పెట్రోల్, డీజిల్ ధరలు గత కొన్ని రోజుల నుంచి వినియోగదారులకు భారీగా వాత పెడుతున్న సంగతి తెలిసిందే. పెరిగేదే కానీ, అసలు తగ్గేదే కనిపించడం లేదు. పెట్రోల్, డీజిల్ ధరలు ప్రభుత్వం త్వరలోనే తగ్గిస్తామంటూ మాటలు చెప్పుకొస్తుంది కానీ, ఎప్పుడు తగ్గింపు చేపడతామనే విషయంపై స్పష్టమైన ప్రకటన ఇవ్వలేకపోతోంది.