న్యూఢిల్లీ: భారత్‌లో కొన్ని రోజులుగా స్థిరంగా ఉన్న పెట్రోల్, డీజిల్ ధరలకు బ్రేక్ పడింది. గురువారం పెట్రోల్, డీజిల్ ధరలు స్వల్పంగా తగ్గాయి. పెట్రోల్‌పై లీటరుకు 16 పైసలు, డీజిల్ 14 పైసలు తగ్గింది. సుమారు 15 రోజుల విరామం తర్వాత నేడు(ఏప్రిల్ 15) చమురు ధరలు స్వల్పంగా తగ్గాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.. ప్రస్తుతం దేశ రాజధాని దిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.90.40 ఉండగా, డీజిల్ ధర రూ.80.73గా ఉంది. రాష్ట్రాలు విధించే పన్నులు ఆధారంగా ధరల్లో స్వల్ప మార్పు ఉంటుంది. ఆరు నెలల నుంచి పెరుగుతూ వస్తున్న పెట్రోల్ ధరలు పెరగ్గా, మార్చి 24 నుంచి స్వల్పంగా తగ్గాయి. నేడు హైదరాబాద్ లో పెట్రోల్ ధర రూ.93.99 ఉండగా, డీజిల్ ధర రూ.88.05గా ఉంది.
చదవండి: ఫ్లిప్‌కార్ట్ చేతికి ట్రావెల్ బుకింగ్ క్లియర్‌ట్రిప్
Comments
Please login to add a commentAdd a comment