ఆయిల్ ధరలను సమీక్షించే కంపెనీలు.. చివరిసారిగా నవంబర్ 15న ధరలు తగ్గించాయి. నేటి సమీక్షలో పెట్రోల్ ధరలు పెంచి, డీజిల్ ధరలు తగ్గిస్తున్నట్టు తెలిపాయి. కొత్త ధరల ప్రకారం ఢిల్లీలో లీటరు పెట్రోల్ రూ.66.10, లీటరు డీజిల్ రూ.54.57గా ఉండనున్నాయి.