న్యూఢిల్లీ: ఏ ముహూర్తన ఎన్నికలు అయిపోయాయో గానీ అప్పటి నుంచి చమురు కంపెనీలు సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి. ఒక పక్క సామాన్యుడు కరోనా మహమ్మరితో పోరాడతుంటే మరోపక్క చమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. దీంతో ఏది కొనాలి అన్న భయమేస్తుంది. ఎన్నికల ఫలితాలు ప్రకటించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎనిమిది సార్లు పెట్రోల్ రేట్లు పెరిగాయి. ఈ నెల 4 నుంచి ఇప్పటి వరకు పెట్రోల్‌పై రూ..1.94, డీజిల్‌పై రూ.2.22 పెరిగింది. చమురు కంపెనీలు ఒక రోజు విరామం తీసుకుని నేడు మళ్లీ పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాయి. దేశవ్యాప్తంగా పెట్రోల్ ధర 28-30 పైసలు పెరగగా, డీజిల్ ధర 34-40 పైసలు పెరిగింది. తాజా పెంపుతో చమురు ధరలు రికార్డు స్థాయికి చేరాయి.
ప్రస్తుతం ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.92.34, డీజిల్ రూ.82.95కు చేరుకుంది. ఆర్థిక రాజధాని ముంబైలో పెట్రోల్ రూ.98.65, డీజిల్, రూ.89.75, చెన్నైలో రూ.93.84, డీజిల్ రూ.87.49, కోల్‌కతాలో రూ.92.16, డీజిల్ రూ.85.45, జైపూర్‌లో రూ.99.02, డీజిల్ రూ.91.80కి చేరాయి. ఇక హైదరాబాద్‌లో పెట్రోల్ ధర 30 పైసలు పెరిగి రూ.95.97కు చేరుకుంటే, డీజిల్ ధర 37 పైసలు పెరిగి రూ.90.43 చేరుకుంది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్ వంటి రాష్ట్రాలలో పలు చోట్ల లీటర్ పెట్రోల్ ధర రూ.100 మార్క్‌ను కూడా దాటింది.
రోజు రోజుకు ఇంధన ధరలు పైపైకి వెళ్తుండడంతో వాహనదారులు, సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. భారతదేశంలో ఇంధన ధరల పెరుగుదల అనేది అంతర్జాతీయ ముడి చమురు ధరలు, రూపాయి డాలర్ మార్పిడి రేటుపై ఆధారపడి ఉంటుంది. పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం, విలువ ఆధారిత పన్ను (వ్యాట్), కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాలు వివిధ పన్నులు విధిస్తాయి. పెట్రోల్ రిటైల్ అమ్మకపు ధరలో 60శాతం, డీజిల్ 54 శాతంపైగా కేంద్ర, రాష్ట్ర పన్నులు ఉన్నాయి.
చదవండి:
Comments
Please login to add a commentAdd a comment